రైతే రాజు
రైతు బాధలు
గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు.
ఎండకు ఎండి... వానకు తడిసి...
చలిలో వనుకుతు....
రోగమొచ్చనా.. నొప్పులొచ్చినా....
రాత్రనకా... పగలనకా...
రైతులు పడే కష్టానికి....
ప్రభుతలు వారికి యిచ్చిందేమిటి?
పంటకు నష్టం వేలలైతే....
పరిహారాలు పదుల్లలోనా?
మిర్చిరైతులు ఒకపక్కా....
చెరుకు రైతులింకోపక్కా...
పల్లిరైతులు ఒకపక్కా....
పత్తిరైతులింకోపక్క....
ఉల్లిగడ్డలు.... ఆలుగడ్డలు....
ఎల్లిగడ్డలు.. చామగడ్డలు...
ఆకుకూరలు.... కాయగూరలు....
పప్పుదాన్యాలు పండిస్తున్నా....
ఆహోరాత్రులు కష్టపడినా ..
పంటకు దగ్గ ఫలమే లేక...
గిట్టుబాటు ధర రాకుండాయే...
రాబందులదే రాజ్యంబాయే...
అమ్ముదమంటే ధరనే రాక....
అగ్నికి ఆహుతి ఇస్తున్నరు....
చేసిన అప్పులు తీరకపాయే...
పరువు ప్రతిష్ట మొత్తం పోయే...
ప్రాణం సైతం పణంగపెట్టి...
ఆత్మహత్యలె శరణంబాయే....
రైతే రాజని గొప్పలు చెప్పకు....
రైతుకు రాయితి లిచ్చి ఆదుకో....
చచ్చినాక నీవిచ్చుటకంటే....
బతికుండగనే రైతునాదుకో....
బతికుండగనే రైతునాదుకో....
మీ
సహస్రకవిమిత్ర, సహస్రకవిరత్న
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653
*************
పాలకుర్తి నాగజ్యోతి
07/01/18..
మట్టిని నమ్ముకున్నోడు...
మట్టిని నమ్ముకుని
అమ్ముకోలేని అమ్మతనమున్నోడు
నువు బెదిరించినా అదిరించినా
ప్రకృతి వైపరీత్యమై కాటేసినా
ఆ మట్టిని కప్పుకునే వరకు
నెలల బిడ్డకువలే నీకు
కాపలా తనవుతూనే వుంటాడు..
అర్ధరాత్రో అపరాత్రో నీ గొంతెండిన ప్రతిసారి
నిద్రకళ్ళను తరిమికొట్టి
తన ప్రాణాన్ని పణంగా పెట్టి
పచ్చని పైరుని తన గుండెలో మొలిపించుకుని
ఎదిగే కొడుకువలే నిను సాకుతుంటడు...
చేతికచ్చిన పసిడివి నీవైతే
పండంగ సంభరమంతా తన కళ్ళలో నింపుకుని
అప్పుల తీర్చే ఆశవు నీవయితే
మార్కెట్లోని మాయ జూదానికి మోసపోవటం తనవంతైనా
విశాదమంతా గుండెలో ఒంపుకుని
కన్నీళ్ళను కంటికి కాపలా చేస్తుంటడు..
గుండెపై తన్నిన పంటరేటువు నువయిన
ఆ కొండ మనసులో మార్పును చూపక
తొలకరి జల్లుకి ఎదురుచూపై
ఏరువాక తన మది వాకిలైతే
తన కంటి గుమ్మంలో
నెలలతల్లికి చేసిన సేవలే నీకు చేస్తుంటడు...
మట్టి పిసికిన చేతులు నీగుండెను తడుముతూ..
తన బ్రతుకు ఆశకు ఊపిరి పోయమంటూ వేడుకోలుతో..
అన్నదాత పేరును అమ్ముకోక
నేలతల్లివంటూ పూజిస్తుంటడు
నిను పంచప్రాణంలా భావిస్తుంటడు..
@సిరిమల్లెలు...
*************
*తెలుగు కవన వేదిక*
నేటి అంశం: రైతు
కవి: శ్రీదాస్యం లక్ష్మయ్య
కవిత సంఖ్య: 1
రైతే రారాజు కావాలి
🌸🌸🌸🌸🌸🌸
రైతు అంటే అందరికీ అలుసే
రైతే కదాయని!
