బంధుత్వాలు



[2/5, 4:41 AM] Poet Musthakheem విన్నర్: శీర్షిక:బంధుత్వాలు 
తేది:05.02.2018
రచన: విన్నర్, ముస్తఖీమ్ 

బంధుత్వాలు బహు భారమైన 
రోజులివి! 
ఒక్క మాటలో చెప్పాలంటే 
గంగలో కొట్టుకు పోయి నామ
రూపాల్లేకుండా చెల్లాచెదురౌతున్నాయి!!
అన్నదమ్ములు, తండ్రితనయులు ..అన్ని బంధుత్వాలు, రక్త సంభంధాలు 
గాలిలో కొట్టుకు పోతున్నాయి!!
ఇంటికొచ్చే చుట్టంను అతిథి దేవోభవ అంటూ. అనుకుంటూ
గౌరవించే రోజులు గతకాలపు
జ్ఞాపకాలై కూర్చున్నాయి ..!!??
మరి నేడు బంధుత్వాలు 
ఆస్తి పాస్తుల పేర్లతో ,కలహాలతో..
రక్తపాతాన్ని.. చవిచూస్తున్నాయి!!??
ఒకే రక్తం ప్రేమకు బదులు 
ద్వేషాన్నే రగిలిస్తున్నాయి..!!??
ఆప్యాయతల పిలుపులు ఎప్పుడో మాయమై పోయాయి!!??
అనురాగబంధవ్యాలు ఆశనిపాతమైనాయి..ఆవిరైనాయి..అవసారానికొద్దిగా మారాయి!
తీపి చుట్టరికాలు చేదు గుళికలై
సహించరానివిగా పరిణమించాయి!!??
పలకరించుకోవడం..గగనమై..
కలహించుకునడం.. దగ్గరైంది..
మరీ విపరీతమై..హత్యలకు సయితం ..వెనుకాడనిది..?
చూసే చూపులకు ..ఇవేం 
బంధుత్వాలురా నాయనా??
అనిపించక మానదు??!
బంధుత్వాలు పీక్కు తినే రాబందువులు..అయిన కాలమిది!! 
ఇంకెక్కడి మమతలు-మమతానురాగాలు??
స్వార్థాలే..పచ్చి స్వార్థాలే ..
ద్వేషాలే,కుట్రాలూ-కుతంత్రాలే..రాజ్యమేలుతున్నాయి?? బంధుత్వాలు నగుబాటుకు గురైనాయి.,చతికిలపడి కొట్టుమిట్టాడుతున్నాయి..!!?

రచన:విన్నర్, కొల్లాపూర్.
💐💐💐💐💐💐💐💐
[2/5, 11:12 AM] Poet Satya Neelima: శీర్షిక: బంధుత్వాలు
రచయిత: సత్యనీలిమ
👪👨‍👩‍👧‍👦👭👬👨‍👩‍👧‍👧👨‍👩‍👧
తియ్యని మాటల కమ్మని పిలుపుల మనసుకు నచ్చిన
బంధమా
స్వార్థం పెరిగి నాదని తలచి
భారమైన అనుబంధమా...(2)
                             "తియ్యని"
అమ్మ చేతి గోరుముద్దల కమ్మదనమా
నాన్న అంటే ధైర్యం ఇచ్చే
స్నేహగుణమా
అక్కచెల్లి,అన్నతమ్ముడు
రక్తబంధమా
అత్తామామ,పిన్నిబాబాయ్
ఆప్యాయగుణమా
బామ్మ చెప్పే కథలు వింటే
అంతులేని ఆశ్చర్యమా
తాత ఒడిలో ఆడుకుంటే
చెప్పలేని సంతోషమా
                      "తియ్యని"
నేటి తరానికి ఎంతమందికి
తెలుసు ఈ విలువలు
ఉమ్మడి వ్యవస్థ కుప్పకూలినా
తెలుసుకోలేని పిల్లలు
అందుకే ఇక్కడ వెలిసెను
అనాథ వృద్ధ ఆశ్రమాలు
ఇకనైనా చేయాలి మనం
స్వార్థాన్ని ప్రక్షాళనలు
                   "తియ్యని"
తెలుసుకోండి యువతరమా
ఉమ్మడి వ్యవస్థను కాపాడుదాం
పూర్వవైభవం తీసుకువద్దాం
బంధుత్వాలలో బంధాన్ని
ఆహ్వానిద్ధాం
భావితరాలకు బంధం విలువలు నేర్పిద్ధాం
                    "తియ్యని"
👨‍👩‍👧👨‍👩‍👧‍👧👭👬👨‍👩‍👧‍👦👪
         ✍....సత్యనీలిమ,
            ఉపాధ్యాయురాలు,
            జీనియస్ పాఠశాల,
                     వనపర్తి.

