వాతావరణ కాలుష్యం


వాతావరణ కాలుష్యం

[4/28, 10:19 PM] కృష్ణమోహన్ గోగులపాటి: ఈ వారం అంశం...

రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యంతో... మానవుని జీవితం దుర్భరంగా మారిపోతుంది.... కావున దాని పర్యవసానం,  చూపేదిశగా... కవనాలు సందించండి...
అందుకే ఈ వారం అంశం-
 *"వాతావరణ కాలుష్యం - దుర్భర జీవితం"*
[4/28, 11:07 PM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి ముటుకూరి హన్మకొండ        ఎవరిదీపాపం   : sheershika          నిన్న నిజమై ఎదురు గుంది
నేడు రుజువే దొరక కుంది

ఏవీ నిన్నటి ఆ చల్ల గాలులు
కానరాక మిగిలిన జ్ఞాపకాలు

ఎక్కడా స్వచ్ఛమైన  తియ్యని జలాలు
కాలుష్యభూతానికి దొరక్క అడుక్కు పోయిన వనరులు

జంతువులు మన కడకి వస్తే ఏలా భయం
వాటి తావుల్లో చేరిన మన కంటే నయం

మానేయందే ప్లాస్టిక్ వాడకం
తరిమి కొట్టలేం కాలుష్యం

ఆపేయందే రసాయన వాడకం
పెంచలేం భూ సారం

పెంచనిదే అడవుల సంరక్షణ
ఎలా సాధ్యం వర్షపు  ఆకర్షణ
[4/29, 12:54 AM] Manne Lalitha: 7416863289.
 కవిరత్న,కవిమిత్ర,కవిసుధమన్నె(పిన్నక)లలిత.
హైదరాబాద్.
అంశం:వాతావరణ కాలుష్యం__దుర్భరజీవితం.×××××××××××××××××
చెట్టు నీడ లేకపొేయె
తాగనీరు ఇంకిపొేయె
ఎట్టా బతుకుతాం
మనవెట్టా బతుకుతాం

జనపనార జనానికి తెలియకపొేయె
ప్లాస్టిక్ వాడకం పెరిగిపొేయె
పచ్చగడ్డి కరువై
ప్లాస్టిక్ తిన్న పశువులు
పాలివ్వలేకపొేయె
ప్లాస్టిక్ నిండిన పొట్టలొే
పాలచుక్క రాకపొేయె
వక్షొేజ సౌందర్యంకొేసం
వనితలు
పొేతపాలనాశ్రయించ
బిడ్డకు మాతృస్పర్శలేక
చాలీ చాలని కల్తీ పొేతపాలతొే
రేపటి భారతభాగ్య విధాత?
పీల్చ పరిశుధ్ధ గాలిలేక
కల్తీ తిండి తింటుా
విషపుారిత రసాయన
కాలుష్య వాయువులు పీలుస్తున్న నేటి బాలల
భవిష్యత్తు ప్రశ్నార్ధకం
కాలుష్య భుాతానికి
బలి అవుతున్న
బంగారు కొండలు
నేటి అభంశుభంతెలియని పసివారు
శిరచ్ఛేదన చేయబడ్డ చెట్ల ఉసురు
తీస్తుంది ప్రజలకు ఊపిరి
ఆడనివ్వక
నిన్నటి చెరువుల పుాడికతీత
నేటి జలసిరికి నిధులముాట
అదే మీ పిల్లలకు మనవ సంతానానికి మీరిచ్చే
వారసత్వ వజ్రాలముాట.
×××మన్నె(పిన్నక)లలిత.××××××××××××🌿🌺🌿
[4/29, 5:37 PM] Poet Musthakheem విన్నర్: అంశం : వాతావరణ కాలుష్యం -దుర్బరజీవితం
శీర్షిక :స్వయం కృతాపరాధం-వాతావరణ కాలుష్యం
రచన : విన్నర్
తేది :29-04-2018



