అమ్మేకదా... అఖిలము..
గోగులపాటి కృష్ణమోహన్
అమ్మేకద మనదైవం
బమ్మయె గుండెగుడిని కొలువై నిలచు సదా
అమ్మేకద మనకఖిలము
అమ్మేప్రత్యక్ష దైవమగునిల కృష్ణా
అమ్మేకద యాధారము
నమ్మేకద దైవమనిన నమ్మే సర్వం
బమ్మేకదభూమాతయు
నమ్మే కదభరతమాత యంజలి కృష్ణా
మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు...
💮💮💮💮💮💮💮💮💮💮💮💮
కవిపేరు: నరేశాచార్య
మాతృమూర్తిమనకు మమతసమత బెంచు
పెంచిపెద్దజేయు పేర్మితోడ
గోరుముద్దలెట్టి గొప్పవాళ్లనుజేయ
కష్టబడుచుబెంచు కన్న మనసు!!
కన్నతల్లినెపుడు కష్టబెట్టనువద్దు
మనల మోసికన్న మమత యామె
రెండువంశములను రెట్టింపుజేసెటి
అపర బ్రహ్మయమ్మ నవనిలోన!!
వేంకటేశు డెపుడు వెలుగుచుండెనిలలో
అమ్మదనముకొరకు నలరుచుండి
వకుళదీవెనలతొ వరుడిగా తానయ్యి
వరము దీర్చుకున్న వంద్యుడతడు!!
"మహిళ లనగ శక్తి మానవాళి కెపుడు
గౌరవించవలయు వారి నెపుడు!
పద్దతిదియె సుమ్ము భారతావనిలోన
దివ్య నారసింహ దీనబంధు! !"
......ఆచార్య
[5/7, 9:01 PM] కృష్ణమోహన్ గోగులపాటి: అంశం : మాతృమూర్తి
శీర్షిక: ఆడ జన్మకి గర్వ కారణం….
``````````````````````````````````
రచన : గోగులపాటి కృష్ణమోహన్
ఆడ జన్మకి గర్వ కారణం….అమ్మే.
అమ్మ అనే కమ్మని మాట లోనే వుంది...
అమృత ధార….
మన జన్మకి తన ప్రాణాన్ని పణంగా పెట్టే ఈ అమ్మ జన్మ... ఇలలో ఒక అద్భుత వరం…
ప్రేమ పంచి పెంచి, లాలించి, బుజ్జగించి
అభిమానాన్ని గోరు ముద్ద గా పెట్టే అమ్మకు...
ఆ బ్రహ్మ కూడా దాసోహమేగా….
కర్ఖోటకుడిని సైతం కళ్ళల్లో పెట్టి చూసుకునే ఓర్పు అమ్మ ప్రేమేగా ….
గుండె మండేలా మాట్లాడినా,
గునపాలు దించినా, కిక్కురుమనక అనురాగం పంచేది అమ్మేగా…
కంట నీరు పెట్టించినా, ఎంత వేదన మిగిల్చినా, వెన్ను తట్టి ఓదార్చేది అమ్మ అనురాగమే కదా…
మనకి కష్టమొస్తే తన కన్ను..
నీరు వర్షిస్తుంది...
మన కష్టంలో వేలు పట్టి నడిపిస్తుంది...
ఎంతటి పాషాణ గుండెకైనా... మమతని ధారబోసేది అమ్మే…
అమ్మ అని పిలిస్తే ఆప్యాయాన్ని అంతా ఆలంబనగా చేసి, మన విజయానికి మనల్ని మించి సంబరపడి పండగ చేసుకునేది అమ్మ ప్రేమే…
మనకి కొండంత అండగాతన గుండె పరిచి నడిపించి కాపాడేది ఈ అమ్మ జన్మేగా….
ఆడ జన్మకి గర్వ కారణం….అమ్మే. అమ్మనే...
అమ్మలందరకీ... అంకితం...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653.
