[3/11, 3:27 PM] అంబటి Poet Bhanu Prakas: 🌷🙏🌷
*ఉగాదికి స్వాగతం*
ఉషోదయాన బాలభానుని
నునులేతకిరణాల చేత,
వికసితమై,
నయనానందకరమై,
సరస్సులలో విప్పారిన కలువలు,
తమ ప్రియమైన మిత్రునికి స్వాగతం
పలుకుతుండగా,
ఓవైపు కోయిల స్వరాలు,
మరోవైపు లేమామిళ్ళ వాసనలు,
నీకై ఎదురుచూస్తున్నాయి.
ఓ నూతన వత్సరమా,
నీకు స్వాగతం.
మార్పును ఆహ్వానిస్తూ,
మంచిని ఆచరించే మనుషులు,
మమతలుపంచుతూ,
సమతాలోకం నిలిచిఉండే,
సరికొత్తగా మమ్మల్ని నడిపింతువు గాక.
ఆనందాన్నీ,ఆరోగ్యాన్నీ,ఆయుష్షునూ,
అందరకూ అందింతువుగాక.
తీపి జ్ఞాపకాల మధురిమలో,
గతచేదును మరచీ,
మమకారాల మాధుర్యం ,
నలుగురితో పంచుకొంటూ,
నవ్వుతూ నవ్విస్తూ, నాలుగుకాలాలు
సంతోషంగా గడిచిపోయేలాగ,
రావమ్మాచైత్రలక్ష్మీ.
🌷........... *అంబటి భానుప్రకాశ్*
జోగులాంబ గద్వాల జిల్లా.
.
[3/11, 5:06 PM] Poet Satya Neelima: శీర్షిక: నూతన వత్సరాది ఉగాది,
రచయిత: సత్యనీలిమ..
🌿🎋🌿🎋🌿🎋🌿🎋
తొలిసంధ్య వేళలో
వసంత ఋతువు ఆగమనంతో
కొమ్మ మీద కోయిలమ్మ కుహుకుహు అని భూపాలరాగం ఆలపిస్తున్న వేళ
లేలేత మామిడి పిందెలు చెట్టుకు గుత్తులుగా ఉన్న వేళ
నింగిలోని చంద్రుని కాంతివలె వేపపూత శ్వేతవర్ణ కాంతులు వెదజల్లగా
చెట్లన్నీ చిగురాకులు తొడగగా
షడ్రుచుల సమ్మేళన యుగానికి
ఆదిగా వ్యవహరించే ఉగాది పర్వదినానికి స్వాగతం పలుకుతున్న వేళ ఈ చక్కటి శుభవేళ
షడ్గుణాలను పారద్రోలడానికి షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడిని సేవించి సుఖసంతోషాలతో, ఆయుఃఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ..
నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం
కాలుష్య రహిత నవ సమాజాన్ని నిర్మిద్దాం..
🎋🌿🎋🌿🎋🌿🎋🌿
✍....సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి...
[3/11, 5:40 PM] Poet Musthakheem విన్నర్: అంశం : ఉగాది -విళంబి నామ సం -
శీర్షిక :-ఉగాది -యుగాది
కవి :విన్నర్
తేది :11-03-2018
ఉగాది అంటే గుర్తుకొచ్చేది
ఉగాది పచ్చడే ..??
ఉగాది అంటే ..యుగాదే ..!!
అంటే సంవత్సరాది ..!!
కొత్త వత్సరం ..
తీపి , చేదు , వగరు , పులుపు , కారం , ఉప్పదనం ..ఇత్యాది
రుచుల సంగమమే ..కొత్త..
యేడాది ..అనుభవాలు ..??
మంచి -చెడు ..ను , అన్ని అనుభవాల సారాన్ని ..గుర్తు
చేస్తోంది ..శడ్రుచుల ..ఉగాది పచ్చడి ..??!!
భారతీయ సంస్కృతి ..గొప్పదనం
పండుగ -పబ్బాలు వ్యక్తం
చేసినంతగా ..ఇంకేదీ చేయదేమో ..??
పంచాంగ శ్రవణం..సాయంత్రానికల్లా ..
సంవత్సరమంతా ..ముందే
చెప్పడం ..కాసింత యెంత
కాదన్నా ..ఆశ్చర్యమే ..??!!
ప్రజల సుఖ శాంతులు ..
జీవితం లో యెదురయ్యే అనుభవాలు ..
అన్నింటినీ ..సమభావన తో ..
రోజులు గడపాలని ..ఉగాది
సందేశాన్ని ఇస్తోంది ..!!
సుఖాలకు ..పొంగి పోవద్దు ..??
దుఃఖాలకు ..కుంగి పోవద్దు ..??
కొత్తగా జీవితాన్ని ప్రారంభించు ..
గతం గతః గా .. యుగాది పేరు
తో ..కర్తవ్య పాలనతో ..జీవితాన్ని ..జీవించు ..??
ఉగాది అంతరార్థం ..ఇదే ననుకుంటా ..60(అరవై ) సంవత్సరాదులు ..వస్తున్నాయి
పోతున్నాయి ..హిందువుల కొత్త సంవత్సరం ..యుగాది (ఉగాది )..శుభాకాంక్షల తో ..
రచన : విన్నర్ , (mustakheem)
కొల్లాపూర్ .ph:97052 35385.
[3/12, 11:28 AM] +91 99085 60246: 🌷🌸🌷
ఎ.భాగ్యచంద్రిక.
తెలుగు పండిట్.
*నవ కాంతి*
వసంత ఋతువు వచ్చింది
వసుధకు అందం తెచ్చింది.
ప్రకృతిని చూసి మనసు పరవసించగా. కొత్త ఆశలు చిగురించి
ఈ ఏడాదిలో ఆనందాల
వెల్లువ కావాలి
గతకాలము చేదు అనుభవాలను మరుగుపరుస్తూ,
లేలేత సూర్యుని కిరణాలలా
వెలుగులు పంచుతూ
నవశకానికి నాంది కావాలి ఉగాది. షడ్రుచుల సమ్మేళనం యుగాది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు
పెట్టింది పేరు.
కలదా ఇలలోన సాటియైనది
సుఖసంతోషాలు నిండాలి ప్రతి ఇంట. నింగిలోని చంద్రుడిలా ఆహ్లాదభరితం కావాలి.
