బలౌతున్న బాల్యం



                           బలౌతున్న బాల్యం
బడిలోకి వెళ్ళి బలపం పట్టాల్సిన బాల్యం పలు కారణాలచేత బానిసలుగా బందీలవుతున్నారు... ఆ బందీల బతుకులు మారేదెలా?...
ఇదే ఈ సారి ప్రత్యేక అంశం...
"బలౌతున్న బాల్యం"

కృష్ణమోహన్ గోగులపాటి: అంశం : బలౌతున్న బాల్యం

శిర్షిక : బాల్యాన్ని రక్షించండి
రచన: గోగులపాటి కృష్ణమోహన్

చిట్టిచేతుల చిన్నారులు ....
బాల కార్మికులౌతున్నారు....
ఆడిపాడాల్సిన బాల్యం... ఆగమైపోతుంది.

తల్లిదండ్రుల పేదరికం ఒకవైపు...
నిరక్షరాస్యత మరోవైపు...
వెరసి
స్వేచ్ఛా విహంగంలో
విహరించాల్సిన బాల్యం ..
బందీ గా మారింది.

చెడు స్నేహాలకు కొందరు
చిల్లర అలవాట్లకు మరికొందరు
బాల నేరస్థులుగా
బ్రతుకీడుస్తున్నారు..

అమాయకపు మాటలు నమ్మి .... కన్యత్వాన్ని తాకట్టుపెట్టి....
సెక్స్వర్కర్లుగా మారుతున్నారు ఇంకొందరు...

ఇలానే కొనసాగితే...
పేదరికం వలన... బాల కార్మిక వ్యవస్థ,
బాల కార్మిక వ్యవస్థ వలన
నిరక్షరాస్యత.

నిరక్షరాస్యత వలన... పేదరికం ....
పేదరికం వలన.. వెనకబాటుతనం.....
అన్నీ చక్రబంధమై తిరుగకమానదు....
మన భావిభారతం తరగక మానదు....

కలం పట్టాల్సిన చేయి కత్తి పట్టొద్దు..
బడికి వెళ్ళాల్సిన బాల్యం బలైపోవద్దు...
ఆటపాటలతో పెరగాల్సిన పిల్లలు
పనులకు పోవద్దు...

అమ్మ ఆలన... అయ్య పాలన
తెలియని పసిమొగ్గలు కొందరు...
కంప్యూటర్ ఆటలు...
హైటెక్ చదువులు తెలియని
పేదరికం వీరిది...

చట్టాలు ఎన్నున్నా....
వీరిని మాత్రం అపలేకపోతున్నాయి...
అలోచించండి ఆదుకోండి ...
బాల్యాన్ని రక్షించండి...

మీకు కనిపించిన బాలకార్మికున్ని...
మీకు కనిపించిన బజారులో యాచకున్ని...
మీరు కనిపెంచని బిడ్డగా భావించి...
బడికి పంపించండి...

అదే... మీరు... మనం చేసే మంచికార్యం
ఇదే రేపటి తరం బాల్యం
బానిసలు కాకుండా బాటలు వేస్తుంది...
బాల్యాన్ని బానిసలుగా కాకుండా
బడికి పంపిద్దాం... బాగుపరుద్దాం...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
సూరారంకాలని, హైదరాబాదు
9700007653

★★★★★★★★★★★★★★★
[3/29, 6:12 AM] Gvr bngr: 🌻🌻వీరా గుడిపల్లి🌻🌻

🌻🌻🌻శీర్షికః ః   బాల్యం🌻🌻

బాల్యం అంత బాగుంటుందని
అప్పుడ్నాకు తెల్వదంటె దెల్వదు

అస్సల్దెల్వదు నిజంగ దెల్వదు
తెలిత్తె..బాపు చెప్పినట్లు ఇంటుంటి
అమ్మ జెప్పినట్లు సదువుకుంటుంటి

లెక్కల్సారు మీద కోపం బెట్కుంటోన్నా?
ఇంగ్లీస్సారు చెప్పినట్లినక పోతుంటినా?

