"మానవ మృగాలు"
బాలికలపై అమానుషంగా అత్యాచారలకు పాల్పడుతున్న
"మానవ మృగాలు"
Poet Venkteswararao Patnaikuni Sakshi: జీవచ్ఛవాల్లా ఉండాలి..!
–––––––––––––
ఇక్కడ ఏ సిద్ధాంతం వర్తిస్తుంది
ఆత్మ శక్తా..కర్మ ఫలితమా
అసలు ఆ అకృత్యానికి
మూగ సాక్షి ఓ మందిరమట
అందులోని దేవుడు
పవళింపు సేవలో ఉన్నాడా
బహుశా ఆయనా
మతం మంత్రాల్లో
బందీ అయ్యాడా
మరో వర్గం వారు ప్రార్థించే
ఆ దేవుడికీ
మనసూ కరగలేదా..
చిట్టి అసిఫా..పిక్కటిల్లేలా
చేసిన రోదన వారెవరూ
ఎందుకు వినలేదో..
తప్పుచేసిన వారికి మతం ముసుగట
బాధితులు అన్యవర్గమవ్వడం నేరమట
ఇవి మన దేశ సిద్ధాంతాలు కావే
మన ధర్మం ఎక్కడా చెప్పలేదే
అక్కడి మీడియా కన్ను చేరేసింది
న్యాయవాదులు నల్లకోటుపై
ఒట్టేసి నోర్లు కట్టేసుకున్నారు
‘సుప్రీం’ ఎర్రగించడంతో
ఇప్పుడు తీగ కదులుతోంది
దేశం విస్తుపోయాక
డొంకలను వెతికేపనిలో
చట్టం పరుగులు...పెడుతోంది
మానవత్వం ఏమైంది
మమతలను ఎక్కడ పాతేశారు
చిన్నారిని చిదిమేసిన
ముష్కరులారా
మీరు మనుషులు కారు
రాక్షసులా..కాదు కాదు
వారికీ నీతి ఉందని అంటారు
అయినా మీరు బతకాలి
మీ మగతనం తెగిపోవాలి
జీవచ్ఛవాల్లా..ఉండాలి
ఇదే అందరికీ పాఠం కావాలి..!!
– పట్నాయకుని వెంకటేశ్వరరావు
(13–04–2018, శుక్రవారం)
( జమ్మూ,కాశ్మీరు రాష్ట్రంలోని కతువా ప్రాంతంలో చిన్నారి అసిఫా ఉదంతం కలచివేయడంతో ఆవేదనతో)
[4/14, 1:01 PM] Poet Satya Neelima: శీర్షిక : మానవమృఘాలు,
రచయిత : సత్యనీలిమ.
😭😭😭😭😭😭😭😭
అబంశుభం తెలియని పసిమొగ్గలకు
చాక్లెట్లు ఆశచూపి
కన్నుమిన్నుగానక తనను కనిపెంచింది ఒక ఆడదే నని మరిచి
పశువుల్లా మీదపడి
గోళ్ళతో రక్కి రక్కి పంటితో కొరికి కొరికి
బాధలకు తాళలేక పసిపిల్ల ఏడుస్తుంటే
పైశాచిక ఆనందం పొందుతూ
లేడిపిల్ల మాంసాన్ని తినే
అడవి జంతువుల కంటే హీనంగా, ఘోరంగా
బండకేసి మోదుతూ,
పచ్చినెత్తురు తాగే మృఘాల కంటే కూడా నీచంగా
చేతులు జోడించి ప్రాదేయపడ్డా
కనికరం చూపలేని కఠినాత్ములు
ప్రాణం పోయినా కామంతో శవాన్ని పీక్కుతినే రాబందులుల్లా కోరిక తీర్చుకునే మానవమృఘాలను శిక్షించేది ఎవరు?
ఏమవుతుందో తెలియని పసిప్రాయాలను దోచుకున్న
ఈ కఠినమృఘాలను ఆపేదెవ్వరు?
పసిమొగ్గలు కరుడుగట్టిన మృఘాల చేతుల్లో రాలిపోతుంటే
కన్న కడుపు ఘోష వినేదెవ్వరు?
భూమాత ఈ పాపాత్ముల భారానికి బద్దలైపోతుంది
ఇటువంటి మృఘాల వల్ల
ఆడపిల్లను కనాలంటే భయం
పెంచాలంటే భయం
బయటకు పంపాలన్నా భయం
పెంచి పెద్దచేసి కంటికి రెప్పలా కాపాడుకుని
పెండ్లి చేసి పంపినా
వరకట్నం కోసం హింసలు తప్పకపాయె
భయం గుప్పిట్లో ఆడపిల్లల జీవితం
ఇంకెనాళ్ళీ ఈ భయం
ఎటువెళ్తుందీ సమాజం
ఎన్ని చట్టాలొచ్చినా మానవ నైజం మారేనా
భగవంతుడు మరో అవతారం ఎత్తినా ఈ మానవమృఘాలను శిక్షించేనా
ఇకనైనా మేలుకోండి యువతీయువకులారా
షడ్గుణాలను వదిలిపెట్టండి
ఆడపిల్లలను కాపాడుదాం
భయం అనేది లేకుండా చేద్దాం
👍👍👍👍👍👍👍👍
✍....సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
వనపర్తి...
[4/14, 3:26 PM] Poet Musthakheem విన్నర్: అంశం: "మానవ మృగాలు"
శీర్షిక : "మతి తప్పిన ..మానవ మృగాలు"
కవి : విన్నర్ (ముస్తఖీమ్)
తేది : 14-04-2018
ఏమయ్యింది రా..మీకు
మనిషి రూపం లో ఉన్న
మృగాల్లా రా ..
చిన్న , పసి పిల్ల ల పై ..మరీ
ఆ అఘాయిత్యం ..యేమిటి రా ..??
అసలు మతి ఉందారా ..మీకు ??
