[3/17, 7:36 PM] కృష్ణమోహన్ గోగులపాటి: ఈ వారం అంశం
ఇప్పటికీ ఆడపిల్ల తల్లిదండ్రులను పట్టి పీసిస్తున్న రాకాసి...
"వరకట్నం"
ఇదే ఈ వారం అంశం...
[3/17, 8:21 PM] Poet Musthakheem విన్నర్: అంశం:వరకట్నం
శీర్షిక: వరుడి అమ్మకం
కవి :విన్నర్
తేది :17-03-2018
వరుడు ..స్వీయ అమ్మకం దారుడు ..
వధువు కావాలి నాకు కాని
పెద్ద మొత్తం లో కట్నం కావాలి
సుమా ..
కొనుగోలు చేసే తల్లిదండ్రుల్లా రా ..రండి రారండి ..
మీ అమ్మాయి నల్లదైన -తెల్లదైన ..కుంటి , మూగ , చెముడు ..యేమున్నా ఫరవా లేదు ..??
కట్నం -కానుకలు వగైరా వగైరా
బాగా ఇవ్వండేం..??!!
అడిగినప్పుడల్లా ..పిల్ల కట్నం ..
అదే ..అదనపు వరకట్నం ఇస్తుండండి ..!!?
లేకపోతే గృహ హింస లో నా
అమ్మా నాన్నలు , అక్కాచెల్లెళ్ళు ..అందరూ పాల్గొనడానికి సిధ్ధంగా వుంటారు ..జాగర్త ..?
పోలీస్ స్టేషన్లు , కోర్టులు , పంచాయతీలు ..గట్రా వన్నీ
మమ్మల్ని యేం భయ పెట్టలేవు ..!!
పెళ్ళి కూతుళ్ళ ప్రాణాలు
తోడేయడానికి , వేధించడానికి,
చంపడానికి , కొరకడానికి,
వరకట్నం పేరు తో పుట్టిన ..మహా దొరలం..మేము
వరులం..!!??
వధువులను ..పట్టి పీడించే ..
పిశాచులం..??
వరకట్నం ..నేరం ,ఘోరం ..ఇత్యాదివన్నీ ..మేం జాన్తా నై ..!!??
వరకట్నం ..ఒక జాఢ్యం !!?
వరకట్నం ..ఒక సమస్య !!?
వరకట్నం ..ఒక సామాజిక దోషం !!??
వరకట్నం ..ఒక మూఢత్వం !!?
వరకట్నం ..ఒక అనాగరికం !!?
వరకట్నం ..ఒక తీరని దాహం!!?
దీన్ని పార ద్రోలడం ..యెంతో
ముఖ్యం ..!!??
వరకట్నం లేని సమాజాన్ని ..
ఆశిస్తూ ..
రచన: విన్నర్ , కొల్లాపూర్ .
💐💐💐🌸🌸🌹🌹🌺
[3/19, 8:32 PM] Poet Padma Tripurari: కట్నం కట్నం కట్నం
******************
కట్నం కట్నం కట్నం
కట్నానికి బలైన మహిళ
కట్నానికి సమిధైన అబల
కట్నానికి ఆహుతైన అతివ
ఇవేగా ప్రతిరోజూ వినిపించే మాటలు
అసలెందుకివ్వాలి కట్నం?
అమ్మానాన్నల అపురూప ప్రేమగా
అపరంజి వెలుగుల లావణ్యరాశిగా
పెరిగి పెద్దయి
అనుక్షణము ఆనంద మందిరములో పెంచిన తల్లిదండ్రులను వదిలి వచ్చినందుకా?
లేక
కన్ను తెరిచిననాటినుండి
కన్నె పిల్లగా మారేంతవరకు
ఎదిగిన మనసును,వయసును,
శ్రమను సర్వస్వాన్ని
అత్తింటికి అర్పించినందుకా?
ఎందుకివ్వాలి కట్నం?
సిరిమువ్వల సవ్వడిలో
నట్టింట నడయాడిన మహలక్ష్మి
పుట్టింటి వంశాంకురమయినా
మెట్టినింటి వంశవృద్ధికి వచ్చినందుకా ఇవ్వాలి కట్నం?
ఎందుకివ్వాలి?
