అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా...
శీర్షిక : మాతృభాష..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మాతృభాష నేర్చుకో
మమకారం పెంచుకో
మంచిఏదో చెడుఏదో
అన్నింటినీ తెలుసుకో.............(మాతృభాష)
ఉగ్గుపాల భాషరా
ఉన్నతమై నిలిచెరా
పరభాష మోజులో
దానినెపుడు మరవకురా.........(మాతృభాష)
అమ్మభాష తెలుగుగా
అక్షరమై వెలుగగా
వేసితి విధ్యాభారతి మెడలో
కవితార్చన మాలగా..............(మాతృభాష)
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి....
[2/21, 11:05 AM] కృష్ణమోహన్ గోగులపాటి: ప్రపంచ మాతృభాషాదినోత్సవం సందర్భంగా
పంచపద్యరత్నాలు
గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
తెలుగుభాషలోని తేటతెల్లపదము
వ్యాకరణముతోటి వాసికెక్కి
పద్యసంపదగల పదునైన భాషయౌ
జ్యోతి నవ్య కృష్ణ జూఁడుమఖిల
మరువకండి మీరు మాతృభాషనెపుడు
భావివార్కితెలుపు భాద్యతగొని
మధురమైనభాష మన తల్లిభాసయౌ
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
అమ్మ నాన్న పలుకు లానవాలేలేదు
మాతృ భాష మీద మక్కువేది
తెలుగు మాటలాడు తెలుగు ఘనతచాటు
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
అమ్మ నాన్న యనెడి నాత్మీయ పలుకులు
పద్య సంపదగల భాష మనది
తేనెలూరుభాష తేటతెలుగుభాష
జ్యోతి నవ్య కృష్ణ జూఁడు మఖిల
తెలుగంటే నాకు భయము
తెలుగంటే వ్యాకరణము తెలుగే ఘనమౌ
తెలుగంటే ప్రేమేమరి
తెలుగును నే నేర్చుకొందు తెలియగ కృష్ణా
ప్రపంచ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలతో...
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
9700007653
[2/21, 11:16 AM] Poet Kusumanchi Sridevi: కుసుమంచి శ్రీదేవి
శీర్షిక-తెలుగు వైభవం
-------------------
తెలుగు ముంగిట
జన్మించి...
తెలుగు తల్లి ఒడిలో
సేదతీరి..
అచ్చులు..హల్లులు
దిత్వాలు..సంయుక్తాలు..సంశ్లేషాలని
ఆభరణలుగా ధరించి,
సంధులు..సమాసాలు..అలంకారాలతో
ఎంతో ప్రకాశవంతమైన వర్ఛస్సు కలిగిన
తెలుగు తల్లి దీవెనలతో..
మన తెలుగింట పురుడుపోసుకొన్న
మంచి విలువలతో కూడిన
సంస్కృతి,సాంప్రదాయాలతో పాటు..
బ్రతుకు తెరువు కోసం
ప్రపంచ విజ్ఞానం నేర్చి....
రెక్కలు బలపడ్డాయనే భ్రమలో
చల్లని దీవెనలిచ్చే..
విలువలు నేర్పే ఆ తల్లిని మరిచి..
పరాయి భాషా వైపు పరుగులుతీసి,
మన సంస్కృతి,సాంప్రదాయాలను
తూర్పూర బెట్టి...ఎండమావులను
చేస్తున్నారు...నేటి తరం
సృష్టిలో ఎన్నిప్రేమలు లభించిన...
అమ్మ ప్రేమలో మాధుర్యాన్నివ్వలేవు...
బ్రతుకు తెరువు కోసం
ఎన్ని భాషలు నేర్చిన...
మాతృభాష తియ్యదనం
ఇసుమంతైన పరాయిభాషలో లభించదు...