ఉట్టందితే సాలు అప్పల్దినొత్సనుకున్న
ఏరు దాటితె మొగోన్ననుకున్న

సిత్పాలకాయలే ముఖ్ఖెమనుకున్న
బడెగ్గొట్టి జాతరకెల్తె మస్తు గొప్పన్కున్న

సదువుకుంటె బాగుంటదంటె ఇనక పోతి
ఇప్పుడన్కుంటేంలాభం?

ఏ యాల్లకాపని జెయ్యాలని మా బామ్మ గప్పుడే అంటుండె.. మనమినమైతిమి

మల్ల గారోజులొత్తె ఎంతబాగుండు?
ఒద్దులే గిప్పడు గట్లలేదు

అబ్బో శెప్పుకుంటెట్టే లేదు
బాల్యం బందీ అయ్యిందియ్యాల

మూడేండ్లు నిండకుంటనే ముసురుకుంటున్నయి కష్టాలకు
ముచ్చటంటెంగూడ దెల్వకుండ నిండుకుంటుంది బాల్యం

🌻🌻🌻🌻🌻 వీరా గుడిపల్లి🌻🌻🌻
[3/29, 6:36 AM] Poet Khalandar Khattevale: *నిర్బంధ బాల్యం*
********************

గంతలు కట్టి గెంతులేస్తూ
గడిపిన మా బాల్యం ,
గురుతులు చెరుపుతూ.. గుంతలుతీస్తూ
ఎదుగుతున్నదీ.. నవ విద్య వైకల్యం

పరుగు పరువులో  పారనందునా ..
తరిగి ఒరుగునా..(మము) కన్నదీవెనా ..?
వడిన మడిని అయి హరితబూనినా ..
బడిన బలపమై అరగతీసునా..
అమ్మపంచనే  ..దేహాలు విరుగునా
 
భవిత మారెనా ..? బ్రతుకు ఎగిరెనా ..?
యువత ఎదిగెనా ..?యుద్ధం చేసినా ..
యుద్ధం ఆగునా ..అద్దం ఇంత చూపినా..

బంధాల అందము  బడులలో  జారెనే ..
బంగారుపక్షినీ..ఎడారుల నిసిరినే..
రెక్కలరిగినా .. దూలానా తూగీనా ..
మార్కులాటలో  గురువులు చిదిమెనే ..
ర్యాంకుల కొలిమిలో  బాల్యాలు కాలెనే..

గుక్కలు అంటెనే .. దిక్కులు నవ్వెనే ..
ఒత్తిడిల ధాటికీ  ఉత్పత్తి పెరిగెనే ..
నిష్పత్తి మారెనే .. ఉత్తీర్ణత తగ్గెనే ..
విషములు కారెనే .. విషయాలు మారెనే..

పెంచినోళ్ళకీ ... సంద్రం ఎంచినా
ప్రేమ పంచినోళ్ళనీ.. వాగున ఎండినా ..
పంతం మానరే ...దర్పం ఆపరే ...
తల్లితండ్రులై  తలరాతను శాసించెనే..

వాగు తడిసినా ..మునకలు ఏడ్చినా ..
శవాలుఈదినా ..రుమాళ్ళు తడిచినా ..
భావాలు అలిసినా .. సవాళ్లు విసిరినా ..
అమ్మ పంచనే ... ఆశలు విరిగెనే
నాన్నవంచనే. ...నడతలు విరిచెనే ..
*ఇద్దరేకమై..నవ్యతను చంపెనే* ..

చరిత మారునా?  .. కోత తప్పునా ..?
మోపు ఎత్తినా ..మోత తగ్గునా ..?
బంధాలు మునిగెనే ..సంద్రాలు మిగిలినే ..
పలకలు పగిలెనే.. పంతాలు నెగ్గెనే..

కన్నోళ్లుఎరగరే ..కన్నీళ్లు చూడరే..
కష్టాల కౌగిలే ..రత్నాలు మింగెనే ..
దీపాలు ఆరెనే .. దివిటీలు కాలె నే ..
*నేలమ్మ ఆకలై.. నూరేళ్ళు కదిలెనే*!!

