సినీనటి శ్రీదేవి కి అక్షర నివాళి

శ్రీదేవి కి అశ్రునివాళి
[2/25, 2:35 PM] Poet Padma Tripurari: జలతారు వెన్నెల తార
సిరివెలుగుల  సితార.
*******************
నిండు పున్నమి వెన్నెల వెలుగును 
జిలిబిలి జిలుగుల సొగసు బొమ్మను చేసి
నవరసాల సార సరిగమల గమమును
నయనముల నవకాంతిని చేసి
అమాయక హృదయ రవమును 
నవనీత ఎదపదముగ చేసి
పసిడికాంతుల సుందర రూపము
అపరంజి బొమ్మకు ప్రాణం చేసి
నింగితారల తళుకును జలతారు తారగ భువికి చేర్చిన
 ఆ బ్రహ్మదేవుడి అపురూప సృష్టిగ
అభిమానుల హృదయతారగ
సిరివెలుగుల రాగసితారగ
అపురూప నటనతో ఆరాధ్యరూపగ
అందరి హృదయ మందిరమున
మనోహర మనస్వినిగ వెలుగయి నిండి
వివాదరహిత క్రమశిక్షణా
అభినేత్రిగ
నీరాజనాలందుకున్న  దేవీ!మా శ్రీదేవీ!అశృ నివాళిదె అనుపమాన నటనా చాతురీ!  


                పద్మ త్రిపురారి.
[2/25, 8:15 PM] Poet Kusumanchi Sridevi: కుసుమంచి శ్రీదేవి
శీర్షిక- నటి శ్రీదేవి గారు
---------------------
నింగిన వేళ తారలుండగా
వెలుగులతో ప్రకాశవంతంగా
నింపుకున్న అభిమానల
హృదయాలను చీకటి మయం చేసి
భువిలో తారను నింగికి 
అర్థాంతరంగా
తీసుకుపోయిన ఆ పైవాడు
ఎంత కఠినాత్ముడో..

జీవితంలో అన్ని పాత్రలను
అవలీలగా..
అధ్భుతమైన అభినయంతో
నటిస్తూ,.
అభిమానుల హృదయాలను
దోచుకుంటూ..

నవరసాలను గర్భస్థ స్థాయిలోనే
స్వీకరించినట్టు..
బాల్యం నుండే 
నటనలో పెద్ద ఆలిందలా
ప్రతీ పాత్రలో పరకాయప్రవేశం
చేసి..
అధ్భుతంగా నటించి
అందరిని
అలరించి..మెప్పించి..
భూలోకానికి ఓ దేవకన్యలా
వచ్చి..
అర్ధాంతరంగా...దేవకన్యలా
వచ్చిన కార్యమేదో సంపూర్ణమైనట్టు..
అభిమానులను శోకసంద్రంలోకి
నెట్టి..
నింగికెగిసిన అందాల తార
శ్రీదేవి గారికి
ఇవే నా అశ్రునివాళులు
[2/25, 8:42 PM] కృష్ణమోహన్ గోగులపాటి: శ్రీదేవి
సహస్రకవిభూషణ అవేరా
SK101
కవితసంఖ్య:903
24/02/2018
శీర్షిక:అగ్రతార శ్రీదేవి (హృదయ నివాళి)

దివికేగినదివ్యతార
సిరినవ్వుల సినీతార
సినీల గగన సితార
సినీరంగ సిగలో నగ
అగ్రనటుల ఆణిముత్యము
నిర్మాతల "సిరి"దేవి
ఆనందాల సిరిమల్లి
జగదేక వీరుల
అతిలోక సుందరి
యువహృదయ స్వప్నసుందరి
రసహృదయ స్వప్నమంజరి
నాగిన్ నాట్యమైనా
అప్సరసలవిన్యాసమైనా
యుగళ గీతమైనా
విషాధనైరాష్యమైనా
నవరస కళళ కాణాచి ఆ రాణి
"క్షణంక్షణం" వేటాడే కలల "నాగినై"
"హవాహవాయి""లేడీచాప్లినై"
బహుభాషల బహురాణియై
పురస్కారాల శిఖామణీయై
పద్మనేత్ర పద్మశ్రీ గా
వెలుగు జిలుగు సినీతార ఆ సితార
గగనవీధిజేరింది ధృవతారగ నిలిచింది...!
ఓకళాతపస్వీ....!.ఓమహాయశస్వీ....!
హృదయాంజలిలివిగో..మా..బాష్పాజలులివిగో...!
*********అవేరా******




