కల్తీ..‌ కల్తీ... కల్తీ...


గులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు

శీర్షిక : కల్తి.. కల్తీ...కల్తీ....

అయ్యో అయ్యో కల్తీ అన్నిటిలో కల్తి
లేవగానె చూడ టూతు పేస్టులో కల్తి
కాఫి తాగుదమంటే పాల లోన కల్తి
నీళ్ళుదాగుదమన్న అందులోన కల్తే

అన్నమొండుదమంటే బియ్యములో కల్తి
కూరవండుదమంటే కాయగూరలు కల్తి
పసుపు, కారం కల్తి, ఉప్పు పప్పుల కల్తి
గసగసాలు కల్తి, మసాలాలు కల్తి

స్వీటు లోన కల్తి, హాటులోన కల్తి
సబ్బులోన కల్తి, సర్ఫులోన కల్తి
షాంపులోన కల్తి, నూనెలోన కల్తి
పండ్లు తిందమన్న అందులోన కల్తె

కల్లు లోన కల్తి, సారలోన కల్తి,
పైసలెక్కువైన మద్యమందు కల్తి
ఇసుకలోన కల్తి, సిమెంటులో కల్తి
సున్నమందు కల్తి, రంగులోన కల్తి
ఖర్చుపెడదమన్న కరెన్సీకల్తి

వస్తువులన్నీ నేడు కల్తి కల్తి
ఇరుగుపొరుగు వారి మాటలోన కల్తి
బంధుమిత్రుల పలకరింపులో కల్తి
ప్రేమికుల మధ్య ప్రేమలోన కల్తి
అన్నదమ్ముల ఆప్యాయతలో కల్తి

అయ్యో అయ్యో కల్తి అన్నిటిలో కల్తి
అమ్మ ప్రేమలో తప్ప అన్నిటిలో కల్తే
అయ్యో అయ్యో కల్తి అన్నిటిలో కల్తి 
కవుల కవనముల తప్ప అంతటా కల్తే

అందుకే.... 
కల్తీ లేని నవ సమాజం కోసం పోరాడుదాం

మీ
 సహస్రకవిరత్న 
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
మొబైల్ నం 9700007653
*********************** 

కె. వరలక్ష్మ
  సంగారెడ్డి
శీర్షిక..కల్తీ...కల్తీ.....కల్తీ....
************************
ఎక్కడ లేదని అనుకుందాం
పీల్చే గాలి కల్తే.....
తినే తిండి కల్తే.....
తాగే నీరు కల్తే....
కట్టె బట్ట కల్తే....
అన్నిటా కల్తీ కల్తీ కల్తీ....
మనిసే కల్తీ ఆ మనసే కల్తీ
ఇంక ఎక్కడని వెతుకుదాం
కల్తీ లేని స్వచ్చమైన మేలిమిని
మనిషి మంచి వాడైతే 
అంతా శ్రేష్టమే అన్ని స్వచ్చత ఉన్నవే
చివరకు అమ్మ ప్రేమ కూడ
కల్తీ గా మారిని కలియుగం ఇది బ్రతుకంత కలుసితంతో
బతికేస్తున్నాము ఈ జీవన 
పోరాటాన్ని సాగిస్తున్నాము
కల్తీ మయ లోకాన.....
*** వరశ్రీ***
********************


నేటి నిజాలు...
కల్తీ........కంటే..
నిరంజనయ్య.....SA ...

PM కుర్చీ, CM కుర్చీకల్తీ.
MP కుర్చీ, MLA కుర్చీకల్తీ...
నోట్ కల్తీ.. ఓట్ కల్తీ..
కల్తీలేనిరాజ్యం లేనేలేదోయ్...
నీళ్ళు కల్తీ ... పాలు కల్తీ... 
చదువు కల్తీ.. ఉద్యోగం కల్తీ..
పండు కల్తీ.. పంట కల్తీ... 
కల్తీలేని జీవనం లేనేలేదోయ్....
భూమి కల్తీ.. ఆకాశం కల్తీ.. 
మాటకల్తీ... మూట కల్తీ..
పుట్టుట కల్తీ.. గిట్టుట కల్తీ...
డాక్టర్ కల్తీ.. యాక్టర్ కల్తీ... 
కల్తీ లేని చోటే లేదోయ్...
స్నేహం కల్తీ.. ప్రేమ కల్తీ... 
బంధం కల్తీ... అనుబంధం కల్తీ...
కల్తీ ..కల్తీ... బతుకంత కల్తీ