[2/5, 11:45 AM] కృష్ణమోహన్ గోగులపాటి: వసుదైక కుటుంబం
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు

ఉమ్మడి కుటుంబాల ఊసే లేకుండా పోయింది
అమ్మ, నాన్న,.... 
అక్క బావ...
చెల్లి మర్ది.... 
అన్న వదిన.... 
తమ్ముడు మర్దలు.... 
మేనత్త మేనమామ.... 
పిన్ని బాబాయ్..... 
పెద్దమ్మ పెదనాన్న.... 
తాతయ్య అమ్మమ్మ.... 
తాతయ్య నానమ్మ..... 
ఒదిన, మరదలు....
బావ బామ్మర్ధి.....
ఇంకా.... 
ముత్తాత తాతమ్మ....
ఇలా వరుసలు ఉన్నాయని.... ఉంటాయన్న సంగతే మరిచారు నేటి తరం....
మమ్మి డాడి..... ఆంటీ అంకుల్
ఇవి రెండు తెలిస్తే చాలు....
ప్రపంచమంతా మన బందువులే అనే భావన ఏర్పడింది.
రక్త సంభందం అంటే ఏంటో తెలియని దుస్తితి....
కారణం.....
పుట్టగానే పిల్లలను క్రెచ్చ్ ల్లో వేయడం....
లేదా ఆయాలకు అప్పగించడం...
అందాలకు బందీలై తల్లి పాలు కూడా ఇవ్వకపోవడం....
ముడ్డి కడగడం మానుకొని డైపర్స్ వాడడం....
ఇంకెక్కడి ప్రేమలు... లాలనలు....
ఇక్కడినుండే మొదలు....
ఇక కాన్వెంట్లు..... రెసిడెన్సు స్కూళ్లు....
వాడికి ఎవడు చుట్టమో... ఎవడు పక్కమో తెలియని పరిస్థితి ....
ఎద్దులా పెరిగి మొద్దులా తయారవడం తప్ప మరేమీలేదు....
ఇంజనీరింగ్ చేయడం.... 
ఎమ్మెస్ కని విదేశాలకు వెళ్ళడం..... 
వాట్సాప్ లో చాటింగ్....
ఐ ఎం ఓ లో విజిటింగ్....
స్కైప్ లో వీడియో కాలింగ్....
అమేజాన్ ద్వారా షాపింగ్....
నెలకింత అమ్మ నాన్నలకు డబ్బు పంపిస్తే.... వీరికదే ఆనందం....
పెళ్లి ముందురావడం.... అయిపోగానే పెళ్ళాని తీసుకొని పోవడం..... 
ఇంకెక్కడి ప్రేమలు... ఆప్యాయతలు....
అయ్య అమ్మ సస్తే తప్ప.... 
కనీసం దాయాదులు పోయినా....
దగ్గరోడు సచ్చినా....
దయలేని దుస్థితి ....
చూడలేని పరిస్థితి ....
ఇంకెక్కడి బందాలు....
ఇంకెక్కడి బందుత్వాలు....
అందుకే....
కుటుంబ వ్యవస్థ రోజు రోజుకు నశించిపోతుంది....
అందుకే రోజు రోజుకు ఓల్డ్ ఏజ్ హోం ల సంఖ్యలు పెరుగుతూ పోతున్నాయి.....
బాల్యం నుండే మార్పు రావాలి...
బందాలు పెరగాలి....
అమ్మమ్మ, నానమ్మ ల కథలు వినాలి....
తాతయ్య నేర్పే మర్యాదలు నేర్పాలి....
కుటుంబం లో ఉండే ఆనందం తెలపాలి....
అది మనింటినుండే ప్రారంభం కావాలి....
కలసి బోజనం చేసి.... 
కలసి ముచ్చటించడం నేర్పాలి....
ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడి....
మళ్ళీ ప్రపంచానికి మన దేశం వసుదైక కుటుంబం అని చాటి చెబుదాం....
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
9700007653
[2/7, 12:53 AM] ‪+91 99483 57673‬: అంశం  : "  బంధుత్వాలు "'
   కవి  :  మస్తాన్ వలి 
శీర్షిక :  👨‍👨‍👧‍👧 *వీడని బంధం* 👨‍👧‍👦

