సంక్రాంతి సంబరాలు
గోగులపాటి కృష్ణమోహన్
సూరారం కాలని, హైదరాబాదు
9700007653
శీర్షిక : సంక్రాంతి కాంతి
భానుడు మకరాన మరలియున్న వేల
దక్షణాయనమెళ్ళి ఉత్తరాయణమొచ్చె
కొత్త అల్లుళ్ళతో కోడిపందాలతో
బోగిమంటల తోడ బోగభాగ్యాలతో
రంగురంగులతోటి రంగవల్లులు విరిసె
ముంగిళ్ళు ముత్యాల ముగ్గలతో మెరిసె
హరిదాసు కీర్తనలు, గంగిరెద్దాటలు.
బోగిపండ్లతోటి, బొమ్మరిల్లులతోటి
పిండివంటలతోటి, తీపివంటలతోటి
పిల్లపాపలతోటి, ఆడబిడ్డల తోటి
బోగి, మకర,కనుమ ముక్కనుమలతో
ముచ్చటగా సంక్రాంతి కాంతియై నిలిచె..
ఉత్తరాయణానికి పలుకుతున్న సాదర సు-స్వాగతం...
మంచుతెరలు కప్పుకున్న అందమైన హేమంతం...
బోగిమంట వెలుగుల్లో సంప్రదాయ సౌందర్యం...
ఇంటిముందు ముగ్గుల్లో కన్నెపిల్ల సోయగం...
గొబ్బెమ్మల సిగలోన బంతిపూల సింగారం...
ముత్తైదువ నోముల్లో ఉట్టిపడే సంప్రదాయం...
హరిలొరంగ అనుకుంటూ హరిదాసుల సుస్వరం...
కోడిపుంజు కొట్లాటలొ కనిపించే అహంకారం...
కొలువుతీరిన బొమ్మల్లో ఉట్టిపడే నయగారం...
అమ్మమ్మలు తినిపించే అతికమ్మని ఫలహారం....
ఆకాశంలో ఎగిరిపడే గాలిపటం ఆనందం...
సంక్రాంతి సంబరం .. సంస్కృతికి అంకురం...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ...
💐🌿 సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు 🌿💐
మీ
గోగులపాటి కృష్ణమోహన్,
🌸🌷🌸 🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
సంబరాల సంక్రాంతి
పల్లె పల్లెలో
సంక్రాంతి సందడి
సాంప్రదాయాల సంబర
హడావిడి
సంకురాతిరి
సంబరాలను మోసుకొచ్చేరా
కర్రసాము,కోలాటం
తీసుకొచ్చేరా...
హరిదాసు గానాలను
ఆలపించేరా
బసవన్న గీతాలు
వినిపించెరా
ముంగిలలో రంగవల్లులు
జిలిబిలులు
ఇళ్లల్లో పిండివంటల ఘుమ ఘుమ లు
భోజమంటలు, గొబ్బెమ్మలు,
గుమ్మడిపూలు
ఆడపడుచుల సందడి
తప్పేటగుళ్ల హడావిడి
పులివేశాల గడబిడి
బొమ్మలకొలువుల
ఆనందలహరి
పొంగలి రుచులు
గాలిపథంగాల పోటీలు
గారడిలు,గమ్మత్తులు
కోడిపందెలు,
అన్ని..మన తెలుగు
సాంప్రదాయ తీపిగురుతులు
...ఈవేమన
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
సంతోషాల సంక్రాంతి
కోడి కూతకు ముందుగ లేచి
కల్లాపి చల్లి ముగ్గులు వేసి
రంగులు నింపి గొబ్బెమ్మలు పెట్టి
భోగిమంటలు వేసి చలికాపుకుంటూ
ఆటలాడుతూ పాటపాడుతూ
చక్కదనంగా ముస్తాబయ్యారు
ఆడపడుచులు
ఘల్లు ఘల్లున గజ్జెలు మోగగా
బసవన్న గంతులు వేస్తూ ఉండగా
హరిదాసు వచ్చి కీర్తనలు పాడి
అందరినీ మురిపించగా
కొత్త ధాన్యం ఇంటికి రాగా
అమ్మ చేతి పిండివంటలు
ఘుమ ఘుమ లాడగా
బంధువులతో ఇళ్ళంతా సందడితో
ఆనందాల హరివిల్లుగ మారగా
వచ్చెనండి సంక్రాంతి
తెచ్చెను నవకాంతి..
