బాల కార్మికులు



[6/9, 7:10 PM] కృష్ణమోహన్ గోగులపాటి: ఈ వారం అంశం

ఈ నెల 12వ తేదీన ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం....ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బడికి వెళ్లాల్సిన బాల్యం... బంధీగా మారుతుంది... కావున... బాలకార్మిక వ్యవస్పై తెలుగు కవన వేదిక కవులు తమ కలం ద్వారా కవన అస్త్రాలను సంధించి బాల కార్మిక వ్యవస్థ కూల్చేలా ప్రయత్నిద్దాం...
అంశం :-  *బాలకార్మికులు*
[6/10, 9:19 AM] కృష్ణమోహన్ గోగులపాటి: బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రత్యేకం

గోగులపాటి కృష్ణమోహన్

శీర్షిక : బలౌతున్న బాల్యం

ఇటుకలుమోస్తూ కొందరు... 
ఇనుమును కరిగిస్తూ ఇంకొందరు...
రిక్షాలాగుతు కొందరు...
బిక్షమెత్తుకొంటూ మరికొందరు...
పంక్చర్ చేస్తూ కొందరు...
పేపర్ వేస్తూ మరికొందరు....
పాలను అమ్ముతూ కొందరు....
పల్లీలమ్ముతు మరికొందరు...
ఇంటిపనిలో కొందరు....
కంపెనీలలో ఇంకొందరు....
పశువులు కాస్తూ కొందరు...
కలుపులు తీస్తూ ఇంకొందరు...
పాలిష్ చేస్తూ కొందరు..
పెయింట్ వేస్తూ ఇంకొందరు...
అన్నం లేక కొందరు...
ఆటలు తెలియక ఇంకొందరు...
బాల్యం చితికి కొందరు....
బాద్యత తెలిసి ఇంకొందరు...
దవాఖానలో, దర్భారులో...
చాయ్ దుఖానం.... పాన్ షాపులో
కల్లు కొట్టులో... కిల్లీ కొట్టులో
సార బట్టిలో.....వైన్స్ షాపులో.... 
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో.... ఇరానీ హోటల్లో...
మంగళి షాపులో, కిరాణ కొట్టులో
ఎక్కడ చూసిన బాల్యం బాల్యం...
బలౌతున్న బాల్యం....
భాద్యతమరచిన పెద్దలు.....
బందీగా మారిన బాల్యం.......
ఈ పాపం ఎవరిది....
ఈ శాపం ఎవరికి.....
బాల్యాన్ని బలిపశువులుగా...
 చేయకుండా కాపాడలేమా....
పసి బాల్యం బలౌవ్వాల్సిందేనా????
ఆలోచించండి..... ఆసరా ఇవ్వండి...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్‌ జర్నలిస్టు
9700007653
[6/10, 12:50 PM] Poet Thirupathi Rao: బాలకార్మిక లు జీవితం
హీనమైన హేయమైన గాయమైన భావిభారతజీవితం
కామాంధులు వదిలేసిన చిదిమేసిన అనాధలు
రోడ్డుపై విసిరేసిన ఎంగిలి విస్తరాకులు
విధిరాతకు బలిరాతలు
ఎవరు పట్టించుకోని బాలకార్మిక లు
చిత్తుకాగితాలు ఏరుకుంటూ
చినుకుపోయిన బతుకులు ఈడ్చుకుంటూ
బతుకు బండిని మోస్తూ
బ్రతుకు కోసం
మెతుకుకోసం
జీవితపోరాటం
ఆకలితో ఆరాటం
బాలకార్మికు లుగా చాలీచాల నీ జీతంతో
వెట్టిచాకిరి చేస్తూ విధిని వెక్కిరిస్తున్న అనాధగాలిగాళ్లు
భావిభారతపౌరులు
నిలువ నీడలేని వారసులు
ఆదరణ కరువైన బాలలు
దేవుని బిడ్డలు
బాలకార్మిక లను నిర్మూలిద్దాం
వారిజీవితాలను స్వర్ణమయం చేద్దాం

🌹సహస్రకవిరత్న🌹
సాసుబిల్లి తిరుమల తిరుపతి రావు
ఉపాద్యాయులు
కామారెడ్డి
తెలంగాణ
[6/10, 10:37 PM] Poet Musthakheem విన్నర్: అంశం :  *బాల కార్మికులు*
శీర్షిక :  *ఓరి ..పిల్ల గాడ*
కవి :  *విన్నర్*
తేది: 10-06_2018

