బాల్యం గురుతులు

[1/19, 10:18 PM] కృష్ణమోహన్ గోగులపాటి: అంశం : బాల్యపు గురుతులు

గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు

శీర్షిక : బాల్యం ఒక మధురం

చిలిపి చేష్టలు, కోతి గంతులు...
రంగుల ప్రపంచం లో... 
స్వేచ్ఛా విహంగం....
తెలిసీ తెలియని వయస్సులో....
మిత్రులతో తగాదాలు....
అమ్మా నాన్నలకు శికాయిదీలు..
తెల్లారేసరికి మళ్లీ మిత్రులతో చెట్టపట్టాలు....

కోతి కొమ్మలు, చిర్ర గోనెలు, 
బొంగారాల గిరగిరలు..
ఉప్పు బందరు, చార్ పత్తా.. 
దొంగబంతి, దాగుడు మూతలు....
గుడు గుడు గుంజం గుండే రాగం...
వీరీ వీరీ గుమ్మడి పండు.... వీరీపేరేమీ అంటూ....
చెట్ల కింద అమ్మా నాన్నల ఆటలు, బొమ్మల కొలువులు.....

అష్టాచెమ్మలు, ఓనగుంతలు, 
అచ్చన గుళ్ళు, అలెంకీలంక, 
చెడుగుడు చెడుగుడు, 
తొక్కుడు బిల్లలు...
పలిజూదం, దాడులు ఆడతూ.
శివరాత్రికి పచ్చీసులు, 
మూడు ముక్కలు.... 
బాగోతాలు, బొమ్మలాటలు... 
ఇలా రోజులు ఎలా గడిచావో ఆనందంగా... హాయిగా....

బడికెళ్ళి వస్తూ రేగుపండ్లకై ఫైట్లు... చేతి నిండా గాట్లు....
మేడిపండుకోసం పాట్లు.. 
చీమలతో కాట్లు....

ఈత నేర్వడం కోసం లొట్టలకై పాట్లు...
బాయిలో వేస్తే మునుగుతూ అగచాట్లు....
దరిచేరటం కోసం నానా పాట్లు... చేతినిండా మొరం గాట్లు.... 
అన్నం కలుపుతుంటే వేడి కారం చేతికి తగులుతుంటే మంటలే మంటలు.... 
అమ్మ కలిపి పెడుతుంటే మమకారపు పంటలు... 

బడిలో మాష్టారు వల్లెవేయించిన
సుమతీ శతకం ....
ఏడో ఎక్కం లో తప్పు దొర్లినపుడల్లా
ఝళిపించే లెక్కల మాష్టారి బెత్తం ,

స్నేహితులతో కలిసి ఇసుకలో
కట్టుకున్న గుజ్జన గూళ్ళూ .....
లైటు కింద ఆటలు, 
రచ్చబండపై కబుర్లు,

సైకిల్ కాంచీ తొక్కుతూ... కిందపడటాలు... 
దండతొక్కుతూ.... దండీలు పడుతూ....
సీటెక్కినప్పుడు రాజోలే చూపులు....
పైడీలు అందక పరేషానుపడుతూ....

బట్టలకంటిన మట్టిచూసి
అమ్మ వేసిన మొట్టికాయలు ,
నాన్న బుజ్జగింపులూ ....
బామ్మ చేతి గోరుముద్దలు
తాతయ్య చెప్పే రాజు రాణి కధలూ ....

ఇవన్నీ నిన్నటి మన తీపి జ్ఞాపకాలు
మల్లీ ఎప్పుడొస్తుందా బాల్యం ...
అని  ఎదురు చూపులు... 
రాదని తెలిసి నిస్పృహలు....
ఏది ఏమైనా బాల్యం ఓ మధురం...
మల్లీ రాని ఓ మధుర జ్ఙాపకం....

పసితనం కాదది .....పసిడి వనం ....
నాటి మన బాల్యం ....
నేటి పిల్లలకు ......కథైతే .....
రేపటి తరానికి ...... చరిత్రౌతుందేమో .......

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు,
9700007653
[1/19, 10:40 PM] Poet Musthakheem విన్నర్: శీర్షిక .బాల్యం ..అమూల్యం
బాల్యమే మధురము ..బాల్యమే బహు మధురము బాధలే బహు దూరము ..బాల్ యనే మధురాతి మధురము అమ్మఒడిలో ..నాన్న గుడిలో ..బాల్యమే మధురము ...ఎన్ని వచ్చిన గాని ..మళ్ళీ తిరిగిరానిది ..ఈ బాల్యము ..జీవితంలో మర్చి పోలేని మధుర జ్ఞాపకం ..ఈ బాల్యము .ఏ బాదర బందీ లేనిది ..ఆనందమే ..ఆనందమే ..ఎరిగినది .అందమైన ఊహల్లో విహరించేది ..అందమైన ..భావనల్లో ..ఊరేగేది ..ఈ బాల్యమే .అమ్మానాన్న లే ..స్వర్గ నరకాలు ..దండింపులు ..బుజ్జగింపులు అమ్మ లాలింపులు ..నాన్న ..బెదిరింపులు ..అక్క ముద్దాడడాలు ..అన్న ఎత్తుకోవడాలు ..ఓహో ..బాల్యమే ..వర్ణింపలేనిది ..బాల్యమే ..మరచి పోలేనిది ..గాలి పటాలు ఎగరేసిన తీయటి జ్ఞాపకం ఇసుకతో ఇసుకలో ..ఇండ్లు కట్టిన సుమధుర జ్ఞాపకం ..గాలి బుగ్గలు రంగురంగుల ..ఆటలాడిన ..రంగుల చిలిపి జ్ఞాపకం ..సైకిల్ తొలి సారి ఎక్కిన సంతోష జ్ఞాపకం..కిందపడి దెబ్బలే తాకిన ఏడ్పుల బాధల జ్ఞాపకం ..గోళీల ఆటలు ..గిల్లి దండాలు ..ఆడిన ..స్నేహసమూహాల ..అనంత జ్ఞాపకం ..ఈతలాడిన ..చింత చెట్టులెక్కిన ..చింత కాయలు తెంపిన తిన్న తీపి పులుపుల ..జ్ఞాపకమే ..మదిని వీడని జ్ఞాపకమే ..బాల్యమే ..జ్ఞాపకాలమయమే..మధుర మధుర ..జ్ఞాపకాల బాల్యమే ...ఇంటిలో ..బడిలో ..యెక్కడని చెప్పను బాల్యం ..పసితనం ..అమాయకం ..అమాయకం ..తెలియనితనం ..బాల్యం ..తెంపరితనం ..ఈ బాల్యం ..గొడవల బాల్యం ..గొలుసు కట్టు ఆటల బాల్యం ..ఏడ్పుల బాల్యం ..బాల్యం ..నవ్వుల బాల్యం ..బడి కెళ్లే బాల్యం ..గుడికెళ్లే బాల్యం ..చిలిపి తగవుల బాల్యం ..చిలిపి నవ్వుల బాల్యం బాల్యమే ..మధురం ..మధురాతి మధురం ..మళ్లీ ఒక్క సారి బాల్య జ్ఞాపకాల్లోకి ..వెళ్తూ ..రచన .విన్నర్ ..కొల్లాపూర్ .
[1/19, 10:58 PM] Poet Vara Lakshmi: 🌺తెలుగు కవన వేదిక🌺
*************************

పేరు. కోత్తగడి వరలక్ష్మి
వృతి-- ప్రయివేట్ జూనియర్
అద్యాపకురాలిని
శీర్షిక-- "బాల్యం గపరుతులు
తేదీ:19/1/2019
  ******************
    🌹బాల్యంగురుతులు🌹