జీతంలేని పనిమనిషిని చేసి
శ్రమనంతా దోపిడి చేసి
మజిలి మజిలీలో యాతనలకు గురిచేసినా
కుటుంబ బంధమే తన జీవనగంధమని నమ్మి
సహనశీలిగా సద్గుణవర్తినిగా
తన శ్రమను ధారపోసే మగువ వరకట్న దాహానికి బలవ్వాల్సిందేనా?
ఎన్నాళ్ళీ నరకయాతన
ఎన్నాళ్ళీ మరణ వేదన
ఎందుకు ఎందుకు ఆడకూతురిపై ఈ దుష్ప్రవర్తన.
మారదా ఈ సమాజం
కాలేదా నవసమాజం
కాల్చలేదా కట్నదాహం
కూల్చలేదా వరకట్నభూతం
ఆపలేదా ఆర్తనాదం
వేయలేదా ప్రేమబీజం
పెంచలేదా మమత
వృక్షం
పూయించలేదా అనురాగ
పుష్పం
పండించలేదా కరుణఫలం
అందించలేదా అమృతరసం
మ్రోగించలేదా కళ్యాణనాదం
చేయలేదా అభ్యుదయ సమాజం
మారాలి మారి తీరాలి
మనిషి మనసు మహిళకు వరమవ్వాలి
అత్తంటే అమ్మ ప్రేమకు ప్రతిరూపమవ్వాలి
మామంటే నాన్న నవనీత హృదయమవ్వాలి
భర్తంటే భరోసా ఇచ్చే బాధ్యతా హితవరి కావాలి
ఆడబిడ్డంటే అనురాగబంధమవ్వాలి.
అందమైన అత్తింటి బంధం
ఆడపిల్ల భవితకు
ప్రేమగంధమవ్వాలి.
అపుడే కదా!
నమ్మివచ్చిన నారీమణి
జగన్విరాజన్మణిగా రాజిల్లి
రమణీయ రమణిగా
పుట్టినింటి మెట్టినింటి
మమతల ముత్యమయ్యేది.
పద్మ త్రిపురారి.
(ఈ కవిత అందరినీ ఉద్దేశించి కాదు.కట్నం కోసం వేదీంచేవాళ్ళనుద్దేశించింది మాత్రమే.)
[3/20, 6:11 PM] Poet Satya Neelima: శీర్షిక: వరకట్నం,
రచయిత: సత్యనీలిమ..
💰💰💰💰💰💰💰💰
కట్నమా వరున్ని కొనేటందుకు ఇచ్చే కట్నమా
నిన్ను నీవు అమ్ముకునే నీచమైన సంప్రదాయమా
నీకు నీవే మార్కెట్లో నిలబడి నిన్ను నీవే వేలం వేసుకుని
ఇంతనీ అంతనీ ఆడపిల్లల తండ్రులనీ
రక్తాన్ని పీల్చే దోమల్లా,నల్లుల్లా
పిప్పిచేసి డబ్బులకు కష్టపెట్టి
అమ్మాయిలను హింసించి లోలోన సంతోషంతో
హింసాత్మక ప్రక్రియలకు పాల్పడే ఓ మనిషీ!
ఎన్నాళ్లీ అరాచకం ఎన్నాళ్లీ అమానుషం
నీ వంశం నిలబెట్టడానికి నిన్ను కొనుక్కుని నీ ఇంటికి వచ్చి
సేవలు చేసి ,పనులు చేసి
అవమానాలు భరియించి బతుకుతున్న మగువ మగాడి బానిసా ఇదెక్కడి న్యాయం
మారాలి ఓ మనిషీ!
నీ ఆలోచన మారాలి
అమ్మాయిలను బలిచేయక
అర్థం చేసుకొని అర్థవంతమైన
జీవితం గడుపుకోవాలి
వరకట్నాన్ని నిషేదించాలి
అబలలకు ఆనందకరమైన జీవితం ఇవ్వాలి...
💰💰💰💰💰💰💰💰
ఇది నా స్వీయరచన
✍..సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
వనపర్తి..
