దర్పణం

దర్పణం

[2/12, 8:57 AM] Poet Musthakheem విన్నర్: అంశం:దర్పణo
శీర్షిక:దర్పాల ..దర్పణం
తేది :12-02-2018
కవి : విన్నర్ , (ముస్తఖీమ్)
స్త్రీలంతా ..సింగారించుకునే ..శ్రింగార  సాధనమా ..!
నిన్ను ఇష్టపడని ..జాణ లేదు !!
ఆడవారి రాజ్యానికి ..నీవే మహారాణివి ..రారాణివి !!
యెప్పుడు పుట్టావో గానీ , యెన్ని యుగాలైనవో గానీ ..
యెవరు కనిపెట్టారో  గానీ ..
ఆడా -మగా అందరి జీవితాల్లో 
నీవొక ..భాగమైనావూ ..ముఖాలను తీర్చి దిద్దుతున్నావు ..ఓ  దర్పణమా !!??
నీ అవసరము లేనిది యెవరికీ ??
అందరికీ ఇష్టమై కూర్చున్నావు ...??
ఉన్నది ఉన్నట్లు చెప్పడమే ..నీ
లక్షణము ..సహజత్వమూ ..!!!
నీవెంత సుకుమారివఁటే ..నిన్ను 
మనసు తో పోల్చారు ...?
చేజారితే ..ముక్కలు -చేక్కలు గా విరిగి పోతావు ...మళ్ళీ 
అతుకుపడవు ???
నిజానికి ..ప్రతిరూపమ్ నీవు !!!
ఉన్నది ఉన్నట్లు చూపెడతావు , 
లేనిది ఉన్నట్లు చేయడమ్ నీవల్ల  కాని  పని !!??
ఊరికే మసకబారుతావు ..ఊరికే ..
అలిగినట్లు ...!!???
కోతులూ ..పక్షులకు ..సైతము 
వినోదాన్ని కలిగిస్తావు !!!??
పిల్లా పాపలకైతే ..యేనలేనీ 
ఆనందాన్ని ..కలిగిస్తావు !!
నీ దర్పము ..కొనియాడబడినది 
ఓ ..దర్పణమా ..ఓ ..అద్దమా ..!!!!
ne
నీవోచ్చీ చరిత్రే ..శృష్టించావే ..
యెన్నెన్ని రకాలుగా ఉపయోగపడుతున్నావే ...!!??
ఆలోచిస్తే ..ఆశ్చర్యమే !!
జోహార్లు ..నీకు రాజ దర్పణమా !!జోహార్లు !!
💐💐💐💐💐💐💐💐
[2/12, 5:04 PM] Poet Mastan Vali: అంశం :  దర్పణం ( అద్దం)
  కవి   :  మస్తాన్ వలి.
  శీర్షిక :  *ప్రతి బింబాల ....  పొదరిల్లు*

👓🌕 🌚🔮 🌈🔎 ...🔍🌈🔮 🌚 🌕👓
  
    తన దర్పాన్ని  చూసుకోవాలంటే 
    రాజైనా, మంత్రైనా ...
     లక్షాధికారైనా , బిక్షాధి కారైనా 
    నా ... ముందుకు రావలసిందే 
   నా   ఎదురుగా నిలిచి 
      చూడవలసిందే...
     నేనెవరనుకున్నారు 
     మీ ... సొగసు ల దర్పాలను 
     మీ  కళ్ళ కే చూపించే  దర్పణాన్ని 

 అతి దూరా నున్న 
చాల దగ్గరగా నున్న
అతి లావుగా నున్న
చాల సన్నగా నున్న
తన రూపం,రంగు
సైజు, వయస్సు
మనసు లతో 
నాకు పని లేదు 
నన్ను నేను తప్ప
నా కంటి లో పడిన
దేని నైనా నాలో దాచుకొ లేను 
నా ముఖం పైకి తీసుకొచ్చి
నా ఎదుటివారి కి 
అగ పడేలా చేస్తాను.

రాసుకు పోతే
కోసుకు పోతాను
మీ చేజారితే 
పగిలి పోతాను
అవసరమైతే
ఆయుధ మౌతాను 

నర రూపం దాల్చిన
ఏ మానవులై నా 
నన్ను ముట్టు కొనివారు
నను పట్టు కోని వారు
ఉండరు ఈ లోకంలో

కానీ ... పశు పక్ష్యాదులకు 
నా గురించి తెలియదు
కాకైనా, పిచు కైనా
కోతైనా, కుక్కనా
నా ముందు నిల్చుని
తన ప్రతిబింబాన్ని
చూసుకొని...
ఇక్కడ వేరెవరో 
వున్నా రని 
పక్షులు ముక్కు తో 
నన్ను పొడుస్తాయి
ప్రక్కకు పోతాయి
వెనక్కు వస్తాయి
నా ఎదుట వాటి 
ఆందోళన..ఆవేదన
వర్ణనాతీతం


నా లాగే  మీ ప్రతిబింబాన్ని
నిజంగా చూపించేది 
సహజ సిద్ధమైన ,కదలని
నీటి యందు చూడవచ్చు
అందుకే...

