సముద్రాలు - ఉపద్రవాలు


[6/7, 7:11 PM] Poet Satya Neelima: శీర్షిక : సముధ్రాలు-ఉపధ్రవాలు

అవనిమీద లవణమున్న సాగరాలు
అవి ఎంతో మనకు ఉపయోగాలు
అలనాడు శ్రీరాముడు కట్టెను వారధి
అంబుధిపై సీతజాడ వెతకడానికి
విదేశాల నుంచి దిగుమతికి
జలయాన రవాణాలు అబివృద్ది చెందాయి
ఎన్నెన్నో ఉంటాయి సుడిగుండాలు
గర్భంలో దాగినవి నిధినిక్షేపాలు
సముధ్రాల లోతులను తెలుసుకొనుట కాదు సులభం
సకాలంలో కురుస్తాయి వర్షాలు
రైతుల పాలిట వరాలు
ఉపయోగాలు ఉన్నా కూడా
వస్తాయి ఎన్నో ఉపధ్రవాలు
నాశనమవుతాయి ఎందరివో జీవితాలు
సునామీలు,సుడిగుండాలు
ఇలా ఒకటేమిటి
తీరప్రాంతాల వారికి దినదినమూ గండమే...

             ✍..సత్యనీలిమ..
            ఉపాధ్యాయురాలు‌,
                    వనపర్తి..
[6/7, 7:32 PM] Poet Uppari Thirumalesh Sagar, Wanaparty: .శీర్షిక : సముద్రఅలల-సవ్వడి

ఎందుకో సముద్రం సంద్రం అయింది
అలల చప్పుడు రణాన్ని తలపిస్తుంది
సముద్ర కెరటాలు
రణరంగంలో తుపాకుల జోరు
రణభూమిలో పిరంగుల హోరు
సముద్రంలోని అలల తీరు

సముద్ర అలల సవ్వడి
సంద్రం పైనా
మానవసమాజం పైనా
ప్రకృతి శక్తుల పైనా
పరిపరివిదాల తపిస్తుంది నా మది

ఈ సముద్రాల హోరు
ప్లాస్టిక్ బాటిల్స్ పైనా
మనిషి వేసిన వ్యర్థాల పైనా
మానవ నాశనానికేనా
సముద్ర హోరు

తీరం అదృష్టవంతురాలే
పెద్ద కొండదన్నులా ఉంది
ఏదో ఉపద్రవం రాబోతుంది
అంటార్కిటికా కరగడం అందుకే

సముద్ర ఆగ్రహం
ప్రపంచ నాశనం
బ్రహ్మంగారి భాషణం
నిజమయ్యేనా...


రచయిత
ఉప్పరి తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
వనపర్తి
9618961384
[6/7, 7:59 PM] ‪+91 96422 61673‬: సముద్రాలు-ఉపద్రవాలు
శీర్షిక   ఉప్పొంగిన కడలి
ఉత్తుంగ తరంగాలతో సంగీతఝరి
భావయుక్తముగా చిందులు వేసినట్లు
ప్రేయసీ ప్రియుల మనోభావాలు
ఉత్తేజపరుస్తూ జనావళికి కనువిందిచెసే కడలిని చూసి
ఉప్పొంగిపోనివారెవ్వరు?
పదే పదే సాగరతీరములో గడపాలని
కోరుకోనివారెవ్వరు.

అందమైన చిత్తరువులా
దేవదేవుని  అద్భుతసృష్టికే
తలమానికమైన  సముద్రం
అంతరంగాన్ని ఎంత ప్రభావితము చేస్తుందో
అంతకు రెట్టింపు అతలాకుతలం చేస్తుంది
జనజీవనాన్ని
ఆటుపోటులతో ఆనందాన్ని పంచగలదు
అదిరిపాటుతో సంతోషాన్ని కబళించగలదు

చింతలేక తలదాచుకున్న వేనవేల
కుటుంబాలిని విషాదములో ముంచెత్తగలదు
ఏ ఘడియలోనైనా వచ్చిపడే
ఉపద్రవం
జీవకోటి ప్రశాంతజీవితాన్ని
కూకటివేళ్ళతో పెకిలించవేయగలదు
దుఖసాగరములో త్రోసివేయగలదు
[6/7, 8:01 PM] ‪+91 96422 61673‬: పేరు  శ్రీమతి విజయలక్ష్మి నంద్యాల
ఊరు  హైదరాబాదు
విశ్రాంత ఆంగ్ల జూనియర్ ఉపన్యాసకురాలు
[6/7, 10:43 PM] Poet Srinivas Chiluka సివిశ్రీ, జిరసం: *సముద్రాలు ప్రమాదాలు*