[3/20, 7:06 PM] Poet Ithagoni Venkateshwarlu: ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:కట్నము
తరువోజ:
కొడుకు వారసుడని కోట్లాది ధనము కూడబెట్టుచునుండి కూతురేయన్న
పెడముఖమ్మును బెట్టి ప్రేమున్నగాని పెండ్లి చేసినయిల్లు వీడిపోవంచు
కడునీచముగ దల్చు కాలమ్మునందు కట్నకానుకలిచ్చి కడుగౌరవముగ
గడచుసంపాదన కాస్తకూస్తైన కన్నకూతురుకిచ్చుకారణంబిదియె
అడచు బేధమ్ములు నాడకూతురుకు నందించ కొంతైన ఆస్తినీరీతి
కడుహీనమౌనోయి కట్నంబు నాకు కావాలె మరియింత కావాలె యనుచు
పడదురాశది దున్నవా ఎద్దువా యవని నంగడిసరుకువా యేమి ఆశ
పడ రాదు విడరాదు పావనత్వమును పడితె వర్ణింప నిన్ బదములే లేవు
[3/21, 9:59 AM] Poet Kusumanchi Sridevi: 🌹అంశం-వరకట్నం🌹
🌹కవి పేరు-కుసుమంచి శ్రీదేవి🌹
-------------------------
ఆడపిల్లే ఎందుకివ్వాలి
వరకట్నం...
సాంప్రదాయాల సంస్కారాలకి
తలవంచినందుకా...
కార్యేషు దాసి...కరణేషు మంత్రి
భోజ్యేషు మాత...శయనేషు రంభ
అనే పాత్రలు ప్రేమతో పోషిస్తున్నందుగా....
మోడు బారిన పురుషుని
హృదయ పూథోటలో
అనురాగపరిమళాలు
పూయిస్తున్నందుకా...
తన స్వేఛ్ఛా జీవితాన్ని
హరించుకుని ...
పురుషునిలో సగభాగమౌతున్నందుకా..
కన్నవారి వాత్సల్యాన్ని..
బాల్యగురుతులని అర్ధాంతరంగా
ఓ మరమనిషిలా సమాధి చేసుకుని
మెట్టినింటిలో అడుగుపెడుతున్నందుకా..
తన పుట్టినింటి పేరు తుడిచిపెట్టుకుని
మెట్టినింటి వంశవృక్షానికి
చిగురులు తొడిగిస్తున్నందుకా..
కన్నవారి పందిరినుండి
విడిపోయి,
భర్త రక్తసంబంధాల పందిరిలో
అనుబంధాలేర్పరుచుకుని
పచ్చని తీగలా అల్లుతున్నందుకా...
తన ఒక జ్యోతై..
సంతోషాల కాంతి పుంజమై
కట్టుకున్న వారింటికై
వెలుగులు వెదజల్లుతున్నందుకా..
ఆ వెలుగలుకై తన ఆశలును
చమురుగా మార్చుకున్నందుకా..
ఎందుకివ్వాలి వరకట్నం...
ఆడపిల్లంటే ఆట వస్తువుగాని
అనుకుంటారా...
అంగడి సరుకుఅనుకుంటున్నారా!
కాలరాయండి..ఈ విషపు సాంప్రదాయాన్ని!
చిరునవ్వులు ప్రసాదించండి
ప్రతీ ఆడపిల్ల జీవితానికి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
[3/21, 11:07 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
~వరకట్నం~
మారరు
ఎన్నిచేసిన
ఎన్ని చట్టాలు వచ్చిన వాళ్ళు మారరు..
మార్పనేది ఒక్కరుచెప్తే వచ్చేదికాదు
ఎవరికి వారే ఎరుపైన ప్రశ్న కావాలి
కట్నం అన్నవారి తలనరికే
ఉక్కు పిడికిలి బిగించాలి..
అపుడే సాధ్యం..
అబలను కాను సబలననే కేతనం రెపరెపలాడిన వేళా
వరకట్న దురాచారంపై జయకేతనం
ఎగురుతుందేమో..
చట్టాలు ఆ ఇంటికి చుట్టాలయ్యాక
ధనం వారి దాహాన్ని తీర్చే మారకం అయ్యాక
న్యాయం గాంధారి అవుతే...
అపుడు అప్పుడు ఆడది అపరకాళి అవతారమయి
నేనెవరు నాలో నేనెవ్వరు
అనే ప్రశ్న ఉద్భవించి..