[5/8, 7:13 AM] Poet Satya Neelima: అంశం : మాతృమూర్తి
శీర్షిక : అమ్మ,
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ భువిలో వెలసిన దేవత రూపమే అమ్మ
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జన్మనిస్తుంది అమ్మ
అమ్మలో అ అంటే అనురాగం
మ అంటే మమకారం
అనురాగానికి,మమకారానికి
మారుపేరు అమ్మ
ఆరెంటినీ కలిపి రంగరించి అమ్మను చేశాడు ఆ బ్రహ్మ
అమ్మ లేకుంటే చెమ్మగిల్లును నా కళ్ళు
అమ్మ ఉంటే పులకరిచును
నా తనువు
అమ్మ ఒడి వెన్న కన్నా మెత్తన
ఆ ఒడిలో పవలిస్తే ఆనందంతో
నిండిపోవును నా మనసు
అమ్మ ఒక తియ్యని పిలుపు
అమ్మ ఒక చక్కటి వెలుగు
బుద్ధి నేర్పింది అమ్మ
మమత నేర్పింది అమ్మ
తప్పటడుగులు వేయకుండా సరిదిద్దేది అమ్మ
మనం జన్మించినప్పటి నుండి
ఎన్నో సేవలు చేసి,
అనేక కష్టాలు పడి,
ఎన్నో బాధలకు ఓర్చి
మనలను పెంచి పెద్దచేసిన
ఆ త్యాగమూర్తికి మనం
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం
మన జీవితాన్ని తల్లి పాదపద్మముల ముందు ఉంచడం తప్ప...
మాతృదేవోభవ..
దివికేగిన అమ్మకు అంకితం చేస్తూ....
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది నా స్వీయరచన
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
వనపర్తి..
[5/8, 12:35 PM] Poet Musthakheem విన్నర్: అంశం :మాతృమూర్తి
కవిత : అమ్మ
కవి : విన్నర్
తేది :08-05-2018
అమ్మ ఇచ్చిన ..జీవితం
ఆజన్మాంతమూ ..ఆమెకే అంకితం ..
అమ్మ ప్రేమ స్వచ్ఛం..అనంతం
అమ్మ ను యెప్పటికి వీడలేని పంతం ..
అమ్మ సేవ , త్యాగం ..యెన్నడూ కాదు సుఖాంతం ..
అమ్మ అనురాగం , ఆప్యాయత , పుత్ర పుత్రికా వాత్సల్యం ..అమూల్యం , శాశ్వతం ..
అమ్మ లో యెదారు , ఆందోళన
బిడ్డ కనిపించే వరకూ , అమ్మ మనసు అశాంతం..
అమ్మ ఆనందం ..బిడ్డల ఆనందం ..అమ్మ అశ్రువులు
బిడ్డల బాధలు ..సుఖమెరుగని
జీవితం ఆసాంతం ..
అమ్మ ఆహార్యం , అమ్మ నడవడి లో అమూల్య మమతానూరాగాల గొప్పదనం
యెన్నడూ , యెప్పుడూ తన గురించి ధ్యాస , ఆలోచన లేని
భర్త పిల్లలే సర్వస్వంగా నున్న గతమే ..గతం ..
"మాతృ దినోత్సవం" శుభాకాంక్షల తో ..
రచన : విన్నర్ .