ఇదేంటి ..ఓరి పిల్ల గాడ..
యాడ ఉన్నావ్ నీవు ..?
ఇదేంటి ..బరువులు మోసే 
కూలీవైనావ..?
హోటల్ లో ..యెంగిలి ప్లేట్లు 
కడుగుతున్నావ..??
కిరాణా షాపుల్లో ..పనికి 
కుదిరావ ..??
ఇళ్ళల్లో ..పనిజేస్తుఁనావ..??
ఇదేంటి ..అడవుల పోటి తిరుగుతూ ..గొఱ్ఱెలు -బర్రెలు 
మేపుతున్నావ ..??
పెద్దలు చెసే ..పనులన్నీ నీవు 
చేస్తున్నావు ..??
ఇంక మీసాలు కూడ మొలవనూ ..లేదు ..
*పేద్ద ..పేద్ద పనులు జేస్తున్నవ్*

బడిని యెప్పుడో ..మర్చి పోయావ్ ..??
చదువూ - సంధ్యలు ..లేనట్లు ..
చదువు కోవడం హక్కు కాదన్నట్లు .. *పనిలో కుదిరావు*
*పెద్దలు పనికి , పిల్లలు  బడికి* అనే సర్కారు మాట 
నీకు తెలుసునా ..ఓరి పిల్ల గాడ..??
నిన్ను పనిలో పెట్టుకున్నోళ్ళు ..
జైలు పాలు ..
*బాల కార్మికం*  అరిష్టం ..
పాప కార్యం ..అనైతికం ..
అన్యాయం ..బాలల హక్కులు 
కాల రాయడం ..
*బడిలో చేరడం ...విద్య నభ్యసించడం ..పిల్ల గాళ్ళ హక్కు* 
దీన్ని కాదని .. *బాల కార్మికుడు* ని తయారు చేయడం ..నేరం 

*బాల కార్మిక వ్యవస్థ ను వ్యతిరేకిస్తూ* ..

   రచన : *విన్నర్*(ముహమ్మద్ ముస్తఖీమ్)
కొల్లాపూర్ .
ph no .9705235385.
☝☝☝☝☝☝☝☝
[6/11, 5:08 PM] Poet Srinivas Chiluka సివిశ్రీ, జిరసం: *జూన్ 12* 
(బాలకార్మికవ్యవస్థ నిర్మూలనా
 దినోత్సవం సందర్భముగా)

*శీర్షిక*.......బాల కార్మికుడు

*రచన*... సి.వి.శ్రీనివాస్

న్యూస్ పేపర్ !
పతాక శీర్షికలో...
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనం!
ఆ పేపర్ తెచ్చేది బాలకార్మికుడే!!

పాలకులు సృష్టించిన
దారిద్య్రరేఖావృక్ష ఫలాలే
అనాదలు,అభాగ్యులు
బాలకార్మికులు!
ఆరవ పంచభూతమైన
ఆకలికి వారసులు!
బాల్యం నుండే జీవన కావ్యాలు
లిఖిస్తున్న బాలకార్మిక కవులు!!

బాల్యం అమూల్యం!
మొదట అమ్మఒడిలో
బడిలో ఆటపాటలతో 
భవితకు పూలబాటలేసే వయసులో 
నరక కూపాలలో బాల్యం!
పసి బతుకులు ఛిద్రం!
బాలకార్మికుల జీవితం!!

పొట్ట తిప్పల పుస్తకాలు,
ఆకలి కేకల కావ్యాలు
భుజంపై వేసుకుని 
పనికోసం వెళ్లే అభాగ్యులు!
ఎవ్వరూ చేయలేని 
అందరూ విడిచిపెట్టిన పనులే
వీరికి ఆధారం!
వీళ్ళెంత అపరిశుభ్రంగా ఉన్నా
అన్నింటినీ,అందరినీ
శుభ్రం చేయటే వీళ్ల ప్రత్యక్షదైవము!
 పనే వీళ్లకు బడైనా, గుడైనా!
చింపిరి దుస్తులే వీళ్ళ యూనిఫామ్!
ఏకరూప దుస్తులతో 
బాలకార్మిక బెటాలియన్!!

హోటళ్లలో,ఇళ్లల్లో
గనులలో,కార్మాగారాలలో
బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో
వీధులలో,చెత్తకుప్పలలో వీళ్ళే!
ఇవే వీళ్ళ బడులు, గుడులు!
రోజంతా పని మస్తు,కడుపుకు పస్థులు!
తిట్లు,చీవాట్లు 
దెబ్బలు,గాయాలు
బాధలు,ఆర్తనాదాలే  
వారికి నిత్యం జరిమానాలు!!

బాలలతో పని చేయించడం
 అతిహేయం' నేరం !
పాలకులు, ప్రజలందరూ కలిసి
ఈ అమానవీయ వ్యవస్థను నిర్మూలిద్దాం!
పనికెందుకు తొందర
చదువే ముందర!
బడి ఈడు పిల్లలని బడిలో చేరుద్దాం!
బంగరు భవితకు బాటలు వేద్దాం!!
నిన్నటి బాలకార్మికులే
నేటి  బడిపిల్లలు!
ఉదయిస్తున్న సూర్యులు!
భావి భారత పౌరులు!!


