కల్తీ కల్తీ కల్తీ.. 2



🌻🌻🌻🌻🌻🌻
సహస్ర కవి భూషణ, స్పూర్తి శ్రీ
వీరా గుడిపల్లి కవిత
శీర్షిక ః కల్తీ

కల్తీ.......16.01.2018

కల్తీని కత్తిరంచాలనుకుని కలంపట్టి చూస్తే మిగిలేదేముందనిపించిది
కల్తీ కల్తీ కల్తీ కల్తీ కల్తీ.. అంతా తానే అంతటా తానే

కలగాపులగం చేయడమంటే కసిగా చేస్తారు
కల్తీ అంటే వినరసలే

స్వచ్ఛమైన దేదీ నచ్చదెందుకో

*చీకటి వెలుగుల కల్తీ సంధ్యంటే ఇష్టం*

*వెలుగు చీకటుల కల్తీ ఉషోదయమంత ప్రాణం*

నేలతో సముద్రం కల్తీ జరిగిన తీరమే బీచ్ 
ప్రశాంతత వెతికే పనిలో పడతాం
కల్తీ పై మోజింతంతా కాదు
కలవడమే సుఖమనుకుంటాం కల్తీ అంటూ మొత్తుకుంటుంటాం
*పాలూ,నీరూ, మరేవో కల్తీ చేసి తేనీరంటూ గుటకలు వేస్తాం* .. 

కల్తీ లేని చోటు .. కల్తీ లేని జీవితం కలలోనైనా కనగలమా
స్వచ్ఛమైన దన్న పదానికి కల్తీలేని నిర్వచనమివ్వగలమా.. 

*కులం, మతం, కుళ్ళు* *భావనలు కల్తీ జనితాలేనాయె*
*కలం పట్టి కల్తీని కత్తిరించాలని చూస్తే* *మిగిలేదేమీ కనిపించట్లే*

కల్తీ మయం సర్వం. సర్వం కల్తీమయం

..... సహస్ర కవి భూషణ ,స్పూర్తి శ్రీ 

*వీరా గుడిపల్లి*

💐💐💐💐💐💐💐

 కల్తీ..కల్తీ
కుసుమంచి శ్రీదేవి
........................
లోకశ్రేయస్సు కోసం
భూమి సూర్యుని చుట్టూ
పరిభ్రమిస్తే....

స్వార్ధభావనతో 
శకుని కుమారులులా
లోకవినాశనానికై  ధనం చుట్టూ
పరిభ్రమిస్తున్నారు నేటి జనం...

ఆగే ఊపిరిని క్షణం
రక్షించలేని ఈ ధనం
కోసం ..
విలువల మరిచి
తొక్కకూడని అడ్డదారులన్ని తొక్కి..

పీల్చే గాలి నుండి
పంచే ప్రేమ వరకూ
కల్తీ మయం చేస్తున్నాడు..

వట వృక్షం మూలాలా
చాప క్రింద నీరులా 
ప్రాకుతూ...
మానవ ఆచూకీనే కబళించే
అతి పెద్ద భూతంలా పడగ 
వేసుకుంటుంది..

కళ్ళు తెరవండి..
కల్తీ చేసే ప్రతీ మూర్ఖుడా
ఈ కల్తీ నేడు కనకపు సింహాసనంపై
కూర్చోబెట్టవచ్చు గాని...
రేపు  నీవాళ్ళనే
కబళిస్తుంది నీ కల్తీ పాపం...

కళ్ళ తెరించి చూడండి..
మాయా స్వార్ధపు ముసుగులను తెరచి..

విలువలతో నడవండి
ఆరోగ్యంగా బ్రతకండి...
జానెడు పోట్టకోసం
మూరడు మోసం చేయకండి..
నీ పోట్ట ఆకలి తీర్చమన్నది
రేపటి నీ  ఆనందం కోసం మాత్రమే
అని గుర్తించండి...
ప్రక్క వారి ఆరోగ్యాలను ఆవిరిచేయడం
కోసం కాదని గుర్తించండి..

నీకు నువ్వే మారు...
మాయ చేయడం నేర్చుకున్నావంటే...
మంచి ఎక్కడుందో నీకు తెలుసు...
ఎందుకంటే నీవు కప్పే మాయాదుప్పటి
మంచి పైనే కదా...

