అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా...మహిళామణులందరికీ నవరత్నఅక్షర మాలిక...

రచన: గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

1)
మహిళయె కదమన మాతయు
మహిళయె కద యక్క చెల్లి యన్నియుతానే
మహిళయె కద యత్తయనిన
మహిళయె మరి యమ్మ బామ్మ మహిలో కృష్ణా

2)
మహిరక్షణ రక్షించిన
మహళయె మనుగడను గూర్చు మనరక్షణయౌ
మహిళలు లేకుండమనకు
మహిలో మన్నికయెలేదు మరవకు కృష్ణా

3)
అతివ అబల సబల యంగన స్త్రీమూర్తి
నాతి ఇంతి కాంత నారి తరుణి
భామ సుదతి పడతి భామిని ఆడది
మగువ రమణి వనిత మహిళ యండ్రు

4)
మహిళ యన్న ఓర్పు మహిళయనిననేర్పు
మహిళ లేని మహియు మహియెకాదు
మహిళ వలనకలుగు మానవ జన్మము
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

5)
అక్క చెల్లి మహిళ అమ్మమ్మనానమ్మ
ఆడబిడ్డ అమ్మ కూడ మహిళ
ఆడువారె జగతికాధారభూతాలు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల

6)
అర్ధరాత్రిపూట యబల యొంటరిగా
తిరుగుచుండెనేడు తీరికగను
నిర్భయముగ నేడు నిర్భయమే యుండ...
జ్యోతినవ్య కృష్ణ జూఁడుమఖిల

7)
అమ్మ రూపులోన నాత్మీయతను పంచి
భార్య పాత్రలోన బాధ్యత గని..
కూతురుగను తాను కూర్మితో మెలగును
జ్యోతినవ్య కృష్ణ జూఁడుమఖిల

8)
రాజకీయమందు రాణిగా రాణించి
చెలగి సంఘమునకు సేవజేసి
అబలకాదుతాను సబల యని తెలిపె
జ్యోతినవ్య కృష్ణ జూఁడుమఖిల

9)
రౌద్రరూపమైన రాణిరుద్రమదేవి
ఝాన్సి లక్ష్మిభాయి ఛాయలోన
సాధ్వి యోధులకును సంతతి మహిళలు
జ్యోతినవ్య కృష్ణ జూఁడుమఖిల

అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలతో...
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
9700007653
**************

[3/5, 8:58 PM] Poet Satya Neelima: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా...
శీర్షిక : మహిళామేలుకో,
రచయిత : సత్యనీలిమ.
🕵‍♀👩🏻‍⚕👩🏻‍🌾👩🏻‍🍳👩🏻‍🎓👩🏻‍🏫👩🏻‍🏭👩🏻‍💻👩🏼‍💼👩🏻‍🔧👩🏻‍🔬👩🏻‍🎨👩🏻‍🚒👩🏻‍✈👩🏻‍🚀👩🏻‍⚖
ఓ మహిళా మేలుకో
నీ తలవ్రాత మార్చుకో
వంటింటి కుందేలై ఇన్నినాళ్ళుగా
వెట్టి చాకిరి చేసినా లాభంలేదుగా
అందరినీ ప్రేమగా లాలించినా
ఎవ్వరికీ నీ మీద దయలేదుగా
అందుకే .............................(ఓ మహిళా)
అర్దరాత్రి అబల ఒంటరిగా
తిరిగిన నాడే
పూర్తి స్వాతంత్ర్యం వచ్చునని
అన్నాడు గాంధీజీ ఆనాడు
అరవై వత్సరాలు గడిచినా
కూడా 
ఆడదానికి స్వాతంత్ర్యం రాలేదు నేటికీ
ఆడ,మగ సమానమని చట్టాలేవచ్చినా
నోటిమాట గానే తప్ప
ఆచరణే లేదులే
నింగికెగసి జాబిలమ్మలో
ఏముందో చూసినా
పక్కనున్న కొమ్మ మనసు
అర్థం చేసుకోలేరులే
అందుకే...........................(ఓ మహిళా)
ఆడపిల్లై పుట్టినందుకు
వరకట్నపు బాధలాయె
వీధిలోకి వెళ్ళాలంటే
పోకిరీల గొడవలాయె
అబలలపై ఎన్నెన్నో
దారుణమైన దాడులాయె
ఎక్కడికెళ్లినా రక్షణన్నది
కరువాయె
మంచి ఏదో చెప్పినా
మార్పు అన్నది రాకపాయె
ఎక్కడికెళ్తుందో సమాజం 
ఏమాత్రం తెలియకపాయె
అందుకే.. ...........................(ఓ మహిళా) 

@ మహిళలను గౌరవిద్దాం @
👩🏻‍⚖👩🏻‍🚀👩🏻‍✈👩🏻‍🚒👩🏻‍🎨👩🏻‍🔬👩🏻‍🔧👩🏼‍💼👩🏻‍💻👩🏻‍🏭👩🏻‍🏫👩🏻‍🎓👩🏻‍🍳🕵‍♀👩🏻‍⚕👩🏻‍🌾
               ✍.....సత్యనీలిమ,
               ఉపాధ్యాయురాలు,
                        వనపర్తి.
      చరవాణి : 9502156813
[3/5, 9:16 PM] Poet Palloli Shekar Babu: 🌺🌺🌺🌺🌺
మహిళ 
🌺🌺🌺🌺🌺

- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర 9490484316.

