దినసరి కూలీలు


అంశం...
రెక్కాడితే కానీ డొక్కాడని అడ్డామీది కూలీల బతుకులు ఆగమ్య గోచరమనే చెప్పాలి... అందుకే వారే ఈ వారం అంశం...
దినసరి కూలి...

అడ్డా కూలీ...
రచన : గోగులపాటి కృష్ణమోహన్

బరువులెన్ని మోసినా....
బతుకులు భారంగా గడపడం...

సద్ది సంకల బెట్టి
సరసరామనుకుంటు....
అడ్డమీదికి వెళ్ళి
అడ్డంగ తిరుగుతూ....

కూలి దొరుకుతేనె
కూడు దొరుకు నంటు
కూలి పనుల కొరకు
కుస్తీలు పడుకుంటు....

భవన నిర్మాణాలు
కాలువలు, బావులు
ఇసుక, ఇటుక బట్టి
ఇతర కంపెనీలు..

ఎండకెండుకుంటు
వానకు నానుతూ
చలికి వణుకుకుంటు
పనికి బెదరకుండ...

పండుగొచ్చిన గాని
బందులొచ్చిన గాని
రోగమొచ్చిన నేమి
పనులులేక పస్తులుండుడాయె

పనులున్న లేకున్న...
పస్తులే ఉండేటి
ఆగమైన బతుకు
అడ్డకూలీ బతుకు...
*******************

అంశం :దినసరి కూలీలు ,
శీర్షిక : "అన్నమో ..చంద్రా"
కవి : విన్నర్ (mustakheem)

యెవరు పెడతారు ..
మాకెవరూ ..అన్నం -బువ్వ
గంజి ..
యెవరు తీరుస్తారు ..మా
ఆకలి ..యెప్పుడూ అర్ధాకలే ..!!??

యెవరు కట్టిస్తారు ..ఇల్లూ -గిల్లు ,
తోడూ -నీడ యెవరు ..??
యెక్కడి ఏ .సి .
ఫ్యాన్ కూడ కర్వాయే ..??
పూరి గుడిశె ..స్వర్గంలా బ్రతుకుతాం..
అంబలి తాగి వొళ్ళు  సల్లబర్చు
కుంటాం..

అయ్యా ..సామి ..వొళ్ళు
వంచుతూ పంజేస్తం..!!
చెమట ..కార్చుతం..!!
కాయ -కష్టం చేసి ..బతుకు బండి ..సాగుతోందిగా ..
ఇంక ..యెవడి పై ..యెవడి సహాయం..కై యెదురు చూపు ..!!??

కాళ్ళు -చేతులుండగ ..వేరే వాడి పై ఆధారపడ్డం శుధ్ధ దండగ ...??!!

రోజు కూలి తోనే ..జీవితం !!
రోజు కూలి తోనే ..పిల్లల చదువూ ..పెళ్ళీ గట్రా !!
రోజు కూలీతోనే ..మంచీ -చెడ్డా !!

కూటి కోసం .కోటి కష్టాలు
ఇలా వుంటాయి ..మా దినసరి
జీవితాలు ..!!!

రచన: విన్నర్ , కొల్లాపూర్.
9705235385.🌸🌸🌸🌸🌸🌸💮💮💮🌹🌹🌺🌺
[4/8, 8:02 PM] కృష్ణమోహన్ గోగులపాటి: "అడ్డ మీది కూలీలం"

  ———***———

అడ్డ మీది కూలీలం

అన్నమో రామచంద్రా

అనేటోళ్లం!

ఏ రోజుకారోజు

ఎళ్లదీసుకునెటోళ్లం

పని దొరికితే

పండుగ జేస్కుంటం

దొరుకక పోతే

పస్తులుంటం

పల్లెలెల్ల గొడితే

పట్నమొచ్చినోళ్లం

సందులల్ల పందులోలె

గుడిశెలల్ల సర్దుకుంటం

వానలొస్తే తడిశిపోతం

వరదలొస్తే మునిగిపోతం!

