రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్


14-04-2018
మహానాయకుడు, భారత రాజ్యాంగ నిర్మాత డా||. బాబాసాహెబ్ బీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక అంశం " రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ "

[4/13, 3:09 PM] Poet Musthakheem విన్నర్: ప్రత్యేక అంశం :-

"రాజ్యాంగ  నిర్మాత ..అంబేద్కర్"

శీర్షిక: "ఆశా ..జ్యోతి "

కవి :  విన్నర్ (ముస్తఖీమ్)
కొల్లాపూర్ .
ఫోన్ :9705235385.


అట్టడుగు వర్గాల..ఆశా జ్యోతి
వై పుట్టావు ..!
చిన్నతనం నుండి ..యెన్నో
విమర్శలు , చీదరింపులు , అవమానాలు ..యెదురుకున్నా వు ..!!
అమానుష ..అంటరానితనం
వ్యాప్తిని ..కుల , జాతి , మత
వివక్ష ను నిరసించిన ..నిర్మూలించిన
మహానుభావుడు , మహనీయుడు ..!!!

దాహం తో వున్న  తమ్ముడి
దాహార్తిని తీర్చలేని , గుక్కెడు
నీళ్ళు ఇవ్వలేని ..ధనిక , అమానవీయత కు ..క్షోభించిన
హృదయం ..పాపం ఆ ..అంబేద్కరుడిదే ..!!

"రాజ్యాంగం" ను రచియించిన
అపర ..మేధావి , భారత రాజ్యాంగ ..నిర్మాత ..అతడు .

మనిషిలో ..వుండవలసింది ..
మానవత్వ ..జాడలే గాని ,
కుల మతాలు , ఉచ్ఛ-నీచాలు
కాదని ..బల్ల గుద్ది చెప్పిన ..
బారిష్టరు అతడు ..!!
పుట్టుక నీది , చావు నీది
"బ్రతుకంతా ..దేశ సేవకు "
అన్న  కాళోజీ మాటను ..నిజం
చేసిన గొప్ప ..స్ఫూర్తి ప్రదాత ,
మహా మహుడు ..అంబేడ్కర్ ..!!
ఆ మహానీయుని కి జన్మ దిన
శుభాకాంక్షలతో ..

రచన :- విన్నర్ , కొల్లాపూర్ .
9705235385.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸💮💮💮💮💮🌹🌹🌹
[4/13, 5:43 PM] ‪+91 96189 61384‬: *శీర్షిక: అంబేద్కర్*

రచయిత: ఉప్పరి తిరుమలేష్

💐💐💐💐💐💐💐💐

భారత రాజ్యాంగానికి నీవే ఆదిగురువు

బౌద్ధమత సిద్దాంతం నీ తనువు

మొదటి న్యాయశాఖ మంత్రివి నీవు

గుడికి దూరంగా

బడికి చివరగా

విచక్షణకి గురి అయినావు

ఆధిపత్య శక్తులకు ఎదురొడ్డి నిలిచావు

కులతంత్ర సమాజం పైన

శివమెత్తి నావు

కులతంత్ర అడ్డుగీతలను తుడిచినావు

అణచివేతకు గురయిన వర్గాల ఆణిముత్యం నీవు

ప్రజాస్వామ్య మనుగడకు దిక్సూచివి నీవు

అగ్రవర్ణ నీచబుద్ధిపై ఎత్తినావు కత్తి నీవు

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతివి నీవు

దేశాలెన్నో తిరిగి

రాజ్యాంగాలు ఎన్నో చదివి..

రాజ్యాంగాన్ని రచించిన మహర్షివి నీవు

బుద్ధుని జ్ఞానజ్యోతివి నీవు

భారతీయ మట్టిలో పుట్టిన

మానవ రూపంలో అవతరించిన మహనీయుడవు నీవు

లాల్ నిల్ కలయికతో ఆశయాలు అమలుపరిచావు

జై భీమ్...

జై జై భీమ్..