మహిళ 
మహోన్నత వ్యక్తి 
మహాద్భుత శక్తి 
అపరిమిత ప్రేమమూర్తి 
అనంత శాంతమూర్తి 

మహిళ 
మగవాడితో సమానం 
మనుగడలో సహకారం
పురోభివృద్ధికి ఆధారం 
ఆలోచనకు శ్రీకారం 

మహిళ 
భూమి పొరల్లో చొరబడింది 
సముద్ర లోతుల్లో పయనించింది 
విను వీధుల్లో విహరించింది 
మానవుణ్ణి సమూలంగా పరీక్షించింది 

మహిళ 
కలం పట్టి కవిత్వం రాసింది 
హలం పట్టి పొలం దున్నింది 
కత్తి తిప్పి రణం చేసింది 
జోలపాడి లాల పోసింది  

మహిళ 
చేయని కార్యం లేదు 
రాయని కావ్యం లేదు 
నేర్వని విద్య లేదు 
అసాధ్యం ఏదీ లేదు

మహిళంటే 
ఎందుకు అలుసు 
ఎందుకు భయం 
ఎందుకు అవేధన 
ఎందుకు అస్థిర ఆలోచన 

మహిలే కదా 
కవితలల్లిన మొల్ల  
కత్తి పట్టిన ఝాన్సిలక్ష్మీభాయ్  
రాజ్య మేలిన ఇందిర గాంధీ 

నైటింగేల్ సరోజని దేవి 
మానవతా మూర్తి మదర్ థెరిస్సా 
పరుగులరాణి పి టి ఉష
ఐ పీ ఎస్ కిరణ్ బేడీ  

వీరంతా మహిలలే 
మనకు మార్గదర్శకులే  
మహిళ పట్ల మన 
ఆలోచన ధోరణి మార్చుకుందాం
నీచ ప్రవర్తన మానుకుందాం 
మగవాడి మహిళ కలయికే 
రమ్యమైన ఈ సృష్టి 
వీరిద్దరూ లేకుంటే 
వ్యర్థం ఈ సృష్టి 

మహిళకు 
ఆలోచనా స్వేచ్ఛ నిద్దాం
ఆర్థిక సహకారమిద్దాం
మగవాడితో సమానత్వమిద్దాం
సంపూర్ణ స్వాతంత్య్ర మిద్దాం

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర.  9490484316
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[3/5, 10:12 PM] Poet Musthakheem విన్నర్: అంశం : అంతర్జాతీయ మహిళా దినోత్సవం 
శీర్షిక: మారిన మహిళ
కవి :విన్నర్ (ముస్తఖీమ్)
తేది :05-03-2018