మట్టి లోనే పుట్టి
మట్టి తోనే అనుబంధం పంచుకొని
మట్టినే నమ్ముకుని
మట్టిలో మట్టి లా కలిసి పోయి
ప్రకృతిని ప్రేమిస్తూ
పచ్చదనం చుట్టూ పరిభ్రమిస్తూ
పురుగుబూషి నడుమ
పూటల కొద్దీ గడిపే
రైతంటే అందరికీ అలుసే
కంటికి రెప్పలా
దివారాత్రాలు కాపలా కాసి
ఇంటిల్లిపాదీ ఆరుగాలం కష్టించి
పురుగుల బారినుంచిపంటను కాపాడుకొని
కోసి ,కుప్పలేసి ,నూర్చి
శ్రమను మరచిపోయి
గంపెడాశలని మూటగట్టుకొని
పంటనంతా విపణికి తరలిస్తే
గిట్టుబాటు గురించి
పట్టించుకోకుండా
శ్రమంతా దళారుల పాలవుతుంటే
ఇదేమి అన్యాయమని ప్రశ్నించే
రైతంటే అందరికీ అలుసే
గిట్టుబాటు లేక
పెట్టుబడులు రాక
అప్పులు పెరిగి
తిప్పలు మొదలై
మట్టి వాసనలు వదలలేక
మట్టితో బంధాన్ని తెంచుకోలేక
ఆత్మహత్యలే శరణ్యమై
ఆసరా కోసం ఆర్తిగా చూసే
రైతులంటే అందరికీ అలుసే
ఉపన్యాసాలతో ఊదరగొడుతూ
రైతే రాజు అంటాడొకడు
ఇదేనా రాజరికమంటే
ఇదేనా రైతు రాజ్యమంటే
రైతే దేశానికి వెన్నెముక అంటాడింకొకడు
రైతు నడ్డివిరుస్తున్న
ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు
నానాటికి పెరుగుతున్న కూలీలరేట్లు
నామమాత్రంగా మద్దతు ధరలు
ఇవేవీ వాళ్ళకంటికి కనిపించవు
రైతుల బతుకులపై కనికరం కనిపించదు
రైతంటే అందరికీ అలుసే కదా
రైతు రైతులా మరో రైతుకు
ఆదర్శంగా నిలవాలంటే
ఎవరో ఏదో చేస్తారనే భ్రమలు వీడాలి
రైతే తన పంటకు లెక్కలు వేసుకుని
ధరలను ప్రకటించగలగాలి
రైతు నేరుగా పంటలనమ్ముకునే
పరిస్థితి కల్పించుకోవాలి
రైతే రాజసంగా నిలవాలి
అలాంటి పరిస్థితులు మన కళ్ళముందే కదలాడాలి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
నా రైతు గాథ "🌞
ఓ రైతు నీ శ్రమకు లేదు దాపరికం...
కోడికూయంగానే మేలుకొంటివి...
ఆదిత్యుని పలకరింపుతో పైకి లేచి...
ఉదయభానుని నీడలో ప్రయాణిస్తూ...
కారడవిలో ఒంటరిగా ప్రయనిస్తివి...
భార్యబిడ్డలను నీతో కలుపుకుంటివి....
పచ్చని పొలాల్లో పైరును నాటితివి....
బీడుబడిన భూములను బిడ్డలాగా...
హక్కున్న చేర్చుకుoటివి...
నీ బిడ్డలను పరుగెతిస్తివి..
ప్రకృతి తో సంభందమును కలుపుకుoటివి...
పైరు పంటలను పండించుకుంటివి...
నీ కష్టం అనంత విశ్వసృష్టికి తీరని ఋణం...
వాయువు ను ఊపిరిగా పోసుకొని..
బక్క చిక్కిన పొట్టతో ఆయుష్షు పెంచుకొని...
వరి పొలంలో అదైర్య పడని నడకలతో...
నాగలిని నమ్మి గొడ్ల నమ్మి....
నీ పనిలో దాగిన నైపున్యాన్ని....