కోయిలమ్మ కుహుకుహు రాగము.
విళంభి నామ సంవత్సరంలో విశిష్టతలు పొందాలి అడుగు పెడుతోంది నవ భారతి నేడు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలి మహిలోన !!!
....
[3/12, 12:58 PM] అంబటి Poet Bhanu Prakas: 🌷🙏🌷
*అంబటి భానుప్రకాశ్.*
జోగులాంబ గద్వాల.
🍀🌺🍀
*ఉగాదికి స్వాగతం*
మామిడిచెట్టు కొమ్మలో చేరి
లేలేత మామిడి పూతను,
నిండుగా మెక్కిన గండు కోయిలమ్మ
స్వాగత గీతాన్ని పాడుతోంది,
ప్రకృతి కాంత పరవశంతో
పచ్చదన పరిమళాన్ని పంచుతోంది,
వేపచెట్టు కొమ్మ కొమ్మలో ,
పూతను పూసి,
స్వాగతపుష్పాలను చల్లుతోంది.
ఓనవయుగాది వత్సరమా నీకు స్వాగతం.
గడపగడపనా నీకై,
మామిడి తోరణాలు ఎదురు చూస్తున్నాయి,
గుండెగుండెలో,
నీవుతెచ్చే వైభవసంతోషాలకై,
ఆరాటపడే మాపల్లెకు,
నీ చల్లని చూపును ప్రసరించి,
ఆనందింపజేయవమ్మా.
ఆధునికత ముసుగులో ,
ఆకాశమే అవధిగా ఆనందాలను
కోరుకునే నేటి యువతరం,
ఆశల పల్లకీలో అనవరతం ప్రయాణిస్తూ,
అలుపెరుగని పోరాటం చేస్తుంది,
కోర్కెల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నది,
నీరాకతో ఆశలు కొత్త చిగుళ్ళు తొడుగుతున్నాయి,
ఆచారాలు సంప్రదాయాలు,
పండుగలు ,పంచాంగశ్రవణాలు
తిరిగిపురుడు పోసుకుంటున్నాయి.
అందరికీ ఆనందాలను అందిస్తూ,
మాయింటికి రావమ్మా ఉగాది లక్ష్మీ.
ఎన్నెన్నో ఆరోగ్య సూత్రాలు,
మరెన్నో ఆచారసంప్రదాయాలు,
పారమార్థిక విషయాలు,
అంతరార్థంలో దాగిఉన్నా
పండుగ పారమార్థం తెలియని నేటి
యువతకు,
పండుగంటే పరమాన్నాలేకాదు,
పదిమందికీ పంచిపెట్టే,
పరమపుణ్య కార్యం.
పదిమందిలో నవ్వుతూ, నవ్విస్తూ
తిరిగేదని తెలిసేలా,
రావమ్మా వసంతలక్ష్మి.
💐🌸💐🍀🌻🍀💥🌸💐🌷🍀🌻💥💐🌸💥🌻🍀🍁🌼
[3/12, 1:10 PM] +91 96189 61384: శీర్షిక: ఉగాది
రచయిత: ఉప్పరి తిరుమలేష్
🌾🎍🎍🎍🎍🌵🌵🌵🌿🌿🌿🌴🌴🌴🌴🌲🌻🌻🌻🌻🌻🌻🌻🐾
చిగురాకులు చిగురులు తొడగగా
కొమ్మల్లో కోయిలమ్మ ఆనంద రాగాలు వినిపించ గా
తొలిసంధ్య కిరణాలు పుడమి తల్లిని తాకగా
వచ్చెనండియుగానికి 'ఆది' ఉగాది
తెలుగువారికిదే నవమోహనా ది..
కొత్త ఊహలు చిగురింప చేస్తూ
కొత్త ఊహలకు ఊపిరినింపుతూ
కొత్త సంవత్సరం వచ్చెను నిత్యనూతనంగా..
ధరణితల్లి ఒడినిండా తెల్లని పూలు చల్లినట్లుగా
వేపపూత నిండుగా ప్రతికొమ్మనూ పూయగా
తీపి. చేదు .పులుపు. కారం. ఉప్పు
షడ్రుచుల సమ్మేళనం ఉగాది అమృతం
షడ్గుణాల సమ్మేళనం అమ్మ ప్రేమామృతం..
అందుకే.....
అమ్మనూ మరువలేము
యుగానికి 'ఆది'ని మరవలేము
అమ్మకూ యుగానికి ఆది కి అంతసామీప్యంఉంది
ఉన్నతంగా గౌరవంగా ధన్యవాదన్యాలతో
దినదినాభి వృద్ధి పొందుతూ ఉండాలని ఆశిస్తూ............🎋🎋🎋🥦🥦🥦🎋🎋🥦🥦🎋🎋🎋🥦🥦🥦
✍ ఉప్పరి తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయుడు
జీనియస్ పాఠశాల
వనపర్తి
9618961384
[3/12, 4:21 PM] Poet Bharathi: విళంబీ వాసంతలక్ష్మీ రావమ్మా
ఉరుకులు పరుగులతో !
మాబ్రదుకుల నిండుగా
నూతననోత్సాహము పండగ
కోకిలముల కూజితముల
చిలుకల పలుకుల
తుమ్మెదలరొదల
కొమ్మల ఊయలలూగు గొల్లభామల మంగళవాద్యముల తో స్వాగతం సుస్వాగతం !!!
పచ్చని పచ్చిక తివాచీపై
మెత్తగా అడుగులిడుతూ
దారివెంట ఇరుగడల
మల్లెలూ మొల్లలూ
మరువమూ ధవన్రమ్ముల అగరువత్తుల సువాసనలహారతులు
స్వీకరస్తూ
మమ్మానందపరచ రావమ్మా !!.
విళంబీ వత్సరమా !
రాలిపడిన ఎండుటాకులు
గతసంవత్సరపు వొఫల్యాలై తొగిపోగా
చిగురాకుల గుబురులు
నూతన వత్సర ఆశల చిహ్నాలై
ఆనంద పరవసులము కాగా
అరిషడ్వర్గాల దునుమాడ
షడ్రషోపేత ఉగాదీ పచ్చడి తౌ నీకు స్వాగతం !.
సుస్వాగతం !
