నవ తెలంగాణ


[6/2, 8:06 AM] కృష్ణమోహన్ గోగులపాటి: ఈ రోజు అనగా 2 జూన్ 2108 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం...

తెలంగాణా పునర్నిర్మాణం సందర్భంగా కవులు తమతమ కవనాల కవితా అస్త్రాలను సంధిస్తారని ఆశిస్తూ.... తెలుగు కవన వేదిక మిత్రులందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

ప్రత్యేక అంశం... "నవతెలంగాణా"
[6/2, 8:11 AM] కృష్ణమోహన్ గోగులపాటి: తెలంగాణా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు - 2018
యాదాద్రి భువనగిరి జిల్లా

కవి సమ్మేళనం 02-06-2018
జాగృతి కవితాంజలి
రవీంద్ర భారతి, హైదరాబాదు.
తేది: 09-09-2017


శీర్షిక : అమరుల సాక్షిగా
రచన : గోగులపాటి కృష్ణమోహన్

నా బాస తెలంగాణ....
నా యాస తెలంగాణ....
నా నీళ్ళు.... నా నిధులు....
నా యువకుల కొలువులకై...
పోరాటం చేశారు..
అమరులే అయ్యారు...
ఆ అమరుల సాక్షిగా....
సాధించాం తెలంగాణ ....

ఊరు బాగు కొరకు....
నా వాడ బాగుకొరకు....
కూడుకొరకు... గూడు కొరకు....
కట్టుకోను బట్ట కొరకు...
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

పదవులనే ఫణంగా...
పెట్టారు కొందరు...
సకలజనులు స్పందించి... 
సమ్మెనే చేశారు...
యువకులు, విద్యార్ధులంత
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు...
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

నిరాహార దీక్షచేసి....
నీరసంగా అయ్యిండ్రు....
తల్లిపిల్ల తేడలేక
రోడ్డు పైన ఎక్కిండ్రు...
ఉద్యోగులు.... మహిళలు...
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

మా బతుకులు మారనీకి .....
మా ఉనికి చాటనీకి....
మా గడ్డను ఏలనీకి
మా బిడ్డలు బతకనీకి
చిన్నపెద్ద తేడ లేక
పోరాటం చేశారు...
అమరులే అయ్యారు
ఆ అమరుల సాక్షిగా...
సాధించాం తెలంగాణ....

అమరులార.... అమరులార
మా త్యాగధనులారా....
మీ ఆశయసాధనలో...
మీరు అస్తమించినా....
మీ ఆశయసాధనకై....
మేము నడుం బిగిస్తాం
చేయి చేయి కలుపుతాం....
అభివృద్దిని సాధిస్తాం....

జోహార్ జోహార్
తెలంగాణా అమరులారా..
జోహార్.... జోహార్
తెలంగాణా యోధులారా
జోహార్ తెలంగాణా అమరవీరులకు
జోహార్ జోహార్

మీ
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653
[6/2, 1:48 PM] Poet Padma Tripurari: జనజాగృత తెలంగాణ
*********************

పల్లవి;;

పచ్చని పొలాలలోన
పారే సెలయేరులోన
ఆనందపు వెలుగయింది తెలంగాణ
హరివిల్లై విరిసింది తెలంగాణ


1చరణం::

పసిపాప నవ్వుల్లోన
పండంటి వృద్ధుల్లోన
వెలిగేటి జ్యోతయ్యింది తెలంగాణ
వెలుగుల్లో జిలుగయ్యింది తెలంగాణ

                       "పచ్చని"

2చరణం::

అందాల అమ్మ ఒడికి
అపరంజి పెళ్ళి సిరికి
అనురాగం పెనవేసింది తెలంగాణ
ఆదరణే తానయింది తెలంగాణ

                   "పచ్చని"

3చరణం::

మెరుపంటి యువతలోన
సాగేటి చదువులోన
అభివృద్ధి సాగయింది తెలంగాణ
కొలువులకు నెలవయ్యింది తెలంగాణ

                     "పచ్చని"

4చరణం::

రైతన్న కష్టంలోన
శ్రామికుడి శ్రమయందైన
నడిపేటి శక్తయ్యింది తెలంగాణ
జనజాగృత పదమయ్యింది తెలంగాణ.

                   "పచ్చని"


     పద్మ త్రిపురారి
     జనగామ
[6/2, 4:37 PM] Poet Musthakheem విన్నర్: ప్రత్యేక అంశం : *నవ తెలంగాణ*
శీర్షిక : *బంగారు తెలంగాణ*
రచన : *విన్నర్*
తేది: 02-06-2018

ఉత్సవం వచ్చే ..
ఆనంద దినోత్సవం వచ్చే ..
 *తెలంగాణ అవతరణ దినోత్సవం* ...వచ్చే ..
బంజరు తెలంగాణ ..పోయి
బంగరు తెలంగాణ ..హాయి

ప్రతి రైతూ ..సంతసించే
*రైతు బంధు*చెక్కు పొందే ..
ప్రతి ఒక్కడు ..సంత్రుప్తి చెందే
*సర్కారు తెలంగాణ* ను
పొగిడే ..!!