ఈ ప్రపంచానికి పరిచియం చేస్తూ...
నీకు సాటి లేరని.. ఇక రారని...
శ్రమభలంతో..బుద్ధిబలంతో...
పచ్చన్ని పొలాల్లో అడుగులు వేస్తూ...
నీ శ్రమతో కూడిన నైపున్యానికి...
యాంత్రిక కృషి సరి రాదనీ..
నీ దరి చేరదని నిరూపిస్తూ...
పచ్చని పొలాలను పండిస్తూ..
కంటికి రెప్పలా..కటిక కాపరిలా..
కాపలాకాస్తు...నీరాబడి కోసం..
ఎదురు చూస్తూ..
చిన్న చిన్న చినుకుల కొరకు...
ఆశతో ఎదురుచూస్తూ...
ప్రకృతి వైపు కన్నీరు కారుస్తూ...
పటిమతో ప్రజలకొరకు శ్రమిస్తూ...
చినుకులా....రేయిలా.... పిడుగులా...
అగ్గిపుల్లలా...నివురుగప్పిన నిప్పులా...
ఆకాశంలో మెరిసే మెరుపులా...
కూసే కోయిలలా...
నిద్రను లేపే కోడిలా....
పరుగెత్తే జింకలా...
అధిక బరువును మోసే ఒంటెలా, ఏనుగులా...
శత్రువులను చంపే నీటి గుర్రంలా...
పంజా విసిరే బొబ్బిలి సింహలా...
శ్రమనే ఆయుధంగా కలిగి...
పచ్చని పొల్లాలకు.. నావికుడిలా...
రాజ్యాన్ని రక్షించే యోధుడిలా...
దౌర్జన్యము, దౌర్భల్యము,దౌర్భగ్యము,దౌష్ఠ్యం
పారద్రోలే ధర్మరాజులా....
పచ్చని పైరు లను పండిస్తూ...
నీ శ్రమకు రాబడి రాదని....లేదని
తెలిసినా నివ్వురు గప్పిన నిప్పులా...
ఉప్పెంగే సముద్రపు ఉప్పెనలా...
నీ శ్రమను నమ్ముకున్న ఓ శ్రామిక జీవి....
నీవు నిజంగా ధన్య జీవివి......పుణ్య జీవివి..
🙏🙏🙏🙏🙏🙏🙏
రచన
✍ తెలుగు తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
ఎం. వి.రామన్ ఉన్నత పాఠశాల
ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
అమరచింత మండలం, వనపర్తి జిల్లా.
చరవాణి : 9908910398
*****************************
*****************
రైతన్న పరిస్థితి
******************
వర్షం కురిసే
వంకలు పారే
వాగులు పొంగే
చెరువులు నిండే
మోడు చిగురించే
బీడు పులకించే
అవని పరవశించే
అన్నదాత ఆనందించే
భూగర్భ జలం వృద్ధిచెందే
పైరుకు జలం సమృద్ధిగా అందే
ఎరువులతో పైరు తృప్తి చెందే
అధిక దిగుబడి రైతుకు అందే
ఉహాల్లో రైతన్న విహరించే
అప్పులు తీరునని భావించే
పంటను మార్కెట్ కు తరలించే
ఆదాయం వచ్చునని ఆశించే
మార్కెట్ లో ధర మందగించే
ఆ వార్త దళారీ రైతు కందించే
రైతన్నమదిని నిలువునా బాధించే
మూడుదుడ్లకు పంటను అప్పగించే
వేధనతో రైతన్న కన్నీరు కార్చే
ఇంటిల్లి పాదిని ఆకలితో మాడ్చే
అప్పులు నిప్పులై బ్రతుకును కాల్చే
అన్నదాతకు ఎవరు ఓదార్పు నిచ్చే
**************************
పల్లోలి శేఖర్ బాబు -కొలిమిగుండ్ల 9490484316
***************************
*రైతన్న లేడు*
*రచన*.... *అవనిశ్రీ*
*దాసరిపల్లి* *మల్ధకల్**మండలం
జోగులాంబ గద్వాల జిల్లా
9985419424
నేను
రైతుపై కవిత్వం రాయలేను
నా కలం కదలక కాదు
నాలో భావాలు ఉట్టిపడక కాదు
రైతులపై
కవిత్వం కుమ్మరించడానికి
రైతులన్నది ఈ నేలపై
ఉంటే కదా..
