[3/25, 9:52 AM] Poet Palloli Shekar Babu: కమనీయం సీతా రాముల కళ్యాణం !
*******************
కమనీయం ! రమణీయం !
సీతారాముల కళ్యాణం ! !
భారతీయ సంస్కృతికి దర్పణం !
కుటుంబ జీవితానికి పరి పూర్ణ తార్కాణం ! !
నీలమేఘ శ్యాముడు
శ్రీ రామచంద్రుడు !
సుగుణ సౌందర్యరాశి
సీతాదేవి! !
అవతరించిరి
లోక కళ్యాణార్థంమై !
భువిలోన వైకుంఠం వీడి
మనుజావతారులై ! !
కార్యార్థియై వెళ్ళిన రాముడు జనకుని కొలువును చేరే !
సభికులందరు చూస్తుండ
శివుని విల్లుపెల్లున విరిచే !!
స్వయంవరం పోటీలో
విజయుడై రాముడు నిలిచే!
సిగ్గుల మొగ్గైన సీతమ్మ
పూలమాలతో రాముణ్ణి చేరే!
నూనూగు మీసాల నూత్న ప్రాయుడు !
చిరునవ్వుల పువ్వులు
శ్రీ రాముడు కురిపిస్తుండగా!
ఆనందసాగరం జానకిమదిలో
ఉప్పొంగుచుండగా !
ఎరుపెక్కిన బుగ్గలతో
తలవంచి సీతమ్మ నిలుచుండగా ! !
సభికులంతా ఆనంద భరితులై
కరతాళధ్వనులు చేస్తుండగా!
దివినిండి దిగోచ్చి దేవతలు
దీవెనలు అందిస్తుండగా ! !
కిన్నెర కింపురుష గంధర్వులు
పూలవర్షం కురిపిస్తుండగా!
జరిగిన సీతా రాముల కళ్యాణం !
త్రిలోకాల్లో చిరస్మరణీం ! !
(నేడు మార్చి 25. 3. 18 శ్రీరామ నవమి పర్వదినం , సీతా రామ కళ్యాణం సందర్భంగా . . ! )
(చూచిన కనులే పావనం !
ఆ మావన జన్మ ధన్యం )
- పల్లోలి శేఖర్ బాబు 9490484316.
*****25. 3. 18***
[3/25, 10:31 AM] +91 94411 68976: జీవన ధర్మం- మానవ ధర్మం(రామాయణం)
@@@@@@@@@@@
యుగాలుగా సాగుతున్న కాల వాహిని.సాగరాలను మధించి, గ్రహాంతరాలను శోధించి సాధించిన విజ్ఞాన సంపత్తి. అద్వితీయమైన జ్ఞానం. అద్భుతమైన కళాసృజన.సంపదలు,సదుపాయాలు,సౌకర్యాలు.
మనిషి సాగించిన ఈ అనంత జీవన యానంలో ఒక్క సారి చుట్టూ పరికిస్తే...ప్రశ్నలు వేసుకుంటే..
1) శాంతి చిరునామా?
2)ఆకలిని తరిమామా?
3)మానవతకేది ధీమా?
ఎవరికి వారే గా సాగుతున్న జీవన గమనం. భావమొకటి,భాషింకోటి. వేషాలు కోటి.చేసేది మరోటి.
మనిషిని పశుత్వం నుంచి, రాక్షసత్వం నుంచి వేరు చేసేదే ధర్మం. భారతీయులుగా,విశ్వ గురువులుగా సంస్కృతీ సారధులుగా వెలిగిన మనం మన ధర్మం వైపు దృష్టి సారించాలి.మరిచిపోతున్న గ్రంథాల్ని, మారి పోతున్న బంధాల్ని మన పిల్లల కు తెలియ జేయాలి.
రామాయణం మనకు,మనుషులైన అందరకూ ధర్మం, ఆచరణ,మానవత్వం, కరుణ,సేవ , శాంతం అనే మహనీయ గుణ సంపదలే అన్ని సంపదలకన్నా మిన్న అనే సత్యాన్ని సదృశ్యంగా కళ్లకు కట్టి చూపుతుంది.
మలేషియా, వియత్నాం, దావోస్.. ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఈ రామ ధర్మం, మానవ ధర్మాన్ని ప్రతిబింబించే రామాయణపు గురుతులు్న్నాయ్.