*మిషన్ కాకతీయ*
మహత్తు జూడు ..!!?
బీడుబడ్డ భూములు ..
పంటలు పండించే ..!!
*మిషన్ భగీరథ*
మహిమ జూడు ..!!?
*శుధ్ధ జలం* తాగించే..!!
*కేసీఆర్* (KCR) కిట్టు
అయ్యింది ..చూడు హిట్టు ..!!
*24గంటల కరెంట్*
హాయే ..హాయి ..పర్మనెంట్ ..!!

*సుఖ -శాంతులు* ..
తెలంగాణ  నలువైపులా ..
*ఆనందాల హరివిల్లు*
 చూడు ..చూడు మల్లా ..
*పనికొచ్చే పథకాలే*..
*మేలు చేసే పనులే*..
*కావాలి అందరి  బాగోగులే*
*కావాలి సుభిక్ష  పాలనలే*..
మల్ల చూడు ..వెలిగి పోయే
సల్లగా సూడు ..మెరిసి పోయే
*బంగారు తెలంగాణ*..మా
  *సింగారు  తెలంగాణ*
*జై తెలంగాణ .జై జై తెలంగాణ* ..!!
*సై తెలంగాణ ..సై సై తెలంగాణ* ..!!

రచన : *విన్నర్*
(Mohd.Mustkheem),హిందీ ఉపాధ్యాయుడు , ups , వరిదేల
కొల్లాపూర్ -509102
ph no.9705235385.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[6/2, 4:45 PM] Poet Satya Neelima: అంశం : బంగారు తెలంగాణ
శీర్షిక : తెలంగాణ సంస్కృతి-సంప్రదాయం

తెలంగాణ వచ్చెను మనకోసము
అమరవీరుల త్యాగాల ఫలితము

ఐదువేల సంవత్సరాల చరిత్ర గలది
కాకతీయులు, కుతుబ్ షాహీలు ఏలినట్టిది
కాకతీయపండుగ జరిగినట్టిది

బతుకమ్మ, బోనాలు, దసరాపండుగలు
మన సాంప్రదాయానికి ఆనవాలు
బుర్రకథలు, ఒగ్గుకథలు, చెక్కబజనలు
మన సంస్కృతికి పట్టుకొమ్మలు

విభిన్న భాషలు, సంస్కృతులకు కేంద్రబిందువు
మన తెలంగాణ
గంగా-యమునా తెహజీబ్ గా
చరిత్రకెక్కిన ప్రాంతం
మన తెలంగాణ

కృష్ణమ్మ పరవళ్ళ గలగలలు
రుద్రమ్మ, ఝాన్సీల పౌరుషాలు

రాణీశంకరమ్మ రాజసం
కొమురంభీం యొక్క శౌర్యం

కవి ,గాయకులకు పుట్టినిల్లు
రచయిత్రుల భావాలు వెదజల్లు
మన తెలంగాణ ముక్కోటి ప్రజల ఆశల హరివిల్లు

విదేశీయులు మెచ్చే పంచెకట్టు
మన సంస్కృతి
చేనేతచీరల అలంకారం మన సంస్కృతి

మన సంస్కృతిని కాపాడుదాం
భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం
తెలంగాణ ఖ్యాతిని నలువైపులా వ్యాపింపచేద్దాం
బంగారు తెలంగాణాగా మారుద్దాం.....

                  ✍..సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                         వనపర్తి..
      చరవాణి:9502156813..
[6/3, 11:38 AM] Poet Mastan Vali: జూన్  2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం       సందర్భంగా.  .... ఈ కవిత

       అంశం  ::  నవ తెలంగాణా
     రచన  :  షేక్. మస్తాన్ వలి

   💧🌈 😀🤣 🤓👍 ✌🏻💪🏼 ✍ 👉🏻 🌈💧

       గానమా ,గనమా ...
       ఘనమైన గణమ
       గానమా, బోనమా
      అమృత భాండమా
     తెలంగాణ మే ప్రాణమ

   ప్రాణాలను పణంగా పెట్టి
   సాధించిన గాణమే
    నవ తెలంగాణము

      అరవై ఏళ్ళ పురిటి నొప్పులకు ...
     పుట్టిన తెలుగు తల్లి చెల్లి
     *నవ తెలంగాణా తల్లి*

      వెంటాడి వేటాడి తే ... మిగిలింది
      ముక్కోణపు భాగము
      ఎటు చూసినా ముచ్చట గొలుపు
       త్రికోణమే చూపు పసికందు
       నవ తెలంగాణ రూపము
       శిఖరాగ్ర రూపమే

       కనుక ఇది...
       అభివృద్ధి కి ఆనవాలు
        సంవృధి కి చిహ్నాలు
        నవ తెలంగాణ రూపాలు

      వెలుగు తున్న దీపాలు
      తెలుగు వెలుగు రూపాలు
      తెలుగు యాస సోపాలు
      నవ తెలంగాణా రూపాలు