లేనప్పుడు
ఇన్ని సానుభూతి మాటలెందుకే....?
రైతును
నిలువెల్ల దహనంచేయడానికి
ఈ దేశాన్ని పాలించే పెద్దలు
రైతే రాజనీ
వేదికలెక్కి రూబాబుగా
గుండె సించుకోని
కూడపల్గుతరు
డెబ్బయి రెండు శాతమున్న
రైతన్నల ఓట్లకోసమే
ఎవరైన
కాదాంటారా చెప్పండి..??
రైతన్నలపై కవిత్వం
అనగానే
సహజంగానే
సకల కవుల కలాలకు
పూనకం రావచ్చు
కాగితంపై ఖచ్చితంగా
ఈ పాలకుల పాపం
కడగాలనే సిద్దమైతరు
కవిత్వం ముగియగానే
సర్వం యధాతథం.
రైతులెక్కడున్నారు
కవిత్వం రాయాటానికి
వెయ్యి పుట్లు పండించే రైతు
పట్నంలా పల్లీలమ్ముతున్నడు
ఆరు అరకలుగట్టి
ఆరుగాలం పంటను కాపాడే
రైతులు
ఏటీయమ్ దగ్గర
కావలి కాస్తున్నాడు
కల్లం కాడికొచ్చిన
బిచ్చగాడికి గంప ధాన్యంబెట్టే రైతు
నేడు
బిచ్చగాడై తిరుగుతున్నాడు
నిజమే
నిక్కచ్చిగానే రాస్తున్నాను.
నా కలం
రైతు ఆనందాన్ని
రాయటం మొదలుపెడితే
నాదే ఉత్తమ కవిత్వం అవుతుంది
రైతుల భాదలు
నాకు ఎక్కువే తెలుసు
నేను రైతును కాబట్టి.
రైతులు
ఎక్కడున్నారు
రైతుపై కవిత్వం రాయటానికి
ఇంకెందుకయ్య
ఈ కవిత్వం
రైతే లేనప్పుడు
ఇంకెందుకు
రాస్తారు
సానుభూతి కవిత్వం
ఇక చాలు
వదలండీ కలాలను
కదలండీ పోలాలకు
రైతన్నను
రాజును చేయటం
ఈ కవి సామ్రాట్ కే
సాధ్యం.
****************
రైతన్నా,
దేశాన్ని రక్షించే
సైనికులతో పోల్చి
జై జవాన్ జై కిసాన్..నినాదాలు చేసి మురిసిపోయాం
సాదర కుటుంబ సభ్యుడిని చేసుకుని రైతన్నా అంటూ
ఆప్యాయతల్ని రంగరిస్తాం
ఇవన్నీ పెదాల పై పూసే
కృత్రిమ పదాల పూలు..
రైతే లేకపోతే అమ్మయినా
బిడ్డ ఆకలి తీర్చగలదా?
ప్రకృతి కన్నెర్ర చేసినా
ఊసరవెల్లి రాజకీయమైనా
బలయ్యేది రైతే
అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటూ..దణ్ణం పెట్టుకోవాల్సిన కనిపించే
దేవుడు రైతు..!
కనిపించి విలపించే రైతన్నకి
నాటినుండి నేటి వరకు
కష్టాలు తీరలేదు
"అన్నం పరబ్రహ్మ స్వరూపం"
అన్నమాట కి రూపమిచ్చిన
కృషీవలుడు
కృంగి కృశించి నశించిపోకూడదు
అందరం తలుచుకుంటే..
అన్నదాత సుఖీభవ" అన్నది నిజమౌతుంది..
-----పి.వి.ఎల్.సుజాత
సైనిక్ పురి..సికింద్రాబాద్
*********************
@రైతు@...
