పొగాకు మానేద్దాం


మే 31న అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం...

కావున కవులందరూ పొగాకు వ్యతిరేకంగా కలాలను కదిలిద్దాం...

అంశం‌: పొగాకు మానేద్దాం...

[5/28, 11:41 AM] Poet Musthakheem విన్నర్: అంశం : పొగాకు -వ్యతిరేకం
తేది :28-05-2018
శీర్షిక : ధూమ పానం
రచన : విన్నర్ (Mohd .Mustakheem )
ph.no.9705235385.


ఓ ..ధూమపాన ..ప్రియుడా

ధూమపానం ..తీస్తుంది నీ పానం ..??
మెల్లి మెల్లిగా ..దుర్భరం అవుతుంది ..నీ జీవనం ..??
పూట పూటకు ..గడియ గడియ కూ ..ఒక్కటే ఊదుతుంటావు ..
నీ బతుకుని సైతం పొగ పెడుతూ  గ్రహించ లేకున్నావు ..

సిగరెట్ , బీడీ , చుట్ట లో వున్నది .."నికోటిన్" విష రసాయనం వున్న పొగాకు అన్నది ..యెప్పుడైనా ఆలోచించావా ..?

"ఊపిరి తిత్తుల క్యాన్సర్ "..నీ
ఊపిరిని తీయడానికే ..పొగాకు
రక్కసి రూపంలో వచ్చిందని ..
ఇప్పుడైనా ..గ్రహించి మానేస్తావో ..లేదో చావే కొని  తెచ్చుకుంటావో చెప్పు మహానుభావా ..??

"బహిరంగ ధూమ పాన నిషేధం" చట్టంపెట్టినా ..నిన్ను
కట్టడి చేయడం సాధ్యం కావడం లేదు .

నీవు ఊదే పొగ వల్ల నీకే కాదు ..పక్క వారిని
ఇష్టం లేనివారిని ఇబ్బంది పెడుతున్నావు ..బస్సులో ..
బస్తాండు లో ..మార్కెట్ లో ..బజార్లో ..అన్నీ చోట్లా ..ఓ
*పొగరాయుడు* నీ పీడ యెక్కువైంది ..!!

కుటుంబం కోసమన్నా ..
సమాజ హితం కోసమన్నా ..
*పొగాకు* ఉత్పత్తులు - సిగరెట్ , బీడీ , చుట్ట , గుట్కా , ఖైనీ ..వగైరా వదులు నాయనా ..??!! నీ కంపును భరించడం మా వల్ల కాదయా ..!?

రచన : *విన్నర్* ,కొల్లాపూర్
ph .no.9705235385.
[5/30, 7:46 AM] కృష్ణమోహన్ గోగులపాటి: శీర్షిక: పొగాకును తగలేద్దాం
మే  31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా....

రచన : గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.

పొగాకు తగలేద్దాం
పోరాటం మొదలెడదాం

గుట్కవేసి ఒకడు
జర్ధతింటు ఇంకొకడు..

తంబాకు తింటొకడు
పాన్ పరాగంటొకడు

సిగిరెట్టు, బీడీలు
గంట చుట్టలుతాగి

పొగాకునందరూ
పొట్టనెట్టుకుంటూ...

జీవితాన్ని మీరు
తగలబెట్టుతుండ్రు....

సినిమాకు ముందర
ఎన్ని సూపించినా...

పేపర్ల వార్తలు
ఎన్ని రాసేసినా....

మారదూ ఈ యువ
మారదూ ఈ ప్రజ....

నోట్ల పుట్టు కంపు
వారికెంతొ యింపు

పక్కవాడికి పుట్టు
వెగటు కంపు....

నోట్ల తూట్లు పడ్డ
కడుపులో క్యాన్సరై

మాయరోగాలొచ్చి
మాయమై పోయినా....

మారదూ ఈ యువ
మారదూ ఈ ప్రజ....

నీ యింటి ఇల్లాలు
నీ కంటి పాపలూ....

