[1/29, 8:36 PM] Poet Ithagoni Venkateshwarlu: రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ,9912274442
అంశము:నల్లధనము
మ:
ధరలో ద్రవ్యము వల్ల బెక్కు సుఖముల్ ధైర్యమ్ము శౌర్యమ్ము స
త్వరమౌ పేరు ప్రతిష్ఠలున్ గలుగుటన్ భావింపగా వాస్తవం
బరయన్ ధర్మము న్యాయమున్ విడిచి సంపాదింప పాపమ్ముతో
పరులన్ దోచుచు నీప్రభుత్వమునకున్ పన్నుల్-ఎగన్ వేయుచున్
కరవై కూటికి పైకి ప్రక్కటెముకల్ కాన్పించ కండింతయే
ఒరె లేకుండగ రక్తహీనులయి అమ్మోశ్రామికుల్ కార్మికుల్
పరిగడ్పున్ బడికంపపిల్లలను పాపంబంచు భావించకే
మరి వారిట్టుల నుండపేదరికమున్ మత్తెక్కి కోట్లాదిగా
ధర దేశంబుల దాచిపెట్టెదరు విత్తంబెప్డు నిత్యంబురా
సరిగా చూచిన కాదు నల్లధనమే చక్కంగ తెచ్చిప్పుడే
స్థిర చిత్తంబున పంచపేదరికమే శీర్ణంబుగా చేయుడో
ధరనగ్రేసర దేశమౌతు మనదే దర్పంబుతో వెల్గెడిన్
నరలోకంబున భారతంబె యనగా నాకంబునున్ మించురా
[1/29, 9:40 PM] Poet Musthakheem విన్నర్: శీర్షిక: నల్లధనం,
తేది,29.01.2018
తెలుగు కవన వేదిక
రచన : విన్నర్
దేశానికి పట్టిన పెద్ద దరిద్రం!!
దరిద్రుడు ఆకలితో అరుస్తుంటే
పెద్దమనిషి కనిపించని ..కాల్వలో ప్రవహించి మల్లగుల్లాలు పడుతున్నాడు ..నల్లధనం
తెల్లగా మార్చడంలో నిమగ్నమయ్యాడు..
ఉన్నోడి దాహార్తి పెరుగుతోంది.. కానీ ..లెనోడి పరిస్థితి ..??
స్విస్ బ్యాంకుల్లో ..సేద తీరుతుంది ..ధనం నల్లదై..
ఆర్థిక అసమానత కు కారణ మౌతోంది !!
బీదోడిని పరోక్షంగా దోచుకోవడం లో ప్రధాన పాత్ర పోషిస్తోంది !!
లంచాల అవతారంగా సయితం మసరుతోంది !!
నల్లధనం నోట్ల రద్దుతో ఒక్కసారిగా ఉలిక్కి పడి చెత్తకుడీలతో సహా ఎక్కడెక్కడో ..ఎగిరిపడింది??!!
మాడింది ..మసయింది !!
హల్చల్ రేపి నిదురను దూరం చేసింది ..
నల్లధనాన్ని గెలికితే కొద్దిలో కొద్దీ దేశం బాగుపడుతుందేమో??
నల్ల ధనం ను రూపుమాపితే
అందరూ సమానులు ..ఇవాళ
కాకున్నా రేపన్నా వ్యవస్థలో
మార్పు రావచ్చేమో ??
నేడు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ..కుంభకోణాలుగా బయల్పడుతోంది ..
నివారించడం ..తక్షణ అవసరం!!?? దేశ ప్రగతికి ఎంతో ముఖ్యం!!***^***""
విన్నర్, కొల్లాపూర్.
[1/30, 11:11 AM] Poet Satya Neelima: శీర్షిక: నల్లధనం,
రచయిత: సత్యనీలిమ.
💰💸🏦💰💸🏦💰
ధనమా!మనిషిని నడిపించే ఇంధనమా!