*********************
 విన్నర్: శీర్షిక .కల్తీ సమాజం ..
మనిషే కల్తీ అయ్యాడు ..మనసే కల్తీ అయింది ..కాదేది కవితకనర్హం ..అన్నట్లు కాదేది ..కల్తీ కి దూరం ..ఇది నేటి నిజం .. పాలూ నీళ్ళూ ..కల్తీలెరుగక కలిసిపోతున్నాయి .. పెట్రోలు ..కిరోసిన్ కల్తీ తెలియనట్లు కల్సిప్రయాణిస్తున్నాయి వంటనూనె ..పెంటనూనెగా మారి కల్తీ అయింది బక్క సచ్చిన కుక్కల నక్కల కొవ్వుతో చెలగాటమాడుతోంది ..మనుష్యుల ప్రాణాలను కల్తీ కత్తెర కత్తిరించి ..తోసుకెళుతోంది .. పప్పూ ..ఉప్పూ చక్కర బెల్లం ..సబ్బూ గబ్బూ ..బియ్యం గోధుమ పిండి తిండీ ..అన్నీ కలుషితమై ప్రజల ఆరోగ్యాలను కరిగిస్తున్న వైనం ..ఎవ్వరూ ఏమీ చెయ్యజాలని తరుణం ..దారుణం ... ప్రభుత్వాలు కల్తీకారుల భరతం పట్టి పల్టీ కొట్టించాలి ... కల్తీ మనుషుల కల్తీమనసులను మార్చలేం .. .వ్యాపార మయం అయింది గనుక ..చట్టం కత్తి ఝళిపించాలి కల్తీ రాయుళ్ల ..కల్తీ తనాన్ని నిరసించాలి ..నిర్వీర్యం చేయాలి ..కల్తీకల్లూ ..కల్తీకి దూరం కానిదేది లేదు ..ఆడవారి ఒంటి సింగారం ..బంగారం కల్తీ .. మానవ సంబంధాలు మునుపెన్నడూ ఎరగని రీతి లో కల్తీ ..కల్తీ .కల్తీ ..భార్య భర్తను ..భర్త భార్యను .. తండ్రిని కొడుకు ..కొడుకులు తల్లిదండ్రిని ..అన్న.తమ్ముళ్లను ..ఒక్కరేమిటి ఒక్క రక్తమై పుట్టిన రక్తసంబంధీకులు కల్తీ లైనారు ..కల్తీలైన ..మానవ సంబంధాలు ..బంధాలన్నీ కల్తీ కల్తీ కల్తీ .గురు శిష్యుల బంధం కల్తీ ..రాజకీయాలూ కల్తీ లంచాలతో ..అధికారుల ఉద్యోగం కల్తీ .. మనిషీ ..కల్తీ మనసూ కల్తీ లైన వేళ ..వస్తువులెన్ని కల్తీలైనా ఆశ్చర్యం ..లేదనుకుంటా ..కల్తీ కి అలవాటు పడ్డా రంతా ..కల్తీ ..కల్తీ ..ప్రతిదీ కల్తీ ..కల్తీ ..మార్పును ..ఆశిస్తూ ..విన్నర్ ..కొల్లాపూర్ ..
**************

సాహుకారి శాంతన్న.యస్.ఎ.          
కల్తీ_.                                          నిజానికి మనం మాట్లాడే మాటలుకల్తీ.                               మనచుట్టూ ఉన్న వాతావరణం కల్తీ,.                                         తిండి కల్తీ,నీరు కల్తీ,గాలికల్తీ.             మనుషులు కల్తీ,మమతలు కల్తీ,మానవత్వమూకల్తీ,.            ఈలోకం లో కల్తీలేని,అమ్మపాలు, కన్నీటి నికల్తీగాేకుండాచూడాలి.            కల్తీలేని సమాజనిర్మానాన్నినిర్మిద్ధాం.         కల్మషం లేనిహృదయాలనుఆవిష్కరిద్దాం.
**************

*తెలుగు కవనవేదిక*
శ్రీదాస్యం లక్ష్మయ్య
తేదీ. 16-1-2018
అంశం. కల్తీ
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కల్తీ.... కల్తీ.... కల్తీ
కల్తీ లేని సమాజాన్ని కానరాని రోజులు
కల్తీ కాని అంశం గూర్చి వినలేని రోజులు
అన్నింటా కల్తీ.... అంతటా కల్తీ