నీ తల్లి దండ్రులూ...
నీ తోబుట్టువులు....

నీ బందుమిత్రులూ
చుట్టుప్రక్కల వారు

ఛీఛీ లు కొట్టినా....
దూరంబుబెట్టినా....

మారదూ ఈ యువ
మారదూ ఈ ప్రజ....

క్యాన్సర్ కారకం
ప్రమాదహెచ్చరికలు

పొగాకు ఉత్పత్తి
పైన రాసే ఉంది...

దానిని చూసైనా
రోగాలు చూసైనా....

నీవారి కోసమూ
నీ రక్ష కోసమూ...

మారాలి ఈ యువత
మారాలి యీ ప్రజా...

మీరు కాలుస్తుంది ప్రత్యక్షంగా పొగాకే...
కానీ పరోక్షంగా అది ధనమని మరవకండి....
అందుకే.....
పొగాకు తినడం/తాగడం మానండి....
మీరు... మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా చూసుకోండి....

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653
[5/30, 10:50 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: పోతావ్ ...


చెప్పాలనుకుంటా
ఎంతలా అనుకున్నా చెప్పలేకపోతా.. అందుకే
ప్రియమైన నీకు..
అక్షరాలను ఏరి మాలగా కుచ్చి నీకై పంపుతున్నా ఈలేఖ..

డస్ట్ బిన్ ని చేయక
నీ పెదాల పదాలై నన్నల్లుకుంటాయని ఆశతో...

గుప్పుగుప్పుమంటూ రింగులురింగులుగా గాలిలో నాట్యమాడిపిస్తావుకదా
అదేమన్నా నీ మొదటి ప్రియురాలా..!
నన్నైనా వదిలుంటావు కానీ
నిమిషం కూడా వదలకుండా ఆ మాయదారి సిగార్ ని వెంటేసుకునీ తిరుగుతావ్..

చేతి చమురునొదిలిస్తూ
నీగుండెలో మంటను రగిలిస్తుంటే
పెదాలతో ముద్దాడుతూ
యాష్ ట్రే ను హత్తుకుంటూ
చురుక్కుమనిపించినా
రెండువేళ్ల మద్య ముద్దుగా ముచ్చటాడుతవ్

గుండె పై జేబులో దానిబరువుని మోస్తూ
ఊపిరితిత్తులలో దాని ప్రేమను దాస్తూ
గాలిలో ఊయలలూగే ఊపిరిని
ఎందరికీ పంచుతావ్...

క్యాన్సర్ , నోటి క్యాన్సర్ ,
లంగ్ ఇన్ఫెక్షనంటూ
పొగాకు పరాకుగా ప్రాణాన్ని పణంగా పెడుతుంటే..
రోజు రోజు కి భూమిపై నూకలు తగ్గిపోయి
నీలెక్క క్లియరైతే నిన్ను నమ్ముకున్న
నేనేమికావాలి..?

పొగాకు వ్యతిరేక దినమచ్చి
నన్ను తాగకు, తినకు,
పోతావ్ అంటుంటే
మారిక..
ఇప్పటికైనా నీకై పరితపించేవారిని చూడిక..


@సిరిమల్లెలు...
పాలకుర్తి నాగజ్యోతి
[5/31, 11:09 AM] Poet Pudathu Bhaskar: ****పొగాకు వదిలెయ్****
-----------********-------------
పొగాకు నరకానికి తొలి మెట్టు
నరుడా పీల్చకు ఊపిరి ఆగేట్టు

పొగాకులోని నికోటిన్ నిన్ను నిలువునా కాల్చు
నిజం తెలుసుకొని దాన్ని నీవు విరమించు

పొగను పీల్చి పోగొట్టుకోకు నీప్రాణం
ఆ పొగే నీ కుటుంబానికి తలపెట్టు దారుణం

ఆనందంతో గింగిరీలు తిప్పుతూ పీల్చేపొగ
అదే నీ నాశనానికి గిరగిర వేయు పాగ

అతి సున్నితమైన శ్వాసకోశ నాళాలకు
ఎక్కించకు విషపుగాలి వాయుగోళాలకు

నివారించలేని రోగాలకు అదే మూలం
అది తెలుసుకొని నడిచిన నీ జీవితం ధన్యం

పొగాకుకు బానిసవైతే జీవితం కొడిగట్టు
అది చివరకు నాశనానికి దారి చూపెట్టు

అందుకే నిజం తెలుసుకొని పొగను వదిలి పెట్టు
అందమైన జీవితాన్ని హాయిగా చేపట్టు.  !!!!