పేదవాడి చెమటచుక్క ఫలితం నీవు
మనిషి సృష్టించాడు నిన్ను
కానీ, నీవు మనిషిని చేశావు మనీ షీ గా
స్కాములు,కుంభకోణాలు ఎన్నెన్నో చేసి నిన్ను ఇతరదేశాలలో భద్రపరచి మన దేశాన్ని చేస్తున్నారు పేదదేశంగా
నిన్ను అన్నారు నల్లధనమని
నీవు రావాలి మన దేశానికి
పేద,ధనిక తారతమ్యాలను రూపుమాపాలి
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కానీ, భూమి మీది మనుషులు నీ చుట్టూ తిరుగుతున్నారు
నీకోసం ఎన్ని అడ్డదారులైనా
తొక్కడానికి సిద్ధంగా వున్నారు
మనదేశం ఇతర దేశాల ముందు అప్పుకోసం చేయిచాచకుండా సంపన్నదేశంగా
ఋణరహిత దేశంగా అభివృద్ధి
సాధించాలి నల్లధనమా!
నీ సంకెళ్ళను విడిపించుకొని రా!మనదేశ ప్రతిష్ఠను పెంచు..
అందుకే అన్నారు పెద్దలు
"ధనం మూలం ఇదం జగత్" అని.
💰💸🏦💵💰💸🏦💰
✍...సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి..
[1/30, 9:41 PM] Poet Kashi Vishwanatham: ధనాన్ని
సృష్టించేదీ మనం
రద్దు చేసేదీ మనం
నలుపుని తెలుపుగ
మార్చేదీ మనం
అవినీతి తప్పని చెప్తూ
డబ్బుకు
దాసోహం మనం
ఎంతకైనా తెగిస్తాం
అక్రమ సంపాదనే లక్ష్యం
బల్లకింద
చేతులుంచుతాం
గాంధీ బొమ్మ సాక్షిగా
నిజాన్ని తొక్కిపెడతాం
నల్ల డబ్బని
కూడబెడతాం
స్విస్ బ్యాంకుల్లో
దాచి పెడతాం
ఎన్నికల్లో దారపోస్తాం
బంగారపు
మరుగు దొడ్లు
కట్టించుకుంటాం
తోటి వారికి
సాయపడం
దాన ధర్మాలకి
ఆమడదూరం
తరువాత తరాలకోసం
కోట్లు కూడబెడతాం
వాటిని కాపాడుకోడానికి
ముప్పతిప్పలు పడతాం
పి.కాశీవిశ్వనాధం
శీర్షిక : నల్ల డబ్బు
[1/31, 1:43 AM] +91 99483 57673: అంశం : నల్ల ధనం
కవి : మస్తాన్ వలి
శీర్షిక :💰 *నల్ల ధనమా !? -- ధనమే నల్ల నా*..?💰
💰 🛍 🌏 🇮🇳 📈 📉 🇮🇳 🌏 🛍 💰
నల్ల ధనం , ఎర్ర ధనం
తెల్ల ధనం , పచ్చ ధనం
ఎల్లలు ఎరిగిన ధనం
ఎల్లలే దాటిన ధనం
ఏమిటీ ... ధనాల గో (ల )డు ..?
ధనం ఎక్కడున్నా ధనమే .!!
ఎందుకు ధనానికి ఇన్ని నామములు
దేవుడి కి .. నామం పెట్టి
మనిషి కి ... పంగ నామం పెట్టి
కామా (లు) లేకుండా....
రోమాలు నిక్క బొడిచినా
తాపీగా, హ్యాపీగా...
సంపాదించే ధన మే ...నల్లధనం
ఆ తెల్ల ధన రూపాంతరమే
ఈ నల్ల ధన రూపం.
కష్టించు వాడి ధనము తెల్లన
వాడికి అష్టైశ్వర్యాలు అందునా...??
నటించు వాడి యందు ను
నష్ట పరుచు వాడి యందును
అల్లన మెల్లన ధనము నల్లన
ఇదే గదా... జగమంత యెరిగిన
నోరు మెదపని .. బహిరంగ రహస్యము
నల్ల ధనమునుచెమట పట్టించి
తెల్లని రంగు పూయు వాడెవ్వడు
ఈ ప్రపంచమున పైసలకే లొంగని వాడెవ్వడో..??