అంతా తెలిసిన మనం. చౌర్యం,క్రౌర్యం,ధన దాహం, అహంకారం మనలోని శత్రువులని తెలుసుకునే ప్రయత్నం, ప్రతి వ్యక్తీ,ప్రతి పార్టీ చేయాలి.మానవుడుగా ఎదగడం అంటే దానవీయ గుణాలను అదిమి, ఒదిగి ఉండడమే.ఆ గుణ సంపన్నత వైపు నడుద్దాం. అవగుణాలను తరుముదాం. ఆచరణ తో సకల గుణాభి రాముడిగా వెలిగిన శ్రీరాముడిని ఎదలో నిలపుదాం.
జై శ్రీరాం
జై హనుమాన్
నమో సీతా మాతా.
[3/25, 10:58 AM] Poet Musthakheem విన్నర్: అంశం: సీతారాముల ..కళ్యాణం
శీర్షిక : చూడచక్కని ..బంధం
కవి : విన్నర్ (mustakheem)
తేది :25-03-2018
యెంత సౌకుమార్యం ..సీతమ్మది
యెంతటి ..వీరుడు ..ధనుస్సును ఒక్క ఉదుటున ..యెత్తి
పెళ..పెళ..విరగ్గొట్టేను ..తళ ..తళ ..సీతమ్మ..మెరిసెనిలా ..
"స్వయంవరం" తో జీవితాల లా ..కలీసేను ..!!
అందమైన బంధం ..అపురూపమై..
జగతి లోన..కీర్తింపబడిన వేళ..
అదే ..అదే ..సీతారాముల ..కమనీయ ..కళ్యాణం ..!!
కన్నుల పండువగా .".శ్రీరామనవమిగ"
ప్రసిధ్ధికెక్కింది ...!!
""యేక పత్నీ వ్రతం..
పతి పాదసేవ..""
ఈ ద్వి పదాలు ..సీతా రాములనే ..ప్రతిబింబిస్తూన్నాయి ..!!
ఆదర్శ దాంపత్యం గా ..
అనురాగ జీవనం గా ..
గౌరవానికి ..భంగం ..కాని చర్యగా .."వనవాసం",రాజ్య నిష్క్రమణ ..ఇత్యాదివన్నీ ..
మచ్చుకు కొన్ని ..చారిత్రక నిజాలు ..!!
మిత్రులందరికీ ..."శ్రీరామ నవమి" పర్వ దిన శుభాకాంక్షలతో ..
రచనా:విన్నర్ , కొల్లాపూర్.
9705235385.🙏🙏🌸🌸🌸🌸💐💐💐💐🌹🌹
[3/25, 11:00 AM] Poet Satya Neelima: శీర్షిక : సీతారాముల కళ్యాణం,
రచయిత : సత్యనీలిమ
🕉🏹🎺🎷🥁🎻🎠🕉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కనులకు ఇంపుగా వీనుల విందుగా
కమనీయం రమణీయం
సీతారాముల కళ్యాణం
వరుడేమో రామయ్యంట
వధువేమో సీతమ్మంట
ఇరువురి కలయిక
లోకహితమంట........................."కనులకు"
ప్రతిఏటా జరిగేనూ కళ్యాణము
చూచినవారి జన్మధన్యము
దేవతలే దిగివచ్చి పెళ్ళపెద్దలవగా
బ్రహ్మ కడిగిన పాదములను
జనకుడు మరలా కడగగా ........"కనులకు"
తారలే తలంబ్రాలుగా ఇరువురి దోసిలిలో నిండగా
సాగరుడే ముత్యాలను కళ్యాణానికి ఇవ్వగా
సూర్య ,చంద్రులే మంగళకరమగు మంగళసూత్రమవగా
నాలుగు దిక్కులు వేదమూర్తులుగా వేదమంత్రాలు చదవగా..........."కనులకు"
శ్రీరాముడు ఓరకంట చూడగా
సీతమ్మ సిగ్గులమొగ్గగా మారగా
ఆనందంగా కళ్యాణం జరగగా
అందరికీ ఆదర్శం అవగా........."కనులకు"
🕉🏹🥁🎷🎻🎸🎠🕉
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది నా స్యీయరచన
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
వనపర్తి...
ఈ కవితపై సర్వహక్కులు నావే...
[3/25, 9:08 PM] Poet Khalandar Khattevale: 🌒 *నవమి బాణం*🌕
⚓⚓⚓⚓⚓⚓⚓
***********************
*రామ కనవేమి రా*..
జరుగుతున్న జగన్నాటకం
*రామ వినవేమి రా*..