     నవ తెలంగాణ పిల్ల వమ్మ
     పల్లె పాటలకు తల్లి వమ్మ
     తెలంగాణా ముగ్ద వమ్మ
     పసిడి పదముల జాణవమ్మ

   
       నెత్తుటి తో కోలాటమేసి
      కత్తులతో సహవాసమైన
      రుద్రమ్మ బాహుబల కీర్తి
       నేటి పాలకుల కు....
     మిషన్ కాకతీయ స్పూర్తి
    నవ తెలంగాణ మూర్తి
   

     హైటెక్ సిటీ అంచులలో
     సైబర్ నేరాల సంచులకు
     చెక్ పెట్టె మూలలు
    నవ తెలంగాణ రూపం

     ఆవిర్భవించిన ఆనందం
     వ్యక్తం చేసిన ఆల్హాదం
    మానసిక ఉల్లాసం
    శారీరక సల్లాపం
  నవ తెలంగాణ ఉత్సాహం

      🌈💧💧✍👉🏻💪🏼✌🏻👍🤓🤣😀💧🌈

       షేక్. మస్తాన్ వలి
   నవ్యాంధ్ర గీత రచయిత
   జంతుశాస్త్ర అధ్యాపకులు
   సెల్  ::  99 483 57 673
[6/4, 4:52 PM] ‪+91 98853 80371‬: నేను కలగంటున్న నా తెలంగాణ
----------------------------------------
   ...✒బింగిదొడ్డి వెంకటేష్
        ....📞9885380371
----------------------------------------
బంగారు తెలంగాణ
భద్రంగుండాలి, బాగుండాలి
బడిపిల్లల చదువులకు
ఆడపిల్లల మానాలకు
భద్రతనివ్వాలి
భవిష్యత్తునివ్వాలి

ముంగారు తెలంగాణ
ముద్దుగుండాలి, పొద్దుపొడవాలి
ఆరుగాలం పంటలకు
అన్ని పరిశ్రమలకు
కరెంటునివ్వాలి
కష్టాలు తీర్చాలి

చిన్నారి తెలంగాణ
చిందులెయ్యాలి, చిరునవ్వుచిందాలి
కర్షకుల కనులకు
కార్మికుల పనులకు
సంతోషాన్నివ్వాలి
సరిపడు వేతనాలివ్వాలి

ముత్యాల తెలంగాణ
ముత్తైదువుగుండాలి,ముసిముసినవ్వాలి
ఊరూరా చెరువులకు
నీళ్లారా కాలువలకు
నీటినివ్వాలి
నిర్వహనుండాలి

రతనాల తెలంగాణ
రంగులనివ్వాలి,హంగులనివ్వాలి
నిరుద్యోగ యువతకు
చేనేత భవితలకు
చేతలనివ్వాలి
చేయూతనివ్వాలి

మురిపాల తెలంగాణ
మెరిసిపోవాలి,మురిసిపోవాలి
సంక్షేమపథకాలకు
క్షామపరిస్థితులకు
నగదునివ్వాలి
నిఘాపెంచాలి

బంగారు తెలంగాణ
భద్రంగుండాలి, బాగుండాలి
స్వరాష్ట్రప్రగతికై
ప్రపంచశాంతికై
పోటీపడాలి
పాటుపడాలి.
        ------**------
కవి,జీవశాస్త్రఉపాధ్యాయుడు,
బింగిదొడ్డి గ్రా.,ఐజ మం.,
విద్వద్గద్వాలసాహితీసేవకుడు.
           💐💐💐
[6/6, 8:03 PM] Poet Bheempally Srikanth: *గమ్యాన్ని ముద్దాడాల్సిందే !*

అడుగులు వేస్తున్నాకొద్దీ
గమ్యం దగ్గరవుతూనే ఉంటుంది
గమనం ఆహ్వానించేకొద్దీ
మజిలీ విజయవంతమవుతూనే ఉంటుంది

నాలుగేళ్ళ తెలంగాణ ప్రయాణం
గత పాలనకు శాపనార్థం పెట్టింది
చీకటికి జవాబు చెబుతూనే
వెలుగులను నిరంతరం విరజిమ్మింది

ఇంతకాలం ముసురుచీకట్లో మగ్గినంక
ఇపుడు వెలుతురు విలువ తెలుస్తుంది
గతకాలం మానని గాయాలతో
ఒళ్ళంతా పచ్చిపుండై పారాడినంక
తెలంగాణ లేపనమై ఊపిరినిల్పింది

ఎన్ని గాయాలతో నరకయాతన పడ్డాం
ఎన్ని బాధలతో జీవితాన్ని అనుభవించాం
తెలంగాణ మందుకోసం
ఎన్ని రోజులు ఎదురుచూశాం
కల సాకారమైందా
పాలెగాడు పచ్చిపుండై మెదిలిండు
అడుగడుగునా ఆటంకమై అడ్డమైండు

ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా
తీరం ఎప్పటికీ చేరాల్సిందే
ఎన్ని శాపనార్థాలు పెడుతున్నా
దీవెనలు పూలై రాలాల్సిందే

ఇపుడు తెలంగాణ ప్రయాణం
ఆటంకాలను ఎదిరించిన గాండీవం !
ఇపుడు తెలంగాణ గమ్యం
కోట్లాది ప్రజలను చేరే విజయతీరం !!     
                   ✍ *భీంపల్లి శ్రీకాంత్*
[6/6, 8:26 PM] Poet Srinivas Chiluka సివిశ్రీ, జిరసం: 🌺  *నవ తెలంగాణ* 🌺

నా తెలంగాణ!
బుడి బుడి సి
నడకలతో
కోటి ఆశలతో
బంగారు తెలంగాణ!
నా తెలంగాణ
కోటి రతనాల వీణా!