కొత్త కవనాలకు ప్రేరణ ఐ
పంచాంగ శ్రవణాలతో
మాభవితను తెలియజేయు
కవి పండితుల పురోహితుల ను
కండువా శాలువలతో
సన్మానింప రావమ్మా
ఓవిళంబినామవత్సరమా !!
సప్తవర్ణాల పూదోటల సువాసనలూ వీనులవిందోనరించు
ఎలదేటీపాటలూ
సమస్తంనీరాకకై ఆత్రంగా మోకరిల్లి స్వాగత తోరణాలతో
ఎదురు చూస్తున్నాయ్
ఓ విళంబి నామ వత్సరమా
హారతి గోనుమా !!.
💐💐.
[3/12, 6:18 PM] Manne Lalitha: 7416863289.
అంశం:ఉగాది.
కవయిత్రి:మన్నె(పిన్నక)
లలిత.
తేది:12_3_2018.
××××××××××××××××××
××××ఉగాది×××××××× తెలుగు తల్లిని నేను
హేవిళంబినిని వెళ్తున్నా సంతొేషంతొే
ఉషొేదయంతొే
శ్రీ విళంబినై వస్తున్నా
కొత్తరుచులెన్నొే తెస్తున్నా
మావి చిగురు చీరతొే
వేపపుాల అంచు రవికతొే
మామిడిగుత్తి చేతబట్టి
కొత్తకుండ చంకనబెట్టి
చెరుకు గడను చేతబట్టి ముత్యాలముగ్గులు
పచ్చని క(గ)డపలకు
రత్నాల బొట్లు
పచ్చని మామిడి తొేరణాలు,వేపపుాల మండలుచుాస్తుా
తెలుగు నట్టింట
విళంబి నామధేయంతొే
విలంబనము(ఆలస్యం)
చేయకవచ్చా.
నిన్నటిరొేజు నాకు గుర్తే
చేసిన తప్పులు సవరిస్తా
సవినయంగా వివరిస్తా
లేడిలా గెంతి
చిరుతలా పరుగెత్తి
షడ్రుచుల ఆతిథ్యమిచ్చి
తెలుగుజాతి నవ....రత్నాలు అన్నమయ్య,రామదాసు,క్షేత్రయ్య,త్యాగరాజులు
తెలుగుజాతికి వెలుగునిచ్చే నవపారిజాతాలు.
పాపాయిలనవ్వుల హరివిల్లులు
ఎలకొేయిల గీతాలు
నవ కవితా కొేయిలలగానాలు
కవుల కవితా కదంబాలను
ఆస్వాదిస్తుా
సాయంసంధ్య వేళ
పంచాంగ శ్రవణం వింటుా
మెాహనంగా నర్తనం చేశా.
అందాల అవనిని ఆవిష్కరింపజేశా
ముందుతర నిర్దేశనం చేసిన నన్ను అనుసరించి ఆశీర్వదించను
శుభదినాలకు ఒక్కొేచెట్టుా నాటండి
పిల్లల భావికి బంగారు బాటలువేయండి
సుమ సౌరభాలు వెదజల్లి
విరిజల్లులు కురిపించి
మీ అక్షరపళ్ళెర హారతిని
ఆనందంగా అందుకుని
ఆశీర్వదించి
ప్రగతికి పసిడి సొేపానాలు
పరుస్తుా
కరదీపికనౌతాను.
×××మన్నె(పిన్నక)లలిత×××××××××××🌿🌿🌷🌺🌸🌿🌿🌷🌷☘
[3/13, 4:07 PM] Poet Telgu Thirumalesh: ☘ఉగాది హృదయ సవ్వడి☘
ఏమిటి ఈ ఉగాది?
రెండు ఆయనాల కలయిక ఈ ఉగాది
యుగానికి ఆది ఈ యుగాది
అనుభవాలు అనుభూతుల కలయిక ఈ ఉగాది
కష్ట సుఖాల సమ్మేళనం ఈ యుగాది
నూతన ఆలోచనల ప్రారంభం ఈ యుగాది
గతాన్ని వదిలి నూతనోత్తెజానికి భీజం ఈ యుగాది
శుభాకాంక్షలతో ఈ కవితా సవ్వడి
ఎప్పుడు ఈ ఉగాది?
వసంతరుతువు ఆరంభం
ఆకులు రాలే చివరి దినం
చిగురించే ఆకులకు ప్రారంభపు దినం
చైత్ర శుద్ధ పాడ్యమి ప్రకృతి దినం
అమూల్య ఔషధ విలువలు కలిగిన పండుగ ఈ యుగాది
చైత్ర మాసపు ప్రారంభపు పండుగ ఈ యుగాది
ఆనందాలతో ఈ కవితా సవ్వడి
ఏమిటి ఈ విశిష్టతా?
తీపి కారం ఉప్పు పులుపు చేదు వగరు రుచల ఆస్వాదం
ఈ యుగాది
ఆనందంతో సహనం గా ఉండి ఉత్సాహం తో నేర్పు గా ఉండి
బాధలు లేకుండా కొత్త ఆశల జీవితానికి స్వాగతం ఈ యుగాది
కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యా లకు లోగకుండా ప్రణాళిక రచన ఈ యుగాది
ప్రాత కాలములో నిద్ర లేచి
అభ్యంగనా స్నానాలు ఆచరించి
మామిడి తోరణాలతో కొత్త బట్టలతో ఉగాది పచ్చడి తో పంచాంగ శ్రవణం తో జరుపుకునే పండుగా ఈ యుగాది
వసంత నవరాత్రుల ఆనందాలతో
కొత్త పనులను ప్రేరణతో
నూతన ఆశయాలకు అంకురార్పణ చేసే పండుగ ఈ యుగాది
సర్వే జనా: సుఖినో భవంతు తో ఈ కవితా సవ్వడి
✍...తెలుగుతిరుమలేష్
అమరచింత మండలం
9908910398
[3/13, 10:42 PM] Poet Kusumanchi Sridevi: 🥦అంశం-ఉగాది🥦
🌿కుసుమంచి శ్రీదేవి🌿
-------------------------------
అమ్మ ఒడి లాంటి
వెచ్చదనమిచ్చే
తొలి చైత్ర భానుడి కిరణాలతో..,
గత వత్సరం మిగిల్చిన
కష్ట-సుఖాలని...