😢😢😢😢😢
కె.దాదా ఖలందర్
ఇంగ్లీష్ టీచర్
రాధ స్కూల్ ఆఫ్ లెర్నింగ్
అనంతపురము
9908835149
[3/29, 8:12 AM] Poet Ithagoni Venkateshwarlu: ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
బలియౌతున్న బాల్యం
ఒకచో రంగుల అందమైన కలకై ఓయమ్మ హాస్టల్లలో
నికఐదేండ్లకె వేసియీసమయినన్ విశ్రాంతిలేకుండగా
యకటా యాటలు పాటలున్ సుఖముగా యాత్మీయసంభాషణం
బిక చేకుండగ క్లాసురూము జయిలందే ర్యాంకు సంకెళ్ళతో
ఒకటే రుద్దిన యట్టి యొత్తిడికహోహో చిత్తు చిత్తయ్యె నిం
కొకచో ఎమ్కలగూడు లయ్యె తినగాకూడుం లభింపంగ లే
క కులాసింతయు లేక వెట్టిపనులంగావించ బాల్యంబిలా
వికలంబై నరకంబుకన్న నదమంబే యౌట యీదేశమున్
బ్రకటించెన్ గద ఐక్యరాజ్యసమితే నధ్వాన్నమౌ సూచులన్
[3/29, 9:38 AM] Poet Satya Neelima: అంశం : బలౌతున్న బాల్యం,
శీర్షిక : బాల్యాన్ని అమూల్యం చేద్దాం,
రచయిత : సత్యనీలిమ..
🙎‍♀🙎‍♂🙎‍♀🙎‍♂🙎‍♀🙎‍♂🙎‍♀🙎‍♂
బాల్యం బలౌతున్నది
కామాందుల చేతులలో
బాల్యం బలౌతున్నది
అక్రమ పుట్టుకలలో
బాల్యం బలౌతున్నది
చట్టాల నిర్వహణలో
బాల్యం బలౌతున్నది
పేదరికపు బతుకులలో
బాల్యం బలౌతున్నది
తిండిలేని రోజులలో
బాల్యం బలౌతున్నది
మానవత్వం లేని మనుషులలో
బాల్యం బలౌతున్నది
హాస్టల్ అనే బంధిఖానాలో
బాల్యం బలౌతున్నది
కరుణలేని కర్కశులలో
బాల్యం బలౌతున్నది
తల్లిదండ్రుల ఏమరుపాటులో
బాల్యం బలౌతున్నది
చదువుకునే వయసులో
బాల్యం బలౌతున్నది
పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితులలో
బాల్యం బలౌతున్నది
పలకాబలపం పట్టలేని కారణాలలో....
🙎‍♂🙎‍♀🙎‍♂🙎‍♀🙎‍♂🙎‍♀🙎‍♂🙎‍♀
బాల్యాన్ని కాపాడుదాం...
బాల్యాన్ని అమూల్యం చేద్దాం..
ఇది నా స్వీయరచన.
                 ✍...సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                         వనపర్తి..
ఈ కవిత పై సర్వహక్కులు నావే...
[3/29, 11:33 AM] ‪+91 96189 61384‬: శీర్షిక: బాల్యం
రచయిత: ఉప్పరి తిరుమలేష్
🙎🏼‍♂🙎🏼‍♂🙎🏼‍♂🙎🏼‍♂🙎🏼‍♂🙎🏼‍♀🙎🏼‍♀🙎🏼‍♀
బలైపోతుంది బాల్యం
 బాల కార్మికుడిగా
బర్రెల కాపరిగా
గొర్రెల మేపరి గా
విధి బాలుడిగా
హోటల్లో సర్వర్ గా
తాపీ మేస్త్రీ గా
తాకట్టు వస్తువు గా
తమ్ముడికి కావలి గా
బాల్యమంతా బడికి దూరంగా
బానిసత్వానికి బందీగా
భవిష్యత్తు అంధకారంగా
ఆడిపాడే వయసులోన
ఆనందించాల్సిన బాల్యం
బందీ అయిపోతుంది
డ్రగ్స్ మాఫియా చేతుల్లో
అవయవాల దోపిడిలో
పైశాచిక క్రీడల్లో
ప్రమాద పనుల్లో
బుగ్గిపాలవుతుంది  బాల్యం...
ఇది నా సొంత రచన...