భాషణలో కల్తీ.. భావనలో కల్తీ
తినే పదార్థాలు.. తాగే పానీయాలు
ఆరోగ్యం కోసం వాడడే మందులు
అన్నింటా కల్తీ.... అంతటా కల్తీ

ఎందెందు వెదకి చూసినా కానరాని స్వచ్ఛత
మనకెందుకు లే అని నిర్లిప్తత
ఎవడి పాపం వాడిదే.అన్న ధోరణి
వెరసి అన్నింటా కల్తీ.... అంతటా కల్తీ

లంచాలు, దౌర్జన్యాలు, దోపిడీలు
రాజ్యమేలుతున్నంత కాలం
ఎవరికి వారు ఏమవుతుంది లే అంటున్నంత కాలం
తప్పదు కల్తీ.


తల్లి ప్రేమలా గొప్ప గుణం
తల్లి పాలలా స్వచ్ఛ దనం
కన్నీటి లా నికార్సయిన గుణం 
కళ్ల ముందు సాక్షాత్కరించాలి

ముందు మనలో కల్తీ పోవాలి
మన మనసులో స్వఛ్ఛత నిండాలి
మన చేతల్లో స్వఛ్ఛత రావాలి
స్వఛ్ఛత కు మారుపేరుగా మనం నిలవాలి.
**************

@ కల్తీ @
ఎక్కడ చూసినా కల్తీ
సహజ వనరుల కల్తీ
మనిషి చేస్తున్నాడు కల్తీ
అవుతున్నాడు మనిషే కల్తీ
అవసరానికి మాత్రమే
అవుతున్నాయి బంధాలు
ఆ బంధాలు కూడా కల్తీ
ఊహలలో బ్రతుకుతూ
వాస్తవాన్ని విస్మరిస్తూ
అనుబంధాలు అన్నీ కల్తీ
నీరు కల్తీ, గాలి కల్తీ
పాలు కల్తీ, నూనె కల్తీ
సమాజమే కల్తీ కల్తీ
భావితరాలను కాపాడాలి కల్తీ అనే మహమ్మారి నుండి
మారాలి మనిషి
స్వచ్ఛమైన నవ వనరులను
ముందు తరాలకు అందిద్దాం
కల్తీని నాశనం చేద్దాం...
           ✍..సత్యనీలిమ,
           ఉపాధ్యాయురాలు,
           జీనియస్ పాఠశాల,
                  వనపర్తి.
**************

కల్తీ పై పోరు చేద్దాం ! 
🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవి మిత్ర 
🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎

పెరుగుతోంది ! 
సాంకేతిక పరిజ్ఞానం ! ! 
పట్టి పీడిస్తోంది ! 
సమాజాన్ని కల్తీ భూతం ! !

అడుగడుగునా కల్తీ  !
అన్నింటిలో కల్తీ ! !
అక్టోపస్ లా ఆక్రమిస్తోంది కల్తీ !
అందర్నీ శాసిస్తోంది కల్తీ ! !
(ఆరోగ్య భారతాన్ని కూలుస్తోంది కల్తీ ! ! )

మనిషిలో పెరిగిన స్వార్థం !
కల్తీ ఆలోచనలకు శ్రీకారం ! !
అమిత ధనదాహ పర్యవసానం !
కల్తీ సామ్రాజ్యం ఆవిర్భావం ! ! 

బడాబాబులే కల్తీ రాజ్య సృష్టి కర్తలు !
బూర్జువా నాయకులే వ్యూహ కర్తలు ! !
పెట్టుబడి దారులే క్రియాశీలకులు !
కల్తీ మయ రాజ్యపాలకులు ! !

పీల్చే గాలి త్రాగే నీరు కల్తీ !
తినే తిండి మ్రింగే మందులు కల్తీ ! !
కల్తీ లేనిదాన్ని ఊహించలేము !
అలాని చూస్తూ ఊరకుండలేము ! !

రండీ ! కలం ఖడ్గం ఝళిపించుదాము !
కల్తీ కుహనా శక్తులపై పోరాడుదాము ! !
కల్తీ చీకటిరాజ్యాన్ని కూల్చుదాము !
కల్తీ రహితసామ్రాజ్యం నిర్మించుదాము ! !