ఆ నీరంటే నాకు భయం
తను నా మీద పడినా
నేను దాని లో పడినా 
నా రూపం పోతుంది
నా ఆకారం చెడుతుంది

మీ సొగసు ను మీ దర్పాన్ని
చూపించ లేను ...
అందుకే...
మీరు ఈ అద్దం వద్దని 
నన్ను ఒక మూలన వేస్తారు
లేక చెత్త లో విసిరి పారేస్తారు 
అందుకే...
మీరంటే భయం లేదు
నీరంటే భయ మండీ
నా ప్రతి బింబాల పొదరిల్లు లో
మీకు ప్రతి బింబాల హరివిల్లు
కనిపిస్తుంది అందుకే
నేను దర్పణ మయ్యా.

👓 🌕  🌚 🌈 🔍 .... 🔎 🌈 🌚 👓 🌕

           షేక్. మస్తాన్ వలి.
   నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ :  99 483 57 673.
[2/13, 8:40 AM] Poet Satya Neelima: శీర్షిక : దర్పణం,
రచయిత : సత్యనీలిమ.
👓👓👁👁🔎🔎
అందానికి సొగసులద్దే అద్భుతమైన సాధనం దర్పణం
ప్రతిబింబ దర్శిని దర్పణం
ఎంత పెద్ద వస్తువైనా అరచేతిలో ఇమిడిపోయేలా చూపించే ఇంద్రజాల వస్తువే దర్పణం
అన్ని రకాల వస్తువుల తయారీలో ఉపయోగించే సాధనం దర్పణం
చూపును ప్రతిబింబం
మానవ నిర్మిత దర్పణం
లోకాన్ని చూపును
దైవ నిర్మిత దర్పణం
అదే అదే నయనం
మన మనసే మనకు
అతిపెద్ద దర్పణం
దర్పణం, మనసు రెండూ కూడా మూడక్షరాలు
రెండింటి తీరూ ఒకటే
పగులుతే అతకవు
అలనాటి రామచంద్రుని
కూడా నవ్వించిన గొప్ప
చరిత్ర నీదే దర్పణం
నీరు, పాలు,నూనె ఏదైనా నీ తోబుట్టువులే సుమా
శ్రీ కృష్ణుని అపవాదు కారణం
పాలలో చంద్ర ప్రతిబింబ దర్శణం
యుగయుగాలుగా మాతో ఉంటూ మా దైనందిక చర్యలలో బాగమైన ఓ దర్పణమా నీకు జోహార్లు..
👓👓👁👁🔎🔎
                   ✍..సత్యనీలిమ,
                ఉపాద్యాయురాలు,
                జీనియస్ పాఠశాల,
                         వనపర్తి..
[2/13, 12:24 PM] ‪+91 96404 07103‬: అంతర్దర్పణం!!

దర్పాన్ని
దర్పణంలో చూసుకోకు..!
అంతర్దర్పణ మనేది
అందరిలో ఉంది....
అందులో దర్శించు..!!
చేసే మోసాలు
వేసే వేషాలు
ఎక్కడి నుండి తెచ్చుకున్నవి..?
ఎవ్వరినుండి నేర్చుకున్నవి...??
ఎదుటి మనిషి కళ్ళుగప్పి
ఏదైనా మటుమాయం చేయగలవు..!
ఎవ్వరెరుగరన్నట్టు
ఎంత నటనైనా పోగలవు..!!
కానీ...అంతర్దర్పణంలో
ప్రశ్నలుధ్బవిస్తాయి?
వాటికి జవాబు చెప్పగలవా..??
అందుకే ఎవరూ 
ప్రశ్నించనంతా ఎత్తుకు ఎదగాలి...!
దర్పాన్ని వీడాలి...!
ధర్మాన్ని కాపాడాలి...!!

                              ✍🏻"మరికంటి"
[2/14, 12:25 PM] Poet Kusumanchi Sridevi: 🔍శీర్షిక-దర్పణం🔎
,🌹పేరు-కుసుమంచి శ్రీదేవి🌹
----------------------
అమ్మ ఇచ్చిన రూపాన్ని
నన్ను,నాకే దర్శనం చేయించి
పరిచయం చేసి...

నేనేమిటో, ప్రసాదించిన
ఈ మేను సొగసేమిటో,
వదన వర్ఛసేమిటో,
ఊహ రెక్కలు తొడిగేక
సమాజం నాకోసమన్న మాటలు
ఎంత వరకూ నిజమో!