👫…👭 👬 👨‍👨‍👧‍👧  👩‍👧👨‍👦  👨‍👨‍👧‍👧  👫👭 ....👬

ఓ నరుడా .. విర్ర వీగు పామరుడా 
పెన వేసు కొన్న దీ పేగు బంధము
విడ దీయ రాని దీ రక్త సంబంధము
సకల బాంధవ్యాల ను మించిన
బంధమే ఈ ... రక్త బంధం
అని తెలుసు కొంటె ఆనందం

పైసల తో ముడి వేయకురా
బంధాలను విడదీయునురా
బాల బాలిక లను చదువుల పేరు తో...
వసతి గృహం పాల్ చేయకండీ 
మది వేదన యద రోదన కనిపించదు
షష్టిపూర్తి చేరు కొన్న జననీ జనకులకు
వృద్ధా శ్రమాల బాట చూప కండీ

కరుణ లేని మది నీ దని
మదిలో మమతలు కరువని
గుండె ను బండగ చేసు కొని
అనురాగాలను, ఆప్యాయతలను
తుంచకు , తుంచి పారేయకు

రక్త బంధాలను
పాత బంధువులను
కొత్త బంధం కోసం
ఉన్న బంధము
వదులు కోకురా
రక్త పు మరకలు
మాయని మచ్చని 
తెలిసి మసలుకోరా

ప్రపంచ బాంధవ్యానికీ
పునాది వేసిన రక్త సంబంధికుడా
వీడని బంధం ... నీది రా. ...
సుమ గంధాలు జిమ్ము
ఆ బంధమే అందము రా


నూ చెరిపి నా చెర గనిది. 
నూ చించి నా చిరగనిదీ
నూ తుంచి నా విలగనిది
నిను వీడని నీడరా
నిన్ను కాదని పోదురా
ఈ రక్త సంబంధము

బంధా లన్ని టి లోను...
అతి పెద్దది
బందుత్వాని కిది చిన్న దీ
చిట్ట చివరికి...
రక్త బంధమే మిగులునది

ఈ వసుధ లోన
అన్ని బంధాలలో
మొట్టమొదట తట్టేది 
చిట్ట చివర మెట్టేది 
ఒకే ఒక్క టి
రక్త బంధ మొక్క టే

👨‍👨‍👧‍👧👨‍👧‍👦   👬👫👭 👨‍👦......👩‍👧  👬👫👭 👨‍👧‍👦👨‍👨‍👧‍👧

      షేక్. మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు 
సెల్ : 99 483 57 673.
[2/7, 7:44 AM] ‪+91 96189 61384‬: శీర్షిక:బంధుత్వాలు
రచయిత:ఉప్పరి తిరుమలేష్
👬👭👫👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👩‍👦‍👦👨‍👧‍👧👨‍✈
బంధాలు అనుబంధాలు
భవిష్యత్తు కాలానికి భాగ్యరేఖలు
పేగుబంధము అమ్మ
ప్రేమానురాగాల అనుబంధము నాన్న
ఆశయాల ఆనంద లోగిలి
చిన్ననాటి అండదండల కౌగిలి
ఆణిముత్యం లాంటి అన్నయ్య
అనురాగం
సన్నజాజి మల్లెతీగ పారినట్లు
సన్నజాజి మల్లెలు వికసించినట్లు
సన్నసన్నాయి మా చెల్లి పాటలు
మా చెల్లి అనురాగాల అనుబంధం