నిల్ లాల్ సలామ్...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

               ✍ *రచయిత*

                 ఉప్పరి తిరుమలేష్

        తెలుగు ఉపాధ్యాయులు

                9618961384
[4/13, 5:54 PM] Poet Satya Neelima: శీర్షిక : అంబేద్కర్
రచయిత : సత్యనీలిమ
👍👍👍👍👍👍👍👍
అంబేద్కర్ వ్రాశాడు ఓ గ్రంథము
అదే అమూల్యమైన మన రాజ్యాంగము
అమరవీరుల త్యాగాల ఫలితంగా
స్వతంత్రంగా జరుపుకొందుము గణతంత్రము
కులమత బేధాలు వద్దంటూ
అందరూ ఒకటిగా ఉండాలని
చిన్న పెద్ద తేడాలు ఏవీ లేకుండా
కలిసి మెలిసి అందరూ బ్రతకాలంటూ
అందరికీ సమానంగా వ్రాసినాడు
మన రాజ్యాంగాన్ని తీర్చిదిద్దినాడు
దేశాలెన్నో తిరిగి తిరిగి
అమూల్యమైన పదజాలంతో
నింగికెగసిన ఆనందంతో
లక్షణమైన భావాలతో
ప్రజలందరికీ ఉపయోగకరంగా
వ్రాసినాడు రాజ్యాంగం
మనకిచ్చినాడు గణతంత్ర స్వాతంత్య్రం......
👍👍👍👍👍👍👍👍
                 ✍....సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                         వనపర్తి..
[4/13, 10:31 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: *****  ***   *****

పాలకుర్తి నాగజ్యోతి
అసిస్టెంట్ ప్రాజక్ట్ మేనేజర్
కుమ్రం భీం జిల్లా..
8074712181


అందరూ సమానమే...


అణగారిన వర్గాల అణచివేత...
దళితవాడల దాగుడు మూతల సయ్యాట..
ఊరికి విసిరేసినట్టుగా...
లేదు లేదంటున్న లౌకికత్వం..
పట్టుకుని వేళ్ళాడుతున్న పల్లెకొమ్మలు..
చాపకింద నీరులా...!!

బోయ వాల్మికి రాసిన రామాయణం..
నీ హృదిలో- హిందు గుడిలో...
దళిత భీంరావ్ రాసిన రాజ్యాంగం.. రక్షణై భారత గుడిలో...!!

అశ్ప్రస్యత లేదంటూనే
కులమతాల కుమ్ములాట
శరీరానికున్న  అంటరానితనం
మరి వారి ఞ్ఙానానికి లేదేం..?
భారత హృదిలో పెట్టి పూజిస్తున్నావ్...!

లేదు లేదంటూనే అనాదిగా
ఏకలవ్య, కర్ణుడి లాంటివారినే కులం
పేరుతో ధూషించి..
విలువిద్యల వెలివేసావ్...
ఆదినుంచి నువ్వంతే...

సిగ్గుపడే సమాజమా... 
లేదు లేదంటూనే వేరుకుంపటి పెట్టించావ్...
నువ్ గెలిచావా..?
ఆ మాటన్నావో..   
నీ నాళిక తెగ్గోస్తా......
మరుమల్లెల పరిమళాలు
వెదజల్లును ఎక్కడైనా..
ఆశ్వాదించే వారున్నా..
లేకున్నా..!

అడవి మల్లెలు విరగకాసెను..
పూసెను..
తోటమాలి లేకున్నా...
సుమగంధాలు గరీబుల తాకెను...!!

దళితులు దళితులు అని దిక్కులు పిక్కటిల్లేలా
అరచిన నువ్వు...
ఆ దళిత రాజ్యాంగం నుంచి పారిపోగలవా..?
ఈ బోయ రామాయణం స్మరించకుండా ఉండగలవా..?

జవాబు లేని సమాజమా...
తలదించుకున్నావా..?
అయితే చెప్పు రాతలు గీతలు కోతలు కాదని...
ఆచరణ ఉండాలని....
నీ సోదర సోదరీమణులకు..
నీ ఊరి నేస్తాలకు..
నాలుగు దిక్కులకు..
వందకోట్ల గడపలకు...
కులమతాలు లేవని..
అందరూ సమానమేనని..!!