ఆరు గంటలకొచ్చి

అడ్డమీద నిలవడుతం

ఎవరు విలుస్తరని

ఎదురు సూస్తం

ఏయ్!ఒస్తవా,అంటే

సరేనంటమ్

ఎకిలి సూపులు

సూశినా ఏమనం

ఎంతిస్తవని మేమే

అడుగుతం!

పొట్ట కూటి కొరకు

ఆరాట పడెటోళ్లం

పోరగాళ్ల సంకనేస్కొని

పోరాడెటోళ్లం

ముసలోళ్ల ముద్దుగ

జూస్కునెటోళ్లం

రాళ్లు గొడతాం

రంగులు వేస్తాం

మూటలు మోస్తం

కోటలు కడతాం

ఎంగిలి విస్తర్లెత్తేస్తాం

ఎన్నో గిన్నెలు తోమేస్తాం

ఏ పని జెప్పినా,

ఏమనుకోం

రేపు పిలవరని

భయపడుతాం..!!

    —————

....పెసరు లింగారెడ్డి
[4/9, 10:11 AM] Poet Mastan Vali: అంశం  :  దినసరి కూలీలు
    శీర్షిక   :  *రోజు కూలుంటే - బ్రతుకు హోళీ*
    కవి  :  షేక్. మస్తాన్ వలి

    🌑🌑🌏💥💥🌈🌻🌓🌗🌖🌕🌏🌟

       రోజు కూలీలం  రోజు కూలీలం
      బ్రతుకు భారమై రాయని పాళీలం
     రోజు కూలీలము పనికై వెతికే దినసరి కూలీలం

      దిన దిన గండం నూరేళ్ళు
      అన్న చందం మా బ్రతుకు
      ఉదయ మౌతుందంటే భయం
      ఏ రోజు పస్తుండాలనో నని
       పనే మాకు బాస్
      ఏ పనైనా భేస్
   
     రేపు తినే నెమలి కన్నా
    ఈరోజు తినే కాకి మేలు
     అన్నదే మా సిద్దాంతం
   
    ఎందుకంటే ....
    దినసరి కూలీలము
    రోజు గడవక, రోజూ
    ఎదురు చూసే బీదోళ్ళం
 
    కాయకష్టం చేసే టోళ్ళం
   కర్మ సిద్దాంతం నమేటోళ్ళం
   మా ఖర్మ యింతే నని
   సర్దుకు పోయేటోళ్ళం
   
      రోజు కూలికై ఎదురు చూపులు
      ఆకలి తీర్చే బ్రతుకు దారులు
     ఏ పనైనా చేయ గలిగి నోళ్ళం
    నోటి మూతకై ..
    రోజు కూలీ వుంటే చాలు
   మా బ్రతుకు హోలీ నంట

   🌏🌟💥💥🌕🌕🌖🌗🌑🌑🌓🌻🌈

         షేక్. మస్తాన్ వలి
       నవ్యాంధ్ర గీత రచయిత
    జంతుశాస్త్ర అద్యాపకులు
     సెల్  :  99 483 57 573
[4/10, 12:46 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: **  -  *****  -  **

పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
8074712181

~~ దినసరి కూలీలు ~~


వలస పక్షుల బతుకులు
క్యాలండర్లో ఒక్కోపేజీని చింపుతూ
కడుపునిండా తిన్నరోజుని పండగలా టిక్ పెట్టుకుంటే వేళ్లపై లెక్కచూడవచ్చు..

నడిచే అడుగు ఆరాటం
పొట్టకై పోరాటం ఈరోజుదైతే
అడ్డా కూలీల బతుకుకు మిగిలిందేమి లేదు
రేపటి రోజుకు రిజర్వేమి లేదు..

