సంస్కృతి - సాంప్రదాయాలు



 కృష్ణమోహన్ గోగులపాటి:
ఈనెల 21 న ప్రపంచ విభిన్న సంస్కృతుల దినోత్సవం... ఈ సందర్భంగా ఈ వారం అంశం... "సంస్కృతి-సాంప్రదాయాలు".  మరెందుకు ఆలస్యం... కలం కదిలించండి... లోతుగా పరిశీలించండి... అక్షరాలను పేర్చండి...

[5/13, 6:11 PM] Poet Mastan Vali: 21 న ప్రపంచ పు విభిన్న సంస్కృతుల దినోత్సవం         సందర్భంగా ఈ కవిత.
      అంశం :  సంస్కృతి  --  సాంప్రదాయాలు
     శీర్షిక  :   *ఆచార వ్యవహారాలు*
    కవి :  షేక్. మస్తాన్ వలి

  ☀🌙🌏🙊🌏🙉🌍🙈🌎 🇧🇴 🇧🇪🇦🇿 🇨🇮🇪🇹🇬🇭        🇲🇲  🇸🇷 🇸🇩   ...🇮🇳  ...    🇮🇷 🇮🇪 🇳🇪 🇹🇯 🌙 ☀ 🌏

         ప్రపంచ మే ఒక భిన్న
      సంస్కృతుల నిలయం
     విభిన్న సాంప్రదాయాల ఆలయం
   
    ఎన్ని సంస్కృతు లున్నా
    ఎనెన్ని సాంప్రదాయా లున్నా
    ఎవరి సంస్కృతి వారికి గొప్పన్నా
    ఎవరి సంప్రదాయం వారే మెచ్చుకొను నన్నా

     విభిన్న జాతులు
    విభిన్న మతాలు
    కంప్యూటర్ కాలమందు
    ప్రపంచ మే ఒక కుగ్రామం గా
    మారిన తరుణం  ..!! నేడు
 
     అచ్చమైన, స్వచ్ఛమైన
     సంస్కృతి, సంప్రదాయం
    కనుమరుగై నాయి ..!!
   
       పిక్చర్ చూసి, మిక్చర్ చేసి
       కలగలుపు పులగ మాయే నేడు
     
       డేగ కన్నేసి చూసినా,
     భూతద్ద మేసి వెతికినా
    మచ్చుకైనా కనిపించదు
   మిక్సింగ్ లేని స్వచ్ఛమైన
    సంస్కృతి, సంప్రదాయం

     కాలానుగుణంగా
    పరిస్థితుల కనుగుణంగా
    పుట్టిన వే కదా . ..!? 
    ఎవరి. ...
   సంస్కృతైనా,సాంప్రదాయమైనా

     మనుషుల మేధస్సు పెరిగి
     అంతరాత్మ తగ్గి
     అంతర వలయాలు గీసుకొని
    నియమ , నిబంధనల తో
    సంస్కృతి, సంప్రదాయాలు
    ఏర్పరచుకున్నారే !! ... కానీ
     ఒకరిది , మరొకరు అర్థం
      చేసుకోనరాయే .  ??

       ఎది ఏమైనా....
     మానవ జీవన మనుగడకు
      సంస్కృతి, సంప్రదాయాలు
      సాయ పడతాయి
      సహకరిస్తాయి
      స్థాయిని తెలియ జే స్థాయి
       సభ్యతను నేర్పు తాయి
       సంఘ జీవిగా,
       జీవించుటకు ,ఎదుగుటకు
      సంస్కృతి, సాంప్రదాయాలు
      తోడ్పడతాయి

   అందుకే...
          నాది గొప్ప ..?, నీది గొప్ప..?
          నీది కానేకాదు...!!
        నాదే గొప్ప . !!  అని తగువులు ఏల ..??!
          తన్నుకు చావుట ఏల ..?!!
   
       తరతరాల తరగని
        వరాల లాంటి
       సంస్కృతి , సాంప్రదాయాలు
       కాపాడుకోండి, కాపాడుకోండి
       పాడుచేయకండి .!!?

       ఎవరిది వారికే గొప్ప
     తపొప్పులు వుండవప్ప
    తప్పులు వుంటే, నొప్పులు తప్పవు

     ఎందుకో..
    ఎదుటి వారి గొప్ప
    నూ చూడలేవు,..??
    నీకు కనిపించదు..!!
 