అణగదొక్కిన వారిని
వివక్ష అన్న నోటికి
నీకెందుకివ్వాలి కట్నం
నీకెందుకివ్వాలి నా బ్రతుకు
నీకెందుకివ్వాలి అనే ప్రశ్నగా మారి..
కట్నం అన్న నాలుకను తెగ్గోస్తే
వరకట్నం డిమాండు తగ్గుతదేమో
వరకట్న చావులాగుతయేమో...
@సిరిమల్లెలు...
పాలకుర్తి నాగజ్యోతి..
కుమ్రంభీం జిల్లా
[3/22, 6:45 PM] Poet Palloli Shekar Babu: *******************
యువత ఉద్యమించాలి !
*******************
- పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 9490484316
కట్నం
ఒక ఆచారం
నాడు సదుద్దేశ్యం తో ఏర్పరచారు !
కట్నం
ఒక దురాచారం
నేడు దురుద్ధేశ్యంతో పీడిస్తున్నారు !
ఆడ పిల్ల పుట్టిందంటే
ఆ ఇంటిలో గోల గోల. !
ఆడపిల్ల బాగోగులు ఎలా ఎలా ? ?
అత్త చుప్ప నాతి అవుతుంది
భర్త మూతి చపాతీ అవుతుంది
బిడ్డ ఎదిగే కొద్దీ
కట్నం జ్వాల గుండెల్లో
దహిస్తు ఉంటుంది !
అమ్మాయి కుందనపు బోమ్మైనా !
సుగుణవతి యైనా !
విద్యావంతరాలైనా !
ఉద్యోగస్తురాలైనా !
ఒక్కింటిదాన్ని చేయాలంటే !
వరకట్నం ఇచ్చుకోవాల్సిందే !
అప్పో సప్పోచేయాల్సిందే !
అస్థిపాస్తులైనా అమ్మాల్సిందే !
స్త్రీ కి శత్రువు స్త్రీ యే అన్న నానుడి
అక్షరాల నిజం చేస్తున్నారు అత్త గారు
సంతలో పశువులా అబ్బాయి గారు
అంతులేని ఆశల త్రాచు ఆడపడుచు
కట్నం వేధింపుల కాష్టం లో
కాల్చబడుతునే ఉంది
కోటి ఆశలతో అడుగెట్టిన
అమ్మాయి శలభమై నేల రాలుతోంది !
శోకసంద్రములో తల్లిదండ్రులు
మునిగి తేలుతున్నారు !
చట్టం లంచాలకు
చుట్టం అయినంత కాలం
కట్నం పిశాచం పీడిస్తునే ఉంటుంది !
వరకట్నం త్రాచు కాటేస్తూనే ఉంటుంది !
ఆ పిశాచాన్ని అంతంచేయాలంటే !
ఆ త్రాచు కోరలు పీకేయాలంటే !
యువత ఉద్యమించాలి !
యువత శపధం చేయాలి !
వరకట్నంను రూపుమాపాలి !
************************
- పల్లోలి శేఖర్ బాబు కొలిమిగుండ్ల 9490484316
*******22. 3. 18*********
[3/23, 12:09 AM] Poet Mastan Vali: అంశం : వరకట్నం
శీర్షిక : బలి పసువు ఎవరు ..?
కవి : షేక్. మస్తాన్ వలి
⚗ 💰 💣 🔫 ⚖ 🔫 💣 💰 ⚗
మొన్న స్వయం వరం
నిన్న కన్యాశుల్కం
నేడు వర కట్నం
రేపు సమ కట్నం
పేరేదైతేనేమి వధువే కదా
బలి పసువు
ఇది ఒక నాటి మాట
నేడు మాటలతో కాదు
మూటల తోనే పోటీ... !!
వరుడే కట్నమైతే
వధువే పట్టపు రాణి
కానీ ... పరిస్థితులు అలా లేవే
తను ఒక పట్టణానికో,
మరో నగరానికో కాదు కదా
తన స్వంత పురానికి కూడా
రాణి కాజాలటం లేదు..!!