[2/21, 11:17 AM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి .హన్మకొండ 9000683826 శీర్షిక -అమ్మలా కమ్మన . ******* మాత తర్వాతే గురు ,పిత రులు
మాతృ భాష పిమ్మటే ఇతరాలు
బలం ఇచ్చే మన తిండి అపరాలు
బలుపు తెచ్చే తిండి కై ఆపు నకరాలు
అమ్మ భాష కాదా పున్నమి వెన్నెల
విస్తరింపజెయి నలు దెసల
కమ్మని గడ్డ పెరుగు నా తెలుగు
ఏ దేశ మేగినా నీ వల్లే వెలుగు
అజ్ఞాన చీకటి చీల్చే కాంతి శరం
అజ్ఞాతంగా మార్చి అవ్వకు పరభాష పరం
తియ్యనైన తేనెల సోన మన వరం
అమ్మ భాష మరిస్తే అమ్మను మార్చినంత శాపం
పొట్ట నింపగ కావాలి పర భాష - లేదు అవరోధం
అందుకు అవసరం లేదు సొంతభాషా విరోధం
మనసులో మాట చెప్పగ తేలిక చేసేది మాతృ భాష
నీ బాధల్లో ఓదార్పై నిలిచేది అమ్మ శ్వాస
ఆక్సిజన్ లా ఆయువు పోసేది అమ్మ భాష
గుండె మండే వాయువు పర ఘోష
[2/21, 11:43 AM] Poet Sripada Shiva జిరసం: శివానీలు... (మాతృభాష)
---------------
1.
అక్షర చిన్కులె
వరదలై
నవరస కవితలౌ
తెలుగు నేలలు
2.
అక్షర సమీరమే
శ్వాసయై
కవితా సుగ్రంధాలౌ
తెలుగు పదములు
3.
అక్షర వెల్గురేడు
వేకువై...
కమలాల తోటలౌ
తెలుగు మాటలు
4.
అక్షర రేరాజు
క'వనము'ల
కలువల తేనీయలౌ
తెలుగు పాటలు
5.
అక్షర విహంగాల
సమాగమం
కవన విపంచికలౌ
తెలుగు సౌరభం
6.
హృదయాల
కలకంఠముల
అక్షర రవములౌ
తెలుగు వైభవం
-----------------------------
రచన:YesSPశ్రీపాదశివప్రసాద్
8978835919
[2/21, 11:53 AM] అంబటి Poet Bhanu Prakas: 🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀
అంబటి భానుప్రకాశ్.
9948948787.
----------------------------------------
*మాతృభాష మాధుర్యం.*
-----------------------------------------
సీ.
మాతృభాషలనందు మమకారమును జూప
మాటలాడుచునుంద్రు మనసు మెచ్చ,
ఆంధ్రత్వమును జూప అడుగులే వేయకన్
ఆంగ్లభాషల మాట లాడుచుంద్రు,
నేడిదే మొదలంచు నేర్పుతో మాటాడి
నాటకం బాడెరు నల్గు రందు,
చిత్తశుద్ధిగలేని శివపూజలన్నట్లు
చిత్తమందున లేక చిందులేల !!
తే.గీ.