[2/25, 8:42 PM] కృష్ణమోహన్ గోగులపాటి: 🙏 *"అతిలోక సుందరికి అశృనివాళి"* 🙏                                             అతిలోక సుందరివో,ఆధునిక అప్సరసవో!                              ఏవంకలూ లేని నింగి నిలిచిన నెలవంకవో!                            దివి నుండి దిగివచ్చిన భువనైక సుందరివో!                             బాపూ గీసిన బొమ్మలందరిని    కన్న అమ్మవో.!                               కొన్ని కోట్ల భారతీయుల మది దోచిన కలల రాణివో!                ఎందరో యువకుల గుండెల్లో నిలిచిన చాందినివో!                    సిరిని ఝరిలా అణువణువునా పులుముకున్న అందానివో!           దివ్య తేజస్సు నిండిన నవ్య దివ్యాంగనవో!                              నాగలోకపు కన్యను తలపించిన నాకవనితవో!                       మన్మధునికే మతి పోగొట్టించిన రతీరూపానివో!                       బ్రహ్మదేవునికే దిమ్మ దిరిగే సురలోక సుందరివో!                   ఇహలోకమునొదిలి ఇంద్రలోకము జేరిన ఇంద్రజవో!                        అభిమానులందరిని వదిలి     దివికేగినదేవకన్యవో.!!                             .........పెసరు లింగారెడ్డి
[2/25, 8:42 PM] కృష్ణమోహన్ గోగులపాటి: ..........................
...........................

*శ్రీదేవికి మ‌ర‌ణ‌మా...???*
...... *వీరా గుడిపల్లి*
......................................
....................................

*శ్రీదేవికి మ‌ర‌ణ‌మా...???*
*నమ్మలేకున్నాం.....*

అందం అలిగి వెల్లిపోయిందా....
అందమనే విశేషణం దేహియై,శ్రీదేవియై
అవనిపై నడయాడి అమరలోకం చేరుకుందా

న‌వ్వంటే తాను, నటనంటే తాను

ప్రకృతి యాకృతీ తానే కదా

వయసే అలసిపోయిందామెను జూసి
నటనే ఓనమాలు నేర్చుకుంది తనదగ్గర
*మానవ రూపం చాలించాలనుకుని*
*మ‌ర‌ణానికి* *స్వాగ‌తం...ప‌లికిందేమో.....* 

శ్రీదేవికి మ‌ర‌ణ‌మా...???
నమ్మలేకున్నాం.... 
..........................................
..........................................
[2/25, 10:03 PM] Poet Musthakheem విన్నర్: ప్రత్యేక శీర్షిక: అందాల రాశి -శ్రీ దేవి కి అక్షర నివాళి !!

అందాల రాశి అప్పుడే అలసిందా!!
చినుకంటి చిన్నది చిగురాకులా రాలిందా ..??!
చిలిపి చిరునవ్వులు పదహారేళ్ళ వయసుకే ..మూతి 
ముడిచాయా ..??!!
అతి లోక సుందరి ..అందనంత 
అతి దూరం మరలిరాని తీరాలకు తరలి వెళ్ళిందా ..??!!
మిస్టర్ ఇండియాను ..డిస్టర్బ్ 
చేసి ..ఆటా -పాటలో ఓడి నట్లు..శోకం మిగిల్చి ..లోకం వదలి ..వెళ్ళిపోయిందా ..??!!
సినీ సింహాసనం ను పిన్న వయసు నుండే యేలిన ..మహా 
నటి ..మహా రాణీలా..దుబాయిలో నిష్క్రక మించిందా ..??!!
అయ్యో బోని కపూర్ పచ్చని 
కాపురంలో ..ఇలా విషాదం 
నింపి , అభిమానుల గుండెల్లో 
సైతం ..ఆవేదనల జ్వాల రగిల్చి ..కన్నీళ్ళు తొణికించి 
తొందరగా ..తరలి వెళ్ళిందా ..??!!
అక్షర నీరాజనాలతో ...ఒక 
అభిమాని గా ..కీ .శే . శ్రీదేవి , సీనియర్ సినీ నటి గారికి ....

