[2/13, 2:02 PM] Poet Gundu Madhusudan మధురకవి: పాహి మాం పరమేశ్వరా పాహి పాహి!
(యత్యక్షరాలలో శి-వ-రా-త్రి)
రచన: మధురకవి గుండు మధుసూదన్
.
తే.గీ.
"శి"తిగళా! పరమేశ్వరా! "శి"వ! మహేశ!
"వ"హ్నిలోచన! కరిచర్మ"వ"స్త్రధారి!
"రా"జశేఖర! రాజేశ్వ"రా"! కపర్ది!
"త్రి"పురవైరి! ధూర్జటి! హరా! "త్రి"ణయన నతి!
.
స్వస్తి
.
పై రచనను నా బ్లాగులో వీక్షించడానికి క్లిక్ చేయండి:
http://madhurakavanam.blogspot.in/2018/02/blog-post.html
[2/13, 3:27 PM] కృష్ణమోహన్ గోగులపాటి: శివరాత్రి శుభాకాంక్షలతో
మీ
గోగులపాటి కృష్ణమోహన్
శివ శివ యని తలచిననే
భవహరుడేతెంచునుకదభక్తుల బ్రోవన్
శివుడే కద భయహరుడగు
శివుడే నవనాయకుండు శివుడే కృష్ణా
శివశివయని పలికినచో
శివుడేప్రత్యక్షమగుచు చెంతననిలచున్
శివుడేయభయంబిచ్చును
శివనామస్మరణ సేయ శివమగు కృష్ణా.
(శివమ్ అంటే శుభం అని)
పస్తులుండినాము పగలంత పూజతో
జాము రాత్రి వరకు జాగరణతొ
శివుని పూజ చేస్తి శివరాత్రి దినమున
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
[2/13, 4:20 PM] Poet Satya Neelima: శీర్షిక : శివరాత్రి,
రచయిత :సత్యనీలిమ.
🔱🌙💧☄🌪🌫💨🌙🔱
శివ శివ అని పలుకవే మనసా
శివుని మహిమలు తెలుపవే మనసా..............................(2)
పంచభూతాల అధిపతి
పంచాక్షరాల మంత్రనిది
పంచామృత అభిషేక ప్రియ
పంచప్రాణాలు నీవేనయా
..........................(శివ)
శశి జఠా మకుట ధారి
భక్త హృదయ విహారి
నాగ హార కంఠ ధారి
త్రినెత్ర అలంకారి
............................(శివ)
కన్నప్ప భక్తికి మెచ్చి
మార్కండేయునికి వరమిచ్చి
ప్రహ్లాదుని రక్షించి
గంగమ్మ కే నీ శిర స్థానమిచ్చి
............................(శివ)
గజాసుర సంహారి
గౌరీ పూజాఫల అర్ధనారి
లింగరూప ఆవిర్భావి
ఢమరుక నాద తాండవ శంకరి
............................(శివ)
🌙🔱💨🌫🌪☄💧🌙🔱
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
[2/13, 4:37 PM] Poet Satya Neelima: శీర్షిక : శివరాత్రి,
రచయిత :సత్యనీలిమ.
🔱🌙💧☄🌪🌫💨🌙🔱
శివ శివ అని పలుకవే మనసా
శివుని మహిమలు తెలుపవే మనసా..............................(2)
పంచభూతాల అధిపతి
పంచాక్షరాల మంత్రనిది
పంచామృత అభిషేక ప్రియ
పంచప్రాణాలు నీవేనయా
..........................(శివ)
శశి జఠా మకుట ధారి
భక్త హృదయ విహారి
నాగ హార కంఠ ధారి
త్రినెత్ర అలంకారి
............................(శివ)
కన్నప్ప భక్తికి మెచ్చి
మార్కండేయునికి వరమిచ్చి
విషబారి నుండి దేవతలను రక్షించి,
అమృతాన్ని పంచి
గంగమ్మ కే నీ శిర స్థానమిచ్చి
............................(శివ)
గజాసుర సంహారి
గౌరీ పూజాఫల అర్ధనారి
లింగరూప ఆవిర్భావి
ఢమరుక నాద తాండవ శంకరి
............................(శివ)
🌙🔱💨🌫🌪☄💧🌙🔱
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
[2/13, 4:40 PM] Poet Satya Neelima: శీర్షిక : శివరాత్రి,
రచయిత :సత్యనీలిమ.