వట్టి మాటలు మానర!వసుధ నందు,
మరువకుండగ మాటాడు మాతృభాష
దేశభాషలలోపల తెలుగు లెస్స
నిలుప వలయును మనభాష నేర్పుతోడ,
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
[2/21, 11:55 AM] Poet Telgu Thirumalesh: ✍తెలం(గు)గాణ భాషా వైభవం🖌
లేదా
తెలుగు భాషా గొప్పతనం
ప్రాచీనమైనది నా తెలుంగు భాషా
ఆంధ్రపాలకులతో ఆంధ్రభాషగా నాడు
తెలంగాణతో తెలుంగు భాష గా మారెను నేడు
అచ్చమైన పూర్ణానుస్వరమైన భాష
వినసొంపయిన యాస భాష
ఇంపు సొంపయిన గ్రాంథిక భాష
చారిత్రక జానపద పలుకుబడుల భాష నా తెనుగు భాష
ప్రత్యక రాష్ట్రము తో మురిసిపోతుంది
నిర్మలమై పరిమళమై మెలుగుతుంది
ప్రపంచ తెలుగు మహాసభలను తిలకిస్తుంది
కమ్మనైన తీయనైన ఆత్మీయభావాలను
తమ కలంతో కదిలించిన తెనుగు కవులెందరో
అందరికి వందనాలు... వందనాలు
నా తెలంగాణ సంప్రదాయ రచయిత
నా తెలంగాణ ఆదికవి పాల్కురికి
మధురభక్తి సహజకవి పోతన
తెలంగాణ తొలి పొద్దు మన కాళోజి
నా తెలంగాణ కోటి రతనాలవీణ
అని చాటిన నా దాశరథి
తొలి తెలుగు రామాయణ రచయిత గోన బుద్ధారెడ్డి
హేతువాద రచయిత నా సుద్దాల హనుమంతు
దాశరథి శతక కర్త కంచర్ల గోపన్న
గోలకొండ సంచిక సాహితీ వేత్త సురవరం
జ్ఞానపీఠ గ్రహీత సాహిత్య ప్రభుత నా సినారె
ప్రాసాత్మక పదాలతో మాతృ భాష వెలుగులు
చిందిస్తున్నాయి నేడు ప్రపంచానికి వెలుగులు
అమ్మ లాంటి అలవాటైన భాష
ఆంగ్ల భాష తో కాకూడదు మృత భాష
మాతృ మూర్తిని గౌరవిద్దాం
మాతృ భాషను కాపాడుకుందాం
తెలంగాణ సాహిత్యం లో
సాహితీ మకుటాలెందరో
అందరికి వందనాలు... వందనాలు
ఇట్లు
నా సొంత రచన
✍ తెలుగు తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
ఎం. వి.రామన్ ఉన్నత పాఠశాల
ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు
తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షులు
సెల్ : 9908910398
[2/21, 11:56 AM] అంబటి Poet Bhanu Prakas: అంబటి భానుప్రకాశ్.
9948948787.
----------------------------------------
*మాతృభాష మాధుర్యం.*
-----------------------------------------
సీ.
మాతృభాషలనందు మమకారమును జూప
మాటలాడుచునుంద్రు మనసు మెచ్చ,
ఆంధ్రత్వమును జూప అడుగులే వేయకన్
ఆంగ్లభాషల మాట లాడుచుంద్రు,
నేడిదే మొదలంచు నేర్పుతో మాటాడి
నాటకం బాడెరు నల్గు రందు,
చిత్తశుద్ధిగలేని శివపూజలన్నట్లు
చిత్తమందున లేక చిందులేల !!
తే.గీ.
వట్టి మాటలు మానర!వసుధ నందు,
మరువకుండగ మాటాడు మాతృభాష!
దేశభాషలలోపల తెలుగు లెస్స
నిలుప వలయును మనభాష నేర్పుతోడ!!
🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏
[2/21, 12:12 PM] Poet Musthakheem విన్నర్: 💐💐అమ్మ భాష💐💐
అమ్మ భాష కమ్మనైనది ,
సహజమైనది ..సరళమైనది !!!
మదిలో పారే భావ పరంపరల
నది ని ఆహ్లాదం తో ..ఆనందం తో ..ప్రవహింపజేస్తుంది !!!
మర్యాద మన్నన లను , హర్షాతిరేకాలను , సంతోష
విషాదాలను ..సులభంగా ..
సులక్షణంగా వ్యక్తం గావిస్తుంది !!!
పలకరింపుల పవళింపులను ,
మాటల మాధుర్యాలను ..
వినసొంపుగా , విలక్షణంగా
వినిపింప జేస్తుంది !!!
యెన్ని బంధాలున్నా , గాని
అమ్మ నుండే ..నాన్న నుండే
మొదలై తీరుతాయి ...??!!