చెడిపోయింది ..వాతావరణం
విడి పోయింది ..సహజ గుణం
అతలాకుతలం అయోమయం
మనిషి హాహాకారం ..
భరించలేని వ్యవహారం..
వ్యాధుల ..విజృంభణ
అంటు వ్యాధుల ..ఆక్రందన
ఒక్కటేమిటి ..
అన్నీ ..వాతావరణాలు
అన్ని రకాలుగ కలుషితాలు
1.జలం ...కాలుష్యం
2.వాయువు ..కాలుష్యం
3.భూమాత ..కాలుష్యం
4.ఆకాశ  ఓజోన్ ..కాలుష్యం

మనుష్యుల ..తప్పిదాలు
అందుకే తప్పని ఇక్కడాలు
సౌకర్యం..పేరుతో ..
హద్దు మీరడాలు ..
ఫలితంగా ..వాతావరణ కాలుష్యాలు ..


తీవ్రంగా ..పెరుగుతున్న  యెండ లు ..యేటికేడు
అతివృష్టి -అనావృష్టి  అసమంజస..వానలు-వరదలూ , రాల నైన రాలని చినుకులు ..
తుఫానులూ -సునామీలు
తీవ్రతరమయ్యే ..శీతాకాలం చలి గాలులు ..
భూమి ..బ్రధ్ధలయ్యే ..భూకంపాలు ..మనిషి చేసుకున్న ..భూ కలుషిత పాపాలు ..

"మితం..హితం , అతి అనర్థం"
'వాతావరణ కాలుష్యం-మనిషి
దుర్బరజీవితం' అంశంనకు ..
సరిగ్గా ..సరిపోతుంది ..!!?

రచన : విన్నర్ (mohd .mustakheem )
కొల్లాపూర్ .
9705235385.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[4/30, 10:19 AM] Poet Ithagoni Venkateshwarlu: ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:వాతావరణకాలుష్యము

సీ:జనులమేలును గూర్చు శాస్త్రసాంకేతిక
జ్ఞానంబు పెరిగి సుఖాలు పెరిగె
పెరుగు సుఖాలవి పెంచె కాలుష్యమ్ము
కృత్రిమమైనట్టి ఎరువులు మరి
పురుగు మందులు నీరు భూమిలో గలియుచు
ఆపైన ఆహారమందు గలియ
ఆజలమును ద్రాగి ఆతిండి తినుటచే
విపరీత రోగాలు  విస్తరిల్లె
వాహనంబులనుండి వచ్చుపొగలు గూడ
ఈరోగముల వంతనెంత పాడు
పంచభూతాలిల పాడయి పోతుండ
చెట్టుచేమలవెన్నొ క్షీణమయ్యె
క్షీణమయ్యిన ముందు క్షీణమౌ వంతోయి
మానవా నీదేను మహినిజూడ
గీ:ఇప్పుడైనను మునుగునదేమి లేదు
మూడు చేపల కథలోని మూలమెరిగి
ప్రకృతి పరిరక్షణముజేయు లక్ష్యమెంచి
వేగముగ అడుగులనిక వేయుమయ్య
భావి తరములు మనగాను భద్రముగను
[5/3, 10:45 AM] Poet Mastan Vali: అంశం : " వాతావరణ కాలుష్యం - దుర్భర జీవితం         
      శీర్షిక  :    *ప్రకృతి  -- వికృతి*
       రచయిత::  షేక్. మస్తాన్ వలి


     🐾 🌚  🎆 🎇 🌴🌞  🐾  🌚  🎇🐾

        అతి పవిత్రం  ...  మన సంస్కృతి
       పరమ పవిత్రం  ... ఈ ప్రకృతి

       హైటెక్ మోజులపై  అతి ప్రీతి
       సైబర్ ఆడంబరంతో అతి భయంకర ఆకృతి
     ప్రకృతి ఆయెనే అతి ఘోర భయంకరమైన వికృతి
     ప్రకృతి సాంప్రదాయాలను త్రోసి వేసి
     కృత్రిమ సాంప్రదాయాలను మొదలెట్టె