🔱🌙💧☄🌪🌫💨🌙🔱
శివ శివ అని పలుకవే మనసా
శివుని మహిమలు తెలుపవే మనసా..............................(2)
పంచభూతాల అధిపతి
పంచాక్షరాల మంత్రనిది
పంచామృత అభిషేక ప్రియ
పంచప్రాణాలు నీవేనయా
..........................(శివ)
శశి జఠా మకుట ధారి
భక్త హృదయ విహారి
నాగ హార కంఠ ధారి
త్రినెత్ర అలంకారి
............................(శివ)
కన్నప్ప భక్తికి మెచ్చి
మార్కండేయునికి వరమిచ్చి
విషబారి నుండి దేవతలను రక్షించి,
గంగమ్మ కే నీ శిర స్థానమిచ్చి
............................(శివ)
గజాసుర సంహారి
గౌరీ పూజాఫల అర్ధనారి
లింగరూప ఆవిర్భావి
ఢమరుక నాద తాండవ శంకరి
............................(శివ)
🌙🔱💨🌫🌪☄💧🌙🔱
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి.
[2/13, 5:38 PM] Poet Musthakheem విన్నర్: శీర్షిక: శివ రాత్రి
తేది :13-02-2018
కవి :విన్నర్ (ముస్తఖీమ్)
మహిమ గల రాత్రంత ..మహా శివ రాత్రి ..!!
దేవ దూతలే దివి నుండి భువి
కేగే ..దివ్య రాత్రి ..!!
తన భక్తులంతా ..యేడాది
మొత్తం లో యెదురు చూసే యెదురు చూపుల రాత్రి ..మహా
రాత్రి ఇది !!
సమస్త పాపములు ..తొలగించు , పుణ్యంలు ..ప్రాప్తించు రాత్రి !!
యేటిలో మునకేసీన ..త్రుటిలో
దుర్గుణమ్ములు సమసు నంట!!??
వణికించిన చలి సైతము
శివా ..శివా .. నంటూ పరిగెత్తు
నంటా!!
శివ-పార్వతుల ..స్వైర విహారము ..భక్తుల పాలిట ..
వరముల భాండాగారము !!
భోళా శంకరుడు ..భలేగా ..
స్రుష్టించిన ..రాత్రి ..అదే , అదే ..
మహా శివ రాత్రి ..మహిమ గల రాత్రి !! అందరికీ ..శుభాకాంక్షలతో ..
రచన:విన్నర్ , కొల్లాపూర్ .
97052 35385.💐💐💐💐💐💐💐💐💐💐💐
[2/13, 6:40 PM] అంబటి Poet Bhanu Prakas: 🌷🙏🌷
అంబటి భానుప్రకాశ్.
జోగులాంబ గద్వాల.
🌷🙏🌷
*సాహితీ మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
సీ.
శివరాత్రి పర్వంబు శ్రీకరంబుగవేడ,
పరవశించిభవుండె ! వరములొసగు
శివ నామ మహిమయే చిరజీవు జేయును
శివుని దలచి నంత చింత దొలగు,
హరనామ కీర్తన హరియించు పాపంబు
హాలాహలమయిన హాయినొసగు
సమవర్తి భయమేల శంకరున్ దలచిన,
సాగివచ్చునుగాదె శక్తితోడ,
ఆ.వె.
లింగరూప ధరుడు నంగనమణిగూడి,
వెలసినాడు ధరణి వేడ్కమీర
ఆపదేల నుండు ఆలంపురీశుడా
వేదనంబు దీర్చి మోదమొసగు.
🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
[2/13, 6:55 PM] +91 97048 40963: 🌹🌹🌹🌹🌹🌹
సీస పద్యం
శ్రీశైల శివదేవ, శ్రితపోష మహదేవ
మహిలోన మముగావు మంజునాథ!
జంగమ దేవర జగమంత నీవేను
జయజయ శంకర జయము గొలుప!
పాలలోచన, పాహి,పార్వతీ వల్లభా!
