వేసవి సెలవులు


వేసవి సెలవులు...
 ఈ వారం అంశం
వేసవి సెలవులు రాగానే అందరూ పట్నాలనుండి ఒల్లెలకు... పల్లెలనుండు పట్నాలకు పయనం అవుతూ... బందుమిత్రులను కలుస్తూ ఆనందడోలికలలో మునుగుతుంటారు... ఇప్పుడు ఆ రోజులు కరువయ్యావనే చెప్పవచ్చు...
అందుకే ఈ వారం అంశం...
"వేసవి సెలవులు"
గోగులపాటి కృష్ణమోహన్

ఎండల సెలవులయందున
దండిగ బంధువులు మిత్ర తతి వేడుకలన్
నిండుగమధురాన్నములన్
వండుకొని భుజింతురు తీరిబంతుల కృష్ణా

[4/22, 12:08 AM] Manne Lalitha: 7416863289
కవిరత్న,సుాక్తిశ్రీ
మన్నె(పిన్నక)లలిత.
హైదరాబాద్.
22.4.2018.
అంశం:వేసవిసెలవులు.
××××××××××××××××××
వేసవిసెలవులు ఇచ్చారండీ
పుస్తకాల్ పెన్ లు
అటకెక్కించండి
బట్టలు బొమ్మలు సర్దండి
ఛుక్ ఛుక్ రైలు ఎక్కండి
కదిలే చెట్లను చుాడండి
పల్లీ బఠాణీ తినండి
బొమ్మల పుస్తకాలు కొనండీ
నీతులెన్నొే తెలియండి
 జట్కాబండీ ఎక్కండి
నానమ్మ తాతగార్లను చుాడండి
నానమ్మ చేతి పిండివంటలు గొేరుముద్దలు గడ్డపెరుగు
కొత్తావకాయ నంజుకు తినండి
తాతచుట్టిన తలపాగాతొే
చిన్నరైతువై ఎడ్లబండెక్కి
చెర్నాకొేల చేతబట్టి
హేయ్ హెయ్ అదిలింపులతొే పొలందరి చేరండి
మామిడి నీడన కాయతెంపి కొరికి
వగరుపిందని ఊస్తే
తాతగారిచ్చిన తియ్యని కొబ్బరిబొండం నీరుతాగి
లేత కొబ్బరి తాతచే బతిమిలాడి తినిపించుకుని
చెరుకు గానుగ దగ్గర
బెల్లం పానకం తాగి
నిమ్మతొేటలొే కాయలుకొేసి
తాత పైపంచెలొే ముాటగట్టి
 చక్రకేళి గెల,ఈతగెల,లేత అరటి ఆకులు కొేయించి బండిలొే పెట్టించి
  తాటి ముంజలు మెువ్వాకులొే చుట్టించి
'ముంజలు తిన్నాక మావిడి ముక్క తినాలన్న'
నానమ్మ మాట గుర్తొచ్చి
తీపి మామిడి కాయలు తెంపి గుత్తిపట్టుకుని
బండెక్కి
గణగణ గంటలు మువ్వల చప్పుడుతొే
చప్పుడుచేయక నానమ్మను భౌమంటుా దడిపించి
తాతగారి ముసిముసినవ్వులతొే శ్రుతి కలిపి
బావి స్నానంచేసి
వేడి వేడి అన్నం
 అప్పుడే కాచిన నెయ్యి
కుారలు,వడియాలు ఘుమాయించే ఉలవచారు ,మీగడ
గడ్డపెరుగు మాగాయి ముక్క నంజుడు
రొేజుాతినే అన్నమే రుచులువేరు
ఆరుబయట నీళ్ళుచల్లి
సందముగ్గువేసి
మంచాలు దుప్పట్లు వేసిన
దానిపై కొబ్బరాకుల సందుల్లొేనుండి వచ్చేచల్లని తెల్లని వెన్నెల
'నైట్ క్వీన్'సువానను మెాసుకొచ్చే పిల్ల తెమ్మెర
 ప్రాణం ఊహాలొేకాల్లొేకెళ్ళి
 మామయ్య పిలుపుకు లేచి హుషారుగా తయారై
మామ తెచ్చిన కొత్త యమహా బండెక్కి
తాతగారిచ్చిన నొేట్లు జేబులొే కుక్కి
నానమ్మ తడికళ్ళుతుడిచి
మరలావస్తానంటుా చెయ్యుాపి
మామయ్యతొే వేగంగా బండి నడిపించి
అమ్మమ్మను తాతగారిని గుమ్మంలొేచుాచి
ఒక్క గెంతుతొే దుాకి
ఇద్దరి చేతులు పట్టుకుఊపి
ఆవిరికుడుం ,సంబారు ,
మీగడతొే లాగించి
స్నేహితులతొే చెరువుగట్టు
గుడిచుాచి
కలువలు కొేసి,కలేకాయలు కొేసి ,ఆటలాడి అలిసి ఇల్లుచేరి
 మనవడొచ్చాడని ఎవరొేఇచ్చిన జున్ను తిని
పుట్టకొక్కుల కుార,తొేటకుార పచ్చడి,
కొడుగుడ్డుఅట్టు(ఆమ్లెట్)
చారు,మినప వడియాలుఅప్పడంతొే భొేజనం ముగించి
 తాతగారిపందిరిమంచంపై
పక్కలొే పడుకుని కథలువింటుా
నిద్రలొేకిజారి తియ్యని కలలుకంటుా ......
వెధవా!సెలవులిస్తేసరి ఒళ్ళుాపై తెలియదు నిద్రే నిద్ర....లే..లే...
ఈరొేజునుండి స్పెషల్ ఇంగ్లీష్ క్లాసులు,హేండ్ రైటింగ్,డ్రాయింగ్,స్విమ్మింగ్.....నాన్న సెలవుల దండకం సాగుతుానేవుంది.
వేసవి సెలవులిచ్చారుా....
పైకల కళ్ళల్లొే తిరుగుతుా.....
××××మన్నె(పిన్నక)లలిత×××××××××××××××🌷