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[5/10, 10:40 AM] Poet Uppari Thirumalesh Sagar, Wanaparty: *🌷శీర్షిక: అమ్మ 🌷*
రచయిత: ఉప్పరి తిరుమలేష్
🌷🌷🌷🌷🌷🌾🌾🌾
తన ప్రాణాలు ఫణంగా పెడుతూనే
బిడ్డకి జన్మనిస్తుంది
అమ్మ పరమాత్మ స్వరూపిణి
నవమాసాలు మోస్తూనే
పురిటి నొప్పులబాధ భరిస్తుంది
పేగుబంధం అమ్మ
తను పస్తులుంటూనే
తన పిల్లలకు ఆయువు పోస్తుంది
అమ్మ ఒడి ఆహారబాండాగారం
తన కంటిలో నీటిని దాచుకుంటూనే
మన కంటిని తుడుస్తుంది
ఆత్మబంధువు అమ్మ
తను మనకు నీతి కథలు చెప్పుతూనే
మనలో నిజాయితీ పరుడు తయారు చేస్తుంది
మొదటి బడి అమ్మ ఒడి
మానవతా విలువలు
బోధిస్తూనే
భవిష్యత్తు బతుకు పునాది వేస్తుంది
అమ్మ ఒడి అక్షరాల నిధి
ఉగ్గుపాలు పడుతూనే
మనలో వీరత్వంకి పునాది వేస్తుంది
వీరుల పురిటిగడ్డ అమ్మ గర్భగుడి
ఆకాశంలోని చంద్రుడుని చూపించి గోరు ముద్దలు తినిపిస్తూనే
అవధులు లేని విశ్వంలో విజయాలు సాధించాలని కోరుకుంటుంది
అమ్మ ఆశీర్వచనాలే
విధిరాతలు
అమ్మ క్రొవ్వొత్తిలా కరిగి
పోతూనే
తమ పిల్లల అభివృద్ధికి కృషి చేస్తుంది
అమ్మని మించిన దైవం లేదు
సృష్టి కర్తకు కూడ తల్లి అవుతూనే
వేళ ఎరుగని మాతృమూర్తి అనిపిస్తుంది
మాతృమూర్తులు మానవతావృక్షాలు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍రచయిత
ఉప్పరి తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
9618961384
[5/10, 10:18 PM] +91 96033 88680: 💐🌷అమ్మ🌺🌹
ఆప్యాయత అనురాగలకు నిలయం అమ్మ
అవనిపై వెలసిన అపురూప బ్రహ్మ సృష్టి అమ్మ
మాంసపు ముద్దవంటి దేహాన్ని ముత్యంలా మర్చుతూ
దీపంలా నిన్ను వెలుగిస్తూ తైలములా తను ఆవిరైతు
నీ చిరునవ్వు ఆ తల్లికి స్వర్గదామం
నీ సంతోషమే ఆమెకు అమృతదామం
ఆస్తులు అంతస్తులు మణులు మాణిక్యలు
ఆ మాతృమూర్తి ప్రేమముందు మౌనంగా మోకరిళ్లు
జీవించినంత కాలం ఆమెకు కట్టాలి నీ గుండెల్లో గుడి
అది చూసిన ప్రతిమనిషిలో కలగాలి గుండెతడి
ఏమిచ్ఛినా ఎంతిచ్ఛినా తీరనిది తల్లి నీ ఋణం
అందుకే నీ సేవ కొరకు పెడుతున్నా నా ప్రాణమైన ఫణం.
💐🌺🌷🌹🌸కృతఙ్ఞతలు🦋🍀భూచంద్ర🙏🙏
[5/11, 3:33 PM] Poet Palloli Shekar Babu: .పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర కొలిమిగుండ్ల 9490484316
🌺🌺🌺🌺
అమ్మ
🌺🌺🌺🌺
అర్చిస్తేనే దేవత
కోరిక నెరవేరుస్తుంది !
అర్తించకుండానే అమ్మ
అన్నీ సమకూరుస్తుంది ! !
ఆ దేవత కన్న
అమ్మ కదా మిన్న !
తేనె కన్న మధురం
అమ్మ మనసు వెన్న ! !
తన ప్రాణం పణంగా పెట్టి
బిడ్డకు జన్మనిస్తుంది !
రక్తాన్ని పాలగా మార్చి
పోషించి పెంచి పెద్దచేస్తుంది ! !
కంటికి రెప్పలా ఎల్లవేళలా
బిడ్డను కాపాడుతుంది !
