వివాహ బంధం


 అంశం: వివాహ బంధం 
శీర్షిక: వివాహం -జీవితం 
 కవి : విన్నర్ (ముస్తఖీమ్)
తేది :04-03-2018

యేడడగులు ..నడిచే బంధం !!
జీవితాంతం ..తోడు -నీడగా , 
ఒకరికి ఒకరై..చీకటి -వెలుతురు గా , కష్టసుఖాల్లో 
ఆనంద-విషాదాల్లో ..చేయి చేయి కలిపి నడిచే ..బహు దూరపు బాటసారుల్లా ..

ధర్మార్ఠ కామమోక్షాదుల్లో ..
అమోదయోగ్యంగా ..
ముక్కూ ముఖం తెలియని 
ఆడా -మగా పెళ్ళి పేరుతో 
యేకం కావడం ..ఆలోచిస్తే 
విచిత్రం ..విస్మయం కలుగక మానదు ..??
అయినా వివాహాలు స్వరం లో 
అవూతాయట ..??

మనసున మనసై ..బ్రతుకున బ్రతుకైనవేళా ..ప్రేమ తోరణాలు 
కట్టిన వేళా ..పెళ్ళి జీవితం 
ఆనందాలు ..కురిపించిన వేళా ..పెళ్ళి బాజాలూ -భజంత్రీలు ..మ్రోగిన సమయాన..బంధు మిత్రు జనాలు ..అభినందనలు తెల్పిన వేళ..
కమ్మని రుచులు ..ఘుమఘుమలాడి న..సమయం ..!!?? జీవితం లో 
మరచిపోలేని మధురానుభూతుల..కారణం ..
?? వివాహం ..వివాహం ..వివాహం ..!!??
భార్యా -భర్తల ..ప్రేమకు నిలువుటద్దం ..కనిపెంచే ..సంతానం ..!!?
ప్రేమైక జీవితానికి ..వివాహమొక్కటే మార్గం ...!!
వివాహం ఒక బాధ్యత..??!!
చివరిదాకా కలిసి ప్రయాణించే ..ఒక తోడూ నీడల నడక..!!??

సృష్టి కార్యానికి ..ఆది వివాహమే ..!!?
పాలూ -నీళ్ళలా ..కలిసిపోయే 
అర్ధనారీశ్వర వాదం ..వివాహం !!
మనసులతో ముడిపడి ..మనువాడే ..బంధం !!? జన్మజన్మల ..అనుబంధం ..??!!
చిరు కోప-తాపాలు , యేడ్పులు -నవ్వులూ వున్న బంధం ..!!??
కౌగిలింతలు -కవ్వింపులున్న ..మధుర బంధం 
వివాహం బంధం ..!!?
సున్నితమైంది కూడా ..మంచిగా నిలుపు కోవడం లోనే వుంది ..మనిషి 
చతురత ...????!!!!