పని పనంటూ
రక్తాన్ని చెమటగా మార్చే పనికి
పూటకో వేషమై
రెక్కలనమ్ముకున్న కష్టం
ఎంచుకునే తీరయ్యాక కొందరికే పని దొరికిందెన్నడో
దొరకందెన్నడో..

పస్తులున్న రోజులలో
మంచినీళ్ల కుండ సహాయం మర్వలేక
పక్షియై రోజొక దిక్కు ఎగురలేక
వచ్చిపోయే వారిని
పనుందా పనుందా అంటూ బతుకు యుద్ధపు ఆయుధమవుతాడు..

పశ్చిమ సూరీడు
మబ్బుల అడ్డును దాటి
వెలుగు పరుచుటకు
చీకటి తెరలను ఒక్కోటిగ తుంచి
దినసరి కూలీగా మొలుస్తాడు..


@సిరిమల్లెలు...

పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
8074712181

**  -  *****  -  **
[4/11, 12:36 AM] Manne Lalitha: 7416863289.
కవయిత్రి:కవిరత్న,సాహితీ సచివ
మన్నె(పిన్నక)లలిత.
హైదరాబాద్.
_______________
శీర్షిక:దినసరి కుాలీలు.
____________________
అడ్డామీది కుాలీలం
గడ్డం మీసం ఉన్నొేళ్ళం
కాయకష్టం చేసేటొేల్లం
కల్లా కపటం తెలీనొేళ్ళం
సుారీడితొే పొేటీపడతాం
సుఖదుఃఖాలెండగడతాం
కాసుతొే సంబరపడతాం
కాసు లేకుంటే కాళ్ళు ముడుచుకుంటాం
ఉన్ననాడు పండగ
లేనినాడు ఎండగ
కలొే గంజొే తాగుతాం
గుడిసెలొే ఒదిగొదిగి పండుతాం
ఆదమర్చి నిద్రిస్తాం
చేతకాని పనిలేదు
చేయరాని పనిలేదు
ఏపనైనా చేసేస్తాం
యజమానికొేసం ఎదురుచుాస్తాం
ఎండా వానలు లెక్కజేయం
ఎల్లరను కలుపుకుపొేతాం
మేడలుకడతాం
గొేడలుకడతాం
కార్ఖానాలు కడతాం
కళాశాలలుకడతాం
కార్ఖానాల్లొే ఉద్యొేగం
రానొేటొేల్లం
కాసుల లెక్కలు తెలీక మెాసపొేయేటొేళ్ళం
ప్రమాదాల్లొే నష్టపొేతాం
ప్రమాద భీమా కావాలనుకుంటాం
మెాసంగీసం తెలీనొేళ్ళం
పైసే పరమాత్మనుకునేటొేళ్ళం
పలుగుా పారా కుంచెలే మాఆస్తి
అవిలేకుంటే మాపని నాస్తి
కుాలొేళ్ళం మేం దిసరికుాలొేళ్ళం.
××× మన్నె(పిన్నక )లలిత×××🌷
[4/11, 12:37 PM] Poet Bharathi: బాలభారతి9491353544

