త్యాగధనులు (భగత్ సింగ్, రాజ గురు, సుఖదేవ్)



[3/23, 2:29 PM] Poet Musthakheem విన్నర్: ప్రత్యేకఅంశం: త్యాగ ధనులు 
శీర్షిక : "ఉరి తీసినా ..ఉద్యమం ఆగదు" 
కవి : విన్నర్ 
తేది :23-03-2018

న్యాయం కోసం ..జరిగే పోరాటం  యెన్నటికీ ఆగదు ..!!
ఉరి తీసిన ఉద్యమం ..ఉధృతం అవుతుంది తప్ప ..యెప్పటికి 
ఆగదు ..??!!
తెల్ల దొరల ..డొల్లతనం ఢమీ 
అనక మానదు ..??!!
దేశాన్ని దోచుకునే ..దొంగలు ..
బ్రిటిష్  సేనలు ..!!?

వీర భగత్ , రాజ్ గురు , సుఖదేవ్ ల ..ఉరి ..దేశం లో 
ఉద్యమాన్ని ..ఉధృతం చేసింది ..!!?

యెందరో ..యెందరెందరో ..కొత్త 
భగత్ , రాజ్ , సుఖ్ ..లను 
పుట్టింప జేసింది ..భారత దేశం ..!!?

మెడ కేసిన  ఉరి తాళ్ళు ..
వ్రేలాడే ..దేహాలు ..
చూపరుల్లో ..విషాదాశ్రువులు ..
కసికోపాలూ ...
అందరినీ ..యేకం జేసిన ..ఉరితీతలు ...
దేశ వాసులందరు ..చూసిన 
బలిదానం ..
""భారత మాతా కీ జై'""
నినాదం తో గాలిలో ..కలిసిన
భగత్ , రాజ్ , సుఖ్ ..ల ప్రాణాలు ..!!

దేశం ..కోసం ప్రాణాలు ..ఫణంగా పెట్టిన
మీ బలిదానం ..మేమెప్పటికీ 
మరువలేమయ్యా ..!!

మీ లాంటి వారి దయా దాక్షిణ్యాల వల్లనే ..భారత దేశం .."స్వతంత్ర్య భారతదేశం"
 అయి కూర్చుంది ..స్వేచ్ఛా వాయువుల్ని పీల్చగలుగుతోంది ..!!
 మీ ..ఆత్మలు ..శాంతించి..సంతోషించాలని ..ఆశిస్తూ ..
మీ త్యాగాన్ని , 
మీ బలిదానాన్ని , 
మీ దేశ భక్తిని , 
మీ సేవా నిరతిని ....
వేనోళ్ళ పొగుడుతూ ..
జై ..భగత్ సింగ్ జీ కీ !!
జై ..రాజ్ గురుజీ కీ !!
జై ..సుఖ్ దేవ జీ కీ !!
"జై భారత్ మాతా కీ"

రచన:విన్నర్ (mustakheem )
కొల్లాపూర్ .
ph :9705235385.
👏👏👏🙏🙏🙏👍👍
[3/23, 5:07 PM] Poet Mastan Vali: మార్చి నెల 23 వ తేదీ... భగత్ సింగ్, రాజ్ గురు, 
                       సుఖ్ దేవలు ... ఉరి కొయ్యను ముద్దాడిన
                        భరతమాత ముద్దు బిడ్డలు
   అంశం :  త్యాగ ధనులు
    శీర్షిక   :  ఎరుపెక్కిన ఆవేశం . ...దిగివచ్చిన తెల్ల దొర     
                                                    తనం.
        కవి :  మస్తాన్ వలి.

💣🔫⛓⛓💎  ⚖  🇮🇳  ⚖💎 ⛓⛓🔫💣


       భయమెందుకు భయమెందుకు
        బానిస పు బ్రతు కెందుకు
         భరత జాతి స్వేచ్ఛ కోసం
         బలియైన బిడ్డ లెందరో 
        వారి పాదాలకు మా వందనం
        విడరానిది వారితో మా బంధనం 

       మీసం మెలి తిప్పిన
       భరత జాతి సింగమ
       ఉరి కోయ్యను ముద్దాడిన
       భగత్ సింగ్ ప్రాణమా

        మొక్కల నే  తుపాకులు గ నాటిన
         బాల్యపు నీ భారతీయ భక్తి
         భగత్ సింగ్  నీ యుక్తి , నీ శక్తి
         మా దేశ శిఖరాగ్రాలలో నిలిచె లే