ఉన్నత శిఖారాలకు ఎదగాలని
అహర్నిశలూ ఆశపడుతుంది ! !
దేవత నైవేద్యం కోరుతే . . !
అమ్మ బిడ్డ శ్రేయస్సు కోరుతుంది ! !
సృష్టిలో ప్రతిఫలం కోరనిది అమ్మ ఒక్కటే !
దైవాల కు దైవం ఈ అమ్మ ఒక్కటే ! !
అమ్మ బ్రహ్మ! అమ్మ విష్ణుః !
అమ్మ దేవోమహేశ్వర: ! !
అమ్మ సాక్ష్యాత్ పర బ్రహ్మ!
తస్మయ్ శ్రీ అమ్మే నమః ! !
అమ్మను ప్రతి రోజూ పూజించు !
అమ్మను ప్రతి నిత్యం సేవించు ! !
సకల సౌఖ్యాలు సాధించు !
సుఖంగా ఇలలో జీవించు ! !
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర కొలిమిగుండ్ల 9490484316.
🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅
[5/12, 2:56 PM] Poet Mastan Vali: అంశం : మాతృమూర్తి
శీర్షిక : ఇలపై దేవత అమ్మ
కవి : మస్తాన్ వలి
👩👧 🤱🏻👸🏻 👩🚀 🧚🏻♀ 🏃🏻♀🚶🏻♀ 🧚🏻♀ 👸🏻🤱🏻👩👧👩👧
ఈ సృష్టి లో ఎవరూ చేయని దాన్ని
చేయగలిగేది కేవలం అమ్మ ఒక్కటే
దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒక్కటే
ఒక వైపు వునా సరిరారు అమ్మకు వారు
తన ప్రాణాన్ని తృణ ప్రాయం గాచేసి
జన్మ నిస్తుంది బిడ్డకు తల్లి
అమృతాన్ని పంచి,
ఆయుష్షు పెంచేది
మాతృమూర్తి
అందుకే ....
మాతృదేవోభవ అని తల్లి కే
అగ్రస్థానాన్ని చేకూర్చి ఆర్యులు
కన్న ప్రేగు కోసం, తన కున్న ప్రేగు
తెంచుకొనే త్యాగమూర్తి,
మన మాతృమూర్తి
🌹🤱🏻🌹🤱🏻👩👧🧚🏻♀👸🏻🚶🏻♀🚶🏻♀🏃🏻♀👸🏻🧚🏻♀🌹👩👧
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతు శాస్త్ర అధ్యాపకులు
సెల్ : 99 483 57 673.
[5/12, 9:16 PM] Poet Padma Tripurari: అమ్మపాట
************
పల్లవి::
కంటిరెప్ప నీవై కంటిపాపవోలె
"నను పెంచిన
ప్రేమవు నీవమ్మా." 2
"కంటి"
చరణం::
దైవమన్నరూపం
నీలో వెలుగై
"నను నడిపే
జాబిలి నీవమ్మా" 2
"కంటిరెప్ప"
చరణం::
లోకమంత ఒకటై
నీ ఒడిలో చేరి
"జోలపాట పదమై
చేరెనమ్మా."
"కంటిరెప్ప"
చరణం::
ప్రేమకు రూపం
అనురాగ దీపం
సృష్టికి నీవే అపురూపం
అమ్మా!
సృష్టికి నీవే అపురూపం.
"కంటిరెప్ప"
చరణం:::
కన్న ప్రేమకన్న
మిన్న ఏది లేదని"
మిన్ను మన్ను చాటిన సహనవమ్మా" 2.