     ✍ఉప్పరితిరుమలేష్
     తెలుగు ఉపాధ్యాయులు
               వనపర్తి
         9618961384
[3/29, 3:20 PM] కృష్ణమోహన్ గోగులపాటి: బాల్యాన్ని రక్షించండి
బాలల్ని కాపాడండి
                  ...కిరణ్ కృష్ణారావు

చిట్టిచేతుల చిన్నారులు
కార్పొరేట్ బడులలో బందీలవుతున్నారు
తల్లిదండ్రుల అత్యాశల సమిధలవుతున్నారు
ఆటపాటలు తెలియని బసనిసలవుతున్నారు...
కాపాడండి బాల్యాన్ని...
కాపాడండి బాలల్ని....

తల్లిదండ్రుల సంపాదనే వీరికి శాపం
కోడి కూతకు ముందే ట్యూషన్లకై పరుగు...
మధ్య రాత్రి వరకు పుస్తకాలతో పోరు
వయస్సుకు మించిన చదువు
అందుకే
కాపాడండి బాల్యాన్ని....
కాపాడండి బాలల్ని.....
ఆరో తరగతిలో ఐఐటీ కోచింగ్
ఇరవై నాలుగు గంటల్లో పదిహేను గంటలు చదువుకే
అమ్మ లాలన మంచిర్యాంకు వస్తేనే
నాన్న పాలన మంచి ర్యాంకు కోసమే
కాపాడండి బాల్యాన్ని....
కాపాడండి బాలల్ని.....
ప్రాణమున్న యంత్రాలు నేటి బాలలు
పెద్దల కలలు నిజం చేసుకునే సాధనాలు ఇప్పటి పిల్లలు
విదేశాలలో గొడ్డు చాకిరికి తర్ఫీదు పొందే వారు ఈ చిరంజీవులు...
అందుకే
కాపాడండి బాల్యాన్ని....
కాపాడండి బాలల్ని.....
       ----వై.వి.కిరణ్ కృష్ణా రావు
[3/29, 5:59 PM] Poet Musthakheem విన్నర్: అంశం :బలౌతున్న బాల్యం
శీర్షిక : పనిలో మ్రగ్గుతున్న ..బాల్యం .
కవి : విన్నర్
తేది :29-03-2018

బంగారు లాంటి ..బాల్యం
ఆయా పనుల్లో మ్రగ్గుతోంది ..!!?

పనిలో పెట్టుకునడం ..నేరమన్నా
పట్టించుకునే వాడేది ..??

పిల్లగాడు ..బడిలో  వుండాలన్నా..మాట వినరేరి ..తల్లిదండ్రులు ..!!?

చిన్న వయసులో ..ఇంటి పరిస్థితి వల్ల సంపాదనలో
పడింది ..పసి -పసిడి ..బాల్యం ..!!?

ఆట -పాటల్లో గడవాల్సిన ..బాల్యం ..
"బాధ్యతలు" భుజాల పై వేసుకునాల్సిన అగత్యం ..యేర్పదుతోంది ..!!?

ఇదెంతో ..దౌర్భాగ్యం ..అనైతికం ..అన్యాయం ..!!
మధుర బాల్యాన్ని ..ప్రియ బాల ల కు ..అందించాల్సిన ..అవసరం,బాధ్యత ..పెద్దల కుంది ..!!
సమాజం లోని వారందరికీ వుంది ..!!??

రచన : విన్నర్ , కొల్లాపూర్ ,
9705235385
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐
[3/30, 2:54 PM] Poet Kusumanchi Sridevi: 🌹కుసుమంచి శ్రీదేవి🌹
🌹అంశం-బలౌతున్న బాల్యం🌹
-----------------------------------------
జీవితంలో బాల్యమనేది
మాయా,మర్మమెరగని
బాధలెరగని  ..
కల్మషాలు లేని
తియ్యని తాయిలం!

అలాంటి తియ్యని తాయిలాన్ని
విషపదార్ధాలాంటి
లక్ష్యాలని స్థాయికి మించి
రుద్ది విషతుల్యం చేస్తారెందుకు!

జీవితం గాని
రంగుల రాట్నమనుకున్నారా
ఏమిటి?
మరల..మరల తిప్పి
తడిమి ఆస్వాదించడానికి!

బలవంతంగా వారి
స్వేఛ్ఛా జీవితపు రెక్కలు
విరిచి..
మీ లక్ష్యాల పంజరాలలో
బంధించి ...
బలవంతపు విహంగపు
విన్యాసాలు చేయంచకండి!