హలము వేసుకుంటివి భుజముపైన
నీకు సాటి ఎవరు ఈ భువనములోన
ధరణిని దున్ని వేస్తావు బీజాలు
వాటిని కంటి రెప్పలా కన్నబిడ్డల వలె కాపాడుతూ
సకాలంలో వరుణుడు కరుణించక తల పైకెత్తి నింగి కేసి చూస్తూ అందరికీ అన్నం పెట్టడం కోసం నీవు ఎన్ని పస్తులున్నావో ఎవరికి తెలుసు
పంట పండాక తగిన గిట్టుబాటు ధర లేక కన్నీళ్లు మింగుతూ ఉండే నీ ఘోష ఎంత మంది అర్థం చేసుకుంటారు ఇప్పుడు భరతమాతను అడగాలని ఉంది ఒక మాటను
ఓ భరతమాతమ్మా ఎక్కడున్నవమ్మా నీ పిల్లల బతుకులను వచ్చిచూడవమ్మా
ఉరి తాళ్ళకు వ్రేలాడుతూ ఉయ్యాల లూగుతూ శాశ్వత నిద్రలో ఒదిగి పోవుచున్నారు
రైతును కాపాడుదాం
వ్యవసాయాన్ని అభివృద్ధి చేధ్ధాం హరిత తెలంగాణాగా
మారుధ్ధాం...
✍....సత్యనీలిమ
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
******************************🌷-
--------------------------------
*అంబటి భానుప్రకాశ్.*
9948948787.
---------------------------------
ఉనికి
అమృతాన్ని పండించే రైతన్న
హాలాహలం మింగుతున్నడు,
అడగాల్సిన వారంతా
అడుగేయడమే మరిచిండ్రు,
దేశానికి ఏదో అవసరమని
రాత్రీ పగలూ ఆరాటపడుతున్నరు,
కానీ,
మట్టినే నమ్మిన,
రైతులు మట్టిలో గలిసిపోతుంటే,
మౌనంగున్నరు.
మౌనం వీడకపోతే అన్నదాతల మనుగడే
కష్టం!
సాప్టు వేర్లూ ఇంజినీర్లూ కాదు
సాకేటోడు కావాలి ముందు,
తనువెల్లా చెమటతో తండ్లాడే రైతులు
ఉరికొయ్యకు
వేలాడకముందే,
ఉనికి కాపాడుకొందాం!!
🌷🌻🌷
కర్షకుని జీవన పోరాటం
భాస్కర బాలభారతి
9491353544
కర్షకుని జీవన పోరాటం
పదెకరాల రైతన్నకు
పదేళ్ళనుండీ పండలేదు
పంటలు
వరదలా పారేటి అతనికన్నీళ్ళు
కలిపితే
పండేను పంటలు పదేళ్ళు
అమ్ముకున్నాడు
ఏడాదికో ఎకర
ఆకలి మంటలు ఆర్పుకోను
అప్పులమూటతో
వలస బాటపట్టాడు
పట్టణానికీ
ఆరాటంతో కూలికై తిరిగాడు
పట్టణమంతా
కూలదొరకక ఆశ్రమజీవి
ఎత్తాడు పేడగంప
నెత్తిన పేడ సేకరణా
పిడకల వ్యాపారంచేయదలచి
కరురువు కాటకాలకు బరువు
కాగా
అమ్మారు పసుల కబేళాలకు
పేడాలేదూ పీడకలూ లేవు
కట్టెలమోపు తలపై పెట్టి
కట్టెలవ్యాపారం మొదలు పెట్టాడు ఐడవి చెట్లు
కొట్టరాదని
పట్టు కున్నారుఅధికారులు
నేరమని
ఇచ్చుచేతులేగాని
పుచ్చుకొనుట
ఎరగని తరగని అభిమాన వంతుడైనరైతన్న
ఊఃచవృత్తి ఎంచుకోలేక
తాళలేక ఆకలిమంటకు తూలుతూ
చేరాడోకళ్యాణ మంటపం వెనుక
కూర్చున్నాడు మురికి
కాల్వగట్టున
ఎంగిలి విస్తర్లకై ఆత్రంగా
ఆకలి ఎరుగదు రుచీ సుచీ
