మా ఊర్లో (కూనూరులో)గ్రంథాలయం

*మా వూర్లో (కూనూరులో) గ్రంథాలయం*

యాదాద్రి జిల్లా భువనగిరి మండలం కూనూరు మా స్వస్థలం.  ఇటీవలే గ్రామ యువతకు గ్రంథాలయ ఆవశ్యకత గురించి తెలియజేయగా వారు ముందుకు వచ్చారు.

అతిత్వరలో మా ఊర్లో గ్రంథాలయం పునరుద్దరణ జరుగబోతోంది అని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను.

ఈ విషయమై మా జిల్లాకు చెందిన సాహితీ పెద్దలు మన యాదాద్రి జిల్లాకు చెందిన ఇద్దరు వయోవృద్ద కవులు ఆచార్య కూరెళ్ళ విఠలాచార్య గారు ఆలేరుకు చెందిన శ్రీ తిరునగరి గారు ఎంతో సంతొషించి మా గ్రంథాలయం కోసం చెరో వంద పుస్తకాలు ఇస్తామని చెప్పడం జరిగింది...

సాహితీ మిత్రులారా... మీ సహకారం కూడా కోరుతున్నాను...

మావూరి గ్రంథాలయం కోసం మీవంతు సాహితీ సహకారం కోరుతున్నాను... పుస్తక బిక్ష చేపడుతున్నాను.

మీ సాహితీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.

మీ
సాహితీ మిత్రుడు
గోగులపాటి కృష్ణమోహన్
వ్యవస్థాపకుడు, తెలుగు కవన వేదిక
9700007653

















Comments