విన్నర్ ,(ముస్తఖీమ్),కొల్లాపూర్ .
తేది :25-02-2018
😪😪😪🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[2/25, 10:18 PM] Manne Lalitha: సిరి మల్లెల శ్రీదేవి
×××××××××××××
అందాలరాణీ
అవని విరిబొేణిీ
సన్నజాజి సొేయగం
 జగమంతా అయెామయం
బాలనటివై ముద్దుముద్దు పలుకులు
ప్రౌఢవై పరిఢవిల్లిన వయ్యారాలు
ఇరవైలొే అందాలే అరవైలొే
అరవిరిసిన మందారాలైతే 
చిరకాలం చిరంజీవినిగా
మనుతావనుకుంటే
ఇదేమిటమ్మా ఈ నమ్మలేని నిజం
నిన్నుకొలిచే,ఆరాధించే జనం
జనవాక్యంలొే చిన్నాపెద్దా 
నీ మరణంకాని మరణం
మాటలే
అందాలతారవై ఆకాశాన్నంటిన నీ సొేయగం
అదే సొేయగంతొే స్వర్గలొేకంలొే నాట్యంచేయను వెళ్ళి
తిరిగిరావటం మరిచావు కదుా!
ఏదొేరుాపంలొే తిరిగిరా
నీ స్థానం నీకే పదిలం.
నీస్థానం నీకే పదిలం.
××××××××××××××××××
మన్నె(పిన్నక)లలిత.
హైదరాబాద్.
[2/26, 12:30 AM] Poet Naga Jyothi సిరిమల్లెలు: *****  ***  *****
పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
25/02/18


~బాల్యం సంచి బరువు దించుకుంది~


అతిలోక సుందరికి
వార్ధ్యాక్య ఛాయలుండవనీ చెప్పుటకా పండువారని ఆకును రాల్చుకెల్లావ్ 
తెరమీద బొమ్మగా మిగిల్చి
తెల్లారకముందే మా మాయపొరను తొలగించావ్ ...

కొన్ని తేనె చుక్కలు
కొన్ని పూలరెక్కలు కలిపిన
అందమైన చిత్తరువు ఆమె అయినపుడు
అమృతమయమైన ఆమె సిరుల నవ్వులకు మరణమెక్కడున్నది..?

తెరవెనక నిజాలని చూడలేని 
ఆమె బాల్యపు సంచి బరువును
ఆమె అందం వెనక వేదనను పంచుకోని అభిమానులమై మేముంటే..
సిరిమల్లె పువ్వై
పదహారేళ్ళ నవ్వై
క్షణంక్షణం మము వెంటాడే అతిలోకసుందరివైనావు..

తెరమీద బొమ్మవు నువై
తెరవెనుక అమ్మవు నీవై
జామురాతిరి మము జోలకొట్టి తెరమరుగయి
కనుమరుగై
మరణమింటికి అలసట తీర్చుకోను వెళ్ళావా..?


@సిరిమల్లెలు...


*****  ***  *****
[2/26, 7:35 AM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి      హన్మకొండ    9000683826        కవిత పేరు:ఏది శాశ్వతం? ?          అందాల అపరంజివే ...      అతిలోకసుందరి వే ..        తాగలేదు అమృతమని  మరచామే ...                 ఈ విషాద వార్త కు నీ ఆర్జీవీ వంటి అభిమాను లెందరో తెలిసితినే ...      మనవరాలిగ , కూతురిగా అలరించీ      పసితనాన ...    ...      వారికే నాయికగా ..అహో అబ్బురమే ..          దానిని మించి ..నాయకుల పిల్లల కూ నాయికవే ...విడ్డూరమే-       అందం శాశ్వతం కాదని నమ్మలేకుంది మా లోకం ..                                ఏం జరిగిందో మరి ఇలా వదిలి వెళ్ళావు మాటైనా చెప్పక సత్వరం ..            కన్నీరు మున్నీరుగా శోకం తో బేధం లేని తరం ..               .....అయినా , ఇక మరలి రావు ,    రాలేవన్నది జీర్ణించుకోలేని సత్యం..
[2/26, 11:40 AM] Poet Palloli Shekar Babu: 💖💖💖💖💖💖💖💖