ఇకనైనా మేలుకొని,
తెలుసుకొని మసలుకో
నీ... గృహ సీమకుఆమె రాణి
నీవే... రాజువట భోగ భాగ్యాలే కాదు
సుఖ సంపద నీ యింట నిలుచునట
ఆస్తి, పాస్తులలో ఆడ, మగ
తేడా లేదు,సుఖసంతోషాలు
తలరాత, స్థలాన్ని బట్టి రావే
ఎందుకు కట్నపు గోడవలు
మరెందుకు పట్నపు పరుగులు
సోదరా నీకు తెలుసా...?!
అందరికీ సమానపు హక్కులుండగా
మీకు లేదు కదా ఇక దండగ
కట్నపు జాడ్యం ఎందుకు నీకు
సమానత్వం తో వెళ్ళు ముందుకు
ఆశించిన దాని కంటే అందుకో
అధిక సంపదనే నీవు పొందు కో
కట్నం కోరి నావా నీ విక
అమాయక చక్రవర్తివే నీ విక
ఆస్థి లో సమానత్వం తెలీక
అసమాన భాగం తో నీవిక
సంపూర్ణ సంపద ను పొందక
కట్నపు కోరల్లో చిక్కుకుపోతున్నావు
మాటల మంటల్లో దహించుకు పోతున్నావు
వరకట్నం పేరుతో మోస పోతున్న వరుడే నీవు
ఓ పెళ్లి కొడుకా నీవే నని తెలుసుకో తెలిసి మసలుకో
వీధి నాటకం లా ...
చెప్పుకొంటున్న
ఘనులకు,ఘనాపాఠిలకు చెప్పు
వరకట్నం వద్దు నాకు
ఆస్థి పాస్తులలో నాకు
సమ భాగమే ముద్దు
అంటూ ముందుకు పదం డీ
మేలుకోండి మిత్రులారా
కట్నం వద్దు, వరకట్నం వద్దు
సమ భాగమే మీ హద్దుగా
సాగిపోండి ముద్దు గా
నాడు చదువు కోనివాడు
వింత పసువు...
నేడు చదువు కొన్నవాడు
సంత పసువు..
కాజాలం కాజాలం
ఆ పదజాలం వినజాలం
పట్టం,పట్టం కట్నం పట్టం
అంటూ ముందుకు పోగలం
స్వయం వరంతో కోరుకున్న
భాగస్వామే ముద్దు
కట్నం, పట్నం గోల
మాకు పట్టని కేల
వరకట్నం పేరుతో
అసమానత బరువు తో
సాగిపోయే వరుడివీ
నీవే, నీవే ఓ నరుడా
సహ చర్యం నీ దంట
సహ వాసం నీ దంట
కంప్యూటర్ యుగంలో
ఆ అపకీర్తి ఎందుకంట
వరకట్నం వలదంటూ
సాగిపో ముందు కంట
ఈ నవ యుగము నవ్వుతూ
వరకట్నం వలలో చిక్కకనే
చిక్కు ముడులు విప్పుతూ
మూడు ముడులు మెచ్చుతూ
సాగిపో , సాగిపో సహ ధర్మపత్ని తో
💰💰 💣🔫 ⚖ 💫 ⚖ 🔫 💣💰💰
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673.
[3/23, 12:59 AM] Manne Lalitha: 7416863289
అంశం: వరకట్నం.
కవయిత్రి: కవిరత్న
మన్నె(పిన్నక)లలిత.
××××××××××××× రాక్షసవివాహాలు
స్వయంవరాలు
కట్న కానుకలులేని
వధువు వరాలు.
కుాతురి పెళ్ళికి తిరిగీ తిరిగీ ఆరు జతలచెప్పులు అరుగుదల ఒకనాడు.
కన్యాశుల్కం
వరకట్నం
ఏదైనా స్త్రీకి స్త్రీయే
శతృవేనాడైనా.
కుాతురి తల్లిగా
కట్నమివ్వడానికి
కుంగిపొేయే తల్లి..
కొడుకుతల్లిగా
కొేరినకొేర్కెలు తీర్చుకుంటుా
అందలమెక్కి కుార్చుంటుంది.
కొడుకును అంగట్లొే
బొమ్మలా
సంతలొే పశువులా బేరమాడుతుంటే
గురువింద గుర్తుకొస్తుంది.