🍏🍎🍓🍊🍈🍉🍍🍌🍇🍆🍅
పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవి మిత్ర 9490484316
🌷🌽🍚🍗🍕🍫🍬🍜🍝🍦🍣

కల్తీ..కల్తీ...కల్తీ...కల్తీ..
*******(((*)))*****

 కాదేదీ..కవితకనర్హం
అన్నట్లు...కాదేదీ
కల్తీకనర్హం!
తల్లిపాలలో కల్తీ
లేదనుకున్నా?
కానీ!!
కల్తీ ఆకుకూరలు
కల్తీ ఎరువుల్తో
కల్తీ విత్తనాలతో
పండినవి తిన్న కన్నతల్లి
పాలు కూడా కల్తీ అని
తెలుసుకున్నా!!!

కల్తీ లేనిది ఈ అవనిలో
యేది లేదన్నది వాస్తవం
గోరిపై పూసిన గోరింట
గోరు పొయేంతవరకూ
ఎలా ఉంటుందో
కల్తీ కూడా మనిషి చనిపోయిన వరకూ
ఉంటుందని తెలుసు కున్నా!!!!

నేడు ...రెండే..
రాజ్యమేలుతున్నవి
కల్తీ-లంచం
కల్తీ.
కల్తీ...
కల్తీ....
కల్తీ లేనిది ఒక్కటే
నీడ...

                  ...ఈవేమన
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 

🌷కల్తీ🌷
    --------------------
ఏమున్నది ఈ కలిలో
ఎటు చూసినా కల్తీనాయె

మాట్లాడేమాటల్లో ఎంతోనీతి
మనసు నిండా మాయని కల్తీ

మనం తినే తిండిలోను కల్తీ
నడిచే రహదారుల్లోను కల్తీ

నీతిని వల్లించే ప్రతి మనిషి
చేసే పనులన్నీ ఒక కల్తీ

మాద్యమాల ప్రకటనలు జాస్తీ
అవి అనుసరించి చూస్తే కల్తీ

విత్తులో,పత్తిలో,పండులో కల్తీ
నీటిలో,గాలిలో,చమురులో కల్తీ

ఈ వంక,ఆ వంక,ఏ వంకైనా
తిరిగి చూస్తే కనిపించేది కల్తీ

కల్తీలేని స్వచ్ఛతకై కదులుదాం
పదికాలాలు పదిలంగానిలుద్దాం.!!!

            రచన
         ********
     పూదత్తు భాస్కర్.

**************

అవనిశ్రీ: *కల్తీ*

   రచన.... *అవనిశ్రీ*

కల్తీలేనివి
ఒకప్పుడు
చనుబాలు
కన్నీళ్లు
ఇప్పుడు
కల్తీ కానివి
ఊహించటమే
గగణం.

కల్తీ కల్తీయనీ
వస్తువులను
నిందించటం
సరికాదు
ప్రకృతి సృష్టించిన
ప్రతీ అణువు
సుభప్రదమే.

కల్తీకి
కారకులు మనుష్యులు
దుమ్మెత్తి పోయటం
మనం తినే
పదార్థాలపై కాదు.

కల్తీ మనలో
కంకణంగట్టుకోని
కూసుంది కదా
కల్తీ మనలో
ఎవరెస్టంత ఎదిగింది కదా
మనలో
రెండు ముఖాల
పరదాను తీసేయ్యండి.

ఈ ప్రపంచంలో
కల్తేలేదు
కల్తీ కాలేదు
అయ్యిందల్లా మనిషే
చేసిందల్లా మనిషే
నిజమే
కల్తీదారుడు
కల్తీధీరుడు
మనిషే
ముందుగా 
నీవు మనిషి కదండీ
నీకు నీవు కల్తీకల్మషంలో
కొట్టుకపోకు చాలు
ఈ దునియాలో
కల్తే ఉండదు.
**************

శీర్షిక : కల్తీ కథలు 

కష్టించి ఆకలితో ఇల్లు చేరిన 
మనిషిలో మొదలాయే 
నేకొన్న బియ్యం నిజమో నకిలినో 
అన్న అనుమానము 

బలముకై ఆశతోఅంగడివైపు 
 అడుగేసి కొన్న గుడ్డును చూడగానే మొదలాయే 
ఇది నిజంగా గుడ్డో నకిలియను గాడిద గుడ్డో 
అన్న అనుమానము 

ఇంటిపనిలో తలమునకలైన 
తల్లి కి డబ్బా పాలు బిడ్డకు పట్టగానే మొదలాయే 
ఇవి పాలో అనారోగమిచ్చు కల్తీపాలో 
అన్న అనుమానము 

పౌరుషంబు నిచ్చు పంటయైన 
కారంబు చూడగనే మొదలాయే 
అది కారమో అది తినడమే మనం చేసిన నేరమో 
అన్న అనుమానము 