....  *సీవీశ్రీ*
    9985809434
[6/11, 8:04 PM] ‪+91 96422 61673‬: శ్రీమతి  విజయలక్ష్మి నంద్యాల
స.క.న. 2401/233
అంశము      బాలకార్మికుల విమోచన దినోత్సవము
పలకా బలపము పక్కనపెట్టి
బరువు బాధ్యత తలపైమోస్తూ
జీవనభృతికై శ్రమించే
బాలకార్మికులు
పరిస్తితులకు బానిసలు

ప్రత్న్యమ్నాయాలకై
స్పందించనిసేవాసంఘాలు
సమస్యను భూతద్దములో
చూసి నిట్టూర్పు విడిచే
ప్రజల సానుభూతి
అక్కరకురాని పథకాలు
అందుబాటులోలేని చట్టాలు
పరిష్కారదిశలోవైఫల్యాలే

హక్కులపై సదవగాహన
వ్య్వవస్థ నిర్మూలనకై కృషి
ప్రేమించే స్వచ్చమైన హౄదయాలు
కలగలిపి  అడుగులు పడిన రోజే
బాలకార్మికులకు పండగరోజు
అదే  విమోచనదినోత్సవం
[6/12, 8:14 AM] 334455 Poet Murthy Sreedevi: మూర్తి శ్రీదేవి 
శీర్షిక :  కార్మికులం

బాల కార్మికులమే మేము
కొందరికి కన్నవారు వుండి
కొందరికి ఎవరూ లేక
పనికి బానిసయ్యాము 
అమ్మానాన్నల కష్టాలు
కడుపులో ఆకలి కేకలు
నోట్లోకి ఐదు వేళ్ళు పోక
ఒంటి మీద సరైన బట్ట లేక 
గుండె తరుక్కుపోతుంటే 
గోరుముద్దలు తినిపించే కన్నవారు దూరమై వీధిన 
పడ్డ మా జీవితాలను  ఆదరించే దిక్కు దొరకక
ఆ రవి చంద్రులే తోడు 
ఎండా వానలకు గొడుగు
నిచ్చే అయినవారు లేక
త్యాగ తరువులే మాకు 
తోబుట్టువులు అయ్యిరి
పలకాబలపం పట్టాల్సిన 
మా బుల్లి హస్తాలు కమిలి
కన్నీళ్ల కడలి అయ్యాయి
చెడ్డ తల్లి ఉండని మన
లోకంలో మాకు ఈ దుష్ట
జన్మకు కారణం ఎవరో
తెలియక , మార్పుకు దారి
గోచరించక ఇంత ముద్ద
దొరకక ఎన్నాళ్ళు ఈ పని
చేయాలో అర్థం గాక మేము
పడే అవస్థ ఆదేవుడు కని
మము కాపాడే కాలం
కోసం ఎదురుచూస్తున్నాము
పట్టు పరువుల మీద పవ
లించే శ్రీమంతులు ఒక్కసారి
మాపై దృష్టి పెట్టి ఇంత సాయం చేసిన... మేము 
జన్మ జన్మల ఋణపడి
ఉంటాము, కలకాలం
తలచుకుంటాము
[6/12, 10:51 AM] ‪+91 99085 60246‬: జూన్  12
అంశము  : బాలకార్మిక  విమోచన దినోత్సవం


శీర్షిక  :  కన్నీటి  బ్రతుకులు


మాచిట్టి  సేతులు  సక్కని  రాతలు రాయ నోచుకోలేదు  బాలకార్మికులం పనికి మేం బానిసలం
ఆదరించే వారు లేక  కాలంతో పరుగుపెడుతూ
 భుజాన  బరువులు మోస్తూ తెరంగేట్రం చేస్తాం
వీధిన పడ్డాం  బాలకార్మిక  చిరునామా తో


పలకా  బలపం పట్టి  బుడిబుడి  అడుగులు వేస్తూ
బడి బాట  పట్టాల్సిన  బాల్యం లో  బరువు 
బాధ్యత లతో బ్రతుకు పోరాటం సాగిస్తున్నాం
మసివారిన  మోములో మోదమంటే ఎరగనోల్లం


విచక్షణ  లేక వీధిలోకి విసిరేసిన  బాల్యం
అతుకుల  బొంతగా  మారింది                       చెట్టుచేమ  చెత్తకుప్పలు  స్నేహితులైరి
చీదరించుకోవడాలు  చివాట్లు  గదమాయింపులు 
ఈ సమాజంలో  లభించిన  అవార్డులు


ఎండావాన  ఆకలిదప్పులతో  వేకువ నే
ప్రపంచంలో తొలి అడుగులు   మావే             బలౌతున్న   మా  బాల్యం                  విలాసవంతులకు విస్తరి అయింది
 చట్టాలు తెల్ల కాగితం పై  మము హేళన చేస్తూ  
మురిసిపోతుంది .......
బాలకార్మికుల జీవితాలను  రంగులమయం 
చేసే తీరు రాలేదు.......