********రచన*******
పూదత్తు భాస్కర్
ఎస్.ఎ. తెలుగు
జోగులాంబ గద్వాల.
[5/31, 11:37 AM] ‪+91 99085 60246‬: 🌹 🍀🌹 🍀 🌹
       

 కవితా శీర్షిక : చుట్ట సింగారం
     


నిగనిగలాడే సిగరెట్  అందము                             చూసి చిత్తైపోతారెందుకు  ఆశ           
ఒక్కసారిగా ఉరకలెత్తిస్తుందా                                   
మోసపోకండి అది నీ ఆట కట్టించును....                   

గుప్పుగుప్పు మంటూ రింగురింగులు     
పొగను గగన మంతా పాకేలా వయ్యారిని
నాట్యమాడిస్తూ వదులుతావెందుకు
ఊపిరందక ఊపిరి తిత్తులు ఉడుకుతున్నా
పట్టక పల్టీలు కొడుతోంది  ప్రాణం......

పొగాకు రక్కసి పోరాడి పోరాడి  నీ వెముకలను
గుళ్ళ చేసి క్యాన్సర్లు పుట్టించి కడతేర్చి
కాటికంపుతుంది  కళ్ళు తెరవండి

అందమైన జీవితాన్ని  ఆహ్లాదభరితం
చేసుకోడానికి  ఆరాట ముండదు       
ఆవేశమొచ్చినా  ఆకలేసినా  గుప్పుమనిపిస్తారు
 కన్ను మిన్ను కానక  ఇష్టానుసారమైన లోచనతో

ఇహపరాలు మరచి ఇరుకున పడి
అర్థాంతరంగా ఆరిపోతారెందుకు 
నేను "చుట్టను సింగారం"     
సిత్రంగా ఉన్న  మీ జీవితాలను  చితిమంటల్లో
కలుపుతాను  కాసుకోండి  జర......   

నన్ను విడవండి విడచి విపృలవ్వండి.......


ఎ : భాగ్యచంద్రిక
ఉపధ్యాయురాలు (తెలుగు)
దుప్పల్లి


🌷🍀🌷🍀🌷🍀🌷🍀
[5/31, 11:52 AM] Poet Padma Tripurari: పొగాకు మానుకో
భవిష్యత్తు దిద్దుకో
*****************
ఆనందంలో తేలినట్టు
అనంత శక్తే నీదయినట్టు
అపూర్వలోకం నీ ముందున్నట్టు
అవని అద్భుతమే నీవయినట్టు
అపురూపమనిపించే ధూమపానం
ఆరోగ్యవినాశకరం అని తెలుసుకోలేవా యువతా,జనతా!
తెలిసినా తుంచుకుంటున్నావా నీ భవిత.

తెలిసీ తెలియని  నీకు తెలుసు
పొగాకు నీ జీవిత నౌక మునుగుటకు
నీలోని శక్తి దిగజారుటకు
నీవారిని నీకు దూరం చేయుటకు
నింగి చుక్కల దరికి చేర్చుటకు
అనారోగ్య వేదన చేరువవుటకు
అయినవారి ఆత్మ వేదనకు
నిన్ను నీవే దహించుకొనుటకు
దాహం తీరని వ్యసనానికి బానిసవుటకు
నీకు నీవే నీ బతుకు బుగ్గి చేయుటకని తెలుసు నీకు తెలుసు.
అయినా మారలేని మరమనిషివవుతున్నావని తెలుసుకో.
పొగాకు మానుకో
భవిష్యత్తు దిద్దుకో.