మారుతున్న భూగోళ భాగవతం
*పుట్టిన రోజులు ఎందుకు రా?*..
నీవు పుట్టించిన బతుకులకు
ఆశల ఆశ్రయం ఆశయమై మనిషిని
నిలబెట్టకా..
*తీపిపానకాలు ఈఒక్కరోజు చాలునటరా*?
వేసవి తాపానికి శ్రామిక రక్తం చమటై
పండుగ, జీవితాలలో ఆవిరౌతున్నప్పుడు..
*ఉత్తుత్తి ఉట్టి సంబరం ఊర్లలోఉండాలా*?
గాయమై అయినా గేయమై అయినా
ఒక్కటే రామబాణమై ఈ అమానుష వనంలో
ఆప్యాయత వృక్షాలుగా చిక్కగా కలిపిన బంధాల
బురదలో నిలబెట్టక ఎదగమనీ చెప్పనప్పుడు..
*అలంకారాలెందుకు రా*..?
ఆటంకాలుగా అవమానాలతో సీతలందరూ
ఈ యుగమునా సాధికారత సాధ్య పరీక్షలు
ఎదురుకొంటుండగా ..
*పండగేమిటి రా*..?
సమానతల పండ్లులేక ఆకలివాకిళ్ళు
అసమానతల గుమ్మాలుగా మోకరిల్లినా
సత్ఫలాలతో మంచితనపు ద్వారాలు నిర్మించకా..
మనసుగృహాలలో వెలుగుతున్న అసాంఘీక ఆలోచనా కాగడాలు ఆర్పి, మానవత్వపు
చిరుదీపాలైనా అందరి ఇళ్ళలో వెలిగించి
పేదరికపు నైరాశ్యం పారాద్రోలకా..
సాయంత్రానికైనా కష్టజీవికింత బువ్వివకా..
*రామ కనవేమి రా* ..
కరుగుతున్న విలువల హిమాలయ ధైర్యం
*రామ వినవేమి రా* ..
కాటిన్య కళేబరాలుగా బతికిన శవాలబూడిద
జీవనదులుగా ప్రవహించాల్సిన జీవనాలను
కల్మషంతో కలుషితం చేస్తుంటే..
పవిత్ర గంగాజలమైపారాల్సిన భరతభవితను
మూసీమురుగునదిన స్వార్థానికి సాక్ష్యంగా
పాలకులూ పాశ్చ్యాతులై, పవిత్రత మరచి
ప్రాణాలను, మానాలను జాతులుగా విభజించి మూర్ఖంగా మాలిన్యాన్ని విసర్జిస్తుంటే..
భువి అంతా రామాయణ పారాయణమే..
దశరథుని అజ్ఞానమే..
కౌసల్య అమాయకత్వమే..
కైకేయి స్వార్థమే..
జానకిల నిబ్బరమే..
లక్ష్మణుల మౌన వదనమే..
రాఘవుల అరణ్యవాసమే ..
రావణుల రాజసమే..
రామ కనవేమి రా...రామ వినవేమి రా..
రామ కనవేమి రా...రామ వినవేమి రా..
హనుమంతులై తగలబెట్టందువా?
ధర్మాలై వీడిన హరిహరాదులను ఏకంచేసి
నవ కురుక్షేత్రమును జయించి వాల్మీకిలా
కలియుగ రామాయణం రచించమందువా ?
*రామా బదులియ్య రా*..
*నీ..కళ్యాణం ఆపించైనా*
*లోక కళ్యాణం గావించ రా*..
K. Dadakhalandar
English Teacher
Radha school of learning
Anantapur
9908835149
[3/26, 7:15 AM] Poet Padma Tripurari: పచ్చని పందిరి ముత్యాల ముంగిలి
************************
పల్లవి,,::
పచ్చని పందిరి ముత్యాల ముంగిలి
రతనాల లోగిలి రమణీయ లాహిరి
సీతారాముల కళ్యాణమే ఇది
సీతారాముల కళ్యాణమే ఇది.
