శీర్షిక ః *పేదరికం*
*వయసుదేముంది ?ఎన్ని పదులు దాటితే నేం !!!*
*సంస్కారం తెలియనోడు సమన్వయం చేసినట్లు*
ప్రతిదీ కవితని మురిసి పోవడం తప్ప చేసేదేముంది
*రంగూ రుచీ చిక్కదనం ఏ ఒక్కటీ లేని తేనీటి లా*
*వస్తువు, శిల్పం, వర్ణన ఏదీలేని కవితల. . దాడిలో*
*పేదవాడైన పాఠకుడిని*
(పాఠకుడి) నా సహనానికి పరీక్షలా ... వర్తమానం వేధిస్తున్నా
భవిష్యత్తు బహుముఖాలని పగిలిన అద్దంతో చెప్పించిన కొమర్రాజు గారి భరోసా నడిపిస్తుంది.
*పఠనార్తి పెరిగిపోతుంటే.. .. ఒక్కమంచి కవితకోసం తపిస్తున్న పేద పాఠకుడిని*
బిరుదుల మాలలు ధరించి, శాలువాల మాటున దాక్కుని
*పోలోమని కవితలంటూ కల్తీ పదసమూహాలు గుప్పిస్తూంటే*
*రోజు రోజుకీ పేదరికం* *పెరిగిపోతున్న పాఠకుడిని*
వయసుదేముంది ?ఎన్ని పదులు దాటితే నేం !!!
సంస్కారం తెలియనోడు సమన్వయం చేసినట్లు
*పాఠకలం పేదవాల్లమే అవుతున్నాం*
💐💐💐💐💐💐
*వీరా గుడిపల్లి*
[2/18, 7:26 AM] Poet Seenu Vkota: రానాశ్రీ
అంశం-పేదరికం
శీర్షిక- మా పూరిగుడిసె
~~~~~~~~~~~~~~~
మా పూరిగుడిసె
మా పూర్వీకుల గుడిసె!
బుడ్డీదీపంతో గుడిసెంతా వెలుగే...
ఒక ప్రక్కన పొయ్యి
మరో ప్రక్కన మా అవ్వ మంచం!
అవ్వకు దగ్గువస్తే
అరడజను చేతులు
ఆదుకొంటాయి........!
అందాల మాబిడ్డలకు జ్వరమొస్తే
అన్ని చేతులు అక్కడ్నే వుంటాయ్!
మా పూరిగుడెసెలో
మనుషుల మధ్య దూరంపెంచే
తలపులుండవు...
సచ్చిపోయినా .....
సాయంకావాలన్నా.....
ఆ అద్దాల మేడలు పరాయిదేశాలే.....
ఎవరికి వారే...యమునాతీరె!
మా పూరెగుడిసె నిండా
మణులు మాణిక్యాలుండవు..
అనురాగపు ఆప్యాయతలే
అడుగు అడుగునా అగుపిస్తాయ్!
చూట్టూ జరిగే విషయాల్ని
మా పూరిగుడెసె వింటుంది...
మా గుడెసెకు మానవత్వం వుంది!
మనుషుల ఐశ్వర్యం కంటే
మమతలనే నేర్పిస్తుంది
మా పూరిగుడిసె.......!
రానాశ్రీ
చిత్తూరు.
[2/18, 7:38 AM] Poet Musthakheem విన్నర్: అంశం:పేదరికం
శీర్షిక:పేదరికం బాధాకరం!!
కవి : విన్నర్ (ముస్తఖీమ్)
తేది:18-02-2018
కడుపార తినలేని ..దైన్యం!!
యెవరినీ అర్థించ జాలనివాళ్ళు
ఆత్మాభిమానము మెండుగా ఉన్నవాళ్ళు !!
జీవిత గమనాన కన్నీళ్లను , కష్టాలను కలిగించే ..ఈ బీదరికం..సాధక బాధకాలను
అర్థం చేసుకోని మారాజులు యెందరో ..యెందరెందరో ?
క్షుద్బాధ ఓ వైపు ..అనారోగ్యం
ఇంకో వైపు ..ఇల్లూ వాకిలి సరిగా లేని వైనం..చేతి లో
చిల్లి గవ్వా నిలువని , లేని రోజులే యెప్పుడూ ..??
పలుకరించే వారు కూడా తక్కువే ..ఇదంతా పేదరికం
ఇచ్చిన బహుమానం!!