అగుపించవు ఎఃగిలిమంగలాలు
అక్కడే చేరిందో సూకరం
ఎంగిలిమెతుకులకై అలవాటుగా
నకనకలాడే ఆకలీ చురచుర
చూచేచూపులూ
విస్తళ్ళకై ఎదురు చూపూలు
ధభీమన్న విస్తళ్ళకట్టను
ఒడీసి పట్టాడు అంతెత్తెగిరి
రైతన్న
ఆకలికేకలూ అరనిమిషం
తోపులాటలూ
గుర్ గుర్ గుర్ పంది
తోసింది రైతన్నను ముందుకు
ముట్టెతో
పడ్డిడు రైతన్నమురికా
కల్వలోకి
కూరుకుపోయాడు ఊబిలో
ప్రాణాలు అనంత వాయువుల్లో
ఎంతటి మహా వటవృక్షమైనా
నేలకు వరగాల్సిందే
ఝంఝామారుతానికి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
పేరు : అభిరామ్
శీర్షిక : కర్షక గాధ
*కర్షక గాధ*
హలం మోసిన
బలరాముడు
దేవుడైయ్యాడు
ఆ హలాన్నే
నమ్ముకున్న కర్షకుడు
ఉరి తాడు ఆకలికి
ఆహారమైయ్యాడు
బలరాముడు చేసిన
పుణ్యం ఏమిటి
ఈ కర్షకుడు చేసిన
పాపం ఏమిటి
ఇది దేవుడిచ్చిన శాపమా
ఈ ప్రభుత్వ పాలన లోపమా
ఏది న్యాయం
ఎక్కడుంది ధర్మం
సమస్తాన్ని వర్ణించే
కవికలం
ఎరుపు సీరాతో మండి న్యాయం అడగదెంగుకు ?
మట్టికొట్టుకొన్న తలపాగ చుట్టిన తలకుమాసిన మనిషి గురించి మనకెందుకనా ?
*అభిరామ్*
ఆదోని
**********************************
: దండ్రె రాజమౌళి 7-1-2018. శీర్షిక : వెన్నెముక.
మన్నును నమ్ముకుని
మిన్నును ఆశగాచూస్తూ....
కంటినిండా దు:ఖం
ఎగజిమ్ముతున్నా గుండెనిండా వేదన గూడుకట్టుకుని నిత్యం పలకరిస్తున్నా... ఆశాజీవే తను! కేజీలకొద్దీ నిరాదరణ టన్నులకొద్దీ దారిద్ర్యం చూరుపట్టుకు వేలాడుతూ కాపురముంటాయ్! అయినా తనతో ఏదో దివ్యకార్యం నెరవేర్చేవి విధిచే లిఖించబడిన కారణజన్ముడననే ప్రగాఢ విశ్వాసం! జాతికి ఆకలి దీర్చే అక్షయపాత్ర తానన్న. నమ్మకం! సకల జీవరాశుల దాహాన్ని తీర్చే అపర భగీరథుడు... తాను! దేశానికి తాను వెన్నెముకగ నిలిచి కుటుంబానికి మాత్రం ఏ ఆదెరువు చూపలేని నిస్సహాయి...!
🌼🌺🌼🌼🌺🌼🌼🌺🌼🌼🌺🌼
*A.భాగ్యచంద్రిక
*రైతన్నకు అభివందనం*
🍀🍀🍀🍀🍀🍀🍀
హలం పట్టి పొలం దున్నే రైతన్నా
సిరులనిచ్చే భూమాతకు
పచ్చని కోక చుట్టినట్లు సింగారించే
కృషీవలుడా ,!!
తొలిపొద్దు కోడికూత పలకరించే
రవికిరణాల ,
వెలుగులో నడకసాగించి,
మోడువాడిన బీడుభూములును
అందాల హరితవనాలు చేస్తావు,
ఎండనక వాననక ఏకమైన నీకృషితోన భూమాత ముత్తైదువైనట్లు కనిపిస్తుంది.
మాగాణి నీచలువతో
కష్టాల కడలిలో కొట్టుమిట్టాడు నీబతుకుకు
చేయూతనిచ్చే వారులేక
జీవన చదరంగంలో
ఓడిపోయే నీమనుగడ ,
గొడ్ల డొక్క లెండిపోయే !
మాగణం మాడిపోయే !
నీరూపే మట్టిగలిసె !!