దరిద్రుల్లారా , దుష్టుల్లారా ,
తెలివి తక్కువ దద్దమ్మల్లా రా ..
ముక్క పచ్చలారని ..బాలికల పై ..లైంగిక వేధింపులా ..??
దౌర్జన్యమా ..థూ ..థూ ..థూ ..
మీ బతుక్కి అర్థం ఉందారా ..?
పనికిరాని ..వెధవల్లారా ..
సోంబేరీ..సన్నాసుల్లారా ..
"పర స్త్రీ ..తల్లి తో సమానమ"ని తెలుసు కోండి రా ..
తెలివి తక్కువ ..మూర్ఖుల్లారా ..
లోకానికి చీడ-పీడ రా ..మీరు
మిమ్మల్ని నిలువునా ..చీరేయ్యాలి రా ..
బహిరంగంగా ..ఉరి తీయాలిరా ..
ఆడ పిల్లల ..జోలికి వస్తే ..
మిమ్మల్ని ..నరికేయాలి రా ..??!!
పాపం అభం -శుభం తెలియని
పిల్లలు రా ..భగవంతుని ..ప్రతి రూపాలు రా ..!!
అమాయకులు రా ..ఆట లాడుకునే ..వయసు రా ..వారిది !!
పెళ్ళి జేసుకొని ..బాధ్యత గా
జీవించరా ..సమాజాన..??
లేదా ..
"పిచ్చాసుపత్రి"లో చేరు రా ..
మతి తప్పి గతి లేని ..మానవ
మృగమా ..!!
నీ బ్రతుకు ..వృధా .థూ ..నీ ఇంకొకరికి ..వ్యధ ..!!
వర్తమాన..సంఘటనలను ..
నిరసిస్తూ ..
రచన: విన్నర్ , కొల్లాపూర్.
ఫోన్ :9705236385.
✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍✍
[4/14, 6:24 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: పాలకుర్తి నాగజ్యోతి
~~ ఆఖరి"సారీ" ~~
పశువులను కాసుటకెళ్లి
పశువుల చేతిలో విసిరేయబడిన బాల్యం నీదయిన వేళా
ఎంత నరకం చూసావో
ఎంతలా అమ్మను పిలిచావో..
దాహం, ఆకలి, అమ్మా, నాన్నా, అల్లా, అల్లా..అంటూ
ఆసిఫా ఎంతగా అరిచావో
చెవిటి లోకానికేం వినపడుతుంది
బండరాయికి ఏం కనబడుతుంది
డ్రగ్స్ నీ శరీరంలో ఎక్కించి
పచ్చి మాంసపు ముద్దతో
కామక్రీడ సల్పిన స్థలం దేవాలయమైతే
నువు కాదు చిన్నా
ప్రాణంలేని శిలగా వున్నందుకు
ఆ దేవుడే చచ్చిపోయాడు..
తలపై బండమోదేముందు కూడా ఆఖరి"సారీ" అంటూ
చిరిగిపోయిన యోనిని రక్త సంద్రంగా మార్చిన ఆ మానవ ఆయుధాలు
మతం మరకను పూసుకుని తిరిగితే
అక్షరం అపరకాళియై తిరగబడుతుందిపుడు..
అక్షరానికే కత్తులు కట్టి
వారుచచ్చేదాక చంపుతూనేవుంటాం
ఆసిఫానే ఆయుధంగా చేసి తరిమికొట్టాలన్న వారి పన్నాగంని
ఆసిఫానే అక్షరంగా మార్చి
న్యాయమేదని ప్రశ్నిస్తున్నామి పుడు..
వేల పాళీల అక్షర యుద్ధం నీకై మొదలయిన ఈవేళా..
న్యాయం నీకే ఆసిఫా
న్యాయం న్యాయంవైపే ఆసిఫా..
అంటూ
అక్షరం అమ్మై
నిన్ను ఓదారుస్తున్నదీవేళా..
@సిరిమల్లెలు...
పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
8074712181
***** ****** *****
[4/16, 6:37 PM] కృష్ణమోహన్ గోగులపాటి: ఆడపిల్లకు అన్యాయం...
రచన : గోగులపాటి కృష్ణమోహన్
ఆడపిల్లకు అన్యాయం...
అలనాటి నుండీ జరుగుతుందే....
ఈనాడు ఇదేం కొత్తకాదు...
సంవత్సరానికి సగటున
వేలాది అకృత్యాలు జరుగుతున్నా...
లక్షలాది ఆడతల్లులు....
ఆహకారాలు చేస్తున్నా....
నిర్భయలాంటి చట్టాలు ఎన్నున్నా...
కఠినాదికఠినంగా శిక్షలేసినా....
ఈ అకృత్యాలను ఆపలేకపోతున్నాయి...
పట్నం... పల్లె తేడాలేదు...
చదువు సందె బేదం లేదు...
వయో బేదం అసలేలేదు
పరువు మర్యాద కానరాదు...
ఆడతనం కనిపిస్తే చాలు...
ఒళ్ళంతా కామనేత్రాలే అవుతున్నాయి...
కర్కషత్వంతో కామ క్రీడ లో తేలుతున్నాయి....
బడికి వెళ్ళాలంటే భయం
బాయికాడికి నడవాలంటే భయం...
మార్కెట్ కు వెళ్ళాలంటే భయం...
షాపింగ్ చేయాలంటే భయం...
సినిమాకు పోవాలంటే భయం...
కారణం... తల్లీ... చెల్లీ...
తేడాతెలియని పోకిరీలతో భయం...
మార్పు ఎక్కడో మొదలవ్వదు...
మన ఇంటినుండే మొదలవుతుంది..
ముందు నువ్వు మారాలి...
నీ పిల్లలకు బుద్దులు నేర్పాలి..
స్త్రీని గౌరవించడం... మననుండే...
మన ఇంటినుండే మొదలవ్వాలి...
అప్పుడే స్త్రీ నిజమైన స్వేఛ్చ వాయువును పీల్చగలదు...