            పద్మ త్రిపురారి
            జనగామ
[5/31, 12:35 PM] కృష్ణమోహన్ గోగులపాటి: మణిపూసలు:-
సిగిరెట్టు తాగొద్దు
బీడీలు తాగొద్దు
పొగాకు తీసుకొని
ప్రాణాలు పోవద్దు

పానుపరాగులొద్దు
జర్ధా గుటుకాలొద్దు
పొగాకును వాడుకుంటు
క్యాన్సరు రావొద్దు

✍🏼
గోగులపాటి కృష్ణమోహన్
[5/31, 1:21 PM] పెసరు లింగన్న Poet: *"మత్తులోని గమ్మత్తు"*

బీడి,సిగరెట్,చుట్ట-బోడేదైతేనేమి?
అన్నీ తగలబెడుతున్నామనుకుంటు
తామే తగలబడి పోతారు కొందరు!

పొడుగాటి గొట్టాలను ఫోజుగాను లాగుతారు
నీరులేని మేఘాలను నీమీదికే వదులుతారు
తాము మాత్రమే చావక నిన్నుగూడ చంపుతారు!

తమాషా కొరకు తాగుతుంటారు
తమ్ముళ్లతో పాటు ఆకతాయి చెల్లెల్లూ
ఆహుతై పోతారు ఆవిరి ఆకర్షణకు!

హుషారు కొరకు ఉరుకుతుంటారు
హుక్కా సెంటర్లకు ఎంతో హుందాగా
అన్నీ కోల్పోతారు ఆఖరుకు అందంగా!

గుమ్ముగా ఉంటుందని వేస్తారు గుట్కా
గుట్టుగా మనక్కూడా చెప్తారు చిట్కా
మనశ్శాంతికి మందని కొడ్తారు మస్కా!

పసందైన పాన్ పరాగ్,పాన్ మసాలా
ఆశిఖీ,విమల్,మాణిక్ చంద్,జోడాబైల్,
రాజాఖైనీ-అన్నీ చేసేవే నిన్ను ఖూనీ!

ఊపిరితిత్తులే కాదు,నోరు-దంతాలు
గొంతు ఒక్కటే కాదు,కళ్ళూ-చెవులు
గుండె ఒక్కటే కాదు,మెదడూ గాయబ్.!!
         ———###———              (పొగాకు వ్యతిరేకదినం సందర్భంగా)
       ----పెసరు లింగారెడ్డి
[5/31, 3:02 PM] ‪+91 97053 84510‬: " మేలుకో మానవుడా"

ప్రజలకు ధూమపానం వద్దంటుంది
ప్రభుత్వం పొగాకు పంటకు
పర్మీషన్ ఇస్తుంది,
సిగరెట్ పెట్టె ప్రమాదం అని
వ్రాసి అమ్ముతుంది కంపనీ,
సిగరెట్టు నీ జీవితాన్ని,
నలిపేస్తానని చెపుతుంది,
అయినా నీవు దాన్ని
వెలిగిస్తూనే ఉన్నావు,
నీవు ఆనందం కోసం
కాలుస్తున్నావో
అనారోగ్యం కోసం
కాలుస్తున్నావో
నాకు తెలియదు,
నీవు విఙ్నానినని
అంటున్నావు,
అఙ్నానపు పనులు
చేస్తున్నావు,
అందరూ సిగరెట్
కాల్చకపోతే
పండించిన పొగాకును
ఏంచేయాలనెదె నీప్రశ్న,
ఈ అనంత సృష్టి శాసన
కర్తవు నీవు,
నీకు ఏది శ్రేయమో
దాన్ని సృష్టించాలి,
కాని నాగరికత పేరుతో
నీకు ఏది ప్రియమో దాన్ని
సృష్టిస్తున్నావు,
నీవు మనిషివి కాదు
మహా*మనీషివి*
నేడు కనిపించే ఏవస్తువైనా
నీ సృష్టే,
కాని దేదొ ఒకటి చెప్పు,
నాయకులను నమ్మొద్దు
ఒకపక్క వద్దంటారు
ఒకపక్క తయారు చేస్తారు,
నన్ను నమ్ము
నీ శ్రేయోభిలాషిని
చెడును మానుకో!
మంచినలవరచుకో!
*మనీషి మేలుకో*
ఈశ్వర్ రెడ్డి ఊర!
[5/31, 3:48 PM] ‪+91 98853 80371‬: పొగాకు గుప్పిట్లో పొగరాయుడు హతం
---------------------------------------
     ...✒బింగిదొడ్డి వెంకటేష్,
      చారవాణి:9885380371.
     ------------------------------------
తెలియని వయసులో
పొయ్యిలో మండుతున్న
కట్టెపుల్లను నోట్లోబెట్టి
పొగను పీల్చినప్పుడు...