నా తెలంగాణ!
అమరుల త్యాగాలతో
వీరుల బలిదానాలతో
నిరుద్యోగుల ఆశలతో
నిధులు,నిరుద్యోగాలతో
నా తెలంగాణ
కోటి రతనాల వీణా!

నా తెలంగాణ!
ప్రమాదాలకు ఆపధ్భందు!
అన్న దాతల రైతుబంధు!
ఆడపిల్లల కళ్యాణలక్ష్మి!
తాగునీటి పథకం భగీరథ!
సాగునీటికి మిషన్ కాకతీయ!
గొల్ల,కురుమలకు జవసత్వం!
నేతన్నకు నిత్యం చేయూత!
కార్మికులకు ప్రమాద భీమా!
నా తెలంగాణ
కోటి రతనాల వీణ!

నా తెలంగాణ
గుర్తింపు లేని జిల్లాలు!
జాడే లేని జోన్లు!
నిరసనల గొంతుకలని
నిత్యం నొక్కే ప్రయత్నం!
బుడి నడకలే నేడు
తప్పటడుగులు పడితే
మళ్లీ మొదటికొచ్చు తెలంగాణ!
తరతరాల బానిసత్వంలో
మళ్ళీ నా తెలంగాణ!
ప్రజా సమస్యల పరిష్కారం
ఆత్మ పరిశీలనే అభివృద్ధి!
అదే నవ తెలంగాణ
నా తెలంగాణ!
కోటి రతనాల వీణ !!

      🌺🌸🌸🌸🌺

.... *సి.వి.శ్రీనివాస్*
       9985809434
[6/7, 8:19 AM] కృష్ణమోహన్ గోగులపాటి: శీర్షిక : నాతెలంగాణ
పేరు : దేవీదాసః

శ్రీల కిరువైన భారత క్షేత్రమందు
త్రిభువన గణనీయ త్రిలింగదేశమందు
రాణకెక్కిన నాతెలంగాణమన్న
యింపు మిక్కుట మెపుడు నా హృదయమందు

ప్రతిభావంతులు శౌర్యధుర్యులు మహారాజన్య వంశంబులున్
పదిలంబై సలిలంబులన్ బరుపుచున్ పండింప సస్యంబులన్
ముదమొప్పెన్ ప్రజ తృప్తులై తనివితో భోగించి రా రోజులన్
గద  నేడో మది బాధ నొందును తెలంగాణమ్మునున్ దల్చి నన్

ఆంగ్ల సంస్కార కాలుష్య మంటకుండ
కొన్ని వందల వత్సరాల్ కుదురుకొనగ
తెలుగు సంస్కృతి కాపాడి వెలిగి మేటి
ఆణి ముత్యంబు నాతెలంగాణ సీమ

శ్రీల కిరువైన భారత క్షేత్రమందు
త్రిభువన గణనీయ త్రిలింగదేశమందు
రాణకెక్కిన నాతెలంగాణమన్న
యింపు మిక్కుట మెపుడు నా హృదయమందు

దేవీదాసః
[6/7, 12:36 PM] ‪+91 93981 89847‬: నవ తెలంగాణ - నా తెలంగాణ

విడిపోతే పోయాం
నా తెలంగాణా ముక్క నాకు దక్కింది
నా యాస నాకు మిగిలింది
నాపబ్బం నాకు గడుస్తోంది
ఇబ్బడి ముబ్బడి ఆర్థక వనరులతో
ఎవరేమైపోతే నాకెందుకు
అని అనుకుంటానని అందరూ అనుకుంటారు
నేను ఆనందంగా ఉన్నానో లేదోనాకే తెలుసు
ఆస్థి పంపకాలతో గొడవ
నీటి సర్దుబాటులో గొడవ
అప్పులు ఇచ్చి పుచ్చు కోవటంలో లొల్లి
పళ్ళెంనిండా కూడుంటే సరిపోతుందా
ముద్దమింగగలిగిన సంతోషం కావద్దూ

రచన: బిట్రా వెంకట నాగమల్లేశ్వర రావు,
చీరాల - పేరాల,
7-6- 2018, గురువారం
[6/7, 1:25 PM] ‪+91 92900 42432‬: Sree vinaayaka
తెలంగాణా   తల్లికి వందనములు