నిగనిగలాడే డబ్బాను చూడగానే 
మనసులో మొదలాయే 
డబ్బులు దారబోసి కొన్నది నూనో డబ్బానూనో 
అన్న అనుమానము 

సమాజంలో మనిషిని మనిషి 
చూడగానే మొదలాయే 
వీడు మనిషో మనిషి ముసుగులో ఉన్న ప్లాక్టిక్ మనిషో 
అన్న అనుమానము 

అన్యాయం అవనిపై దరహాసం చేస్తుంటే 
అందుకు కల్తీయను ప్లాక్టిక్ నాడీకేంద్రమై 
నడిపిస్తున్నది
సత్తువ కోల్పోయిన నిజాయితీ నిర్భయంగా చూస్తూ 
నిలబడినది 

                  *అభిరామ్*
******************************

 *🌷బద్రిపల్లె.శ్రీనివాసులు🌷*
*🌷శీర్షిక:-కల్తీ.🌷*

తల్లిగర్భము నుండి కెవ్వుమని బాలుడు జనించగ
మాతృమూర్తి మనసు పొంగిపోయె ఆనందడోలికల్లో.................
కనులు మూసి నిదురిస్తున్న చంటి గాడిని
తన రెండు కన్నులతో చూస్తూ
సుతారముగా తన చేతిని తాకిస్తూ ముద్దు పెట్టుకొనుచున్నది..................
ఇప్పుడే కదా జన్మనిచ్చినదని..........................
మరుక్షణమందే ఏడుపు చంటోడి పై పెదవులపైన ఉదయించే సూర్యునివలె..............
చూస్తూ ఊరుకోగలదా!
అమ్మ
గబుక్కున తన పవిటదీపి హృదయానికి హత్తుకున్నది పాపము చంటోడి ఆకలి దీరలేదు..................
అమ్మకు తెలియదు ఏమిటని.................
సందేహము కలిగి తనచేతులతో తాకి చూస్తే నిజము తెలిసింది............ వేసవిలో చెలమ లోని నీరు భానుని కిరణానికి హావిరైనటుల ఆ తల్లికి ఆనందము ఆక్షణమందే తొలగె....................
అయ్యో!
పేగు తెంచుకు పుట్టిన గారాల కుమారుని ఆకలి దీర్చలేని నాది ఒక మాతృత్వమేనానని..................
పాపము ఆతల్లి వేదన వర్ణనాతీతము..........
తనే పాపము చేయలేదు కానీ ఏనాడైతే సంతోషము కలిగి వైద్యము కొరకు వెళ్ళందో అపురూపముగా.........
అదే ఆమె పాలిట శాపమైనది.
కల్తీ మందులతో చంటోడికి చనుబాలను పట్టలేని స్థితికి జారుకొన్నది.
ప్రసవ వేదన కన్నా పాలు పట్టలేక పోతున్నాననే వేదన అధికమైనది మాతృమూర్తికి............
చంటోడి బాగుకొఱకు
పక్కింటి కూరకూడా ముట్టని, ఆ ఇల్లాలు  సాంప్రదాయ వంటలను భుజిస్తూ చక్కటి బిడ్డకు జన్మను అందించిన................
కల్తీ మందులు ఆమె పాలిట శాపమై
చివరికి బాధను మాత్రమే మిగిల్చింది.
*🌷బద్రిపల్లె.శ్రీనివాసులు*
*ప్రొద్దుటూరు,*
*కడపజిల్లా.*
*9441721650.🌷*