మాయా దుప్పటి తోలగించు..
నలుగురి మన్ననలు పొందు...
మంచిగా జీవుంచు..
ఆరోగ్యకర ప్రపంచాన్నందివ్వు

 🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పాలకుర్తి నాగజ్యోతి
కుమ్రం భీం జిల్లా..
8074712181


కల్తీ...


గీ మాటింగనే నామనసంత పాడైందిపుడు..
రత్త పరీచ్చ చేసినట్టు గిపుడన్నీ పరీచ్చలుజేసి కొనాల్నాయే..

తినాల్నంటే భయమైతాంది..
ఆకలైనపుడల్లా
గుండెలో గుబులైతుంటే
ఎండిన పేగులు మలమల మాడవట్టే..

యాడున్న నువున్నవన్న నమ్మకముండె గిన్నిదినాలు
నువ్ మాటమార్శినంక నీ మాటసుడ కల్తీ అయినంక..
నన్ను మర్శినంక
నీ మనసు సుత కల్తీ ఆయే..
గిప్పుడు శెప్పెటందుకేముంటదిక..
ఏంలే..

గాపాటి ధర పలికే అత్తువులకంటే గవో గివో పరీచ్చలు జేత్తంగనీ
అనుమానమచ్చినంక
కల్తీ తేలడానికీ..
నీ మాటకి
నీ మనసుకి
ఏం పరీచ్చలుజేయమంటవు జెరశెప్పరాదే...

కొలతల కల్తీనో
నాన్యత కల్తీనో అయితే ఏ కోర్టన్న తీర్పిత్తది..

విలువల కల్తీ అయితే ఏమని తీర్పిత్తది..
వలువలనెలా తొడుగుతది..


@సిరిమల్లెలు...

*** ***** *** ***** *** 

కల్తీ
+++
కోరలు సాచిన భూతం కల్తీ
వ్యాపార పిశాచి కరాళ నృత్యం కల్తీ
మానవత మరిచిన మనిషి దానవ కృత్యం
అనునిత్యం దోపిడీని అణువణువూ నింపుకుని తను ఎక్కిన కొమ్మ తానే
నరుక్కునే మనిషి పైత్యపు స్వభావం కల్తీ
పచ్చదనం, పరిమళం నిండిన
హరిత భువనాన్ని
తన వికృత,విపరీత ధోరణులతో
హననం చే సే మనిషి స్వార్థ రీతికి దర్పణం
గాలి,నీరు, ఆహారం
అన్నీ కల్తీ చేసే మానవ సమాజపు
మారణ హోమం 
తన కంటిని తానే 
పొడుచుకునే
మనిషి విచిత్ర పోకడకిది
ప్రతిబింబం.
అనంత అమృత జీవన కలశం లో
విష బిందువు కల్తీ.
+++++
వెల్ముల జయపాల్ రెడ్డి
9441168976
వల్లంపట్ల.
🌼🌼🌼🌼🌼🌼🌲🌲 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
✍🤘ఎద్దు'లా' -వనపర్తి జిల్లా (9963224187)🤘✍
  
🌹శీర్షిక: "కల్తీ - కల్తీ"🌹

కందం॥

కల్తీ లేని తలంపులు
గల్తీ లేని సమాజ గణమే లేదోయ్
కల్తీ..కల్తీ...యననీ
శాల్తీ కనుమరుగవునుగ శాంతంగుండూ

తే.గీ॥

మంచి సాహిత్యమనివాని మదిల గాంచి|
ఉలుకు పలుకులు లేక మారుబలుకని క
లియుగ రాజుల ఈర్ష్య,'కల్తీ' జనమును|
గాంచినంతనె కవిగుండె గాయంబయ్యె|

🌹🤘ఎద్దు'లా' - నపర్తి జిల్లా(9963224187)🤘🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🤘ఎద్దు'లా' - వనపర్తి జిల్లా(9963224187)🤘🌹

శీర్షిక : " కల్తీ కల్తీ...కంత్రీ కల్తీ "

