ప్రభుత్వ బడులు

ప్రభుత్వ బడులు
[2/25, 9:27 AM] Poet Musthakheem విన్నర్: అంశం:ప్రభుత్వ పాఠశాలలు 
శీర్షిక :పలుచనైన పాఠశాలలు 

ప్రైవేటు దెబ్బకు ప్రభుత్వ పాఠశాలలు చతికిలబడ్డాయి !!
వచ్చీ రాని టీచర్లే అమాయక ప్రజలకు నచ్చారు !!?

ఇంగ్లీషు మోజులో పడి అనాది 
నుండి వస్తున్న ..ప్రభుత్వ పాఠశాలలను మరిచారు !!
ప్రభుత్వ విద్య ఉచితం , గనుక 
ఉత్తదనే అలుసు ..??

ప్రభుత్వం సైతం కొన్ని సౌకర్యాలు కల్పించడం లో 
విఫలం అవడం కూడా  ఒక 
కారణమే ..??!

యెందరో ..మహామహుల కు 
జన్మనిచ్చింది ..ప్రభుత్వపాఠశాలలే ???!!!
స్వచ్ఛమైన పాలలో ..విషం లా 
చెడగొట్టింది ..ప్రైవేటు పాఠశాలలే !!!??

తల్లిదండ్రులూ ..మూర్ఖంగా 
వుండడమే ..సమస్యలకు 
ప్రధాన కారణం!!

ప్రభుత్వం కోట్లాది రూపాయలు 
టీచర్ల జీతాలకు ఖర్చు పెడుతున్నది నిజమే !!
కాని పాఠశాలల..సమస్యలు 
తీర్చడం లో ఆసక్తి చూపడమే లేదు !!
పాత బిల్డింగ్ , మూత్రశాలలు, 
ప్రహరీ గోడలు , తగినంత సిబ్బంది కొరత..ఇత్యాదివన్నీ ..
పరిష్కారమే కాని సమస్యలు !!

ముఖ్యంగా ..తల్లిదండ్రుల..ఆలోచనా విధానం మారాలి , 
తమ పిల్లల్ని ప్రైవేటు లో గాకుండా ..ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి ..
సమస్యలు వాటంతటవే పరిష్కారం అవుతాయి ...!!??

విద్యార్థుల కొరత కూడా సమస్యలకు ఒక కారణం!!

ప్రభుత్వ పాఠశాలలు ..నిపుణులైన ఉపాధ్యాయుల..విగ్న్యాన భాండాగారం..దాని విలువను 
గుర్తించి ..ఆదరించాలి !!

ప్రైవేటు లో ఫీజుల వేటు ఉంటుంది ..కృత్రిమ చదువు ..??
పాత బంగారాన్ని ..మరవద్దు ??కొత్త మోజులో ..??

రచన:విన్నర్ , కొల్లాపూర్.
తేది :25-02-2018
🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐
[2/25, 12:26 PM] Poet Kusumanchi Sridevi: అంశం-నేటి ప్రభుత్వబడులు
కుసుమంచి శ్రీదేవి
---------------------------
నాటి సర్కారు విద్య ఏది నేడు..
విద్యాసంవత్సరం మద్యలో
అందించే పుస్తకాలతో..
యూనీఫామ్ గా  లేని
యూనీఫామ్ లిస్తూ...
మధ్యాహ్నా భోజనములు 
మేమే పెడతున్నామంటూ..
వారి భోజనాలకి గురువుని
కాపాలదారుడిని చేస్తూ...
పిల్లల ఇంటి దగ్గర
మరుగుదొడ్డుల కోసం
గురువుని ప్రోత్సహకారుడిని
చేసి...
వాటి రిపోర్ట్ ల కోసం
ఒక విలేకర్లుగా..రిపోర్ట్ ర్ లగా
మార్చి..
ఆ డే..ఈ డే
అంటూ పలకరిస్తూ..
వాటి కోసం నినాదాలు..
వాటి కోసం ర్యాలీలు..
ఆ ఫోటోలు పై అధికారులకు
అప్ లోడ్ లు..

ఒక విధ్యావిధానం పిల్లలకి
చేరే లోపే..
కొత్తవిధానంపై ప్రయోగాలు
అర్ధం లేని ట్రైనింగ్ లు
దరి చేరని మెటీరియల్స్ 
రెండికి చెడ్డ నావ
ప్రయాణాలు,...