పేరు :  ఎ .  భాగ్యచంద్రిక
ఉపాధ్యాయురాలు (తెలుగు)
      దుప్పల్లి


  🌹 🌲 🌹 🌲 🌹
[6/12, 2:02 PM] Poet MMJRS Sravan2: ####  "వేకువ కోసం ఎదురు చూస్తున్న బాల కార్మి కు లు. "
________________________
వాళ్లు.....
పేదరిక పు అప్పు కాగితా ల్లో ని
'అంకె లని' మో స్తున్న బాలఏసు లు.
వాళ్లు.....
అమ్మయ్య లకు బరువై
అగ్గువ కొచ్చిన  పనోళ్లు.
వాళ్లు..... 
పల కా, బలపం  ఎరగని
 ఖార్ఖానా లో పనిముట్లు
 వాళ్లు.....
చిత్తు కాగితాలలో
'బతుకు' ను వెతుక్కుంటున్న
అభాగ్యజీవులు.
వాళ్లు.....
తాము చేస్తున్న పనికి
కూలీగా తిట్లు, దండనలు
పొందుతున్న వాళ్లు.
వాళ్లు.....
'శివ కాశీ టపాసులలొ'
బాల్యాన్ని  బలి పెడుతున్నవాళ్లు.
వాళ్లకు.....
పేవు మెంట్లు, పార్కులేఆస్తులు. 
చిరిగిన చింపులే దుస్తులు.
పూట గడవక రోజూ పస్తులు.
వాళ్లు.....
ఆట పాటలు, చదువు సంధ్యలు  ఎరగని అమాయకజీవులు. 
వాళ్లేవరో కాదు.
మన చుట్టూ ఉన్నవాళ్లు.
చట్టాలెన్నున్నా,
బతుకు చట్రంలొ
బాల్యం బలి పెడుతున్న
బాల కార్మికులు.
వాళ్ల కోసం మనమంతా
ప్రతిన బూనుదాం. 
బాల కార్మిక వ్యవస్థను
నిర్మూలిదాo.
[6/12, 2:13 PM] Poet Malla Reddy Leklala Bngr: బాల కార్మికుల గురించిమీఆవేదన
బాగుంది. గత కాలం కంటే ప్రస్తుత
సామాజిక మార్పులు చూస్తుంటే 
మనం ఆశిస్తున్న మార్పు రావచ్చనే
ఆశ కలుగుతుంది. కవులు మేధా
వులు కవయిత్రులు ముందుకు 
సాగిపోతూనే వుండాలే. బాలకార్మి
కుల జీవితాల్లోకి వేకువస్తుంది. 
  ~లెక్కలమల్లారెడ్డి వి. హిం. పం. 
           సైదాపురం  యాదాద్రి
[6/18, 10:28 PM] Poet Kusumanchi Sridevi: 🙇🏾‍♀బాలకార్మికులు🙇‍♂
---------------------
వాళ్ళేమి చేసారు పాపం
అమ్మ ఒడిలో
ప్రేమతో తడిసి...
నాన్న భుజాన
ఆనందంతో ఆడి..
గురువు సమక్షంలో
అక్షరం ముక్క చదివి
బాల్యమనే రెక్కలు తొడిగి
సంతోష దీవులు 
అందరిలా విహరించవల్సిన
సమయాన!

కరువు పలకరించిందనో!
కాలం కాటేసిందనో!
బాధ్యత భుజాన ఆకర్షించిందనో!

బాల్యపు ఆనందపు
లేత రెక్కలు !
ఇనుప ముక్కలై!
తనువు యంత్రమై!

ఎండకి వానకి
మానులా!
రణగొణ ధనుల
మధ్య చెవిటి
మరలా!
కష్టాలకు ఆ మనసు
కేరాఫ్ అడ్రాసై!

కందెన లేని యంత్రములా
బాల్యము అరిగి!
కాల చక్రములో తన
జీవితం తరిగి!
కష్టాల కడలికి చేరువై పోతుంది
నేటి బాలకార్మికుడి
జీవనం!

బాల్యం తిరిగిరాని
తాయిలం!
ఆ తాయిలాన్ని అందించండి
ప్రతీ బాల్యపు వయసుకి!


🖋శ్రీదేవి సురేష్ కుసుమంచి🖋

Comments