ఏ మనిషీ , ఏ నేతా అర్థం చేసుకోలేని బ్రతుకు మాది ,
అర్థం చేసుకున్నా ..సహాయము
అందించని రకం!!??
ఉన్న దాంట్లో నే సర్దుకొని బ్రతుకు బండి లాగుతున్నాం!
యెన్ని ప్రభుత్వాలు వస్తేనేమి
గరీబీ హటావో అంటేనేమి ..??
ఉచీతాలన్నీ ..ఉత్తవేననీ ..అర్థం చేసుకున్నాం!!
మా బీదరికం,మా పేదరికం మాకేన్నో ..పాఠాలు నేర్పింది !!
యెవరో వస్తారని ..యేదో చేస్తా
రని యెదురు చూసి మోసపోకూమా ..?? అనే మాటను బాగా నేర్పింది !!
మా జీవితాలను ..మేమే చక్క
దిద్దుకోవాలనే గ్ననోదయం అయింది !!?
మా పేదరికమే..మాలో పేద్దవవ్వలనే ..కసి రేపింది , అందుకే మా పిల్లలు డాక్టర్లు , ఇంజినీర్లు , కలెక్టర్లూ , టీచర్లూ ..మంత్రులూ , ప్రధాన మంత్రులూ ..యెన్నెన్నో పడవులు అలంకరించారు !!???
మా పేదరికాన్నీ ..పెద్దరికం గా
మార్చు కున్నాం!!??
కన్నీరు ని పన్నీరు గా మలిచాం!!??
రచన:విన్నర్ , కొల్లాపూర్.
[2/18, 1:58 PM] Poet Satya Neelima: శీర్షిక : పేదరికం,
రచయిత : సత్యనీలిమ.
☹☹☹☹☹☹☹
పేదరికం పేదరికం పేదరికం
మనిషికి ఇదే అతిపెద్ద నరకం
ఎక్కడ చూసినా నమ్మలేని నిరంకుశం
మాయమాయె మానవత్వం
ఒక్క పూట తిండిలేక అల్లాడిపోయే ప్రాణాలెన్నో
కట్టు కోవడానికి బట్ట లేక తల్లడిల్లే మనసులెన్నో
ఉండటానికి గూడు లేక రహదారిపై నిదురించే అనాథ బ్రతుకులెన్నో
వీధివీధి తిరిగి చెత్త ఏరుకునే
పసిపిల్లల బతుకులు మారే దారి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి అభాగ్య జీవితాలెన్నో ఎన్నెన్నో
చదవుకోవాలనే కోరిక ఉన్నా
అవకాశం లేక వెట్టిచాకిరి చేస్తున్న పసిప్రాయాలెన్నో
ఎన్ని సర్కారులు మారినా
పేదల జీవితాలు మారేనా
ఎన్ని యుగాలు గడిచినా
పేదరికం రూపు మాపేనా
ఇంకోసారి ఆ భగవంతుడు
అవతారమెత్తినా పేదరికాన్ని నాశనం చేసేనా
అందుకే... ఓ పేదరికమా
వెళ్ళిపో మా జీవితాలనుంచి
మా దేశం నుంచి...
పేదరికమే లేని నూతన నవభారతాన్ని నిర్మించాలి..
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి...
👍👍👍👍👍👍👍👍
✍..సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి..
[2/18, 2:08 PM] Poet Mastan Vali: అంశం : పేదరికం
కవి : షేక్. మస్తాన్ వలి
శీర్షిక: *మాది... పేదరికమా*...?..!!
⛹🏻♂🤾🏻♀🤺 🏋🏻♀🎪 ⛺ 🏰 🏭 🚠🤾🏻♀🤺⛹🏻♀🏋🏻♀
పేదరికమా..!! ..?
అదెప్పుడొచ్చింది
అదెక్కడుందీ ..?
నేను, నా దేశం
సు విశాల మైన
సు సంపన్న మైన
ప్రకృతి వనరుల తో
తుల తూగుతూ
విశ్వంలో నే ...
అగ్ర తాంబూలం నాది
నాకు, నా దేశానికి పేదరికమా.!.?
నా చుట్టూ, నా దేశం చుట్టూ
పేద రాశి పెద్దమ్మలు...
దరిద్ర దేవత తిరుగుతారు
బహుశా వాళ్ళని చూసి
నన్ను, నా దేశాన్ని
పేదరికం లో వున్న
పేద వాళ్ళు అను కొన్నారేమో !!
