మేడారం సమ్మక్క సారక్క జాతర

 కృష్ణమోహన్ గోగులపాటి: మేడారం జాతర

1)
lసీl
మేడారమందున  మేడరాజుకు పుత్రి సమ్మక్క శౌర్యంపు సచ్చరిత్రి!   
పేర్మిని మీరంగ పెండ్లినాడినయట్టి
పగిడిద్ద రాజుకు పట్టమహిషి!
వారికి సారక్క వాసిగ, జంపన్న నాగులమ్మ సుగుణ నాత్మజులగు!
రుద్రుని యెదిరించి రుదిరమ్ము చిందించి,
యసువులు బాసిరి ఐఖ్యతకయి!

lతేగీl
ఆత్మ గౌర వమ్ము లతిశయింపగబోర
తరలివచ్చినారు దైవములయి!
మన్యభూమి మ్రొక్కె ధన్యులౌవారికి !
జ్యోతి నవ్య కృష్ణ జూడు మఖిల.


2)
lసీl
కాకతీయులనడ్డి కదనరంగంబందు,
తలపడిరా వనితాద్వయమ్ము!
జంపన్న వాగులో చరితను రాసినా...
రమణులైనట్టి యా యక్క సెల్లె!
సమ్మక్క సారక్క జంపన్నలున్ గొప్ప
గిరిజన వేల్పులై కీర్తిగొనిరి!
భరతధేశమునందు భాగ్యప్రదాయులై
కోట్లాది భక్తుల కోర్కెదీర్చు!

lఆవెl
కొంగు ముడియె పసుపు బంగారు మయములు!
భక్తి తోడ కొలువ భాగ్యమబ్బు!
కోట్ల జనుల
సకల జనుల గాచు సమ్మక్క సారక్క
జ్యోతి నవ్య కృష్ణఁ జూడు మఖిల.
[2/4, 8:59 AM] Poet Satya Neelima: శీర్షిక: సమ్మక్క సారలమ్మ జాతర
రచయిత: సత్యనీలిమ
🙏🙏🙏🙏🙏🙏🙏
జాతర చూద్దామా సమ్మక్క సారక్క ...(2)
వరంగల్లు జిల్లాలో మేడారం జాతరంట...(2)
గిరిజన పడతులంట అడవితల్లి ఆడపడుచులంట..(2)
                               "జాతర"
పగిడిద్ద రాజు బార్యాబిడ్డనంట
గద్దె మీద కూర్చొని మనగోడు వింటరంట....(2)
                             "జాతర"
జంపన్న వాగులో తానాలు చేస్తరంట...(2)
నిలువెత్తు బంగారం అమ్మకు ఇస్తరంట....(2)
                            "జాతర"
వనదేవతలంట చల్లని తల్లులంట...(2)
మహిమలెన్నో చూపి చల్లంగ చూస్తరంట.…(2)
                            "జాతర"
ప్రతాపరుద్రునితో రణంలో పోరాడి
వీరత్వం చూపిరంట వీరమరణం పొందిరంట..(2)
                         "జాతర"
గుట్ట దగ్గర సమ్మక్క భరిణె గా మారెనంట..(2)
పసుపు కుంకుమ లే కనిపించిన గురుతులంట..(2)
                          "జాతర"
వరంగల్లు జిల్లా కళ కళా
తెలంగాణా కుంభమేళా...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
                ✍.. సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                జీనియస్ పాఠశాల,
                         వనపర్తి...
[2/4, 10:55 AM] అంబటి Poet Bhanu Prakas: __

🌷🌷🌷🌻🌷

పేరు: *అంబటి భానుప్రకాశ్ .*
ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
జోగులాంబ గద్వాల జిల్లా.
9948948787.