తనివితీర అమ్మ ఒడిని
అనుభవించకముందె
తన తల్లి దగ్గరకు పంపింది
అమ్మ..
నాన్న చీటికెన వేళు పట్టి
తప్పటడుగులు వేయలేదు
నాన్నంటే భయం 
గోరు ముద్దలు తినే 
వయస్సులో మేనమామ
చేత చీవాట్లతో గడిచెను
చిరు బాల్యం 
పదో యేట కన్నవాళ్ల చెంత
చేరిన బాల్ వాడి బాటతో
మోదలైయెను చదువుల
బాల్యం ..
సోదరులతో కలిసి చిర్రగోనే
దాగుడు మూతలు 
అక్కలతో కలిసి తప్పేన
గూళ్లు బోమ్నరిల్లాటులు
బడి వదలగానే
నేరేడి పండ్ల చేట్టదగ్గర
పోటాటోటి యుద్దాలు
 జున్ను గడ్డల కోసం
జుట్టు జుట్ల పోట్లాట
సంక్రాంతికి ఇక్కలతో సవాల్ పెద్ద ముగ్గులా
తీరుతెన్నులు
బతకమ్మ వస్త సందడంత
మా ఆడపిల్లల హడవుడీ
అంతని చెప్పను 
నాన్నమ్మ తెచ్చియిచ్చిన
కుంకుమ బంతి పూలతో
చిన్ని బతకమ్మల ఆట మా
గల్లి అంత.....
అమ్మమ్మ గారాభంతో
చదువు లో కనిష్టం
టూషన్ మాస్టారు 
బత్తెంతో పూజ..
గోడ కుర్చీలు అబ్బో యెన్నాని నా బాల్యం
తీపి చేదుల జ్ఙాపకాలు
మూడవ తరగతిలో
ముచ్చటైన పంతులమ్మ
అన్ని తరగతి టీచర్లతో
శాబసి అనిపించుకున్న
అయిన నాన్నంటే ఇంక
భయమే నాన్న స్కూటర్
చప్పుడుతో నా నోటికి
తాలం చేత పుస్తకం 
 కాలం నేర్పిన పాఠాలు
నా బాల్యాపు గురుతులు
మళ్ళి నా చెమతకు బాల్యం
వస్తనంటే నా సమస్త సంపదలను దారపోయన
ఆ తీయని మధుర ఫలా
బాల్లాన్ని మనసార
ఆస్వాదించక ఉండగలనా
బాల్యామా నీ జ్ఙాపకాల
జడివానలో తడిసి ముద్దవన నా చిట్టి బాల్యమా ..............
********************వరశ్రీ**
[1/20, 1:35 AM] ‪+91 99483 57673‬: అంశం  : " బాల్యం గురుతులు" 
శీర్షిక    :  అందమైన... *బాల్యం* 
కవి పేరు :  షేక్. మస్తాన్ వలి.
చిరునామా : గుడిమెట్ల (పోస్ట్) ,నందిగామ,
                    కృష్ణా జిల్లా.
చరవాణి : 99 483 57 673 .

😀🤡🙇🏻👯🏼‍♂💃🏽🏃🏽🤷🏼‍♂🤷🏼‍♀🙋‍♂🙇🏻🤡😀

  దూర దూర తీరాలలో  
   చెరిగిపోని , చెరచ లేని ...!!
   మరిచి పోని , మరుపు రాని ..!
  మధుర మైన జ్ఞాపకాలు
ఆ నాటి ..." బాల్యం" ఈ నాటి కీ గుర్తే ..!!

మల్లెల లాంటి...
కల్మష మెరుగని మనసు
ప్రతి బాల్యాని కీ తెలుసు

వెన్నెల లో విరబూసే ఆటలు
తిరిగి రాని మధుర మైన ఊటలు
నేటికీ బరువు తో మోస్తున్న...
నాటి బాల్య పు మూటలు
ఈనాటి నా... కవి "తల" లో మాటలు

   వాన కురుస్తున్నా
   వెన్ను వణుకు తున్నా
   కన్ను లలో కనిపించని... భయ మన్నా
   ఆ బాల్యానికే తెలుసు

తేనె పట్టు కోసం...
చింత చిగురు కోసం
చెట్టు లెక్కుట...
చిటారు కొమ్మ నెక్కుట
కోతులకు తీసి పోని చేష్టలు
ఉద్యోగం లేకున్నా పోలీసు పోస్టులు
దొంగ తనం తెలియకున్నా దొంగాటలు
ఆనాటి బాల్యపు వేషాలు...
ఈనాటి కే కాదు... ఏ నాటికీ అవి తీపి గుర్తు లే..!!

రంగు రంగు గాజు గోలీల కోసం
గుంట లో గోలీ ,బిందె ఆటలు
చెల రేగి ఆడిన... ఉప్పు చెర్రులు
అమ్మ , నాన్న... అరుస్తున్నా...
చెడు గుడు తో చిరిగిన చొక్కా లు
పిచ్చి బంతి కోసం... పరుగులు
గుద్దు లాట కోసం ...గుర్రపు చేలో గుబేలు
అవి నేటికీ మధుర గుర్తులే ...!!

దివిటీ లతో తిరుగుతూ
దివికే కాక మా ఊరి కే మోదట
దీపా(వళి)ల వెలుగు తెచ్చింది
మా ….   బాల్య మే. ...!!
ఆనాటి మా బాల్యం 
మరువలేనిది మరుపురానిది
తిరిగి రానిది తియ్య నైనది
మా  .. బాల్య మే..
అది ...మన బాల్య మే

🌹😀🤡🙇🏻🙋‍♂🤷🏼‍♀🙏🏼🏃🏽🙏🏼🤷🏼‍♀🙋‍♂🙇🏻🤡😀🌹

    షేక్. మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673 .
[1/20, 3:57 AM] ‪+91 94411 68976‬: బాల్యం
+++++
మనోహరం
మధుర స్వరం
చీకూ-చింత లేని
తీయనైన నవ గీతం
శ్రీ లేఖ, కాంతి రేఖ,
ఆనందూ, అబ్దుల్లా
రాకేషూ,రాబర్టూ
అందరిదొకటే జట్టు
అమ్మ తోడు
బాల్య మంటె
స్వర్గానికి తొలి మెట్టు.

చినుకులలో చిందులు
వెన్నెలలో గెంతులు
కోతీ కొమ్మచ్చి ఆటలే
పసందైన గురుతులు

వెల్లువెత్తు
ఉల్లాసపు
వెలుగు దివ్వె బాల్యం

ఊహలకు,ఊసులకు
రంగులద్దు
దివ్య రథం బాల్యం
అనుబంధపు
సిరి మల్లె ల
సుమ గంధం బాల్యం

చెరుకు తీపి తీయదనం
జున్ను పాల కమ్మదనం
బాల్యమే బతుకంతా
మోగేటి రస రాగం
భగవంతుడి దీవెనగా
మిగిలేటి రమ్య పథం

వచనాలకు అందని 
అమూల్య దీప్తి బాల్యం.
మళ్లీ ఒక్క సారి
కరుణ జూపి
రావమ్మా బాల్యమా
అంతులేని సంతసాల
ఆనంద స్వరాజ్యమా..