మాది ఇనప గజ్జెల సవ్వడి
వాళ్ళ ది సువర్ణ సంకెళ్ళ ముట్టడి
నిజంగా, నిజం చెప్ప నా...
మేము తేనెటీగలం లాంటి వాళ్ళం
ప్రతి పువ్వు లో మకరందాన్ని
కష్ట మనుకోక ,ఇష్టం తో తెచ్చి
తేనె పట్టు లో దాస్తాం
మా తేనెను, తేనెపట్టును
దోచేస్తాడు ... పేదవాడు
వాళ్ళు నిరుపేద వాళ్ళు
ఎందు కనగా . ...
వాళ్ళ కు చేవ లేకా,చేతకాక
చచ్చు బడ్డ నాయాళ్ళు
దోచు కోవటమే తెలిసిన
దొంగ నాయాళ్ళు
రవ్వంతైనా,జర్రంతైనా
సీము లేదు, శరం లేదు
సిగ్గు లేని, ఎగ్గు లేని
సచ్చి నోడి దగ్గర ...
చిల్లర ఏరు కొనే ముఖాలు
అలనాటి నుంచి నేటి వరకు
నన్ను, నా దేశాన్ని
దోచుకొనే వారే...
దోచుకు పోయేవాడు
ధనవంతుడా ..?
పేద వాడా ..!! ?
నాడు ... షేకులూ ,
ఘోరీ లు, మహమ్మద్ లూ
మోగలాయులు, బ్రిటీషు లూ.
దోచు కొన్నారు..
నేడు ...దిగ్గజాలని చెప్పుకొనే
కార్పొరేటు బిచ్చగాళ్లు
రాజకీయ రొచ్చు లో...
తిరిగాడె ముష్టి వాళ్లు
దోచు కొన్నారు...
సిస్ బ్యాంకు లో
దాచు కొన్నారు
వారెప్పుడూ పేద వాళ్ళె
నేను కష్ట పడుతున్నంత కాలం
నా...అంత ధనికుడు లేడు
ధన మోక్కటే లేక పెద వాన్ని
ఆత్మ ధైర్యం లో ధనికుడిని
సాయమందించుటలో ధనికుడిని
ఆదుకోవటం లో ధనికుడిని
ఆదరించుట లో ధనికుడిని
కష్టపట్ట మే తెలిసిన ధనికుడిని
సుఖం లో సౌఖ్య ముంది
కని పించని రోగ ముంది
కష్టం లో నష్టం ఏముంది
ఆత్మ విశ్వాసం వుంది
అందుకే...
నేను, నా దేశం
పేదగా,నిరుపేదగా కనిపించినా...
నాడు, నేడు ధనికులము మేము
విశ్వానికి సాయం చేసే మూలధనం
మాదే మాదే ముడి ధనం మాదే
ఇప్పుడు చెప్పు
పేదరికమా మాది
హీనంగా, దీనంగా
ఆశగా ఎదురు చూస్తున్న
పేద (దేశాలు)వాళ్ళు
మా చుట్టూ ఉన్నంత కాలం
నిరుపేద గా కనిపించే ధనికులము
బీద పలుకులు పలికే
పేదరికం మేము పేదరికులమే
🏋🏻♀🤺🤾🏻♀⛹🏻♂⛹🏻♀ 🎪 ⛺ 🏰 🏋🏻♀🤺🤾🏻♀⛹🏻♂⛹🏻♀
షేక్. మస్తాన్ వలి
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673
[2/18, 10:22 PM] Poet Ithagoni Venkateshwarlu: రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:పేదరికము
సీ:
ధనము లేకున్నవానిని పేదవాడని
అందురునందరు నదినిజమగు
నీపేద చెమటయేనీపేద రక్తమే
నన్నమౌ ప్రాణమౌ నఖిలజగతి
నభివృద్ది సర్పంబు నకుపాలు పోదురు
కాటేయ వేటేయ కడకు దెలసి
ఈపేదరికమన్ననింతింత యనరాని
త్యాగాలయమునౌను ధరణి నెపుడు
గీ:
దాన గుణమున విజ్ఞాన ధర్మమునను
సంస్కృతీసాంప్రదాయాల సర్వమందు
పేదలై సద్గుణము లందు విశదముగను
పేద గాని శ్రీమంతులౌ పేదవారి
వేలకోట్లున్న సద్గుణ పేదలిట్లు
పీల్చి వేదురునిసుమంత బెదురు లేక
మ:
కడు ఘోరంబగు శిక్షలెవ్వరికయా కాసింత నేరానికే