"పచ్చని"
చరణం::
రఘురాముని ప్రేమే చెంపన కెంపై
రఘునందని పిలుపే ఊహల సిరులై
రఘుకుల తిలకుడు కనులకు తళుకై"
నిలిచిన సీతా కళ్యాణమే ఇది. "2"
"పచ్చని"
చరణం::
సీతా గుణములు చెవులకు సోకగ
సుందర జానకి మనమున నిలవగ
వేదమంత్రములు మేళతాళముల"
వైదేహిని వలచిన రాముని మనువిది "2"
."పచ్చని"
చరణం::
పసుపు కుంకుమలు పారాణి మెరవగ
బంధుజనులతో పందిరి నిండగ
పెద్దలు చిన్నలు ఆనందించగ"
సాగిన అవనిజరాముల పెండ్లిది "2"
"పచ్చని"
చరణం::::
శ్రీకర హితకర రఘువీరుడు రాముడు
శుభకర కోమలి సుశీల సీతను
మనువాడిన వేళా అంబరమంటిన"
ఆనందనందమే దివిభువి నిండెను."2"
"పచ్చని"
పద్మ త్రిపురారి
జనగామ.
[3/26, 7:15 AM] Poet Padma Tripurari: రామా రామా రామా రామా
************************
పల్లవి::
రామా రామా రామా రామా
రామా శ్రీరామా
రఘుకుల తిలక దశరథ తనయ రామా శ్రీరామా.
"రామా"
చరణం::
తండ్రిమాటకై అడవులకేగిన రామా శ్రీరామా
గురువు మాటకై రక్కస మూకను చీల్చిన శ్రీరామా
యాగరక్షణే భుజమునదాల్చిన రామా శ్రీరామా
ఇచ్చిన మాటను దాటని రాజువు నీవే శ్రీరామా.
"రామా'
చ::::
లక్ష్మణ భరతుల ప్రేమల
వెలుగువు నీవే శ్రీరామా
అన్న ప్రేమకు అసలు రూపువు అతులిత బలధామా
గుణగణములతో రాజ్యమునేలిన రామా శ్రీరామా
రామరాజ్యమే జనులరాజ్యమని చాటిన శ్రీరామా.
"రామా"
చ:::
అమిత బలముకు ఆకృతివైన రామా శ్రీరామా
బలమును మించిన దయామయుడవై వెలిగిన శ్రీరామా
రమ్యమైనది నీ చరితం రామా శ్రీరామా
శ్రీకరమైనది నీ శుభనామం రామా శ్రీరామా
"రామా"
చ:::
సీతా మారుతి గుహుని ఎదలలో నిలిచిన శ్రీరామా
శబరిమాతను బ్రోచినవాడా రామా శ్రీరామా
రక్కస రావణ మదమును అణచిన రామా శ్రీరామా
కోదండపాణివై జనులను కాచిన నీలమేఘ శ్యామా
"రామా"
చ:::
నీ నామము నే పలికి తరించితి రామా శ్రీరామా
నా మనసే నీ కోవెల చేసితి రామా శ్రీరామా
భక్తుల కాచుతు ముక్తిని ఒసగెడి రామా శ్రీరామా
నిరతం సతతం నీ నామం విడువం రామా శ్రీరామా.
"రామా"
పద్మ త్రిపురారి
జనగామ
[3/26, 7:50 AM] Gvr bngr: సీతారామ కళ్యాణం
[3/26, 7:50 AM] Gvr bngr: *వీరా గుడిపల్లి రామభక్తుడైన వేళ*
సీతారాముల కళ్యాణం కమనీయం కాని
*ఏటేటా జరిపే రామ భక్తులంటేనే నాకిష్టం*
రాముడంటేే నాకిష్టం కానీ
*రాముడిపాత్రనే సృష్టించిన వాల్మీకంటే ఎంతో ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*అన్నకు తోడుగా నిలిచిన లక్ష్మణుడంటే ఎంతో ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*అన్యాయాన్నెదిరించాలని అశ్వాన్ని బంధించిన లవకుశులంటే చాలా ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి పాదుకలకు వదిలేసిన భరతుడంటే మరీ ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*ఆలిమాటకు విలువనిచ్చిన దశరథుడంటే చాలా ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*అడవిలో వదిలినా క్షమించిన సీతమ్మంటే చెప్పలేనంత ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*ఉడుతాభక్తిని చాటిన వైనమెంతో ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*అంతా చూస్తూ భరించిన అయోధ్యావాసులంటే మరీ మరీ ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*వారధి గట్టిన వానరులంటే ఎంతో ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*స్వామి కార్యపరాయణత్వం చూపిన హనుమంటే*
*ఇంకా ఇష్టం*
రాముడంటే నాకిష్టం కానీ
*నాటి నుండి నేటి వరకు భారతాన్ని శాసిస్తున్న రామాయణం సృష్టించిన వాల్మీకి అంటే ఎంతోఇష్టం*
*ఃఃఃఃః*
*వీరా గుడిపల్లి*
*ఃఃఃఃఃః*
[3/26, 12:15 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: *** ***** *** ****
పాలకుర్తి నాగజ్యోతి
కుమ్రం భీం జిల్లా
26/03/18
~ కళ్యాణ వైభోగమే ~
రావటం, పోవటం మధ్యలో ఓ అద్భుతఘట్టం..