ఎన్ని వేషాలేసిన కూటికే...
ఎంత బతికినా కాటికే...
'ఏ కులం అయిన ఒకటే స్ళశానానికని'.....


@సిరిమల్లెలు...

పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
[4/13, 10:56 PM] Buf Amaravadi Rajashekar Sharma: నడిచే విజ్ఞాన భాండాగారం బాబాసాహెబ్ అంబేద్కర్
ఎదిగిన మానవవికాస రూపం బాబాసాహెబ్ అంబేద్కర్
భారతరాజ్యాంగానికి ప్రాణం ప్రాణం ప్రణవం అంబేద్కర్
చదువుల సారం ప్రగతికి ద్వారం జ్ఞానాకారం అంబేద్కర్

చిన్నతనంలో సమాజం చిన్నతనం చేసేస్తుంటే
ఉన్నతి చేరే మార్గం విద్యని ఎన్నుకొని అడుగేసాడు
పుస్తకమొక్కటి నేస్తం తనకని విడువక నడకను సాగించ
తిట్టిననోళ్ళే పొగడేవేళ గిరి శిఖరంలా నిలిచాడు
కులమతాలనే కుళ్ళే ఎరుగని నవ సమాజమే కోరాడు
కోరుటెగాక క్రియాశీలిగా అహర్నిశలు శ్రమియించాడు

అన్యాయాన్ని ఎదిరించేందుకు న్యాయశాస్త్రమును చదివాడు
మార్గదర్శిగా నడిపించేందుకు నాయకుడయ్యి వెలిగాడు
దేశములెన్నో తిరిగాడు భాషలనెన్నో నేర్చాడు
క్షణము క్షణమునా కణాము కణమునా జ్ఞానదృష్టినే నిలిపాడు
శాంతికాముకత ప్రేరేపించగ బౌద్ధ మతములో చేరాడు
భారత రత్నై భారతజాతికి తలమానికమై భాసించాడు
[4/13, 11:13 PM] Poet Telgu Thirumalesh: 📚 *బలహీనవర్గాల ఆశా జ్యోతి అంబేద్కర్*📚

అంటరానితనంతో ఆవేదన చెంది
ఎన్నో అవమానాలు పొంది
బలహీన వర్గాలకు బలంగా నిలిచి
మూఢనమ్మాకాలను నిర్మూలించి
కులరహిత సమాజానికి పాటుపడిన
మహనీయుడు అంబేద్కర్

సమానత్వం కోసం పోరాడిన సామాజిక విప్లవకారుడు
చదువుకోసం పరితపించిన విద్యావిజ్ఞాన వేత్త
పుస్తకాలను హస్తభూషణంగా ధరించి
నిమ్నవర్గాల పై జరుగుత్తున్న అన్యాయాలను ఎదిరించిన
మహామేధావి అంబేద్కర్

దాహంతీర్చే చేరువు నీటి సమానత్వపు సంగ్రామముకు సంజీవినిగా నిలిచావు

అసమానతల సమాజాని చూసి ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించుకున్నావు
తొలిన్యాయ శాఖా మంత్రిగా నిలిచావు
విద్యా శీలం స్వాభిమానాలను దైవంగా
బుద్ధుడు కభీరు పూలే వంటి మహానీయులను ఆదర్శ గురువులుగా భావించి
అగ్రవర్ణాల అహంకారాన్ని అంతరింపచేసిన
సంఘసంస్కర్త అంబేద్కర్

హిందూ సిక్కు ముస్లీం  బౌద్ధులను ఆకర్షించిన ఆణిముత్యం అంబేద్కర్

రాజ్యంగ రచనతో
రాజ్య పరిపాలనకు
దారిచూపిన
రాజ్యాంగ రూపశిల్పి  అంబేద్కర్

సముద్రపు కెరటం లాంటి
ఆయన జీవితపు ప్రయాణంలో
అనేక అవమానాలు తిరస్కారాలు

ఆకలిదప్పులతో
విద్య కిరీటాలను పొంది
అజ్ఞానపు
విషపు కోరలను
పెకిలించిన
బడుగు బలహీన దళిత వర్గాల
ఆశాజ్యోతి  అంబేద్కర్