అలసి,సొలసిన గురుతులని..
ఆనందాలలో తేలియాడిన
మనసులని
షడృచులతో పోల్చి..
ఆధునిక ఆహారపదార్ధాలతో
విసిగిన జిహ్వని
ఔషధ గుణములన్న
షడృచుల పచ్చడితో
ఉత్తేజపరిచి...
ఆధునీకరణ మయకానికి
బలైనవారందరిని..
చిరునవ్వులు చిందించే
అతిసున్నితమైన
లేలేత చిగురులతో...
మదిని దోచే కోయిల
గానములతో...
అనురాగపరిమళాలు వికసించే
తెలుగు లోగిళ్ళో...
బ్రతుకు తెరువు కోసం
ప్రపంచపు అంచులు పట్టి
తిరిగే రక్త సంబంధాలని
ఒక గూటికి చేర్చి..
అమ్మమ్మ వంటకాలతో
రుచి గుళికలకు
పునర్జీవం పోసి..
సంప్రాదాయ దుస్తులతో
కళకళలాడుతూ..
తిరిగిరాని బాల్యాన్ని
నెమరువేసుకుంటూ..
పంచాంగ శ్రవణంతో
భవిష్యత్ ని తెలిపి..
మన పాండిత్య గొప్పదనాన్ని
తెలియజేసి..
ఆనందాలనందిచే
తెలుగు సంవత్సరాది
🌹...ఉగాది..🌹
[3/13, 10:50 PM] Poet Aruna Chamarthi: అదే నీవు ...అదే నేను ********************ఓయ్ ! చెలియా ఎందుకే కోపం .... అప్పుడు నీలో సప్త వర్ణాలు , షడ్రుచులు గోచరం ... . కోపం లో అదిరే . అధరం పై . అందంగ అమరిన . . పుట్టుమచ్చ మిరియపు కారం .... . కట్టలు తెంచుకున్న ఆగ్రహం ... ముడిచిన మొహం వేపపువ్వు చందం ... గ్రోలగ లేను చేదు మకరందం .. . . కవ్వించే కళ్ళు , పెంచే ఆకళ్లు పులకరించిన మేను పులుపేను ... .. లవణం లేనిదే రుచి లేని విధం లలన సాయం లేనిదే సాగదు జీవనం ... ' కోరి చెంత చేరే సమయం మధురం ... అదే నా తీయని తలపుల కాధారం ... . మనం కలబోసుకున్న ఊసులు ... ఎన్నెన్నో రుచుల , అభిరుచుల వడపోతలు . ఉగాది లక్ష్మి వే కాదు ఆర్రుచుల సంయోగమే నీవు .... అబ్బురం గా చూస్తూ నేను ... అరుణ చామర్తి /ముటుకూరి హన్మకొండ 9000683826
[3/14, 5:06 PM] Poet Kashi Vishwanatham: లే చివురుల మేసిన
ఆమనికోయిల రాగం
పచ్చని ప్రకృతి సోయగం
వేప పూల పరిమళం
కవికోకిల కవితా గానం
పంచాంగ శ్రవణం
షడ్రుచుల
ఉగాది సంబరం
వాసంతుని
ఆగమనానికి సాక్ష్యం
కాల వాహినిలో కరిగిన
హేమలంబి మిగిల్చిన మధురానుభుతులతో
అణగారిన
గుండె గూళ్ళ నిండా
ఆశల ఊసులు
అల్లుతూ
స్నేహ సౌరభాల
తోరణాలతో
విళంబినామ ఉగాదికి
స్వాగతమిద్దాం
సమస్యలను సవాళ్ళను
సమర్ధవంతంగా
ఎదుర్కొనేందుకు
ఆత్మ విశ్వాసం తో
ముందుకెళదాం
ఈ నూతన వత్సరం లో
ఆనందంగా జీవిద్దాం .
పి.కాశీవిశ్వనాధం
9494524445
[3/15, 6:05 PM] Poet Padma Tripurari: మధుమాస మదన మధుకాంత
ప్రకృతి పులకరింత
************************
మబ్బు చాటున దోబూచులాడిన సూరీడి
లేలేత కిరణాలు
మబ్బై కదిలిన మేఘుడి చిటపట చినుకుల ముత్యపు సరులు
చినుకు చినుకుకు పరవశించిన భూమాత వెదజల్లిన మట్ఞివాసనలు
చల్లని మెల్లని పిల్లతెమ్మెరల ఊయలలూగిన కొమ్మలు రెమ్మలు
పచ్చని పైరులు సొగసుగ విసిరిన విల్లుకు చిక్కిన
చూపుల కులుకులు
జలజలపారే సెలయేరు ఒరిసిన గిరులు తరువుల నడుమన గలగలసడులు
నిలిచిన తరువులు చిక్కగ వేసిన చక్కని చిగురులు
చిగురించిన ఆశల ఊహల హృదయము మీటిన కిలకిల పక్షులు
కుహుకుహుమని కొమ్మల చివరన కమ్మగ కూసిన కోకిల పలుకులు
పందిరి అల్లిన మల్లీవల్లుల పరిమళ సుమముల సుధాలహరులు
వర్ణ వర్ణ లావణ్య శోభిత విరుల హరివిల్లు అందచందములు
ఏతెంచెడి మధుమాస మదన మధుకాంత వరించిన వసంతుడేలెడి సుందర సిరులు
కాంచి తపించి తరించి మురిసిన ఎద ఎదల మధుపదములు
నేటి ఈనాటి ప్రకృతి రమణీయ రమణి హొయల లయలు.
.పద్మ త్రిపురారి.
(ఈరోజు ఏర్పడిన అందమైన ఆహ్లాదమైన వాతావరణ చినుకుల తడిలో తడిసిన మనసున విరిసిన కవిత.)