     ప్రాచ్యాన్ని పార ద్రోలెనే
    అప్రాచ్యాన్ని అందల మెక్కించెనే
     ప్రకృతి ... వికృతి అయేనే

      విదేశీ  ... వ్యవహారాల పై క్రేజు
     పర దేశీ ... భాష పై మోజు
     స్వదేశీ ... సంస్కృతి సంప్రదాయాలకు బూజు
   
        కంప్యూటర్ ... యుగమని ప్రీతి
        హైటెక్ .... యుగమని ఖ్యాతి
       ప్రకృతి ముందు పసికూనల రీతి

       ప్రకృతి ని ఎదిరించి నా ... ఓటమే మన గతి
       ప్రకృతి పులకరిస్తే  ... పురోగతి
      ప్రకృతి వికటిస్తే  ....  అధోగతి
   
       ప్రకృతి అయింది  ... వికృతి ..!!
       వికృతి అవదా  ...  ప్రకృతి ..? !!
   
      వికృతి రూపమే కరువు, కాటకాల ఆకృతి
      ప్రకృతి ... వికృతిగా మారినందుకే
        సునామీ ల ఆగతి.. !!
     భూకంప భీభత్సపు శృతి ..!!
     సకాల వర్షాల కు తిరస్కృతి ..!!
     అకాల వర్షాలకు స్వాగతి ..!!
 
       మానవ ... ప్రతి సృష్టికి
       ప్రకృతి విషాదకర వికృతి
     ఏ జీవైనా ... ప్రకృతి నియమం ఉల్లంఘింస్తే
    దాని ... సంతతికి లేదు పురోగతి
    మిగిలేది ... డైనోసార్ గతి ..!!
   
      ప్రకృతికి... విరుగుడు పచ్చని చెట్టే
     కాలుష్య పు కోరలు పీకేసే ...
    స్థితికి చెట్లే పురోగతి
     ప్రకృతి సంరక్షణే ... మన ప్రగతి...!
   ప్రకృతి సమతుల్యం ... జీవి మనుగడకు కారణభూతి
    పచ్చని చెట్లు లేకనే ... కృత్రిమ - వికృతి
    మొక్కలు నాటి చూడు ... వికృతి అవదా ప్రకృతి..?!

    🐾🙏🏻🌴🎆💥💥🌴🎇🙏🏻🙏🏻🐾
 
           ఉగాది కవిత పోటీ లో ద్వితీయ బహుమతి      పొందిన కవిత

         షేక్. మస్తాన్ వలి
     నవ్యాంధ్ర గీత రచయిత
    జంతు శాస్త్ర అద్యాపకులు
    సెల్  :  99 483 57 673.
[5/3, 1:53 PM] Poet Satya Neelima: శీర్షిక : వాతావరణ కాలుష్యం,
రచయిత : సత్యనీలిమ..

గాలి ,నీరు , భూమి ఇలా ఎక్కడ చూసినా కాలుష్యం

ఇదే మానవజాతికి
అతిపెద్ద విధ్వంసం

అనారోగ్య సమస్యలు
అనేక రోగాలకు
కారణం కాలుష్యం

కూరగాయలు, పండ్లు
నిత్యావసర వస్తువులు
సమస్తం కాలుష్యం
బారిన పడినవే

కాలష్య కారణంగా
భూసారం నశిస్తుంది
ఓజోన్ పొర చిధ్రమవుతుంది

ఈ కాలుష్యబూతం నుండి
సహజవనరులను కాపాడుదాం
మొక్కలను పెంచుదాం
కాలుష్యబూతాన్ని తరిమికొడదాం

కాలుష్యరహిత స్వచ్ఛమైన సహజవనరులను భావితరాలకు అందిద్దాం...