[4/22, 8:08 AM] Poet Satya Neelima: శీర్షిక : వేసవిసెలవులు,
రచయిత : సత్యనీలిమ..
☀☀☀☂☂☂🌍🌍

భానుడు భగభగమంటూ తీక్షణమైన కిరణాలను ప్రసరిస్తూ ఉన్న వేళ
పాఠశాలలకు ఇచ్చారండీ వేసవిసెలవులు
తల్లిదండ్రుల గుండెల్లో గుబులు గుబులు

పిల్లలకెక్కడవండీ మనతరం ఆటపాటలు
నేటితరం వారికి కంప్యూటర్ గేములే సరదాలు
బయటకు వెళ్ళాలంటే వడదెబ్బ భయం భయం
వృక్షాలు లేక ఉక్కపోత భాధలు

కూలర్లు వేసుకుంటే కరెంటుబిల్లు మోపెడు
పెళ్ళిళ్ళు, పేరంటాలతో ప్రయాణాల బడళికలు
సాయంత్రం పార్కులలో కొంతైనా ఉపశమనం
పిల్లల కేరింతలతో అలసట మటుమాయం

నీళ్ళకరువు,కరెంటుకోత అదనపు కష్టాలు
కూరగాయల ధరలు పైపైకి
చర్మవ్యాధులు తప్పనిసరి

ఇన్ని సమస్యల మధ్య ఇచ్చారండీ వేసవిసెలవులు
తల్లిదండ్రుల గుండెల్లో గుబులు గుబులు

అందుకే అందరం
మొక్కలు నాటుదాం
భూ భఢభాగ్నిని చల్లారుద్దాం
పర్యావలణాన్ని కాపాడుదాం
ఓజోన్ పొరను రక్షిద్దాం
ముందు తరాలకు ఎలాంటి కరువు లేకుండా చేద్దాం...
☀☀☀☂☂☂🌍🌍
                ✍...సత్యనీలిమ,
               ఉపాధ్యాయురాలు,
                      వనపర్తి..
[4/22, 9:25 AM] Poet Musthakheem విన్నర్: అంశం : వేసవి సెలవులు
శీర్షిక : "యెండల ..సెలవులు బాబోయ్ "
తేది :22-04-2018
కవి : విన్నర్

వచ్చాయి ..యెండల సెలవులు ..
వేసవి ..సెలవులు ..
ఇంట్లో ..పిల్లల ఒకటే లొల్లి
పొద్దున ..సల్లదనం ..మధ్యహ్నం ..బాబోయ్ ..యెండలు

ఊర్ల కు ..పోదామన్న ..కోరిక
యెండ దెబ్బలకు ..ఆవిరై పోతోంది ..!!