లేదంటే...
ఆడదే తిరగబడితే రక్తచరిత్రలే....
మగవాడనే మాట వనిడం తప్ప...
జాతిని చూడలేము... పక్కా...
అందుకే ఆడది ఆదిశక్తి గా మారకముందే...
మగమృగాలు మారాలి...
ఇకనైనా మారండి...
మీ అమ్మ, అక్క, చెల్లి, కూతురు...
ఆడదని మరవకండి... ఆడతల్లిని బ్రతికించండి...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు.
9700007653.
[4/16, 8:40 PM] Poet Padma Tripurari: ఆడపిల్ల అగ్గిబరాటా కావాలి
************************
ఆడపిల్లంటే అలుసయిపోతోంది
అమానుష మగమృగాలకు బలయిపోతోంది
అమానవీయతలో నలిగి నలిగి చితికిపోతోంది
అంతులేని అకృత్యాల చితిలో కాలిపోతోంది
కుసుమ కోమల మనము రగిలిపోతోంది
రగిలి రగిలి జ్వలనమయి దహించిపోతోంది
దయలేని రక్కసుల కర్కశకోరల్లో చిక్కిపోతోంది
చిక్కువిడని ప్రశ్నల వలలో విలవిలలాడుతోంది
ఎందుకిలా?
అమ్మలా ఆదరించాల్సిన ఆడపిల్లను అంగడిబొమ్మను చేస్తున్న పాపం ఎవరిది?
అనంత సృష్టికి ఆదిశక్తి అంశయిన ఆడపిల్లపై పెరుగుతున్న అకృత్య నేరం ఎవరిది?
అడుగడుగున ప్రేమరూపిణిగా నిలపాల్సిన అమ్మాయిల భవితను కాలరాస్తున్న ఘోరం ఎవరిది?
సమాజానిదా?
సమసమాజాన్ని చేయలేని నాగరికతా పోకడదా?
లేక
పెరుగుతున్న అనైతిక స్వార్థచింతనా ధోరణులదా?
ఎవరిది?ఎవరిది?ఈ పాపం ఎవరిది?
పరువుకోసం సమాధవుతున్న ఆడపిల్ల బాధ అంతు తేల్చే ఆయుధమవ్వాలి.
ఆడపిల్ల అగ్గిబరాటా కావాలి
కామాంధుల పైశాచికానికి నిప్పు పెట్టాలి.
ఆ సెగలో అమానుషాలు మాడిమసైపోవాలి
అలుసైన ఆడపిల్ల ఆణిముత్యమై ఎదగాలి
ముత్యమంటి మనసున మంచిగంధం కురవాలి.
పద్మ త్రిపురారి
జనగామ.
[4/16, 10:21 PM] Gvr bngr: *వీరా గుడిపల్లి( Sk 305)*
( ఆసిఫా స్మృతిలో)
🌻🌻🌻🌻🌻
*నిరాయుధులను చేయాలి*
🌻🌻🌻🌻🌻🌻
క్రౌర్యం, మౌఢ్యం, కలగలిసి న మృగాలు కొన్ని మనషుల్లో కలిసి పోయి
*దేహక్రీడా లోలురై వయసుతో పనిలేకుండా ఆ..దేహమైతే చాలంటూ చూస్తూ*
ఆ దేహాలను మనుషులుగా చూడడమే మరిచిపోయి
మాంసంముద్దనుకుంటూ మసిచేసి మాడ్చుకుతింటూ కాసిగా కాల్చేస్తున్నాయి.
*కామంతో కళ్ళు మూసుకపోయి.*
*కసాయితనమే తానై మొలకెత్తినట్లు.ఎత్తులకెదుగు తున్నారు.*
వస్తువులా వాడుకుంటూ తానో మనసున్న మనిషన్నదే మరిచారు
ఎందరు ఆసిఫాలను బలితీసుకున్నారో కదా,
*పసిమొగ్గలను కసిగా నలిపే రాక్షసక్రీడే నిత్య కృత్యమైపోతుంటే, వారి వికటాట్టహాసాల నడుమ నాలుగడుగులేయలేని ఆసిఫాలకెలా జన్మనిద్దాం*
అర్థంమారిన మానవ దేహాల క్రీడా జగత్తులో బలియౌతున్న కాంతా రోదనలకు
జవాబు చెప్పే దెవరు ?
*జాలిచూపులతో లాభంలేదని తెలిసీ మౌనంగా కుమిలిపోతే ప్రయోజనముంటుందా*
కథలతో పని జరగదింక కామదహనం జరగాలి
*శతృవును నిరాయుధున్ని చేయాలి.*
🌻🌻🌻🌻🌻
... *వీరా గుడిపల్లి*
[4/17, 12:19 AM] Poet Palloli Shekar Babu: ఆడ పిల్లకు రక్షణేది ? !
****************
వీధుల్లో తిరిగే గోవు
రక్షించబడుతోంది !
అడవుల్లో జీవించే జింక
సంరక్షించబడుతోంది
ఇంటిలో బ్రతికే ఆడపిల్లకు
రక్షణ ఎక్కడ ఉంది ? !
మహోన్నత సంస్కృతి కల్గిన
నా భారత దేశంలో అనాదిగా
స్త్రీ అత్యాచారానికి బలౌతూనే ఉంది !
దేవతలు నివసించిన ప్రాంతాల్లోనే
స్త్రీ హత్య చేయ బడుతోంది !
గోవును తిన్నారనీ . .
జింకను వేటాడారనీ . .
గగ్గోలు పెడుతూ ఉన్మాదులై . .
అమాయకులను కొట్టి తిట్టి
వెంటబడి వేటాడి నరికి చంపుతున్నారే . .!
కోర్టు కీడ్చి శిక్షలేస్తున్నారే . . !
అభం శుభం తెలియని పసిపిల్ల
రెక్కాడితే కాని డొక్కాడని కూలింటి పేదపిల్ల
చిన్న నెపంతో . . అధికార ధర్పంతో . .