మరణం - జ్ఞానోపదేశం . .!  💖💖💖💖💖💖💖💖
 - పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర 9490484316

కుళ్లు పుడుతుంది
దేవునికి అప్పుడప్పుడు . . !
తనను మానవులు
మర్చిపోతున్నప్పుడు . . !
తనను మానవులు
మించి పోతారనుకున్నప్పుడు . . !

అందాల బొమ్మలను
అకస్మాత్తుగా పిలుస్తుంటాడు
ఆ బొమ్మలతో బంధాలున్నవారిని 
ఆవేదనకు గురిచేస్తుంటాడు  ! 
అందచందాలున్నా. . ! 
ఆస్థి అంతస్తులున్నా. . ! !
నవాబులైనా. .  ! గరిబులైనా. . !
సావిత్రైనా . . శ్రీదేవైనా. . !
ఎన్టీఆరైనా . . ఏఎన్నారైనా . . !

ఈ లోకం "అశాశ్విత"మని 
పరలోకం "శాశ్విత"మని
తన లీలలు గుర్తుచేసేందుకు
తన ఉనికి చాటేందుకు
మరణం అనివార్యం ! 
ప్రతి జీవికి తథ్యం ! !
"సత్యం" ప్రకటించేందుకు. . ! 
"జ్ఞానం" బోధించేందుకు. . ! ! 
మనిషిని తన వైపు తిప్పుకునేందుకు . . !
తన మాట పలికించుకునేందుకు . . ! !
తన పాట పాడించుకునేందుకు . . ! 
తన బాటలో నడిపించుకునేందుకు . . ! !

(సినీ నటి శ్రీ దేవి మరణ వార్త విని నాలో కల్గిన భావరచన 26. 2.2018)

💖💖💖💖💖💖💖💖💖💖💖💖
- పల్లోలి శేఖర్ బాబు గురజాడ సాహితీ సేవా  పురస్కార గ్రహీత , 9490484316. 

💖💖💖💖💖💖💖💖💖💖💖💖
[2/26, 9:56 PM] Poet Padma Tripurari: దేవీ!శ్రీదేవీ!
***********
సుందరమగు నీ రూపం
మౌక్తిక సరమే నీ దరహాసం
జాబిలి జిలుగుల నీ ప్రతిరూపం
కన్నుల కాంతుల చిలిపితనం
కమనీయ రూపమే మాకు వరం

దేవీ!శ్రీదేవీ!

కుసుమ కోమల రమణీ లలనా
పాలమీగడ పసిడి మిసిమీ మణివా
పాల వెన్నెల తరగల తరుణీ మగువా
చక్కెర చిలుకల కలికి చిలుకవు నీవా
గల గల పారే సెలయేరుల స్వర రవళీ రవమా
నట నర్తనా నాట్య మయూరమా
నవ వసంత ప్రకృతి కాంతా కమలా
రూప లావణ్య పసి హృదయవు నీవే నీవే
అభిమానుల ఆరాధనా ధనమువు నీవే
అందని అందమయి అందలము చేరిన అపురూప సౌందర్యరాశివి నీవే
నీవు లేవని తెలిసిన ప్రతి మనము 
మౌనమయి మౌనరోదనయి నిను చేరెనని తెలియలేవా దేవీ!తిరిగి రాలేవా శ్రీదేవీ!

అందాల అతివగా
అమ్మయిన ప్రేమ కొమ్మగా
అందరి హృదయ నందనమయున
నీ రాకకోసం వేచియున్నది ప్రతిమది
మది మదిని ముదిమి నింపగ రావా దేవీ!శ్రీదేవీ!


                     పద్మ త్రిపురారి.
[2/27, 12:34 AM] Poet Mastan Vali: *దివి కేగిన సినీ దేవి * శ్రీ దేవి*

షేక్ .మస్తాన్ వలి .