"కంటిరెప్ప"
పద్మ త్రిపురారి
[5/12, 9:18 PM] Poet Padma Tripurari: అమ్మ
*********
అపురూప రూపం అమ్మ
అనురాగ దీపం అమ్మ
అలవికాని మమతల మణిదీపం అమ్మ
ఆత్మీయానుబంధాల ఆరాధ్య దైవం అమ్మ
కరుగుతూ వెలుగునిచ్చే కోటిదీపాల కాంతి అమ్మ
తనలోని ప్రతిరూపమే తన ప్రపంచమయిన అమ్మ
పొత్తిళ్ళలోని బిడ్డే పుత్తడని మురిసే ముదిత అమ్మ
ఒడిలోని బుజ్జాయి
బోసినగవుల పాపాయి
హృదయాన హత్తిన
భుజముపై మోసినా
వీపుపై ఆడినా
ఆనందమే తానై
అవని ఓర్పుకు రూపమై
పసిబిడ్డయే లోకమైన
ఆనందామృత కరుణార్ధ్రతా తపోమయి అమ్మ
బుడి బుడి అడుగులతో
తడబడు నడకలతో
ఎదిగెడి తన బిడ్డ పరుగుల వెనుక అలుపెరుగక పరుగెడుతూ
అణువణువున తానై
కంటికి రెప్పగ పసిపాపను కాచెడి
అమ్మలగన్నయమ్మ ఆ మూలపుటమ్మయే అమ్మ
పద్మ త్రిపురారి
[5/12, 10:20 PM] +91 98853 80371: 💐💐🙏🙏అమ్మ🙏🙏💐💐
అమ్మమనసు
పసిపాప నవ్వులెక్కుంటది -
అది స్వచ్ఛత
అమ్మగుణం
అరిటాకులో భోజనంలెక్కుంటది -
అది పవిత్రత
అమ్మకోపం
ఆకాశంలో నల్లమబ్బులెక్కుంటది -
అది శీఘ్రమాయం
అమ్మఆశ
తనబిడ్డ ఢిల్లీకే రాజు అన్నట్టుంటది -
అది ప్రేమ
అమ్మ ఆలోచన
బిడ్డలసుట్టే ఇసుర్రాయి తిరిగినట్టుంటది -
అది రక్షణ
అమ్మ ప్రేమ
అనంత విశ్వమంతుంటది -
అది కొలువలేనిది
అమ్మ కరుణ
మహాసముద్రమంతుంటది -
అది తరగనిది
అమ్మ త్యాగం
వెలిగే కొవ్వొత్తిలాగుంటది -
అది కొనలేనిది
అమ్మ ఆశయం
గురువులాగుంటది -
అది ఉన్నతమైనది
అమ్మస్మరణ శ్రీరామరక్ష
అమ్మపూజ లోకరక్ష
మలి వయసులో అమ్మ ఆదరణ
అంతకుమించిన ఆరాధన
లేదు ధరణి యందున.
----------------------------------------
(మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకు అంకితం)
...✒బింగిదొడ్డి వెంకటేష్,
కవి,జీవశాస్త్రఉపాధ్యాయుడు,
విద్వద్గద్వాల
సాహితీసేవకుడు,
చరవాణి:9885380371.
[5/12, 11:18 PM] Poet Ghaali Lalitha: ,🌻సువర్ణ పుష్పం🌻
💮💮💮💮💮💮💮💮💮💮💮💮
దివి నుంచి భువికి...
దిగివచ్చిన దేవత
వరాలు ఇవ్వడమే తెలుసుగాని తీసుకోవటం తెలియని తరువు
కష్టాలను,కన్నీళ్ళను .. గుండె లోతుల్లోదాచేసి తన వారి సంతోషం కోసం తను సమిధ అవుతుంది
బిడ్డల ఇష్టమే తన ఇష్టంగా మార్చుకుంటుంది .
తన కన్నా గొప్ప వాళ్ళు అవ్వాలని తనకొచ్చిన విద్యనంతా ముందే నూరిపోస్తుంది
వారి నవ్వుల్లో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది
తనకంటూఏమీ మిగిల్చుకోని కొవ్వొత్తి లా కుటుంబ సభ్యులందరికీ వెలుగు పంచుతుంది.