కుల జాడ్యంతో. . మత మౌడ్యంతో . .
అపహరించి. . నాలుగు నెలలు బంధించి . .
జాలి దయ కరుణ పాపం పుణ్యం
గాలి కొదిలేసి. . మానవత్వం మరచి . .
మృగాలై . .నరరూప రాక్షసులై . .
వంతుల వారీగా . . పశువాంఛ తీర్చుకున్నారే . .
విష నాగులై . . పసి పాపను కాటు వేశారే . .
అసిఫా ప్రాణాలు తీసిన ఆ దుష్టులను
ఇంకా ఉపేక్షిస్తున్నారెందుకు ? !
అసిఫా పై అత్యాచారం చేసిన
ఆ దుర్మార్గులను
ఇంకా బ్రతుకనిస్తున్నారేందుకు ? !
అసిఫా జీవన హక్కును కాలరాసిన
ఆ మానవాధములను
ఇంకా కాల్చకున్నారెందుకు ? !
అసిఫాను అంతం చేసిన
ఆ కుల అహంకారులను
కూల్చకున్నారెందుకు ? !
అసిఫా ఊపిరి తీసిన
మత మూర్ఖులను
ఉరి తీయకున్నారెందుకు ? !
అసిఫా తల్లిదండ్రులకు
కడుపు కోత మిగిల్చిన కామాంధులకు
అంగాలు తీయకున్నారెందుకు ? !
అసిఫా గోవు కన్న
హీనమైనదా ? !
అసిఫా జింక కన్నా
దారుణమైనదా ? !
సభ్యసమాజమా . . !
సమాధానం చెప్పు !
మహా నాయకత్వమా . . !
చిక్కు ముడి విప్పు !
ఆడపిల్లల గతి ఇంతేనా . ? !
అణగారిన బ్రతుకు గుంతకేనా. . ? !
అసిఫా కు న్యాయం జరిగేనా . . ? !
ఆడ పిల్లకు రక్షణ లభించేనా. ? !
అసిఫా హంతకులు శిక్షించబడితేనే
భారత చట్టాల పట్ల నమ్మకముండేది !
ఆడ పిల్లలు దేశం లో బ్రతగ్గలిగేది !
భేటీ బచావో . . ! భేటీ పడావో . .!
అనే నినాదానికి అర్థం ముండేది !
(చిన్నారి అసిఫా కు అశ్రు నివాళి అర్పిస్తూ. . )
- పల్లోలి శేఖర్ బాబు 9490484316.
*********************************
[4/17, 6:10 AM] Poet Rajmouli Dandre: **స్పందన**
వసివాడని పసిపాపని నుసిచేసిన క్రూరత్వం...
చిగురుటాకు ప్రాయాన్ని
చిదిమేసిన అమానుషత్వం...
చిన్నారిని పశువాంఛకు
బలిచేసిన దానవత్వం..
ఇంకిన కన్నీటి
చెలిమను అగ్నిధారగ
మార్చిన రాక్షసత్వం...
గుండెను బండరాళ్ళతో
నలిపేసిన కర్కశత్వం...
మానవతకు సమాధికట్టి
సోదరభావాన్ని ముక్కలుచేసి...
మ్రుగాలకన్నా హీనంగా
మ్రుత్యువుకన్నా ఘోరంగా...
ముద్దులొలికే బాల్యాన్ని... మురిపాలొలికించే
భవితను...
మనిషిరూపంలో
యములై వచ్చి
ఆయువు తీరకుండానే
ఉసురు బలితీసుకుని
ఉసూరుమంటూ విలపిస్తున్న సమాజమా
సిగ్గుపడు....
రక్షణ కల్పించలేని రాక్షస లోకమా
ఆక్రందన అనుభవించు...
దయాహ్రుదయంలేని
ప్రపంచమా పొరలిపోయేలా
దుఃఖించు...
ఆసిఫా!మమ్మల్ని క్షమించు!
మధ్యతరగతి మనుశులం...
ఎవరికి అన్యాయం జరిగితే మాకేంటి...
మేం బాగానే ఉన్నాంకదా అని అనుకునే స్వార్థపరులం
కళ్ళుండి చూడలేని కబోదులం...
చెవులుండీ వినలేని బధిరులం...
నోరుండి మాటాడలేని
మూగవాళ్లం...
నీ ఆర్తనాదాలు హాహాకారాలు మాకెలా కనబడతాయి...?
మాకర్ణభేరినెలా పగలకొడతాయి??
మాకే దారుణమెదురైతే తప్ప!
మేమే బాధితులమైతే తప్ప!
--@దండ్రె రాజమౌళి@--
[4/17, 12:29 PM] Poet Khalandar Khattevale: 😢 *బలాత్కార భారతం -ఎందుకు??* 🤔😢
*************************
అర్ధనగ్న అలంకార అమ్మోరు విగ్రహలు
బాల్యంలో ఏ కోరికను పుట్టించాయో..
పాలతో అభిషేకిస్తున్న శివలింగాలు
యవ్వనంలో ఏ జ్ఞాపకం కలిగించాయో..
శిల్ప కళా సౌందర్యమంటూ గోపురాల
ప్రహారీచుట్టూ చెక్కిన అంగాంగ అందాలు
వృద్దాప్యంలో ఏకామజ్యోతిని వెలిగించాయో..
ఎనిమిదేళ్ళ చిన్నారి కాశ్మీరాన్ని
కల్మష పళ్ళ కాలుష్యం కొరికి కబళించింది
మానవత్వాన్ని ఆధ్యామితంగానే బలాత్కరించింది
కర్కశంగా గుడిలోనే రాజకీయం ప్రదర్శించింది
బహుశా అమ్మలను వారినాన్నలు చెరచడం
చూస్తూ పెరిగి ఉంటారు బాల్యమంతా..