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
: 🌅🎋🐓సంక్రాంతి పల్లె అందాలు🌾🌾🎋🐓
సంక్రాంతి అంటే పాత జ్ఞాపకాలు భోగిమంటలు
పల్లె ప్రజల సరదాలు
కళ్ళాపి జల్లి అలికిన మా పల్లె
చేతి వేళ్ళ మధ్యలోంచి తెల్లనిముగ్గు జారుతూ వంకిలొంకలుగా పర్చుకుంటూ
వయ్యారాల హొయలు పోతూ
మా వాకిటికే ముగ్గు వన్నె తెచ్చింది మా పల్లెకే ప్రకృతి వన్నె తెచ్చింది
మా పల్లె వికసించింది తామరలా
సన్నజాజి పూచినట్లు
మందారం వికసించినట్లు
సన్న మల్లె తీగ అల్లినట్లు
సంక్రాంతికి మా పల్లె లోగిల్ల ముగ్గులు
ముగ్గు తేలి మేలి ముత్యంగా మెరిసింది
అవని తల్లి మెడలో అలంకరించింది
మా పల్లె రంగవల్లుల ముగ్గులు
వీధి వాడ హరిదాసుల కీర్తనలు
గంగిరెద్దులు బసవన్న సవ్వడి
పాడి పంటల సిరి సంపదల
నూతనక్రాంతి మకర సంక్రాంతి
ఆవు పేడ తెచ్చి అందాల పాపలు గొబ్బెమ్మలను చేసి
పెద్దగా తల్లి గొబ్బెమ్మను ఒకటి చేసి మా ఇంటి ముంగిలి ముగ్గులో వెలిసింది
భోగిపండ్లు -రేగిపండ్లు
గరకపోచలు-అగరొత్తులు
నవధాన్యాలతో అలంకరించే
గొబ్బెమ్మ రంగురంగుల ముగ్గులు పూల గొబ్బెమ్మ బారులు భోగి మంటలు
గాలి పటాలు పందెం కోళ్ళు
నింగికి నేలకి అందాన్ని తెచ్చిన
మన సంక్రాంతి సంబరాలు..
🌾🌾🌾🌾🎋🎋🎋🐓
✍..ఉప్పరి తిరుమలేష్,
తెలుగు ఉపాధ్యాయుడు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
చరవాణి:9618961384
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
శుభ సంక్రాంతి
సుజాత PVL
సైనికపురి
వినూత్న కాంతులతో
విశ్వమంతా నేడు
సంక్రాంతి సంబరాలతో
నిండింది..సంబరాల
సంరంభాన్ని సరదాగా పంచుకునేందుకు,..
లక్షలాది ప్రజల కొరకు
సందడిగా సవ్వడి చేస్తూ
తెలతెల వారు జామునే
తలుపుతట్టి ఊరినే మేల్కొలిపింది సంక్రాంతి లక్ష్మి..!
ముంగిళ్ళ ముత్యాల ముగ్గులు
ముగ్గుల్లో దాగిన రతనాల గొబ్బిళ్ళు
గొబ్బళ్ళ కొప్పుల్లో మురిసే
ముద్దులొలుకు ముద్దబంతులు
పచ్చని పైరులు
పసిడి ధాన్యపు రాశులు
గంగిరెద్దు ఆటలు
బసవన్న ఆశీస్సులు
హరిదాసు కీర్తనలు
సంక్రాంతి లక్ష్మి కి స్వాగతం పలుకగా..ప్రకృతి కాంత పరవశించింది..ప్రతి ఇంటా అడుగిడింది నవ నవ్యకాంతి శుభ సంక్రాంతి.