అందుకే అమ్మనాన్న ల నుండి
నేర్చిన భాష..ఈ ..దేవుని
సృష్టి లో వర్ణించనలవి గానిది ..??!!
మాతృ భాష మహత్యం, మహిమ..ఇంతింత కాదయా ..??
మాతృ భాష లేనిదే ..నీవు లేవు
నీ పదవి లేదు ...??!!
నీ ఉనికికి మూలం ఇదే ..ఇదే ..
నిస్సహందేహంగ ..మనిషి గొప్పతనమంతా ..మాతృ భాషా గొప్పతనమే ...!!!?
అంతర్జాతీయ మాతృ భాషా
దినోత్సవ శుభాకాంక్షల తో ..
రచన: విన్నర్ , కొల్లాపూర్.
[2/21, 12:58 PM] Poet Padma Tripurari: తీయని తెలుగు పదము
**********************
కమ్మనైన అమ్మ పిలుపు
కరుణనొసగు నాన్న తెలుపు
తీయనైన తెలుగు పలుకు
కులుకులొలుకు చిలుక పలుకు
కొమ్మ మీది కోయిలమ్మ
మధుర స్వరము తెలుగు పలుకు
చిగురు పచ్చ చిగురంటి
పచ్చనైన పదము తెలుగు
పసిడికాంతి వెదజల్లే
అపరంజి తెలుగు వెలుగు
అరుణ కిరణ సూరీడి
తేజస్సే తెలుగు పదం
చల్లనైన వెన్నెలున్న
జాబిల్లే తెలుగు స్వరం
వయారాల మయూరిలో
పద నాట్యమె తెలుగు పథం
మణులవీణ తెలుగు జాణ
జన జాగృత జయవీణ
గలగల సెలయెటి అలల నురగ
వెన్న జున్ను పాల మీగడ తరగ
తరతరాల కథల సుధల సుమధుర మధుర పదము
పదము పదము మమతగొలుపు మందిరమే జ్ఞానతెలుగు.
మల్లెలమ్మ విరిగంధం
మంచి మనసు మకరందం
మందారపు సుమగంధం
ముద్దబంతి పూచందం
అమ్మభాష సొగసందం.
పద్మ త్రిపురారి.
[2/21, 1:42 PM] +91 96189 61384: తెలుగు వెలుగు
కందనికే అందము నాతెలుగు
కవులకవితల పూలసాగు నాతెలుగు
కమనియ అక్షరాల కూర్పు నాతెలుగు
మాఅమ్మ కంఠధ్వని నాతెలుగు
తేటగీతి తేనె పలుకు నాతెలుగు
తేనెపట్టు కూర్పు వర్ణ అక్షరమాల
అక్షరాలను పదాలుగాపేర్చగా
పదాలను అర్థవంతమైనపదహరాలుగాకూర్చగా
సమర్పించుకున్నారు తెలుగుభాష తల్లికి
సుస్వరాలసుమదురకవితాఅక్షరమాలతి
ఆటవెలది అందం నా తెలుగు
ఆదికవి నన్నయ్య పలుకులు నాతెలుగు
అజంతపదవీనలతీగసాగునాతెలుగు
చదువులమ్మపూలవడినాతెలుగు
అమ్మ భాష తెలుగు గా
అక్షరమై వెలుగు గా
మత్తకోకిల మనసారా పాడిన పద్యంనాతెలుగు
కోకిలమ్మ కూతసాగునాతెలుగు
జీవితాన తీరర్భలేని తల్లి ఋ ణంతెలుగు
ఉత్పలమాల తోనా తెలుగుతల్లికి పూలపద్యాలమాల
చంపకమాతోనాతెలుగు తల్లికిచందన పద్యాల మాల
రచన
ఉప్పరి తిరుమలేష్MA.BEd
తెలుగు ఉపాధ్యాయుడు
జీనియస్ హై స్కూల్ వనపర్తి
చరవాణి9618961384
[2/21, 1:45 PM] Poet Musthakheem విన్నర్: అంశం: అంతర్జాతీయ మాతృ
భాషా దినోత్సవం
శీర్షిక:మా మంచి భాష-మాతృ భాష
కవి:విన్నర్ , కొల్లాపూర్
తేది:21-02-2018
ఇది అమ్మ ఒడి లో నేర్చిన భాష!!