మనిషి మనిషిని తడుముతూ
మనసు మనసును కలుపుతూ..
కళ్యాణ వైభోగమే..
ఒకరికి ఒకరై
మూడుముళ్ళై
పంచభూతాల సాక్షిగా
ఏడడుగులై
ఒక జంటగా మారిన వేళా
కళ్యాణ వైభోగమే..
ఆకాశమంతా పచ్చని చలువ పందిరిలో
భూదేవంత సందడి చేసి
ముత్యాల తలంబ్రాలతో నవమి సందడి చేయ
శ్రీ సీతారాముల కళ్యాణమే..
నారాయణుడే నరుడై నడయాడిన ఈ నేల
నవమి నాటి వెన్నెల రేడై
రామదాసు కొలచిన దేవుడై
లోక కళ్యాణానికి శాసనమై
సీతమ్మను మనువాడిన రోజు
కళ్యాణ వైభోగమే..
@సిరిమల్లెలు...
*** ***** *** ***** ***
[3/26, 2:35 PM] Poet Ithagoni Venkateshwarlu: ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:సీతారామకళ్యాణం
మ: నవమింబుట్టితి పెండ్లిజేసి కొనితానాడే గదారామయా
సమతా వాదమె వేదమయ్యె తమకున్ సంబంధ భాందవ్యముల్
మమతల్ వ్యక్తిగతంబులైన నయముల్ రాజ్యంబు భోగంబులున్
గమనించన్ మరి ముఖ్యమే యనక సఖ్యంబంచు ధర్మంబునే
క్షమతో పూనితి రాజ్యమున్ సతిని సాకల్యంబుగా వీడితే
తమరుంజూపిన మార్గమున్ విడిచి యందంబొప్పు నీవిగ్రహాల్
సుమహైశ్వర్యము నిచ్చునంచు నవమిన్ జూడంగ నాటోపమీ
సమయంబున్ మరి పెండ్లిచేసి మురవన్ సంసారమేరీతిగా
తముదాటంగను జూతురో నరులు నీదర్పంబునజ్ఞానులై
సుమతిన్ దత్వమెరుంగరైరి ప్రభువా చోద్యంబిదే చూడుమా
నవమిన్ దోషమటంచువల్కెదరు విజ్ఞానంబు నార్జించకే
యమితానందము వస్తుజాతములలో నందంగ జూతుర్గదా
నమసుల్ రామయ మాదువెర్రి దొలగన్ జ్ఞానంబునందింపుమా
[3/26, 9:57 PM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...సీతారామకల్యాణం
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853
రామాయణము
మానవజీవిత
పారాయణము
సీతారామ కల్యాణం
చూచిన కనులకు వైభోగం
అన్నదమ్ముల ఆనురాగానికి నిదర్శనం
రామలక్ష్మణ భరతశత్రుఘ్నులయితే
అన్నదమ్ములు ఎలా
ఉండకూడదో తార్కాణం
రావణ విభీషణాదులు
వాలిసుగ్రీవులు....
అక్క చెల్లెళ్ళ అన్యోన్యం
ఆలుమగల అనుబంధం
ఆచరణలో ఆదర్శం
ఏకపత్నీవ్రతం
తల్లితండ్రుల మాటను
జవదాటని తత్వం
నిశ్చల భక్తి తత్వం
ఇచ్చిన మాటను
నిలబెట్టుకునే వైనం
చక్కని రాజరికం
చల్లని పాలనం
వెరసి వాల్మీకి రచనం
అవనికి అద్భుత వరం
నియమాల సారం
రామాయణం
రసరమ్య భరితం!!!