ఓ ..మహిళా మణి , యెంతగా 
మారిపోయావ్ నీవు ...??!!
యెక్కడ లేవని చెప్పెద నేను ..??!!
కల్పనా చావ్లా వై అంతరిక్షం లో  కి అడుగు పెట్టావు ...!
మదర్ థెరిస్సా వై మమతకు , కరుణకు మారు పేరై నిలిచావు ..!!
ఇందిరా గాంధీ వై భారతదేశ మొట్ట మొదటి మహిళా ప్రధాని 
పీఠాన్ని  అధిరోహించావు ..!!!
ప్రతిభా పాటిల్ వై తొలి మహిళా రాష్ట్రపతి గా నీ 
ప్రతిభను చాటావు ..!!!
సరోజిని నాయుడివై కవితా జల్లును జోరుగా కురిపించావు ..!!!
కవయిత్రి మొల్ల వై రామాయణం ను రచించావు ..!!
లతా మంగేష్కర్ వై లోకాన నీ 
గాత్ర మాధుర్యాన్ని వినిపించావు ..!!!
ఝాన్సీ , రుద్రమ వై ..అకుంఠిత 
దీక్ష , ధైర్య -సాహసాలనూ , పోరాట పటిమనూ చూపించావు ..!!!
శ్రీదేవి లాంటి అందగత్తె వై అందాన్ని ..అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల అభిమానాన్ని సాధించావు ...!!!
ఆడ దంటే అబల కాదని , సబల అని నిరూపించావు ...
సమాజం లో మగవారితో సమానంగా ప్రగతి సాధించినా ..హక్కుల పరంగా ..ఇంకా అనేక విధాలుగా వివక్షను , హింస ను 
పురుషాధిక్యతను ..యెదుర్కొంటున్నావు ...?????
కుళ్ళు సమాజం లో మన లేకున్నావు ..???
డాక్టర్ , యాక్టర్ , కలెక్టర్ , టీచర్ ..మంత్రి , ముఖ్య, ప్రధాన మంత్రివైనా ..యెందు లో ఆరి తేరినా ..నిన్నొక పిల్లలు 
గనే  యంత్రం గానో ..కోరికలు తీర్చే వస్తువుగానో ..ఇంటి చాకిరీ చేసే పని మనిషి గానో ..
వంట మనిషి గానో ..మగాడి చేతిలో కీలు బొమ్మగానో ..ఇత్యాది వెన్నో హింసలు , గృహ -సామాజిక హింసలు ...మానసికంగాను , శారీరకంగానూ ..అనుభవిస్తున్నావు ...???😣😣☺
నీ విలువను గుర్తించీ -గుర్తించని ..మహానుభావులకు 
నీవొక తల్లివని , చెల్లివని, అనేక రూపాలలో నున్న దేవతవని ...మనసారా నిన్ను 
నమస్కరిస్తూ ...
విన్నర్ , కొల్లాపూర్ .9705235385💐💐💐💐💐💐🌸🌸🌸🌸💮💮💮💮🌹🌹🌹🌹🌹🌺
[3/5, 11:19 PM] Manne Lalitha: 7416863289
అంశం:అంతర్జాతీయ మహిళా దినొేత్సవం.
కవయిత్రి:మన్నె(పిన్నక)
లలిత.
తేది:5_3_2018.
జయహొే మహిళా!జయజయెాస్తు మహిళా!!
××××××××××××××××××
నిండు సభలొే వలువలు ఊడ్చినా
పాచికలాడి నిన్ను ఒ(తర్వాతఅక్షరం నాచరవాణిలొేరాదు.)డినా(ఒడినా)
కారడవులకు వెళ్ళినా
నిండు చుాలాలనిచుాడక
వనములకంపినా
ఇలా...ఎన్నొే....
యుగాలుమారినా మారని తలరాత
నేడు అవనినుండి అంబరానికి నిచ్చెన వేశావు
రాజనాలుపండించి రాజ్యాలుఏలావు
సాధికారం సాధించావు
పసిడిమెట్లు వేసి పౌరుషాన్ని నిలుపుకున్నావు
నీ రక్షణ విషయంలొే బేలవై బలవుతున్నావెందుకు?
ఆధునిక రక్షణ విద్యలునేర్చి అధములను అణచి,అంతంచెయ్యు
అబలకాదు
ఆదిశక్తని నిరుాపించుకొే
కాళివైకదంతొక్కి
కాలనాగువై కాముకజాతిని కాటువేయి
జయహొే మహిళా!
జయజయెాస్తు మహిళా అన్న నినాదాలు నింగినంటుతాయి.
×××మన్నె(పిన్నక)లలిత🌿🌺🌿
[3/5, 11:40 PM] Poet Telgu Thirumalesh: 🎙 సవ్వడి  🎷
(నూతన వచన కవితా ప్రక్రియ)
 ఆద్యులు :తెలుగు తిరుమలేష్
                  9908910398

ఎవరన్నారు?
మహిళా సభల కాదు అభల అని
మానవ జీవిత ఉద్భవం ఆమె త్యాగం
వంశ వృక్షానికి మూలం ఆమె రూపం
సప్త అడుగులు సప్త సముద్రాల నీటిచుక్కలనట్లుగా
ఆమె సహనం కుటుంభ వెలుగుకు సంతర్పణం
అందుకే అభినందన లతో నీకిదే నా ఈ కవితా సవ్వడి

ఎందుకీ భయం?
మహిళాభివృద్ధి సవ్వడికి
కొవొత్తి లాంటి శరీర సౌందర్యం ఆమె సొంతం
భర్త బాలల భరణం లేని భాద్యత ఆ భవానికి  అంకితం
కస్తూరి బొట్టుతో, పద్మములవంటి శరీరంతో, కలువ కన్నులు కలిగిన కిరీటం లేని కిరణం ఈ కలికి
కుటుంభ పోషణలో పదవులు లేని,పొగడ్త లు లేని పత్ని
అందుకే నీ సహన గుణానికి నీకిదే నా ఈ కవితా సవ్వడి
                  
                    ఇట్లు
✍ ....తెలుగు తిరుమలేష్
                 M.A,(M.Sc),B.Ed.
ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు
"సవ్వడి "నూతన వచన కవితాప్రక్రియ ఆద్యులు
వాట్సాప్ నెంబర్ : 9908910398
[3/6, 2:13 PM] ‪+91 99085 60246‬: 🙏🌷

ఎ.భాగ్యచంద్రిక.