సీసము

ఆదిలా బాదొక   హారమై  మెరియగ ,  భద్రాద్రి కురులపై పతక ,మవగ,

వడ్డాణ మాయెను నడ్డిపై  హైదరాబాదు, మెదక్ నిజామ్ బాదుల  జత

కమ్మ లాయెను  గదా కర్ణ ద్వయమునకు,  జనగాము,నల్గొండ సంగ రెడ్ది ,

జోగులాంబ జతకు నాగరు కర్నూలు  నుoగ  రాలుగ నయ్యె కంగులమున,

మహబూబునగరము మహబూబ బాదుయు  బాహు భూషణములై  పరవశించ

యాదాద్రి భోన్ గిరి మోదముగా చీర  కాగా, జగిత్యాల కంచుకంబు

గా మారె,మేడ్చల్  వికారబాదు, జయశంకరు, పెద్దపల్లి, కుమరము భీము

నొక్క చేతికి యు, వేరొక్క చేతికి సిరిసిల్ల, కామారెడ్ది, సిద్ధి పేట,

సూర్యపేట, జత మంచెర్యాలు గాజులై  మెరిసె, కరీంనగర్  మిసిమి తిలక

మాయె, రంగారెడ్డి మహిమ గల కిరీట మాయెను,   వనపర్తి మనసు బడుచు

జడలోన కొప్పులై సంతసిం చెగ, వరంగల్లు,  ఖమ్మము నీదు కాళ్ళ కంది

యలుగ జేర ఘన నిర్మలు కాటుకై నీదు కనులలో జేరెను తనివి దీర,

తేటగీతి

ఘనత నొప్పారు జిల్లాలు మనసు బడుచు

జేరెనో  తెలంగాణపు సిరుల తల్లి

నీదు కాయము పైన,  ననిశము చూప

వమ్మ నీదయ తెలుగు  జనమ్ము పైన

రచన  :    పూసపాటి  కృష్ణ  సూర్య కుమార్    బంధ కవి    9290042432
[6/7, 5:01 PM] ‪+91 96769 47064‬: **నా నవ తెలంగాణ**
నా తెలంగాణ ఇప్పుడు
ఎవరి బంధీ కాదు
పాలకులము మేమే
పాలితులము మేమే
దాయాదులపై
సవాలు విసిరి
సంకెళ్లను తెంచుకుని
స్వతంత్రంగా నిలబడింది
కన్న కలలను సాకారం చేసుకోవడానికై
చేయి చేయి కలిపి అడుగులేస్తుంది
జయశంకరుని
సిద్ధాంతాన్ని సిగలో తురుముకొని
కాళన్న మాటలను బాగా గుర్తుపెట్టుకొని
అమరుల రక్తాన్ని
తిలకం దిద్దుకొని
ఆశయ సాధనకై అడుగులేస్తుంది
ఇప్పుడు నాకు ఎవరు శత్రువులు కాదంటూ..
ముందుకు సాగిపోతుంది
భారతావనిలో
బంగారు పల్లెమై
తళతళ మెరవాలని
ఉవ్విళ్లూరుతున్నది
✍: వడ్ల.సాయిలుచారి
       (ఉత్తులూర్) సంగారెడ్డి
      9676947064
[6/7, 5:57 PM] ‪+91 89191 59812‬: "నా నవ తెలంగాణ "
అవతరించె అవతరించె చైతన్యపు అంగన !
నిష్క్రమించె  నిష్క్రమించె
అతిస్వార్ధపు వంచన !!

చేనుమేయు కంచెలను కాష్ఠానికి సాగనంపె!,
చెంగనాలు వేసుకుంటు
తెలగాణము పైకెగిరె !!
            !! అవత !!
కల్మషమును కాలరాసి కూపమందు మసిచేసె !,
కూరిమితో కేకవేడ్తూ
కేతనమును ఎగరేసే !!
        !! అవత !!
గజముచ్చపు బుద్ధులను
గంగపాలు గావించె !,
గతమే ఓ గర్హితంగ
గర్వంతో గర్జించె !!
    !! అవత !!
నియుతమైన నిరయాన్ని
నిగ్గుతేల్చి పంపించే !,
నిక్కమైన నీవృత్తును
నిర్లిక్తము కావించే !!
   !! అవత !!
మాయదారి మాదమును
మింటికంట పారద్రోలె !,
మహిమీది మర్త్యులకు
మరులు త్రిప్పి మతి నిచ్చె !!
     !! అవత !!
లయకారిని లాగి లాగి
లోష్టములో కప్పివేట్టే !,
లాస్యముతో లాలనలంత
లీలలుగా నాట్యమాడే !!
        !! అవత !!
---- గిరిరాజు ఆరుట్ల
[6/7, 6:27 PM] ‪+91 94936 03594‬: ***నవ తెలంగాణ ***

నా తెలంగాణాల
రాజుల కాలంల రతనాలను,
అంగళ్ల  అమ్ముకునే వారని
పుస్తకాల్ల సదువుకున్నోళ్ళం.....

చెక్కు చెదరని గోల్కొండ కోట,
వెయ్యి స్తంభాల రామప్ప దేవాలయపు
నిర్మాణ నైపుణ్యం కల్గినోల్లం......