అవగాహన వచ్చింటాది మగాలంటే
ప్రేమను బలాత్కరించడం అవస్యమనీ
బడిలో కార్పొరేట్ చదువులు చెరచడం చూస్తూ నేర్చింటారు విద్యాభ్యాసంలో..
జ్ఞానాన్ని బలాత్కరించడం సులువనీ
సమాజంలో స్వార్థం బంధాలను చెరచడం అనుభవించి ఎదిగుంటారు యవ్వనంలో..
విలువలను బలాత్కరించడం సాధారణమనీ
సంఘం మొత్తం సహవాసం చేసి
బలపరచి చెరచుంటారు తన అంగాల్ని
బలాత్కారం నాగరికతగా తమ హక్కనీ..
*అలాంటి పెంపకాలకి గుడి ఒక లెక్కా..?*
*గర్భగుడిలో బలాత్కరించడం పెద్దచిక్కా?*
సంస్కృతి మరచి ఆకృతి విడచి ప్రకృతిని చెరిచి
వీధుల్లో వీరులమని విర్రవీగుతున్న
సమాజ వైఫల్యాన్ని పారద్రోలాలనీ లేదా..?
మత మిఠాయిలు మృతశరీరాలపై ఆపరా..?
పంతం బూని విద్వేషాలను అణచరా..?
ఆడబిడ్డలకు స్వాతంత్ర్యం కలిపించరా..?
ఆసిఫాలను ఇకనుండైనా కాపాడరా..?
ఆదర్శవంతమైన పెంపకం ఇళ్లలోనే
జీవనంగా ఆచరించి చూయించరా...?
రండి మతం తీసి అడుగుదాం
పదండి హితం కలిపి కదులుదాం
మనదేశ పిల్లల రక్షణ కవచాలై నిల్చుదాం
కుతంత్రాలు సృష్టించే పాలక సన్నాసుల
కుయుక్తులకు చూపుడువేలును బలంగా
గొంతుకు బిగించి బలాత్కార మరకలను
శాస్త్రీయంగానే భారతీయులుగా కడుగుదాం
భినత్వ సంస్కృతి మాదే మాదేననీ చాటుదాం
ప్రభుత్వాన్నీ, పరిస్థితులనీ తక్షినం మార్చుదాం
కలిసి సంఘమించి ఉద్యమిద్దాం
ఇలాంటి వైఖరిపై యుద్ధం ప్రకటిధాం..!
కె.దాదా ఖలందర్
ఇంగ్లీష్ టీచర్
రాధ స్కూల్ ఆఫ్ లెర్నింగ్
అనంతపురము
9908835149
[4/17, 12:47 PM] Poet Gottapu Srinivas Rao: *వీడ్కోలు తల్లీ*
అమ్మా....ఆసిఫా.....
వీడ్కోలు తల్లీ.....
పరువు పోయిన ప్రపంచం నుండి...
కామపు పొరలనుండి పుట్టుకొచ్చిన కోరలచే చీల్చబడిన........
నీబాల్యం నుండి....
నేడు....
అమ్మ స్థానానికి అవమానం.
ఇది.....
పక్షవాత సమాజానికి సంకేతం.
బండరాయిని సైతం కరిగించే నీ కన్నీరు.......
ఆ గుండెరాళ్లకు కనిపించలేదా?
ఎంత వేదన అనుభవించిందో
నీ గొంతు.....
శాశ్వతంగా మూగబోయింది
ఎంత ఎదిరించాయో
నీ చిట్టిచేతులు.....
శాశ్వతంగా చచ్చుబడ్డాయి
ఎంత బెదిరిపోయాయో
నీ నిస్సహాయ నయనాలు........
శాశ్వత నిద్రలోనికి జారుకున్నాయి
వీడ్కోలు తల్లీ....
కమిలిపోయిన నీ దేహం నుండి......
కుమిలిపోయిన మా మనసుల నుండి...
గొట్టాపు శ్రీనివాసరావు
సెల్ నెం. 9542019064
[4/18, 8:05 AM] పెసరు లింగన్న Poet: *రాక్షస క్రీడ*
———*———
మానవత్వం మాడి మసై పోతుంది
మతం అనే మంటల్లో
కులం అనే కుంపట్లో....
దానవత్వం పేట్రేగి పోతుంది
పశుత్వం అనే పంకిలంలో
కౄరత్వం అనే చీకట్లో....
పసిమొగ్గలు వాడి పోతున్నాయి
కసాయి కన్నుల చూపుల్లో
రాబందు రెక్కల ఊపుల్లో...
ఆడతనం అంటే అలుసయింది
తొమ్మిదేళ్ల పాపల్లో
తొంభయేళ్ల బామ్మల్లోనూ...
దివ్యాంగులనూ వదలడం లేదు
దీనమైన వేదనలో
రొంపిలోన రోదన లోనూ...
మలినమంటే తెలియడం లేదూ
అశుద్ధం తినే వెధవలకు
అబద్ధం చెప్పే అథములకూ...
రాక్షస క్రీడ రాజ్యమేలుతోందీ
అమాయక ఆసిఫా అంతంలో
మూన్నెళ్లు దాటిన పంతంలో..
ఆవుల కొట్టం దేవాలయమాయే
జనం శోఖమే జాగరణాయే
వ్రణం పైననే వ్యాపారమాయే...
అయేషా,నిర్భయ,ఆసిఫాలయినా
ఆడకూతురులే అవుదురురా
అమృతం పంచే అమ్మలేనురా..
అమ్మను మించిన జన్మ లేదురా
అమ్మాయి లేనిచో అమ్మే లేదు
అమ్మ లేనిదే లోకం లేదూ.......!!