[3/16, 1:16 PM] Buf Amaravadi Rajashekar Sharma: ఓ విళంబి వత్సరమా
స్వాగత కుసుమాంజలి
నవ జీవన ప్రియ వరమా
సవినయ హృదయాంజలి
మావిడాకు తోరణాల
మల్లెపూల సౌరభాలు
మత్త కోకిలల మధుమయ
సుమనోహర గీతాలతొ
ఆరురుచుల పచ్చడుల
ఆరగింపు లొకవైపు
జరుగు మంచి పంచాగపు
శ్రవణాలింకొకవైపు
కవి పండిత గాయకుల
శుభాకాంక్షలొకవైపు
ఆత్మీయుల కలయికతో
ఆనందము ఒకవైపుగ
చదువుకు ఫలితము శుభమై
ఉద్యోగము ఒక వరమై
వివాహము సంతానము
ఆరోగ్యము ఆనందము
ఎనలేని ఐశ్వర్యము
ప్రతి మనిషికి అవి వశమై
మానవతే పరిమళించి
మనిషి దేవుడై నిలిచి
ప్రాణికోటి పరమాత్ముని
రూపాలుగ తలపింపగ
ఓ విళంబి వత్సరమా
స్వాగత కుసుమాంజలి
నవ జీవన ప్రియ వరమా
సవినయ హృదయాంజలి
................అమరవాది రాజశేఖర శర్మ
తెలుగు భాషోపాధ్యాయులు
జిపఉపా తిగుల్
9848996559
[3/17, 8:57 AM] Poet Palloli Shekar Babu: మనీషి గా అవతరించు !
*****************
జీవితం లో
తప్పు చేయనివాడు
మనిషి కాడు !
చేసిన తప్పును
సవరించుకునే వాడు
జ్ఞానవంతుడు !
ఆ తప్పును
సమర్థించుకునే వాడు
మూర్ఖుడు !
ఏదో సందర్భం లో
తప్పు చేయటం
మానవ నైజం !
గుర్తించటం
పాశ్చాత్తాప పడటం
మనిషితనం !
మనిషితనాన్ని
నీలో పెంపొందించు
మనీషి గా అవతరించు !
విళంబి ఉగాదితో
ఆరంభించు
విలక్షణ జీవితం కొనసాగించు !
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర 9490484316.
********17. 3. 18************
[3/17, 9:17 AM] Poet Srinivas Prasad Thurimella: వుగాది కో కవిత
ఉగాది పచ్చడి
అమెజాన్ లో ఆర్డరిచ్చి
కోయిల గానం
యూట్యూబ్ లో వింటున్నా
కవిసమ్మేళనాన్ని
వాట్సప్ లో తిలకిస్తూ
తెలుగు పద్యాల్ని
గూగుల్ లో గుర్తు చేసుకుంటున్నా
మామిడి తోరణాల్ని
మెసెంజర్ నుండి డౌన్లోడ్ చేసుకొని
కొత్త బట్టల్ని ఫ్లిప్ కార్డ్ లో
క్లిక్ చేసుకొంటున్నా
అతిథులకు ఈ మెయిల్ లో
విందునందిస్తున్నా
నిండైన తెలుగు దనాన్ని
ఫేస్ బుక్ నుంచి
తస్కరిస్తున్నా
ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపి
షట్టర్ వేసుకొని తిరుగుతున్నా చలికి
మీ శ్రీనివాస ప్రసాద్ తురిమెళ్ళ
[3/17, 5:28 PM] అంబటి Poet Bhanu Prakas: 🌷🎤🎤🎤
*అంబటి భానుప్రకాశ్...*
జోగులాంబ గద్వాల జిల్లా.
9948948787.
🍁🌼🍁🌼🍁
*మనకెందుకు ఉగాది*
నిన్న నేర్చిన అనుభవం నేడు మర్చిపోతే
ఎందుకు ఉగాది,
ఆడపిల్లలపై అరాచకం ఆగక,అన్యాయంగా తనువుచాలిస్తుంటే
కన్నవారు కన్నీరు మున్నీరౌతుంటే,
మనకెందుకు ఉగాది,
కార్పొరేట్ చదువులతో పిల్లలను హింసిస్తూ,
బలవంతపు చదువులు కొని'పెడుతుంటే
మనకెందుకు ఉగాది,
పుట్టుకమొదలు గిట్టే వరకు
ప్రకృతి తన తోడని మరచి వినాశనం చేస్తుంటే
మనకెందుకు ఉగాది
కరెన్సీ కాగితాల సంపాదనే ముఖ్యమై,
కన్నవారినీ,తనకున్న వారిని
అనాదరణ చేస్తుంటే
మనకెందుకు ఈ ఉగాదులూ ఉషస్సులూ,
అనకొండలా ఆలోచన కాదు కావల్సింది,
అవగింజంత ఆచరణ ముఖ్యం,
తనువు తరలే వరకు సాటి వారికి
సాయపడితేనే కదా సమస్త మానవాళికి ఉగాది.
🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀
[3/17, 7:49 PM] +91 97053 84510: *స్వాగతం*సుస్వాగతం*
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
యుగాది *శీర్షిక*
యుగాదికి ఆదిగా వెలసి,
ప్రతి సంవత్సరం ఉగాది గా,
ప్రారంభమై,
నవ జీవన నిర్మాణానికి నాందివై,
మానవ జీవితమున నవ వసంతమై,
పాతలెక్కలకు పరిసమాప్తమై,
నూతన చిట్టాలకు సమారంభమై,
పెళ్ళిళ్ళకు పేరంటాలకు
తొలి అడుగై,
బాలల అక్షరాభ్యాసానికి,
సిధ్దమై,
క్రొత్త పంటల విత్తులు జల్లడానికి,
తొలి ఋతువై,
పాడి పంటలకు పచ్చని
ప్రకృతి రూపమై,
జీవితమున మూడు పూవులు,
ఆరు కాయల నానుడి,
నిత్య సత్యమై,
కరువు కాటకాలు రాకుండా,
ఎడారిలో ఒయాసిస్సులా,
పరమ శివుని తలపై నుండి,
దిగిన అపర భగీరథివై,
అన్ని ప్రాణులను ఆనందంగా ఉంచె,
ఆరోగ్య ప్రదాయినివై,
బిడ్డ కోసం ప్రసవ వేదన భరించి,
"అమ్మలా"
మాకు శక్తి నిచ్చే శక్తి మాతవై,
ముదుసలికి చేయూతనిచ్చే,
చేతి కర్రలా,
మాకు ఆలంబనమై,
చెడును అంతంచేసి,
మంచిని ప్రేరేపించే,
దివ్య శక్తి వై,
వచ్చే,
విళంబి నామ సంవత్సరమా,
నీకు,
+స్వాగతం+సుస్వాగతం+
"లోకాన్ సమస్తాన్ సుఖినోవంతు"
ఈశ్వర్ రెడ్డి ఊర
🕉🕉🕉🕉🕉
[3/18, 1:43 AM] Poet Mastan Vali: 🌱🌿 *ఉగాది కో మనాది*🍂🍁
💫 షేక్. మస్తాన్ వలి 🌾
🌱🌿🌾🍃🎋🍂🍁🌞🌱🌿🍁🍃🍂🍁
ప్రతి ఉగాది
నాకు మనాది
కనక తప్పెట్ల కోలాహలము
కనక మేడల సోభాయమానం
లేకపోయినా పర్వాలేదు నాకు
శునకాన్ని సింహాసనం పైన
కూర్చో బెడతారని ....