ఇది అమ్మ బడిలో నేర్చిన భాష!!
ఇది అమ్మ-నాన్నల గుడిలో నేర్చిన భాష!!
ఇదే ..ఇదే ..
అమ్మభాష, మన మాతృ భాష!!!?
అమ్మ-నాన్నల..లాలిత్యం లో
అమ్మ-నాన్నల ..పారవశ్యం లో
తనయులకు అబ్బిన భాష!!!
అమ్మ -నాన్నల పెంపరికం తో
అమ్మ-నాన్నల ప్రేమానూరాగాలతో
తమ వారసులకు తిలకం దిద్దిన భాష!!!
మంచి సహజ భావ వ్యక్తీకరణకు ..
తీయతీయని భావాలకు ..
స్వచ్ఛమైన ఆలోచనలకు ..
ఆత్మీయ బంధాలకు ..
సొగసులద్దిన భాష!!!
తల్లి భాష, అమ్మ భాష, మాతృ
భాష..పుట్టుకతో వచ్చిన భాష,
పరభాష కూడ మాతృ భాష
తోనే ..నేర్చినది !!??
మరవకోయీ ..విడవకోయీ
మాతృ భాషను !!!??
రచన: విన్నర్ , కొల్లాపూర్.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐
[2/21, 1:57 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
21/02/18
~ అరువు తెచ్చుకోవాలి ~
అ ఆ లిపుడు అరువు తెచ్చుకోవాలి
మాతృభాషాదినోత్సవమంటూ
కొత్తగా ముస్తాబు చెయ్యాలి
ఉగాదికి ఇసరలను మెరిపిచ్చినట్టు
పొలాలకు గంగిరెద్దులను తయారుచేసినట్టు
సంక్రాంతికి రంగులతో వాకిళ్ళను మెరిపిచ్చినట్టు కొత్త శోకులు చెయ్యాలి..
పరాయి భాష మోజులో లక్షలకు లక్షల పెట్టుబడి చదువులు నేటి మోజయ్యాక
ఒక్కరోజు తలపయ్యింది మాతృభాష
మరచిపోని..
రక్తంలో కలిసివున్న భాషను బలవంతపు వెలివేత చేసాక ఇంతకన్నా ఎక్కువ ఏమిచేయలేము కదా...
అమ్మ ను మామ్ చేసాక
నాన్నను డాడ్ చేసాక
సిస్, బ్రో;అంకుల్, ఆంటిలంటూ
అతుకుల బొంతను కప్పుకునే సరిహద్దులు దాటిన పయనం నేటి విచిత్రం..
భాషను ఖూనిచేసేవారేగానీ
భాషకు ప్రాణమిచ్చేవారెవరు చెప్పు
ఆత్మీయ స్పర్శలను,
అమ్మ భాషను మర్చినట్టు
నటించే నటనకు ఆస్కార్ కూడా చిన్నబోద్ది..
ఆకలేసిన,
బాదేసిన అమ్మగుర్తచ్చిన్నట్టే
చిన్నపుడు దిద్దుకున్న అక్షరాలపై ప్రేమను
పలకపై తుడిచినంత సులువుగ మర్చి పరాయి భాష పై ప్రేమను తీరందాటిస్తున్నాం...
ఉంగా ఉంగా అల్లరులన్నీ
చైల్డ్ కేర్ సెంటర్లలో సేదదీరాక
రేపటి తరానికి
మన తెలుగు భాష వారసత్వం ఎలా బదిలి చేయబడుతుంది..?
ఎలా ముందుతరానికి తరగని ఆస్థిగా కొనసాగబడుతుంది..?