వరుని ముఖం లొే పశుచిహ్నాలు కనిపిస్తుంటే
తలవంచి తాళికట్టించుకుని
పలుపుతాడు వేయించుకున్న పశువులా
వ(ప)రునిఇంటికి బానిసై వెళ్తుంది.
చదువులు పెరిగి
విజ్ఞానం పెరిగినా
ఆటవికంగా ఆటబొమ్మలై
సుడిగుండంలొే చీమలా
బలైనా
చట్టాలొచ్చి మీరు చుట్టాలేనమ్మాఅంటుా
ఆస్తిహక్కు ఇచ్చినా
అనుభవించే అధికారం లేనిబేలతనాన్ని వదిలి
ఆత్మీయానుబంధాల
సుమ లతికవై సంసారపందిరికి అల్లుకుపొే
సుమ సౌరభాలను తరతరాలకు తరగనిసంపదగా అందించు
ఎన్నొే ఉద్యమాలుచేసే నువ్వు
కట్నం ఇవ్వను..
కట్నం తీసికొేను...
అనినినదించు
కట్న రహితసమాజనిర్మాణం నీచేతిలొే...నీ చేతల్లొే...
××××××××××××🌷
[3/23, 5:58 PM] +91 99085 60246: 🌼🌻🌼🌻🌼🌻
*వరకట్నం.*
................................
అపురూపంగా పెంచి
నట్టింట నడిచే అపరంజికి
గొడ్డు గోద అమ్ముకొని
ఆస్తి పాస్తులు తాకట్టెట్టి.
అప్పు సొప్పులు జేసి
కట్న కానుక లిచ్చి పెండ్లి జేస్తరు. కోటి ఆశల పల్లకిలో
మెట్టినింట అడుగు పెడుతూ.
ఆ ఇంటి ఆశా కిరణమై
ఇంటిల్లి పాదిని కాచుకుని.
కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా తీర్చిదిద్దడానికి
పరిశ్రమించే మగువను
మంట గలుపుతుంది వరకట్నం!!! వెతలెన్నో అనుభవిస్తూ
తనవారి భవిత దిద్దే దశలో
సాగిపోయే సహనశీలి
సుగుణాలరాశి మగువ.
వరకట్నమనే దాహానికి
బలి యై పోతుంది ఇలలో!!!
నమ్మి వచ్చిన అతివని
అత్తింటి బంధం ఆప్యాయతలు పంచక
కట్నమనే కార్చిచ్చు పేర్చి
కాటికంపుతున్నారు నేటి సమాజం !!! వరకట్నమనే పిశాచానికి బ్రూణహత్యలు నట్టింట నాట్యమాడుతూ
అబల బ్రతుకు అగాధంలో తోసివేస్తుంది నేడు. వరకట్నమా
వసుధపై నిన్ను వధించే వారు లేరా!!!
🍁🍀🍁🍀🍁
*ఎ.భాగ్యచంద్రిక.తెలుగుపండిట్.*
*దుప్పల్లి,వనపర్తి జిల్లా.*
💐💐💐💐💐💐
[3/23, 9:22 PM] కృష్ణమోహన్ గోగులపాటి: 🍁🙏🍁
*అంబటి భానుప్రకాశ్*
జోగులాంబ గద్వాల.
🌸🌸🌸🌸🌸🌸🌸
*వరకట్నం*
జీవితం ఒక ప్రయాణం,
ఇద్దరు వ్యక్తులు సాగేది ,
మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యేది,
నాలుగుకాలాలు కలిసి ఉండేది,
పంచభూతాల సాక్షితో, సాగిపోతూ
ఆరవప్రాణమని తలచేది,
ఏడడుగులతో మొదలైనా
వేయిసంవత్సరాల బంధమనిపించేది,
అష్టదిక్పాలకుల సాక్షి,
నవజీవితం,
ధరణిపై కలకాలంగా ఉండాలని కోరేది
కానీ,
మారింది,
అర్థం మారింది,
వ్యర్థంగా తయారైంది సమాజం,
వివాహ బంధానికి
కరెన్సీతో విలువకట్టింది,
ఎంత ఎక్కువైతే అంత హోదా! !