అంబేద్కర్ ఆశయసాధనలో
సమీదగా ఉంటూ
అంబేద్కర్ ఆశయాలను
స్మృతించుకుంటు
అక్షరాంజలితో నా ఈ కవిత

🙏🙏🙏🙏🙏
 
 ✍... *తెలుగు తిరుమలేష్*
*మహాత్మా జ్యోతిరావు పూలే జాతీయ అవార్డ్ గ్రహిత*
*అమరచింత మండలం*
*సెల్ : 9908910398*
*********************

[4/14, 6:58 AM] Poet Mastan Vali: డా॥ బాబా సాహెబ్ బీంరావ్ అంబేద్కర్ జయంతి 
             సందర్భంగా ఈ కవిత
     అంశం : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్
     శీర్షిక  :  *అందరివాడు ... అంబేద్కర్*
      కవి : షేక్. మస్తాన్ వలి

       🍌🍇🌽🌶🍬🦂 🤣🐍🌑🌒🌔🔥⛄✍

         నీకు, నాకు
        కానే కాదోయ్
          అందరికీ  ...
        జను లందరికీ
       చుట్టాలే నోయ్

       చట్టాలన్నీ
       చుట్టాలై
      పట్టాలెక్కి
      పయనించే నోయ్

       హిందు, ముస్లిం
       తేడా లేదోయ్
       క్రైస్తవ, సిక్కు
       బేధం లేదోయ్

        మత మేదైనా
       కుల మేదైనా
       అందరూ ఒకటే
      చట్టం ముందోయ్

       అవతరించెను ...
       అవతరించెనూ
       దళిత జనోద్ధరణ కై
       అవతరించెను

        హరిజన ,
        గిరిజనోద్ధరణకై
        అవతరించెను
       తన,మన బేధం లేక
        సర్వ జనులూ...
       సమాన మంటూ
        చట్టాలే ....
       రూపొందించెనోయ్

       అందరి వాడు
     అతడందరివాడు
     అంబేద్కర్....
     అందరి వాడోయ్

      ✍🌶🤣🌽🍇🍌🌑🌔🌓🔥🐍🦂🍌🍇

        షేక్. మస్తాన్ వలి.
     నవ్యాంధ్ర గీత రచయిత
    సెల్ : 99 483 57 673.
[4/14, 8:18 AM] ‪+91 94933 58758‬: 💐💐అంబేద్కర్💐💐

దళిత కుటుంబంలో పుట్టావు,
బంగారు భవితకు బాటలు వేసావు!

ఎన్నో బాధలు పడ్డావు,
భావి భారతాన్ని నిర్మించావు!

న్యాయశాస్ట్రాన్ని అభ్యసించావు,
సమన్యాయం కోసం పరితపించావు!

ఎన్నో పట్టాలు పొందావు,
నడిచే గ్రంథాలయం గా మారావు!

ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించావు,
భారత కీర్తిని చాటిచెప్పావు!

స్వతంత్ర భారత తప్పటి అడుగులు,
ఉజ్వల భారత ఉరుకులు, పరుగులు!

అతిపెద్ద భారత రాజ్యాంగ నిర్మాణం,
అది నీ మేధస్సుకే ఒక తార్కాణం!

ఎన్నో బాధలు,
మరెన్నో అవమానాలు,
అన్నింటికి ఎదురీడుతూ,
ఉవ్వెత్తున ఎగిసే కెరటంలా,
భారత కీర్తి పతాకాన,
విజయ పతాకాన్ని
గర్వాంగా ఎగురవేసినా,
ఓ అంబెడ్కర్ నీవు....
అమరం...... అమరం......!

                           వెంకటేశ్వర్లు. కె
                           తెలుగు ఉపాధ్యాయులు

[4/14, 8:59 AM] ‪+91 94918 81916‬: *కులం-అసమానతలు*

*కులం*
*దేహాన్ని వెయ్యి ముక్కలుగా నరికిన*!
*కత్తి*!!