@సిరిమల్లెలు...
[2/21, 5:36 PM] Poet Ithagoni Venkateshwarlu: రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
తెలగుభాష వైభవము
సీ:
తేనేతో నిను పోల్చలేను తెలుగుతల్లి
చెడు నొకచుక్కనీరిడిన తేనె
మల్లెలతోపోల్చ మరిభయమాయెనే
గంటకే వాసన కానరాదు
వెన్నెలతో పోల్చమన్న కూడభయమే
అమవాస నాడేమిటన్న యనరె
గంగమ్మతో పోల్చగా పూనుకొనలేను
కాలుష్య సర్పంబు కాటువేయు
గీ:ఇతర భాషలు కలసిన ఇంతచెడక
కలుపుకొని యమరత్వము కలుగజేసి
పోల్చ ఒకవస్తువేలేక పొల్చు తల్లి
పద్య గేయ వచన కథ బహువిధాల
నీవిరాట్స్వరూపమ్ము సంధింతు హృదిని
[2/21, 9:22 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు:
పాలకుర్తి నాగజ్యోతి
కాగజ్ నగర్
21/02/18
~ నేర్పిత్తనుల్ల ~
ఇగ నే బుట్టిన ఊరి భాష గిట్లనే వుంటది
సదువుకుంటే మాత్రం మాట మార్తదా
నా రాత మార్తద
అగో గా కాలేజ్ కి బోయిన్న
ఊరి పిల్లంచిందంటు నవ్వుతలు
గీమేనోపాలి మాట్లాడించుండని ఎకసెక్కం జేత్తరు..
మాయమ్మ గిట్లనే మాట్లాడతది
ఆల్లయమ్మ గట్లనే ముచ్చట్లెడతది
గాళ్ళుశెప్పిన భాసనే నే నేర్సుకున్నది
గిపుడు మాయిండ్లల్ల అందరం గిట్లనే ముచ్చట్లెట్టుకుంటం..
దుకాణం బోదాము అత్తవాయే అక్కంటే
పక్కింటోల్లపిల్ల నాతోడచ్చింది
ఆల్లదంటే మాటకు ముందో అండి మాటెనకో అండి
అబ్బో అదర్థం గావాలంటె పదైదు నిమిసాలు పట్టుద్ది నాకు..
ఇదేం యాసంటు నామాటకు నవుతరుల్లా అందరు
నే పట్టించుకోనబ్బ
పుట్టిందిక్కడ
పెరిగిందిక్కడ
రేపు మా మామను లగ్గమాడినంక అమెరికాబోతకదా
లేలే ఆల్ల భాస నే నేర్సుకోనబ్బ
గదంటే నాకస్సలు బడదు
నిజం జెప్తున్న
గక్కడ గీ భాసను యాసను అందరికీ నేర్పత్తనుల్ల
తెలుగును అమ్మపేమలా పంచత్తనుల్లా..
గోరుముద్దల తినిపిత్తనుల్లా..
నను నమ్ముండ్రి మల్ల..
@సిరిమల్లెలు...
[2/21, 10:14 PM] Poet Mastan Vali: ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...
కవి : షేక్. మస్తాన్ వలి.