నీవు లేని ప్రపంచం ఆకలికి
అలమటిస్తుంది,
అందరికి బువ్వపెట్టే
నీకు వందనం ! అభివందనం !!
ఎ.భాగ్యచంద్రిక.
🌼🌺🌼
@రైతేరాజు@
ఓ కర్షకుడా!
మాడిచెక్కలే నీకు పరమాన్నం
చెఱువు నీళ్ళే నీకు అమృతం
చేతితో వడికిన నూలు బట్టలే పట్టువస్త్రాలు
కప్పుకొనే గొంగడే నీకు ఆత్మరక్షణ కవచం
పశుసంపదే నీ కుటుంబం
నీవు పెంచిన పంటలే ఉధ్యానవనాలు
నీవు పండించే పంటనే ప్రపంచానికే ఆహారనిధి
నీ రక్తాన్ని ధారపోశావు మాగాణిలో
బంగారు సిరులు పండించావు
మాగాణంలో
మార్కెట్లో ధరలు లేక మాడిన
చీడ పీడలు చేరి పంటలు ఎండిన
కరువొచ్చిన కాటకమొచ్చిన
వానొచ్చినా వరదొచ్చినా
నిన్ను రక్షించే నాథుడే కరువయ్యాడయ్య ఈ భువిలో
రైతే దేశానికి వెన్నముక
అతడలిగితే లేదు మనకు అన్నమిక
సమాజంలో ఆకలిని తీర్చే దేవుడు మన రైతే
రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న రైతులకు శతకోటి వందనాలు...
✍ ఉప్పరి తిరుమలేష్,
తెలుగుఉపాధ్యాయుడు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి...
9618961384
🌼🌺🌼🌼🌺🌼🌼🌺🌼🌼🌺🌼
పేరు: వాసుదేవమూర్తి శ్రీపతి
శీర్షిక: జగతికి వెన్నముక రైతు
నేలనేలే రాజుకన్నా
హలం పట్టిన రైతు మిన్న
అన్నదాతల కన్ను తడిసిన
నరుల మనుగడ నిండు సున్నా
రైతు మేలుని కోరుకుంటు
నమ్ము వేల్పుకి మొక్కుమన్నా
మన్ను నమ్మిన వాని నవ్వులో
అవని మేలు దాగెనన్నా
కర్షకేంద్రుని కడుపు మండిన
ఆకలి విలయం తప్పదన్నా
ఉరికి రైతు ఉసురు విడిచిన
మనిషి భవిత సూన్యమన్నా
రైతు దేశపు వెన్నుముక కాదురన్నా
రైతు జగతికె వెన్నుముక ఇది నిక్కమురన్నా
🌼🌺🌼🌼🌺🌸🌸🌸🌸🌸🌸🌸🌸
రైతు
********
పుడమి తల్లి ఒడిన
పులకించే రైతన్న
పస్తులతో తానుండి
పరుల పస్తులు తానుదీర్చి
రెక్కల కష్టాన్ని ఇష్టంగా
మలచుకొని నిలిచే మారాజు
ఆహారానికి అర్రులు చాచే
లోకానికే తాను ఆప్తుడై
రాత్రి పగలు భేదం తెలియక
కాయా కష్టం మర్మం తెలియక
ఆకలి కేకలు లేని లోకానికై
అలుపుసొల్పును లెక్కచేయక
అందరి ఆకలి తన ఆకలేనని
ఆలోచించే ఆదర్శమూర్తి రైతు
అందరి వాడివి నీవే రైతన్న
నీవు లేనిదే ఈ లోకం లేదన్న
నీవే మా జీవన ప్రాణాధారం
అందుకే అందుకో నిత్యం...మా వందనం.!!
రచన
******
పూదత్తు భాస్కర్
🌹🌹🌹🌹🌹🌹🌹
దండ్రె రాజమౌళి
తేది 8-1-2018
శీర్షిక : రైతు
పంట చేనే పట్టుపానుపై
పురుగులమందే పెరుగున్నమై
వేలాది బక్కపాణాలు
పిట్టల్లా రాలిపోతున్నా
నేటికీ వ్యవసాయం మిగిలున్నది
కర్షకుడి కరుణార్ద హ్రుదయమే...