వెల్ముల జయపాల్ రెడ్డి 👫
9441168976🤽
వల్లంపట్ల 🤾
కరీంనగర్.👭


[1/20, 6:21 AM] Poet Pudathu Bhaskar: 🌷బాల్యపు గురుతులు🌷

బాల్యం అదొక అమూల్యం
అరమరికలు లేని జీవితం

అల్లరి పనులకు అలుపే లేనిది
ఎగురుతు గెంతుతు విహరించేది

ఇసుకతో వెన్నముద్దల ఆటలు
వాన నీటిలో వదిలిన కాగిత పడవలు

గోలీల ఆటలు దాగుడుమూతలు
లఘోరి ఆటలు కొబ్బరిమట్ట పీకలు

గాలి పటాలు బొంగరాల ఆటలు
బిల్లంగోడులు బొమ్మరిల్లు ఆటలు

రేగు,నేరేడు,చీమచింత పండ్లకై
చెట్టు చెట్టు తిరిగిన జ్ఞాపకాలు

జేబులో పోసుకుని తిన్న చిరుతిండ్లు
చొప్పబెండుతో చేసి ఆడిన బండి ఆటలు

కాలువల్లో,బావుల్లో చెరువుల్లో
ఈదుతు,కొర్రులేస్తూ గడిపినకాలం

ఎండు కట్టెలు,పిడక నుగ్గులు
మోదుగాకులు,తైద కంకులు

ఎక్కడెక్కడో ఎంతదూరమో
తిరిగి తిరిగి తెచ్చిన తీపిగుర్తులు

వాగులు,వంకలు గుట్టలు
ఎక్కడెక్కడో వేసిన అడుగులు

హద్దులేని ఆనందాలకు
బాల్యమే ఒక ఆలంబనం

చెరిగిపోని గుర్తులు
మరిచిపోని పాత్రలు

నా బాల్యపు గురుతులు

🌹🌸   రచన🌸🌹
      పూదత్తు భాస్కర్


[1/20, 7:38 AM] 334455 Poet Sujatharayudu Pv: బాల్యం

ప్రకృతిలోని అణువణువుని
కళ్ళింతలు చేసుకుని 
ఆశ్చర్యంగా చూడాల్సిన బాల్యం...
చిట్టి పొట్టి చేతుల్లో తాయిలాలు దాచుకుని
దోస్తులతో పంచుకుని ఆనందించాల్సిన బాల్యం...
ఆడుతూ, పాడుతూ, తుళ్ళుతు, గెంతుతూ
గడపాల్సిన చిరుప్రాయం...
చెడుని మరిచిపోతు,
మంచికి మురిసిపోతు
మనసుని నిర్మలంగా ఉంచుకునే
అమాయకమైన పసితనం..
మట్టిమోస్తూనో, కార్ఖానాలలోనో,
కూలీగా మారిపోతోంది
చౌరస్తాలో బిచ్చమెత్తి
ఆకలి తీర్చుకుంనేందుకు
పరుగులు తీస్తోంది.

బడి బాట పట్టి
భవితను తీర్చిదిద్దుకోవాల్సిన
భావిభారత పౌరులు
ముక్కుపచ్చలారకముందే
బాధ్యతలకు బంధీలవుతున్నారు
బ్రతుకుని భారంగా మోస్తున్నారు
నిరాసక్తమైన జీవితం గడుపుతూ
నిర్వీర్యమైపోతున్నారు.

సమాజం చైతన్యవంతం కానప్పుడు
మనుషులలో సామాజికమైన 
బాధ్యత కొరవడినప్పుడు
చట్టాలెన్ని వచ్చినా వ్యర్ధమే
బాలకార్మికుల చట్టం కూడా
ఆ వ్యర్ధాలలో భాగమే..


పీ.వీ.ఎల్‌. సుజాత

[1/20, 7:46 AM] Poet Satya Neelima: శీర్షిక:అమూల్యమైన బాల్యం
రచయిత:సత్యనీలిమ
🚶🏻‍♀🚶🏻‍♀🚶🏻‍♀🚶🏻‍♀🚶🏻‍♀🚶🏻‍♀🚶🏻‍♀🚶🏻‍♀
మరువలేనిది బాల్యం
మరలిరానిది బాల్యం
త్వర త్వరగా లేచి
పాఠశాలకు తయారయి
చద్దెన్నంలో ఆవకాయ
వేసుకుని తిన్న రోజులు
చెల్లెళ్ళతో,స్నేహితులతో
కర్రాబిళ్ళా,క్రికెట్
చెమ్మ చెక్క, బారకట్టా
కుంటిగిచ్చ,డబ్బాలాట
సైకిలు కాంచీ తొక్కడం
వర్షపునీటిలో కాగితం తో
పడవలు చేసి చప్పట్లు కొట్టిన
 ఆ రోజులు తిరిగిరావు
అమ్మ చేతి గోరుముద్దలు
ఆరోగ్యం బాగాలేనపుడు
పక్కనే ఉండి దైర్యం చెప్పిన
అమ్మ నాన్న కొట్టబోతే అడ్డుగా
వచ్చి రక్షించిన అమ్మ
తరగతి గదిలో ప్రథమంగా
వచ్చి బహుమతితో ఇంటికి
వచ్చినప్పుడు అమ్మ కళ్ళలో
కనిపించే ఆనందం
సంక్రాంతికి గొబ్బెమ్మలలో పెట్టడానికి తంగేడు పూల కోసం తిరిగిన పొలాలు
మరచి పోనివి ఆ రోజులు
సీతాఫలాలు,రేగుపండ్లు
ఇంకుపండ్లు,జామపండ్లు
ఈతపండ్లు,తాటిముంజలు
నాకంటే నాకని గొడవలు
పడిన ఆ రోజులు
మనసు తెరలలో దాగిన జ్ఞాపకాలు
అక్షర రూపమైన సత్యాలు..
🍒🍉🍒🍑🍊🍎🍍
         ✍...సత్యనీలిమ,
         ఉపాధ్యాయురాలు,
        జీనియస్ పాఠశాల,
                వనపర్తి..


[1/20, 8:09 AM] Poet Naga Jyothi 

సిరిమల్లెలు: పాలకుర్తి నాగజ్యోతి
కుమ్రంభీం జిల్లా
8074712181

బాల్యపు గుర్తులు...


గిప్పుడు మస్తు గుర్తుజేసిండ్రు గీసారు
ఓసారి ఆగు ఓ సారు
బాల్యపు ఆకిళ్ళకెళ్ళి జెరన్ని గురుతులు ఏరుకత్తా...

మా అవ్వ కొంగునగట్టిన రూపాయి బిళ్ళ
నా నోర్లో చాక్లెట్ బిళ్ళ అయి 
గా ఇంట్రవెల్ కరిగిపోయేదన్న యిశయం తియ్యగున్నదిపుడు...

మా బామ్మశెప్పిన పనికి 
బొడ్లసంచిని జూప్తూ 
నాకేమిత్తవంటూ 
శేయి జాపిన రోజు కండ్లముందు కనవడవట్టే..

లెక్కల పంతులు ఎక్కాలడిగితే ఎక్కెక్కి ఏడ్సి సీమిడి పూసుకున్న గా సంగతి గిపుడు జరిగినట్టే అగుపడవట్టే..

ఏరుకుంట ఏరుకుంట అల్లానేరెడుపండ్లు, రేగుపండ్లు 
దోశిల్లు నింపుకుంటా 
తినుకుంటా 
అడవిలో దారిదప్పిన రోజయితే మర్సిపోలె ఇంకా..

తొండిజేసి గెలిశిన సిన్నప్పటి ఆటల్లో గా రమాదేవి జేసిన మోసం
నన్ను ఓడిత్తే.
జీవితపు దారిలో గెలిసేలా సేసింది గా పాఠం...

బాల్యపు సిత్రాలన్నీ అమ్మమీద అలకైతే
నాన్న శిటెకెన వేలు ధైర్నాన్ని నేర్పింది..

కాకెంగిలి నేస్తాలు,
గిచ్చికయ్యాలు పెట్టి అలిగిన దోస్తానాలు
మట్టి గొట్టుకపోయిన శేతులు, 
పేడతో కళ్ళాపిజల్లిన వాకిళ్ళు 
మట్టి వాసనల సుట్టరికాలు అరికాలుల ముల్లుదిగిన
మహారాణోలే సూసిరి...

అన్నయ్య, అక్కయ్యలు స్వార్థాన్ని సూసుకుంటే 
నా మనసెందుకో పల్లె ముంగిలిలోనే ఆగిపోయింది..

ఎనకటి మనిసంటూ 
ఎన్ని అవాకులు చివాకులు పేలినా 
మా అయ్యంటే
నువ్వంటే పాణం..
నువ్వేలోకం అని రాసుకున్న నా బాల్యపు పుస్తకంలో...


@సిరిమల్లెలు...

***  *****  ***
[1/20, 8:50 AM] ‪+91 94411 68976‬: 

కమ్మని పాట రా బాల్యం
వెన్నెల తోట రా ఈ బాల్యం
చింత చెట్టు కొమ్మ నుండి
కిందకు దిగలేక
దిగులు పడి వెక్కి వెక్కి ఏడ్చిన జ్ఞాపకం
ఆ వెంటనే వానొస్తే కిందకు దూకిన వైనం

చెరువు గట్టు పక్కనే
చెరుకు తోట లోపల
చెరుకు గడ లు
విరుచుకుని
పరుగులు తీసిన స్మృతులు

సైకిల్ టైరేసుకు
రైరైమని ఉరుకులు
ఆనందపు పరుగులో
తెలియని దూరాలు
 కాకెంగిలి అంటూ
పంచుకున్న జామ పళ్ళు
జానకి కోసం చాటుగ 
కోసిన జాజి పూలు

జాతరలో ఒడుపుగా
మాయం చేసిన వేణువు
చల్లగా జారుకునే వేళ
పసిగట్టిన  సాహెబు

ఎపుడు కదిలి పోయిందో
ఆ చల్లని బాల్యం
ఎందులోనూ అపుడపుడూ
మోగుతూంది ఆ నాదం ‌
🌸🌼 వెల్ముల జయపాల్ రెడ్డి 🌷🌷 
          10_2_880 / ఎ/1
          🌹 విద్యానగర్ 🌹
       🌴 కరీంనగర్ 🌱 
9441168976
🌻🌻🌻🌻🌻
[1/20, 9:08 AM] Poet Kusumanchi Sridevi: 
🌹కుసుమంచి శ్రీదేవి🌹
🌹శీర్షిక-బాల్యం🌹
----------------------------
బాల్యం.... తేనేతో లిఖించిన
తియ్యని అనుభూతల
గ్రంధం...