శీర్షిక: *మాతృభాష మరిచినవాడు వ్యర్థ మానవుడే*
🖋 …🎂⛳ 🏹 . 👑....✒🖌🖍📝✏
తల్లి పాల రుచి ... తెలియని వాడు
మాతృ భాష నే ... మరిచిన వాడు
తెలుగు వెలుగు ... చూడని వాడు
త్రిలింగ దేశమందు వశించు వాడు
వెలుగు భాష , నా ... తెలుగు భాష రాని వాడు
వ్యర్థ మానవుడే ... అతడు వ్యర్థ మానవుడు
అన్ని భాషల పై నీ కుంది ...అధికారం
అది దేశానికే ఎంతో ... ఉపకారం
నీ ... భాషపై చూపించే .... నిస్సాకారం
వ్యర్థమేనోయ్ అది ... వ్యర్థమేనోయ్
దేశ భాష లందు తెలుగు లెస్స అని ఆనాడు
దేవరాయలు వారు కొనియాడే ఆనాడు
ఆంధ్రుడ వైయుండి మాతృభాషమరిచి ఈనాడు
దేశ భాష లందు తెలుగు లెస్.. అని నావు నేడు
పి.వి.కి.వచ్చు పదునాలుగు భాషలు
ఐనా తన భాషపై చూపారు సాధికారం
అతని సంస్కారానికి నా... నమస్కారం
పి.వి.కి. ధీటుగా అన్నింటా ఘన కీర్తే నీ హద్దు
తెలుగు తల్లి గౌరవం శిఖరాగ్రం చేరితే ముద్దు
మాతృభాష నుదుటి పై ఇక రక్త తిలకం దిద్దు
మాతృభాషను చదువు మానవుడే ముద్దు
✒📝✏🎂⛳🏹🖌...✒✒🖍✏🎂✏
షేక్. మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673
[2/22, 12:24 PM] అంబటి Poet Bhanu Prakas: 🌷🙏🌷
*అంబటి భానుప్రకాశ్.*
9948948787.
----------------------------------------
*మాతృభాష తెలుగు*
-----------------------------------------
*ఉత్పలమాల*
*పాడర! తీయనౌతెలుగు పల్కులు తీరుగ నెంచి, నేడిదే*
*వేడర ! భారతీ జనని వేద విభూషిత యంచు ,భక్తితో*
*జూడర! నాటివైభవపు సొంపులు గూర్చిన సాహితీగతుల్,*
*పాడర ! పద్యమందు మన భాషయె భాషలమేటి యంచికన్,!!*
🙏✍🙏
[2/22, 1:00 PM] Poet Srinivas Prasad Thurimella: అమ్మభాషరా కమ్మనైనభాషరా!
ఆంథ్రభాషరా అందమైనభాషరా!!
నన్నయ్యచేతిలో నడచినిలచినభాష
తిక్కన్నకలముతో తీపినిండినభాష
యఱ్ఱన్న గళములోఎగసివీచినభాష :అమ్మ:
పోతన్నభక్తితో పొగడిన భాష
శ్రీనాథ రక్తిలో ఓలలాడిన భాష
అష్టదిగ్గజాలు ఆంధ్రభోజుని ఇంట
అమృ తాలె కురిపించిన భాషరా! :అమ్మ:
[2/22, 5:48 PM] Buf Amaravadi Rajashekar Sharma: మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు
------------------------------------------------------
అమ్మ పాలు నేర్పినట్టి
కమ్మనైన మాతృభాష
నమ్మకమునె జీవితాన
గుమ్మరించు మాతృభాష
అంతులేని దుఃఖమైన
సంతసాలు వెల్లువైన
పంతమైన వింతయైన
చెంతనుండు మాతృభాష
నదిలా ప్రవహించునది
విధిగా వికసించునది
పదపదమున నవభావన
మదిలో మురిపించునది
పలుభాషల మధురిమలను
పలు పదముల ఘుమఘుమలను
కలుపుకొని కలిమిగని
వెలుగులీను మాతృభాష
భాషా నియమాలేమిటో
దోషాలను గనుటేమిటో
లేశమైన నెరుగకనే
భాషించే మాతృభాష
మాతృభాష మాతృభాష
మాత్రమె మనసైనభాష
ఛాత్రులకును గురువులకును
పాత్రమైన మాతృభాష
తెలుగు మనకు మాతృభాష
వెలుగుతు వెలిగించు భాష
కలకాలం నవకాంతుల
కళలీనగ మత్కాంక్ష
---------------అమరవాది రాజశేఖర శర్మ
[2/23, 7:17 PM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...మాతృభాష
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853
తేనెకన్న తీపి తెలుగుభాషమనది
పాలధారవోలె పద్యముండు
భావనిధులువేడి భారతీదేవికి
ఆటవెలదితోడ యంజలిడుదు!!!