తల్లిదండ్రులుగా
మార్గదర్శుకులుకండి...
కాని వారి మార్గాలకు
అడ్డుదారులు కాకండి..

మీ జీవితమే వాళ్ళైతే
వాళ్ళకి పెద్దల మార్గం
చూపించండి..అంతే గాని
బలవంతపు గంగిరెద్దులను
చేయకండి!

వాళ్ళపై మీ కోరికలని
రుద్ది..
వారి ఆశలపై నీళ్ళు
జల్లకండి!
రేపటి దేశ సంపద
వీరే నని గుర్తించి!
బలౌతున్న బాల్యాన్ని
రక్షించి..
రేపటి పౌరులని
కాపాడుదాము!
🌹🌹🌹🌹🌹🌹
[3/30, 5:18 PM] Poet Mastan Vali: ఆంశం :  బలౌతున్న బాల్యం
      శీర్షిక   : *బలౌతున్నది..బాల్యమా - భావితరమా*
     కవి  :  షేక్.  మస్తాన్ వలి

👳🏻‍♂🧕🏻👲♨🦋⚓📈📉⚓🦋♨👲🧕🏻👳🏻‍♂

     భావి భారత  పౌరులారా
     బాల్య మెరుగని బాలలారా 
     బ్రతుకు అంతా చీకటైతే
    భారమైన బ్రతుకు బాల్యమా
     సమృద్ధి కి బాట లేక,
      బల్యాన్ని దాట లేక
     నవ వృద్దులు గా మీ బాల్యమాయే
      కురువృద్ధులు లేక మీకు
     యువ,వృద్దులుగా మిరినారా

     ఓ ... బాల్యమా
    గురుతులెరగని  బాల్యం
    బలౌతున్నది అమూల్యం
    ఆ ... బాల్యాన్ని బంధించే
    తాళాలు పగల గొట్టండి
    వాటి మూలాలు వెతకండి
   ప్రతి మనసును అడగండి
   ప్రతి మనిషికి చెప్పండి
  మన మూలధనం వారేనని
   మన అమూల్య ధనం వారేనండి

  విద్య నార్జించాల్సిన ఓ ... బాల్యమా
  పొట్ట కూటికై చేతులు చాచిన బాల్యమా
  యాచకులైనారా  ఓ  భావితరమా

   బాధ్యత తెలియని మనస్సు తో
    మీరు ఆడి ,పాడే వయస్సు లో
    బ్రతుకు భారమైన బాల్యమా
    నవ నాగరికత లో...
   నీ ... బ్రతుకు వెలుగు కై
   వెతుకులాటే ఒక విద్యాలయం

   ఇది విరించి కే తెలియని విషయమా
   అది వరించి వచ్చిన కష్టమా
   దాన్ని భరించేది ఈ బాల్యమా

    చట్టాలన్నీ సభలకే అంకితమా. ...??
   ఆచరణలో అంతా శూన్యమే ...!!
   అందుకు బలౌతున్నది బాల్యమే

👳🏻‍♂🧕🏻👲♨🦋⚓📈  ....  📉⚓🦋♨👲🧕🏻👳🏻‍♂


             షేక్. మస్తాన్ వలి
    నవ్యాంధ్ర గీత రచయిత
    జంతుశాస్త్ర అద్యాపకులు
   సెల్  :  99 483 57 673
[3/30, 10:54 PM] ‪+91 99085 60246‬: 🍀🌷🍀


*పసి మొగ్గలు*


చిరునవ్వులు పూయించే పసి మొగ్గలు.
నింగిలోని పక్షివలే
అంచలంచెలుగా
ఎదగాల్సిన చిరుగు
అవధులు లేని ఆనందాలు పొందుతూ
అమ్మ ఒడిలో అనురాగం పొందాలి.
కల్లోల ప్రపంచంలో చిదిమేయ బడుతుంది
బాల్యం 
అడుగడుగునా చాకిరి కోరల్లో మసిబారి పోతున్నది  !!
ప్రకృతిలో అణువణువు పసిపిల్లలకు అమ్మఒడి.       
పసిప్రాయంలోనే బాధ్యతలతో బందీ అయిపోతున్నది.   
ఒకవైపు విలాసవంతమైన జీవితాలు. 
మరోవైపు వీధినపడి నలుగుతున్న బతుకులు.           
దౌర్భాగ్యపు   స్థితిలో తల్లడిల్లుతూ బలియైపోతుంది బాల్యం. 
ఎంతని చెప్పేది- ఏమని చెప్పేది 
ఎన్నిచట్టాలు మార్చిన  మనుగడకు నోచుకోలే     
ఎన్ని సంస్కరణలు తెచ్చినా  సాఫల్యత  ఏది  !!             
రాబోయే తరాలకు బాల్యం తీపి జ్ఞాపకాలు కావాలి.......!!