గంటకో రిపోర్ట్ లు..ఘడియ కో
రిపోర్ట్ లు..
అవి కావంటూ వేరే
అధికారి ఛీవాట్లు
మళ్ళీ మొదటికి
తెడ్డు వచ్చి మొదలెట్టిందన్నట్టు...

పరీక్ష సమయం కన్నా!
పిల్లవాడిని చదివాంచే
సమయం కన్నా!
అధికమైన గ్రేడింగ్ సమయం!
లాభమేమో గాని 
వ్యర్ధమౌతున్న సమయం!

నేటి గురువులు
ఎన్నో అగ్నిపరీక్షల కన్నా
కఠిన పరీక్షలెదురుకుని
గురువు స్థానంలో అడుగుపెట్టి
దశావతారమెత్తి బోధిస్తున్న...ఫలితమేముంది..

పిల్లవాడి దగ్గర గడిపే సమయం
లేనప్పుడు..
గురు..శిష్యుల బంధం
బలహీనమౌతున్నప్పుడు
ఆ పర్యవేక్షణ..ఈ పర్యవేక్షణంటూ
గురువు స్వేఛ్ఛా బోధనకు
పరిధులు గీస్తున్నప్పుడు..
బోధన ఫలవంతమెలా అవుతుంది!


గురువుకు స్వేఛ్ఛ నివ్వండి
పిల్లలకి విద్య బోధించే అవకాశాన్ని
దూరం చేయకండి..
బట్టీ విధానాన్న ప్రోత్సహించే
కార్పోరేట్ స్కూళ్ళను తరిమికొట్టి..,
బ్రతుకు తెరువు నేర్పే..
మన సంస్కృతి..సాంప్రదాయాలను
విలువలను తెలియజేసే
 సర్కార బడులకు
చేయూత నివ్వండి.

ఆదాయం రాని వ్యవస్థ
అని చిన్నచూపేలే!
రేపటి దేశ భవిష్యత్ కి
పునాది రాళ్ళు వీరు..
రేపటి ఆదాయానికి
మేథో వనరులు వీరు అని మరవకండి..
[2/28, 7:21 AM] Poet Padma Tripurari: ప్రభుత్వబడి
***********************

అన్నదాత రైతన్నల ముద్దుబిడ్డలు
స్వేదం చిందే శ్రమ జీవుల పసిడిబాలలు
రెక్కాడితె డొక్కాడని పేదింటి ముద్దుబాలలు
ఇంటింటి వ్యధనంతో వగచేటి విరిబాలలు
బాలశిక్ష పట్టి నేర్చు 
చదువులమ్మ గుడి ప్రభుత్వబడి


రోజు గడవడమే గగనమైన జీవిత పోరాటంలో
అలసి సొలసి విసిగి వేసారిన
జనుల పోషణలో
పెరిగి తిరిగి తడబడు అడుగులను
బడిగుడివైపు నడిపెడి బడి ప్రభుత్వబడి

పల్లెపట్న అంతరము లేని
మిథ్యాప్రపంచంలో
నవనాగరికత నేర్పిన సాంకేతికతలో
తమను తాము చూసుకొని
అటు ఇటు కాలేని
ఆకర్షణ వలలో జీవనయానము చేసెడి
భావిపౌరుల బడి ప్రభుత్వబడి

కాయకష్ట జీవితాన
విలువైన భావనలున్నా
సమయము వెచ్చించలేక
తప్పొప్పులు తేల్ఛలేక
తలమునకలయ్యే తల్లిదండ్రుల ఒడిలో సేదదీరు సిరిబాలలు
చిరునవ్వుతొ చేరు బడి ప్రభుత్వబడి

చేసిన కష్టము మరువ
వ్యసనాలకు బానిసలయి
బతుకుబండి గాడి తప్పిన
కుటుంబ బరువులో
గురితప్పిన భవితయిన 
బంగరు బాలలు చేరెడి బడి ప్రభుత్వ బడి

తెలిసీ తెలియనితనం
తెలిసినా ఏమనలేని గుణం
వెరసి వక్రమార్గ పయనమయినా
చూడలేని సమయాన్ని
సరిచేసెడి యత్నంలో
అన్నీ తామై తపించే
ఉపాధ్యాయ గణం
ఉన్నబడి ప్రభుత్వబడి