నా మనసుపై చెరగని
ముద్రలా లిఖింపబడిన
తియ్యని బాల్యపు గురుతులు
ఎన్నిసార్లు తడిమి
చూసిన మరి తిరిగి
అడుగు పెట్టలేని అందమైన
ఊహాలోకంలో విహరించినట్టుంది..

అమ్మ గోరు ముద్దలు
నాన్నకి ఎదురొచ్చినందుకు
కొట్టిన నాణేల కమీషన్లు....
నానమ్మ వండిపెట్టిన
నేతి మిఠాయిల కమ్మదనం...

నెలకోసారి నది ఒడ్డున
ఇసుక తిన్నేలపై సంత..
కనబడని కడుపు నొప్పితో
స్కూలుకి డుమ్మ కొట్టి
ఐసు పుల్లలు..చెరుకు గెడలుతో
పడమరదిక్కుకి భానుడు జారేవరకు
స్నేహితులతో కోలాహలం....

ఎడ్లబండ్లు వెనక్కి వేళాడుతూ
రైతన్నను ఆటపట్టిస్తూ
ఆడిన ఆటలు...

ఎంత చెప్పిన..
ఎంత తలుచుకున్న
తిరిగిరాని తియ్యని తాయిలం
బాల్యం...

సమస్యల వలయంలో
బరువెక్కిన  నా మనసుని
తాకి...తేలికపరిచే చక్కనీ ఔషదం...


[1/20, 10:54 AM] Poet Abhi Ram: 
శీర్షిక : *బాల జ్ఞాపకం* 

చదువుల బరువులను 
గోడ కుర్చీ వేయించి 
అమ్మమ్మతో 
ముద్దు ముద్దుగా మాట్లాడి 
నడుముకు వేలాడే 
బ్యాంకు ఖాతా నుండి 
అర్ధరూపాయి తీసుకుని 
అంగట్లో పిప్పరమెంటు బిళ్ళలను 
జేబులో నింపుకుని 
గొర్రె పిల్లల ఆకలి తీర్చే భారం 
నెత్తిన మోసుకుని 
పచ్చని ప్రకృతిలో 
చెట్టుకింద కూర్చుని 
చెరుకుగడ తిన్న మాధుర్యం 
మనసు బావిలో 
జ్ఞాపకాల ఊటయై 
నేటికి పొంగిపొర్లుతున్నది 
                                *అభిరామ్*


[1/20, 1:18 PM] ‪+91 96189 61384‬:
 శీర్షిక:బాల్యం (మా అమ్మ ఒడి)
రచయిత:ఉప్పరి తిరుమలేష్
🚶🏻🚶🏻🚶🏻🚶🏻🚶🏻🚶🏻🚶🏻🚶🏻
🌞🌞🌞🌞🌞🌞🌞🌞
బాల్యమే భాషగా
అమ్మ ఒడే పాఠశాలగా
అమ్మ సైగ అనుకరణగా
అమూల్యమైన బాల్యం ఆనందంగా
మా అమ్మ పాలే అమృతంగా
ఆనందంగా మా అమ్మ ఒడిలో
సాగింది నా బాల్యం
అలిగిన నాకు అలికిన మా వాకిటిలో అందంగా ముచ్చటిస్తూ ఆనందంగా ముద్దులు పెడుతూ
ఆవకాయతో ముద్దలు పెడుతూ ముద్దులాడింది మా అమ్మ 
ముచ్చటించాడు మా నాన్న
ముసిముసి నవ్వులు నవ్వింది
మా నాన్నమ్మ 
సంబర పడ్డాడు మా తాతయ్య
తప్పటడుగులు వేస్తూ కిందపడినపుడు పరిగెత్తుకు వచ్చి పైకి లేపింది మా అత్తమ్మ
బాల్య భవిష్యత్తుకు బాట
అదే నా బడి బాట
మా మొదటి గురువు
మా పద్మమ్మ గారు
బాల్యాన్ని అమూల్యంగా మార్చిన మా చదువులతల్లి సరస్వతమ్మ
మా ఫరీద్ సార్ పలకపై వర్ణమాల
మా బాలస్వామి సార్ బాల
వ్యాకరణం
మా బాబు దేవిదాస్ సార్
తెలుగు వ్యాకరణం
మా కృష్ణయ్య సార్ తృష్ణ
మా అర్జున్ సార్ ఆలనపాలన
మా ఎస్.పి రత్నం సార్
రత్నాల్లాంటి లెక్కలు
మా శరణప్ప సార్ చరణం ఆంగ్లము
ఆనాటి శాస్త్రవేత్త ఈ నాటి సామాన్య శాస్త్ర సుదర్శన చక్రం
మా సుదర్శన్ సార్
మా కనకదుర్గమ్మ మేడమ్
కాలంతో కూడిన సాంఘీక శాస్త్ర భోదన
నా బాల్య జీవితాన్ని తీర్చిదిద్దిన దేవుళ్ళు వీరు
అమ్మ ఇచ్చింది జన్మ
అది గుర్తుండిపోయేలా 
తీర్చిదిద్దింది మా గురువులమ్మ
మరలిరానిది బాల్యం
అది ఎంతో అమూల్యం..
🍇🍓🍒🍇🍎🍓
         ✍..ఉప్పరి తిరుమలేష్,
        తెలుగు ఉపాధ్యాయుడు,
            జీనియస్ పాఠశాల,
                    వనపర్తి...
    చరవాణి:9618961384
************************

[1/20, 5:29 PM] ‪+91 99122 74442‬: శీర్షిక:బాల్యము
రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
మ: మదిలో భేదము కుళ్ళు కల్మషములున్ మంచేది చెడ్డేది దె
ల్యదు కావల్సిన తిండి బట్ట చిరుబండారాలికేమైన అ
డ్గు ధరెంతైనను తల్లిదండ్రి వలదింకోవస్తువేతీసుకో
ఇదివద్దన్నను కిందపండి పొరలున్ ఏడ్వంగ కాల్నేలకే
సి ధనాదన్మని కొట్టు గోడకుతలన్ శీఘ్రమ్ము బాదించున
య్యది కోనియ్యగ స్వర్గమే  యనగయా ఆనందముం బట్టలే
కిదిగో నిద్రనుపోడు పొద్దుననె ఇంకేముంది ఆస్నేహితుల్
ఇది సూపర్ అన పొంగు బాల్యమనగా యేస్వర్గమున్ సాటిరా
అది బంగారము కన్నమిన్న ధరపోల్చంగొక్కటేముందిరా
[1/21, 9:03 AM] ‪+91 96767 20412‬: బాల్యామృతం.

దేవుడే ఎదురై వస్తే
అడగని వరమేదైన ఇస్తే 
నాబాల్యాన్ని నాకిమ్మని అడుగుతాను.

బాల్యమెపుడు అమృతభాండం
పునరుజ్జీవించుతుంది.

కొత్తావకాయ జాడినే
నోరూరించుతూ
అమ్మమ్మచెప్పె కొత్త కతె
చెవులూరించుతూ

బడిలో ఆటలు,గుడి గంటల మోతలు,స్నేహితుల తో వేసిన 

,
అమ్మ,నాన్న ఆటల్లో చేసిన పచ్చిక విందులు..