రచన: విన్నర్ ,కొల్లాపూర్ , 9705235385
💘💘💘❤❤💔💔💕💕💞💞💞💋💋💋💋
[3/4, 2:44 PM] Manne Lalitha: 7416863289
కవయిత్రి:మన్నె(పిన్నక)
లలిత.
శీర్షిక:వివాహబంధం.
తేది:4_3_2018.
××××××××××××××××
ఆదిమానవుడు
ఆదిమహిళతొే కలిసి
తిన్న మధుర ఫలం(అంజీర్)తొే 
మెుట్టమెుదటి జీవితబంధం మెుదలు.
ప్రేమ అనే రెండక్షరాలు
అప్పుడే పుట్టుకొచ్చాయేమెా!
అదే బంధమై వివాహబంధమై మనగలిగినదేమెా!
అదే ఏడడుగుల(సప్తపది)
వివాహబంధం.
భార్యాభర్తలై కలిసి ఒకేసారివేసే ఏడడుగులైతే
ముచ్చటగా పసుపుతాడుతొేపెనవేసుకునే ముాడుముళ్ళ బంధం వివాహబంధం.
మనసా వాచా కర్మణా
కలిసిఉండాలనేబంధం
పేదైనా ధనికైనా పసుపుతాడుతొేనే ముాడుముళ్ళుముందు
బంగారుతాడుతొేకాదు
పెళ్ళినాటి ప్రమాణాలు నిలుపుకుని
ప్రతిరొేజు పెళ్ళినాటి సంతొేషాలు తలుచుకుని
ఆనందనిలయంచేసి
"గృహమేకదా స్వర్గసీమ"
అనుకొేవాలేకాని
బ్రతుకు దుర్భరంచేసి 
ఇలలొే నరకంచుాపకు (భార్యాభర్తలుఇద్దరికీ)
ఇరువురు సమస్యలకు సామరస్య పరిష్కారాలు చేసికుని
సంసారశకటానికి జొేడెడ్లై
పరుగులుతీయాలి 
కావడి కుండలై
కలిసిమెలసిఉండాలి
జీవిత సారాన్ని ఆలుమగలిద్దరుా ఆనందంగా పిండుకొేవాలి
కడదాకా ఏడడుగుల వివాహ బంధాన్ని
బలొేపేతంచేయాలి ....
కానీ..... 
అవే బలవన్మరణాలు కారాదు.
×××మన్నె(పిన్నక)లలిత×🌷
[3/4, 3:04 PM] Poet Satya Neelima: శీర్షిక: వివాహబంధం,
రచయిత: సత్యనీలిమ..
💑💑💑💑💑💑💑💑
ఎంత చక్కనిది ఈ వివాహబంధం
ఎంత గొప్పనిది ఈ వివాహబంధం
ఎన్నో బంధాలకు,బంధుత్వాలకు మూలం ఈ వివాహబంధం
వంశము వృద్ధి చేసే రమ్యమైనట్టిది ఈవివాహబంధం
ముక్కోటి దేవతలే ఆశీస్సులీయగా
మూడుముళ్ళతో,ఏడడుగులు నడుస్తూ, అగ్నిసాక్షిగా,వేదమంత్రోచ్చారణతో నూతన సృష్ఠికి అంకురార్పణ చేసే స్త్రీ పురుష సంయోగ బంధం ఈ వివాహబంధం
ఒకరికి ఒకరై,ఒకరంటే ఒకరికి చెప్పలేని ఆత్మీయబంధమే ఈ వివాహబంధం
ఎన్నోజన్మల అనుబంధం ఈ వివాహబంధం
💑💑💑💑💑💑💑💑
           ✍....సత్యనీలిమ..
                ఉపాధ్యాయురాలు,
             జీనియస్ పాఠశాల,
                  వనపర్తి...
[3/4, 6:51 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: *****  ***  *****  ***  ******

పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్ 

~ నమ్మకం ~


నమ్మకం 
నీమీద నమ్మకం
నీతో గడిపే జీవీతం మీద నమ్మకం
నా మెడ వంచుకుని మరీ మూడుముళ్ళు వేయించుకునేవేళా
కుటుంబ వ్యవస్థపై నమ్మకం..

నువ్వేవరో తెలియదు
మూడు నిమిషాల పెళ్ళిచూపులు
మాటల తర్జూమాలే కానీ 
మనసుల బదిలీ జరగని దృశ్యం..
ఆ సంప్రదాయం పై నమ్మకం..

మాటాముచ్చట, కట్న కానుకలు
పసుపుకుంకుమల క్రింద ఖరారయ్యాక
నను నీతో పంపే ప్రక్రియకి ఓ దస్త్రం రాసుకున్నాక
ఆనందం విరిసిన నా తల్లిదండ్రుల కనుల మెరుపు సాక్షిగా
ఈ సంస్కృతి పై నమ్మకం..

పరిచయం లేని నీకు జతగా మిగిలిన బతుకంతా 
సహధర్మచారిణి అనే అందమైన పేరుతో పిలవబడే కొత్తబంధాన్ని కదా..
ఆ వివాహబంధంపై నమ్మకం..

నావోళ్ళు అనుకునేటోళ్ళంత పరాయోళ్ళయి
వాళ్ళందరిని వదిలేసి నవ్వుతూ
ఏడుస్తూ,
నన్ను నేనే సముదాయించుకుంటూ
నీతో అడుగై వేస్తాను చూడు
నువంటే నమ్మకం
నీతో బతుకంటే నమ్మకం..


@సిరిమల్లెలు...

***** *** ***** ** *****
[3/4, 8:00 PM] కృష్ణమోహన్ గోగులపాటి: వివాహబంధం

గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.

మూడుముళ్ళు... ఏడడుగులు...
తెలసీతెలయని వయస్సులో...
తెలియని బంధమే...
ఈ వివాహబంధం...

కన్నవారందరినీ వదిలేసి...
కట్టుకున్నవాడిని నమ్మేసి...
చేయిపట్టి... కాలుకదిపేదే
ఈ వివాహబంధం...

బాల్య స్నేహం... బంధు జనం
ఊరిజనాన్ని... పాత జ్ఙాపకాలను
వదిలివెళ్ళేదే...
ఈ వివాహబంధం...

