వారం అంశం
ఇటీవల రోజురోజూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి... ఎందరో అకాలమరణం పొంది కన్న వారికి కంఠశోకం పెడుతున్నారు... పోయినవారిని ఎలాగూ తీసుకురాలేము... ఉన్నవారినైనా కాపాడుకుందామనే ఆశయంతో... ఈ వారం అంశం " రోడ్డు ప్రమాదాలు - అకాలమరణాలు"
[5/20, 9:04 PM] Poet Musthakheem విన్నర్: అంశం : రోడ్డు ప్రమాదాలు -అకాల మరణాలు
శీర్షిక :- "గాలి లో కలుస్తున్న ప్రాణాలు "
రచన :- విన్నర్ (md.mustakheem)
తేది :-20-05-2018
ph .no.9705235385.
నిర్లక్ష్యం మాటున ..
నిర్విరామం చాటున ..
మద్యం సేవించి ..
నిత్యం సేవించి ..
రోడ్డు స్వంతమన్నట్లు ..
వీర స్వైరవిహారమన్నట్లు ..
ఒక్క బండి పై ..నలుగురు మించి ..తూలుతూ ..తత్
సమయాన్ని యేలుతూ ..
విపరీత వేగంతో ..గాలిలో నన్నట్లుగా ..
తల్లిదండ్రులను ,
భార్యా బిడ్డలను ,
అయిన వారి నందరినీ మరచి నట్లుగా ..
రోడ్డు ప్రమాదాల్లో ..పండంటి
ప్రాణాలను ..గాలిలో కలిపేస్తున్నారు ..??!!
బంగారం లాంటి యౌవనాన్ని
అర్థాంతరంగా ..ముగిస్తున్నారు
బండి మోజు ..పీక లోతై
ప్రాణాలను తోడేస్తోంది ...
రోడ్డు ప్రమాదాలు ..కుటుంబం
నకు ..యేనలేని రోదనలు మిగులుస్తున్నాయి ..
ఆధారపడ్డ వారిని ..రోడ్డున పడవేస్తున్నాయి ..
ఓ యువత ..కాస్త తగ్గించు నీ
ఉడుకు -దుడుకు ..??
కాస్త మారు ..కాకు అలా బేజారు ..
లక్ష్యం తో ..జీవించు ..
అలా చక్కర్లు కొట్టి ..
ప్రాణాలు చేతులారా ..గాలిలో
కలిపేసుకోకు ..?
అయిన వారికి కన్నీళ్ళు మిగిల్చకు ..?
రోడ్డు ప్రమాదాల్లో ..పడకు ..?
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[5/22, 1:46 PM] కృష్ణమోహన్ గోగులపాటి: అతివేగం - ప్రాణాపాయం
రచన : గోగులపాటి కృష్ణమోహన్
అతివేగం ప్రమాదకరం..
అనితెలిపినా వినిపించుకోరు ఈ జనం...
బైకులు కార్లు ఎక్కినడుపుతారు..
తామే హీరోలమని అనుకుంటారు...
రోడ్ల పైన కొడతారు ఫీట్లు..
తెలియక పడుతారు నానాపాట్లు..
కొత్తబండి కొనేవరకు మంకుపట్టు..
అదే అవుతుంది ప్రాణాపాయానికి తొలిమెట్టు...
బయటకు వెళ్ళారంటే పిల్లలు..
వచ్చే వరకు ఇంటిల్లిపాదీ గుండె గుబేలు...
నిద్ర "మత్తు"లో చోదకులు..
గాలిలో కలుస్తున్న నిండు ప్రాణాలు...
నిర్దాక్షిణ్యంగా నడపొద్దు..
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి కావొద్దు...
నిదానమే ప్రదానం..
అదే అదే కావాలి మన నినాదం ....
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
చరవాణి : 9700007653
[5/22, 10:01 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: ఆఖరి ఊపిరి
కనుల ఆకాశం నుండి
కురుస్తున్న వర్షపు చినుకులు
చూపు తెరకు అడ్డుపడకుండా తొలగించుటకు
వైపర్లయినా చేతులు..
కురిసే వర్షానికి అలుపనేది లేదు
తుడిచే వైపర్లకి విరామమనేది లేదు..
గతరాత్రి నుండి
నిరంతరాయంగా కొనసాగుతున్న వాతావరణ హెచ్చరికను పట్టించుకోని ఆమె..
ఆత్రంగా పరుగెడుతున్న కారు
గమ్యం చేరాలనే తపన
పాప చేతిలోని బొమ్మను లాక్కెల్తూ
చక్రాలుగా తిరుగుతున్న గాలి
కారు కంటిలో దుమ్ముకొట్టిపోయింది..