మారుతున్న సమాజాన
బోధకులై అర్థకులై
సాగేటి గురువులను
ఎకడెకడో జరిగేటి
సంఘటనలో బంధీచేసిన
నిందల భారం మోసే బడి ప్రభుత్వబడి

అత్యున్నత వసతుల్లో
ఆంగ్లమాధ్య మోజుల్లో
మునుగుతున్న తీరయిన
అరకొర వసతులున్న
అందమయిన ప్రపంచాన్ని
తరగతిలో చూపించే
తపనలున్న బడి ప్రభుత్వబడి

కనబడుతుందా ఎవరికైన
వెతల నడుమ ఎదుగుతున్న
కలతల బాల్యం
బంగరు బాల్యం చేయాలనే గురువుల ప్రయత్నం
గుర్తిస్తుందా సమాజం
గురువుల యాతనలోని విద్యావిధానం
అనకుండా ఉంటుందా
ప్రభుత్వబడి నిర్వీర్యం అని
చూస్తుందా లోలోపలి ఈ కష్టతర సుసాధ్యం
అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కొనసాగుతున్న బడి ప్రభుత్వబడి.

             పద్మ త్రిపురారి.
[2/28, 5:59 PM] Poet Satya Neelima: శీర్షిక : ప్రభుత్వ బడి,
రచయిత : సత్యనీలిమ..
🏢🏬🏢🏬🏢🏬🏢🏬
బడిలోకి వెళదామురా తమ్ముడూ
అక్షరాలు నేర్చుదామురా తమ్ముడూ
అక్షరాలు నేర్చదామురా.......... "బడిలోకి"
ప్రభుత్వ బడి అంట
పంతుళ్ళు ఉంటరంట..........(2)
ఉచితంగా పుస్తకాలు, బట్టలు ఇస్తరంట...............(2)
అన్నీ సదుపాయాలతో తమ్ముడూ
అందంగా ఉంటదంటరా తమ్ముడూ
అందంగా ఉంటదంటరా......... "బడిలోకి"
అమ్మా నాన్న లాగ ప్రేమగా చూస్తరంట............(2)
పాటలెన్నో పాడించి కథలెన్నో చెప్తరంట..............(2)
మధ్యాహ్న వేళలోనా తమ్ముడూ
భోజనమే పెడతరంటరా తమ్ముడూ
భోజనమే పెడతరంటరా......... "బడిలోకి"
ఉపకారవేతనం ప్రభుత్వం ఇస్తదంట............(2)
పెద్ద పెద్ద చదువులన్నీ ఉచితమేనంట.............(2)
అందరికీ అర్థమయ్యేలా తమ్ముడూ
పాఠాలే చెప్తరంటరా తమ్ముడూ
పాఠాలే చెప్తరంటరా............... "బడిలోకి"
జెండావందనం నాడు చాక్లెట్లు ఇస్తరంట..............(2)
ఆటలెన్నో ఆడించి కానుకలే ఇస్తరంట..............(2)
ఎన్నెన్నో కార్యక్రమాలన్నీ తమ్ముడూ
వైభవంగా చేస్తరంటరా తమ్ముడూ
వైభవంగా చేస్తరంటరా........... "బడిలోకి"
🏢🏬🏢🏬🏢🏬🏢🏬
                ✍....సత్యనీలిమ,
                ఉపాధ్యాయురాలు,
                జీనియస్ పాఠశాల,
                        వనపర్తి...
[2/28, 8:34 PM] Poet Mastan Vali: అంశం  : ప్రభుత్వ పాఠశాలలు 
    కవి  :  షేక్. మస్తాన్ వలి.
 శీర్షిక : *మనం దరి  ... బడి*

🎪🚶🏼‍♂🔔🕘🔕🕑🔔🕠🔔👫🎪


    ఎండిన మడి కన్నా ... పచ్చని చెట్టు మిన్న 
    పవిత్ర గుడి కన్నా ... అతి పవిత్రమైన తల్లి ఒడి మిన్న
    తల్లి ఒడి కన్నా  ...  జ్ఞానం నేర్పే బడి ఎంతో గొప్ప దన్న

ఎంతటి గొప్ప దైనను నేడు ప్రభుత్వ బడి స్థితి సున్న
వాటి పునాదులు కుంగు తున్నాయి , వంగు తున్నాయి
పూజ లేని గుడి లా నిల " బడి " వున్నాయి

నేటి ఈ దుస్థితి కి కారణం. .!.?
ఆంగ్ల మాధ్యమాల అనుకరణం 
అమ్మా , నాన్న లు అనవసరం
మమ్మీ , డాడీ లు అవసరం...!!