కాల్చేసిన బీడీలను
భయం భయంగా ఏరుకొని
పొదలచాటున పోగేసి
దొంగచాటుగా పీల్చినప్పుడు...

జతగాళ్లంతా గుమిగూడి
చిల్లరంతా జమచేసి
పెద్దగోల్డు సిగరెట్టును
పంచుకొని పీల్చినప్పుడు...

తెలివొచ్చిన వయస్సులో
అదో పెద్ద రాజభోగంలా
నిషిద్ధ ప్రాంతంలోనూ
నిస్సిగ్గుగా పీల్చినప్పుడు...

చిన్నప్పుడు తల్లిదండ్రులు గమనించలేదు
పంచుకున్నప్పుడు స్నేహితులు వారించలేదు
పెద్దైనప్పుడు సమాజం ఛీత్కరించలేదు

జీవితంలో సరదా తీర్చుకున్న కొమ్ములు తిరిగిన మొనగాన్ని
పొగాకు తన సరదా తీర్చుకుని
చావు బహుమతిని కుటుంబానికిచ్చింది.
          -------*--------
(పొగాకు వ్యతిరేక దినం సందర్భం)
కవి,జీవశాస్త్ర ఉపాధ్యాయుడు,
బింగిదొడ్డి గ్రా., ఐజ మం.,
జోగులాంబ గద్వాల జిల్లా.
💐💐💐💐💐💐💐💐
[5/31, 8:40 PM] Poet Kusumanchi Sridevi: 🔥దహనమైపోతున్న జీవితాలు🔥
------------------------------------
ఎంతకని కాలుస్తావు
జీవితాన్ని దహనం
చేసుకుంటూ!
అనురాగా పరిమళాలు
వెదజల్లే తియ్యని
అనుబంధాలను దూరం
చేసుకుని!
లోకాన్ని కాలుష్యం
చేస్తూ!
నీ జీవితాన్ని
నాశనం చేసే మత్తుకి
బానిసై కాలుస్తావు!

కళ్ళు తెరిచి,
ధూమపానం మత్తు
విడిచి...
నీ భవిష్యత్ కి ఆరోగ్యకర
పూల బాట వేయు!

లేనిచో కేన్సరనే
శత్రువు నీ
ఒంటికి పిలవని
పేరంటకమై వచ్చి!
నిన్ను నిలువెల్లా
దహించి!
నీ కుటుంబాన్ని
రోడ్డు పాలు చేస్తుంది!

ఓ క్షణం ఆలోచించు!
పూలబాటా!
ముళ్ల బాటా!
రేపటి జీవితం కోసం?