మహిళ మణిదీపం

మహిళా మేలుకో  చాటుకో నీ ఘనత.   అడుగడుగున అవాంతరాలు  ఎదురైనా,
ఎదురీతే  ధ్యేయంగా విజయపథాన సాగుతూ                   నీ ధైర్యం , నీతేజం చాటుకుంటూ సాగాలి.              గెలుపు శిఖరాలను అధిరోహిస్తూ   
రాచబాటలు వేయాలి 
రానున్న తరాలకు . 
పసిబిడ్డలా అడుగులేస్తూ  
జీవన సాగరాన్ని దాటుతూ   
ఆటుపోట్లు లెక్కచేయని          
నీ స్థైర్యం                       
అందమైన ఊహాలన్ని ఆవిరి కాకుండా  కుటుంబమనే  రథానికి సారథివై నడిపిస్తూ అంచెలంచెలుగా  ఎదిగేలా చేసే నీప్రతిభకు సాటిలేనిది.     
 ఓర్పుకు మారు రూపమై  
మహిలోన నిలిచింది .      
మహిళ మనిదీపమై  వెలుగులు  పంచుతూ.       అన్ని రంగాలలో  ఆదర్శమైనా  ,
ఈసడింపులు ఛీత్కరాలు సన్మానాలు. 
నీ దరి చేరుతాయి.                        
ఎన్ని ఎదురైన సహనమే నీ ఆయుధం.                           జన జీవన సాఫల్యంకు మూలమై  
జాతి ఖ్యాతి పెంచే.       
మహిళా వందనం అభివందనం !!

🙏🌷✅🌞
[3/6, 9:33 PM] Poet Mastan Vali: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 
   అంశం :  మహిళా శక్తి
   కవి  :  షేక్. మస్తాన్ వలి
 శీర్షిక :  *నారీ ... మోగించే విజయ భేరి.. !*

🧛‍♂🙆🏼‍♂🚶🏻‍♀🏃🏼‍♀💃🏻🧚🏼‍♀🧚🏻‍♂🙅‍♀🧚🏻‍♂🧚🏼‍♀🏃🏼‍♀🚶🏻‍♀💃🏻

   ఇరవై ఒకటవ శతాబ్దపు ...నారి
   మోగిం చింది  విజయ   ...భేరి
   అన్ని రంగాలలో ....  చేరి
   ఆరి తెరింది  ఈ ... నారీ

     చీపురు పట్టిన చిన్నారి
     బలపం పట్టిన పొన్నారి
     విసుగు చెందని వీర నారీ
     సినిమా స్టెప్పుల సొగసరి
     అందం లో విశ్వ సుందరి
     స్టెతస్కు పటిన  గడ సరి
     రాజకీయం ఒక లాటరీ

     యాక్టర్, డాక్టర్, లాయర్
     వంటలో, పంటలో,జంటలో
     వరి లో అయినా, బరిలో అయినా
    ఆడని,ఈడని లేదు ఈ సారి
    అంతరిక్ష  విహారి

   అన్నింటి లో ఈ ... చెంగు
   చెంగు, చెంగు  మంటూ
  దూసు కెళుతుంది ఈ కొంగు
  అందుకే ... ఇరవై ఒకటవ శతకం
 ఈ ... నారీదే  విజయ భేరి