ప్రాణము లేని నీవు
ప్రాణమున్న మాకు
ఖచ్చితంగా ..ఉన్నదున్నట్టుగా
తెలియజేసి...

నలుగురులో నా స్థానమేమిటో,
నన్ను,నేను ఉన్నతంగా
మలుచుకునే శక్తిని!

నీలో నన్ను చూసుకుని
నాలో నేను  మాటలాడుకుని,
నాకు,నేనే ప్రోత్సహించుకునే
అవకాశం నీ వల్లే కదా!

సృష్టిలో ఎంత మేధావులైన
నువ్వు పరిచయం చేస్తేనే
తన రూపం తనకు పరిచయమయ్యేది!

ఓ దర్పణమా! నువ్వు నిర్జీవివైనా,
సజీవుడైన..మేథవుడైన,.
మానవులని నీ చుట్టూ
లింగ భేదం లేకుండా
తిప్పుకుంటున్న పెద్ద నెరజాణవులే..
✍✍✍✍✍✍✍✍✍✍
[2/14, 12:44 PM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి        హన్మకొండ  9000683826         శీర్షిక   ..:  అంతం చేసే యుగం              అమ్మాయి అంటే ఆమడ దూరం ...                  ఒంటరి బ్రతుకు భారం ..          .                                                                  ఆపై , ఆరేళ్ళ -అరవై ఏళ్ళ ఆడ అయితే అత్యాచారం....               ఇదీ నేటి గ్రహచారం   -      .                   గురువులపై    పరిహాసాలూ           వారిచే         పరిహారాలూ .....   ..           .                              తిండి పెట్టే రైతన్న స్థితి దైన్యం                       ఇదే కొనసాగితే   మన బ్రతుకు అధ్వాన్నం ...           .                                                            ఎదిగే చెట్టుని చూస్తే ఓర్వం                     ప్రకృతి   ఆగ్రహిస్తే పనికొస్తుందా గర్వం ....                  .                    పెరుగుతున్న విజ్ఞానం    సరిగ ఉపయోగించలేని అజ్ఞానం   ..                      .                       కలియుగం అనేందుకు నిలువెత్తు దర్పణం      తెలుసుకునే సరికి బ్రతుకు అర్పణం
[2/17, 12:43 AM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...దర్పణం
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853

అద్దంలో.......
ప్రతిరోజూ
నిన్ను నీవు చూస్తుంటే
బాగానే వున్నావని 
బదులు నీకు చెప్తుంది
నిజం ఒప్పుకో నేస్తం!
బాహ్యంగా కనబడేది
అసలందంకాదే
అదిగో నీలోని అహం
అదిగదిగో స్వార్ధం
అదివో కోపము మోహము
నిలువెత్తున లోభం
మోసం ద్రోహం కపటం
కనపడటం లేదా?
అంతరంగ అందాన్ని
అట్టడుగుకు త్రోసేసే
అరిషడ్వర్గాలు చేయు
అవికృత ఘోషనీకు
వినిపించుట లేదా?
ఏదీ నీ సౌందర్యం?
ఏదీ నీసౌకుమార్యం?
ఏదీ నీ నగుమోము ?
ఒక్కసారి కను నేస్తం
పదేపదే చూస్తున్నది
ప్రతిరోజూ దీన్నేనా?
సబ్బుస్నోలు పౌడర్లను
పూస్తున్నది దీనికేన?
అంతరంగ శత్రువులగు
ఆరింటిని తరిమేసెయ్
మమత సమత ప్రేమ
పదిమందికి పంచి
మానవతలను రంగరించి
శాంతిసహనమ్మను నగలను
అనునిత్యం ధరించి
ఒక్కసారి చూసుకొనుమ
అందానికి నిర్వచనం
నీవేనని అంటుంది
నీమనో దర్పణమే
నీరాజనమిస్తుంది..!!!
[2/17, 1:30 AM] Manne Lalitha: మన్నె (పిన్నక)లలిత.
శీర్షిక:దర్పణం.
ఊరు:హైదరాబాద్.
చరవాణి:7416863289.
×××××××××××××××××
దర్పణం.......
ముకురం మెురాయిస్తుంది
నాముఖం చుాడనివ్వక
"ఈజన్మకు ఏంచేశావ్ నీవిక.
అరిషడ్వర్గాలను అదుపులొేపెట్టుకొే
నీకు ఆనందాన్ని తెచ్చుకొే
తాగి పడిన నిన్ను 
ఒక దర్పణం ఛాయాచిత్రంగా తీయలేదా?
నీకు మతిలేక తిట్టి..కొట్టినా
నీసతి పల్లెత్తు మాటనక 
నీకు పెట్టే కుాడు నీకెట్లా 
సహిస్తుంది?
మంచి భాషణమే భుాషణం
అదేనీకు అలంకారమని నాలొేకిచుాచి తెలుసుకొే
 ప్రద్యొేషవేళ కాలవలొే నిశ్చలనీటిని...దర్పణంలొేలా కనిపిస్తున్న నీటిలొే రాయి విసురు
అల్లకల్లొేలమైన నీరు చుట్టుకుంటున్న వలయాలు
నీ జీవితముా అంతే
మంచీ చెడుా విచక్షణ కలిగినరొేజు
సమాజానికి నేనేంచేశానని నీవనుకున్నరొ్జు
నీ మనొే దర్పణంలొేని దుమ్ము తొలగినరొేజు
పరిశభ్రమైన మనస్సుతొే ఎద దర్పణం ప్రకాశవంతం
నీహృదయం నిర్మలానందమయం
దుమ్ములేని నా ముఖపద్మంలొే 
నీవెంత అందగాడిగా కన్పిస్తున్నావ్!
నీ మనస్సెంత అందంగా 
కనిపిస్తుంది.
××మన్నె(పిన్నక)లలిత××
[2/17, 8:30 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: పాలకుర్తి నాగజ్యోతి
కుమ్రంభీం జిల్లా
8074712181