గతం కన్న నేడు ..యెండలు
విపరీతమైనాయి ..మనసు
మార్చుకున్నట్టున్నాయి ..?
మనుష్యుల పై చాలా కోపం
కూడ ఉన్నట్టుంది ..??
అందుకే ..పెరుగుతూ ఉన్నాయి ..


ఐనా ..వేసవి సెలవులు
సరదా గా గడుస్తున్నాయి ..
ఈత ల్లో ..టీ వీ  చూడ్డం లో
ఆట ల్లో ..పాటల్లో ..అల్లరి
చేయడం లో ..


ఇష్టం కానిది ..యెవరికి వేసవి
సెలవులు ..టీచర్లకు ..పిల్లలకు
ఒకటే ..విశ్రాంతి ..యెడాది పడ్డ
కష్టానికి ..బహుమతి ..ఈ
సెలవులు ..??

అవ్వా ..తాతల ప్రేమకు ..
యెండలు అడ్డంకి కాదన్నట్లు
మూట ముల్లె ..సర్దుకున్న రోజులు ..నేడు అరుదు గా
కాన వస్తున్నాయి ..!??

ఆ రోజులు ..అద్భుతం
ఆ రోజులు ..మధుర జ్ఞాపకం
బంధువుల ..ఊర్లకు ఊరికీత గ
పోయినట్లు ..బస్సులో రయ్ రయ్ మంటూ ..కిటికీ దగ్గర
కూర్చొని ..ఆనందంగా ..


ఇప్పటి పిల్లలకు ..టీవీ , సెల్ఫోన్ ..కంప్యూటర్ ..లే
లోకం ..??
అప్పటి తరం..అలా
ఇప్పటి తరం..ఇలా
"వేసవి సెలవులు" నేడు ..మూసవి ..??!

రచన: విన్నర్ , కొల్లాపురి .
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[4/23, 9:54 AM] Poet Uppari Thirumalesh Sagar, Wanaparty: *శీర్షిక: వేసవి సెలవులు*
*రచయిత: ఉప్పరి తిరుమలేష్
☂☂☂☂☂☂☂🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌛🌜🌛🌜🌛🌜🌛🌜🌛
ఎండాకాలం సెలవులు
మండే ఎండలు
మర్చిపోని రోజులు
మనసునిండా గుర్తుండే జ్ఞాపకాలు
 
పుస్తకాల కుస్తీకి స్వస్తి
బట్టి చదువులకు స్వస్తి
బడిపంతుల మాటలకు నమస్తే
బాల్యమిత్రులతో గల్ల గల్లి
తుళ్ళింతలు
కేరింతలు
గిల్లి గిల్లి గింతలు
ఆకతాయిచేష్టల ఆనందం గడిపే ఎండా కాలం సెలవులు
మామిడి చెట్లు
నేరేడు చెట్లు
చింత చిగురులు
కోతి కొమ్మచ్చిలు
ఆనందాల ఆటల పాటల సందడితో సెలవులు
కాలువ గట్లు
బావి మెట్లు
చెరువు కట్టలు
మునుగబెండ్లు
ఈదె రోజులు
వేసవి సెలవు రోజులు
రాగుల అంబలి
చింతకాయతొక్కు
మామిడి ముక్కలు
అమ్మమ్మ ఇంట్లోని ఆనందంతో
వేసవి సెలవులు
బార కట్ట
అచేన గుండ్లు
ఉప్పు బెరె
ఊడలమఱ్ఱి ఊయల రోజులు
పల్లె పిల్లల వేసవి సెలవురోజులు