పాపపు సొమ్ము చేజిక్కించు కొనక
వొద్దు వొద్దు ఈ సొమ్ము ..
నా వద్ద నుంచి పొమ్ము
అని అను వాడెవ్వడు..??
దొడ్డి దారిన మసి పూసి
సంపాదించిన దే కదా ..!?!
ఈ నల్ల ధన మనగా ?
నాకు అక్రమంగా
నే కష్ట పడ కుండా నే
నా సంపద వంద రెట్లు పెరిగితే..
నీకు అందు పది శాతం వాటా
ఒప్పందం బేసు కుంటాడు
దేవుని మోక్కి ..
నరునే మ్రోక్కి నా...
మోక్కిన వాడికి ముక్కు తాడై
వాడిని ఏకు తాడు,గోకుతాడు
ఒకటి పీకుతా,వాడి జీవితాని కే
మేకై దిగు తాడు,.. చాకై పొడుస్తాడు
అందుకే...
సామాన్యు డంటే భయం
మనీ " షీ " అంటే నయం
అంటారే...
ఈ నల్ల ధన కుబేరులు
స్వదేశంలో... సన్మానించ కున్నా
అక్రమ సంపాదనని అవమానించినా
సిగ్గు విడిచి... చిందు లేయ వచ్చు
విదేశాల లో ... విహ రించ వచ్చు
చిత్త కార్తె కుక్కలా సొంగ కార్చ వచ్చు
అత్తరు పూయ వచ్చు ...
మత్తులో మునగ వచ్చు
మస్తుగా , జబర్దస్త్ గా ...
దునియా మోతం డేక వచ్చు
కాయ కష్టం చేసే వాడి.. డొక్క నిండక
పేద వాడు .. నిరు పే దైయ్యా డే ...!!
నులక మంచంపై కాళ్ళు ముడుచు కొన్నాడే
నల్ల ధనం తో...
బలిసిన వాడు..
నలుసంతైనా తగ్గక
అందరినీ అతడు...
చులకన చేస్తాడు
పలుచన చేస్తాడు
పంచ భక్ష్యాలు సుష్టిగా,
పుష్టిగా మేస్తాడు
సుకు మెత్తని, కుసు మాల
పరుపు పై కునుకు తీస్తాడు..
అంతెందుకు భయ్యా
నేడు కార్పోరేటు స్కూల్స్
కళాశాలలో చోటు
విద్యా లయాలలో రేటు
వాడెబ్బ సొమ్ము కాదుగా...!!?
నేడు బహుళజాతి
దిగ్గజాల వద్ద కోట్లు కోట్లు
అది వాడి కష్టార్జితమా..?
లేక వాడి యబ్బ కష్టార్జితమా..??
విద్యార్థుల ... తల్లిదండ్రుల...
రక్త మాంసాల తో ...
టీచర్ల శ్రమ దోపిడీ తో
నిర్మించిన వి కాదా ... ?!!
కార్పోరేట్ భవన సముదాయం
భయ్యా... నేటికీ కొన్ని చోట్ల
ప్రభుత్వ స్కూళ్ళ ల్లో
గవర్నమెంట్ దవాఖానా లలో
ఉచ్చోసు కొనే... మరుగుదొడ్డి లేదే ..!!
కార్పొరేట్ ఆసుపత్రుల లో
గవర్నమెంట్ వేటెయ్యని
ప్రవేటు విద్యా లయాలలో
పాలీష్... బండల సొగసులు
అయినా... వాడికి నష్ట మంట. !!
ఏం కష్టపడుతున్నాడ నో...!?
అన్నీ అమ్ము కొని... కష్టానే నమ్ము కొని
కష్టించే వాడి సొమ్ము...తెల్ల ధన మైతే
కష్ట పడక దోచు కొనే.. వాడి సొమ్ము
నల్ల ధన మవదా...?