     అలాగే ..
    ఎవరి తప్పు
   వారికి కనిపించదు

      మిత్రమా ...
     గుడ్డి వైనా,మంచి వైనా
    కళ్ళు ఎవరి వైనా
    ముళ్ళు గుచ్చు కొంటే
     నొప్పి ఒక్కటే,
అని తెలుసు కొంటే చాలు

🌏☀🌙🇹🇯🇳🇪🇮🇪🇮🇷🇸🇷🌎🇧🇪🇦🇿🇨🇮🌏☀🌙

         షేక్. మస్తాన్ వలి.
   నవ్యాంధ్ర గీత రచయిత
   జంతు శాస్త్ర అధ్యాపకులు
    సెల్  ::  99 483 57 673.
[5/14, 6:48 PM] Poet Musthakheem విన్నర్: అంశం: సంస్కృతీ సంప్రదాయా లు
శీర్షిక : జాతి నిండు గౌరవం
తేది :14-05-2018

సంస్కృతీ సంప్రదాయాలు ..
ఒక జాతి నిండు గౌరవం..!!
కొట్టొచ్చినట్టు కానవచ్చే
ఆకర్షించినట్టు అగుపిచ్చే
ప్రజల కట్టూ -బొట్టూ
వేషధారణ , మాతృ భాష
అన్నింటి మేలు మేళవింపు
జీవిత విధానం ..వంటి వన్నీ
ఒక జాతి ఉనికిని తెలిపే
జాతి నిండు గౌరవం ...!!!

నాగరికత ను నిలువెల్లా
చాటి చెప్పే ..
ప్రజల సంబంధ బాంధవ్యాలను
ఐకమత్యం ని , ఆహార్యం ని ,
పండుగ నూ , పబ్బాలనూ
సంబంధ నృత్యం , నాట్యకళా
రీతుల్ని ..వగైరాల దర్శనాలు
నింపుకున్న నిండు జాతి గౌరవం ..సంస్కృతీ సంప్రదాయం ..విభిన్నం-విలక్షణం ..!!!

తరాలెన్ని తరిగినా ..
నవతరాలెన్ని పెరిగినా ..
యెక్కడికీ వెళ్ళని ..
యెన్నటి కీ సడలని ..
గట్టి పునాదులు ..
పునాది రాళ్ళు ..
"ఈ సంస్కృతీ -సంప్రదాయాలు
ఒక జాతి నిండు గౌరవాలు ."

రచన: విన్నర్
ph:9705235385
హిందీ ఉపాధ్యాయులు
ups , waridyal
కొల్లాపూర్ -509102.
🌸🌸🌸🌸🌸🌸🌸


[5/15, 12:28 AM] కృష్ణమోహన్ గోగులపాటి: సంస్కృతి-సాంప్రదాయాలు

రచన : గోగులపాటి కృష్ణమోహన్

సంస్కృతి... సాంప్రదాయాలు...

నుదుట బొట్టు... కంటికి కాటుక...
చెవులకు కమ్మలు... ముక్కుకు పుడుక...
మెడలో తాళి... కంఠాహారం...
చేతికి గాజులు... వేలికి వంగరం..
కాలికి గజ్జెలు... వేలుకు మెట్టెలు...
అలంకారాలకు ఆనవాళ్లు
ఇవీ మన సంస్కృతి-సాంప్రదాయాలు...

సంక్రాంతికి...వాకిట ముగ్గులు
గొబ్బెమ్మలు... బోగిపండ్లు...
ఉగాది పచ్చడి... హోళీ రంగులు..
దసరానాడు.... అలాయ్ బలాయ్
దీపావళి వెలుగులు... కార్తీక నోములు..
ఆనందానికి నిలువెత్తు సాక్ష్యాలు
ఇవీ మన సంస్కృతి-సాంప్రదాయాలు...

పచ్చని పందిరి... గడపకు ముగ్గులు
కాలుకు పసుపు... గంధపు సొగసు...
వాయనాలు... చీరలు సారెలు...
బియ్యం పోసుడు... బట్టలు పెట్టుడు...
తాంబూలమిచ్చి సాగనంపుడూ...
ఆరోగ్యం కోరే అంతరంగాలు...
ఇవీమన సంస్కృతి-సాంప్రదాయాలు..

గుట్టను ఎక్కి... పుట్టను మొక్కి...
పూజలు చేసి... మొక్కులు ఇచ్చి...
బారసాలలూ... అన్నప్రాశనలు...
పుట్టెంటికలు... విద్యాభ్యాసం...
ఉపనయనాలు... వివాహాలు...
ఇంటిల్లిపాదికి ఆనందపుగడియలు...
ఇవీ మన సంస్కృతి-సాంప్రదాయాలు‌..

పూర్వకాలపు మంచి చెడులను...
భావితరాలకు తెలిపేటి...
భాగ్య వంతులుగ నిలిపేటి
ఆచారాలే సంస్కృతులు.,
ఆచరించడమే సాంప్రదాయం
ఆచరించడం‌.. ఆదరించడం...
ఇవే మన సంస్కృతి-సాంప్రదాయం..