ఇదేమి పట్టించుకోని ఆమె
అమ్మా
నా బొమ్మా అంటూ పాప పాటనందుకుంటే..
ఆందోళన, ఆతృత, గమ్యం చేరాలనే తొందర
క్షణకాలపు కనుమరుగు
అడ్డొచ్చిన ఆవును తప్పించపోయి ఎదురుగా వచ్చే లారీని హత్తుకుంది..
రెప్పపాటులో
రహదారి ప్రమాదం ఎర్రపూలై రోధించి
ఆఖరి ఊపిరిని గాలికి అంకితం చేసింది..
@సిరిమల్లెలు...
పాలకుర్తి నాగజ్యోతి
[5/26, 9:41 AM] Poet Mastan Vali: అంశం : రోడ్డు ప్రమాదాలు - అకాల మరణాలు
శీర్షిక : *చక్కని జీవితం -- చుక్కల్లో కి పయనం*
రచన :: షేక్. మస్తాన్ వలి.
🛣🚹 🚸🚳 📵🚷 🛤🚜 🛴🚳 🚸 🛣🚹
ప్రమాదాలకు పుట్టిల్లు అతి వేగం
నిదానంగా వెళితే వచ్చేది లేదు ఏ రోగం
జాగ్రత్త అందరికీ అవసరం
అతి జాగ్రత్త వాహన చోదకులకవసరం
లేకుంటే ....
ఆది లోనే హంసపాది లాగ
నిండు జీవితం అనుభవించకనే
యవ్వనం నిండు సున్న
తాగుతూ ప్రయాణం ఒకరిది
తూగుతూ ప్రయాణం మరొకరిది
పరధ్యానంలో ప్రయాణం వేరొకరిది
నిర్లక్ష్యంతో ప్రయాణము
నీ .. జీవితానికే ప్రమాదము
అతి వేగం తో ప్రయాణం వద్దు
ప్రమాదం కొనితెచ్చుకో వద్దు
ప్రమోదాన్ని దూరం చేసుకో వద్దు
సుఖ దుఖా లకు నిలయమైన జీవితం
రెప్ప పాటు కాలంలో నే జీవితాన్ని
అంతం చేసుకో వద్దు...
నీటి బుడగ లాంటి జీవితం
వేగవంతమైన ప్రయాణం తో
మధ్యలో నే పగలకొట్టు కోకు
నిదానంగా వుంటే నే
ఆనందం, ఆల్హాదం
నూరేళ్ళ జీవితం
సుఖమయం
నిన్ను నమ్ముకొన్న వారికి
ఆనందకరం
అని మరవక ప్రయాణం
సాగించు సుఖం గా...
🛴🚸🛣🚜🛤🚷📵🚸🛣🛴🛤🙏🏻
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతు శాస్త్ర అధ్యాపకులు
సెల్ :: 99 483 57 673
[5/27, 8:25 AM] Poet Satya Neelima: శీర్షిక : అతివేగం- రోడ్డుప్రమాదాలు
బైకు నడపాలని ఆశతో నేటితరం కుర్రకారు
తల్లిదండ్రుల మాటలను లెక్కచేయక
ఏడ్చి,అలిగి,బెదిరించి బైకు సాధించి
ట్రాఫిక్ రూల్స్ కూడా తెలియకుండా
రయ్ రయ్ మని దూసుకుపోతూ
తలకు హెలిమెంటు అయినా పెట్టుకోకుండా
ప్రమాదాలభారిన పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారు
ఆలోచించండి యువతీయువకులారా
మిమ్మల్ని కని పెంచి మీమీదే ఆశలు పెట్టుకుని ఇంట్లో ఎదురుచూస్తున్న మీ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేయక
అతివేగం అనర్థదాయకం
ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం
ప్రమాదాలను నివారిద్దాం...
ఇది నా స్వీయరచన
✍...సత్యనీలిమ,
వనపర్తి...