ముమ్మాటికీ... నల్ల ధనమే.
💰🛍 🌏 🇮🇳 📉📈 📈📉 🇮🇳 🌏 🛍💰
షేక్. మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్ : 99 483 57 673.
[1/31, 5:16 PM] +91 96189 61384: శీర్షిక: నల్లధనం
రచయిత: ఉప్పరి తిరుమలేష్
💴💴💵💵💵💵💵💵
నల్లధనం...
మూలధనం...
దొంగధనం...
అవినీతిధనం...
ప్రపంచాన్ని శాసిస్తున్న
అక్రమార్కుల మూలధనం
ఇదే ఇదే నిజం నిజం
ఇదేనల్లధనం
ప్రాజెక్టులు కట్టినారు
పక్కజేబు నింపినారు
డబ్బులు దండుకుని
నల్లధనం పెంచారు
పైకేమో అభివృద్ధి
లోపలేమో కుళ్ళుబుద్ధి
జిల్లానుదాటించిన జిత్తులమారి నాయకులు
రాష్ట్రాలను దాటించిన రహస్య ముఠాలు
సీక్రెట్టుగా చేరినాయి స్విస్ బ్యాంకు అకౌంట్లో
పటాపంచలు అవ్వాలి స్విస్ బ్యాంక్ అకౌంట్లు
పదిమందికి పంచాలి నల్లధనం మూటలు
ధరించేది తెల్లదనం
దాచేసి నల్లధనం
పైకేమో పటారాం
లోపలేమో నల్లధనం
చెప్పేది శ్రీరంగనీతి
చేసేది అవినీతి
పన్నులతో పెట్టినారు ప్రభుత్వానికి ఎగనామం
అవినీతిలో మీయంత
ఎక్స్ప్ ర్టు ఎవ్వరంట
చెల్లవు మీ కల్లబొల్లి
కబుర్లన్ని చెదలుపట్టె
అవినీతిని అంతం చేద్దాం
నల్లధనం పంచుదాం
భావి భారత పౌరుడా
భారతీయ వీరుడా
చేయి చేయి కలుపుదాం
నడుము కట్టి సాగుదాం
ప్రపంచాన మనదేశం
ప్రతిభను నిలబెట్టుదాం
💴💴💴💴💴💴💴💴💸💸💸💸💸💸💸💸💵💵💵💵💸💸💸💵రచన
ఉప్పరి తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయుడు
జీనియస్ పాఠశాల
9618961384
[1/31, 9:21 PM] Poet Telgu Thirumalesh: ----------🌻🌻🌻🌻🌻------------
అంశం మనది..కవితనాది..
కవతాసారంసమాజానికి!
తేది : 31-01-2018
🌝 " అభివృద్ధి చీ(క)టి ..నల్లధనం"🌝
అజ్ఞానపు చీకటిలో
ఉద్బవించిన అక్రమధనం ఈ నల్లధనం
శ్రమదోపిడి నుండి
మొలిచిన ముళ్ల వనం ...
సమాజ కుటుంబాల అభివృద్ధి కి
ఆటంకం కలిగించి కూడబెట్టిన ధనం ఈ నల్లధనం..
శ్రమలేకుండా విజ్ఞానాందాకారంలో
అక్రమంగా సంపాదించిన ధనం..
రాజకీయ అండదండలతో
సంపాదించిన చీకటి వనం..
మానవత్వపు విలువలను మరిచి
క్రూరమృగాల మనుషుల లో
ఉండే అవినీతి అలజడి ఈ నల్లధనం..
ప్రభుత్వ రుణo మరిచి
ప్రభుత్వాలను ముంచి
అభివృద్ధిని తుంచి
అభయముగా మారి
హద్దులు దాటి
హద్దులు మీరినది ఈ ధనం..