పెద పిల్లల చదువులకు ఇవే మణిహరం
ప్రభుత్వ పాఠశాలలకు గ్రహణం
ఎప్పుడు మారునో ఈ తరుణం

ఈ స్థితి , దుస్థితి ఎందుకో తెలుసా ..?
రోజు గడవని మట్టి బ్రతుకు వారి దన్నా
వారి లో ఎరుపెక్కిన ఆవేశం వున్నా 
పెదవి దాటకనే చెమట చుక్కలతో ... చల్ల బడి
క్రింద కు జారి నేల తడి పే బ్రతుకు
కలిమి లేక , కండ లేక 
వుండ లేక , వెళ్ళ లేక
రోజెల్లుటకు బడి మాన్పించే బ్రతుకు
బడి కెలితే బండెల్లని వారి బ్రతుకు
తన వారందరికీ దొరకదు మెతుకు
అతుకుల బొంత లాంటి వారి బ్రతుకు

ప్రభుత్వ పథకాలు లంకెలు వేస్తున్నా 
అంకెల లో గారడీ చేస్తున్నా 
పడి పోయిన పాఠశాలలు
ఎదగక ,ఒదగక
నిల బడ లేక , పడి పో లేక
నత్తనడక తో కుంటు తున్న ది
ఒంటికాలు తో గెంతు తున్న ది

వడి గట్టి, మడి గట్టి
తొడ గొట్టి,పడగొట్టారు
ఆంగ్ల మాధ్యమం మోజులో
ప్ర "వేటు" బడులను కనిపెట్టారు
కార్పొ "రేట్" పాఠశాల నిలబెట్టారు
ప్రభుత్వ పాఠశాలలను పడగొట్టారు

మార్కుల హోరు తో,
ర్యాంకుల జోరు తో
ప్రవేటు బడులను పోషించాము
ప్రభుత్వ బడులను కూల్చేశాము

నేడు ర్యాంకులు వద్దు
బ్యాంకులు వద్దు అంటున్నాము
మారాలి, మారాలి అంటున్నాము
మనుషులు మారాలని చెబుతున్నాము
మనము మారట్ల, మన మనసు మారట్ల
మారండీ , మారండీ అని చెబుతున్నాము
మరి మారే దేవరో ..? 
ప్రశ్నించు కోండి  .. ప్రతి ఒక్కళ్ళు 
ప్రభుత్వాన్ని శాసిస్తారో ..?
ప్రవేటులను పోషిస్తారో ...?
తేల్చు కోండి  ... మీరే 

ఈ కోర్టు లో దోషి మీరే,..!
(ఈ కోర్ట్ కు) సాక్షి మీరే ,..!!
న్యాయ వాది మీరే
న్యాయస్థానం మీ మనసాక్షే ..!!
అడిగి తెలుసు కోండి

తెలియ కుంటే 
నన్న డగండి ..మీలో 
ఒకరిని నేనండి 
నాలో భావం మీదండి 
అందరు ఒకటై కదలండి 
మీరంతా ఒకటై నిలవండి 
ప్రభుత్వాలే మన వండి
ప్రభుత్వ బడులే మనవండి 

   🎪  👫 🔔  🕘 🚶🏼‍♂ 🕑 🎪  🕠  🔔

          షేక్. మస్తాన్ వలి
   నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
 సెల్ : 99 483 57 673.
[3/2, 9:02 PM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...ప్రభుత్వబడి
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853
కందపద్యములు...
బడియే తొలిగుడి జనులకు
నడవడికనునేర్పుతూనె నయముగ మనకున్
కడివెడు మమతల నొసగెడు
బడి ఋణమునుదీర్చుకొనుట భాగ్యము గాదే!!!

ఆలన పాలన కరువై
మేలగు సౌఖ్యములు లేక మేదిని యందున్
లీలామాత్రంబుగనే
చాలని నిధులున్న పాఠశాలలు గనరే!!!