మావ,తాత...
 అంటూ  మురిపంగా పిల్చుకుంటూ మురిసిపోయేటోళ్లం....

సేయి సేయి కలిపి,
సెల్కల్ల బంగారాన్ని పండించేటోళ్లం.....

గళ గళ మంటూ పారె నదులను
దేవతలా ఆరాధించే వాళ్ళం.....

శరీరాలను నల్లగా చేస్కోనైన,
అందరికి వెన్నెలను పంచే
 సింగరేణి కార్మిక శక్తి గల్గినోల్లం.......

పేయి మీద ఈసమంత
 బంగారం లేదేమో గాని,
గుండెల నిండా
అందరి బాగు కోరుకునేవాళ్ళం.......

పచ్చని పల్లెళ్ల 
అందరు మెచ్చుకునేటట్లు
మసులుకునేటోళ్లం.....

అమ్మా,అయ్యలను
కండ్లల్ల బెట్టుకుని సూసుకునేటోళ్లం.....

ఈది భాగోతలు,చెక్క భజనలు,
పీర్ల పండుగనాడు
అలయ్, దులాయ్ ఆడేటోళ్లం......

మా బాసను, యాసను, శ్వాసను
 అణగదో క్కాలని సూసేటోళ్లను 
అదనుచూసి ,కసి తీరా
కాటేసి తీరాలని సెప్పిన

'కాళన్న' వారసులం,
సాకలి ఐలమ్మ మనుమలం....

కష్టానికి-దోస్తులం,
కన్నీళ్లకు-దగ్గరోల్లం

మేము, నేటి....

తెలంగాణ  పోరగాళ్ళం,
తెలంగాణ పోరాట యోధులం,

బంగారు తెలంగాణను కోరుకునేటోళ్లం....
నవ తెలంగాణను  సాధించేటోళ్లం......



సాక హరీష్ బాబు ...
అమరచింత,వనపర్తి జిల్లా:
9493603594...
[6/9, 7:10 AM] ‪+91 99085 60246‬: శ్శీర్షిక : తెలంగాణమా నవతెలంగాణమా



గత పోరాట యోధుల  వారసులమై.     
ప్రాణాలొడ్డి  కల సాకారం చేసుకున్న  రాష్ట్ర మా
స్వేచ్ఛ గా  గగన మంతా మాదే అని చాటి చెపుతూ
ఎదిగిన పోరాటమా 

కల సాధించిన వైభవమా 
మము పాలించు నవ యుగమా
గత కీర్తిని పునికి పుచ్చుకుని బుడిబుడి అడుగులేస్తూ
ఉప్పెనై  ఎగిసిపడుతు పణమొడ్డిన తెలంగాణ మా
వేలకొలది కోరికలను వేడుకల్ని చేస్తూ అవతరించిన నందనవనమా

అవతరించె అందమైన హరివిల్లై
స్వ రాష్ట్ర మైన తెలంగాణ మా
చరితలన్ని పునికి పుచ్చుకుని
 స్వర్ణయుగమై సాగిపో తెలంగాణమా   మాపోరాటాల నవ గానమా
 

పేరు :ఎ.భాగ్యచంద్రిక
ఉపాధ్యాయురాలు(తెలుగు)
   దుప్పల్లి



 🌹 🍀🌹🍀🌹
[6/9, 1:00 PM] Poet Daram Gangadhar జాగృతి: 🙏రచన దారం గంగాధర్
       *****శీర్షిక*****4
  *నవత తెలంగాణ**
ఇన్నాళ్లు పరుల చేత చిక్కి
శల్య మైన నా తల్లి