తోటల్లో, ఏటినీళ్లల్లో,ఊరి చివర కొండగుట్టల్లో,
ఆకాశం కింద మబ్బు తరకలతో
తీసిన పరుగులు,
నులకమంచంపై చంద్రుని వెక్కిరిస్తూ తీసిన ఆనందభెరవిరాగాలు,
వెన్నలక్రీనడల్లో ఆడిన హైడ్& సీక్ ల అల్లరి ఆటలు...

ఆపే క్ష అమ్మైతే,
భయమెపుడు నాన్నే,
అరోపణలెపుడు అన్నదమ్ములే 
ఆనందలన్నీ స్నేహితాలే...

యతి,గణాలు,అలంకారాలు
నేర్పుతూ, తెలుగుటీచర్ తిట్టనతిట్లు -భాషాభావాలకు
అంటుకట్టాయి.
నీ సత్తాఇంతేనాఅంటూ లెక్కలమెష్టారు నాఇగోని గిల్లి నవ్వి తే,గణితంలో గుణం కనిపించింది.చిట్టి మేధావిలా పోజుకొట్టింది.
స్కేలు తో కీళ్లపై కొట్టిన సైన్స్ టీచర్...పంధాలే వేరుగాని,
ప్రతిభను గుర్తించి నగురువులు
వీపుపై ఆప్యాయంగా చరిచినచరుపు...
కన్నుల్లో, గుండెల్లో తడిఆరనివ్వని తనింపినతీరుబాల్యం నాకెపుడు నవరసాలసమ్మేళనమే...
గోడపత్రికపై మొదటి కవితకు
స్టాఫ్ రూమ్ లో అబినందనలు
స్టార్లా నన్నుచూసిన తోటివారు.

ఊరుమొత్తానికి 10th సెకండ్ వస్తే...పేపర్లో నెంబర్ చూసిచెప్ఫిన సహవిద్యార్ది నోరు చెక్కరతో నింపినతీరు...

సైకిల్ ఎక్కి తొక్కుతూ కిందపడి
దండపెడుతూ తీసిన పరుగులు...
నడిపిస్తూ చెప్పిన కథలు,
మురిపిస్తూ పంచిన తాయిలాలు,
పాఠశాల వేదికపై పాడినపాటలు,
కీచుమన్న గొంతువిని నవ్విన నవ్వులు,వేసిన నాటకాలు,...

ఎరువు తెచ్చుకున్న చందమామకథలు, బాహుబలిని తలపించే బాలమిత్ర గాధలు
రేడియో శ్రోతగ చెవికోసున్నవైనం..

బాల్యం నాకొక బ్రతుకు పాఠం.
నేను చదువుకున్న మహాభారతం.
నేటికి దారిచూపుతున్న మహావేదం.
నిత్యం రిఫర్ చేసే విద్యాపుస్తకం.
ప్రతిబాల్యం ఓచరితకాకపోవచ్చు.
కాని పిల్లలకి,పిల్లలపిల్లలకి చెప్పగలిగే పిట్టకథ.
ప్రతిమనిషికివుండే ఓ ఆత్మ కథ.
మనసుపొరల్లోవుండే జ్ఙాపకం.
మలిరోజుల్లో తలచుకునే వ్యాపకం.

శ్రీజయ.
గుంటూరు.
[1/21, 1:39 PM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...బాల్యపు గురుతులు
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853
కవిత....
మధురమైనవి బాల్యపు గురుతులు
మరలి రానివా తీయని తలపులు
మొదట చూసిన శోభన్ సినిమా
మొదట వేసిన అట్ట హంగామా

మొదట మేధ్స్ లో వచ్చిన సున్నా
మొట్టికాయలే పెట్టిన నాన్న
రేగు పళ్ళకై పట్టిన ఫ్రాకు
రాగిచెంబులో దాచిన కేకు

అమ్మ పెట్టిన మీగడ తరక
చెల్లిపైన నే విసిరిన పలక
వాననీటిలో వదలిన పడవలు 
గోనె సంచిలో ప్రాగు జంపులు
గడ్డివామిలో దాగుడు మూతలు
గుడ్డివారిలా కళ్ళకు గంతలు
మళ్ళగట్లపై పెట్టిన పరుగులు
మల్లె చెట్లలో ఏరిన పూవులు
పట్టెమంచము నేసిన చేతులు
పట్టువదలని పంతపు గురుతులు
నాటు బండిపై చేసిన ఫీట్లు
నాన్న చేసిన చక్కని స్వీట్లు
వీధి వాకిలిట బాణాసంచా
పెరటిైపున ఆ పావంచా
సాములోరికి పెట్టిన దండం
శలవులొస్తె నే సర్దిన దండెం
పూలు నింపిన దసరా బాణం
తీయతీయని పప్పు బెల్లం

జామపళ్ళపై రాసిన పేర్లు
క్లాతు చుట్టిన సీతాఫలాలు
అమ్మ కలిపిన కమ్మని కాఫీ
నాన్న చెప్పిన కధల గెలాక్సీ
బుజ్జి చెల్లితో ఆడిన హాయి
బొజ్జి తలపైన కొట్టిన రాయి
చిట్టి, సీతతో ,ఆడిన ఆటలు
పొట్టి రేడియో పాడిన పాటలు
నిమ్మతొనలకై పెట్టిన పేచీ
అప్పడు చేసిన ఆ లాలూచీ
పూలకోసమై ఎక్కిన గోడలు 
వేంకటేశునికి కట్టినమాలలు
మామ్మచెప్పు రామాయణ కధలు
మామయ్య నేర్పిన గీత శ్లోకములు
అమ్మమ్మ పెట్టిన గోరు ముద్దలు
నాన్నమ్మ చెప్పిన బొబ్బిలి కధలు
మంచి మంచి నాస్నేహితురాళ్ళు
పంచుకున్న ఆ తీయని జీళ్ళు

పుస్తకాలలో నెమలి కన్నులు
నేస్తురాళ్ళతోచేయు చిన్నెలు
పల్లెటూరిలో వదలిన బాల్యం
పంచు కున్నను తరగని మూల్యం
కంచు కోటలా ఉండే ఇల్లు
పంచు మమతల మా పొదరిల్లు
కరిగి పోయెనా ఆ హరివిల్లు
కడకు మిగిలెను ఈ ఆనవాళ్ళు..!!!
[1/21, 4:02 PM] Poet Telgu Thirumalesh: ---------🌻🌻🌻🌻🌻----------
అంశం మనది... కవిత నాది .. కవతాసారంసమాజానికి !

రచనా తేది : 21-01-2018

      🌝  బాల్యాను (అ) భూతులు 🌝

బాల్యం ఆనందాల బంధుత్వం
స్వేచ్చానురాగాల సంబోధనము
జీవితగమనానికి మనోహరము
ప్రశంసలు కురిస్తే ప్రశస్తి పుల్లము
ధ్యాసమరిస్తే ప్రమాద వనము

బాల్యం భోగముతో
భావాలను వ్యక్తం చేస్తూ
విహరించే విహంగం లాంటిది
జీవితానికి మకుటం లాంటిది
బాల్యం గడిచిపోయింది...అలా గడిచిపోయింది

చిలిపిచేష్టాల కేరింతలతో
కోతికొమ్మచ్చు తొక్కుడు బిళ్ళల ఆటలతో
అష్టాచెమ్మ  దొంగాపోలిష్ అనుకరునలతో
బాల్యం గడిచిపోయింది..అలా గడిచిపోయింది

అమ్మ నాన్న ఆటలతో
అహంభావంలేని అనురాగాలతో
చెలికాని బోదకములతో
సముద్రపు కెరటాల 
కేసరి నాదాల లాంటి శబ్దాలతో
బాల్యం గడిచిపోయింది...అలా గడిచిపోయింది

బాల్యం విలువైనది
వెలకట్టలేనిది
ఆకాశ సంద్రాలంతా స్వేచ్చనైనది
ప్రకృతి లాగా పరవసింపచేయునది
కురిసేవానకు వీచేగాలికి హద్దులు లేవు
వికసించే బాల్యానికి కులమతాలు లేవు
బాల్యం గడిచిపోయింది.... అలా గడిచిపోయింది

చినిగిన చొక్కా లాగుతో
చీమిడి కార్చే ముఖముతో
చింతచెట్టు వేపచెట్టు గింజల ఆటలతో
నదులలో చెరువులలో 
ఈది చేసిన స్నానాల తో
బాల్యం గడిచిపోయింది.... అలా గడిచిపోయింది

బడి ఎగొట్టి గుళ్లకు చేరి
గంధర్వులాగా గానము చేస్తూ
వదరుబోతు మాటలతో
గాలిపటాల ఆటలతో
చెప్పేమాటలు చేసేపనులు
ఎండమావుల లాంటివని తెలియక 
బాల్యం గడిచిపోయింది... అలా గడిచిపోయింది

బాల్యం అనుభూతులు...
కాకూడదు కల్పనాభూతులు...