**************
🌞🌞 కల్తీ 🌞🌞

పల్లవి: 
వద్దురా వద్దురా
కల్తీతో మము సంపొద్దురా..(2)
 చరణం 1:
ఇందుగలదు అందులేదని
సందేహం ఏలరా  ....(2)
ఎందెందు వెతికినా అందందు కలదురా...(2)
కష్టించి పండించే రైతుకు
కల్తీ విత్తనాల కత్తిరా ..(2)
ఆరుగాలం పండించిన పంటకు
దళారుల ధర కత్తిరా ..(2)
                           ....వద్దురా
చరణం: 2
పాలు కల్తీ నీరు కల్తీ
వంటనూనె కల్తీరా ...(2)
పాకెట్ పాలు వద్దు పాడిని పోషించరా ....(2)
ఆరోగ్యం నీదేనురా
ఆహారం కల్తీ ఫలహారం కల్తీ
పట్టెడన్నం కూడా కల్తీ అయ్యిందిరా ...(2)
ప్రకృతిని నమ్మరా పదికాలాలు బ్రతకరా ...(2)          ...వద్దురా
చరణం :3
కల్తీ తెచ్చెను అల్సర వ్యాది నీకురా ...(2)
కల్తేమో అనారోగ్యం పాలు చేసిందిరా ...(2)
దీన్ని మాపకపోతే నీవు పోకా తప్పదు కాటికిరా ...(2)
అందుకే ఇకనైనా మారండి మనుషులుగా బ్రతకండి ...(2)
కల్తీని పారద్రోలుదాం పదికాలాలు జీవిద్దాం ...(2)
చేయి చేయి కలుపుదాం
పద పదమంటూ ముందుకు వెళ్దాం ....(2)         ...వద్దురా
✊✊✊✊✊✊✊✊
          ✍ఉప్పరి తిరుమలేష్,
        తెలుగు ఉపాధ్యాయుడు,
          జీనియస్ పాఠశాల,
                  వనపర్తి.
    చరవాణి:9618961384
16-01-2018
**************
🚯 🚷     *కల్తీ*  --  గల్తీ హై  ...✒    🚯🚷

🍼 🌽 🍚  🏃🏼‍♀🏃🏽 🚷 🏃🏼‍♀🏃🏽 🍚  🌽 🍼

  అమ్మ  ప్రేమ లో  కల్తీ  లేదే 
  నాన్న  ప్రేమ లో  నకిలీ లేదే
  ప్రపంచ మంతా కల్మషాలతో...
  కల్తీ అయిందెందుకో ...??

గోవు పాలలో కల్తీ లేదే 
నీరు కలిస్తే గల్తీ కాదే
ఫెవికాల్ పాలుగ మారితే
పసి కందులు మసై పోయారే 
కల్తీ చెసే బచ్ఛా లను...
అలా వది లేస్తారేమిటో ...!!

ఇంటి నేతి లో  కల్తీ లేదు
వంట నూనె లో కల్తీ ఎందుకు...??
పంట పొలంలో కల్తీ లెదే 
పురుగు మందు లో కల్తీ వుందే 
కల్తీ చెసే లుచ్ఛా లను ...
అలా వది లేస్తా రే ...??

కల్తీ లేని స్థలమే లేదు
కల్తీ కాని వస్తువు లేదు
కల్తీ లేని వ్యవస్థ లేదు
కల్తీ తోనే అవస్థ లంతా

ఎందుకు .. అస లెందుకు
ఈ . .. కల్తీ లెందుకు భయ్యా 
కాసుల కోసం కల్తీ లా...?!
ఆస్తుల కోసం వుల్టా పల్టా
ఎందుకు నీ కెందుకు ...?

ఓరే ...ఓరే ..ఒ రేయ్... బాస్
ఈ .. కల్తీ .. గల్తీ ..అనే దెవరు ..??
అన్న వాడే .. అపరిచితు డా ...?!!

కల్తీ లన్నీ వరించి నట్లు
భారతీయులే భరించి నట్లు
దేశ దేశాలు హరించు తున్నా 
మన వాళ్ళు.... ముందు కెళ్ళరే 
కల్తీ కొమ్మలు నరుకుటకాదు ...
కూక టేళ్ళ తో కూల్చేయండీ 
కల్తీ వ్యవస్థ ను పెకిలించండి 
అస్థ వ్యస్థ నుంచి ఆదుకోండి
సమస్థ జనులకు సాయ పడండీ 

కల్తీ చూస్తూ కూర్చోకండీ 
ముక్కు నోరు ముసు కోకండీ 
మూసుకొని ముందు కెళ్ళ కండి 
ఆగండి... ఆలోచించండి
వ్యవస్థ అంతా అతలాకుతలం
కాకముందే.. మేలుకోం 
కల్తీ చూస్తే  .. కల్తీ .. గల్తీ అని
నీ  గళము విప్పి తే..
నీ  ఫల మేమి పొదు  గా 
నీ  హల మేమి ఆగదు గా
కలము లు ...గళము లు 
ఏక మైతే .. కల్తీ కోరలు..
పీకొచ్చు ... పీకొచ్చు
కల్తీ ని సమాధి చేయోచ్చు.