ప్రతి ఉగాది నా కో మనాది
ప్రతి ఉగాది నాకు మనాది
మంచి యెచనకు లేదు పునాది
దుర్మార్గ యెచనకు లేదు సమాధి
అందుకే ... ప్రతి ఉగాది నాకో మనాది
ప్రతి ఉగాది ... నాకు మనాది
షడ్రుచుల తో వుగాది
పచ్చడి పంచకున్నా పర్లేదు
షడ్జమంలో మద్దెల దరువు
వాయించినా పర్వాలేదు
కానీ ... హైటెక్ పోకడ లతో...
యువత ... కంప్యూటర్ యగంలో
కలియుగపు అంచుల లో ...
పురోగమనమో, తిరోగమనమో
తెలియక కొట్టుమిట్టాడుతున్నారని
ప్రతి ఉగాది నా కో మనాది
ప్రతి ఉగాది నాకు మనాది
ఆరంభ శూరత్వమే కానీ ...
అంతిమం లో వీరత్వం లేదు
ప్రతి దీ ఓ ... ప్రత్యేకత ...!!
ఆచరణలో ప్రత్యేకం లేదు, ప్రత్యేక ...
హోదా లేదు ... గోదా లేదు
ఆదా లేదు ... బీదా లేదు
ప్రత్యేకం ఇవ్వక మోడీ వాదులు
అంతా ఒకటే నంటున్నారని
ప్రతి ఉగాది నాకో మనాది
ప్రతి ఉగాది నాకు మనాది
తిధులు, వర్జ్యా లు, ...
నియమాలు చూస్తాం
ఆశించిన ప్రతి ఫలం లేకున్నా
మల్లీ వుగాది కి పంచాంగం
తిర గేస్తాం ... అందుకే
ప్రతి ఉగాది నికో మనాది
ప్రతి ఉగాది నాకు మనాది
విచ్చలవిడిగా హద్దులు దాటాం
సంప్రదాయాల పద్దులు దాటాం
ఐనా ... అవసరానికి సంప్రదాయపు
ముసుగు ని వేస్తాం ... అందుకే
ప్రతి ఉగాది నాకు మనాది
ప్రతీ ఉగాది నా కో మనాది
యువతకు నిలకడ లేదు ...
పెద్దలకు భవిష్యత్ పై
భరోసా కనిపించట్లేదు
ఐనా... అంతా సాధిస్తాం అని
చావని.. ఆశ మిగిలున్నది అందరిలో
అందుకే ... ప్రతి ఉగాది నాకో మనాది
హుషారు లేని వయస్సు లో
తేజస్సు లేని పని తనం తో
నత్తనడక సాగిస్తున్నాం ...
ఐనా ... రంగుల ప్రపంచంలో
హంగు,ఆర్భాటాలు చూపిస్తున్నాం
అందుకే... ప్రతి ఉగాది నా కో మనాది
ప్రతి ఉగాది నాకు మనాది
ఒక్క వుగాది నాడే వుషస్సులు
ఉషస్సులు లేని యుగాదు లెన్నో
చీకటి లో మూల్గు తున్న జీవితాలకు
వెలుగులు పంచ లేక పోయా మనే
ప్రతి ఉగాది నా కో మనాది
ప్రతీ ఉగాది నాకు మనాది
రవి తలమున ప్రచండ జ్వాలలు
కవి తలపున ఉజ్వల జ్వాలలు
కవి కలమున మహోజ్వల పదజ్వాలలు
ఐనా ... జాన పదుల లో మహోన్నత మేది
జన వాణి లో మహోజ్వల తేజ మేది
అందుకే ... ప్రతి ఉగాది నా కో మనాది
ప్రతి ఉగాది ... నా కో మనాది
ఎన్ని వుగాదులు వచ్చినా
ఎన్ని మనాదులు వచ్చినా
లోకం పోకడ ఆప లేము
కాలంలో మార్పు శాశించ లేము
అందుకే...
ప్రతి ఉగాదీ ... నాకు మనాది
🌱 🌿 🍃 🍂 🍁 🌞 🌱🌿 🍃 🍂 🍁
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673.
[3/18, 7:44 AM] అంబటి Poet Bhanu Prakas: 🌷🍀🍁🌼🌷🍁🍀🌼🌷
*అందరికీ ఉగాది శుభాకాంక్షలు*
🍁🍀🍁🍀🍁🍀🍁🍀🍁🍀
శ్రీరామ.
కం.
రాగదె విలంబి వేగమె
భోగము,భాగ్యంబులిచ్చి భూజన తతికిన్
రాగము, సోయగము గలుగ
సాగవె సంతోష పరచి చక్కని వేడ్కన్.
ఆ.
క్రొత్తచిగురు వేసి కొమ్మకొమ్మలునూగె,
పులకరించి నిలిచె ప్రకృతి కాంత
నూత్న వత్సరంబు నుత్సాహమివ్వగా
వచ్చెనిక యుగాది వసుధ పైన.
ఆ.
శ్రీలనొసగి,జనుల చిరునవ్వు జెడనట్టి
సంతసంబుల నిడి, సకల జనులు
రోగ బాధ లేక వేగ యాయువునిచ్చి
వేగ మే విలంబి సాగిరావె,
ఆ.
పసిడి పంటలెపుడు పండగా జేయుచు
హాలికులను గాచి హాయినివ్వు
రైతు చల్లగున్న రాజులై బ్రతికేము
రాగదే విలంబి రక్షనీయ.
*అంబటి భానుప్రకాశ్*
జోగులాంబ గద్వాల.