🌹🌹🌹🌹🌹🌹
సంక్రాంతి పండుగ
🌹🌹🌹🌹🌹🌹
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవి మిత్ర. కొలిమిగుండ్ల 9490484316.
సంక్రాంతి పండుగ !
సంబరాల పండుగ ! !
పంటల పండుగ !
పిండివంటల పండుగ ! !
ముగ్గుల పండుగ !
గొబ్బెమ్మల పండుగ ! !
గంగిరెద్దుల పండుగ !
దాసరయ్యల పండుగ ! !
రేగు పండ్ల పండుగ !
చెరకు గడల పండుగ ! !
గుమ్మడి పూల పండుగ !
మకర సూర్యుడి పండుగ ! !
పశువుల పండుగ !
పనిముట్ల పండుగ ! !
తెలుగింటి పండుగ !
తెలుగు సంస్కృతి పండుగ ! !
కోడి పందెంల పండుగ !
కొత్త అల్లుళ్ళపండుగ ! !
ఆత్మీయుల పండుగ !
ఆప్యాయతల పండుగ ! !
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవి మిత్ర , కొలిమిగుండ్ల 9490484316
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌾సంతోషాల సంక్రాంతి🌾
🌾🌾🌾🎋🎋🐓🐓🐓
కోడి కూతకు ముందుగ లేచి
కల్లాపి చల్లి ముగ్గులు వేసి
రంగులు నింపి గొబ్బెమ్మలు పెట్టి
భోగిమంటలు వేసి చలికాపుకుంటూ
ఆటలాడుతూ పాటపాడుతూ
చక్కదనంగా ముస్తాబయ్యారు
ఆడపడుచులు
ఘల్లు ఘల్లున గజ్జెలు మోగగా
బసవన్న గంతులు వేస్తూ ఉండగా
హరిదాసు వచ్చి కీర్తనలు పాడి
అందరినీ మురిపించగా
కొత్త ధాన్యం ఇంటికి రాగా
అమ్మ చేతి పిండివంటలు
ఘుమ ఘుమ లాడగా
బంధువులతో ఇళ్ళంతా సందడితో
ఆనందాల హరివిల్లుగ మారగా
వచ్చెనండి సంక్రాంతి
తెచ్చెను నవకాంతి..
🌾🌾🎋🎋🐓🐓🌄🌄
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
********************
దండ్రె రాజమౌళి
12-1-2018
దండ్రె రాజమౌళి
శీర్షిక : సంక్రాంతి
ఇంటి నిండా ధాన్యసిరితో
కడుపునిండా బువ్వతో
కంటినిండా కునుకుతో
గుండెనిండా భరోసాతో
సంక్రాంతి వచ్చింది
సంబరాలు తెచ్చింది!
మనసునిండా సంతోషం
తనువునిండా ఆనందం
తెలుగుదనం అద్దంలా
ప్రపంచం ముందునిలిచి
పాడిపంటలు పండుగైవచ్చి
పశుపక్షులు పులకరించే క్షణం!
పల్లెనిండా ప్రాణం చిలకరించే దినం!!
సంక్రాంతి నీ రాక
రైతు బతుకున కొత్త కాంతి!
సంక్రాంతి నీ రాక
మానవజాతికి ఆనందక్రాంతి!!
*********†*****************
సంక్రాంతి...తెచ్చే క్రొత్త కాంతి
వచ్చింది.. వచ్చింది... సంక్రాంతి
పాడి-పంటలతో...పసిడి
భాగ్యాలతో...
ప్రతీలోగిళ్ళలో అందాల
హరివిల్లుల రంగవల్లులు
గాదెల్లో బంగారు ధాన్యాలు ప్రతిఇంట
గుమ్మడిపూలు,గొబ్బెమ్మలతో..భోగి మంటలు సాక్షిగా...