ఆమె కరిగే శిల్పం
చిరునవ్వుల రూపం
అనురాగ దీపం
మమతల మణిహారం
అమ్మ మనందరికి ఓ సువర్ణపుష్పం
**************************
[5/13, 10:34 AM] పెసరు లింగన్న Poet: 🙏 *అమ్మ కు ప్రేమతో!*🙏
అమ్మ అనే రెండక్షరాలు
కావవి మామూలు స్వరాలు
సంగీతం పలికించే సప్తస్వరాలు,
సృష్టికి మూలమయే బీజాక్షరాలు!
అమ్మ అంటే అమృత భాండం
అమ్మ అంటే ప్రాతఃస్మరణీయం
అమ్మ కంటేనే ఉన్నామందరం
అమ్మ ఉంటేనే ఆనంద నిలయం!
అమ్మ అంటే కనిపించే దైవం
అమ్మ అంటే ప్రేమ స్వరూపం
అమ్మ వెంటే శక్తి ప్రసారం
అమ్మ ఉంటేనే ఉంది ప్రపంచం!
అందుకో అమ్మా వందనం
అందివ్వమ్మా ఆశీర్వాదం
ఒక్కరోజేందమ్మా నీ స్మరణం?
ప్రతీక్షణం నీకు పాదాభివందనం!
———®———
🙏🙏🙏అమ్మలందరికీ శుభాభివందనాలతో...!!
—————పెసరు లింగారెడ్డి
[5/13, 10:52 AM] Poet Pudathu Bhaskar: 🌹అమ్మ🌹
************
ప్రకృతి రూపం అమ్మ
త్యాగానికి వెరువనిది అమ్మ
సృష్టికి ప్రతి సృష్టినే
తనగర్భంలో పోగేసుకొని
రక్త మాంసాలను రంగరించి
అందమైన రూపును తీర్చిదిద్ది
తనను తాను మరిచిపోయి
మరో తనువుకై జీవం పోసి
తనగర్భగుడిని గూడుగా చేసి
సజీవ శిల్పాన్ని సృష్టించి
మరణం అంచున తాను చేరి
మరో జన్మకు పురుడు పోసి
అవంతరాలను ఆటంకాలను
అనుభవించి ఆందోళన చెంది
అవని పైకి తీసుక వచ్చి
ఆనందాన్ని కురిపించి
ముద్దు మురిపాలను పంచి
ముదిమిలోను ప్రేమను పంచి
పరితపించేది అమ్మ
ఎన్నిజన్మలెత్తినా తీర్చలేనిది
అమ్మ ఋణానికి లేదు అవది
అందుకే అమ్మలకు అమ్మ
నీకు పాదాభివందనమమ్మా!
🌹రచన🌹
**********
పూదత్తు భాస్కర్
తెలుగు ఉపాధ్యాయులు
జి.ప.ఉ.పా.మల్దకల్
జోగులాంబ గద్వాల
[5/13, 1:10 PM] +91 94411 10427: **మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో**
ఉత్సాహ వృత్తములు:
1. అమ్మ మాట లెపుడు మనకు నక్షరాల మూటరా
అమ్మ చెంత నుండ మనకు నన్ని పనులు తీరురా
అమ్మ యుండు నెపుడు నీకు నాప్త మిత్రు రాలుగా
అమ్మ లేని జీవితమ్ము నడవి రోదనే సుమా!
2. అమ్మ మాట లన్న నెపుడు నాలకించ వేమిరా
కమ్మ నైన జీవితమ్ము కలుగు నీకు పుత్రుడా
బొమ్మ వలెను నిన్ను పెంచి పోషణమ్ము చేసెనే
చెమ్మ గిల్ల నామె కనులు చేయ బోకు మెప్పుడున్
మేడిచర్ల హరినాగభూషణం, గద్వాల.