*సమ్మక్క- సారలమ్మ.*

*సీ.*
మేడారమందున మేటియై నిలిచారు,
మహిమలే జూపించి రిహముపైన,
వనములో వేల్పులై వనియెల్ల వెల్లువై,
భాగ్యమిత్తురు నిజభక్తిమెచ్చి,
గద్దెపై కొలువుండి ఘనమైన రీతులన్
పూజలందుకొనుచు పులకరించి
కోరిన వారికి కొంగుబంగారమై
కొండంత యండగా కొలువుదీరి

*తే.*
జాతి జనులను మేల్కొల్పిసాగివచ్చి,
పడతి జూపిన ఘనమైన పౌరుషంబు
వీరవనితగ నిలబెట్టి, పోరుజేసె
జయము సమ్మక్క,సారమ్మ జయముజయము

*కం.*
జనజాతర వనమంతట
తనువంతగపులకరింప తరలగ రారే,
కనుపండువ పిలుపందగ
కనరారే కానుకలిడ కనకంబిడరే.

*కం.*
అమ్మల జూడరె కన్నుల
నమ్మిక దోడుత గొలువరె నయముగ మిమ్మున్
వమ్మది జేయక గాచును
నమ్మిన వారల మనమున నాట్యంబాడున్.

*కం.*
బంగారము సింగారము
రంగారుగతీర్చిదిద్ది రమ్యము గొలుపన్
బంగరు తల్లికి నేడిదె
మంగళ హారతులొసగియు మరిరమ్మనరే.


🙏🍀🙏
[2/4, 12:12 PM] Poet Ithagoni Venkateshwarlu: రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:మేడారంజాతర

సీ:
వణకుడు మానినన్ వననిధి వణకును
సబలలు మీరాది శక్తులమ్మ
కలమైన కత్తైన కడునేర్పునొందు మీ
కరముల బొగడగా కరముకరము
తల్లిగా చెల్లిగా  దారగా ధరణిలో
వివిధ పాత్రలు దాల్చు విశ్వరూపి
బ్రతుకునందాశల బంగారు పంటలు
పండించు వండించు నిండుదనము
తే:
కలుగు నను నిజమును దెల్ప గాను గురుతు
సరిగ సమ్మక్క సారక్క జాతరనిన
ఇట్టి స్ఫూర్తిని పొందుడో యింతులార
సత్యచైతన్య దీప్తులై జగతియందు🍇🍇🍇🙏🙏🙏
[2/4, 1:55 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: పాలకుర్తి నాగజ్యోతి
8074712181
కొమరంభీంజిల్లా


జాతర...


వనపుత్రికలు
గిరిపుత్రికలు
తల్లీకూతుళ్ళు
ప్రాణాలకు వెరవక
పోరాడిన వైనం
చరిత్రయై
పుటలలో లిఖించబడి
నేటికినీ కొలువ బడుతుంది..

జన జాతర
వన జాతర
కొంగు బంగారమై
నుదుట బండారమై
రెండేళ్ళకొకసారి పండగ సంబరమై
గుండెను నింపుతుంది...

అడవంతా వెలుగై
జనమంతా తరులై
శివమెత్తిన బోనమై
జంపన్నవాగు పూనకమై
మేడిరాజు కూతురు మేడారంలో కొలువై
పగిడిద్దరాజు తోడులో వీరనారి పోరులో
అశువులు బాసి మాయమయింది..

కుంకుమ భరిణె రూపంలో చిలకలగుట్టలో వెలిసిన
త్యాగమయ జీవితమును
అవతార పుత్రికగ కొలిచి
వనదేవతగ
పూజలందుకుంటుంది..


@సిరిమల్లెలు...