ఎ.భాగ్యచంద్రిక.
దుప్పల్లి.


🍀💐🍀
[3/31, 7:57 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: ***   *****   ***

పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్

~ చిధ్రమైన బాల్యం ~


పేదరిక కుంపటిలో
రగిలిపోయే నిప్పుల బ్రతుకు
చిధ్రమైన బాల్యం..

మేనిని కప్పలేని పీలికలు
కడుపును నింపలేని చేతివేళ్లు
మసి పూసిన బతుకు చిత్రానికి బలౌతున్న బాల్యం..

ఇంటికి కాపలాలాగో
వృద్ధులకు ఆసరాలాగో
పసిపిల్లలకు లాలనగనో
బడికి దూరమై కరిగిపోతున్న బాల్యం...

రెక్కాడితో డొక్కాడని దినం
ఫ్యాక్టరీలో కూలీగనో
పొలంలో నాటేతగనో
పేపర్లు ఏరుకుంటూ, అడుక్కుంటూ
ఏ రకమైతేనేమి
చిదిమివేయబడుతున్న బాల్యం..

లేత చిగురుల కాలం
వెట్టిచాకిరిలో సమాధవుతూ
బాల్య కార్మిక వ్యవస్థనో
బాల్య వివాహ వ్యవస్థనో
అక్షరాలకు దూరంగా విసిరేయబడ్డ బాల్యం

కూడు కొరకు పూటకో అవతారమై
అడుక్కుంటూ
నిన్ను, నన్ను మనందరినీ ఈదేశ వ్యవస్థను హేళన చేస్తు
మీకేమి చేతకాదని ఆకలి చావును పిలిచిన బాల్యం...

మారేదెప్పుడు..?
మార్చేవారెవ్వరు..?
బలికాని బాల్యాన్ని కలగనే కళ్ళు
కరిగిపోని బాల్యాన్ని వరంగా ఇచ్చేరోజుకై వేయికళ్ళతో ఎదురుచూస్తున్న బాల్యం...!!

@సిరిమల్లెలు...

పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్




[3/31, 11:49 PM] Manne Lalitha: 7416864289.
మన్నె (పిన్నక)లలిత.
శీర్షిక:బలౌతున్న బాల్యం.
××××××××××××××××
బాల్యం బందీ అమ్మ గర్భంలొే
రక్త మాంసాలు..
మలముాత్రాలు...
మంచీ చెడుా తెలియక
తొమ్మిది నెలలు మెాసిన అమ్మనే
గర్భంలొేనే తన్నుకుంటుా బయటపడి
బయటప్రపంచం చుాడటానికి వస్తే
ముాడు సంవత్సరాలు
వచ్చీరాకనే, బడి అనే బందెలదొడ్డికి పంపి
మరల నా బాల్యం బందీచేసి..
సుార్యొేదయ సుార్యాస్తమయాలు చుాడనివ్వని
పాఠశాలలు
బండెడు పుస్తకాల బరువుతొే గుానివాళ్ళమై
కాళ్ళు శక్తి హీనమై
రక్త హీనమై
పేలవమైన శరీరంతొే
ఇరవైలొేనే అరవైలా మారిన
మా బతుకులు పగవారికైనా వద్దు    అమ్మా నాన్నల పిలుపులు, ఆప్యాయతానురాగాలు
ఆటపాటలు,ప్రకృతి పాఠాలుఏవీ?మాకేవీ??
మీ బాల్యం మాకెప్పుడిస్తారు?
మా బాల్యం బొేరు బావులకు అంకితమై
మా బాల్యం పాఠశాలఅనే నాలుగ్గొేడల మధ్య నలుగుతుా
మా బాల్యం నిర్వీర్యమైన రేపటి తరమౌతుంటే
మీరేంచేస్తారు?మీరేంచేస్తారు?
×××మన్నె(పిన్నక)లలిత×××××××
[4/1, 1:54 PM] 334455 Poet Murthy Sreedevi: తెలుగు కవన వేదిక
శీర్షిక :  బాల్యం