నిన్నును నిన్నును నిన్నున్
వెన్నంటి మనంబులున్న విబుధుల నదివో
చిన్నప్పటి బడులన్నియు
చెన్నుగ మరి గోరుచుండె జేయూతనిలన్

చదువులు నేర్పిన గుడులను
పదిలంబుగ నుంచుడనుచు భావికి దెలుపన్
కదులుడు నేడే మీమీ
చదువుల తల్లులనుజూడ శరవేగముతో!!!

అదిగో నీ తరగతి గది
హృదయంబుప్పొంగ  వినుము యేమంటుందో
వదలిన బాల్యపు సృతులన్
పదిలంబుగ నిడగనీకు బట్టుకు నుండెన్!!!

తువ్వాయిగ గెంతులిడుచు
నువ్వాడిన ప్రాంగణమది యొకపరి గనుమా!
మవ్వమ్ము తగ్గి యుండెను
దవ్వుల నిలుచుండిపోక దరిసించుమయా!!!

బాగుగ నుందో!లేదో?
నీగురుతులు నిలచియున్న నీబడి యచటన్
సాగుం బొకపరి నేస్తం
నీగుండెల దాగియున్న నిన్నను జూడన్!!!
[3/3, 9:37 AM] Manne Lalitha: మన్నె (పిన్నక)లలిత.
అంశము:ప్రభుత్వ బడి.
ఊరు:హైదరాబాద్.
చరవాణి:7416863289.
×××××××××××××××🌷
నాడు అరుగులమీద బడులు 
తదుపరి ప్రభుత్వ బడులు
ఉదయం 9గం.మెుదలు
సాయంత్రం 3.1/2 కు ఇళ్ళకు కేరింతలతొే.

నేడు ముాడు ఏళ్ళకే 
ఉదయం 7గం లేక8గం.లకే
సాయంత్రం  (కార్పొరేట్ హొేదాబడులు)కాదు..కాదు..రాత్రి 8లేక 9
నిద్రముఖాలు...నీరసపు ముఖాలతొే రేపటి భావిపౌరులు.
"పులినిచుాచి నక్కవాత"
నేటి ప్రభుత్వ పాఠశాలలు.
ఉపాధ్యాయుల అధిక,అనవసర శ్రమ
పిల్లలకు ఏమిచేస్తున్నరొేతెలియని 
అయెామయంలొే నిర్విరామ శ్రమలొే నిర్వీర్యమైన బాల్యం
ఆనాడు ప్రభుత్వ బడిలొే చదివి
ప్రధానులు,రాష్ట్రపతులు,రాజ్యాంగనిర్మాతలు,ఇంజనీర్లు,కావ్యనిర్మాతలు,కళాకారులు...ఎంతమంది ప్రముఖులు చిరస్థాయి కాలేదు?
అదేసుార్యాస్థమయాలు
 మనుషులే..అప్పుడు..ఇప్పుడు
కానీ మార్పు గ్రహించారా?××××××××××××××
లార్డ్ మెకాలే1835,ఫిబ్రవరి2వతేది....బ్రిటీషు పార్లమెంట్ కు వ్రాసిన లేఖలొేని కుట్ర ఫలితం ఈనాడు మనుషులైతే కనువిప్పు కావాలి.
భారతదేశం మెుత్తంలొేబిచ్చగాడులేడు.(మధ్యఇంకాచాలవుంది)...వాళ్ళ సాంప్రదాయ విద్యాస్థానంలొే మన విద్యావిధానం ప్రవేశపెట్టితే
ఆంగ్లేయులు గొప్పవారనే 
అభిప్రాయానికి వస్తారు.అప్పుడు మనం అనుకున్నది సాధించవచ్చు.
×××××××××××××
 సాధించారు "మెకాలే"
మీరనుకున్నది సాధించారు.
కానీ అదితెలిసిన మా మనీషులు అతి తక్కువమంది "ముత్యాలరాజు"లు
 ప్రభుత్వ బడిలొేనేచదివి
పెద్దపదవులు అధిరొేహించారు
మేమేదొే చెయ్యాలనే ప్రభుత్వాలు 
పునరాలొేచనతొే
విచక్షణతొే "మెకాలే"ని
మదిలొేపెట్టుకుని మెదిలి
పుార్వపు ఉన్నతస్థానానికి 
భావితరాన్ని తీసికుని వెళ్ళాలి.
××××××××××××××🌷


Comments