👉
"బాల్యాన్ని స్వేచ్ఛగా వదిలేద్దాం.........బాలల అనుభూతులకు బాసటగా నిలుద్దాం."


                           ఇట్లు
                     నా స్వీయ రచన
         ✍....తెలుగు తిరుమలేష్
                తెలుగు ఉపాధ్యాయులు
      ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
            వ్యవస్థాపక  అధ్యక్షులు
        తెలుగు భాషా పరిరక్షణ సమితి
                  అధ్యక్షులు
       అమరచింతమండలం, వనపర్తి జిల్లా
              చరవాణి : 9908910398


✍✍✍✍✍✍✍✍✍✍
-------🙏  సమాప్తం 🙏 -------
[1/21, 4:08 PM] 334455 Poet Murthy Sreedevi: తెలుగు కవన వేదిక 
కవయిత్రి పేరు.
మూర్తి శ్రీదేవి
శీర్షిక. బాల్య జ్ఞాపకాలు
          మధుర స్మృతులు

పాలుగారే పసిబుగ్గల మోము చిత్రాలు
పసిడిపలుకుల మాధురీ
మల్లికలు
తప్పటడుగుల తీపిగుర్తులు
పాకులాటల పాలవెల్లులు

          --   చిరు జ్ఞాపకాలే

అమ్మానాన్నల ఆలింగన వేడుకలు
నానమ్మ తాతల మురిసిపాట్ల చిరు జల్లులు
మదిలో తాండవించి నాట్యమాడిన మధుర క్షణాలు
      
        --  అన్ని జ్ఞాపకాలే 

వేకువనే తీర్చిదిద్దిన ముత్యాల రంగవల్లులు
కుంకుడుకాయ కన్నీళ్ల
ఎరుపు ఛాయలు
నూతనాంబర ధరణిలా
పచ్చ తోరణాలు
           
       -- అన్నీ జ్ఞాపకాలే

ఊరిలోని వరస పిలుపుల
గుండె చప్పుళ్ళు
గుడిలోని భక్తిగీతాల పరవశాలు
పంటచేలలోని పైరుగాలుల 
చిలిపి చేష్టలు
       
      --- అన్నీ జ్ఞాపకాలే

జనమంతా కలిసి జరుపుకున్న పోలేరమ్మ జాతరలు
ఎడ్ల బండ్ల మీద చెలుల మధ్య చేసిన కేరింతలు 
చెరువుగట్లకాడ కట్టుకున్న 
ఇసుకమేడల అందాలు

     --- అన్నీ జ్ఞాపకాలే
[1/21, 7:14 PM] Poet Lavanya Kotwal: బాల్యపు గురుతు
****************
కాలప్రవాహంలో
చేజారిపోయిన బాల్యం
నా ప్రతి మజిలిలో 
తీయని జ్ఞాపకాల పరిమళమై ఎదురుపడుతూనే ఉంటుంది..

నాన్న భూజాలనెక్కి 
చూసిన లోకం
అమ్మ కొంగులోని ప్రేమైకం
గురుతుకొచ్చిన ప్రతీసారి
వీధిగుమ్మంలోకి మనసు
పరుగులుపెడుతుంది..

నా తప్పిపోయిన పసితనం
అచ్చంగా రంగుల కలలాగే ఉంటుంది..

              (లావణ్యసైదీశ్వర్)
                  9603763848
[1/21, 11:17 PM] Poet Bharathi: 9491353544భాస్కర బాలభారతి 
అనంతపురము 
అంశము---బాల్యపు జ్ఞాపకాలు 

ఇంటికి దీపం ఇల్లాలైతే 
కంటికివెలుగులు బాలబాలికలు ! 
బాల్యం బాగుంటే
బతుకు ఫైరు ఏపుగాపెరుగు  
పాలనురుగుల అందమైన 
నవ్వులూ 
అద్దం లాంటి స్వచ్చమైన మనసూ  
కల్లాకపటంలేనిస్నేహం 
బాల్యం గడచినతర్వాత 
అగుపించవు 
ఎగిరేపక్షులై నీనాతన 
భేదంలేక పిలిచిన వారందరివద్దకూ పరుగులు 
కాకెంగిలిబెల్లంముక్కా 
తినని బాల్యం 
కోతీకొమ్మచ్చీ ఆడని బాలబాలికలూ 
బడీకివెళ్ళక మారాం చేసీ 
 అవ్వాతాతలదవెనుక దాగని 
బాలబాలకలువుంటారా 
నాన్నభుజము నెక్కి చల్ చల్
గర్రం ఆట ఆడని బాల్యాన్ని 
చూశామా
 బొమ్మల పెళ్ళిళ్ళూ 
డాక్టర్ యాక్టర ఆటలాడని 
బాలురు వుండరుకదా 
చింతచెట్టెక్కీ తోటమాలి 
బడీతపూజనుండి తప్పించుక 
తిరిగిన బాలబాలకలు వున్నారా దశరా పండుగ రోజు 
పెద్ధలకు మొక్కి  
ఆశీర్వాదముతో పాటు 
కానుకలరూపంలో 
డబ్బుల కోసం 
ఎందూరమైనా వెళ్ళి జమ్మిచెట్టు ప్రదక్ష‌ణ చేసీ జమ్మిఆకులు పెద్ధలకిచ్చిన రోజులూ ఏనన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు  అందరికీ వస్తుంటాయి బాల్యం 
ఓతీయ్యని మరపురాని 
మరువలేని అనుభూతి 
,        ---4------------****
[1/22, 6:59 AM] Poet Palloli Shekar Babu: 👶👶👶👶👶👶👶

 *ఇప్పటికీ నాకు  గుర్తే ఉంది . . !* 

👶👶👦👦👶👶👶

- *పల్లోలి శేఖర్ బాబు* సహస్ర కవిమిత్ర, రేడియో ఆర్టిస్ట్ , జర్నలిస్ట్ .9490484316.


నాబాల్యం ఉగాది పచ్చడి సాదృశ్యం
మైదుకూరు పంచిన ప్రేమానుబంధం 
మళ్ళీరాని మధురమైన స్వప్నం
జ్ఞాపకాల పుటల్లో భద్రంగా నిక్షిప్తం

ఇంటి వెనుక కేసీ కెనాల్
వేసవిలో భలే హల్ ఛల్
ఒడ్డుకున్న గడ్డి పట్టుకొని
కాళ్ళు రెండు ఆడిస్తూ . . ఆయాస పడుతూ . .
ఎట్టకేలకు కాలువలో ఈత నేర్చుకొన్నది
నీటితో కాలువ నిండుగ పారుతున్నా 
అవతలిగట్టు చేర చేసిన సాహసం
ఇప్పటికీ నాకు గుర్తే ఉంది! 

నల్ల బురద మట్టి తెచ్చుకొని
బోద పుల్లలు పీక్కోని
ట్రాక్టర్ ట్రాలీ ఎద్దుల బండి చేసుకొని
ఎండలో ఆరబెట్టుకొని
టిప్పులు టిప్పులు గా మట్టిని
కుప్పలు కుప్పలుగా తోలటం
ముక్కు మూతి కాళ్ళు చేతులు
దుమ్ము తో సహవాసం చేయటం 
ఇప్పటికీ నాకు గుర్తే ఉంది !

బోదపుల్లలు పీకానని
పక్కింటి పిన్ని అమ్మను దండిస్తే !
మళ్ళీపీకితే  నీ కొడుకును కోడతానని బెదిరిస్తే !
ఉక్రోషంతో అమ్మ నులకతాడుతో కొట్టటం
దెబ్బల బాధకు ఏడుస్తుంటే
గుండెలకత్తుకొని అమ్మకూడా 
ఏడుస్తూ ఓదార్చటం
ఎక్కిళ్ళ ఏడుపును మాన్పింప
పాలురాకున్నా రొమ్ము నోటిలోపెట్టి
అమ్మ నన్ను సముదాయించటం
ఇప్పటికీ నాకు గుర్తే ఉంది !