సూర్యోదయానికిమునుపే
చంకన చంటిదాన్నీ
నెత్తిన చద్ధిమూటతో
బ్రతుకు బాట వెదుకులాటలో
శ్రమించే స్థలంచేరరాలి
దినసరి కూలీ
!!
ఇల్లుకట్టు నైపుణ్యపుకూలీ
లూ
పారా గంపతో
సున్నంకొట్టేకూలీలు
తమవృత్తిచిహ్నసున్నపుడబ్బా
బ్రష్షూచేతబట్టి
కంపుగొట్టుసెప్ట్ క్ గుంతను ఇంపుగచేయ చేత
చేద బకట్టూ పారా నిచ్చెనతో
తారూ కంకరతో రోడ్డువేసేదినసరికూలీలూ
గుడిసెలు దడులూ కట్టురోజువారీ కూలీలు
నిచ్చెనలతో
రకరకాల పరికరాలను
చేతబట్టి
ప్రతిరోజూ నాలుగు కూడళ్ళ
కలీసేచోటు 
పనిచేయించుకునే యజమాని
పిలుపుకై
చూడాలి ఎదురు చూపులు !!
ఆరోజు అదృష్టదేవత
వరించిన కూలీలు
తమతమ పనిముట్లతో
పోవాలి యజమానివంట
పనిచేయుగమ్యస్తానానికి !
ఆరోజు తమపొట్ట
నిండబోతుందన్న ఆనందంతో
కొందరు కూలీలూ
కూలీదొరక లేదన్న నిర్వేదముతో మరెఃదరో
రోజువారీ కూలీజనం
కన్నీళ్లతో కడుపు నింపుకొని
పస్తులతో వెనుదీరిగి
మరోరోజు కూలీ దోరుకుతుందన్న ఆశతో
ఎదురుచూపులు
వారి శ్రమ లేనిదే సమాజము
ముందు కళ్లలేదును
సత్యమెరిగీ
ప్రభుత కల్పంచాలి
అందరికీ
తగినన్ని పనిదినాలు
పస్తులుంచరాదు ఎవరినీ 
💐💐💐💐💐
[4/12, 4:00 PM] Poet Satya Neelima: అంశం : దినసరి కూలీలు,
శీర్షిక : ఒక దినసరి కూలీ వ్యధ,
రచయిత : సత్యనీలిమ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దినసరి కూలీలమూ మేమూ
దినదినమూ దిగజారి పోతున్నాము
ఉన్నఊరు వదిలి,కన్నవారిని విడిచి
పొట్టచేత పట్టుకుని కూటికోసం వెళ్తున్నాము
తినడానికి తిండిలేక పస్తులెన్నో గడిపినాము
పంపునీళ్ళు తాగి మేము కడుపు నింపినాము
పనికోసం తిరిగి తిరిగి కాళ్ళచెప్పులు అరిగిపాయె
పనిదొరక్క మాకు ఎన్నో తిప్పలెన్నో తప్పకపాయె
నిద్రపట్టక అటూఇటూ దొర్లుతున్న రాత్రులాయె
ఊరు గుర్తుకొచ్చి ఎక్కెక్కి ఏడ్పులాయె
మా గోడు ఎవరూ వినేవారు కరువాయె
మా కష్టం చూసికూడా మానవత్వం లేకపాయె
అందుకే ఓ అయ్యలారా! 
ఓ అమ్మలారా!
దినసరి కూలీలని చూడకు మమ్మల్ని చులకనా
మేమూ మనుషులమేనని గుర్తించండి ఇకనైనా
ఎన్ని సర్కారులు మారినా
మా జీవితాలను చక్కదిద్దేనా
ఇప్పటినుంచి అయినా
ఈ సమాజం మారేనా
మా బ్రతుకులు మార్పుచెందేనా.....
.....ఇది ఓ దినసరి కూలీ హృదయవేదన...
  🙏🙏🙏🙏🙏🙏🙏
                  ✍...సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                        వనపర్తి...
[4/12, 9:13 PM] ‪+91 96189 61384‬: శీర్షిక: దినసరి కూలీ
రచయిత: ఉప్పరి తిరుమలేష్
🌾🌾🎍🎍🎍🍃🍃🍃
కూలీలము మేము కూలీలము
కూటికి లేని నిరుపేదలము
అడ్డా మీద బతికేటోళ్ళము
అరకడుపుకు తినేటోళ్ళము
కాయకష్టం చేెసే వాళ్ళము

పొద్దుపొడవకముందే నిద్రలేస్తము
చద్దిదో బొద్దిదో తినేటోళ్ళము
చద్ది మూట కట్టుకునేటోళ్ళము
పక్షి వలె అడ్డమీదికొస్తము
కాయ కష్టం చేసేవాళ్ళము
మేము అడ్డా మీది కూలీలము