సంకెళ్ల బంధీతొ
బండ బారిన తల్లి

బంధాలన్నీ తెగి
ఆనందము పొందె నేడు

నవ తెలంగానకై మనం
నడుం బింగించాలి

నాన్యమైన పాలనకై
నవతరం తరలాలి

రాజకీయ లబ్దికై
రాజ్య మేలుట కాదు

రమ్యమైన పాలనతో
రంజింప జేయాలి

సకల జనులు సంతసిల్ల
సంబరంగా ఉండాలి

నా తెలంగాణ మిలలోన
నవ్యమై మెరువాలి

ఇది నిర్మించ విజ్ఞులు
ముందండి నడవాలి

నవ తెలంగాణకై మనం
నడుము బిగించాలి.
...................................
[6/9, 1:06 PM] పెసరు లింగన్న Poet: *"నవతెలంగాణలో నక్కలు నక్కుతున్నై"*
దోచిన నక్కలు నక్కుతున్నై మొక్కల మాటున,
మొరిగిన కుక్కలు మూలుగుతున్నై పెంటకుప్పల చాటున!
ఎత్తిన పిడికిళ్లు ఏలుతున్నై జాతి గర్వించంగా,
మన జాతీయ జండా ఎగురుతున్నది సగర్వంగా!
అమరుల ఆత్మలు ఆశీర్వదిస్తున్నై ఆకాశం నిండా,
వారి నెత్తురు చుక్కలు నిండబోతున్నై చెరువుల నిండా!
పల్లె-పట్నం ఒక్కటయింది పరాయి పాలన విముక్తి కోసం,
మళ్లీ ఐక్యత చూపుతమంటుంది బంగారు తెలంగాణ కోసం.!!
దించిన తలలు పైకి లేచి చూస్తున్నై ధైర్యంతో,
మట్టిని ముద్దాడుతున్నై పల్లెలన్నీ 'రైతుబంధు'తో!
పగుళ్లు వారిన కాల్వలు పారబోతున్నై నీళ్లతో,
బీటలు వారిన బీళ్ళు నిండబోతున్నై పన్నీటితో!
నూతి కాడ కూచున్నై కొన్ని కొరివి దయ్యాలు,
గోతులు తీయ జూస్తున్నై కొన్ని గుంట నక్కలు!
నాలుగేండ్లైనా ఎదురుచూస్తున్నరు యువతీ యువకులు,
పుస్తకాలతో కుస్తీ పడుతున్నరు రాత్రింబవళ్ళు!
ఉద్యమకారులు కాబోతున్నరు ఉద్యోగస్తులు,
ఆర్తిగా చూస్తున్నరు ఉద్యమవీరుని వైపు!
...జై తెలంగాణ!   జై తెలంగాణ!!
        .......పెసరు లింగారెడ్డి
[6/9, 6:55 PM] Poet Gundu Madhusudan మధురకవి: *తెలుగు కవన వేదిక*
*మధురకవి గుండు మధుసూదన్*
తేది: 09-06-2018
పద్య సంఖ్య: 01-18
అంశం:
*మాన్య తెలంగాణ రాష్ట్ర రథ సారథి - కేసీఆర్*

సీసము:
అఱువది యేఁడుల యాంధ్రాధిపత్యమ్ము
        నంతమ్ముఁ జేయంగఁ బంతమూని,
తెలఁగాణు లందఱ నిల నొక్క త్రాఁటి పైఁ
        కినిఁ దెచ్చి బలమిచ్చి ఘనత నూని,
నీరముల్ భూములు నిధులును గొలువులు
        వనరులం దోచిన పగిదిఁ దెలిపి,
తీవ్రమౌ పలుకులఁ "దెలఁగాణ వచ్చుడో
        కేసియార్ చచ్చుడో" కృత ప్రతిజ్ఞుఁ
గీ.
డైన "కేసియార్ వ్రతదీక్ష", యాంధ్ర పాల
కులకుఁ బ్రక్కలో బల్లెమై, కునుకు నిడక,
చోద్యముగఁ దెలంగాణ రాష్ట్రోద్యమమును
ఢిల్లి కనిపి, సాధించె రాష్ట్రేప్సితమును!01

ఉత్పలమాల:
ఈ తెలఁగాణ మాట యిఁక నెప్పుడు వల్కక యుండ నాజ్ఞ నా
నేతయు చంద్రబాబె యిడ; నిత్యము నీ తెలఁగాణ నామమే
చేతము పొంగఁగా వినిచె, శీఘ్ర మసెంబ్లియె మ్రోగఁ గేసియార్!
నేత యతండు రా! ఘన వినీతుఁడు, ధీరుఁడు, పుణ్య మూర్తిరా!!02

ఉత్సాహము:
"సకల జనుల సమ్మె" చేసి, శాశ్వతముగఁ బ్రజల హృ
త్ప్రకర మందు నిలిచి వెలిఁగి, రాష్ట్ర సాధనమునకై
రకరకమ్ములైన వ్యూహ రచనములనుఁ జేసియున్
బ్రకటిత మ్మొనర్చెఁ బ్రజల రాష్ట్ర కాంక్ష ఢిల్లికిన్!03

సీసము:
ఒక వంక నమరె సదుద్యమ స్ఫూర్తికై
        తెలఁగాణ జనభేరి దివ్య కృతము;
నొక చెంత నలరెఁ జెల్వొప్పఁగాఁ దెలఁగాణ
        సాగరహార సంజనిత వ్రతము;
నొక చోట మించె సముత్సుక తెలఁగాణ
        జనుల ధూంధాము చేతన గళములు;
నొకట నుజ్జృంభించె నుత్సాహ యుక్తమౌ
        సభ విరాజిల్లు ప్రసంగ ఫణితి;
గీ.
యంత సమ్మెలు హర్తాళు లమర వీర
కలిత బలిదానములు సముత్కంఠ నిడఁగ,
నీ తెలంగాణ మంతయు నెద రగులఁగఁ,
జెలఁగె నిరశన వ్రతి చంద్రశేఖరుండు!04

శార్దూలము:
ఢిల్లీకిం జని కేసియారె యచటన్ దిక్కుల్ ప్రకంపింప ఱం
పిల్లం జేసె స్వరాష్ట్ర కాంక్ష నినదం; బెల్లన్ సముత్కీర్ణ హృ
త్ఫుల్లాంభోజ సభాంతరాళ మలరన్ బోరాడి, సాధించె సం
సల్లీలన్ దెలఁగాణ రాష్ట్రమును నుత్సాహమ్ము దీపింపఁగన్!05