బంధం కల్తీ - బంధుత్వం కల్తీ
గింజల కల్తీ - గంజీల కల్తీ
చదువుల కల్తీ-నడతల కల్తీ
మందుల కల్తీ - పొందుల కల్తీ
పాలూ నేయీ-గాలీ ధూళీ
జలమూ - ధనమూ
అన్నీ కల్తీ - అంతా కల్తీ
కలియుగమున - అణువణువూ కల్తీ
కాలం ఒడిలో నీడరకల్తీ
మరణంలోనూ పీడించుర కల్తీ
కల్తీనరుకుదమంటూ నేను...
కరవాలంబునదిప్పితి కత్తి
కల్తీ కత్తి పుటుకున విరిగెను
కల్తీరక్కసి శివతాండమాడెను
కల్తీ కాటుకు కన్నీరొలికెను
పెదవి అంచున కన్నీరలికెను
నాలుకనంటిన కన్నీరంతా....
కల్తీ...కల్తీ...కల్తీ...కల్తీ....
కల్తీ కల్తీ..కంత్రీ కల్తీ!!!

🌷ఎద్దు'లా' - వనపర్తి జిల్లా (9963224187)🌷

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కల్తీ

ప్రపంచీకరణ మోజులో
ఆధునిక జీవన వ్యామోహంలో
ప్రగతిపథం అనే ముసుగులో
మనిషి తనను తాను మోసం చేసుకొని
తనతో పాటు తన చుట్టూ ఉన్న
ప్రకృతిని సైతం కల్తీ చేస్తున్నాడు
నిత్యావసరముల పేరుతో
నిత్యం తాను వాడుతున్నటువంటి
ఆధునిక యంత్రా లనే భూతాలు
విరజిమ్మే కాలుష్యపు కోరలలో
చిక్కుకొని గిలగిల్లాడు తున్నాడు
చివరకు ఆధునిక వ్యవసాయ మనే పేర
అధిక దిగుబడుల కోసం
పంటపొలాలను కూడా మందులతో నింపేసి
తినే ఆహారమును కూడా కల్తీ చేసేస్తున్నాడు
చిన్నపిల్లల ప్రధాన ఆహారమైన పాలను కూడా
కల్తీ చేసేస్తున్నాడు
ఇదీ యదీ యనికాదు ప్రపంచంలో ప్రతీదీ కల్తీ 
కల్తీ ఎవరో చేస్తున్నారని అనుకుంటూ
బాధపడుతూ కాలం గడపడం మనిషి మూర్ఖత్వం గాక మరేమిటి
కల్తీకి కారణం మనిషి గాక మరెవరు?
మనిషి మనసు కూడా కల్తీ అవుతే
ఈ కల్తీని ఆపే దెవరు
దేవుడనేవాడు ఉన్నాడో లేడో కానీ
దేవుడా నీవే ఇక దిక్కు.

  మేడిచర్ల హరినాగభూషణం, గద్వాల.
*******************************

 కన్నీరు కల్తీ

కల్తీ కల్తీ కల్తీ
కన్న ప్రేగు కల్తీ
కన్నీరు కల్తీ
కాటికి వెళ్లినా
పేర్చిన చితి కల్తీ

ఆమె ప్రేమ కల్తీ
అమ్మ పాలు కల్తీ
అన్నంలో మట్టి కల్తీ
ఆవనిలో కానిది లేదు కల్తీ

ప్రేమంటూ చంపడం
వైద్యమంటూ చంపుతూ ఉండటం
స్వేదం తాకట్టు పెట్టినా 
సేద్యం అసాధ్యం అవడం 

బతుకు కల్తీ
బంధం కల్తీ
కల్తీ లేనిది లేనప్పుడు
మన చావు మాత్రం నిజం

కరణం లుగేంద్ర పిళ్ళై

***********************

మూర్తిశ్రీదేవి
సహస్ర కవిమిత్ర
తెలుగు కవన కవిత
తేది : 17/1/18
శీర్షిక :     కల్తీ కల్తీ

కల్తీ లేని వస్తువేమున్నది
కలియుగమ్మున
తెల్ల పాలలో నీళ్ల కల్తీ
నూనెలో ఎముకల గుజ్జు కల్తీ
చక్కెరలో రవ్వ కల్తీ
బియ్యములో రాళ్ళకల్తీ
నెయ్యిలో డాల్డా కల్తీ
తేనెలో బెల్లపుగుజ్జు కల్తీ