[5/13, 4:57 PM] Poet Kusumanchi Sridevi: అంశం-అమ్మ
కుసుమంచి శ్రీదేవి
-----------------
అమ్మంటే దేవుడు
సృష్టించిన అధ్భుత రూపం..
అమ్మనే మాట
తలవగనే ప్రసాదిస్తుంది
వేయేనుగుల బలం,.,
అమ్మ మాటలో
ఉంది అమృతం!
అమ్మవడం ఓ తియ్యని
అనుభూతి...
ప్రేమ పరిమళాలు
మాత్రమే వెదజల్లే
అనురాగ దేవత!
తన కోసం మరిచి
అనుక్షణం బిడ్డ
క్షేమం కోరుకునే
ఇలలో దైవం!
నవమాసాలు తనలో
వచ్చే కష్టతరమైన
మార్పులు ఆనందంగా
ఆస్వాదించి,
ఓ బిడ్డకి జన్మనిచ్చే
అమృతమూర్తి! అమ్మ
అమ్మతనం ఒక వరం
అమ్మను పొందడం
అదృష్టం!
అమ్మ ఉన్న చోట
అమృతం అవసరముండదు!
అమ్మే ఓ అమృత కలశం!
[5/13, 6:00 PM] Buf Amaravadi Rajashekar Sharma: తొమ్మిది నెలలు
కమ్మని ప్రేమతో
అమ్మే మోసింది
చక్కని ఆకృతి
మక్కువ గోరి
దృక్కున నిలిపింది
ఆలోచనలూ
అదుపున బెట్టి
మంచిని తలచింది
వసుమతి పై బడు
పసిపాపను గని
ఎంతో మురిసింది
తన ఆరోగ్యం
తన ఆహారం
తలపున విడిచింది
మనకై సతతం
తన సర్వస్వం
అనిశం వదిలింది
తరగని ప్రేమను
విరగని మనసును
మురిపెమునిచ్చింది
ఎన్నో చేసీ
మననీ భువిన
మనిషిగ నిలిపింది
అమ్మా అనెడి
కమ్మని పిలుపుకు
కొంగును చాపింది
అంతే చాలంది
ముడుపులు కోరిన
దేవుడి కన్నా
ఎత్తున నిలిచింది
మనదేముంది అంతా తనదే
తనకింకేముంది అంతా మనమే
అమరవాది రాజశేఖర శర్మ
[5/13, 7:59 PM] Poet Rajmouli Dandre: *శీర్షిక:అమ్మ*
*************
నవమాసాలు మోసి
పురుటి నొప్పులతో మరుజన్మ ఎత్తి
ఈలోకాన్ని నీకు చూపుతుంది అమ్మ!
తనువును పంచి
ప్రేమతో పెంచి
రక్తాన్ని చెమటగ చేసి
ప్రతిక్షణం నీ బాగుకోసం
తపిస్తుంది అమ్మ!
నువు తప్పటడుగులు వేస్తుంటే తన కష్టాన్ని
మరచిపోతుంది!
ముద్దు ముద్దు గా
పలుకుతుంటే మురిసిపోతుంది!
తను కడుపు మాడ్చుకుని నీ కడుపు నిండిందో లేదోనని
ఆరాటపడుతుంది!
చెట్టంత ఎదిగినా
పసివాడిగానే చూస్తుంది
నువు కలత పడితే
తను కలవరపడతది!
నీ అరికాలికి ముల్లునాటితే
తను విలవిలలాడుతుంది!
నీ కంట్లో నలుసు పడితె
తను కన్నీటిసంద్రమౌతది!
అమ్మ చూపు చల్లన
అమ్మ మనసు మెత్తన
అమ్మ మాట చక్కన!
అమ్మ కోవెల లేని దేవత
అమ్మ కళ్ళముందు కదలాడే దైవ స్వరూపం!
*దండ్రె రాజమౌళి*
*వరంగల్*
👌🙏🙏🙏Vandanamulu Meeku..👍
ReplyDelete