లంచాలతో లాచనంగా మారి
నిజాయితిని నిద్రలోకి మార్చి
అన్యాయాన్ని ధరించి
అవకాశాల ను చేదించి
ప్రభుత్వానికి పంగనామం బెట్టి
సంపాదించిన ధనం ఈ నల్లధనం..
బడావ్యాపారస్థులకు బలముగా మారి
బహుళ జాతి కంపినీలకు బహుమతిగా మారి
కార్పొరేట్ సంస్థలకు కుబేరుడిగా మారి
రాజకీయ ముసుగును దరించి
రాజ్యము వదిలి
రస్తా మార్చి
రంగును మార్చుకుని అయినది ఈ నల్లధనం..
ప్రభుత్వానికి తప్పించుకొని ఫలాయనము చేస్తున్నావు
స్కాముల కుంభకోణాలతో దారిని వెతుకున్నావు
స్వీస్ బ్యాంకులో మూలుగుతున్నావు
బీనామిలా పేర్లతో మురిసిపోతున్నావు..
తమ తరాల వెలుగులకు
ఆశలుగా మారి కోట్లు కూడబెడుతున్నావు..
వాటిని కాపాడుకోవడానికి
ముప్పుతిప్పలు పడుతున్నావు..
ఇది మనదేశం..అందుకే అయింది పేద దేశం...
నల్లధనం తెల్లధనముగా
మారేదెప్పుడు
పేదలకష్టాలు తీరి
సమాజ ప్రగతి చాటేదెప్పుడు..
విదేశాలకు తరలిన అక్రమ ధనం
తరలి రావాలి మన మూలధనం
తిరిగి పంచాలి అందరికి ఆ ధనం
తద్వార జరుగాలి మన అభివృద్ధి ప్రయాణం..
నల్లధనం నిర్ములించాలి
అవినీతిని అరికట్టాలి
ప్రభుత్వ పరిపాలనను
సుసంప్పన్నం చేయాలి..
ఈ డబ్బులు రప్పిస్తే
ఈ ధనమును తెప్పిస్తే
ఈ అవినీతిని అరికట్టిితే
భారతదేశం భాగ్యదేశం
అవుతుందో లేదో తెలియదు కాని
అన్నపూర్ణ దేశముగా
పేదలు లేని దేశముగా
నిజాయితి గల దేశంగా ఉంటుoదన్నది మాత్రం
నిజం... నిజం...నిజం !
----------/////--------
👉
నల్లధనం ను నిర్ములిద్దాం....నవ భారతముకు స్వాగతం పలుకుదాం.
ఇట్లు
నా స్వీయ రచన
✍....తెలుగు తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
వ్యవస్థాపక అధ్యక్షులు
తెలుగు భాషా పరిరక్షణ సమితి
అధ్యక్షులు
అమరచింతమండలం, వనపర్తి జిల్లా
చరవాణి : 9908910398
✍✍✍✍✍✍✍✍✍✍
-------🙏 సమాప్తం 🙏 -------
[2/1, 3:12 PM] Poet Akundi Sailaja: తెలుగు కవన వేదిక
ఆకుండి శైలజ
అంశము...నల్లధనము
ఊరు...విజయనగరం
చరవాణి ....8347513853
ఆటవెలది....
కొల్లగొట్టిధనము కోట్లకు పడగెత్తి
నల్లధనము బేర్చి నయము గాను
ఎందు బడితె నందు ఇంపుగా దాచుచు
ఇల కుబేరులయ్యెపొలుపు విడిచి..!!!
తెల్లవారినైన దేశమ్మునుండియు
తరిమి నాము గాని,ధరణిలోన
నల్లధనము దరుమ నరులకు సాధ్యమే?
విస్తరించి యుండె విశ్వమంత..!!!
అక్రమార్కులకిల నాటలు కట్టగ
పెద్ద నోట్ల నెల్ల రద్దు జేసి
నల్లధనము తవ్వి నాశనమొనరించి
చేయ మేలు నదియె చేటు దెచ్చె..!!!