                 ✍..సత్యనీలిమ,
              ఉపాధ్యాయురాలు,
                      వనపర్తి...
[5/3, 7:57 PM] Poet Uppari Thirumalesh Sagar, Wanaparty: శీర్షిక:వాతావరణ కాలుష్యము
రచయిత: ఉప్పరి తిరుమలేష్

ప్రకృతి ఒడిలో అల్లారు ముద్దు పల్లె అందాలు
కాలుష్యం కోరల్లో చిక్కుకుంది
ప్రకృతి వినాశనకరి
సృష్టికి ప్రమాదకారి
మానవులు సృష్టించిన మహమ్మారి
సర్వరోగ హితకారి
సమస్తం నష్టానికి సూత్రధారి
కాలుష్యము మహమ్మారి
కాలుష్యము తెచ్చెను కరువు
కర్షకునికి కన్నీటిగోసను
ప్రపంచానికి ప్రమాదంను
మానవజాతి వినాశనం
ముఖ్యంగా సూత్రధారి కాలుష్యము
కాలుష్యము మార్చెను కాలాలను
ప్రసాదించెను ప్రకృతికి ఘోషను
ఆమ్లవర్షంతో అస్థిత్వం ని
కరువు కాటకాలతో కంఠని
రేడియేషన్తో మనరెక్కలను
కాలుష్యము కాటువేెస్తుంది మనబతుకులను
రాగిపల్లెము ?
మటి కుండ?
నులక మంచం?
జొన్నసంకటి జోలి లేదు!
ప్లాస్టిక్ పల్లెము
ప్లాస్టిక్ బాటిల్స్
ప్లాస్టిక్ పరుపు
ప్లాస్టిక్కి ప్రాణాలు
కాలుష్యముకి ముల్లోకాలు
అతిశాస్త్రీయుం..
అవనికి తెచ్చెను కాలుష్యము
ముప్పు
అనంతలోకాలకు సాగనంపు
అమ్మ అవనికి అన్ని జీవరాసుల ప్రాణాలకే ముప్పు
ఫ్యాక్టరీ వద్దు ..
 ప్రవహించే నదులు ముద్దు
ఫ్యాక్టరీ వద్దు
పంటలు  పొలాలు ముద్దు
ప్లాస్టిక్ సంచులు వద్దు
ప్రకృతి సంపద ముద్దు
అభివృద్ధి దిశగా ప్రయత్నం చెయ్యాలి
కాలుష్యము లేెని ప్రపంచాన్ని నిర్మించాలి
చెట్లు పెంచండి
కాలుష్యము లేెని ప్రపంచ ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం..

✍ ఉప్పరితిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
వనపర్తి
9618961384
[5/4, 12:46 AM] కృష్ణమోహన్ గోగులపాటి: కాలుష్యం... కాలుష్యం
రచన : గోగులపాటి కృష్ణమోహన్

కాలుష్యం కాలుష్యం
ఏవైపు చూసినా కాలుష్యం

పరిశ్రమల నుండి వెలువడే
రసాయనాలతో జల కాలుష్యం

వాహనాలనుండి వెదజల్లే
పొగతో వాయు కాలుష్యం

అడ్డమైన ప్లాస్టిక్ వాడకంతో
భూమి లో కూడా కాలుష్యం...

కాలుష్యం కాలుష్యం
ఎటు వైపు చూసినా కాలుష్యం...

తినే తిండిలో కాలుష్యం
కాసే కాయలో కాలుష్యం

పూసే పూవులో కాలుష్యం
పచ్చని పండులో కాలుష్యం...

కాలుష్యం కాలుష్యం
ఎటు వైపు వెళ్లినా కాలుష్యం...

చెరువులో నీరు కాలుష్యం
తాగే మందులో కాలుష్యం

పెరిగే పైరులో కాలుష్యం
పైర గాలిలో కాలుష్యం

కాలుష్యం కాలుష్యం
కాకలు దీరిన కాలుష్యం

వాయు, జల, శబ్ద కాలుష్యం
బెంబేలెత్తుతున్న జనం

అరికట్టలేకపోతున్న
అధికార గణం...