✒🏃🏽🚷🍼🌽🏃🏼‍♀🍼🌽🚯🏃🏽.....🖋

   షేక్. మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
 సెల్ : 99 483 57 673.
**********************
[1/17, 7:07 AM] Poet Aruna Chamarthi: కల్తీ -కానిది ఏది ? ? ? *********************                               కల్తీ _అవునిది మరి కలికాలం                         అన్ని కల్తీ , అంతట కల్తీ         కమ్మనైన అమ్మ పాలు ,      స్వచ్ఛమైన నాన్న ప్రేమ      పవిత్రమైన భార్య అనురాగం    ,                  పిల్లలు చూపే అభిమానం అన్ని కల్తీ , అంతా కల్తీ                      అలనాడు కిట్టు డు తాగిన కమ్మని ఆవుపాలు కూడ హార్మోన్ లతో కల్తీ ,          ఆరోగ్యం ఇచ్చే ఆకుకూరలు , కూరగాయలు , పళ్ళు రసాయనాల కల్తీ ,           కనిపించే అందం కల్తీ ,       కనిపించని కపటం దాగె స్నేహం కల్తీ ,                 మనసు స్పందన ల ప్రేమా ...కాదంటే కర్కశత్వపు కల్తీ ,             అవునిది కలికాలం మరి అన్నిటా కల్తీ , అంతట కల్తీ ,                     బ్రతుకూ కల్తీ , బంధమూ కల్తీ , చదువు కల్తీ , వైద్యం కల్తీ                      వస్తువు కల్తీ , వ్యాపారం కల్తీ  , చూపు కల్తీ , రూపు కల్తీ , పైకి చెప్పే తియ్యని మాటా కల్తీ     వాతావరణం కల్తీ ..                  అవునిది సహజం             అన్నిటా కల్తీ , అంతట కల్తీ ......                           అసలు ను నమ్మలేనంత అలవాటు పడ్డ కల్తీ , కాలమహిమ ఇదీ , కాలమూ కల్తీ .....
[1/17, 11:16 AM] Poet Bharathi: 9491353544 బాలభారతి 

కాదేదీ ఖల్తీకనర్హం 
భూమ్యాకాశాలు 
సమస్తం 
కల్తీమయం ! 
ఎందెందు వదకినా 
అందందే కనబడు 
కాలుష్యం! 
కోటాను కోట్ల వాహనాలు 
క క్కు పొగల 
సెగలతో వాయుకాలష్యం ! 
జనావాసాల్లో మమేకమై 
న ఫ్యాక్టరీలు విసర్జించే 
మలమూత్రాలతో నీటికాలుష్యం ! 
పవిత్రమైన నదీజలాల
జలచరాలూ సముద్రపు 
జీవుల ప్రాణహాని !.
పుచ్చి పురుగుపట్టిన విత్తులూ 
పాడైపోయిన ఎరువులతో 
పైర్లూ 
వాటినితిన్న పక్షులూ నాశనం ! 
డబ్బుల ఆదాకై వాడిన సిరంజులూ గడువు 
మీరినా గడపదాటి
నకిలీమందులతో  ప్రజల రక్తం 
కలుషీతం ! 
మనం తీనేతిండీ 
తాగేనీరూ కల్తీమయం ! 
మనసుల్లో మాటల్లో చేతల్లో 
స్వచ్చత లేదు ! 
ఎటుజూచినా కల్తీ 
బతుకు దుర్భరం @ 
ఇన్నాళ్ళూ అమ్మ పాలొక్కటే 
స్వచ్చమైనవని నమ్మా !! 
ఆడపిల్లపట్టుకేశాపంకాగా 
పసిగుడ్డును వదిలించుకొను 
నేపథ్యంలో 
చనుబాలనుకూడా 
మందూమాకులతో 
కలుషితంచేసి 
కళ్ళైనా తెరవని 
కన్నపేగునుకడతేర్చు 
అపర పూతనలెందరో 
వున్నారని ఆవేదన చెందా 
నాకలం కూడా కలుషీతమైన 
కవిత రాయడానికీ 
రీఫిల్ కల్తీదను నెపంతో 
రాయకుఃడా మొరాయించింది !!!

**********************
----------🌻🌻🌻🌻🌻---------

రచనా తేది : 16-01-2018

    🌝  " నేను.....క (త్తి )ల్తి ని "🌝
        (  కాదేది కల్తి కి  దూరం )

నేను మిమల్ని చెడగొట్టడంలో
విడగొట్టి పడగొట్టడంలో
నేను కత్తిని.... అదే నేను కల్తిని...

నేను మీలోని
కొవ్వును కరిగించి
కాల్చే కొలిమిని...

నేను మీలో కలిగిన
నీచ బుద్ధులకు జన్మించిన ఉలిని
ఆధునిక సమాజానికి నేనొక శక్తిని...