ఎముకలు కొరికిన చలిలో
కిలకిలా నవ్వుల పాపాయిలు
తలారా స్నానంచేసి
సంక్రాంతి లక్షిని పిలిచి
మాఇంట సిరులెన్నో
కురిపించుతల్లి అంటూ
మ్రొక్కి కొలిచెదమమ్మా
గణగణ గంటలతో...
డూ.డూ..బసవన్నల సందడితో...
హరిదాసుల ఆశీస్సులతో
పిండివంటలు ఘుమఘుమలతో....
పల్లెపడుచు అందాలతో...
వచ్చింది.. వచ్చింది... సంక్రాంతి!
తెచ్చెను మనలో క్రొత్త కాంతి!!
....ఈవేమన
***********************
: ☘🌹సంక్రాంతి- సంబురాలు🌹☘
మకర సంక్రాంతి
తెచ్చెను నవకాంతి
ప్రతి ఇంట కొత్త పంట
వచ్చి నిల్చె గుమ్మినిండా
మనిషి మనిషిలోఆనందం
మనసు మనసున ఆహ్లాదం
రంగు రంగుల రంగవల్లులు
తీర్చిదిద్దిరి మగువలందరు
గోమయంతో గొబ్బెమ్మలు
గుమ్మమందు వెలుగు దివ్వెలు
రేగుపళ్ళు,సద్ద రొట్టెలు
గుమ్మడి,చిక్కుడు కూరలు
నోరూరే నువ్వుల ముద్దలు
నవ్వులు పంచే వినోద క్రీడలు
గంగిరెద్దుల విన్యాసాలు
గాలి పటాల రెపరెపలు
కోడి పందాల కోలాహాలు
కొత్త అళ్ళుళ్ళ సయ్యాటాలు
ఇంటింటా వెల్లి విరిసేను
ఆనందాల హరివిల్లులు
అదే అదే మన నవ క్రాంతి అదే అదే మన సంక్రాంతి.
రచన
*****
పూదత్తు భాస్కర్
తేది : 12-01-2018
******†*********†******
ఊరంతా సంక్రాంతి ********************* వచ్చింది వచ్చింది క్రాంతి కొత్త మార్పును తెచ్చే సంక్రాంతి మకర ప్రవేశం చేసి మంచి తెస్తుందని భ్రాంతి కొత్త అల్లుళ్ళ కోలాహలం మరదళ్ళ వేళాకోళం . కొత్త చింత , బియ్యం బెల్లం తో పిండి వంటలు పేడ కళ్ళాపి పై రంగుల తో ముస్తాబైన రంగవల్లులు . పంట చేతికొచ్చిన వేళ పసిడి కొనుగోళ్ళ హేల . కోడి పందాలు , గాలి పటాల లీల పారువేట , జల్లికట్టు , ఎడ్ల పూజలు , గంగిరెద్దు , గొబ్బిళ్ళ పాటల లయ . భోగి మంటలు , భోగిపళ్ళ పేరంటాలు , ఊరంతా సంక్రాంతి సంబరం కనుమ దాక సెలవుల తో ఆనందం అంబరం . నువ్వులు , పల్లీలు ,కొబ్బరి పుట్నాలన్ని పంచదార పొడితో సంగమం తిల్ గుడ్ తో అన్ని రాష్ట్రాల్లో స్నేహసంగీతం . చలి తప్పించి వేడి పెంచే నువ్వుల వాడకం సకినాలూ , అరిసెలు ప్రాంతానికో రకం . తెలంగాణ లో మాత్రం ఇది కీడు పండుగ అందుకే అనుకోగ వేడుక దండగ . జగమంత ఆనందం విరియ బొమ్మల కొలువుల్లో , మురిసే పెళ్ళి కలలతో కన్నియ . అరుణ చామర్తి
************************
*సంక్రాంతి*
................. వీరా గుడిపల్లి
ఫలాలనిచ్చే కాలం మార్పు కదలి వచ్చిన సందర్భంలో కదనభావనలు మదిని అలదుకొనని అంబరమంటిన
సంబరాల పండగిదీ...