భూమిపై మూడొంతులూ నీరే!
 ఉన్నదంతా సముద్రంలోనే!
మూడొంతుల జనాభా ఉన్నది
సముద్ర తీరప్రాంతాల్లోనే !!
జలచరాలకు నివాసం సముద్రమే
సరుకుల రవాణాకు మార్గం సముద్రమే
నాగరికతలన్నీ కలిసిపోయే సముద్రంలోనే!
రాజ్యాల సంపదంతా సముద్రం పాలాయనే!
ఇంధన వనరులన్నీ సముద్రగర్భంలోనే!
భడభాజ్ఞులన్నీ సముద్రం లోపలనే!
సునామీలు పుట్టేది సముద్రం నుండే!
ఉప్పెనలా వచ్చి తీరప్రాంతాల్ని
ముంచేది ఇదే
ఇది తీరం దాటితే అంతా అల్లకల్లోలమే
జనహణనమే, మరణమృదంగమే!
తుఫానులకు మూలం సముద్రమే
ఇది విరుచుకపడేది మాత్రం
తీరందాటి సుదూరాలదాకా!
మనుషుల ప్రయాణానికి మార్గం సముద్రమే
అనేకమంది జలసమాధి అయింది సముద్రంలోనే!
నావలకు, పడవలకూ సముద్రమే వాహకం!
ముంచినా మునిగినా సముద్రమేవాటికి దిక్కు!
జాలరుల ఉదకమైనా,తిలోదకమైనా సముద్రమే!

..... *సి.వి.శ్రీనివాస్*
           మేడిపల్లి
        9985809434
[6/7, 10:45 PM] కృష్ణమోహన్ గోగులపాటి: మహా సముద్రం
రచన: గోగులపాటి కృష్ణమోహన్

మహాసముద్రం...
అలలతో హాయిని గొల్పడమే మనకు తెలుసు...
అంతరంలో ఎంత బాధుందో ఎవరికి తెలుసు...

నవమాసాలు మాత్రమే తన గర్భములో బిడ్డను మోస్తుంది తల్లి...
కలకాలం సకల భారాన్నీ తన గర్భంలో మోస్తుంది ఆ సముద్రతల్లి....

మనం వదిలే చెత్తా చెదారం... పనికిరాని పదార్ధలు
తనలోనే నిముడ్చుకొంటు ఎప్పుడూ తేటతెల్లంగా కనిపిస్తుంది

భూగోళంలో మూడొంతుల వాటా తనదే అయినా...
ఎంతో వినమ్రంగా మనకు దర్శనమిస్తుంది....

తనకు కోపమొస్తే ప్రళయమై విరుచుకు పడుతుంది
సునామీలా ప్రభంజనమై అల్లకళ్ళోలమే సృష్టిస్తుంది...

ఎన్నో జలచరాలకు తాను నిలయం..
మరెన్నో విదేశాలకు మార్గం..

అంతర్ఝాలం కూడా ఈ అంతర్ జలంనుండే వస్తుందన్నది నిజం...

ఆకాశాన్నీ భూమిని హత్తుకునేలా...
కనిపిస్తుంది ఈ మహా సంద్రం...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653
[6/8, 7:35 AM] ‪+91 94902 50989‬: *మహా సముద్రం*
***************

సకల ప్రాణి జీవరాశి
జన్మ రహస్యానికి
నాంది ఆది మధ్య
బిందువు
సాగరతీరం!

అదొక కాల గర్భంలో కలిసిన
చరితకు ఆనవాళ్ళు
అంతులేని అగాథంలో
అంతుపట్టలేని వింతలెన్నో
ఊహకందని కదిలే అలలతీరు
తరంగాల ఆటుపోటుల
 సుడిగుండంలో
ముత్యపు రాశులెన్నో!