[3/27, 3:13 PM] Poet Mastan Vali: ఆంశం : సీతారాముల కళ్యాణం
శీర్షిక : అలనాటి *మేటి స్వయంవరం*
కవి : షేక్. మస్తాన్ వలి
🏹 🏹 ⛳🏇🏻 🐴 🏹 🦄 🧚🏼♂ 🧑🏻⛳🏇🏻 🏹 🏹
భువి లోన వైభోగం
దివి లోన ఆనందం
జనక రాజు సభకందం
అంద చందాల సుమగంధం
పసిడి వర్ణాల తన
ముద్దుల తనయకు
స్వయంవరం మనుచు
ఈ ... ఇలా తలమందు కల
సర్వోత్తమ మైన రాజు
లెల్లర కూ ఆహ్వానం పంపగ
నలుదిశల రాజులు
శివ ధనుస్సు నెత్తి,
స్వయం వరం నెగ్గి
సీత ను చేబూనుటకు
జనకుని కొలువున నిలిచెను
శివుని విల్లు నెత్తుటకు
మదపు టేనుగులంటి రాజులు
కండలు తిరిగిన వీరులు
గంభీర కాయము గల సాటిలేని
మేటి రాజులు, రారాజు లు సైతం
కుస్తీ లు పట్టె, పల్టీలు కొట్టే
రెండు కరముల శక్తి చూపించి
పళ్లు బిగబట్టి, గిగ బట్టి
కసితోటి, శిగ పట్లు పట్టంగ
ప్రయత్నించిన పట్టు నిర్వీర్యమవ్వంగ
మరల,మరలా ప్రయత్నించంగ
శ్రీ పర్వత మంటి శివ ధనుస్సు
కదిలించ లేక, విదిలించ లేక
నా నా ప్రయాసలు, ఆప సోపాలు పడుచూ
రూపురేఖలు మారంగ, వీరత్వం దిగ జారంగ
స్వేదం చిందించినా,జర్రంత,రవ్వంతైనా కదలని
ఆ. .. శివ ధనస్సు నెత్త లేక చతికిల పడే
అది కదలక , వది లెను దేశ, దేశముల
రాజులు సైతమున్
అటు పిమ్మట...
ఆజాను బాహుడు
నీలమేఘ శ్యాముడు
దశరధ తనయుడు
సువర్ణ ,సొగసు లద్దిన
సీతమ్మ చేబూనుటకై
శివుని విల్లు నొక్క చేత
దూది పింజ వలె నెత్తెను
వింటి నారి సారించి నంతనే
ఫెళ, ఫెళ మని విల్లు విరగంగ
భలే,భలే మని సభికులందరు
కర తాళ ధ్వనులు చేయంగ
గంగ ఉప్పొంగి నట్లు సీత మదిన
ఆనందముప్పొంగెను
సభాసదులు హర్షించంగా
పూల వృష్టి వర్షించంగా
ముత్యాల తలంబ్రాలు చల్లంగా
వింటి నారి సారించిన రఘు వంశ ఘనుడు
సీతను తన ఇంటి నారిగ చేసుకొని న
సీతమ్మ హృదయాన నిలిచిన.
జన ప్రియుడు ఈ రఘు రాముడు
ఈ శ్రీరామ చంద్రుడు
⛳🏇🏻🏹🦄🏇🏻⛳🏹🏹🦄🐴🏇🏻🏹
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్. : 99 483 57 673.
[3/28, 11:19 AM] కృష్ణమోహన్ గోగులపాటి: శ్రీరామనవమి సందర్భంగా పంచరత్నాలు
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు
1)
పూర్వ భాషి యతడు పూర్ణభాషణలతో
చిర్నగవులమాట చిందువాడు
సత్యభాషి యమిత సద్భాషి రామయ్య
జ్యోతి నవ్య కృష్ణ జూఁడుమఖిల
2)
తండ్రిమాటనిలుప తమ్ముడనుసరింప
వెంటరాగ సీత వెడలెవనికి
రాజ్యకాంక్ష లేని రారాజు రామయ్య
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
3)
నవమి నాడు పుట్టినాడుమా రామయ్య
యడవికేగెతాను నన్నివిడిచి
సీత జాడ తెలిసి శ్రీలంకకేగెను
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
4)
రామరావణులకు భీమమౌ యుద్దము
సాగె, నందు నసురు సంహరించి
సీత తోడ మరలె సిరుల యయోధ్యకు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
5)
రాముడనిన ప్రేమ రాముడన్ననుత్యాగి
రాముడనిన గొప్ప రాజనీతి
రామరాజ్యమన్న రాదిక మహిలోన
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు
బందు మిత్రులకు, సాహితీ ప్రియులకు, శ్రేయోభిలాషులకు.....
శ్రీరామనవమి శుభాకాంక్షలతో..
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు

Comments
Post a Comment