మాటలో స్వార్ధపు కల్తీ
మనసులో కపట కల్తీ
చేతలలో లంచాల కల్తీ
వ్యాపారంలో దగా కల్తీ
సిమెంటులో మట్టి కల్తీ

పసుపుకుంకుమల్లో కల్తీ
మంచినీళ్లలో కల్తీ
మందుల తయారీలో కల్తీ
టూత్ పేస్టులో కల్తీ
పౌడరు అత్తరులో కల్తీ
కాటుక బొట్టులో కల్తీ

కల్తీ లేనివి చూడు మిత్రమా
అమ్మపాలలో లేదు కల్తీ
నాన్న త్యాగములో లేదు కల్తీ
అమ్మ అనురాగములో లేదు కల్తీ
నాన్న మమకారములో లేదు కల్తీ

కలియుగమ్మున కల్తీ లేనివి
మానవులు విలువివ్వనివి 
ఇవి మాత్రమే మిత్రమా 
తెలుసుకొని సాగరా సోదరా
************************** 

తెలుగు కవన వేదిక
అంశం : కల్తి
శీర్షిక :
కవి పేరు: ఐతగోని వేంకటేశ్వర్లు
చిరునామా: ప్లాట్ నం:G-1
చందమామటవర్స్
రామగిరి
పానగల్ రోడ్
శ్రీనివాసనగర్ కాలని
నల్లగొండ
పిన్:508001
చరవాణి సంఖ్య:9912274442

కవిత.... 
1)జలముల్ పండ్లును కూరగాయలకటా శ్వాసించు నీగాలిలో
దలపం జాలము పంచభూతముల నింతంతంత నెంతెంతయో
గలిసెన్ క్యాన్సరు రక్తపోటు మొదలౌగానెన్నొ రోగాలిడన్
కలుషాల్ ;కల్తియుగమ్ము నీకలియుగంగాసేయగా శీఘ్రమున్

2)లలి గ్రంథంబులు తత్వశాస్త్ర కథలున్ ప్ర(బ్ర)క్షిప్త సంగ్రస్తమై
గలుషంబాయెను భక్తియోగ జపముల్ గంగాప్రవాహంబులున్
గలుషంబాయెను సర్వతీర్థములు ఇంకాఔషదాహారముల్
గులగోత్రంబులు మాటమంతనములున్ లోకంబునందెల్లెడన్
గలుషంబాయె కవిత్వరీతులును సఖ్యంబుల్ సమస్తంబులున్
ఇలదెల్పంగను పూననాదుకవితల్ ఈగ్రూపు నిండున్ గదా
గలుషంబుల్ విడి స్వచ్చతల్ గలుగగా కర్తవ్యదీక్షారతిన్
వలనం బూన మనందరంబిపుడు నిర్వర్తింపనౌ బాధ్యతల్

******************************

కవితా శీర్షిక :     కల్తీ గేలం
ఆ గేలానికి చిక్కిన
అమాయకపు చేపలకు
తెలియదు గేలానికి చిక్కని ఉపాయం
చిక్కినా తప్పించుకొనే మార్గం
అందుకే.....ఆ గేలానికి పవరెక్కువ
కల్తీ సామ్రాజ్యానికి చక్రవర్తులై
ధనాగారాలను ఎవరెస్టు శికరమంత ఎత్తున కట్టించారు
బియ్యంలోకల్తీ
బిస్కెట్ లో కల్తీ
తూనికలో కల్తీ
తయారీలో కల్తీ
పండ్లు కల్తీ
పాలు కల్తీ
పండ్లుతోమే బ్రష్ కలితీ
పాలు తాగె పీక కలితీ
విత్తు కల్తీ
చివరకుచిత్తంకూడా కల్తీ
కల్తీ, కల్తీ, కల్తీ ఎటుచూసిన కల్తీ
రాళ్ళ యుగందాటి రాకెట్టు యుగమొచ్చిన
పీల్చు గాలినే కలుషిత పరచే ప్రబుద్దుల కాలమొచ్చే
దోపిడీల తీరుమారే
మెరుగుల ఆకర్షణలో
ఆఫర్ల జోరుపెరిగె
స్వచ్చత లోపించే
నకిలీ గేలాలకు
ప్రాణాలు నిలబెట్టే మందులు కూడా చిక్కే
అసలేదో నకిలేదో తెలియని తికమకలు
అవసర సమయంలో దొరికెననేసంతృప్తి
దోచుకొనేవాడికదేతిరుగులేని బ్రహ్మాస్త్రం
వినియోగ దారుడా విఙ్ఙప్తి
పరిశీలించు isi ముద్రను
చదువు కవరుపైనున్నట్టి చివరితేది
నాణ్యత లోపమైన నోరుమూసుకూరుకోక
న్యాయంకై పోరాడు
నకిలీ పని పట్టు