నేడు లేవు బంధాలు
ఎలాంటి అనుబంధాలు
ఒకరికి ఒకరు
ఎవరికి వారు యమునా తీరు
మల్లెతీగ అందంగా పరిచినట్లు
మల్లెమొగ్గ వికసించినట్లు
మల్లెచెట్టుకు అందం మల్లెపూలు అన్నట్లు
మానవత్వానికి మనిషి జీవితానికి పేగుబంధానికి
ప్రేమానురాగాలకి రక్తబంధానికి
నిదర్శనం మన బంధుత్వాలు
ఊహ తెలియకముందే పుట్టింది మా అమ్మ పేగు బంధం
ఊపిరి ఉండేవరకు కొనసాగుతుంది ఈ బంధం
ఈ జగతిలో మానవ బాంధవ్యాలు భావి తరాలకు
గుర్తుండాలి కలకాలం నిలిచుండాలి
కష్టాలలో కూడా సహాయపడాలి

మానవ బంధాలుగా కలిసి
అత్తా అన్నమాట అంతం చేయకు
మామ అన్నమాట మరువకు
నాన్న అన్న నమ్మకాన్ని వదలకు
అమ్మ అన్న ఆత్మీయరాగాన్ని
మరవకు
తాతయ్య కథలోని తత్వాన్ని వదలకు
పేగుబంధము కన్నా పెనవేసుకుని పోయిన స్నేహబంధాన్ని బాంధవ్యాన్ని
ఎన్నటికీ గుర్తు చేసుకో నేస్తమా
కలిసి జీవితం కలకాలం బతుకుదాం
బంధుత్వాలు మన బలం
బాంధవ్యాలు మన అనుబంధం
అన్నగా అందరికీ సహకరిద్దాం
తమ్ముడుగా అందరికీ సహాయపడదాం
ఈ జన్మ ధన్యం చేద్దాం
👩‍👩‍👦👩‍👩‍👦👨‍👩‍👧‍👧👨‍👩‍👦‍👦👨‍👩‍👧‍👦👩‍👧‍👧👩‍👦‍👦👩‍👧👩‍👧👩‍👦👩‍👦👩‍👦👩‍👦👨‍👧‍👧👨‍👧‍👧👨‍👧‍👧
                       ✍ రచయిత
                 ఉప్పరి తిరుమలేష్
          తెలుగుఉపాధ్యాయుడు
                       వనపర్తి
          చరవాణి9618961384
[2/7, 3:46 PM] Poet Palloli Shekar Babu: తెలుగు కవన వేదిక
👫👫👫👫👫👫
అంశం : బంధుత్వాలు
పేరు : పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర 9490484316. 

👪👫👪👫👪👫👪👫
శీర్షిక : బంధుత్వాలు 
👪👫👪👫👪👫👪👫

బంధుత్వాలు
నేడు తెగిన గాలిపటాలు
భేషజాల సుడి గాలికి
కొట్టుకు పోతున్న కాగితాలు
ఆర్థిక సంబంధాల అడకత్తెరలో
ముక్కలౌతున్న పోకచెక్కలు
సమిష్టి కుటుంబపూవనాల్లో
విసరి వేయబడిన ప్లాస్టిక్ పూలు
ఆత్మీయ అనురాగాలను మార్కెట్ లో 
మైనం పూసిన ఆపిల్ ఫలాలు
మొక్కుబడి పలకరింపు గదుల్లో
కార్భైడ్ తో మాగబెట్టిన బేనిషాలు
సమిష్టి కుటుంబం సమసిపోయే
వ్యక్తి గతకుటుంబం అధికమాయే
ప్రేమాను బంధాలు పుటుక్కుమనిపోయే
ఆర్థిక సంబంధాలు పెరిగిపోయే

బంధుత్వాల మధ్య అంతరం
రక్త సంబంధీకుల సంగ్రామం
భువిపై విస్తరిస్తున్న రక్తపాతం
నోరులేని వన్య ప్రాణులే నయం
అన్నింటికీ మూలం ఆర్థికం
మనిషిపై "మనీ"దౌర్భల్యం
అంతకంటే పెరిగి పోతున్న స్వార్థం
అంతులేని ప్రపంచీకరణ ప్రభావం
పగలురేయి తేడా తెలియని ఉద్యోగ జీవితం
రక్త మాంసాల మనిషి
మారిపోయాడు మర మనిషిగా
బంధాలు బంధుత్వాలు చందమామకథలు
కాకూడదు ఏనాటికీ నేస్తం !
ఆత్మీయ కుటుంబాల వృద్ధికి
ఉమ్మడి కుటుంబాల సమృద్ధికి
రండీ ! . చేయి చేయి కలుపుదాం ! 
సమిష్టి కుటుంబాలను సాధించుదాం ! !
పూర్వ వైభవం చాటుదాం !
హైందవ సంస్కృతి ని కాపాడుకుందాం ! ! 