~ దర్పణం ~


భూమిపై జీవితమంటే 
నలుగురితో బ్రతుకంటే
పుట్టామా
నేలపై నడిచామా
నింగికి చేరామా 
కాదు..

నలుగురిలో నీ నడత
నలుగురితో నీమాట
అదే నలుగురితో 
నువు పంచుకున్న నీ నవ్వులు
మరో నల్గురి కష్టాలలో నీచేయి 
నిన్ను నిన్నుగా చూపే దర్పణమయితది..

నవ్వే ప్రతి కన్నుల్లో నీరూపు ప్రతిబింబమైతే
ఆ కనుచూపు అద్దమై 
నిన్ను రేపటిలో శిఖరాన నిలబెడతది 

సమాజపు గుండెగా నువ్ మారగలిగితే
చరిత్ర తనలో నిను రాసుకుంటది
రేపటి బాలలంత నిను చదువుకుంటరు
తడి హృదయపు మాటను నినుచేసి వారి ఎదను తడుముకుంటరు..


@సిరిమల్లెలు...

********** ***** **********
[2/17, 11:14 PM] Poet Bharathi: శీర్షిక‌ 
దర్పణం 

9491353544 
బాలభారతి భాస్కర 
అనంతపురము 

అద్దమే చూచితినా 
అందులోన నీవేలే! 
దర్పణం  ముకురం అద్దం 
పదాలేవైనా అర్థం ఒకటే 
సమాజములోని 
అనేక సమస్యలకు 
దర్పణం పట్టే కవితలెన్నో వచ్చాయి ! 
అద్ధాలు లేకుంటేనేం 
నీకనుపాప దర్పణం లో 
నాముఖం కనిపిస్తుంది గా  
  ప్రేమికుడు ప్రియురాలి 
ముఖాన్ని అద్ధంలా భావిస్తాడు 
ముక్కూ మొగం బాహ్య రూపమే గాదు అద్దంలో 
కనిపించేది 
మన మనసున దాగిన 
మధుర భావనలూ 
ఆవేశం ఆక్రోశం కోపం పగ 
ప్రతీకారం బాధ  దుఖం 
ఈర్ష్యా అసూయా 
కనిపిస్తాయి ఎదుటి వారికి 
అందుకే  ! అందుకే 
శత్రువుతో మాటలాడు నప్పుడు కూడ 
చాలమంది ముఖముపై 
నవ్వు పులుముకుని 
మాట్లాడుతారు 
 అద్దంలేనిసమయాల్లో 
తొట్టీలోని నీటిలోనో 
గిన్నెలోని నీటీలోనో ప్రతిబింబం 
చూసూకుని మురిసిపోతారు 
ఆకాశంలో రివ్వున 
ఎగిరే పక్షులు నీటి అద్ధంలో 
అటునిటు ఈదే చేపలై 
కనిపించవా ? 
నీలపు నింగి దుప్పట్టా పై 

కుట్టిన రిక్కల చమ్కీలు
నీటిఅద్ధంలొ 
తళతళ మెరిసే చమ్కీల 
దుప్పట్టాను పోలి వుండదా ? 
ఆనీట రా యి విసరిన అల్ల
కల్లోల మైన నీట చెత్తాచెదారమే కానీ 
స్పష్టంగా దుప్పట్టా కని పించదు 
అందుకే అందుకే 
నీరూపు నీకు స్పష్టంగా అగుపించాలన్నా 
మనసు కల్మషాన్ని పారదోలు !

Comments