కంటినిండా విస్పులింగాలు
రగిలిస్తూ...
ఇతరులకోసం నిలువునా
తను కరిగిపోతున్న కొవ్వత్తి...
గిట్టుబాటు ధరలేక
పెట్టుబడికి భరోసా కరువై
సమాజ నిర్లక్ష్యానికి బలియై
ప్రాణాలనే ఫణంగా ఒడ్డి
రక్తాన్ని చెమటధారలుగా మార్చి
తన దేహాన్ని వెన్నెముక చేసిన
అపర దధీచి మహర్షి!
🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
పేరు : మూర్తి శ్రీదేవి
ఎం.ఏ.ఎం.ఈ.డి
తెలుగు టీచరు
యూనిసెంట్ స్కూల్
కొంపల్లి
ఫోన్. 8790560365
తేది : 9/1/18
శీర్షిక : ఆత్మబంధువు-రైతు
రేయనక పగలనక
కాయకష్టం చేసే రైతు
దుమ్ముధూళిని లెక్క
చేయక తుడుచుకుని
పోయే మన హాలికుడు
ఎండావాన ఏమిపట్టని
ధన్యజీవి కర్షకుడు
పండుగొచ్చినా జాతరొ
చ్చినా కొత్తబట్టల బదులు
వానకోసం ఎదురుచూసే
పుణ్యజీవి మన రైతన్న
సెలవులేదు, నెలవులేదు
అన్ని పనిదినాలుగానే
పరిగణించి ఇల్లు వాకిలి
వదిలి పొలమునే నెలవుగా
నమ్ముకొని అంధకారమునే
రాబోయే వెలుగుకు దారి
యని భావిస్తూ చలిలో
వణుకుతూ మంచే మీద
పాతదుప్పటి కప్పుకొని
నిద్రలేమితో బాధపడక
మనందరి ఆహారం కొరకు
కాపలా కాస్తూ పడిగాపులు
కాస్తూ తెల్లవార్లు చప్పుడు
వస్తుందేమోనని బంగారు
పంటను ఏ పశువులు
మేస్తాయేమోనని తన
కళ్ళు కాయలుకాచేలా
చూచి చూచి కోడికూతతోనే
మంచె దిగి కలుపు మొక్క
లను తీయుటకు కొడవలి
పట్టి నేలతల్లిని తనమృదు
హస్తాలతో తాకితాకి పవిత్ర
భక్తుడిగా జాతి ప్రజలకు
అన్నదాతగా తన జన్మ
సార్ధకం గావించుకుంటున్న
మన ఆత్మబంధువు రైతన్న.
అందరికి అన్నదాతఅయిన
రైతు జగానికి ములాధారు డైన రైతు భూమాతకు ప్రియ కుమారుడైన రైతు
నిత్యజీవనం కన్నిటిమయం
ఆలోచించేవారే లేరా రైతు
జీవనవిధానం గురించి ?
🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
శీర్షిక : రైతన్న
ప: భూమాత తొలి పుత్రుడా...! రైతన్న
కష్టాలు పడు జ్యేష్టుడా...!
1.మండు వేసవి లోన మంటల్లో కాగేవూ
తడబాటు లేకుండ మడులు సరిజేసేవు
వానల్లొ నానుతూ వణుకుతూ చలిలోన
నాగలితొ దున్నేవు నాయన్న రైతన్న!భూ!
2.రాత్రనక పగలనక రాల్లల్లొ తిరిగేవు
కష్టాలు కన్నీల్లు కడగంట నెట్టేవు
తలకింద చెయివెట్టి గులకరాలల్లోన
నిదురించి బాధలను ఎదురించె రైతన్న!భూ!
3.పచ్చ జొన్నల గటకే పరమాన్నమౌ నీకు
చల్ల అంబలి ఇంటి కెల్ల పాయసమౌను
పసులమందే నీకు పరివారమయ్యేను
పన్నెచిన్నెలు లేని వయ్యారి రైతన్న !భూ !
. రచన-మధుసూదన్ కోమటి,నల్లగొండ.
. చరవాణి :9491328432.
🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
ఇందులో నా కవిత పంపచ్చా అండి
ReplyDeleteSupper
ReplyDelete