******************

[2/4, 5:28 PM] Poet Musthakheem విన్నర్: 💐మేడారం జాతరో💐

జాతరో జాతర..మేడారం జాతర..
ప్రపంచంలో ప్రసిద్ధి ..గాంచిన జాతరో జాతర ..మేడారం జాతర..
సమ్మక్క సారక్కల ఊ రేగింపుల ,కొలువుల జాతరో జాతర..మేడారం జాతర..
ఎన్నెన్ని ఏర్పాట్లు, ఎన్నెన్ని ఆర్భాట్లు..
ఎన్నెన్ని వెలుగులు, ఎన్నెన్ని జిలుగుల.. వరంగల్లు జాతరో
జాతర..
తెలంగాణ తేజమూ..తెలంగాణ..మూలమూ.. మేడారం జాతర ..ఈ
మేడారం జాతర..
చూడు చూడు భక్తురాళ్ల
ఊపులూ-మైమరపులు..
పొర్లు దండాలు ..యాపాకు చేత బట్టి ..ఆ ఒళ్ళు విరుచుకోవడాలు..జుట్టు ఊపుకోవడాలు..
చూడరో జాతర..ఎంత పెద్ద జాతర..మేడారం జాతర..
సర్కారు సార్ల ఏర్పాట్లు.. మస్తు మస్తు..వైద్యం కూడా ఉంది, చేస్తే గనుక సుస్తు..
జాతరో జాతర మా మేడారం
జాతర..
బెల్లంతో నిలువు బంగారమంటా.. గొర్రె పొట్టేళ్లతో
పండగే పండగంట ..
సమ్మక్క సారక్కల సంతోషం నలువైపులా..
జాతరో జాతర..మేడారం..
పిల్లలకు మైసూరపాకుల ..జాతర..
ఆటబొమ్మల ..ఆనందాల జాతర..
జాతరో ..జాతర..మేడారం
జాతర..చూద్దాం రారండిర..!!
జనం జాతర...

రచన:విన్నర్, కొల్లాపూర్.
[2/4, 5:39 PM] ‪+91 96189 61384‬: 🎋🎋🎋⛰🏔🏕⛺🏕 శీర్షిక: (తెలంగాణా కుంభ మేళా) మేడారం జాతర⛺⛰⛰🏔🎋🎋🎋🎋🏕🏕🏔🏔⛰⛰⛰⛰
అడవి బిడ్డల జీవగడ్డ మేడారం జాతర
కోయ బిడ్డల పురిటిగడ్డ మేడారం జాతర
మానవత్వానికి ప్రతీకలు
మేడారం అడివి బిడ్డలు
కోయ బిడ్డల మనసు కోవెలలో
కొలువై ఉన్న వనదేవతలు
అందాల అడవిలో ఆది శక్తులా గద్దెలు
ఆరాధ్య దేవతలు
చిలుకలదిగుట్టమీద
నెమ్మలి నార చెట్టుకింద
కుంకుమ భరణి వెలిసింది
ఈనాటి కుంభమేళా గా విలసింది
పచ్చని ఆడవమ్మ వెచ్చగా నవ్వంగ
ప్రకృతి అందాల చేత పులకించగా
ప్రపంచమే జనజాతర అని పొగడగా
ఈ భువిలో విలసిల్లిన మరొ కుంభమేళా గా

వరంగల్ అడివి బిడ్డలు
తెలంగాణ గడ్డ పౌరుషానికి ప్రతీకలు
మేడరాజు ముద్దుల బిడ్డ సమ్మక్క
అందచందాల ఆణిముత్యం
పౌరుషల గడ్డ ముద్దుల ముత్యం
మేడారం అడవిబిడ్డల సిగలో రత్నం
మా సమ్మక్క
మేనమామ పగిడిద్దరాజు
ముద్దుల ముత్యం
పగిడిద్దరాజు ప్రాణసఖి
అర్ధాంగి సమ్మక్క
పూర్వజన్మ పుణ్యఫలం
సారలమ్మ నాగులమ్మ జంపన్న
పగిడిద్ద సమ్మక్క సంతాన ఫలం

రాజ్యవిస్తరణ గావించే మొదటిప్రతాపుడు
ప్రతాపరుద్రుడు ని ఎదిరించిన పగిడిద్దుడు
కప్పమా,ఖాయమా అన్నాడు ప్రతాపుడు
రాజ్యరక్షణ కే సిద్ధం అన్నాడు పగిడిద్దుడు

మాఘశుద్ధ పౌర్ణమి రోజున
కాకతీయ సైన్యాలు యుద్ధానికి సిద్ధపడిన రోజు
సాంప్రదాయ ఆయుధాలు పగిడిద్ద పంతం
గెరిల్లా యుద్ధ విద్యల సమ్మక్క సైన్యం
ముప్పుతిప్పలు పెట్టింది సమ్మక్క యుద్ధం
వీరోచిత పోరాటం గా సాగింది
గిరిజన మహిళ యుద్ధం
చివరికి శత్రువు చేతిలోని ఆయుధం
సమ్మక్క పాలిట మారణాయుధం