*కులం*
*రెండు పక్షులను విడదీసిన*!
*వేటగాడు*!!

*కులం*
*అనంతకాలం అధికారమిచ్చిన*!
*సొంత రాజ్యాంగం*!!

*కులం*
*మున్నూటి తరాల*!
*బానిసత్వం*!!

*కులం*
*పచ్చని చెట్టును తెగ నరుకుతున్న*!
*గండ్ర గొడ్డలి*!!

*కులం*
*అస్తమయం ఎరుగని*!
*సూర్యుడు*!!

*కులం*
*వెలుతురు చూడని*!
*నిత్య చీకటి*!!

*కులం*
*మంచి నీటిని కూడా అస్పృశ్య గంగను చేసిన*!
*మను ధర్మం*!!

*కులం*
*అట్టడుగు అమ్మాయిల అత్యాచారానికి*!
*బి.ఫామ్*!!

*కులం*
*అసమానతలకు*!
*పుట్టినిల్లు*!!

*కులం*
*అంతరించిపోవడమే*!
*అంబేడ్కర్*!!

 *డా.బాబా సాహెబ్ అంబేద్కర్   ఆలోచనలు వర్ధిల్లాలి*.


          *పెబ్బేటి మల్లికార్జున్*

                  *అసిస్టెంట్ ప్రొఫెసర్*,
            *కల్వకోల్*.
*****************************

అంబేద్కర్‌ కు అసలైన నివాళి

*ఈ రిజర్వేషన్లు న్యాయమేనా?*
*పేదరికమే ప్రామాణికం కావాలి..*_

సమాజంలో సామరస్య వాతావరణం నెలకొని అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది..

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆనాటి సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కుల రహిత సమాజ నిర్మాణం కోసం కలలు కన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సామాజిక న్యాయం కోసం పరిమిత కాలం పాటు రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు..

కానీ ప్రభుత్వాలు, పార్టీలు దురదృష్టవశాత్తు ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజంలో చిచ్చు పెడుతున్నారు..

రిజర్వేషన్ల ద్వారా  సమాజంలో కులతత్వం తగ్గక పోగా మరింత బలపడుతోంది.. కులాన్ని వదులుకుంటే రిజర్వేషన్ పోతుంది అనే భయమే ఇందుకు కారణం..

మత ప్రాతిపదికన రిజర్వేషన్ కారణంగా మత మార్పిడులు మొదలైతే ఎంత ప్రమాదమో ఆలోచించారా?..

అన్ని మతాలు, కులాలకు మొదటి శత్రువు పేదరికమే.. పేదరికానికి కుల మతాలు లేవు.. అన్ని కులాలు, మతాల్లోని పేదలను గుర్తించి వారికి రిజర్వేషన్లు ఇవ్వాలి..

ఆధార్ అనుసంధానం అమలవుతున్న ఈ రోజుల్లో అర్హులైన పేదలను గుర్తించడం కష్టమేమీ కాదు..

రిజర్వేషన్ల మూలాన విద్యావంతులకు జరుగుతున్న అన్యాయం అంతా ఇంతాకాదు.... అంతేకాదు వారి సేవలను కూడా మనం వినియోగించుకోలేక పోతున్నాము.....

ప్రతి పేదవాడికి కేజీ నుండి పీజీ వరకు ఉచిత కార్పోరేట్ విద్య అందించాలన్నదే నా ప్రధాన డిమాండ్ ....

రిజర్వేషన్లు అన్ని సామాజిక వర్గాల్లోని పేదలందరికీ చెందేలా చూడాలి..

కులమతాలకతీతంగా....
పేదరికం ఆదారంగా....
రిజర్వేషన్లు ఉండాలి....

ఏ పేదవాడికి అన్యాయం జరుగరాదు...
అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళి అందించిన వారమౌతాము
*..జై హింద్..*
*.. జై భారత్..*

మీ
గోగులపాటి కృష్ణమోహన్
*******************

Comments