స్విమ్మింగ్ పూల్--సమ్మర్ స్పెషల్
వండర్లా లో--వింతవింతలు
ఔషన్ పార్క్--వంపు సొంపులు 
పట్టణవాసుల ప్లాస్టిక్ సెలవులు
అమ్మమ్మతో ఆనందంగా
తాతయ్య తో తాత్వికంగా
బావతో బావాలుకలుపంగా
మరుదలతో మరిచిపోలేని అనుభూతి గా
*ఎండా కాలం సెలవలు*
*మండే ఎండలు*
*మర్చిపోలేని రోజులు*
*మనస్సు నిండాగుర్తుండే జ్ఞాపకాలు*
👫👯🏻‍♀👫👯🏻‍♀👫👯🏻‍♀👫👯🏻‍♀🌂🌂🌂🌂🌂☂☂☂☂☀☀☀☀☀☀☂☂☂☂☂☂☂☂☂

       *✍ రచయిత*
  *ఉప్పరి తిరుమలేష్*
తెలుగు ఉపాధ్యాయులు
         వనపర్తి
      9618961384
[4/24, 2:41 PM] Poet Pudathu Bhaskar: 🎇  వేసవి సెలవులు 🎇
         ***************
వేసవి సెలవులు అంటేనే
అందరికి ఆటవిడుపులు

పిల్లల పెద్దల వినోదాలు
అహ్లాదానికి అవియే ఆనవాళ్ళు

అమ్మమ్మ,నానమ్మ తాతయ్యలతో
పిల్లల సరిగమల సయ్యాటలు

పులిబారకట్టలు,వానగుంతలాటలు
దాగుడు మూతలు బొమ్మలాటలు

బావుల్లో చెరువుల్లో కొట్టే ఈతలు
పల్లెవీధుల్లో పంచుకొనే సంబురాలు

చింతచెట్ల లేలేత చిగురుకై వేట
చింతలే లేని చిందులేసే ఆట

తనివిదీర తృప్తినిచ్చే తాటినుంజలు
అదిప్రకృతి ప్రసాధించిన మెత్తని కలకండలు

ఎన్నో ఎన్నెన్నో వినోదాల విందులకు
వేసవి సెలవులే కదా మనకు మజిలీలు. !!!

     🌷రచన🌷
       ********
పూదత్తు భాస్కర్
ఎస్.ఎ.తెలుగు.
    గద్వాల.
[4/25, 10:25 AM] Poet Mastan Vali: అంశం :  వేసవి సెలవులు
  రచయిత : మస్తాన్ వలి

     💥💥🌞🌞🌷🌴☂☂🌚💥☀

      మండే టెండల ముందర
     బడులకు వేసవి సెలవులుండెరా
   
     వేడిమి పంచే ముందర
    మామిడి కాయలు పంచెరా

     తాపము తీరే టందుకు
    తాటిముంజలు తెచ్చెరా

     ఇరుగుపొరుగు బుడతలు అందరూ
    ఏకమై ఆట,పాటల తో సందడి చేశెరా

       ఉక్కపోత లు ఒక ప్రక్క
      పెళ్లి పిలుపులు ఎంచక్క
      వేసవి అంటే ఆనందం
      మల్లెలు తెచ్చే సుమగంధం

     తొక్కుడు బిల్లా ఆటలు
     చెమ్మ చెక్క పాటలు
    అష్టా,చమ్మ ఆటలు
    మామిడి కాయల మూటలు
    ఊరగాయల ఘుమ ఘుమలు
    వేసవి సెలవుల్లో సందళ్ళు

       మేనమామ తో ముచ్చట్లు
        తాతయ్య తో అచ్చట్లు
        అమమ్మ తో చివాట్లు
        వేసవి పంచే ఆనందం
        సెలవులు యిచ్చే అనుబంధం
        మరుపురాని అనుభూతి

      నేటి వేసవి సెలవుల్లో
      వేసవి మిగిలింది
      సెలవులు మాయమై నాయి
      ఇది కలియుగము అందనా
     కంప్యూటర్ యుగము
    మతుల గతులు మారే
    స్తితుల వెతలు మారే
 