———**———
----పెసరు లింగారెడ్డి
[4/18, 8:14 AM] Gvr bngr: 🌻🌻ఆసిఫా స్మృతిలో🌻🌻
పాప పుణ్యాల పేరున పాడు బుద్ది
మంద భాగ్యుల మదిలోన మాటువేసి
మూఢ విశ్వాస ములతోడి మొలకలెత్తి
పసిడి మొలకల మానాన్ని పాడుచేసి
వింత శక్తులు పొందియు విశ్వ మంత
యేల గలమన్న భావమదేల మీదు
మదిని తలపోయ గలిగెనో మతము వలన
మాన వత్వమ్ము మసిజేయు మతము లేల
మూఢ విశ్వాసముననేడు ముంచె నేమి
చిన్ని ప్రాణంబు విలపించి ఛిధ్రమాయె
దైవ మున్నను జరుగునా దయయు లేని
మూర్ఖ దాడులు పుడమిపై మోస గించి
దైవ మున్నను జరుగునా దైత్య బుద్ది
కుృార విన్యాస ములునేడు కృతక ముగను
🌻🌻🌻🌻🌻🌻🌻
.... వీరా గుడిపల్లి
[4/18, 8:38 AM] +91 94918 81916: *కలాల కన్నీరు*
*అసిఫా ఆర్తనాదాలను*
*ఆలయ గంటలుగా మీరు మోగించినప్పుడు*
*పచ్చని ప్రకృతిపై*
*మీరు చిమ్మిన విషానికి*
*హాలాహలమే బెంబేలెత్తిపోతుంది*!
*మీ క్రూరత్వాన్ని*
*క్రూరమృగాలు సైతం అసహ్యించుకుంటున్నాయి*!
*నాజీలు నడిపిన నరమేధం*
*మీ ముందు దిగదుడుపే*!
*రక్షక భటులు నిత్య భక్షక భటులే*
*మీ అరాచకాన్ని చూసి*
*మీ నెత్తిమీది నాలుగు సింహాలు*
*గజగజ వణికిపోయాయి*
*చుక్క క్రింద పడకుండా*
*మీ రక్తాన్ని తాగుతామని ప్రమాణం చేస్తున్నాయి*!
*కనికరం లేని తుపాకి సైతం*
*తలదించుకుంది*!
*ఖాకీలను కసిదీర కాల్చేయడానికి*
*సిద్ధమవుతుంది!*
*నల్లకోట్లు*!
*న్యాయాన్ని నడి బజార్లో నగ్నంగా ఊరేగించినప్పుడు*!
*న్యాయ స్థానాలూ ప్రశ్నార్థకమే*!!
*మీ తోడేళ్ల గుంపును చూసి*
*కలాలు కన్నీటితో రాస్తున్నాయి*!
*రేపటి పౌరుల రాజ్యమా?*
**రేపిస్టుల రాజ్యమా??*
*ఒరేయ్?*
*మత్తుదించుకోండ్రా*!
*మనుష్యులు అనిపించుకోండ్రా!!*
*అసిఫా చివరి సంతకం*
*"నాదేశ ప్రజలారా*
*మతాలతో కాదు*!
*మానవత్వంతో బ్రతకండి"*
*పెబ్బేటి మల్లికార్జున్*
*కల్వకోల్*.
[4/18, 3:53 PM] Poet Kusumanchi Sridevi: అంశం-చిన్నారి అసీఫా
కుసుమంచి శ్రీదేవి
-----------------
కవి కలాలు రవి కిరణాలై
భావ జ్వాలలను క్రక్కుతూ
సప్తాశ్వాలపై పరుగులు తీస్తూ
కామ పిశాచాలను ధనుమాడి
నీ ఆత్మకి శాంతి చేకూర్చాలని
ఉప్పెనలా విరుచుకుపడుతున్నాయి...
కాసుకోండి కామ పురుగుల్లారా!
ఆడతనాన్ని చెదలలా
తొలిచే చెదపురుగుల్లారా!
మన్మధుడికే జుగుప్స
పుట్టించే వకృబుధ్ధుల్లారా!
ఎన్నాళ్ళు...ఇంకెన్నేళ్ళు
అధికార బలంతో
ధనాన్ని జల్లి...
దుష్టరక్షణ వలయాలలో
మృగాళ్ళా సంచరిస్తూ..,
ఆడతనాన్ని కామపిశాచాలలా
జుర్రుతారు...,
ఆడతనమంటే కామవస్తువనుకున్నారా!
ఆడతనమన్నది ప్రాణం పోసే
అమృతమురా!
ఆ అమృతమే విషం కక్కితే
మధంతో రంకెలేసే నువ్వెక్కడ?
మేలుకోండి!నేటి తరం
మనుషుల్లారా!మేల్కోండి!
నిన్న నిర్భయ,..నేడు
ఆసీఫా!!
క్షణంకో ఘోరం!
లోకానాకి వినబడే ఆక్రందనలెన్ని!
సమాధి చేసే కామ బలులెన్ని!
మారాలి చట్టాలు!
కాకూడదు కామాంధులకు చుట్టాలు!
పడాలి శిక్షలు ఆ ఆలోచనకే
వణుకు పుట్టేలా!
కావాలి ఆ చిన్నారి తల్లుల
ఆత్మలకు శాంతిలు..
చేయాలి ఆడపిల్లల జీవితాలకి
తక్షణ రక్షణ చర్యలు..
[4/18, 3:54 PM] Poet Musthakheem విన్నర్: --ఇంకెక్కడి ..మానవత్వం--
ఇంకెక్కడి ..మానవత్వం ..??
పశుత్వం, రాక్షసత్వం ..!!
పైశాచికం..పరమ హింసాత్మకం
పాపం ..చిన్నారి పొన్నారి పాప
"ఆసిఫా" కథ ..భయానకం,
కన్నీళ్ళు ..కరిగించే ..దాష్టీకం ..
దౌర్జన్యం ..మహా ..మహా
పాతకం ..యెవ్వరునూ ..
సమర్థించజాలని, క్షమించ రాని
నేరం ..ఘోరం,
మూడు మాసాలైనా ..ఇంకా
ఆలస్యం ..అలసత్వం అంటే ..
నిందితులు ..యెంతగా ఆరి తేరిన మహానుభావులో అర్థం
చేసుకోవచ్చు ..??