మీ సంపద సౌభాగ్యాలకు
మీకు లభించే పేరు ప్రఖ్యాతలకు
మీ నాయకత్వ అధిపతికి
రాజకీయాలకు రాజమార్గంచూపే
ఆయుధ శక్తిని ....నేనే కల్తిని...

సూర్యోదయం మొదలు
సూర్యాస్తమయం వరకు
మీ మధ్యలో మీమది లో ఉంటూ
మిమల్ని పలకరిస్తూ
నన్ను సృష్టించిన మీకు
మీ జీవిత వినాశనాన్ని 
కోరుకునే కల్తిని....

నేను అక్కచ్చెళ్ళల
అన్నదమ్ముల మధ్యలో ఉండి
సంతోషిస్తాను...

నేను పాడి పశువులతో మెలిగి
ప్రాణంతీసే పాలపాకీట్ తో వస్తాను...

మీరు మాట్లాడే భాషలో
భూషణంగా ను వచ్చి
ఎదుటివాని తొక్కి ఎదుగుతాను...

ఈ భూమి ఆకాశం అంతా 
నా శక్తి చే ఆవరింపచేశాను
మీతో కసి పెంచుకున్న 
కత్తి లా ..కల్తి లా ఉంటున్నాను...

మీరు వాడే తియ్యటి టూత్ పేస్టు లలో
త్రాగే నీటిలో..తినే తిండిలో
కట్టే బట్టలో...మ్రింగే మందులో
మురిపించే సుగందాలలో
సబ్భులలో... సర్పులలో
మత్తెకించే మందులలో కూడా నేనే ఉంటాను
నేను మీతో కలిమిగా ఉండి
కత్తి లా మారి కల్తి గా ఉంటున్నాన్ను.....

నేను మీరు తినే పండ్లలో
ఆడవారి సింగారంలో
బంగారం లా ఉండే కల్తిని...

నేను మీ నోట్లను కల్తి గా 
మీ ఓట్లను కల్తి గా మార్చి
మీ మనస్సును గలిజ్ గా మార్చి
గౌరవంగా సమాజంలో నిలబెడతాను...

నేను మీరు చదివే చదువులలో
మీరు చూసే చూపులలో
చూపించే ప్రేమలో
చేసే పనులలో
భార్యా పిల్లల అనురాగాలలో
బంధం అనుభందాలలో
ఆడంబరంగా ఉంటాను....

డాక్టర్లు యాక్టర్లు
నావల్లే కాగలిగారు...
రాజాకీయాలు 
నేను చెప్పనవసం లేదు
అదే నాకు పుట్టినిల్లు...

నేను ఈ విశ్వమంతా వ్యాపించాను
కాని జన్మనిచ్చే అమ్మ ప్రేమలో మాత్రం 
నేను లేను....ఉండనందుకు 
నా జన్మను సార్ధకం చేసుకున్నాను...

నేను మీతో కలిమిగా 
ఉందామని అనుకున్నాను
కాని నన్ను కల్తి గా మార్చారు..
దానికి కారణం నేను కాదు
మీరే...మీరే..మానవత్వం మరిచి 
మీ మేలు కోసం నన్ను సృష్టించి
నన్ను మలినం చేశారు...

మీరు మనుషులు గా కాకుండా
మనీ బ్యాంకు లుగా మారడం  వల్లనే
నేను కల్తి గా మారాను...

కాని నన్ను అమ్మ ప్రేమలోకి కాని
సాయం చేసే సేవ లోకి కాని
నన్ను పిలువకండి....
మానవత్వంతో మనుషులుగా
మెలుగండి
ఇకనైనా నన్ను (కల్తి)వదిలి
మీ ఆరోగ్యాలను ఆయుష్షును పెంచుకొండి !


" కల్తిని తరిమికొడుదాం.....మన ఆయుష్షును    పెంచుకుందాం "

                        ఇట్లు
                       నా సొంత రచన
           ✍.. తెలుగు తిరుమలేష్
                తెలుగు ఉపాధ్యాయులు
      ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
            వ్యవస్థాపక  అధ్యక్షులు
        తెలుగు భాషా పరిరక్షణ సమితి
                  అధ్యక్షులు
       అమరచింతమండలం, వనపర్తి జిల్లా
              చరవాణి : 9908910398


✍✍✍✍✍✍✍✍✍✍
-------🙏  సమాప్తం 🙏 --------


Comments

Post a Comment