📽🎥💿🎇🌠🌏🌙🌔🌈🎻🎻🎼

దివి కెగసిన అతి లోక సుందరి
సినీ జగతి నేలిన భూలోక సుందరి
తన పదహారేళ్ళ పడుచు ఝరి
ఇప్పటికీ తను(వు) ముగ్ద మనోహరి
అప్పటి నుంచి ఇప్పటి వరికి
యువకుల హృదయ తంత్రులు 
మీటిన  స్వప్న సుందరి
తన గుండె ఆగిపోయింది
అభిమానుల ఆర్తనాదాలు
వేల హృదయాల లో ...
విషాదఛాయలు అల్లు కొన్నాయి
తను నర్తించినా , నటించినా
కీర్తించినది కవి పుంగవుల కాదే 
మాన్యులు కాదు, అతి
సామానన్యు జనులు ...
ఆ జనులకుదూరమైనది
సినీ సిరి,సినీ శ్రీ  ఈ .. శ్రీదేవి

🎼 🌈 🌔 🌙🌏 🌠🎇 💿🎻


              షేక్ . మస్తాన్ వలి
       నవ్యాంధ్ర గీత రచయిత
  సెల్ :  9948357673
[2/28, 6:17 PM] Poet Satya Neelima: శీర్షిక : సినీవెలుగు శ్రీదేవి...
రచయిత : సత్యనీలిమ...
😭😭😭😭😭😭😭😭
క్షణం క్షణం నీవే జ్ఞాపకం
నీ చూపుతో నవ్వుతో గెలిచావు హృదయాలను
యువకులెందరో చేశారు నీకు ప్రేమాభిషేకం
అప్సరసలా అనిపించే అతిలోకసుందరి
సినీజగతిని ఏలిన భువనమంజరి
అందంలో నీకు లేరు పోటి
నటనలో నీకు నీవే సాటి
నింగినుంచి దిగివచ్చిన తారకలా
పంచదార తునకలా
పాల నురగలా
చల్లని నవ్వుల జాబిల్లిలా
విరిసిన సిరిమల్లెపువ్వులా
నిత్యం పదహారేళ్ళ పడుచులా
అనిపించే నీరూపం ఎంతో అపురూపం
నీవు లేవన్న విషయం జీర్ణంకాని విషం
దేవీ..!ఒక్కసారి కనిపించు నీ గొంతు వినిపించు మూగబోయిన మా హృదయవీణలను పలికించు..
శ్రీదేవికి అక్షరాంకితం...
😭😭😭😭😭😭😭😭
              ✍...సత్యనీలిమ,
             ఉపాధ్యాయురాలు,
              జీనియస్ పాఠశాల,
                     వనపర్తి....
[3/1, 9:17 AM] Poet Padma Tripurari: సాహో సహనశీలీ
అంజలిదే శ్రీదేవీ.
****************
మాయాలోకం మాయను చూసి
మమతల లోకం వలదని వెడలి
మరుగైపోయిన మగువా!

బంగరు బాల్యం బరువైన నటనై
అల్లరి ప్రాయం అలసిన శ్రమయై
మెత్తని మనసే మోహన మురళై
మందీమార్బలమున్నా పంచే మనసే  కరువై
వెతల మనసుకు సొగసునద్ది
హంగు ఆర్భాట హడావిడిలో
అందని ఆనంద తీరమే
ఆనంద నందనమని సాగి
సాగని ఇష్టాయిష్టాల సుడిలో
ఉడిగి వడిలి విసిగిన శ్రీదేవీ!
నీ అలసటకు సెలవు కోరావా.
లేక అలసి సొలసే అతివల బతుకు మార్చాలని వెళ్ళావా.
కుళ్ళు కుతంత్రాల లోకానికి ఇక చెల్లన్నావా.

చెలివై మమతల మణివై
రమణుల భవితకు వెలుగై
తిరిగి రావాలని 
నీ దైవలోకం చేరావా దేవకన్యా.

నీ సహన సౌశీల్యమే
సుధాపరిమళ మణిగచేసి
మరుపురాని అనుభూతుల
మము తోసివేసి వెళ్ళావు.
వేసారిన జీవితాల వెలుగువై వస్తావా దేవీ!సాహో శ్రీదేవీ!


                 పద్మ త్రిపురారి.

Comments