🖋శ్రీదేవి సురేష్ కుసుమంచి🖋
[6/1, 11:15 PM] Manne Lalitha: 7416863289.
మన్నె(పిన్నక)లలిత.
శీర్షిక:పొగాకును తగలేద్దాం.
మే 31...పొగాకు వ్యతిరేక దినొేత్సవ సందర్భంగా🥀××××××××××××××××
పొగనిచ్చే ఆకు పొగాకు
పొమ్మనలేక పొగబెట్టారని....
పొగను ఎంతసేపు భరించగలం?
  చుట్టకంపునెంతసేపు భరిస్తాం?
సిగార్ ను ఎంతసేపు
ద వడలు నొప్పిపుట్టేలాపీల్చగలం?
సిగరెట్ ను ఉఫ్ మంటుా ఊదేసినా ప్రాణాలనుా అలాగే ఊదేసి
బ్రతుకు బండలు చేస్తాయి
"పొగతాగనివాడు దున్నపొేతై పుట్టున్"
ఒకప్పటిలొేకొేక్తి.
"పొగతాగినవాడుఊరికి ఉత్తరాన చేరున్"నేటి
లలితొేక్తి.
భలేభలే సిగరెట్...అంటుా
నాసికారంధ్రాల పొగగొట్టాలద్వారా
నొేటిలొేనుడి ఊది మేఘాలు సృష్టించి వలయాలుపంపుతుా
ఆ వలయాలు నీ ప్రాణానికి విషవాయువులని ఎరుగక
విషనాగులాంటి పొగాకుకు ఎరయై
నొేటికేన్సర్..పేగు కేన్సర్....ఊపిరితిత్తుల ఊపిరి తీసి
మానవ మనుగడకే
సమాధికట్టి విశృంఖలంగావిహరిస్తున్న పొగాకులొేని విషాన్ని గుర్తించి
పొగాకును పాతిపెట్టేద్దాం
పండగ చేసుకుదాం.పండుగ చేసుకుందాం...
×××మన్నె(పిన్నక)లలిత××××🌷🌿🌷

[6/2, 4:22 PM] Poet Mastan Vali: మే  31న  పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా
                 ఈ  కవిత....
    అంశం  :  పొగాకు మానేద్దాం
    రచన  :  షేక్. మస్తాన్ వలి.

     🕵🏼‍♂❌♨  🚯 🚫🤺 🌯 ⛄💅🏻 ❌🕵🏼‍♂

      బీడీ, చుట్ట  బందు చేయరా
      బాడీ కంట   విందే  నంటరా

     కంతలు,గుంటలు గుండెల్లో న
     కాయం లోన మంటల గంటలు
    వింత వింత రోగాలు
     పసి ప్రాయం లోన

    బీడీ, చుట్ట వదలకపోతే
   బాడీ కంట బేజారంట

      సిగరెట్ దమ్ము పీకకూ
      కసి గట్టి ,నీ .. దుమ్ము  దులుపును

        పొగ త్రాగని వాడు
       దున్నపోతై పుట్టును రా
       అని పలికించారు గిరీశం చేతరా
       గురజాడ వారు ఆ నాటి నాటకమందు రా
      అది వింటానికి చాలా పసందుగా నుండు రా

      నిజ జీవితమందు  ధూమపానం
     నీ  ప్రాణానికే అపాయం

     సరదాగా నూ ఒక సారి దమ్ము కొడితే
     ఊపిరితిత్తులు  వుడికి పోవును

      గొంతు క్యాన్సర్,
      నోటి పూతలు
      నిను ఆవరించునూ
     నీతో కాపురముండును

    నీ ... కోటి విలువ గల
    ఆయు వేంద్రియాలు
 
    ని "కోటి"న్  తో ఆయువు తీరి
    అంతమవును రా

   దమ్మే పీకితే  సొమ్ము స్వాహా
   కమ్మనై నా కలలే మిగులును
    జీవితమంతా  వ్యథలే మిగులును

   అందుకే ...
    బీడీ, చుట్ట బందు చేయరా
    బాడీ కంతా విందే నంటరా

 🕵🏼‍♂❌💅🏻⛄🌹🤺🚫🚯💅🏻❌🕵🏼‍♂


           షేక్. మస్తాన్ వలి
    నవ్యాంధ్ర గీత రచయిత
    జంతుశాస్త్ర అధ్యాపకులు
   సెల్  :  99 483 57 673

Comments