👪👫👪👫👪👫👪👫👪👫
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర 
కొలిమిగుండ్ల- 9490484326.
👪👫👪👫👪👫👪👫👪👫
[2/7, 10:06 PM] Poet Kusumanchi Sridevi: కుసుమంచి శ్రీదేవి
శీర్షిక-పగుళ్ళు బారుతున్న బంధాలు
----------------------------
వాళ్ళందరూ కళావంతులై
శిశిరమెరగని వసంత వంశవృక్షాలై
నేలను తాకిన పండుటాకులను
తమ హృదిని నిలుపుకుని,
అనురాగ పరిమళాలకై
అర్రులు చాచిన
ఆశావాదులై...
విలువలతో పరిమళించే
ఆ బంధాల లోగిళ్ళు
దేవాలయాలై నాడు
ఊరూర వెలసిల్లేవి....

నేడు సంప్రోక్షణ లేని
ఆలయాలులా
నిత్య శిశిరాలతో మోడులై..
బంధాలను ధనమూతో
తూచి..
విలువలను మంటగలిపి..
ఆప్యాయత కరువైన
పలకరింపులతో,
ఆ పండుటాకులు వీయలేక
కళాహీనమై..
దిక్సూచిలైన పెద్దల 
మాటలను పెడచెవిని పెట్టి..

కోరికలకి బంధీలై..
విలాసాలకి బానిసలై..
పవిత్రబంధాలను తుంగలో కలిపి
కుటుంబవ్యస్థలపై ఆధునీకరణమనే
మూర్చబిల్లను దోపి 
పగుళ్ళు బారుతున్న బంధాలతో
జీవితాలను సుడిగుండాలలో
నెట్టుకుంటున్నారు..
[2/8, 6:01 AM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి                    కవితా శీర్షిక :వీడని బంధం             హన్మకొండ  .                                   .                               కాదు , మనది పుట్టుకతో ఏర్పడ్డ  రక్తబంధం-                   .                            పెరిగిన పరిచయం ప్రాణమైన బాంధవ్యం .          .                         ఒక్కటిగా పుట్టి , పెరిగి ఇప్పుడు మాత్రం వదిలి భావ్యమా నేస్తం ...?           .                                  ఇక , ఎవరికి తెలుసు.. మన ఏటిగట్టు ఊసులు            చెరువుల్లో ఈతలు             పిట్ట గోడ అల్లరులు            కోవెలలో కేరింతలు          కరణం గారి తోట లో దోబూచులు                    ఆడిన కోతి కొమ్మచ్చులు     చిన్ననాడు ఆడిన అమ్మాయిల ఆటలు              డేరా హాలులో మల్లి గాడి సరసాలు బయటేసిన  వైనం ..                           కోడెలతో ఆడుతూ చేసిన గారం           ఒక్కటి అనుకున్నాం ...      కడుపున పుట్టినవారు , కట్టుకున్న వారు వదిలినా ఒక్కటిగా బతికాం ..                        నువ్వు లేని నా లోకం మారింది స్తబ్దత గా         తట్టుకోలేక గుండె సడి వస్తోంది నీ వెంటే నిశ్శబ్దం గా .....
[2/9, 6:32 PM] Poet Naga Jyothi సిరిమల్లెలు: ॐॐॐॐॐॐॐॐॐॐॐ

పాలకుర్తి నాగజ్యోతి
కుమ్రంభీం జిల్లా
8074712181


     ~ వీడని బంధం ~


రాలిపోయిన జీవితం
నను మోడుగ నిలబడితే
నిలువ నీడనీయలేని నేను
గతమై మిగిలి
నీ తలపులు మోస్తూనే
ఒక విలాపమై మిగిలాను..

వస్తూనో పోతూనో
నువ్వొక్కసారి ఆగి నీ చూపులు నాపై విసిరితే
కలుక్కుమన్న నా మనసు
నీకై బొట్లుబొట్లుగ కన్నీరు కార్చింది..