దేహి యనుచు గొల్తు దేవ దేవ!
లింగ రూపుడ నీవు బృంగి నందులతోడ
అంబసహితుడవైనాదరించు
తే.గీ.
గరళకంఠుడ,ముక్కంటి గరిమనేల
ఢమఢమయనుచుమ్రోగంగ ఢమరుకంబు
భళిర శరభయ్య, బసవయ్య బంధువయ్యి
వినుత లయకార భువినేల వేగరావ!
సీసపద్యం
కైలాసగిరివాస,కాశికా పుర యీశ
భక్తపాలక!భవభంజనయ్య!
ముక్కంటి మిముగొల్చి ముదమొప్ప వేడినా
ఘనకోర్కెలే దీర్చి గాచువాడ!
భక్త కన్నప్పచే భక్షించి మాంసంబు
ముక్తినొసగిన వో ముద్దులయ్య!
అర్ద నారీశ్వరా!ఆది దంపతులయ్యి
ఆదర్శభావంబుకాద్యులయ్య
తే.గీ.
నిత్య మంగళ రూపంబు నిఖిలమయ్యి
సత్యమార్గంబు జూపెడి తత్త్వమయ్యి
భక్తి ముక్తుల దెలిపెడి భావమయ్యి
నన్ను నడిపించు నాలోన నావవయ్యి!
మహా శివరాత్రి శుభాకాంక్షలు
💐💐💐💐💐💐
బసవోజు సుధాకరాచారి
పండిత పరిషత్తు జిల్లా అధ్యక్షులు, వనపర్తి జిల్లా.
[2/13, 7:15 PM] Poet Ithagoni Venkateshwarlu: ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:శివరాత్రి
భవబంధమ్ముల గూరుకొంటు ధరలో ప్రాపంచికస్ఫూర్తికై
నవిరామంబగు సంపదల్ గుడుచుటే నజ్ఞానమన్ రాత్రియౌ
శివలింగోద్భవమన్న నట్టితమసున్ చీర్ణించ చిహ్నంబు ని
ట్లు వరిష్ఠంబగు తత్వమున్ నిలుపుటే రీతౌను నీతౌను మ
ర్మవితానంబులెరుంగకుండ మనుజుల్ ప్రార్థించగా వ్యర్థమన్
వివరాలన్నిపురాణముల్ దెలిపెడిన్ నిక్కంబిదే భారతా
[2/13, 7:48 PM] అంబటి Poet Bhanu Prakas: 🌷
అంబటి భానుప్రకాశ్.
జోగులాంబ గద్వాల.
🌷🙏🌷
కం.
గంగాధర !గౌరీవర!
భృంగీ గణములను జేరి భీతిన్ గొలిపే!
మంగళకరమౌ! శశిధర!
లింగంబైనిల్చి నేడు లీలన్ జూపున్ .!!
🌷🙏🌷
[2/14, 12:30 AM] Poet Mastan Vali: అంశం : శివరాత్రి
కవి : మస్తాన్ వలి.
శీర్షిక : *మహా శివరాత్రి*
🔱 🕉🔔 🌏🌕 🌒🌒 🌕🌏 🔔🕉 🔱
శివ శివ శంకర
హర హర శంకర
శంభో శంకర
భోళా శంకర
లోక రక్షకా
దుష్ట శిక్షకా
నీవే నీవే
లింగ రూపుడా
విష్ణు, బ్రహ్మ ల
వాదానికి
కొత్త రూపమే
లింగ స్వరూపుడై
వెలిసిన వాడా
హర హల శంకర
శివ శివ శంకర
రాత్రులు ఎన్ని వున్నా
శివ రాత్రులు ఎన్నివచ్చినా
మాఘమాసాన వచ్చే నంట
మహా శివరాత్రి శోభాయంగా
లింగ రూపమూ దాల్చు కొంటూ
కనుల ముందు లింగ రూపమూ
జనులకు విందు శివుని రూపమూ
జాగారముండు శివుని యందు
పునఃర్ జన్మ వగ లేకుండ గనే
జీవాత్మ శివుని చేరు కొందువు
శివ శివ శంకర
హర హర శంకర
నీవే నీవే లింగ స్వరూపుడా
మనసు లగ్నం చేసి ఆరాధించు
ఫలము తోనో, జలము తోనో
అభిషేకించు ,అభిషేకించు
శివుని రూపమైన లింగ రూపాన్ని
అభిషేకించు....