అత్తింటి కష్టాలు... పెనిమిటితో పంతాలు
ఆర్ధికబాధలు... అవమానాలు...
అన్నీ భరించేదే... 
ఈ వివాహబంధం.

కొత్త ఆశలు... సరికొత్త ఆశయాలు...
తెలియని బంధాలను...
మరింత బలోపేతం చేసేదే...
ఈ వివాహబంధం...

కొత్త ప్రపంచాన్ని సృష్టంచి
జీవితానికి సరిక్రొత్త భాష్యాన్ని... బాధ్యతను తెలియజేసేదే...
ఈ వివాహబంధం...

పరమ పవిత్రమైన ఈ బంధాన్ని
ఎంత పవిత్రంగా కాపాడుకుంటే
అంత బాగా బలపడుతుంది...

అదే అదే ఈ వివాహబంధం...

మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు.
9700007653
[3/5, 12:01 AM] Poet Mastan Vali: ఆంశం :   వివాహ బంధం
    కవి    :  మస్తాన్ వలి.
  శీర్షిక :   నూరేళ్ళ బంధం

  😍  👳‍♂  👩🏼‍🍳  💑   🧖🏻‍♀ .....  🧖🏻‍♂  🧚🏼‍♀  👳‍♂ 👩🏼‍🍳 😍

     విడి పోని బంధం ... విడ రాని బంధం
    అందమైన బంధం ... వివాహ సంబంధం

     సృష్టి లో ఎన్ని బంధా లున్నా 
     ఎ నెన్ని సంబంధాలున్నా
     తనివి తీరనిది  ... తనువు కోరిన దీ బంధం
     ప్రేమానురాగాల పునాది వివాహ సంబంధం

   పసుపు చందనం పూసు కొంటూ
  పసుపు తాడుతో ముడివేసుకొంటూ
  ఏడడుగులతో నూరేళ్ళు బ్రతక మంటూ
  పాల పొంగు లాంటి ప్రాయంలో...
   అందాలను పంచు కొంటూ
   బంధాలను పెంచు కొంటూ
   పాల నురగల పై తేలుతూ
   సరస యుద్ధాన అపజయా లెరుగక 
   రస క్రీడల లో విజేత లెవరో తెలియక 
   ఆనందంగా సాగే సంబంధం ఈ వివాహ బంధం

  సగ భాగం పంచుకొంటూ
  సహ ధర్మ చారిణియై
ఈ లోక మందు జీవించు వారు
సృష్టి ధర్మం తెలుసు కొంటూ
నూతన దంపతులు గా వుంటూ
వి నూతనంగా శిశువుకు తల్లిదండ్రులై 

   కోపాలు, తాపాలు విడిచి మీరు
   పాపాలకు, శాపాలకు గురి కాక 
   వడి దుడు కులు ఎదురు కొంటూ
   వయస్సు మీద పడుతున్నా
   తాతయ్య , అవ్వమ్మ లు గా ఎదిగి నా
   యవ్వ నాన నవ జంటై వెలిగినా 
   మలి వయస్సున తోడు నీడగా నిలిచినా

నాటి నుంచి  నేటి వరకు
ఎన్ని కొత్త బంధాలు పెన వేసుకొన్నా
మరెన్ని పాత బంధాలు తెగిపోతున్నా 

మీ ఈ బంధమే మిగిలున్నది
అప్పటి నుంచి ఇప్పటి వరకు
అందంతో ఆనందం తో వున్నది

ఎన్ని వివాదాలు వచ్చినా ఈ వివాహ బంధం
విబేధాలే చందనం గా పూసు కొని వున్న బంధం
అందం,ఆనందం తో వున్నది ఈ వివాహ బంధం
ఇది వివాహ బంధం కనుకనే...!!
అందుకే ఇది అందరికీ కానుకే ...!!

వివాహ బంధం మంటే ...?
ఇరవై నుంచి అరవై వరకు
అలుపెరగని బంధమే
ఆలుమగల బంధమే
వివాహ సంబంధం

ఊసరవెల్లి రంగు లా
కావలసి నప్పుడ లా
రంగు లు మార్చే ది
కాదిది ఈ షాది 
కడ వరకు యిది
నిలిచి వుండేది 
వివాహ బంధం

    😍👩🏼‍🍳👳‍♂🧚🏼‍♀🧖🏻‍♂🧖🏻‍♀💑🧖🏻‍♀🧖🏻‍♂🧚🏼‍♀👳‍♂👩🏼‍🍳😍

           షేక్. మస్తాన్ వలి
     నవ్యాంధ్ర గీత రచయిత
    జంతుశాస్త్ర అద్యాపకులు
 సెల్ :  99 483 57 673 .
[3/5, 8:02 AM] 334455 Poet Murthy Sreedevi: తెలుగు కవన వేదిక 
మూర్తి శ్రీదేవి 
తేదీ : 5/3/18
శీర్షిక :   వివాహబంధం