🚶🏻‍♀🏃🏼‍♀💃🏻🙅‍♀🧛‍♂ 🧚🏼‍♀ 🧛‍♂🙅‍♀🏃🏼‍♀🚶🏻‍♀💃🏻

            షేక్. మస్తాన్ వలి
    నవ్యాంధ్ర గీత రచయిత
    జంతుశాస్త్ర అద్యాపకులు
 సెల్ : 99 483 57 673.
[3/6, 9:51 PM] ‪+91 96189 61384‬: శీర్షిక: మహిళ,
రచయిత: ఉప్పరి తిరుమలేష్.
🥦🎋🎋🎋🎋🥦🎋🎋
సహనంలో భూమాతవు
జీవితమనే నాటకంలో అన్ని పాత్రలు నువ్వు
ఓ తల్లిగా, ఓ చెల్లిగా
అనురాగాల కల్పవల్లిగా
మమతానురాగాల స్నేహితురాలిగా
ముడేసుకున్న మూడుముళ్ళ బంధం భార్యగా
సఖిగా,ప్రాణసఖిగా,ఇష్టసఖిగా
ఈ సృష్టిలో మీకు లేదు స్వార్థం
విచక్షణ చూపించని న్యాయదేవతవు నీవు
కాని ,ఈ సమాజం నీపై చూపుతుంది వివక్ష
నువ్వు పుట్టకముందే నీ ఆనవాళ్ళను వివక్షతతో తడిమి భ్రౄణ హత్యలను చేస్తుంది నేటి సమాజం
ఆకాశంలో సమం అంటారు
అవనితో సమానం అంటారు
అన్నపూర్ణవు నీవు అంటారు
అరచేతిలో వైకుంఠం చూపిస్తారు
వంటగదిలో బంధిస్తారు
ఇంటిప్రాంగణమే ప్రపంచం అంటారు
నీ అస్థిత్వాన్ని ఆరెయ్యాలని చూస్తారు
అందరికీ అమ్మంటే ఇష్టం అంటారు
ఈ సమాజంలో కూతురంటే కష్టం అంటారు
సృష్టికి మూలం స్త్రీ అంటారు
జగతికి మూలం జనని అంటారు
కట్నం తేలేదని కాల్చి చంపుతున్నారు
మన ఆలోచన మారాలి
మన సమాజం మారాలి
కుటుంబ రథానికి దిక్సూచిగా
మహిళ అని గుర్తించాలి
ఎక్కడ స్త్రీలు ఆనందంగా ఉంటారో అక్కడ ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది
అమ్మగా అభిమానిద్దాం
చెల్లిగా చేరనిద్దాం
అక్కగా అనురాగాలు పంచుదాం
అందరం స్త్రీలను గౌరవిద్దాం
అబలలు కాదు సబలలని గుర్తిద్దాం
స్త్రీ జాతి అభివృద్ధికి పాటుపడదాం..
మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో..💐💐💐
       ✍..ఉప్పరి తిరుమలేష్,
                 ఉపాధ్యాయులు,
              జీనియస్ పాఠశాల,
                     వనపర్తి...
చరవాణి:9618961384
[3/7, 3:54 PM] Poet Kusumanchi Sridevi: 🌹కుసుమంచి శ్రీదేవి🌹
🌹శీర్షిక-మహిళ🌹
-----------------
ఆడదంటే
...ఆడనో..ఈడనో
తలదాచుకునే..
ఆడపిల్లో..ఈడపిల్లో కాదు!

ఇంటికి వెలుగు
అనురాగపరిమళాలు
వెదజల్లే ఓ దివ్యకాంతిపుంజం!

ఎన్నాళ్ళు..ఇంకెన్నేళ్ళు
కట్టుబాట్లు ముళ్లకంచెలతో
కాంతి నిరోధకాలౌతారు..

సూర్యతేజస్సు లాంటి
మేథోశక్తి...
భూమాతంతా సహనం
పారిజాతమంత సున్నితమైన
మనసు..
చల్లని ప్రేమానురాగాలు
వెదజల్లే పున్నమి ప్రతిరూపం..
కడలి కున్నంత ఓర్పు..
ఇంటికి వెలుగు
కంటికి మెరుపు ..మహిళ..

అక్షరాలని పుష్కలంగ
అందిపుచ్చుకుని
క్షరం కాని
ఉన్నతమైన
సమాజాన్ని నిర్మించగల శక్తి
నేటి మహిళ...

నేల నుండి నింగి
వరకు ...
కుటుంబం నుండి
దేశాధిపతి వరకు..
అమ్మ నుండి అంతరిక్షం
వరకూ ...
తన పాత్రలను బాధ్యతగా
పోషించగలిగేది మహిళ...

మహిళంటే ఓ శక్తి...
సహనమనే మకుటం ధరించే
ఓ మహారాణి...

మహిళలని గౌరవించండి..
సమాజాన్ని ఉన్నతంగా మార్చండి..
[3/7, 8:27 PM] Poet Ithagoni Venkateshwarlu: ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:మహిళాశక్తి
తరువోజ:
మహిళన్న చిచ్చక్తి మహిళన్న ప్రకృతి మహిళలేకుండిన మనుగడేలేదు
మహిళవిజ్ఞానియై మగనినిమార్చు మగవాని వెనకాల మహిళయే యుండు
మహిళ ముఖాబ్జము మరివిచ్చుకున్న మానక యాలచ్చి మనునట్టి యిల్లు
మహిళ యేడ్చినయింట మంటలేపుట్టి మలమలమాడురా మగవాడు దాను
మహిళ యర్థాంగియై మంత్రిసమానమై వెల్గుగృహమన్న మరిచూడస్వర్గ
మిహలోక మందున మించునెంతేని ఇదిగాక నరకమై ఎంతయో దోచు
అహమిట్లు పోనాడి యబలలే యనక ఆదరించిన వృద్ది యంబరంబంటు
మహితమై మనదేశ మాన్యసంస్కృతియె మహినిపూర్వపు ఖ్యాతిమంతమై వెల్గు
[3/7, 10:26 PM] ‪+91 94933 58758‬: మనం చూసాం కదా....

            సీతాదేవి  సహనం,  
           సత్యభామ  గాంభీర్యం,
            సావిత్రి  పోరాటం,
    అనసూయ  పాతివ్రత్యం....!

ఇంకా చూసాం కదా....