🌼🙏🌼🙏🌼🙏🌼🙏
[3/18, 8:07 AM] +91 94933 58758: నీలినింగి నుండి జారిపడిన
వాన చినుకులా..
అప్పుడే ఉదయంచే అరుణోదయ
రవికిరణంలా..
సుధామధురమైన పరిమళాన్ని వెదజల్లే
పన్నీటి సెలయెరులా..
పరువాల వయసులో కవ్వించే
పడతి పైటకొంగులా..
వరిచేల గట్లపైన నాట్యమాడే
అచ్చ తెలుగు పడుచులా..
వసంతకాలపు వేచదనంలో విరబూసే
విరిజాజుల రంగుల్లా..
సంధ్యా సమయ సాగరం
ఘోషించే కెరతంలా..
విరులలో మకరందాన్ని ఆస్వాదించి
ఆనందించే తుమ్మెదలా..
శ్రీకృష్ణుని వేణు గానంలా.
శివుడి చేతి ఢమరుకం లా..
విష్ణువు చేతి సుదర్శనం లా..
బ్రహ్మ చేతి రాతలా..
సరస్వతి వీణలా..
పార్వతి ప్రణయంలా..
లక్ష్మీ సంపడలా..
ఎన్నో ఆశలతో,
మరిన్నో ఆశయాలతో,
ఊరించే ఊసులతో,
కవ్వించే హృదాయాలతో,
కొండంత అండతో,
ఆనందాల సౌరభాలతో,
ఆహ్లాదంగా వస్తోంది....
విలంబి నామంతో.... వస్తోంది....
మన అచ్చ తెలుగు సంవత్సరాది..
మన ఉగాది........!
💐💐ఉగాది శుభాకాంక్షలు💐💐
వెంకటేశ్వర్లు.కె
తెలుగు ఉపాధ్యాయులు
[3/18, 8:27 AM] Poet Srinivas Prasad Thurimella: యుగాది కవిత్వం రచన :- శ్రీనివాస ప్రసాద్ తురిమెళ్ళ
శ్రీలు శుభములు జేకూర్చిశ్రేయమైన
మార్గమందున నడిపించిమమ్ము నీవు
చల్లగా జూసి మేల్కూర్చి సాగిపొమ్ము
కొత్త యేడాది ధరణిన కొలువుదీరి
కుహుకుహు రాగాల కోయిలపాటలు
వినిపించె వీనులవిందుగాను
అంబరాన్నoటిన సంబరాలను జేస్తు
కనిపించెబాలలు కన్నులార
పంటచేలన్నియు ఫలియించి ధాన్యాలు
యింటారా! కన్నుల పంటయయ్యె
పంచాంగశ్రవణాలు పంతుళ్ళుజెప్పగా
వినుచుంద్రు పెద్దలు వెడ్కమీర
కొత్త యల్లుని పండుగ కోర్కెతీర్చి
పిండివంటలు యింపుగ వండివార్చి
అందరికినేడు మిగులఆనందమొసగ
ఆదరమ్మునకొత్త యుగాది వచ్చెన
వేపపూతయు బెల్లమువేడ్కతెచ్చి
చింతపండును మామిడి చెరకుముక్క
లరయ మిరియాలపొడి చేర్చ యది యుగాది
పచ్చడిగ జేసితిందురు ప్రజలునేడు
కమ్మనైన మంచిగళముకల్గి పికము
సంతసంబొనరించు వసంతమందు
ఆలపించెను కోటిరాగాల హేల
కోర్కెదీరగ జనులకు కొలువుదీరి
*************************
[3/18, 2:44 PM] Poet Mastan Vali: mpeo nandigama nan:
అంశం : తెలుగు సంవత్సరాది -- ఉగాది
కవి : షేక్. మస్తాన్ వలి
శీర్షిక : *శ్రీ " విళంబి "*
🍁🍂🎋🌱🌿 🥣 🥓🌶 🌿🌱🎋🍂🍁
ఆశించిన ఫలితాలు
మాకు అందించిన
లేక అందించకున్నా
హే ... విళంబీ
సకల మర్యాద లతో. ..
నిన్ను సాగ నంపెదము
పది రెండు నెలలు
మా మధ్య తిరిగాడి
వెళుతున్నావు కనుక
అంతే కాదు సుమీ ...
అది అందంముగున్నా
మరి మందముగున్నా
లేక లంబముగున్నా
మా విశాల మదిలో కి
సువిశాల మనసు తో
*విళంబి* వైన నిన్ను
యుగస్య ఆది యుగాది నాడు
*శ్రీ ... విళంబి* వై రా రమ్మనుచు
స్వాగతం పల్కు తున్నాము
కడు గడసరి గా నడ యాడుచు
చిగురాకుల లో సొగసు ను అద్ది
మామిడి ఒగరులో నీ పొగరు చూపించి
వేపపూత చేదుతో చేదు నిజాలు తెల్పుచు
చింత, బెల్లాలు, ... ఉప్పు, కారాలు కల గల్పి
సుఖ , దుఃఖాలు గా పంచి
జీవిత సారాంశాన్ని
షడ్రుచుల లో చూపించే
కొత్త వత్సరాన కదిలి వచ్చే
కొంగ్రొత్త అందాల తో ...
కొత్త చిగురు లను తీసుకొచ్చి
నూతనుత్తేజాన్ని మా మదిలో నింపి
స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చి
సిరి సంపద లను. ...
సకల జనుల కందించి
*ఉగాది* నాడు
సువర్ణ వైభవం తో
ఇంద్ర ధనస్సు లా ....
జీవిత వెలుగులను నింప
విళంబి వై ... రా కదలి రా
*శ్రీ విళంబి* వై కదలి రా
🍁🍂🎋🌱🌿🌶🥓 🥣 🥓🌶🌿🌱🎋🍂🍁
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673 .
[3/18, 8:17 PM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...వసంత-ఉగాది
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853
................కవిమిత్రులందరకూ ఉగాది శుభాకాంక్షలు.......
మత్తకోకిల...