పేదోడి బాల్యం మట్టి
కుప్పల్లో మగ్గుతుంటే
ఇనుప కొలిమిలో
నలిగిపోతుంటే
కర్మాగార కూపములో
అంధకారమవుతుంటే
దయా హృదయాలకు
వేచి చూస్తుంటే
ఉన్నోడి బాల్యం
పట్టుపరువులకు నిలయమై
కార్పొరేటు చదువులకు
అంకితమై పుస్తకాల
బ్యాగులు మోసే మర
యంత్రాలై ప్రకృతి మాతకు
సుదూరమై కృత్రిమ
జీవితానికి బానిసై
ఆటపాటలు కలగా
నాలుగు గోడల మధ్య
నలిగిపోతున్నాయి
వసంతంలో ఉన్నా గ్రీష్మమే
సూతిమెత్తని బాల్యం
అపురూపమైన బాల్యమును తృణప్రాయ  యమనుకొనిన అవివేకమే
విలువలెన్నో తెలుసుకొనుచు నీతి ఎంతో జీర్ణించుకొనుచు
సారస్వత సారమును
గ్రహించుచు
సంగీత నృత్య సరాగాలలో
వినోద, విజ్ఞాన వెలుగులలో
అనుభూతి చెందుతూ
గురు బోధనలు స్మరిస్తూ ముందడుగు వేయాలి
ధీరత్వ లక్షణాలు పుణికి
పుచ్చుకుంటు సహకార
భావాలు సమ్మిళితము చేసుకుంటూ తనదైన
శైలిలో , నలుగురు మెచ్చే బాటలో పయనించాలి
 
         ---   మూర్తి శ్రీదేవి
[4/1, 7:00 PM] Poet Bharathi: భాస్కర బాలభారతి
అనంతపురము

శీర్షిక    బలౌతున్న బాల్యం
9491353544

బాల్యం కొందరికి వరం !!
మరెందరికో శాపం !!
తల్ల గర్భంలోనే చిదిమివేయబడిన బాల్యం
ఎయిడ్స్ మహమ్మారికి
వీధినపడ్డబాల్యం
చింకీ దుస్తులతో చెంపలపై కన్నీటి చారికలతో
డస్టుబిన్నుల దగ్రర  కుప్పతొట్లవద్ధ కూలబడీన బాల్యం
ఫుట్పాతులపై బూటఽపాలిష్ చేస్తూ
తంబాకులతో బీడీ లు చుడుతూ
పిడికెడు మెతుకులకై నేరాల వలల్లో చిక్కీఎటుచూచినా
బతుకు భారమైనబాల్యం
అత్యాచారాలకు ఆడపిల్లల బాల్యం బలౌతూంది
ప్రభుత తప్పదము పేదరికపు
శాపమే !!
నాణానికి మరోవైపు
ధనిక వర్ణపు డాలర్లమోజు
బాల్యానికి శాపం !!
కిండర్ గార్టెన్
కార్పొరేటు స్కూళ్లపై తల్లదండ్రుల మోజు
వెరసి
మాతృభాషకూ
అమ్మానాన్నల ప్రేమకూ
అవ్వాతాతల
మమకారానికీ
దూరమై
మార్కలవేటలో
లోకజ్ఞాన శూన్యమై
శారీరక శ్రమ లేక
మానసిక వత్తిడికి లోనై
ఆటపాటలతో గడపాల్సిన బాల్యం
బలౌతూంది
 నేటిబాలలే రేపటి పౌరులు !
ప్రభుత నిర్లక్ష్యం తొలగి
కన్యవారి కలిగితే తప్ప
బాల్యం బలౌతూనేవుంటుంది !!
,,,,******     ***4----****
దయచేసి ఈవచన కవితను
బ్లాగులో చర్చండి
,💐💐💐💐💐💐💐

Comments