   రుద్రమదేవి  వీరోచితం,
   ఝాన్సీరాణి  త్యాగం,
   సరోజినిదేవి  సాహిత్యం, మదర్ థెరిసా  మానవత్వం....!

ఇంకా........ఇంకా......

   సుబ్బలక్ష్మి  అమృతగానం,
  మహానటి సావిత్రి  అభినయం సుధా చంద్ర నాట్యమయూరం,
  కిరణ్ బేడీ  సాహసం.....!

అంతేకాదు........

   కల్పనాచావ్లా  విజయం,
 సునీత విలియమ్స్  విజ్ఞానం,
   పీవీ సింధు  పతకం,
   పీటీ ఉష  ప్రవాహం.....!

ఇంకా  కావాలంటే....

  ఆకాశములో, అంతరిక్షంలో,
  విమానాలలో, విజ్ఞానంలో,
సాంకేతికత లో, సాహిత్యంలో ,
 అందాలలో, అభినయాలలో అన్ని రంగాలలో వారిదే పైచేయి..!

మరి  ఎందుకు......?

   ఈ  వివక్ష, వారిపై  కక్ష,
   వేధింపులు, చీదరింపులు,
  భ్రుణ హత్యలు, బెదిరింపులు,
   అవమానాలు, అపహేళనలు,
   హత్యలు,  అత్యాచారాలు,
   ఇదేనా  మహిళపై  గౌరవం,
  ఇదేనా  మహిళా  సాధికారత,
  సంస్కృతి,  సాంప్రదాయం....!
       ఆలోచించండి....     ఆచరించండి......
 స్త్రీని  గౌరవించండి....   కాపాడండి.......
               🙍💇మహిళ        దినోత్సవ శుభాకాంక్షలు🙍💇‍♂

                              వెంకటేశ్వర్లు.కె                         
 తెలుగు ఉపాధ్యాయులు
[3/8, 12:12 AM] Poet Mastan Vali: ది 08 - 03 - 2018 న అంతర్జాతీయ మహిళా              దినోత్సవం సందర్భంగా. ఈ.. గీతం
  * *ఇంతివై వెలిగినావు* 

   🙍‍♀🤷🏻‍♀🤰🏻🤱🧝🏻‍♀🧛‍♂🧚🏼‍♀🧚🏻‍♂🙅‍♀🙆🏼‍♂🙆🏻‍♀🚶🏻‍♀🏃🏼‍♀💃🏻👯‍♀

  పల్లవి :   విజయోత్సవం  ఇది విజయోత్సవం
                నేడు మహిళా   దిన విజయోత్సవం

చరణం1) 
                                                                                                                ఆకాశంలో  సగ భాగం    ఆనందం లో సమ భాగం
ఆ ఇంట ఈ యింటమీరంట  అన్నిట అందెవేసినా రంట    
సఖిగా సగ భాగం పంచినా  తల్లి గా పరి పూర్ణత నీదంట     ఇంతి వై ఇంతై  ఇంతిం తై    జగ మంతై  వెలిగి నావు      జనమంతా హారతి పట్టేలా   జగమంతా జేజేలు పలికేలా
ఎదిగినారు ఎదిగినారు   మహిళలంత  ఎదిగినారు
మేలిమి బంగార మైన  మహిళలుగా  ఎదిగినారు
వెలిగినారు వెలిగినారు జగ మంతా   వెలిగినారు

చరణం 2)

వడలి నారు , హడలి నారు  ముందుగా మీ రంట
అయిన గాని  అలుపెరగని   పయనమే మీ దంట
వడివడిగా నడుచుకొంటు   తడబడక  మీ రంట
నిలబడుతూ తలబడుతూ నిలిచెలే ప్రతి యింట
 అరె వీరులను, ధీరులను ఎదిరించి నిలెచె నంట
వీర నారులై ఎదిగి, ధీరత్వం చూపి నారు మీరంట
మది వీణ మీటుకొంటు మేలు కొలుపు పాడుతూ
ఆహా మేలిమి బంగార మైన మహిళ గా నిలిచె నంట

చరణం 3)

ఎదిగినారు, ఎదిగినారు  లోకమంత ఎదిగినారు
అన్నింటా  తొలి చోటు   మాదెంటూ  ఎదిగినారు
ఎదిగిమీరు వెలిగినారు  వెలుగుతూనే ఎదిగినారు
ఎదిగినారు ఎదిగినారు ఎదిగినారు ఎదిగినారు
అర్రె మేలిమి బంగారమైన మహిళలుగా  వెలిగినారు మహిళా దినోత్సవాన  మెరుపు లై  మెరిసి నారు
మహిళా దినోత్సవాన   తార లై నిలిచి నారు
నిలిచినారు,నిలిచినారు ఇల పైన వెలుగుతూ నిలిచినారు
మహిమ గల మహిళా మూర్తులై వెలుగుతూ నిలిచినారు