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు.
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653


[5/15, 8:17 PM] Poet Rajmouli Dandre: *శీర్షిక:కుటుంబం*
*****************
మంచికి పునాది కుటుంబం
మానవతకు
ఆది కుటుంబం!
మమతానురాగాలకు
మధురమైన వేదిక
ప్రేమాభిమానాలకు
ప్రియమైన దీపిక
కుటుంబం!
మన కుటుంబం!!
యుగాలనాటి సమైక్యతకు
వేల వత్సరాల సంస్కృతికి చిహ్నం కుటుంబం !
మనిషికి విలువల
శిక్షణశాల కుటుంబం!
సత్యానికి ప్రయోగశాల
ధర్మానికి పురుటిశాల
పుణ్యం పుట్టుకకు
పాపం గిట్టుటకు
నడకకు నాట్యశాల నడతకు ఆదర్శమాల!
నీతికి నీడనిచ్చే వృక్షం
నిజాయితీకి చోటు కల్పించే పుణ్యక్షేత్రం
కుటుంబం!
మన కుటుంబం!!
సంస్కృతి తన శ్వాసగా
సంప్రదాయం
తనఊపిరిగా
సంఘ మేలు తన ధ్యేయంగా
పునాదులు నిర్మిస్తుంది కుటుంబం!
ఆదిమ జాతికైనా
ఆధునిక నాగరికతకైనా
మనిషికి విలువలు
నేర్పింది కుటుంబం!
మానవుడిని ముందుకు నడిపే చక్రం కుటుంబం
మానవ మనుగడకు
మేలు చట్రం కుటుంబం!

*దండ్రె రాజమౌళి*

[5/17, 6:05 PM] Poet Padma Tripurari: ఊహాసుందరి
   ****************
పల్లవి::

  కనులకు కాటుక
నొసటను తిలకము
చేతికి గాజులు
విసిరిన వాల్జడ
సుందరమైన ఊహాసుందరి
నందనమాయెను డెందము నిండగ

            "కనులకు"


చరణం:::

జడను తురిమిన మల్లెలు మొల్లలు
చిరునగవు విరిసిన నవ్వుల పువ్వులు
కనుదోయిన నిలిచిన ప్రేమకరుణలు
కలువ కన్నుల ఊహాసుందరి

          "కనులకు"


చరణం::

గలగలమాటలు ముత్యపుమూటలు
హంసల నడకలు వెన్నెల జిలుగులు
అందముకందని అందము తానై
చిన్నెలు చిందిన ఊహాసుందరి


చరణం::::

ఘల్లు ఘల్లుమను అందియ రవళులు
రమణీయ లహరుల మమతల సిరులు
సిరి వెలుగు జిలుగుల జాబిలి సొబగులు
సొగసుల మనసుగ వెలిగిన సుందరి భారతనారి

           "కనులకు"


              పద్మ త్రిపురారి
              జనగామ
[5/18, 8:08 AM] Poet Satya Neelima: శీర్షిక : సంస్కృతి-సంప్రదాయాలు

ఎక్కడుంది మన సంస్కృతి
మచ్చుకైనా కనపడదే
మనదేశ వారసత్వ సంస్కృతి
ఏమాయెను ఆ సంప్రదాయాలు
ఎక్కడున్నవి ఆ వేశదారణలు
అచ్చతెలుగు లోన ఆంగ్లం కలిసె
పంచకట్టు పోయి ప్యాంటు వచ్చె
చీరకట్టు పోయి స్త్రీ వస్త్రధారణ మారె
విదేశీ అలవాట్లు మనదేశం కొచ్చె
ఆ ఒగ్గుకథలు,బుర్రకథలు ఎక్కడ
ఆ యక్షగానాలు,చెక్కబజనలు ఎక్కడ
మరచిపోతిరా మన సంస్కృతి
మనదేశానికి అదే అధోగతి
మార్పురావాలి ఇప్పటికైనా
భావితరాలకు తెలపాలి మన సంస్కృతి సంప్రదాయాలను ఇకనైనా...

                 ✍...సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                        వనపర్తి..

[5/18, 8:42 PM] Poet Kusumanchi Sridevi: 🤝సంస్కృతి -సాంప్రదాయాలు👨‍👩‍👦‍👦
శ్రీదేవి సురేష్ కుసుమంచి
------------------------
ప్రపంచ చరితలలోనే
ప్రత్యేకత చాటిచెప్పిన
సంస్కృతి మనది!