సెలవు దినాల్లో అమ్మకొంగు పట్టుకొని
కూలి పనులకువెళ్ళటం
పసుపు ఉల్లి తోటల్లో కలుపుతీస్తూ ఆడుకోవటం
ఒంటి గంట అవుతుంటే. . ఆకలి దహిస్తుంటే
పొలం గట్టు మీద నిలబడి
సంగటిగంప కోసం ఆత్రంగా ఎదురుచూడటం
ఆముదంఆకులో  గోంగూర పప్పుతో   
సంగటి ముద్ద ఆవురావురుమంటూ తినటం
రాత్రికి ఒక ముద్ద ఇంటికి కూడా తెచ్చుకోవటం
ఇప్పటికీ నాకు గుర్తే ఉంది !

కే సీ కెనాల్ లో నీళ్ళు ఎండిపోతుంటే
గంప గిన్నె చిన్న పార తీసుకొని
అడ్డ కట్టలు కట్టి నీళ్ళు చల్లి
కప్పలను అదిలించి చేపలు పట్టటం
కాలువలో . .  చాకిరేవు వంకలో. .  
గాలంకు ఎర కూర్చి చేపలు వేటాడటం 
అమ్మనాన్నోఎవరో ఒకరు వెదుక్కుంటూ రావటం 
అమ్మ వండిన చేప కూరతో 
లొట్టలేసుకుంటూ అన్నం తినటం
ఇప్పటికీ నాకు గుర్తే ఉంది !

కోతి కొమ్మ గోలీలు చిల్లా కట్టె
బొంగరాలు దొంగ పోలీస్ దాగుడు మూతలు
మేక పులి,  సీత రాముడు , డీఅండర్,  
నేల బండ కుప్పిగంతులు కబడ్డీ కుస్తీలు 
పరుగులాటలు బొమ్మలాటలు కీచులాటలు  
ఎండసినిమాలు  బండలపై బొమ్మలు గీయటాలు
కూనిరాగాలు చదువులో పోటీలు ముక్కుచెంపలు
వగైరావగైరా బాల్య జ్ఞాపకాలు తీపి గుర్తులు
ఇప్పటి కీ నాకు గుర్తే ఉన్నాయి .

- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర,  రేడియో ఆర్టిస్ట్ , జర్నలిస్ట్ . 9490484316. 🌸

(ఈ బాల్యం 5వ తరగతి లోపలిదే  . . ముఖ్య మైన యధార్థ సంఘటనల కు అక్షర రూపమే . బాల్యం గుర్తు చేసిన తెలుగు కవన వేదిక గోగులపాటి కృష్ణ మోహన్ గారికి ధన్యవాదములు )
👦👦👦👦👦👦👦👦👦👦👦👦

[1/22, 7:36 AM] Gvr bngr: 🌻🌻🌻🌻🌻
వీరా గుడిపల్లి

శీర్షికః ః   బాల్యం

బాల్యం అంత బాగుంటుందని
అప్పుడ్నాకు తెల్వదంటె దెల్వదు

అస్సల్దెల్వదు నిజంగ దెల్వదు
తెలిత్తె..బాపు చెప్పినట్లు ఇంటుంటి
అమ్మ జెప్పినట్లు సదువుకుంటుంటి

లెక్కల్సారు మీద కోపం బెట్కుంటోన్నా?
ఇంగ్లీస్సారు చెప్పినట్లినక పోతుంటినా?

ఉట్టందితే సాలు అప్పల్దినొత్సనుకున్న
ఏరు దాటితె మొగోన్ననుకున్న

సిత్పాలకాయలే ముఖ్ఖెమనుకున్న
బడెగ్గొట్టి జాతరకెల్తె మస్తు గొప్పన్కున్న

సదువుకుంటె బాగుంటదంటె ఇనక పోతి
ఇప్పుడన్కుంటేంలాభం?

మల్ల గారోజులొత్తె ఎంతబాగుండు?
శివ శివా! మల్ల గా రోజులు నాయి నాకియ్యరాదు

వీరారెడ్డి గుడిపల్లి
🌻గద్వాల


[1/22, 10:21 PM] Ppet Badripally Sreenu: *🌷బద్రిపల్లె. శ్రీనివాసులు.🌷*
*🌷శీర్షిక:-బాల్యము.🌷*
అయిదు వసంతాలు పూర్తకాగ ఆరో ఏడున మా తండ్రి నన్ను గొప్పవాడిని చేయాలని బడిలో వేసె..............
అంతవరకు అమ్మచంకలో వున్న నాకు ఒక్క క్షణములోనే.............
చెరసాలగ మారిపోయె
ఉండలేక చెంగునెగిరి
గండిని దాటుకువచ్చితిని.
మరుసటి రోజు భుజ్జగిస్తూ బడివద్ద వదలె................
ఇంకేముందు మెల్లగ బడివైపుకు అడుగులు కదలసాగె చినుకు చినుకు కురిసి ఏటికి పయనమైనటుల..............
అ,ఆలతో ప్రారంభమై
అమ్మ,నాన్న పదాలతో
అక్షరాభ్యాసం సాగెడె వేళన...................
గురువులకు చిన్నికడవతో నీళ్ళు వంకకెళ్ళి తీసుకు రావడము,భోజనముకు పుల్లలు సమకూర్చడము మహా సరదా!
అదే కదా! బాల్యమంటే!
శనివారము సాయంత్రం కేరింతలు మరుసటి దినము ఆదివారమని.............
గురువు గుండెదడ చూస్తున్నాడు అరచిన వాడి బెదురు చూడాలని................
దగ్గరికి వచ్చెకొలది బీ.పీ పెరిగినటుల గుండెదడ పెరగసాగె
ద్రౌపది ని కృష్ణుడు ఆదుకున్నటుల...........
ప్రత్యక్షమాయే సోదరి బడివద్ద నాకోసం
అప్పుడు నేను రెండవతరగతి.
మధ్యాహ్నం ఎక్కములు పలికించుట..............
పది నుండి పోటీ మొదలౌతుంది పదునైదుకు,ఇరవై కిని
ఊరుదద్దరిల్లెలా అర్జునుడు పాంచజన్యము పూరించినటుల గొంతునుండి బిగ్గరగా పలుకుట...............
బంతిభోజనం మహా సరదా
ఇంటినుండి తట్ట,చెంబునుండి నీరు
పరుగులతో హనుమంతుని వలె వాలడం,తినడం గిల్లుకుంటూ ప్రక్కవారితో...............
ఉదయం బడికి నామము
అమ్మతో చేనువద్దకు సరదా 
మధ్యాహ్నం వెళ్ళగా రూలు కట్టెతో శ్రీ.దేవదానం సార్ 
మోత.................
సాద్వీమణి శ్రీమతి.ప్రమీల మేడమ్ నన్ను తన ఒడిలో పెట్టుకొని భర్తను ఆపడము.................
గోలీలాట బావివద్ద అమ్మ అరుపులు గాలికి వదలడము.............
నాన్న వచ్చువేళ పిల్లివలె ఇంటికి...........
రేగుపండ్లకు పరుగులు
కాపరులు చూడకుండా
దొంగలాగ తరువు వద్దకు....................
చింతాకు,ఎలక పండ్లు తినడము
ఎప్పటికీ గుర్తుండే రోజులు...............
బావిలో దూకడము 
కాలువలో ఆడుకోవడము కన్నవారికి తెలియకుండా............
సంక్రాంతి రోజున సోదరికి సాయము
అర్దరాత్రి వేసె తనచేతి ముగ్గుకు రంగులు దిద్దడము.............
కోతికొమ్మచ్చి,చిల్లాకట్టె
వీపుడుచెండు,కబడీ
చెన్నాకుప్పల్ చెన్నాబియ్యం,బొగ్గులబొగ్గుల బోనం,
నేలబండ,దొంగ-పోలీసు,డివెండర్,బొమ్మలపెళ్ళి,కోడిపుంజాట,
ఉప్పాట,చెకుచెకుపుల్ల,
అచ్చందకాయలు,గాజుముక్కల ఆట,పాము-నిచ్చగన,ముక్కులుగిల్లె ఆట అన్నీ ఆనందపు ఆటలే....................
ఋతువుల మాదిరి 
ఆడుకుంటూ గడిపిన
ఆనందపు రోజులే బాల్యపు మధుర జ్ఞాపకాలు.
అవే నిలిచి వుండును శరీరము ముడతలు పడినా తలలో వెంట్రుకలు రాలిపోయినా,దంతములు నేలరాలినా..............
శ్వాస ఉన్నంతవరకు గుర్తుండు రోజులే బాల్యపు మధురక్షణాలు.
*🌷బద్రిపల్లె. శ్రీనివాసులు*
         *S.A.తెలుగు*
*ప్రొద్దుటూరు,*
*కడప జిల్లా.*
*9441721650.🌷*
[1/22, 10:43 PM] ‪+91 81252 11720‬: బాల్యంలో బాలలందరు బాబులచేతులలో  
బామ్మల ,తల్లుల సంరక్షణలో బుడి బుడి నడకలతో అన్యం పుణ్యం మెరుగని బోసి నవ్వులతో చిరు నవ్వులతో పాలు త్రాగుతూ 
పాపాలెరుగని పసి పిల్లలారా ....మీది ఒక ఊహ లోకం ఈలోకం లో పాపం,పుణ్యం వుండదు 
ఈ లోకానికి మీరే రాజుల .....స్వార్థం,అసూయా 
అనే మాటలకూ అర్థమే తెలియని ....పసికూనల్లారా అన్నిటికి ఒకే సమాధానం మిస్తారు అదే ఏడుపు ...బొరవెల్లి పవన్ కుమార్ ..,గద్వాల
[1/23, 6:03 AM] Poet Seenu Vkota: 🌹🌹రానాశ్రీ🌹🌹
👨‍👩‍👧👨‍👩‍👧శీర్షిక-బాల్యం👨‍👩‍👧👨‍👩‍👧
~~~~~~~~~~~~~~~~~~~
నిర్మలమైన హృదయాలు
నిండుధనంబుగా కలసి....
కులమత భేదాలు
యేకొంచమైనా కానబడక....
ఆస్థి అంతస్థులులన్నీ
అరణ్యంలో పారేసి....
లింగభేదంలేక
నీచోన్నతములు కానక.....
కలసి ఆడినాటలేనోయి
కలసి పాడినపాటలేనోయి
కబుర్లుచెప్పుకొన్న కాలమేనోయి
భావనిర్మలమైన బాల్యం....
చెరగని జ్ఞాపకమే బాల్యం....

పల్లెతల్లి చూస్తుండగా
చెట్లెక్కి.....చెట్లెక్కి
కొమ్మలపై కొమ్మలపైకెక్కి
కోతికొమ్మచ్చి ఆడంగ!
వాగువంకల చేరి
ఇసుకతెన్నెలతో గుమికూడి
కాకమ్మ గూళ్ళు కట్టంగ!
ఆకలేయని రోజులవి
అలుపెరుగని రోజులవి!
కాలంతో కబుర్లు చెప్పుకొంటూ
సూర్యుడితో నడిచిన కాలమది!
తిరిగిరాని కాలమది.....!
తీపిజ్ఞాపకాల కాలమది....!
చిరునవ్వుల బాల్యమది...!

కష్ణుడంతటి దైవం
బాల్యక్రీడలాడలేదా!
నింగీనేలను తననోట్లో
తల్లికి సర్వమూ చూపదేదా!
బాలుడంతరాముడు
రాక్షసమాయ తొలచలేదా!
తాటికి మాయక్రీడను
ధనువుతో త్రుంచలేదా!
బాల్యమే గోపాలము
బాల్యమే చిరుస్వప్నము!