కడు పాతాలము చేరునెవ్వరిదయా జ్ఞానంబునిక్కాలమున్
గడు ఘోరంబులు చేయనడ్డుదలపంగా లేరునెవ్వారయా
చెడుపుల్ సైచెడి పేదవారెగద నిస్సిగ్గున్ ధరామండలిన్
బడవల్ నెత్తినకళ్ళుగల్గు ఖలులున్ పాపాలు సేయంగనే🍇🍇🍇🙏🙏🙏
[2/18, 10:37 PM] Poet Ithagoni Venkateshwarlu: రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:పేదరికము
సీ:
ధనము లేకున్నవానిని పేదవాడని
అందురునందరు నదినిజమగు
నీపేద చెమటయేనీపేద రక్తమే
నన్నమౌ ప్రాణమౌ నఖిలజగతి
నభివృద్ది సర్పంబు నకుపాలు పోదురు
కాటేయ వేటేయ కడకు దెలసి
ఈపేదరికమన్ననింతింత యనరాని
త్యాగాలయమునౌను ధరణి నెపుడు
గీ:
దాన గుణమున విజ్ఞాన ధర్మమునను
సంస్కృతీసాంప్రదాయాల సర్వమందు
పేదలై సద్గుణము లందు విశదముగను
పేద గాని శ్రీమంతులౌ పేదవారి
వేలు గలిగి సద్గణముల బేదలిట్లు
పీల్చి వేదురునిసుమంత బెదురు లేక
మ:
కడు ఘోరంబగు శిక్షలెవ్వరికయా కాసింత నేరానికే
కడు పాతాలము చేరునెవ్వరిదయా జ్ఞానంబునిక్కాలమున్
గడు ఘోరంబులు చేయనడ్డుదలపంగా లేరునెవ్వారయా
చెడుపుల్ సైచెడి పేదవారెగద నిస్సిగ్గున్ ధరామండలిన్
బడవల్ నెత్తినకళ్ళుగల్గు ఖలులున్ పాపాలు సేయంగనే🍇🍇🍇🙏🙏🙏
[2/20, 8:39 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: ~ పేదరికం ~
పొయ్యెలుగని గుడెసెకెపుడు
ఎదురుచూపు ఆరాటం
ఆకలంటూ ఏడ్చే ఊయలకెపుడు ఊపిరితో పోరాటం..
తొలి కిరణం వెలుగకముందే పొట్టపోరు నడకైనాక
గుంతల దారి అడుగుకు రక్తం రాసాక
ఒలికిన నీరు దాహం తీర్చని తీరైంది..
ఎండమావి బతుకు ఎంతవెతికిన
దొరకని ఒయాసిస్సై
కనుల చెలిమె ఇంకింది..
పేదరికపు పోరు అరుపులయ్యాక ఆయుధం లేని
రణం అనివార్యమయ్యాక
చావు బ్రతుకుల మధ్య
గంజినీరే కారణమయ్యింది..
ఏడ్వలేని
ఓర్వలేని
పేగుల మెలికలు గింజుకుని గింజుకుని
నలిగిపోతుంటే
పల్లెంలో మిగిలిపోయిన మెతుకులకై
వెతుకులాట
ఒక యుద్ధమైనపుడు
ఈ దేశమెటుపోతుందో..
అభివృద్ధి చెందుతున్న దేశం అంటూనే
ఆకలి కేకలనాపలేని
ఆకలి చావులనాపలేని వ్యవస్థ
పేదరికపు నీడలను మోస్తూనే ఎప్పటికినీ...
@సిరిమల్లెలు...
[2/20, 11:36 PM] కృష్ణమోహన్ గోగులపాటి: పేదరికం
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
పేదరికం...
ఏరోజుకారోజు రెక్కడితేకాని డొక్కాడని బతుకులు వారివి...
అన్నికాలాలకూ సమాంతరంగా స్వాగతం చెప్పే బాహ్యపు బతుకులు వారివి...
అప్పులు తేవడమే కానీ తీర్చడం కుదరని కుటుంబాలు వారివి...
చదువుకొనాలన్నా... కొనలేని దుస్థితి...
రోగమొచ్చినా... నొప్పొచ్చినా... ప్రభుత్వ దవాఖానాలే దిక్కూ... మొక్కూ...
పుల్లలేరుకొచ్చి...
పొయ్యి ముట్టిచ్చి...