రాజకీయ రంగు ..పులుముకుని ..
తప్పించుకునే ..పనులు జోరు
గానే వుంటున్నాయని ..తెలుస్తోంది
నిందుతుల గొంతుకు ఉరి బిగించాలి ..నడి బజారున ,
ఒక ఉద్యమంగా జేసి ..
న్యాయం కోసం అందరూ
నడుం బిగించాలి ..!!
ఇంతటి ..రాక్షసత్వాన్ని అలుసుగా యెంత మాత్రం
తీసుకోకూడదు ..!!??
ఆ కిరాతకులను ..చంపి(ఉరి శిక్ష )మాత్రమే ..మనం"ఆసిఫా"
బిడ్డ ఆత్మ కు శాంతి చేకూర్చగలం..??!!
బాధాతప్త ..హృదయం తో ..
రచన : విన్నర్ , కొల్లాపురి.
[4/19, 5:56 PM] Poet Bharathi: 18--4--18
భాస్కర్ బాలభారతి
అనంతపురము
అంశము
అసీఫా. అసీఫా అసిఫా
అంటూ అందరూ ఎన్నాళ్లిలా
తెగబాధ పడతారు ??
సామూహిక అత్యాచార
సంతర్పణం
మనభారతదేశంలో కొత్తకాదుగా ?
మరెందుకిలాకొత్తగా వింతగా
జరుగరానిదేదో జరీగినట్లు
తెగయిదైపోతున్నారు ?
నిండుసభలో ద్రౌపది వలువల
దుశ్యాసనుడు ఊడదీయ
యత్నించుటతోనే
అబలను పదుగురెదుట
పరాభవించుపర్వం మొదలైంది
సాధ్విసీతమ్మను
రావణాసురుడు ఎత్తుకు పోవుట
---------నాటినుండే
అబల అంటే? ఎవరేంచేసినా
చెల్లుతుందని లోకానికి
తెలిసిపోయింది
కన్యాశుల్కం రూపంలో deleted
ముక్కుప
[4/19, 6:14 PM] Poet Bharathi: కన్యాశుల్కం రూపంలో
ముక్కు పచ్చలిరని
బాలికలు
బలికాలేదా ?
బసివిని రూపంలో
మగువలు ఊరుమ్మడి
సొత్తుకాలేదా?
అసీఫా విషయమూఅంతే
!
బాపనోళ్లబాలవితంతువుల
బాధలగిధలు వినలేదా ?
మనదేశంలౌ ఆడవారిపై అఘాయిత్యాలు కొత్తకాదే ?,
అమ్మకడుపున పడిప రోజునుండే
ఆమెగర్భసంచీ పరీక్షానాళికగా మార్చేస్తారు
అందులోపెరిగే పిండం
ఆడా మగా తెలుసుకోను
అప్పటినూండీ ఆడ నెలలపసిగుడ్డుపై కామపుచూపుల వలలు
విసరుతారు
ఎవరోకాదు దగ్తరిబంధువులే
ఆడది ఐతేచాలు
కామపుఇనుపముళ్లచట్రంలో
పిప్పిచేయబడిన చెరకుగడలట్లు
చిదిమేస్తారు మగమృగాళ్ళు
అసీఫా ఒక్కతేకాదుగుడిలో
పదుగురిచేతులలో ఛిద్రమైందని తెగయిదైపోతున్నారు
[4/19, 6:25 PM] Poet Bharathi: గుడేకాదు కదిలేబస్సూ రైలూ కారూ రిక్షా ఏదైతేనేం ఎదవపనికి
నడివీధిలోసైతం కుక్కలూ పందులూ చూస్తున్నాయన్న
భయంకూడాలేక
మనుషులమను ఇంగితాన్ని కోల్పోయి
అదేదో పండైనట్లు పదుగురినీ
పిలిచి పంచుకుంటారు
మదపుటేనుగుల మదజలం
చిందిస్తూనే వుంటారు
నిర్భయకేసులో కొవ్వొత్తులతో
నిరసన తెలిపితే
అసీఫా కేసులో నిరసన తెలిపినవారిపై చర్య
అంతేతేడా
కామక్రీడ అంతంకావాలంటే
మృగాణి అంగంతెగ్కోయాలి
అంతేగాని చట్టాలూ
ప్రభుత్వాలనమ్ముకుంటే
అత్యాచారాలకు అంతంపుండదు
[4/21, 2:04 AM] Poet Farzana, Wanaparty: ఇంకెన్నాళ్లు
''''''''''''''''''''''''''''
ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్లు
నారి ఆర్తనాదాలు ఇంకెన్నాళ్లు
ఇంకెన్నాళ్లు ఇంకెన్నాళ్లు
కీచకుల అరాచకాలు ఇంకెన్నాళ్లు
పాపలు ,పడుచులు ఆసిఫా ,నిర్భయలై
అమాంతంగా కబళించే నరమృగాల పాలై
కన్నీటి ధారాలై ,రాలిపోయే తారలై
రాక్షసుల రణరంగంలో అర్ధాంతరంగా బలై
భారతావని మూగ రోధన ఇంకెన్నాళ్లు
మదమెక్కిన మృగాలు మతం ముసుగు వెసుకున్నాయి
అనూహ్య కృత్యాలను కడవరకు సాగించాయి
పసిమొగ్గను క్రూరంగా చిదిమి చిదిమి తుంచాయి అన్యాయంగా ఆసిఫాను రక్కి రక్కి చంపాయి
ఈ వీధి కుక్కల వేట ఇంకెన్నాళ్లు
చీమను నలిపేసినట్టు నిర్దయగా నలిపారు
మాటు చూసి ,కాటు వేసి తలరాతే మార్చారు
ఆ గుడి గోడల రాళ్లు సైతం కన్నీరు కార్చి ఉంటాయి
నింగి ,నేల ,నలుదిక్కులు బోరున విలపించాయి
మరి ఈ చట్టాల చుట్టరికాలు ఇంకెన్నాళ్లు
ముందు వెనక చూడకుండా కఠిన శిక్షలేయండి
మాన ,ప్రాణ చోరులను నిలువున నరికేయండి
కామాంధులను క్షణక్షణం గజగజ వణికించండి
నీచ నికృష్టుల గుండెల్లో గుణపాలు దింపేయండి
మౌనం ,సహనం,జాప్యం ఇంకెన్నాళ్లు
వర్షించే మేఘమైనా గర్జించుట మానునా
అణిగి మణిగి ఉంటె మనకు న్యాయం చేకూరునా ఒదిగి ఉన్న శౌర్యాన్ని ఉప్పెనలా మార్చుదాం
స్త్రీల రక్షణకై తెగించి మనము ప్రళయమై సాగుదాం
జంకు ,బెణుకు క్షణక్షణం ఇంకెన్నాళ్లు
ఫర్జానా బేగం
హిందీ టీచర్
పెద్ద దగడ
వనపర్తి
[4/21, 11:19 AM] Poet Mastan Vali: అంశం : మానవ మృగాలు
శీర్షిక : *పిచుక పై బ్రహ్మస్త్రం - మృగాచారం*
కవి : షేక్. మస్తాన్ వలి
🐲🐊🐅🐆🦒🐾🐐🐲🐉🐊🐅🐆🐲
ఇది అత్యాచారమా ...??