కన్నవాళ్ళను కష్టాల పాలుజేసే
కాలకూట విషసమానమైన ఆలోచన,
వరుడని,ఘనుడని దోపిడీ దొంగల్లా దోచుకునే
రహదారి,
పాతాళానికి పాతుకొని పోయిన విషవృక్షం,
అక్షరాస్యులు ,నిరక్షరాస్యులూ తేడా లేదు,
దీనికెవరూ అతీతంగాదు,
మారదు లోకం !
తీరదు కష్టం! !
కొడుకును అమ్ముకునే ఆలోచన
పోతుందా ఈసమాజంలో,
అమ్మాయిని ఆదిలక్ష్మి అని
తలుస్తుందా ఇకనైనా ,
వరకట్నాలు లేని,
వసుధైక కుటుంబం వస్తుందా ,నిలుస్తుందా,
ఏమో ! వేచి చూద్దాం! !
🍀🍁🍀🍁🍀
[3/23, 10:28 PM] +91 94411 10427: **వరకట్నం**
సమాజంలో వరుని విలువను నిర్ధారించి
వధువు కుటుంబాన్ని నిరాశా నిస్పృహలకు గురిచేస్తుంది
వరకట్నం ఒక సామాజిక రుగ్మత
వధువు మెళ్ళో మూడుముళ్ళు వేయాలంటే
డబ్బు, బంగారం ,వెండి మూడూ కావాలంటుంది
వరకట్నం ఒక ధన పిశాచం
డాక్టర్,ఇంజనీర్, లాయర్,టీచర్
ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రేటు నిర్ణయిస్తుంది
వరకట్నం ఒక సామాజిక వ్యాపారం
నేటి యువతీ యువకుల ఆలోచనలకు అడ్డుపడి
సంప్రదాయం అనే ఉక్కుచట్రంలో బిగిస్తుంది
వరకట్నం ఒక సాంప్రదాయ ప్రతిబంధకం
వరునికి కావలసింది వరకట్నం కాదని
వరం లాంటి వధువే నని చెబుదాం
వరకట్న దురాచారాన్ని తరిమికొడదాం
మేడిచర్ల హరినాగభూషణం, గద్వాశర్మ
********
[3/27, 11:37 AM] Poet Bharathi: .
9491353544
Bhaskara bala bharathi
Anantapuram
అంశం
వరకట్నం
తాళిబొట్టు కట్టించుకున్న నాడే
తోబుట్టువుల తోడువదలి
చెలికాని చేయిపట్టిననాడే
చెలుల చేయివిడిచి
పుట్టిల్లు వదలి మెట్టిల్లు
చేరినరోజే
తలిదండ్రుల వారిగోత్రనామాల్ని
తుంగలోతొక్కి
ఉన్న ఊరూ
కన్నతల్లి ఉనికిని మరచి
భర్తయే సర్వస్వమని నమ్మివచ్చి
తనవంశాన్ని తలచక
భర్త కోరిక తీర
అతనివంశాంకురాన్ని అందించి
ఆతని కి కష్టసుఖాల్లో తోడైనిలిచి
నీవున్నతికి అహర్నిశలు పాటు పడిన
అర్థాంగికినీవాజన్మాంతమూ ఋణపడ్డావు !!
ఆమెత్యాగంతో సరితూగగలవా??
ఇంతటి త్యాగశీలి నుండీ
కట్నమాసించుట హాస్యాస్పదముకాదా ??
కట్నమాసించువాడామె ముందు విలువలేని ఓటుకుండే !!
వివాహబంధము
కేవలము వధూవరుల కలయిక
కాదు
రెండు వంశాల కలయిక
అందుకే కట్లాలకు ప్రాముఖ్యత
యివ్వవద్దు
చదవనే సంపదా !
సద్గుణమనుసౌంధర్తము
గలకన్యనుచేపట్టి
వైవాహికజీవిత నావలో
పయనించినవాని
సంసారయాత్ర సుఖసంతోషాలతో
సాగిపోతుంది !!
గుణగణాలలెక్కింపక
కట్నకానుకలనిచ్చు
ధనగర్వపు కన్యను చేపట్ట
వాని జీవిత నౌక
తుఫాను ల ఆటుపోటులలో
చిక్కి వ్రక్కలైన
తెడ్డులేని పడవయై
పతనమగును !