     బడులకు వేసవి సెలవులైనా
     బుడతలకు కంపు చదువు లాయే
    సెలవులు లన్నీ కలువలాయే
 

   💥☂☀🌞🌹🌚🌴🌷🌷🌴🌚🌞☀☂💥

           షేక్. మస్తాన్ వలి
    నవ్యాంధ్ర గీత రచయిత
    జంతుశాస్త్ర అద్యాపకులు
     సెల్ : 99 483 57 673 .
[4/25, 5:18 PM] Poet Palloli Shekar Babu: 🍉🍉🍉🍉🍉🍉

వేసవి జాగ్రత్తలు

🍉🍉🍉🍉🍉🍉

ఎండాకాలం వచ్చింది !
మండే ఎండలు తెచ్చింది ! !
బడులకు సెలవులు ఇచ్చింది !
ఇండ్లకు పిల్లల్ను చేర్చింది ! !

పిల్లల్లారా ! ఇటు రారండి !
పరుగు పరుగున రా రండీ ! !
అంకుల్ మాటలు వినరండి !
ఆరోగ్యం కాపాడు కోండి ! !

ఎండలో తిరుగుట మానండి !
ఎండలో ఆడుట వలదండి ! !
చెట్ల నీడలో ఆడండి  !
క్షేమంగ మీరు ఎదగండి ! !

తలకు టోపీ పెట్టండి !
కళ్ళ జోళ్ళు వాడండి ! !
తెల్లని దుస్తులు తొడగండి !
కాళ్ళకు చెప్పులు వేయండి ! !

కళింగర పండ్లు తినండి !
తాటి ముంజలు లాగించండి ! !
కొబ్బరి బొండాలు మేలండి !
పండ్లు జ్యూస్ లు బలమండి ! !

కూల్ డ్రింకులు మానండి !
చల్లని మజ్జిగ త్రాగండి ! !
షర్బత్ కూడా మేలండి !
చెఱకు రసం భలే భేషండి ! !
🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉
పల్లోలి శేఖర్ బాబుసహస్ర కవిమిత్ర  కొలిమిగుండ్ల కర్నూల్ జిల్లా 9490484316.

🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉🍉
[4/26, 11:35 AM] Poet Kusumanchi Sridevi: 🌞అంశం-వేసవిసెలవులు🌞
🏃‍♀కుసుమంచి శ్రీదేవి🏃‍♀
----------------------------------
వచ్చాయి....వచ్చాయి వేసవి సెలవులు
తెచ్చాయి...తెచ్చాయి మాకు స్వేఛ్ఛా రోజులు...


మండే ఎండలు అయితే మాకేమి
కారే చెమటలు అయితే మాకేమి...

తెల్లని వస్త్రములు మేమేస్తామ్
నీడ పట్టున ఆడేస్తామ్ !

కప్పగంతులు..కబ్బాడీ ఆటలు
నింగిని తాకే గాలి పటాలు..
నేలను తిరిగే బొంగరపు ఆటలు ఆడేస్తామ్ !

చెట్టూ..చేమను ఎక్కేస్తామ్
ఊరు..వాడ చుట్టేస్తామ్ !

పుస్తకాలను మూట కట్టేస్తామ్
అమ్మమ్మతో కథలు చెప్పించుకుంటామ్ !
మధురఫలాలను ఆరగిస్తామ్
చల్లని ముంజులతో బొజ్జలు నింపేస్తామ్ !


తాతతో బొమ్మలు కొనిపిస్తామ్
అమ్మమ్మతో నచ్చిన వంటలు చేపిస్తామ్ !

వేసవి విడిదులకు వెళ్లోస్తామ్ !
ఆనందంగా సెలవులు గడిపొస్తామ్ !
[4/26, 3:44 PM] Poet Bharathi: భాస్కర బాలభారతి
9491353544
26--4--18

అంశము    వేసవిసెలవుల్లో
–💐💐💐💐

వేసవి సెలవులంటే
విద్యార్థులకు ఆటవిడుపులే !!