గుత్తాదారి చేతుల్లో ఇరికినా బతుకులు మావి
గత్తెంత్రం లేని గతుకుల బతుకులు మావి
కష్టజీవిగా అలసినా బ్రతుకులు మావి
పట్టణం రోడ్లపై విసిరినా బతుకులు మావి

భవనాళ్ళు కూలిన చచ్చిన బతుకులు
ఎండనక వాననక ఎండిన బతుకులు
రాత్రనక పగలనక రాలిన బతుకులు
గుడిసె నీడల్లొ గోస మా బతుకులు

గొడ్డు గోద ఉన్నోళ్ళము
కరువు కోరల్లోన చిక్కినోళ్ళము
కాయకష్టం తెలిసినోళ్ళము
 అడ్డా మీద నిలిచిన అభాగ్యులము
🍂🍂🍂🍂🍂🍂🍂🍂

✍రచయిత
ఉప్పరి తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
          వనపర్తి
[4/12, 11:21 PM] Poet Kusumanchi Sridevi: 🌳అంశం-దినసరి కూలీలు🌳
🌳కుసుమంచి శ్రీదేవి🌳
---------------------
నాడు ప్రకృతమ్మ ముద్దు బిడ్డలై
పల్లెలకు పట్టుకొమ్మలై
దేశ ప్రజల ఆకలి తీర్చే అన్నదాతలై
వెలిగొందిన మేము...

కాలం వెక్కిరించి
కరువు కాటుకు గురై
మహిమలు లేని
జీవనం గడవని
అవతార పురుషులైనాము...

పనిముట్లుకి పూజించే ఈ కరములతో
కాయానికి ఆయుధపూజ చేసి
శ్రమనే ఇంధనంగా మలిచి..
బంధాలను మనసులో సమాధి చేసుకుని
రేపటి తరం చిగురుల కోసం
జానెడు పొట్టను చేత పట్టుకుని...

గూడులేని పక్షులులా
రెక్కలు తెగిన గాలిపటంలా
దిక్కులు చూసి బ్రతికే మేము
దిక్కులు మరిచి కూలికై
సంచారులమైనాము...

ప్రేమలు పంచే పల్లెలని
మోడు చేసుకుని
కరువు రక్కసికి తలొగ్గి...

అనువుగాని చోట అధికులమనకుంటా
బిక్కుమంటూ అడుగులు వేసి
బ్రతుకు చక్రం ఈడ్చుతున్న
కూలీలం...మేమే దినసరి కూలీలం
నేటి సమాజంలో ఈదలేకపోతున్న
అత్తెసర బ్రతుకులం...
[4/13, 6:41 AM] Poet Aruna Chamarthi: కవితాశీర్షిక.     ...ఎందుకు జాలి   అరుణ చామర్తి /ముటుకూరి హన్మకొండ                           .                       అవసరమా కూలీలని  జాలి  ...                     నీడపట్టున  నాలుగైదు  గంటల  నర్సరీ  పనితో  జాలీ  ..                        తక్కువేమీ  లేదు వారి వేతనం  ..                     మీ కంటే  తక్కువ  కాదని ఎగరేస్తున్నారు  కేతనం  ..               ఇంటి  పనుల  చేయమని తెగేసి  చెప్తూ  ,ఆ వచ్చే పదో  పరకో  వద్దంటూ  ...                 రోజు కూలికై అడుగులు  వేస్తూ  ..                      ఆధునికత  కు అలవాటు పడుతూ  దీటుగా  బ్రతికే  వారిపై  అవసరమా జాలి    ...పెద్ద వయసున  పనులు  చేసుకోలేక  ,పిల్లలున్న పట్నం చేరే  ప్రయత్నం లేక ..         పడుతూలేస్తూ  పతనమయ్యే  పండు  ముసలివారిపై ఉండాలి  జాలి ...                 కాదంటారా  ,కాదంటూ  కారుణ్యం తో కవితలల్లేద్దామా  !!!


Comments