ఆనందము,ఆల్హాదము
ఐశ్వర్యము, సకల సౌఖ్యము
ప్రసాదించు ప్రసాదించు
ఈ మన లింగ రూపుడు
పాలు,తేనె తో అభిషేకం
సర్వ సౌఖ్యాలు,తేజో వృద్ధి
ప్రసాదించునూ....
చక్కెర, నెయ్యి తో అభిషేకించు
దుఃఖ నాశనము జేసీ,ఐశ్వర్య మునూ
ప్రసాదించు నూ...
పసుపు కుంకుమ తో అభిషేకం
ధనము, సౌఖ్య ము
ప్రసాదించునూ....
దేహశుద్ధి చేసు కొని
మనసు మాలిన్యంతో
నీ... తపము, జపము
చేసెదరు...
మనసు శుద్ధి చేయుటకై
నీవు... వేగిన రావయ్యా
మా ... కలియుగ మానవుని
రోగం తీర్చుటకు,మనిషి గా
మార్చుటకు మహా శివరాత్రి
లింగ రూపుడవై రావయ్యా
శివ శివ శంకర, హరహర శంకర
నీవే ,నీవే లింగ స్వరూపుడా
🔱🕉🔱 🔔 🌏 🌕📢🌕 🌏🔔 🔱🕉🔱
షేక్.మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
సెల్ : 99 483 57 673.
[2/14, 1:35 AM] +91 99632 24187: 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
********* *శివశివా....!!**********
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
కందం:
శివుడందురు జనులందరు
భవుడందురు భక్తజనము బారులుదీరీ
నవులందరు ప్రశ్నింతురు
శివుడనువాని కెటులుండు శిగలో గంగా??
✍ 🌺ఎద్దు'లా'-వనపర్తిజిల్లా(13.2.2017)🌺
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[2/14, 1:35 AM] +91 99632 24187: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
***** *కాశీనాథా...?!* *****
కందం:
ఇడుములు దరిజేరునపుడు|
నుడువులు నుడువక గరళమునుగ్గుగదినినీ|
వడలక శివుడైతివిగద|
కడగండ్లను మాపుటెట్లు కాశీనాథా?!|
✍🌸ఎద్దు'లా' - వనపర్తిజిల్లా(13.2.2018)🌸
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[2/14, 1:56 AM] +91 99632 24187: 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
*!!!*శివశివా*!!!*
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
కందం:
శివుడందురు జనులందరు
భవుడందురు భక్తజనులు బారులుదీరీ
నవులందరు ప్రశ్నింతురు
శివుడనువానికెటులుండు శిగలో గంగా??
✍ఎద్దు'లా-వనపర్తిజిల్లా(13.2.2018)
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
[2/14, 11:54 AM] +91 94411 68976: శివత్వం
+++++
వెలుగు జిలుగులను చూడడమే కాదు..చీకటిలోని సొబగులను దర్శించడం మే శివత్వం. అంతా నాదేనను స్వార్థం మూఢత్వమో లేక అనంత జీవన సత్యాన్ని తెలుసుకొనే ప్రయత్నమో!
శూన్యం నుంచే అమృత, అద్భుత సృష్టి ఉద్భవించిందనే విజ్ఞాన శాస్త్రపు మూలాలను స్పృశించిన అనన్య అంతర్లోకమే శివ తేజం.
వాదాలను,వివాదాలను,బేధాలను,ఖేదాలను నాదమయంగా మలిచే రాగ తరంగం.
అన్ని సాధనలను, అన్ని శోధనలను అంతఃకరణం వైపు తిప్పి తమస్సును,ఉషస్సు ను ఆత్మలోనే సాక్షాత్కరింపజేసే అమందానంద భావ శిఖరం శివం.
ఆ మమత్వం,సమత్వ దీప్తి ఈ శివ రాత్రి కావాలని
ధరిత్రి స్వర్గమై నిలవాలని..
శుభాకాంక్షలతో.
శివోహం..
జయపాల్.

Comments
Post a Comment