ఎవడో ఎవడినో చంపినందుకు చేసుకుంటున్న సంబరాలు కావివి
జన్మదిన పుణ్య ఫలమో ధర్మోధ్దరణకై యుద్దం జరిగిన సందర్భమో కాదిది
ఏనాడు యేకుత్తుక తెగిపడలేదు, మంచి చెడుల ప్రసక్తే రాలేదు
విత్తిన విత్తు పంటగా మారి బ్రతకమంటూ నా ధాన్యపు గుమ్మిని సహస్రమై నిండింది
యాడాది కేడాది తనరాకడ నా ప్రాణం తో ముడిపడింది
సంబరాల సంక్రాంతంటే సంతోషాలను మోసుకొచ్చి మది నింపే పండగ
నామనసు గెలిచే పండగ.. నా ప్రాణం నిలిపే పండగ
పండగంటే సంక్రాంతి
💐💐💐💐వీరా గుడిపల్లి
శీర్షిక: నవకాంతి...నేటిసంక్రాంతి
ReplyDelete*****************************
ఆకాశవిహంగమెక్కి
అరుదెంచాడు అరుణుడు
మకరరాశి మురిసిపోయింది
తనముంగిలిలో రంగవల్లులు
తీర్చిదిద్దింది
నవకాంతుల తోరణాలు కట్టింది
ఏతెంచిన ఆ దినకరుని కన్నుల్లో
కాంతిహీనతను గమనించిన
ఆచెలి మంచుపొరల పరదాతీసి
పగటి రాజును పలకరించింది
చెలినీకౌగిలి నే ప్రతియేడు చేరక తప్పదు
మనకలయికకు మురిసే భూమాత కన్నుల్లో
నేడెందుకో విషాదఛాయలు గోచరమయ్యాయి
విచారించగా
పేడకళ్ళాపులనడుమ వరిపిండిముగ్గుల్లో పసుపు,కుంకుమ,చామంతి,బంతిపూలతో
ముచ్చటగొలిపే వాకిళ్ళు నేడు పచ్చరంగు నీళ్ళుజల్లి కృత్రిమరంగులతో ముగ్గులు
ముగ్గు మద్యనముచ్చటగాతల్లి,పిల్లలతో ఒదిగేకూర్చొనే గొబ్బెమ్మలబదులు
ప్లాష్టిక్ పూలనలంకరించినమట్టిగొబ్బిఒంటెరిగా
గొబ్బెమ్మలచుట్టు సుబ్బీగొబ్బెమ్మ అంటూతిరిగే కన్నెపిల్లలు సెల్ఫీల చుట్టూ తిరుగుతున్నారు
హరిదాసు హరికీర్తనాలేదు
కొమ్మయదాసు చుట్టరికాలు లేవు
కోడిపందాలు లేవు
పశువులకు అలంకారాలు లేవు
గంగిరెద్దుల సన్నాయిలులేవు,
పగటివేషగాళ్ళ పలకరింపులులేవు
బుడబుక్కల మేలుకొలుపులులేవు
బొమ్మలకొలువుల పేరంటాలు లేవు
తాతయ్యలిళ్ళల్లో కోలాహలాలులేవు
బావామరదళ్ళ సెటారులు లేవు
పచ్చనాకుతోరణాలు లేవు
పిండివంటలజోరు లేదు
ఉన్నదొకటే పరుగులు...పరుగులు...పరుగులు
వాట్సప్ శుభాకాంక్షలు
గూగులు పిక్ లు
ముఖపరిచయంలేని
ముఖపుస్తకమిత్రులతో
ఛాటింగులు
ఫోను ప్రపంచంలోంచి
బయటకు రావడంలేదు
నన్నసలు పట్టించుకోవడంలేదు
అంటూ వాపోయిందన్నాడు
ఘాలిలలితప్రవల్లిక
తెలుగుభాషోద్యమసమితి ప్రధానకార్యదర్సి
నెల్లూరు
కవితలు కాకుండా కామెంట్స్ పెట్టండి
ReplyDelete