గడిచిన ముచ్చట్లు మన అచ్చట్లు
కోతికొమ్మచ్చి ఆటలు
మధురమైన తేనే చుక్కలు నా గుండెని తాకగానే
నిను చూడాలనే ఆశ చిగురించి
నా ఒడి ఊయలలో నిను పసిపాపలా 
జోకొట్టాలనే ఆశ రెట్టింపవుతుంది...

ఒరిగిన నా మేని 
నీకు ఊపిరి కాలేక
వీడని బంధం నను తడుముతుంటే
తల్చుకునే ప్రతి తడి ఙ్ఙాపకం
నిన్ను నాముందు నిలబెడుతుంది ఆకుపచ్చగా..

రాలిన ఆకులల్లే నీఙ్ఙాపకాలు 
నను తరుముతుంటే
తరువునై
ఆశ నీకై చిగురించాలని 
కొత్తగ మొలుస్తూనే నేను ఇప్పటికినీ...


@సిరిమల్లెలు...

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
[2/9, 10:48 PM] Poet Bharathi: 9491353544 
భాస్కర  బాలభారతి 
అనంతపురము 
    శీర్షిక బంధుత్వం‌ 

జగతి అంతా ఒక కుటుంభమైతే 
 ఆకుటుంభంలో లెక్కించరానీ చుక్కలట్లు 
ఎన్నెన్నో కుటుంబాలు  
ప్రతికుటుంభంలో 
ఒకేరక్తసంబందంగల 
మరెన్నో కుటుంబాలు 
ఎదరోబంధువూలూ 
అన్నాచెల్లి అక్కాతమ్ముళ్ళ 
 బంధుత్వాలు రక్త 
సంబంధమైనబంధాలు 
కష్టసుఖాల్లో పాలుపంచుకునే 
బంధువులు ఒకరికొకరు 
వీరంతా 
!! 
అదినిన్నటితరంమాట! 
ఒకేతల్లిగర్భకుహరపు ఊయలో ఊగీ 
ఒకేతల్లి స్తన్యం గ్రోలీ 
ఒకేతండ్ర బీజకణాల 
పుట్టుకకు కారణమైనా 
 ఎందరో పుట్టుకతో 
అన్నాదమ్ములైనా పెరుగుతూ 
దాయాదులుగా మారుచున్నది 
నేటిమనబంధుత్వం !! 
పళ్ళౌతూనే  ఇంటి ఆడపడుచులు 
అత్తారిఃటీకీ 
అన్నాదమ్ములు 
భార్యలతో వరుకుంపటి రాజేస్తూ 
అమ్మానాన్నల ఆశ్రమాలు ఆదుకొన 
 ఆస్తిఅంతస్తుల తగాదాలతో
ఈర్షాద్వేషాలతో హోదాల తారతమ్యాలతో 
కుటుంబ బంధం పుటుక్కున 
తెగిపోవుచున్న బంధుత్వాలు 
కనుమరుగౌతున్నాయ్ 
బంధుత్వం కంటె స్నేహబంధమేమిన్న !!
[2/10, 12:34 AM] Manne Lalitha: 7416863289
మన్నె లలిత.
శీర్షిక:బంధుత్వం.
××××××××××××××××
వసుధైక కుటుంబం మాదీ....
జగమంత కుటుంబం మాదీ....
అంటుా సరదాపడ్డ రొేజులు పొేయి
ఏ'కాకి'కుటుంబం మాదీ
చింతలులేని కుటుంబం...
చిన్న కుటుంబం మాదీ...
అంటుా ...ఇదొే సరదా.
బాలింత..చుాలింతలతొే
పిల్లల,పెద్దల గలగల మాటలతొే
అరుగుమీది అమ్మలక్కల ముచ్చట్లతొ్
బాబాయ్,మామయ్య,
పిన్నీ,వదిన 
అక్కాయ్,అన్నాయ్
అబ్బాయ్...ఆప్యాయ పలకరింపులతొే
నిత్యంవండివార్చే 
అమ్మ,నానమ్మలతొే
బంతి భొేజనాలతొే
తాతయ్య పొగచుట్ట
రాజసంతొే
నిత్యం పెళ్ళి సందడే.