మానవ మృగాల ఆచారమా ..??
పసికందుల పై పైశాచికత్వమా !!??
పైశాచికత్వాన్ని మించిన ...
శాడిజమా ... ??
శాడిజాన్ని మించిన ...
పేరు లేని కౄర హింసా ..??
అభము శుభము తెలియని ...
పసి కూనలపై రాక్షస క్రీడలా,
అరాచక క్రీడల్లో సుఖభోగాలా
పిచ్చితో కూడిన పైశ్చపు భోగాలా
చెవిటి ముందు శంఖూదినట్లు
ఎన్ని అక్షర ఆయుధాలున్నా
దేహశుద్ధి చేయగలమా ..??
మాలిన్య బుద్ధి మార్చగలమా
దానవ,రాక్షస జాతిని
మించిన వాడి ముందు
ఈ అక్షర ఆయుధాలు
తృణ ప్రాయమే కదా.!!!
నీచ , నికృష్ట , దగుల్బాజీ లను
అక్షర సుమగంధాలతో కడిగిన
ఈ ... అక్షరాలకు మైలంటునేమో
ఓ ... మానవులారా ఆలోచించండి ??
మృగాల మధ్య మనమా ...
మన మధ్య మానవ మృగాలా ...?!!
మృగాలతో పోల్చి ఆ వన్య జాతి
మృగాల నెందుకు కించ పరుస్తారు
తమ జాతి ధర్మమే అవి నెరవేర్చును
ఓ .. మానవ మగ మృగలు
మీ ... ధర్మా ధర్మా లేమిటో ..??
ఈ ... లోకంలో ఎవరికి ఎరుక ..??!!
అబలలపై మృగ తత్వము
సబలలపై అరాచ కత్వము
పిచుక లపై బ్రహ్మ స్త్రము
మీ ఈ మానవ మృగాల తత్వము
పసి మొగ్గ లను తృంచుట
పసిడి మొగ్గ లను
నాశనం చేయుట
మానవ మృగాచారము
🐲🐆🐅🐊🐉🐉🐐🐐🐐🐉🐊🐅🐆🐲
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673.
[4/22, 6:23 AM] +91 98853 80371: నీవేమి మనిషివి?
--------------------------
ముక్కుపచ్చలారని పసిగుడ్డును
నిండుగర్భంలోనే నలిపేస్తివి
కామపిశాచివై కండ్లునెత్తిక్కెక్కి
కన్నకూతురువంటి పసిపాపను చెరబట్టితివి
నిస్సహాయులైన మహిళలు, దివ్యాంగులపై
అరాచకత్వానికి ఒడిగట్టితివి
సాటిమనిషే కదాయనే కనీసస్పృహలేక
వింతగా ప్రవర్తించే జంతువైతివి
నీవింకా మనిషివేనా?
నిన్ను మనిషన్నదెవరు?
చెట్టును కొట్టేసి క్షామమంటావు
కన్నోళ్లను గెంటేసి క్షేమము లేదంటావు
తోబుట్టినోడిని శత్రువుగా జూస్తావు
ఆస్థులకోసమై గోతులు తవ్వుకుంటావు
బంధాలను తెగనరికి విద్వేషాలను కబంధహస్తాలతో కౌగిలించుకుంటావు
నీవేమి మనిషివి?
నిన్ను మనిషన్నదెవరు?
గాలి కాలుష్యమైoదని గగ్గోలు బెడతావు
నీరు మలినమైoదని వడబోసుకుతాగుతావు
నేలకు సారంలేదని నిందలేస్తావు
మరి
దీనికి కారకుడవైన నీవు
నిలువెల్లా విషం నింపుకుంటువి నీసంగతేంటి?
నీవేమి మనిషివి?
నిన్ను మనిషన్నదెవరు?
ఈజీవకోటిప్రపంచం ఇకముందు
శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలంటే
మారాల్సింది ఒక్క మానవుడే
మనిషిని మార్చే సాధనాలలో ఉత్తమమైనవి రెండు
ఒకటి కుటుంబం
రెండోది "గురు"కులం
పైరెండు ఆలయాలలో పిల్లలు సంస్కరించబడితే
భూమాత
పచ్చని ప్రకృతితో
అన్యప్రాణుల చక్కని విహారంతో
తోటిమనుష్యుల సత్సాంగత్యంతో
రమణీయం
శోభాయమానం
స్వర్గధామo.
...✒బింగిదొడ్డి వెంకటేష్
జీవశాస్త్ర ఉపాద్యాయుడు
*********************************
Comments
Post a Comment