అమ్మ నాన్న యనిన యమృత మదియేను
మమ్మి డాడి యనగ మధురమేది
మాతృభాషలోన మమకారమున్నది
తెలుగు భాషవిలువ దెలుసుకొనుమ!!!
ఆంగ్ల మందు మోజు నబ్బరముగనున్న
అలుసు చేయబోకు నచ్చ తెనుగు
భావి తరములందు బాగైన నిధివోలె
విశ్వమందు తెలుగు వెలగవలెను!!!
ఇతర భాషలెన్ని యింపుగా వచ్చిన
వరము గాదె మాతృ భాషమనకు
పట్టి పట్టి బలుక పరభాష గాదయా
పలుకుమోయి తెలుగు పరవశమున!!!
అన్య భాషలన్ని యాదరమ్ముగ బల్కి
సిరుల తెలుగు బలుక చిన్నతనమె?
తెలుగు వాడిననుచు నెలుగెత్తి చాటరా
దిశలు దిగ్గనంగ నసము తోడ!!!
[2/23, 7:37 PM] Poet Kusumanchi Sridevi: కుసుమంచి శ్రీదేవి
శీర్షిక-తెలుగు వైభవం
-------------------
తెలుగు ముంగిట
జన్మించి...
తెలుగు తల్లి ఒడిలో
సేదతీరి..
అచ్చులు..హల్లులు
దిత్వాలు..సంయుక్తాలు..సంశ్లేషాలని
ఆభరణలుగా ధరించి,
సంధులు..సమాసాలు..అలంకారాలతో
ఎంతో ప్రకాశవంతమైన వర్ఛస్సు కలిగిన
తెలుగు తల్లి దీవెనలతో..
మన తెలుగింట పురుడుపోసుకొన్న
మంచి విలువలతో కూడిన
సంస్కృతి,సాంప్రదాయాలతో పాటు..
బ్రతుకు తెరువు కోసం
ప్రపంచ విజ్ఞానం నేర్చి....
రెక్కలు బలపడ్డాయనే భ్రమలో
చల్లని దీవెనలిచ్చే..
విలువలు నేర్పే ఆ తల్లిని మరిచి..
పరాయి భాషా వైపు పరుగులుతీసి,
మన సంస్కృతి,సాంప్రదాయాలను
తూర్పూర బెట్టి...ఎండమావులను
చేస్తున్నారు...నేటి తరం
సృష్టిలో ఎన్నిప్రేమలు లభించిన...
అమ్మ ప్రేమలో మాధుర్యాన్నివ్వలేవు...
బ్రతుకు తెరువు కోసం
ఎన్ని భాషలు నేర్చిన...
మాతృభాష తియ్యదనం
ఇసుమంతైన పరాయిభాషలో లభించదు...
[2/25, 8:56 AM] +91 95428 06804: * అజంతా సుందరి తెలుగు *
-----------------------------------------------------------------
సీ.భళిరే! కవనమందుభయ చంద్రుల గతిఁ మ
హా కవి సామ్రాట్టు లవతరించ
ధిక్కారము న్నెదిర్చగ దిగంబర కైత
జ్వాలా ముఖీనతన్ జ్వలితమవ్వ
అరె! నాల్గు తలలున్న హైందవేనుగు పైన
నెక్కియున్ గుఱ్ఱమూరేగి తిరుగ
రక్త సూర్యున్ని కలం ముక్కున న్నిల్ప
వెలుగు నభ్యయంపు పులుగు జేరె
తే.భౌతిక విషయ చర్యల భావము నెద
యందు తాత్విక జ్ఞానమై నట్టి తోట
ల కవి చిలుకలు గొట్టగ రాలిన ఫల
రస గుళికల కావాసమౌ భాష తెలుగు
. . .ఏబూషి
Comments
Post a Comment