బడులకు సెలవులు ప్రకటించగనే పుస్తకాల
సంచులతో
వేసవి విడిదుల పల్లెసీమల
చేరెదురు  బడుల బందిఖానాలు వదలిఅమ్మ ఒడిజేరిఆదమరచి నిదురించు
పాపాయిలై విద్యార్థులు !!
కొల్లేరుసరస్సులో కొలువుదీర
అరుదెంచు పక్షులట్లు
!
ఆరుబయట అరుగులపరుపులపై
చెట్టుకొమ్మలవింజామరలు
వీచుచుండ
ఆదమరచి
సేదదీరెదరుఅర్థరాత్రిదనుక
చి
[4/26, 4:22 PM] Poet Bharathi: నాటి న్ననాటికబురుల
చెలమలో తేలియాడుతూ
కోడికూతల అలారాలతో
పెందలకడనే మేల్గొని
చల్లని చెలమబానల నీటితో a   స్నాలాలు ముగించుకుని
వేసవి తాపాన్ని తీర్చుకుని
ఆవకాయా చింతొక్కుతోడి మజ్జిగకలిపిన చద్ది తిని
చింతతోపులా మామిడి

 తోపుల ఆటమైదానాలలో
హద్దులు లేక ఒద్దని  వారించు
వారులేక చెమట చిఃదుదనుక
చెంగుచెంగున ఎగురుజింకపిల్లలై
కడుపలోని చద్ది కరగువరకు
ఆడిఆడి ఆలసిన తనువులతో
ఇలుజేరుతారు
ఆవురావురని వేడివేడి
రాగిముద్దా చింతచిగురూ మామిడికాయ పప్పన్నమూ
చిక్కటి మజ్జిగ తో
అమ్మమ్మా నానమ్మా చేతముద్దలు పెట్టుచుండ
అదేస్వర్ణమని కడుపారా భుజించి భుక్తాయాసం
తీర్చుకొందురు వాకిలి గడపదిండుపై తలవాల్చి కొందరు తమయిళ్లలో !! మరికొందరు చాపలపరుపులపై
దొర్లుతూచిన్ననాటి మిత్రుల
జ్ఞాపకాల తోరణాలుఅల్లుకుంటూ
 ఆడపిల్లలు అచ్చెనగాయలూ 
పాములూ నిచ్చెనల ఆటలతో సాయింకాలాలు గడుపుతారు !!
చల్లబడిన సాయింకాలాల్లో
చెట్లకొమ్మల ఊయల్లో
వీధీఆరుగుల్లో ఎటుజూచినా
ఎగిరే పక్షులై కూసేకోయిలలై
పరుగులిడే కుందేళ్టై
ఊరంతాతమదేఅన్న ఆనందముతో
చీకూచింతాలేనిచిన్నారులౌతారు
సెలవుల గడువు ముగియగానే
అత్తారింటికెళ్లు ఆడబిడ్డలై
వదలలేక వదలలేక

.పల్లెవదలి బడులతోవ పడతారు ఉసూరనుచు
బస్సెక్కిపోతారు 
💐💐💐🎂🎂 ఱ
[4/28, 11:20 PM] ‪+91 98853 80371‬: శీర్షిక: వేసవి
              --------------

నీళ్ళను సూడగానే కాళ్ళుసేతులాగని కాలం
తాగడానికైనా
ఈదడానికైనా

నీడ ఎదురుపడగానే అడుగు ముందుకు పడని కాలం
సేద తీరడానికైనా
సెమట తరగడానికైనా

మామిడి కనబడగానే నోట్లో నీళ్ళాగనికాలం
ఆరగించడానికైనా
ఆవకాయ పచ్చడికైనా

కబురందగానే విందుచిందులు జోరందుకునేకాలం
వివాహాలకైనా
విహారాలకైనా

"వేసవి" అనగానే పిల్లలు,పెద్దలు,బంధువులకు సంధికాలం
సంబరాలకైనా
సంబంధాలకైనా.
..................,,,,,,,,,,,,,,,...............
   
   ......✒బింగిదొడ్డి వెంకటేష్
       జీవశాస్త్రఉపాద్యాయుడు
       బింగిదొడ్డి గ్రా., ఐజ మం.,
విద్వద్గద్వాల

Comments