💃🏻🏃🏼‍♀🚶🏻‍♀🙆🏻‍♀🧚🏼‍♀🙆🏼‍♂🙅‍♀🧚🏻‍♂🧛‍♂👯‍♀🤷🏻‍♀🤱

        షేక్. మస్తాన్ వలి.
  నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673.
[3/8, 12:22 AM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి .హన్మకొండ 9000683826         కవితా శీర్షిక :జాగో మహిళా ....జాగో    భోజ్యేషు మాత అంటూ నెట్టేశాడు వంటింట్లోకి                                 కరణేషు మంత్రని చెప్తూ తెలివిని వేసుకున్నాడు తన  ఖాతా లోకి                తన వంశాన్ని  నిలబెట్టే ఇల్లాలినుండీ రొక్కం తోస్తాడు జేబులోకి                భార్యా రూపవతి శత్రు అనుకుంటూ కూడ చూస్తాడు రూపసికే              వేణ్ణీళ్ళకి చన్నీళ్ళ ని పంపిస్తాడు ఉద్యోగాల కి                            మనసులో పురుగులా తావిస్తాడు అనుమానాలకీ                                .తన వారిని ఆదరంగా చూడాలని భావిస్తాడు                                         తాను మాత్రం ఆలి బంధాలని చూడడం మరుస్తాడు     .                 సమానత్వమని  పరిమితం చేస్తాడు ఉపన్యాసాలకి ..               సర్డుకుపోవాలని నీతులు చెప్తాడు ఎదుటి వారికి                         కాదంటాడు తను పాటించడానికి                  అన్ని ధర్మపన్నాలూ   అంటగడతాడు ఆడవారికి...                     స్ర్త్రీ కీ ఉంటుందో మనసు                           అది వాడికి అసలు ఏం తెలుసు ? ? ?
[3/8, 7:06 AM] ‪+91 81062 77719‬: *👨‍🌾:మన ధర్మము*
నేను ఈ భూమి మీదకు వచ్చినపుడు నన్ను పట్టుకోడానికి 
ఒక స్త్రీ ఉంది ----- మా అమ్మ ...
,
నేను ఎదుగుతూ ఉన్నపుడు నాతో ఆడి నన్ను చూసుకోడానికి
ఒక  స్త్రీ ఉంది ---- మా అక్క ....

నేను బడికి వెళ్ళినపుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక స్త్రీ
 ఉంది ----- నా టీచర్

నాకు ప్రేమ , తోడు కావలసిన వయసులో ఒక స్త్రీ  ఉంది ---
నా భార్య

నేను మొండిగా తయారవుతున్నపుడు నన్ను మార్చడానికి ఒక స్త్రీ
ఉంది ------ నా కూతురు ....

నేను చనిపోతున్నపుడు తన ఒడి లోకి తీసుకోడానికి ఒక స్త్రీ
ఉంది ---- భూమాత
నీవు మగవాడివైతే ప్రతి స్త్రీని గౌరవించు ..........
నీవు స్త్రీవైతే స్త్రీగా ఉన్నందుకు గర్వించు..............
*👩🏻Happy Women's Day 

కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అపురూపమైనదమ్మ ఆడజన్మ👍🏻
[3/8, 7:23 AM] Poet Telgu Thirumalesh: ✍..సవ్వడి 
               
ఎటు మహిళా శక్తి?సంసార సంభరంలోనా
ఘుమ ఘుమ లాడే వంటింట్లోనా
దాసి రంభ మాతా జీవనంలోనా
కాదు కాదు...
మహిళా కదిలింది సమాజరణరంగంలో  మెరుపులా ప్రకాశిస్తూ 
కమ్మనైన ప్రేమను చూపుతూ
అమ్మ ప్రేమలా జీవనంసాగిస్తున్న 
మహిళలందరికి శుభాకాంక్షలతో 
ఈ కవితా సవ్వడి
                    
✍ ....తెలుగు తిరుమలేష్
[3/8, 9:23 AM] Poet Padma Tripurari: సహన సౌశీల్య ధీర సుధీరా
************************
సహన సౌశీల్య ధీర సుధీరా
సుందర సుకుమార సుమనోహరా
మానస వీణాగాన విజయీవరా
స్వాభిమాన గుణగణ నిపుణ క్రియాశీలా
క్రమానుక్రమ క్రమశిక్షణా కమల కోమలా
కళ్యాణీ!రమణీ!విరిబోణీ!వినుతశీలా
శీల సౌందర్య మగువ మంజుల మానసలీలా
లీలా చైతన్య జీవన జయ మాధురీ లలనా!

అనురాగలతా అతివా!
మమతల మరుమల్లివి నీవమ్మా!

మగువా!సజయా!
సిరిరాగవల్లివి నీవమ్మా!

తరుణీ!రమణీ!
కరుణాంతరంగిణీ!

విజయా!జయా!
విరిపరిమళ గుణవల్లీ!