[5/28, 11:14 AM] +91 99085 60246: 🌷🍀🌷🍀🌷🍀🌷 శీర్షిక :అతివేగం అనర్థం. తల్లి తండ్రుల అనురాగపునావలో ఎదిగే. పిల్లల పట్ల ఎన్నో ఆశలు పెంచుకుని గారాబంగా పెంచి అందమైన జీవితం అందించాలనే వారి కోరికను మారుతున్న పిల్లలు వారి ఆలోచనలు నట్టేట ముంచుతాయి. . . . అలకలతో మారాము చేస్తూ పట్టువదలని విక్రమార్కులలా అనుకున్నది సాధించే వరకు సాగదీసి సాదిస్తారు....... . చేతి లో బైకు చెవిలో సెల్ ఫోను తనే హీరో అనుకుంటూ రహదారిలో రయ్ రయ్ మంటూ స్పీడు పెంచి జోరుగ గాలిలో తేలుతూ సాగేవారొకరు...... వ్యసనాలకు లోనై మత్తులో తూలుతూ మరొకరు.... మేఘాలను అందుకోవాలన్న ఆత్రుతగా రెక్కలు విదుల్చుతారు....... ప్రమాదాల కోరల్లో బలౌతున్నారు. కన్న వారికి కడుపు కోత మిగిల్చ ........ ఆరని చిచ్చు రగిల్చ వారి జీవితాలకు కానుకలుగా యిస్తున్నారు....... సుఖ దుఃఖాలకు నిలయమైన జీవితం రెప్పపాటు కాలంలోనే జీవితాన్ని అంతం చేసుకోవద్దు.. ... అతివేగం అనర్తదాయకమని తెలుసుకొని మసులుకోండి ఇకనైనా........ 🍀🍁🍀🍁🍀🍁 ఎ.భాగ్యచంద్రిక. ఉపాధ్యాయురాలు. దుప్పల్లి.
[5/28, 4:46 PM] Poet Kusumanchi Sridevi: 🚗🚕రోడ్డు ప్రమాదాలు🏍🏍🏍
-----------------------.-------------
ఎందుకు ఆ పరుగు
నువ్వు చేరుతున్నది
నీ లక్ష్యాన్ని కాదు..
నీ జీవిత చరమాంకాన్ని!
నీకు గాని ఆ మార్గాలన్నీ
పుష్పాలతో అలంకరించి
పూల బాటలలా
అగుపడుతున్నాయా!
అతి వేగం నీ
జీవిత కాలాన్ని
కోరునని గమనించి
ప్రయాణించు!
చూడు...చూడు
ఆ మలుపులు చూడు!
యమపాశాలతో అలంకరించుకుని...
గత రక్తాభిషేకాలతో
తన ఆకలి తీరక..
ఆవురావురమంటూ
మృతసముద్రకెరట ఘోషలా
వినబడుతుంది!
నీ ప్రేమకై
కొంగు పట్టి
ఎదురు చూసే ప్రాణాలు
నీ ఇంటి గుమ్మం
దగ్గర వేచియున్నాయి..
తస్మాత్ జాగ్రత్త!
విలువకట్టలేని
విలువైన ప్రాణాన్ని
సమ వేగంతో
ప్రయాణించి..
చిరునవ్వుతో
ఇంటికి చేర్చు...
అతి వేగం కోరును
నీ ప్రాణమైన
నీ కుటుంబ సంతోషాన్ని!
సమ వేగం
ప్రసాదించును
అనురాగాల హరివిల్లును..!
🌹🌹🌹🌹శ్రీదేవి సురేష్ కుసుమంచి🌹🌹🌹🌹🌹
[5/28, 4:48 PM] +91 98853 80371: అంశం:రహదారి-భద్రత
శీర్షిక:జీవితం అర్దాంతరమా-జాగ్రత్తసుమా
ఎర్రాని తొలిపొద్దు
మందార పువ్వయి
పొడిసేటి సౌందర్యం
ఆరోజటికే అర్దాంతరమా?
పచ్చాని పల్లెలు
మల్లెల సుగంధాలయి
పంచేటి ఆప్యాయతలు
ఆరోజటికే అర్దాంతరమా?
అందాల పట్నాలు
వైభోగ భువనాలయి
అందించే సౌకర్యాలు
ఆరోజటికే అర్దాంతరమా?
సాధారణ కుటీరం
బంధాల పొదరిల్లయి
అల్లుకున్న అనుబంధాలు
ఆరోజటికే అర్దాంతరమా?
పసిపాప బోసినవ్వులు
విరగబూసిన వెన్నెలయి
పంచుకున్న మధురానుభూతులు
ఆరోజటికే అర్దాంతరమా?
అపరాధమో
అప్రయత్నమో
ఆనందమో
అతివేగమో
తెలియనితనమో
తెలిసినా తోచనిక్షణమో
విధిరాతను తప్పించుకోలేమేమో
కానీ
తలరాతను మార్చే జాగ్రత్తలు మనమే తీసుకోవాలి సుమా..
------*------
..✒బింగిదొడ్డి వెంకటేష్,
కవి,జీవశాస్త్ర ఉపాధ్యాయులు,
విద్వద్గద్వాల సాహితీసేవకుడు.