ఘాలి లలితప్రవల్లిక

**************************
తెలుగుకవనవేదిక
అంశం:కల్తీ
కవయిత్రి పేరు:మన్నె లలిత
ఊరు:హైదరాబాద్.
చరవాణి:7416863289
×××××××××××××××××
1)నాగరికతనేర్వనప్పుడు లేని కల్తీ
నాగరికత నేర్చాక ఎందుకు కల్తీ
స్వచ్ఛమైన గాలులు పీల్చిననాడు లేని కల్తీ
స్వచ్ఛ భారత్ లొే ఎందుకు కల్తీ
కల్తీ తెలియని తిండి
క్రమశిక్షణతొేవుండి
కుారగాయలు పండి
పాడిపంటలు నట్టింటనిండి
ఆరొేగ్యంతొేవుండి
నిశ్చింతగా పనీ పాటలు చేసికున్నరొేజులు
బ్రతుకుకు  బంగారు బాటలు వేసికున్నరొేజులు

రొేజులు మారాయ్
డబ్బు జబ్బు వచ్చి
మైకం కమ్మి
తుచ్ఛమైన కల్తీలతొే 
ప్రజల ప్రాణాలు హరించి
డబ్బు గబ్బుకొట్టేంత పొేగేసి
ఆకల్తీతొేనే జీవన ప్రమాణం తగ్గి
మరణించే "కల్తీ "మనిషీ
ఏం సాధించావ్?
ఏం తీసికెళ్ళావ్?
🌿🌸🌿

Comments

  1. కవితా శీర్షిక : కల్తీ గేలం
    ఆ గేలానికి చిక్కిన
    అమాయకపు చేపలకు
    తెలియదు గేలానికి చిక్కని ఉపాయం
    చిక్కినా తప్పించుకొనే మార్గం
    అందుకే.....ఆ గేలానికి పవరెక్కువ
    కల్తీ సామ్రాజ్యానికి చక్రవర్తులై
    ధనాగారాలను ఎవరెస్టు శికరమంత ఎత్తున కట్టించారు
    బియ్యంలోకల్తీ
    బిస్కెట్ లో కల్తీ
    తూనికలో కల్తీ
    తయారీలో కల్తీ
    పండ్లు కల్తీ
    పాలు కల్తీ
    పండ్లుతోమే బ్రష్ కలితీ
    పాలు తాగె పీక కలితీ
    విత్తు కల్తీ
    చివరకుచిత్తంకూడా కల్తీ
    కల్తీ, కల్తీ, కల్తీ ఎటుచూసిన కల్తీ
    రాళ్ళ యుగందాటి రాకెట్టు యుగమొచ్చిన
    పీల్చు గాలినే కలుషిత పరచే ప్రబుద్దుల కాలమొచ్చే
    దోపిడీల తీరుమారే
    మెరుగుల ఆకర్షణలో
    ఆఫర్ల జోరుపెరిగె
    స్వచ్చత లోపించే
    నకిలీ గేలాలకు
    ప్రాణాలు నిలబెట్టే మందులు కూడా చిక్కే
    అసలేదో నకిలేదో తెలియని తికమకలు
    అవసర సమయంలో దొరికెననేసంతృప్తి
    దోచుకొనేవాడికదేతిరుగులేని బ్రహ్మాస్త్రం
    వినియోగ దారుడా విఙ్ఙప్తి
    పరిశీలించు isi ముద్రను
    చదువు కవరుపైనున్నట్టి చివరితేది
    నాణ్యత లోపమైన నోరుమూసుకూరుకోక
    న్యాయంకై పోరాడు
    నకిలీ పని పట్టు


    ReplyDelete

Post a Comment