కాలుష్యం కాలుష్యం
ఏ వైపు చూసినా కాలుష్యం

మానవ తప్పిదాలకు
ప్రత్యక్ష వరం
ఈ కాలుష్యం కాలుష్యం...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653
[5/4, 4:00 PM] Poet Palloli Shekar Babu: 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

కాలుష్యం . . ! కాలుష్యం. . . !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అణువణువూ కాలుష్యం ! !
పట్టి పీడిస్తున్నపెనుభూతం !
విపరీతంగా పెరుగుతున్న విషవృక్షం ! !

నింగి నేల గాలి నీరు !
వంకలు వాగులు కుంటలు ! !
చెరువులు  నదులు !
సరస్సులు సముద్రాలు ! !

పల్లెలు పట్టణాలు !
సంధులు గొందులు ! !
పరిసరాలు పొలాలు  !
ప్రతి స్థలము కాలుష్యం ! !

బరితెగించిన స్వార్థం !
మనిషి బాధ్యత రాహిత్యం ! !
ప్రభలుతున్నకాలుష్యం !
జీవరాసి మనుగడ ప్రశ్నార్థకం ! !

నేను నాఇల్లు నావాళ్ళు !
బాగుండాలి భద్రంగా ఉండాలి ! !
చెండాలమైన ఆలోచన !
విచక్షణారహితమైన ప్రవర్తన ! !

కాలుష్య విష నాగులు !
కాటందు కుంటూన్నాయి ! !
అంటు వ్యాధుల కుంపటి లో . . !  శలభాల్లామాడ్చుతున్నాయి ! !

పిల్లలు స్ర్తీలు వృద్ధులను !
పేద మధ్య తరగతి ప్రజలను ! !
కాలుష్యం రక్కసి కబలిస్తోంది !
అనారోగ్య భారతాన్ని మిగిలిస్తోంది ! !

విజృంభిస్తాయి అంతులేని రోగాలు !
పెరిగిపోతారు రోగ పీడితులు ! !
క్షయ క్యాన్సర్ సైన్ ఫ్లూ విషజ్వరాలు !
యువకులు సైతం జీవఛ్ఛవాలు ! !

కాలుష్యం పనులు తగ్గించుకుందాం !
కాలుష్య నివారణ చర్యలు చేపట్టుదాం ! !
పరిసరాలు శుభ్రత ను పాటించుదాం !
పర్యావరణంను పరిరక్షించుదాం! !

మొక్కలను విరివిగా నాటించుదాం !
బాధ్యతగా వాటిని సంరక్షించుదాం! !
ఆహ్లాదకర వాతావరణం సృష్టించుదాం !
ఆరోగ్య భారతాన్ని అందించుదాం  ! !

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

- పల్లోలి శేఖర్ బాబు - కొలిమిగుండ్ల 9490484316.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[5/6, 9:01 AM] Poet Kusumanchi Sridevi: 🌳కుసుమంచి శ్రీదేవి🌳
🌞అంశం-కాలుష్యం🌝
-------------------------------
కాలుష్యం...కాలుష్యం
ఎక్కడకెళ్ళిన
ఎటు చూసిన
అడుగడుగున కాలుష్యం..
నింగి..నేల
రసాయనాలతో
కాలుష్యం...
గలగల పారే సెలయేరులు
హోరున కెరటాలతో
అలరించే సంద్రాలు
వ్యర్ధపదార్ధాలతో కాలుష్యం..

బలవర్ధకమైన ఆహార
పదార్ధాలు కాలుష్యం..
తాగే పాలు కాలుష్యం..

పీల్చే గాలి కాలుష్యం
తాగే నీరు కాలుష్యం..

ఈ కాలుష్యం ఘోష నేడు
నువ్వు .వినిపించికోకపోతే
రేపు నువ్వు ఆలంకించవల్సింది
కూడ వినబడదు...
తస్మాత్ జాగ్రత్త...

కాలుష్యానికి కారకుడువు నీవే
అని గ్రహించి!
నిర్మూలించే బాధ్యత నీదే
అని తలుచు..
లేనిచో రేపటి తరాల
అంతానికి కారకుడివి
నీవే అని గుర్తించుకో!

Comments

Post a Comment