💐💐💐💐💐💐💐💐
[5/29, 3:38 PM] Poet Komati Madhusudan: తొందర(గా)పోవాలని
రంగుల లోకంలో
నా రంగేమిటొ తెలియకుంది
సమాజ పోకడ చూసి
నిరాశలో నీరైంది
సౌకర్యం కొంతున్నా
సంతోషం కలిగేది
సాదారణ జీవివా..?
సాహసం చేయమంది
సంతోషం నీరైంది
అన్వేషణ మొదలైంది
ఘరానాగ బతకటమే
గౌరవమని చెప్పింది
గొప్పగ లేకున్నగొప్ప
రంగు వేసుకోమంది
అందనంత ఎదిగినట్లు
హుందాగ తిరగమంది
సాదా జీవితమంటే
చచ్చు జీవితమేనంది
అచ్చోసిన ఆబోతుల
రోడ్డు మీద పడమంది
వెంటబడుట వేటాడుట
టైగర్ లక్షణమంది
కోరుకున్న దాన్ని పొందు
వీరోచిత కార్యమంది
తినూ తాగు జల్సాచెయ్
జీవిత మందుకేనంది
బలగం నీ వెంట నుంటె
బలమై కాపాడు నంది
అమ్మా నాన్నలు ఏదియు
అడిగిన ఇస్తారనంది
మనకొరకే సంపాదనత
మొహమాటం వద్దనంది
గొప్పగ నీ కోర్కెలుంటె
ఉప్పొంగి పోతరంది
నచ్చినట్టు బతకమంది
న్యాయమదే పొమ్మంది
తిరుగ రాని లోకాలను
తిరుగు తిరుగు తిరుగమంది
రాత్రి పగలు తేడాలు
రేజింగుకు లేవంది
మత్తు కూడ తోడైతే
గమ్మత్తుగ నుండునంది
గాలి లోన తేలమంది
గోల గోల చేయమంది
తొందరగా పోవాలని
నను ముందర పడమంది
జాలి లేక నా ప్రాణం
గాలిలోన కలిపింది
వాలిన తలిదండ్రులకు
గోలే ఇక మిగిలింది
నన్నెక్కిన హంకారం
నా తోనే చచ్చింది
మధుసూదన్ కోమటి,
నల్లగొండ,
సెల్.9491328432.
[5/30, 2:51 PM] Manne Lalitha: 7416863289.
మన్నె(పిన్నక)లలిత.
అంశం:రొేడ్డు ప్రమాదాలు.
××××××××××××××××××
లేకలేక పుట్టాడు
రవ్వంత పిల్లాడు
అరటి ఆకుల్లొే
అపురుాపంగా పెంచి
అడిగినవన్నీ ఇచ్చి
ముద్దు ముచ్చట్లు తీర్చుకుని
మీగడ పెరుగుతొే
దబ్బపండులా పెంచి
నడకరావటానికి చెక్కబండి
ఊహ తెలిసి మారాంచేస్తే
సైకిలు
వయస్సు పెరిగి
కొేరికలు పెరిగి
పదుగురిలొే పరువు పొేతుందంటే
ఒక్కగానొక్కడని బైక్
కారు....
విలాసాలు...వినొేదాలు....
కన్నమిన్ను కానక
కన్నవాళ్ళు గుర్తురాక
ప్రాణం విలువ తెలియక
"అతివేగం ప్రమాదం,
వేగం వద్దు ,ప్రాణాలే ముద్దు"___అన్న సుాచనలు చుాపులకు అందక
వెంట తరిమే మృత్యువును మభ్యపెడుతుా
నాకేమిటన్న ధైర్యంతొే
మనొేవేగాన్ని మించిన వేగంతొే
చిన్నమెత్తు కష్టం తెలియక పెరిగినవాడు
మృత్యు కరాళ దంష్ట్రలలొే చిక్కి
విలవిలలాడుతుా విడివడిన శరీరాన్ని చుాచి
తల్లి గుండె తట్టుకొేలేక
కన్నకొడుకు శరీరాన్ని
కావలించుకుని పరలొేకానికి వెళ్తే....ఆతండ్రి పిచ్చి చుాపులు చుాస్తుంటే....
ఎందుకయ్యా ఇన్నిప్రాణాలతొే ఆటలు...
మితిమీరిన వేగం వద్దు
మిమ్మల్నిమించి మరేమి వద్దు.
సుఖీభవ.
×××మన్నె(పిన్నక)లలిత××××××××××××××××🌷
Comments
Post a Comment