మూడు ముళ్ల బంధాన్ని
మూడు  జన్మల బంధంగా
భావించి
ఎడడుగులను ఏడు జన్మల 
బంధంగా ఊహించుకొని
దానినే పవిత్రబంధంగా 
మలచుకొని కష్టసుఖాల్లో
సమపాళ్లలో సరితూగేది
పవిత్ర మూడుముళ్ల బంధం
ఒకరి కొరకు మరొకరు 
కోరికలు త్యాగం చేస్తు ఒకరి
నిర్ణయాలకు మరొకరు విలువ ఇస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు
గౌరవిస్తూ కుటుంబ వ్యవస్థకు మూలమయ్యే 
బంధం వివాహ బంధం
రెండు కుటుంబాల మనుషులను గాక మనసు
లను, వారి ఆప్యాయతలను
ఒకటి చేసి కుటుంబ భావనకు ప్రాతిపదిక అయ్యేది వివాహ బంధం
సృష్టి మనుగడకు మూలం
తరతరాలకు ఆధారం 
ఈ  పవిత్ర వివాహబంధం
రెండు మనసులను ఒకటి
చేసి వారి ప్రతిరూపాలకు
ప్రాణ ప్రతిష్టకు కారణం
ఈ పవిత్ర వివాహ బంధం
భారతదేశ సంస్కృతికి
ఆలవాలం వివాహబంధం
అన్ని బంధాలలోకెల్లా
ఉత్కృష్టమైనది గొప్ప 
వివాహబంధం
[3/5, 8:33 PM] ‪+91 96189 61384‬: శీర్షిక: వివాహబంధం‌,
రచయిత: ఉప్పరి తిరుమలేష్,
బంధమా వివాహబంధమా
ఏ జన్మల అనుబంధం
ఈ జన్మల ఋణబంధం
మూడుముళ్ళు,ఏడడుగులు
సప్తపదులు, వందేళ్లు
బంధమా వివాహబంధమా
వేదమంత్రాలసాక్షి  
సంస్కార హృదయములో
కుంకుమ పారాణి
పచ్చనైన పందిళ్ళలో
అందమైన లోగిళ్లు
పెనవేసిన ఈ బంధం
బంధమా వివాహబంధమా
పచ్చనైన ప్రకృతిలో
అందమైన అనుబంధం
చిలకాగోరింకల్లా సాగిపోయే ఈ బంధం
బంధమా వివాహబంధమా
పచ్చని పందిళ్ళలో 
పంక్తి భోజనాలు 
ఫలహార పుష్పాలు
పప్పన్నం భోజనాలు
బంధమా వివాహబంధమా
ముడిపడితే వీడనిది
తెంచుకున్ప తెగనిది
బంధమా వివాహబంధమా
బంధమా ఏడడుగుల బంధమా
బంధమా మూడుముళ్ళ బంధమా...
    ✍....ఉప్పరి తిరుమలేష్,
                  ఉపాధ్యాయుడు,
               జీనియస్ పాఠశాల,
                     వనపర్తి...
చరవాణి:9618961384
[3/6, 2:15 PM] ‪+91 99085 60246‬: 🌸🌼🌻

 Chandrika: 
ఏడడు గుల  బంధం.
,............................
అపరిచితులు మూడుముళ్ళతో  
ఏడడు గుల  బంధాన్ని                     
పెనవేస్తారు బంధువులు  
జీవితాంతం పేదైన ,ధనికైనా 
కడదాకా ఏడడుగుల వివాహ బంధాన్ని 
బలోపేతం చేస్తూ   పెళ్లి ప్రమాణాలు నిలవాలి.                తోడు నీడగా సాగిపోవును జీవిత చక్రం                           జీవితమనే నావను ఒడ్డుకు చేరుస్తూ కుటుంబమనే పొదరిల్లు నందనవనములోని సుమాలు పరిమళాలు  వెదజల్లును.  
జీవితంలో మరచిపోలేని  మధురానుభూతిని నిలుపుతుంది  పెళ్లి.      
మనసున మనసై  బ్రతుకున బ్రతుకైసాగే
వారి కోటి ఆశలు సుందర స్వప్నమై నిలుస్తోంది.    ముక్కోటి దేవతల ఆశీస్సులతో     
ఆలుమగల బంధం సాగాలి.

🌸🌼🌻

Comments