కొమ్మ కొమ్మల కోయిలమ్మలు క్రొత్త గీతులు బాడగన్
కమ్మ తేనెలు గ్రోల పూవుల క్రమ్ముకున్నవి భృంగముల్
నెమ్మి జూపుచు రామ తమ్ములు నేస్తగాళ్ళను బిల్వగన్
రెమ్మ రెమ్మల నూచు తెమ్మెర లెల్ల హాయిని నింపగన్
కమ్మతీడుకు నల్లమబ్బులు గల్గజేయగ హర్షమున్
చెమ్మగిల్లగ గుండెలోతుల చేరు నూతన శోభలన్
సమ్మతించుచు భూతధాత్రియె స్వాగతమ్ములు బల్కగన్
నిమ్మళమ్ముగ యీ విళంబిని నిగ్గునీయు నుగాదియే..!!!
ఆటవెలది...
వగరు తీపి చేదు పచ్చిమిర్చి పులుపు
లవణములను చేర్చ లక్షణముగ
ఆరు రుచుల తోడ నలరారు పచ్చడి
కలసి యున్న మేలు గలుగుననెను..!!!
[3/18, 8:44 PM] Poet Raja Rao: క్రొవ్విడి వెంకట రాజారావు:
ఉగాది కవిసమ్మెళనంలో సౌమ్య యుగాదిపై చదివిన పద్యాలు:
విశ్వ మంతయు దిరుగాడు విశ్వయోని
కాలచక్రాన గమకమ్ము గల్గి నొప్పు
ఆకుపచ్చటి ఋతురాజ! యమలతేజ!
నవ విళంబి నామ వత్సరా! నతులు నీకు
సానువులందు మొండియగు శాఖలు పల్లవ మొందియుండ యు
ద్యానములన్ లతల్ విరులు దాల్చి సుగంధము లీన జోరునన్
ధూననముల్ సరింబెరయ తోషణ మిచ్చుచు నేమముల్మనన్
గానము చేయుచున్ ప్రకృతికాంత ప్రణామము లాచరించెగా!
మావి చిగుళ్ళు మెక్కి మధుమాసపు కోకిల కొమ్మలన్ సుధా
స్రావము రీతి గీత కలరావముతో నలరించు చుండగా
పూవుల తేనెలన్ విహృత పుష్పలిహమ్ములు మోద మారగా
సేవనమంబొనర్చి వనసీమకు నూతన శోభ గూర్చెడిన్
ఇంపెసలారుచున్ మెఱయు నీవిధి తూఱిన చైత్రమా! యిటన్
సొంపమరించగా నిలచి చొప్పడి నీ గత తిక్తమున్ విస
ర్జింపుము తేట తేనియల రెచ్చుము నందరు మెచ్చగా మరిన్
పెంపు వహించి మోదమిడు వేడుకలన్నియు గూర్పు మంతటన్
తీరగు పుల్ల మామిడియు తెల్లని వేపపువుల్ గ్రహించి యిం
పారగ బెల్లమున్ వరుస భాగము లెంచియు మంచి నీటినన్
కూరిమి వాని గూర్చి పసగూర్చు విధాన చవింగొనంగ నే
పారెను నవ్య గీతికలు బాగుగ క్రొత్త యుగాది వేళలన్
ఈదిన మెల్లడన్ కవులు యింపుగ పద్యము లల్లుచున్ వసం
తోదయ గాన మెంచెదరు తుల్యత గూడిన జీవితేచ్ఛతో
వేదులు భావి కాలమున వెల్వడు శోభను జెప్పుచుండగా
వాదము లేక లోకులిట పావన భావన యుక్తులై జనన్
మానుల ఛేదనన్ పసిమి మాసి పురంబుల కోకిలంబుల
ంగానము పూల వాసనలు కామన గల్గిన భవ్య చిత్తముల్
కానక యుండినన్ నెఱిన కామ్య యుగాదిని జేయుచున్
మానవులంత గూడి బహుమాన పురస్కృతులౌచు వెల్గిడెన్
వానలు మీఱగా జలము పాఱగ యాకుపచ్చనన్
మ్రానులు వృద్థి పొందగ సమంబగు వేడిమి సీతు గూడగా
ధేనువు పేయముల్ సిరియు తీరగు సేద్యము పెంపు నొందగా
మానిసి విద్యలన్నెఱిగి మాన్యత గూడగ నుండగ గోరెదన్
సౌమ్య సహకార శోభలు సందడించి
ఆశ లుప్పొంగ జనులెల్ల యలరు చుండి
నవ్య చైతన్య భవ్యులగుచు
విజితితో యీ విళంబిని విరియు గాత!
***********************
విళంబి నామ సంవత్సర ఉగాది
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
శీర్షిక : విళంబి నామ సంవత్సర ఉగాది...
ఆకురాలినన కొమ్మలకు...
కొత్త చిగురుతో ఆశలు రేపుతుంది ఉగాది..
మోడు బారిన జీవితాలకు...
కొత్త ఆశలు రేకెత్తిస్తుంది ఈ ఉగాది.
షడ్రసాల పచ్చడితో...
ప్రకృతి ప్రసాదాన్నిస్తుంది ఈ ఉగాది...
సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు...
మంచి చెడుల సమ్మేళనం ఈ ఉగాది.
చిన్నబోయిన శిశిరానికి...
కొత్త వసంతారంభమే ఈ ఉగాది...
కోకిలమ్మపాట గొంతెత్తి పాడగా
సరికొత్తగానాల ఆరంభమే యుగాది...
ప్రకృతీమాతెంతొ పరవశించిపోగ
పులకరించునట్టి వనవెలుగు ఉగాది...
ఆదాయవ్యయాలు, రాజపూజ్యాలు
ముందస్తుగానే తెలిపేది ఈ యుగాది...
గ్రహ సంచారాలు... రాశిఫలాలు తెలిపే
పంచాంగశ్రవణమే ఉగాది...
జీవితంలో చేదును వేపపువ్వుతో
జరగనున్న మంచిని బెల్లపు తీపితో
మంచి చెడులనే పులుపు వగరులతో
కష్ట నష్టాలనే ఉప్పు, కారాలతో...
ఉగాదిపచ్చడిని రుచిగా తాగేటి..
కలగలిపిన జీవితమే ఉగాది..
హేవళంబికి వీడ్కోలు పలుకుతూ
విళంబికి స్వాగతం పలుకుతూ...
మీకూ, మీ కుటుంబ సభ్యులకు
ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
9700007653
సాహితీప్రియులకు, మిత్రులకు
విలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
తెలుగు కవన వేదిక
Comments
Post a Comment