         శివ రామ్ రాజ్ గురు
          బ్రిటిష్ సైన్యం పై ...
        శివ మెత్తి,గళ మెత్తిన 
        మా... రాజ్ గురువా 
     
        సుఖదేవ్ జీ
      మీ ... సుఖాలన్నీ దేవుడి కిచ్చి
       భరత జాతి సుఖాన్ని కాంక్షించి
       దేశ పు దాశ్య శృంఖ లాలు
       ఛేదించుటకు 
       ఉద్యమ వీరుడివై
      ఉరి కొయ్యలు తాకిన  నీ ధీరత్వం
       మరువలేము మరువలేము
      మీ... త్యాగాలను మరువలేము
   
     ఎందరెందరో త్యాగ ఫలం
     మా... స్వతంత్ర జీవన జన్మ స్థలం
   
     జై ... భరత పుత్రు లారా
     జై,జై ... భరత వీరు లారా

       🔫💎⛓⛓⛓🇮🇳⛓⛓⛓⛓💎🔫

            షేక్. మస్తాన్ వలి
    నవ్యాంధ్ర గీత రచయిత
     జంతుశాస్త్ర అద్యాపకులు
    సెల్  :  99  483  57  673.
[3/24, 8:28 AM] ‪+91 99085 60246‬: 🌼🌸🌼🌸🌼🌸🌼🌸

*శీర్షిక: భరత మాత బిడ్డలు.*  

🌻                      
               
భరత మాత ముద్దు బిడ్డలై     
బానిస బ్రతుకుల విముక్తి కై       
మీ ఖ్యాతి మరచి 
జాతి స్వేచ్ఛ  కాంక్షించి కదలినారు.           కర్కశత్వం కలిగిన.              
తెల్ల దొరల  పీచమనచి          
భరతావని బాధలు బాపి     
భావి భారత జాతిని       
చైతన్య పరిచిండ్రు.          
జంకని అడుగులు వేస్తూ           
జగమంత జనసంద్రంలో సాగుతూ 
సింగమయి గర్జిస్తూ.     
గగనంలో కలిసిన ధీరులరా         
మీ త్యాగ ఫలం నేడు జాతి ఉన్నతికి మూలాధారం.            
నాటి మీ ప్రాణార్పణ 
నేటి  స్వేచ్చా బతుకులు మూలధనం.                   మాతృభూమి  రక్షణకై పాటుపడి                        భరతమాత ఒడిలో ఒదిగిన పుత్ర రత్నాలు మీరు                    
గురుదేవ్ సింగ్ లు!!



ఎ.భాగ్యచంద్రిక
దుప్పల్లి,వనపర్తి జిల్లా
[3/24, 3:43 PM] Poet Satya Neelima: శీర్షిక : త్యాగధనులకు వందనాలు..
రచయిత : సత్యనీలిమ.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు వందనాలు
అమరవీరులైన త్యాగధనులకు వందనాలు
దేశాన్ని కబళించి
హస్తగతం చేసుకున్న
తెల్లదొరల పాలనకు
వ్యతిరేకంగా నిలబడి
తమ గుండెలను
తుపాకీ గుళ్ళకు
బలిచేయుటకు బయపడక
ఎదురొడ్డి నిలిచి
స్వరాజ్యం కోసం
పోరాటం చేసి
ఉరికొయ్యల ఉగ్గుపాలతో
నేలకొరిగిన అమరవీరులకు
జలియన్ వాలా బాగ్ లో
తెల్లదొరల దౌర్జన్యం తో
కాల్చివేతకు గురయిన
దేశభక్తుల ప్రాణత్యాగానికి
వందనాలు కన్నీటి వందనాలు
నేడు మనం ఎటుచూసినా
అవినీతి, అక్రమాలు
లంచాలు, దొంగతనాలు
దోపిడీలు, అఘాయిత్యాలు
ప్రాణాలర్పించిన అమరవీరులు
మనకిచ్చిన స్వరాజ్యం
ఏమాయెను నేటి సమాజం
దేవుడే అవతరించినా
సమాజాన్ని మార్చేనా
మనుషులు మారేనా
మరొక్కసారి అమరవీరులు
జన్మించాలి దేశాన్ని కాపాడాలి
వందనాలు వందనాలు
అమరవీరులకు వందనాలు..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది నా స్వీయరచన
                  ✍..సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                        వనపర్తి..
ఈ కవిత పై సర్వహక్కులు నావే..

Comments