ఎగసి పడే కెరటాలై
ఆకసాన్నంటే వేళ
భూప్రకంపానికి సిద్ధమయ్యి
బడబాగ్ని జ్వాలలన్ని
తనలోనే ఇముడ్చుకుని
నిశ్చల ప్రవాహంలో
సాగేనే కల్లోల కడలి!

ప్రకృతి ప్రళయ
స్వరూపమై
ఎల్ నినో త్సునామీలా
విజృంభించి
లక్షలాది
జనుల నాహుతి చేసి
నీలో వున్న తాపాన్ని
తీర్చుకుని
నిత్యం అంతరంగపు
అంతర్వాహినిలా
సాగే కెరటపు
సహస్ర రవి కిరణాలకు
సమస్త ప్రపంచమంతా
దాసోహం!

నీ ఒడ్డున నడవాలని
నీ ఒడిలో సేద తీరుతున్న
నీ చెంత నున్న
ఇసుక తిన్నెలలో
గూళ్ళు కట్టి
నీ పాద ముద్రలతో
పరవశించి
నీపై పయనించే
సాగర నౌకలో
అంతులేని
అనుభూతులెన్నో
కలబోసుకుని
ఆనందాశ్చర్యాలతో
కళ్ళింత చేసుకుని
చూస్తున్నా
నీలో దాగున్న
అనంత విశ్వ
పరిమాణ క్రమాన్ని
మేమింకా తెలుసుకోలేక
ప్లాస్టిక్ భూత కాలుష్యపు
కోరలతో
నీలో కల్మషాన్ని నింపుతున్న
నిరాకారులం!
నిర్వికారులం!!

*యాయవరం సంధ్యశర్మ*
*చిత్తూరు*
🌊🌊🌊🌊🌊🌊🌊🌊
[6/10, 5:39 PM] ‪+91 98853 80371‬: అంశం:సముద్రాలు-ఉపద్రవాలు
శీర్షిక:ఇట్లు.. నీ శ్రేయోభిలాషి సముద్రం

భూగోళంపై జీవం పుట్టుకకు
పురుడువోసిన తల్లిగర్భం నేను
సకల చరాచర జలచరాలకు
ఆశ్రయమిచ్చిన ఆత్మబంధువు నేను
భూతాపాన్ని నియంత్రించుటకు
ప్రతాప సూర్యుడికి శత్రువు నేను
ఋతుపవనాల గమనాలకు
గమ్యం చూపు దిక్సూచి నేను
శిలాజ ఇంధన కర్భనాలకు
చితికిపోయిన ఊపిరితిత్తి నేను
అవసరానికి ఆహారసంపదకు
ఖనిజరాశులకు ఖజానా నేను
ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన
అంతర్జాతీయ జలమార్గం నేను

నాలో ప్లాస్టిక్ చేసే వినాశకర పరిస్థితి
నీ భవిష్యత్తు పతనానికి నాంది ఇది
ప్లాస్టిక్ చెవిపుల్లను కొరికి
నోటిక్యాన్సర్ తెచ్చుకున్న నీటిగుర్రం
జెల్లీ అనుకొని ప్లాస్టిక్ సంచి మింగి
కడుపుబ్బి పగిలిన మొసలి
ప్లాస్టిక్ ధాటికి పగుళ్లిచ్చిన
జీవవైవిధ్య పగడపు దిబ్బలు
నూనెతెట్టు పేరుకుపోయి
ఊపిరాడని చేపపిల్లలు
దిక్కుతోచని శైవళాలు
దీనస్థితిలో నీలితిమింగలాలు

ఎవడురా నువ్వు
పరిణామక్రమంలో అంతిమంగా ఏర్పడిన
అల్పుడు నీవు
నేనే అంతా అని విర్రవీగితే
నీఅంతు చూస్తా
పాతాళానికి తొక్కేస్తా
నీ జలసమాధిపైనే
నూతన యుగాన్ని నిర్మిస్తా
మేలుకో
జగరూకుడవై ఏలుకో
ఇట్లు
నీ శ్రేయోభిలాషి
సముద్రం.
     -----*-----
బింగిదొడ్డి వెంకటేష్,
కవి,ఉపాధ్యాయుడు,
జోగులాంబ గద్వాల.
చరవాణి:9885380371.
💐💐💐💐💐💐💐💐

Comments