                           
                           ✍ఇట్లు
                     నా సొంత రచన
                 ఉప్పరి తిరుమలేష్
               జీనియస్ హై స్కూల్
              వనపర్తి
          చరవాణి9618961384

[2/4, 6:29 PM] Poet Aruna Chamarthi: పేరు :అరుణ చామర్తి /ముటుకూరి             కవిత శీర్షిక : "కరి" మింగిన వెలగ  హన్మకొండ               *****                   మనిషికే  అనుకున్న రంగు తేడాలు                 
చంచల డబ్బుకు కూడ ఉన్నాయి బేధాలు             
ఎండ కన్నెరగక ఉంటే  మిసమిసలాడే పసిమి రంగు మేను
ఎవరి కంట పడక దాస్తే , అనుక్షణం భయమేనూ
ఎందుకో అవసరాలకు మించి                              పట్టుబడి అవమానమే కదా చూపితే ఎంచి.           .                            పెట్టెలో బంధిస్తే ఆడుతుందా ఊపిరి ..       అందుకే , బైటేస్తుంది తన ఉనికి .                      .                                      స్వార్ధం వదిలి కాస్తైనా ఇస్తే ఇతర్ల అవసరాలకు      తగ్గుతుందిగా బరువు పాపపు చిట్టాలకు ..             .                          "అధికస్య అధికం ఫలం" అని ఆర్జిస్తే  పోతే              తీసుకు పోయేదేం లేదు నీతో పాటే ..
***************************

Comments

  1. అంశం ;సమ్మక్క...సారలమ్మ జాతర
    శీర్షిక : వన పరిమళం
    ఘాలిలలితప్రవల్లిక
    తెలుగుభాషోద్యమసమితి ప్రదానకార్యదర్శి,ఉపాద్యాయిని
    నెల్లూరు

    😊 😊 😊 😊 😊 😊 😊 😊 😊
    రేలా...రేలా...రేలా...రేలా...రేలా..రేలేల
    సమ్మక్కసారక్క జాతరలో
    మా సక్కని తల్లికి మొక్కులో
    మాసారలమ్మకు సారెలో
    మాజంపన్నకు నీలాలో
    రేలా...
    పొలవాసదొరగారాలపట్టి
    పగిడిద్దకొయరాజు పట్టపురాణి
    ముగ్గురుబిడ్డలముద్దులబోణి
    మనసమ్మక్క అడవికిరాణి
    రేలా......
    కాకతీయుని కన్ను పడంగ
    పోరుకు తలపడె పొలవాసరేడుతొ
    ఓడిన మేడరాజు మేడారంచేరి
    ప్రాణాలు దాచుకు నిబ్బరిల్లే
    రేలా......
    కప్పంకట్టని కారణాన్న
    కాకతీయుడు కదంత్రొక్కెను
    ప్రతాపరుద్రుడు గిడిద్దరాజుపై
    దండెత్తి గొరిల్లయుద్దము చేసే
    రేలా......
    వీరనారి సమ్మక్క
    పోరాటప్రతిభకు ముగ్దుడయ్యే
    సారలమ్మ,నాగమ్మ,పగిడిద్దరాజు నేలకొరిగే
    ఓటమిబాధతొజంపన్నసంపెంగవాగులొదూకె
    రేలా.....
    యుక్తి తెలిసిన యోధులధాటికి
    నిల్వలేక రక్తములోడుతు పరుగులుతీసిన
    పడతి సమ్మక్కా చిలకలగుట్టన పుట్టముంగిటకుంకపుబరిణిగ అవతరించే
    రేలా.....
    ఆ నాటినుంచి వనదేవతై
    కోయల,చెంచుల కొంగుబంగారమై
    వరాలపరిమళాలతో వనాన్ని దిద్దిన
    వనదేవత సమ్మక్కా
    రేలా......

    ReplyDelete

Post a Comment