అమ్మ నాన్నలు 
మమ్మీడాడీలై
అత్తమామలు 
ఆంటీ అంకులై
బంధుత్వాలు మరిచిన
నేటి సమాజం
అరువు తెచ్చుకున్న బంధుత్వాలు
 మేము స్వాతంత్ర్యం ఇచ్చినా
మా భాష మిమ్మల్ని
పట్టి  పీడిస్తుానే ఉంటుందంటుా ఆంగ్లేయుని వెటకారపు నవ్వు చుాడని గ్రుడ్డివారు నేటివారు
బంధుత్వాలను
బందీచేసి
నాగరికత బలిసి
మమ్మీ డాడీలను 
అనాధాశ్రమాలపాల్జేస్తుా
రేపు తన కొడుకుకు తనే దారిచుాపించే నేటి తండ్రి
చుక్కలు చందమామ
పాలపుంతలు చుాపే 
తాతయ్యలేరీ? 
కమ్మటి నెయ్యి,పప్పుా వేసి
చందమామరావే అంటుా పాటలతొే మురిపించే బామ్మలేరీ?
 గారాబంచేసే బాబాయ్ పిన్నీ ఎక్కడ?
అక్క చంకనెక్కి
అన్నను ఏడిపించే 
తమ్ముళ్ళు,చెల్లెళ్ళేరి?
ఆసికాలు పట్టించే 
బావలు
గిల్లికజ్జాలుపెట్టుకుంటుా
పీటకింద పెంకులు పెట్టే మరదళ్ళేరీ?
ఏరీ?ఎక్కడ?ఎక్కడ???
××××××××××××××××
మన్నె లలిత.
హైదరాబాద్.
××××××××××××××××××
[2/10, 10:03 PM] Poet Telgu Thirumalesh: -------------🌻🌻🌻🌻🌻----------
   తేది: 10-02-2018        
    
           🌞  బందుత్వాలు🌞

అనుబంధాల లోగిలి
రక్త సంబంధాల వాకిలి
ప్రేమానురాగాల కౌగిలి

అమ్మానాన్న లతో పరిచయం
తోబుట్టవుల సహకారం
ముతైదువుల మమకారం
చిన్నాన్నల ఛివాట్లు
చిన్నపిల్లల అలవాట్లు
తాత గారి ముచ్చట్లు
పెద్దమ్మ పెద్దన్నాన్న ల పలకరింపులు
పండుగతో పరవల్లు
వికసించిన గ్రామ వాకిల్లు

పట్టణంతో వీధి దాటెను బంధువులు
ధనము మోజు తో అయ్యారు ధనవంతులు
డబ్భు తో బంధాలు బలహీనము గా మారెను
ఆత్మీయ సోదరభావము కనుమరుగయ్యను
ఉమ్మడికుటుంబం ఊసేలేదు
వ్యక్తి గత కుటుంబానికి విలువే లేదు
మనషి మనీషి గా మారెను
అహంకారం తో ఒంటరయ్యను.
        /////////////////////

                          ఇట్లు
                     నా స్వీయ రచన
         ✍....తెలుగు తిరుమలేష్
                తెలుగు ఉపాధ్యాయులు
      ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
            వ్యవస్థాపక  అధ్యక్షులు
        తెలుగు భాషా పరిరక్షణ సమితి
                  అధ్యక్షులు
       అమరచింతమండలం, వనపర్తి జిల్లా
              చరవాణి : 9908910398


✍✍✍✍✍✍✍✍✍✍
-------🙏  సమాప్తం 🙏 -------
[2/11, 10:13 PM] ‪+91 96404 07103‬: బంధం ...!!

అందంగా
ఆనందంగా
సాగిపోతున్న
జీవన సాగరంలో
ఎవరో అజ్ఞాత శత్రువు
పసిగట్టి పనిగట్టి
వల విసురుతాడు..!
అభం శుభమెరుగని
అన్నెంపున్నెం తెలియని
చేప పిల్ల ఆ వలలో చిక్కుతొంది.!
వలలో చిక్కిన చేప పిల్ల
అరిసి గీ పెట్టినా
ఆహాకారాల ఆర్తనాదం చేసినా
ముక్కలైన మనసును
చక్కబెట్టే నాధుడుండడు...!
కూలి పోయిన బంధాన్ని
నిలబెట్టే దేవుడుండడు.....!!

                                ✍🏻"మరికంటి

Comments