సృష్టికి మూలం శక్తికి రూపం
మమతల దీపం పెనవేతల బంధం
నీవేనమ్మా ప్రేమల కొమ్మా!

ఇంటికి వెలుగై కంటికి పాపై
పదుగురి భవితల భవితవు నీవై
అలసట ఎరుగని అనంత శక్తివి
నీవేనమ్మా చిరునగవుల రెమ్మా!

కదం తొక్కిన చైతన్య దీప్తివి
కత్తి పట్టిన రుద్రమ శక్తివి

శ్రమకు రూపమై
ప్రేమ వరుణివై
ప్రగతి పథములో పయనించెడి నీకు
లోకం సకలం దాసోహం

దయా హృదయవై
ధరణి గురువువై
ఓర్పు నేర్పుల నారీమణివై
గగన సిగలలో కీర్తి వనితామణివై
ఎదిగిన నీకు వందనమమ్మా!
మహిళా అభినందనలమ్మా!

               పద్మ త్రిపురారి
                జనగామ.
[3/8, 3:19 PM] ‪+91 94411 10427‬: *మహిళా మొగ్గలు*

నవమాసాలు మోసి మమ్ము కని పెంచి
అణువణువూ స్పృశించి ఆదరిస్తుంది
ఆమె అమ్మగా మాతృత్వానికి ప్రతీక

బాల్యం నుండీ చేయి పట్టుకు నడిపిస్తూ 
అడుగడుగునా తానున్నానంటుంది
అక్క పేగు బందానికి అనురాగానికి ప్రతీక

అమ్మ ఇచ్చే దానిలో తనకూ భాగమంటునే 
నీవు నేనూ  అన్నిటిలో సమానమంటుంది
ఆమె చెల్లిగా అల్లరికి, స్నేహానికి  ప్రతీక

అమ్మలాగా పుత్రవాత్సల్యం కనపరుస్తూ 
ఏది మంచో ఏది చెడో తెలియజేస్తుంది
ఆమె వదినగా వాత్సల్యానికి ప్రతీక

 లోకంలో ఇన్ని రూపాల మూర్తిమత్వంతో
మమతా మానవత్వాలను పంచి పెంచుతుంది
ఆమె  మహిళగా సహనానికి ప్రతీక

   మేడిచర్ల హరినాగభూషణం, గద్వాల.
[3/8, 6:07 PM] ‪+91 96767 20412‬: *మహిళ*
ఆమెను తలచుకుంటె
ప్రకృతే పులకరిస్తుంది.
తెలుసుకుంటే, సకల చరాచరజగత్తు
నమస్కరిస్తుంది.
ఆమె అందం ప్రకృతంత,
సహనం భూమంత.
ఆమె మాధుర్యం జీవితమంత
ఆమెను అవలోకిస్తే....
ఆకాశమంత ఆశ్చర్యం,
అంబుధి అంత అద్భుతం,
అగాధమంత ఆవేదన,
నిప్పు సెగలాంటి నిట్టూర్పు.
అవకాశమిస్తే అందలాలన్ని తన సొంతమే, 
అసలు పంచాల్సివస్తే ఆకాశమైన, అధికార మైన సగం తనే.
భలే,....అందరూ
అబలే అంటారు.
అనాదిగ ఆఖరి పంక్తే, అడుగు మెతుకే.
రామసక్కని తల్లీ!
ఆకలి, దప్పులు మరచే విద్యను
ఏ విశ్వామిత్రుడు నేర్పెనోకదా?!

తండ్రి నీడనెదిగి,
భర్త జాడన నడచి, 
కొడుకు ఆసరన తుదిచేరి,
అద్వితీయ మైన శక్తి వున్నా
ఏనాడు ద్వితీయ మే.

మనుష్యజన్మకు ప్రాణం పెట్టే నీకు,
ధర నిర్ణయించుకోలేని రైతులా
స్వజాతి ని కనె స్వయం నిర్ణయం నీది కాదయె

ఆడతనమె బలము,వరము
మగతనమన్నది అహము,మృగము.
మనిషి తనమన్నది సమత,మానవత.

మృగత్వానికెన్ని పార్శవాలో,
నీ ఆత్మవిశ్వాసానికి అన్ని రూపాలు.
భావజాలం మారాలి, నీ భావిజీవితం ప్రభవిల్లాలి.
               *B.విజయ రమ*
                    🌸🌸🌸

Comments

  1. చక్కని ప్రయత్నం.కాని కవులే కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్రాస్తున్నారు.విస్తారమైన కావ్యపఠనం లేకుండా....వ్రాయాలనే తపన యుంటే సరిపోదు.కవిత్వనిర్మాణాలపై సెమినార్ లు ...ఏర్పాటు చేసి ఎక్కువ అధ్యయనం నాణ్యమైన సృజనశీలకవిత్వం ఎలా రాయాలో శిక్షణ అవసరం.

    ReplyDelete

Post a Comment