~~~~~~~~~~~~~~~~
ఆర్ .శ్రీనివాసులు  
కలం-రానాశ్రీ
తెలుగు పండితులు
&
పరిశోధకులు
వి.కోట,చిత్తూరు
7989192308.


[1/23, 1:32 PM] Ppet Badripally Sreenu: *🌷బద్రిపల్లె. శ్రీనివాసులు🌷*
*🌷శీర్షిక:-బాల్యము.🌷*
*🌷ఛందస్సు:-సీసము.🌷*

*🌷1🌷*
బాల్యపురోజులుఁ బల్వురికినిజూడ
............మధురాతి మధురమై మదినినిలుచు!
బాల్యపురోజులఁ బల్కలు గాంచగ
...........కూయుచున్నటులుండు కోయిలల్లె!
బాల్యపురోజులఁ బంతిభోజనములు
..............నవ్వులతోసాగు పువ్వుపగిది!
బాల్యపురోజులఁబాంధవములుజూడ
...........యామనివలెనుండు నందరెదన!
*🌷ఆటవెలది🌷*
చల్లనైనగాలి సహ్యాద్రినుండియు 
వీచినటులనుండు పిలుపులెల్ల
నడకనెమలిభువిని నాట్యమాడినరీతి
బాల్యమందునుండు బాలురఁగన!

*🌷సీసము:-2🌷*
బాల్యపురోజులన్ బరుగునుగాంచగ
.............వారువమువలెనుండు పాదమందు!
బాల్యపురోజులన్ బావిలో నీతయు
...............కేరింతతోసాగు కిలకిలమని!
బాల్యపురోజులన్ బరిహాసములుజూడ
...........జాబిలిభువిపైకి జారినటుల!
బాల్యపురోజులన్ పంటచేలకడన
...........యాడుచుపాడుచు నాడుకొంద్రు!
*🌷ఆటవెలది🌷*
పల్వురికినిజూడ బాల్యపుదినములు
నెదనదాగియుండు నెచటనున్న
యట్టిరోజులికను నవనిలోనరులకు
నెన్నటికినిరావు నేలఁగనగ!
*🌷ఆటవెలది🌷*
కోతికొమ్మయాట కూర్మితోనాడఁగ
చెట్టుదరికిజేరి చెలులతోడ
శాఖలందుదాగి చక్కగదుముకుచు
తిమ్మనవలెయాడు నిమ్ముగాను!
*🌷ఆటవెలది🌷*
సెలవుదినపురోజు చెట్టులు,పుట్టలన్
రోయుచుంద్రుజూడ లోకమందు
ఫలముఁబొందగోరి బాల్యపురోజులన్
గంతులేస్తునెగురు కానలందు!
*🌷బద్రిపల్లె. శ్రీనివాసులు,*
       *S.A.తెలుగు,*
*ప్రొద్దుటూరు,*
*కడపజిల్లా.9441721650.🌷*


[1/24, 6:22 AM] Poet Aruna Chamarthi: పేరు అరుణ చామర్తి /ముటుకూరి            కవితా శీర్షిక :  ఏది నా బాల్యం    ???                   .                           నేనింకా ఉన్నాను యవ్వనం లోనే                        ముసలిదైంది నా బాల్యం....       చిన్నప్పుడు ఎప్పుడో నాన్న కవిత చదివిన జ్ఞాపకం  ....                          ఈనాడు గుర్తుచేసింది నా మస్తకం ....                      అవును మరి , అవసరమేముంది చేరడం అది పుస్తకం...        ఇప్పటికీ ఆ గుర్తు నాలో సజీవం .  ....                  గోళీ లాటలు  , గిల్లికజ్జాలు ,                      కర్రా దండ,                      కోపం రాగానే తిన్నది ఇవ్వమన్న చిన్నారి స్నేహం...                       అన్ని నాలో పదిలం ...                        వయసు పెరిగి శరీరం అవుతుందేమో బలహీనం...                    మధుర జ్ఞాపకాలు మాత్రం మరువం...             మనసు పొరల్లో ఎక్కడో దాగున్నా వదలం ...            బాధ్యత ల్లేని  బాల్యం ,.. ఏ కల్మషం ఎరగని బాల్యం ..                         మళ్ళీ వస్తే బాగుండునని చాపల్యం..                        మరో బాల్యం కోసం ఆశగా పయనం ....

Comments

  1. బాల్యం మీద కవులు రాసిన కవితలు మళ్ళీ నా చిన్నతనానికి తీసు ల
    కెళ్ళాయి.

    ReplyDelete

Post a Comment