కట్నమాసించక
గణవతియైన కన్యచేపట్ట
ఆమె సుగుణములచే
వాని కులము వెలయు
!!
కుమతి కన్య కట్నము తెచ్చు
నని కోడలుగ తెచ్చుకున్న
ఆమె వలన ఆవరుని
కలగోత్రాలు
బురదలో పొర్లు పందియట్లు
కంపుగొట్టు
,,. 💐💐💐💐💐.
[3/28, 11:31 AM] Buf Amaravadi Rajashekar Sharma: అరాశ
వరకట్నం
వరకట్నము తీసుకొనుట
వరకట్నమునివ్వబూనుటెంతయొ నేరం
బరసియు; సంఘమునన్ తన
పరువునకై పాకులాట పదుగురినెదుటన్
ఇచ్చువాడికి నహమును ఇనుమడించు
పుచ్చుకొనువాడి గర్వము పొంగిపోవు
ననుకొనడుగుట నిచ్చుటనంతెకాని
గొప్పకాదది ముసుగున్న చిప్పగాని
మధ్యతరగతి మనిషి శ్రీమంతునరసి
ఉన్న ఆస్తుల తెగనమ్మి ఉన్నతుడిగ
పేరు సాధించ చూచుట పులిని జూచి
నక్క వాతలు పొందెడి లెక్కగాదె
ఇచ్చువాడొందు కష్టాల నెరుగలేక
మానవత్వాన్ని తలచెడి మానసు లేక
డబ్బులడిగెడి వాడిలో జబ్బు జూసి
పిల్ల నిచ్చుటనేలకో పెద్దలార
గంగిరెద్దులై సంతలో కంఠమందు
రేటు దాల్చియమ్ముడు బోవ చేటుగాద
ఒకరికొకరుగ జీవించనొకటిగాక
కట్నమిచ్చుట పొందుటన్ గలదె సుఖము
నెలతలందరు విద్యలన్ నేర్వవలయు
పురుషులులందలి స్వార్థమే కరుగవలయు
కొత్త బంగారు లోకమే కూర్మినిండ
వరులకట్నపిశాచమున్ తరుమవలయు
అమరవాది రాజశేఖర శర్మ
🍁🙏🍁
వరకట్నం
రచన గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
వరకట్నం...
పేద, ధనిక అనే బేదం లేనిది...
ఎంతో మంది అమాయకుల ప్రాణాలతో...
చెలగాటమాడిన యమ పాశమిది...
ఆడబిడ్డకు జన్ననివ్వకుండా...
బ్రూణహత్యలు చేయిస్తున్న పిశాచమిది...
పేర్ల వెనక తోకలకు తగ్గటు...
రేటు పెరిగి కూర్చునే పక్షి ఇది...
చదువుకున్న వాడికో రేటు...
విదేశాలలో స్థిరపడిన వాడికో రేటు...
ఆస్థులు... అంతస్తుల తగ్గట్టోరేటు...
ఏమాత్రం కనికరం కనబడని...
కఠిన పిశాచి వరకట్నం...
కోడలు కట్నమివ్వలేదని అత్త...
తన తండ్రి కట్నమిచ్చేటప్పుడు...
పడ్డబాధ గుర్తెరిగితే...
ఇంత బాధ ఉండేదేకాదు...
వరకట్నాన్ని పెంచి పోషించకండి...
అదే విషసర్పమై మనల్నే కాటేస్తుంది...
ఇక ఈ వరకట్నాలు పేర్లు...
రకరకాలుగా రూపాంతరం చెందుతుంది..
కొందరు కట్నమొద్దు అంటుంటూనే
అబ్బాయికి ఓ బైకు...
కాసింత బంగారం...
ఓ ప్లాటో... ఫ్లాటో...
పెళ్ళి ఘనంగా చేస్తే చాలనీ...
ఇలా ఎన్నెన్నో ఆఫర్లు ఇస్తుంటారు...
ఇదీ ఒక వరకట్నపు స్టంటే అని చెప్పొచ్చు...
వరునికి వధువే ముద్దు
ఇక వరకట్నం... వద్దు...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
9700007653
***************
Comments
Post a Comment