ఊది ఊది ఊపిరి పోగొట్టుకునే బతుకులు...
కొత్త పండుగొస్తె పస్తులుండటమే తప్ప...
కొత్తబట్టలన్నవి ఎరుగలేని బతుకు...
పేదరికమన్నది పెనుశాపమంటాను
పేదరికము తోటె పెరుగు నిరక్షరాస్యత...
పేదరిక నిర్మూలన పేరుకే ఉన్నది
దేశాభివృద్ధికి పెనుముప్పు పేదరికం...
అందుకే
పేదరిక మిర్మూలనకై పాటుపడుదాం
పేదలకు తోచిన సహాయం చేద్దాం...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయుత, జర్నలిస్టు
9700007653
[2/20, 11:51 PM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి .హన్మకొండ 9000683826 శీర్షిక ఎవరు పేదవారు ? ? ? ********************ఏమిటి అంటే పేదరికమని .... లేని తనమా ... అవునవునది లేమితన మే .... లేకితనమే ... డబ్బు లేనినాడు కాదు పేదరికపు బాధ ... వయసు పెరిగిన పరిణతి లేకున్న .... ఎదుటి వారి గొప్ప ఒప్పలేని చోట .... అవును దాని నివాసం నిజమే ... ఉండీ ఇవ్వలేని దానం ...అహం తో చేసే అపాత్రదానం ... అవునది అవగాహనా , మానవతా రాహిత్య పేదరికమే ..... ఆరుగాలం కష్ట పడ్డ రైతు ప్రశాంతత ముందు , తనవారికే కాక ఎల్లరకు తిండి పెట్టే తృ ప్తి ముందు .... ఎవడి నెత్తినో చేయి పెట్టి కోట్లు కొల్లగొట్టి , అనుభవించలేక . . ఎప్పుడు ఎవరు ఎలా దాడి చేస్తారో ననే భయం ... అప్పుడు ఆతను కదా అసలైన పేద ... ఎంత తెలివి ఉన్న ... అది ఎవరికీ అర్దం కాకుంటే సున్న ... నిరుపయోగమే కదా ! అదో రకం పేదరికం
[2/21, 6:12 PM] Poet Bharathi: 9491353544
భాస్కర బాలభారతి
అనంతపురము
శీర్షిక పేదరికము
కూడూ గూడూ గుడ్డేకాదు
తోడూ నీడా లేక
నిలువెల్లా దహింపబడే
శాపమే పేదరికము !!
అవసరాలకు ఆదుకొనువారు లేక కొందరూ
ఇంట బోసినవ్వుల శిరులు
కరువైమరికొందరూ
సంతువుండీ సంరక్షించు వారు
దూరమై నిర్లక్ష్యానికిగురియై
మనోవైకల్యానికి
గురియై
కృంగిపోవుటకూడా
పేదరికమే !
అష్టైశ్వర్యాలు అనుభవిచి
అష్టదరిద్రదేవతాకోరల్లో చిక్కి
నికృష్ట నీచాతి నీచపేదరికాన్ని
చవిచూచి రాహుగ్రస్తమైన
రారాజు చంద్రులెందరో
ఈలోకంలో !!
చక్రవర్తియైన నలమహారాజు
దారిద్ర్య దేవత బాహువల్లో చిక్కి
నిలువ నీడలేక నడివీధుల్లో
నెట్టబడి
కట్టనపుట్టము మార్చుకొన
మరోవసనంలేక
అడవులవెంట బడుట
పేదరికపు శాపంకాదా? సత్యహరిశ్చంద్రుడు సైతం
అప్పులుదీర్చ భార్యను పనిమనిషిగా చేసి
తాను శ్మశాన శెయ్యలో
కాటికాపరిగా నివాసముండలేదా
పేదరికానికి వీరిజీవితమే
పరాకాష్ట !!
కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులెందరో
భూకంపాల రాకాసిలోయల్లో
చిక్కి సునామీభూతంకోరల్లో కోట్టుకుపోయిజోలెపట్టిన
భిక్షగాండ్లై
పేదరికంలో కొట్టుకు పోలేదా ?
గ్రహణం విడిచిన
చంద్రుడల్లే పేదరికం తాత్కాలిక మే !
నిగ్రహంతో ఓర్పు నేర్పుతో
శ్చమించి
పడిలేచీన కెరటమై పేదరికపు
కోరలనుండీ బయటపడు మార్గం అణ్వేషించు !
Comments
Post a Comment