దేశ విదేశాలు చేతులెత్తి
నమస్కరించి..
ఆచరించడానికి
ఆకర్షితులౌతున్న
విభిన్న సంప్రదాయాలను
ఇనుమడింప చేసుకుని
ఉన్నతంగా నిలిచిన
సంస్కృతి మనది!

పెద్దల ఋణం తీర్చుకునే
పండుగలు..

ప్రకృతిని గౌరవించే
తొలి మాసపు
పలకరింపులు!

విభిన్న రీతులలో
వివాహమహోత్సవములు!

మన సంస్కృతి
సాంప్రదాయాలకు
నిలువటద్దం పట్టే
కుటుంబవ్యవస్థ!

నేడు ఆధునికత
మోజులో పడి...
చెదలు పట్టిస్తున్న
మన సంస్కృతి
సాంప్రదాయాలను
కాపాడి...
భావి తరాలకి అందించే
బాధ్యత మనందరిది!

[5/20, 5:53 AM] ‪+91 98853 80371‬: అంశం:సంస్కృతి, సాంప్రదాయాలు
శీర్షిక:పల్లెసంస్కృతిలో పడతి ప్రస్థానం

పుట్టిన తొలిరోజే గుగ్గిళ్ళు, ముంతకల్లు ఇంటింటికి ముట్టజెప్పడం

మేనత్తలు చెవిలో మెల్లిగా పలుకుతూ తొట్ల కిందనుండి పైకి తీస్తూ బిడ్డ పేరు బెట్టడం

పెద్దమనిషయితే ఆడాళ్ళంతా పాటలువాడి పిండివంటలతో నవరాత్రుల సంబరం జేయడం

తండ్రి చాటు బిడ్డగా పట్టుపరికినిలో ఇంటిలో యువరాణిగా మెలగడం

పెళ్లి కాయంజేయాలంటే చుట్టుపక్కల బంధువులల్ల ఒకటికి వందసార్లు పురమాయించడం

నలుదిక్కుల ఇత్తడి నీళ్ళసెంబులకు దారంజుట్టి రోకలిబండపై వధూవరులకు స్నానం చేయించడం

పందిట్ల నల్లగొంగడేసి బియ్యంతో శాసవోసి పీటలపై కూర్చోబెట్టడం

తల్లిదండ్రులు అల్లుడి కాల్లుకడిగి కన్యాదానం చేస్తే శ్రీలక్ష్మియై భర్త గుండెగుడిలో కొలువుండడం

పండగ పబ్బానికి ఇంటికొస్తే పాదాలకు పసుపువూసి కుంకుమ బెట్టి సారెతో ఒడిబియ్యం నింపడం

ఏడుమాసాల నిండు గర్భిణికి ముత్తైదువుల దీవెనలతో సీమంతం జేయడం

గంజికి గతిలేకపోయినా తొలిసూరి కాన్పు పుట్టింట తోబుట్టువులతో జరుపుకోవడం

బిడ్డకున్న బొడ్డుపేగును కుండలబెట్టి మాయిగుంతల పూడ్చి పూజించడం

కానుపైన కన్నతల్లికి ఇంటింటి వేడినీళ్లతో తానం జేయించడం

కుండకొప్పెరలో పిడకల పొగబెట్టి నులకమంచంపై బాలింతకు కాపుబెట్టడం

పండంటిబిడ్డతో ఎళ్ళేటప్పుడు కన్నోళ్లకు ఇంటిగడపకు మొక్కి పుట్టింటి క్షేమాన్ని మెట్టింటి సౌభాగ్యాన్ని కోరుకోవడం

ఊరిపక్కన జాతరయితే కారంబొరుగులు జిలేబి మైసూరుపాకులు ఊరోళ్లతో అమ్మనాన్నలకు పంపడం

పుట్టింటిలో చిన్నశుభకార్యమైనా తాను కంచాతులు బట్టి ముందుండి జరిపించడం

గోసికోసుకుని కోతగోస్తే వరికంకులు నాట్యమాడుతూ తన చేతిలో వాలిపోవడం

నిండైన చీరకట్టుతో పొద్దున్నే పొలానికెళుతుంటే భానుడు తన నుదిటనే ఉదయించడం

నడుమొంగిన వయసులోనూ పుట్టింటి నుండి పిలుపుకోసం రేయింబవళ్లు ఎదురుచూడటం

పల్లె సంస్కృతిలో పడతి
నడత నేర్పే ఆదిగురువు

పల్లె సంస్కృతి పరిరక్షణలోనూ
పడతి పాత్రయే ప్రాముఖ్యము.
----------------------------------------
     ...✒  బింగిదొడ్డి వెంకటేష్,
 కవి,జీవశాస్త్రఉపాధ్యాయుడు
  విద్వద్గద్వాలసాహితీసేవకుడు
చరవాణి:9885380371.

Comments