కందము:
వచ్చెను తెలగాణము మన
కిచ్చెను మన పాలనమ్ము హెచ్చిన తమితో
నచ్చిన విధముగ మన మిపు
డచ్చెరువందంగ స్వర్ణమౌ రాష్ట్రమ్మే!06

తే.గీ.
మన తెలంగాణ ఘన ముఖ్యమంత్రి చంద్ర
శేఖరుండయి వెలిఁగించె శీఘ్రముగను
నెన్నియో పథకమ్ముల నిట రచించి,
యన్ని వర్గాల ప్రజలను నాదరించె!07

ఆ.వె.
మిషను కాకతీయ మిషను భగీరథ
లివియ నీర మిచ్చి హితముఁ గూర్చు;
రైతుబంధుపథక రచనయే మిన్నయై
కర్షకులకు నిడును హర్ష మిచట!08

తే.గీ.
స్థిరతఁ గళ్యాణలక్ష్మి షాదీముబార
కిడెను బాలికా వైవాహికేప్సితముల
ధన సహాయంపుఁ జేయూఁతఁ దల్లిదండ్రు
లకిట భారమ్ము కాకుండ నాదరించి!09

ఆ.వె.
హరిత హార మిడెను నడవులఁ బోషించి,
కాలగమనముల సుకరము సేసి,
స్థితుల సక్రమమిడి నతివృష్ట్యనావృష్టి
దరికిఁ జేరకుండ స్థిరపఱచెను!10

సీ.
ఆసరా పింఛను నారోగ్య లక్ష్మియు
        నమ్మ యొడియుఁ గేసియారు కిట్టు
పల్లె ప్రగతి మఱి ఫైబరు గ్రిడు పథ
        కాలు, మన ప్రణాళిక మన యూరు
మొదలైన వెన్నియో ముఱియఁ జేయుచునుండె
        సకల ప్రజకు మేలు సమతల నిడి,
మన తెలంగాణను మహిలోన వెలుఁగంగఁ
        దీర్చి దిద్దుచునుండి స్థిరముగాను
గీ.
కేసియారు ఘనతతోడఁ జేసెను మన
రాష్ట్రమును స్వర్ణ తెలగాణ రాష్ట్రముగను
నిలిపె సుస్థిర స్థానమ్ము నిఖిల జగతిఁ
బ్రచుర పఱచి కలుగ సంబరము ప్రజకు!11

తే.గీ.
ఇట్టి ఘనతనుఁ బంచియు హితము నిడిన
యోయి చంద్ర శేఖర! యీ మహోత్సవమున
మా శుభాకాంక్షలను దెల్పి, మా హృదులను
సుస్థిరమ్మైన స్థానమ్ముఁ జూపితిమయ!12

స్వాగత వృత్తము:
కామితానఁ దెలగాణను వేగన్
క్షేమమెంచి, యిట గెల్చియు రాష్ట్ర
మ్మోమఁగా మనసు పొంగినవాఁడా!
సౌమనస్యవర! స్వాగతమయ్యా!!13

రథోద్ధత వృత్తము:
కల్వకుంట్ల తెలగాణ యోధుఁడా!
విల్వఁ బెంచితివి వేగ జేతవై!
నల్వవోలె నిను నవ్యగీతులన్
గొల్వఁ బూనితిమి, కొమ్ము కేసియార్!14

తోటక వృత్తము:
ఘన మోదము నిచ్చితి! కాంక్షితమౌ
*త్రినగాంధ్రను గెల్చితి! తేజము హె
చ్చెను మోమున నిప్పుడు శీఘ్రగతిన్!
గొను మో ఘన వీరుఁడ, కూర్మినతుల్!!15
[త్రినగాంధ్ర = తెలంగాణ]

ప్రియంవదా వృత్తము:
అరువదేండ్ల కల నందఁ జేయు నిన్
విరుల వర్షములఁ బ్రేమతోడుతన్
మురియఁ  జల్లుదుము! ముఖ్యమంత్రివై

వరమొసంగఁగను వందనమ్మిదే!16
వనమయూర వృత్తము:
ఎంత ఘన వీరుఁడవు, హేమనగధీరా!
చింత వలదంచు మముఁ జీరి, తెలగాణన్
బంతమున గెల్చితివి! భారము తొలంగెన్!
సంతసము హెచ్చెనయ! స్వాగతముఁ గొమ్మా!17

మాలినీ వృత్తము:
విమత కుటిల ధ్వస్తా! ప్రీతి పౌర ప్రశస్తా!
నమిత జన విశేషా! నవ్య నేతృ ప్రభూషా!
శ్రమ దమన విశిష్టా! శాంతి కాంతి ప్రహృష్టా!
విమల సుగుణమూర్తీ! విశ్వవిఖ్యాతకీర్తీ!18

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

స్వస్తి
*మధురకవి గుండు మధుసూదన్*

Comments