ప్రక్కదేశమందుచక్కగా డబ్బును
పొదుపు జేయ నదియె పృధివిలోన
నల్ల ధనమె గాని తెల్ల ధనము గాదు
దారిమూయ కున్న ధర్మమగునె..!!!
[2/1, 4:36 PM] Poet Bharathi: 9491353544
B Bhaskara bala bharathi
Anantapuram
అంశము నల్లధనము,
కోట్లువిలువగల నోట్ల
ముద్రణతో
కూడబెట్టీ
దిక్కూదివాణం లేని
అమాయకుల ఆస్తులుదోచీ
రాజకీయ అండదండలతో
లంచాలుమరిగీ
అందినకాడికి అందిన
శ్మశానభూముల్నీ
కబ్జాచేసీ
రౌడీల అండదండలతో
అరాచకముసృష్టించీ
విలువల వలువలను వదలేసీ
విలువగలపంటభూముల్ని
కబళించీ
కూడబెట్టిన నల్లత్రాచుపాపిష్టి
నల్లడబ్బుకొడుకులూ
కూతుళ్ళకు లక్షణమైన
ఉద్యోగాలకై లంచాలు
ముట్టజెప్ప
పుట్టబోయే మనుమలూ
మనమరాళ్ళ మనుగడకై
కోట్ల దోచుకున్న దొంగడబ్బు
అనిశా కబంధహస్తాలలో
చిక్కకుండ
పవిత్ర దేవతా గ్రథాల దాచినట్లు
కోట్ల కట్టల నల్లధనం
స్నానపుగదుల గోడల్లో
పడకగదుల పరుపుల్లో
తుదకు పట్టుచీరలమడతల్లో
దాచ
పాములు జేరిన చీమలపుట్టలట్లు
చెదపురుగులచేరికతో
చెత్తైన నీ నల్లధనం
చూచి నీరుగారడమెందుకు , ?
స్విస్ బ్యాంకులోదాచినా
కడుపోవున్న అమ్మ
కనకమాననట్లు
దోచుకుని దాచుకున్న నీ ధనం
బయటపడనని దినదిన గండంగా బదుకు భారంగా
మోసేదాని కంటే
దాచిన సొమ్ము
కూడుగూడు గూడ్డా
లేనివారికి పంచు
నీశ్చింతగా జీవించు నూరేళ్లూ
!!
[2/1, 4:45 PM] +91 94411 10427: నల్లధనం
దొంగలు దొంగల్లా కాకుండా దొరల్లాఎలా ఉంటారో
నల్లడబ్బు నల్లగా గాకుండా రంగుల్లో మెరిసిపోతుంది సుమా!
కానీ దొంగలు దొరల్లా దర్జాగా రోడ్లమీద తిరుగుతుంటే
రంగుల్లో మెరిసిపోయే నల్లడబ్బు మాత్రం పెట్టెల్లో మూలుగుతుంటుంది
ఆభరణాల రూపంలో మెరిసిపోతుంటుంది
బినామీల రూపంలో విస్తృతమవుతూ మరింత పెరుగుతూ ఉంటుంది
విదేశాల లోని బాంకుల్లో రహస్యంగా జమ జేయబడుతూ ఉంటుంది
నల్లడబ్బు తెల్లడబ్బుగా మారాలంటే నోట్ల రద్దు చేయడంగాదు
యువత లో మార్పు రావాలి,ప్రశ్నించాలి,
అవినీతి లేని సమాజాన్ని సృష్టించడానికి అవిరళ పోరాటం చేయాలి
ఎందుకంటే నేటి యువతనే రేపటి నాయకులు కాబట్టి....
మేడిచర్ల హరినాగభూషణం.
తెలుగు ఉపన్యాసకులు,గద్వాల.
[2/2, 12:09 AM] Manne Lalitha: 7416863289.
మన్నె లలిత.
హైదరాబాద్.
శీర్షిక___నల్ల ధనం
×××××××××××××××××
నల్లధనాన్ని నల్ల బంగారంగా దాచువారు
తినబొేరు మేలిమి బంగారం
డబ్బు ముాటలాగు పొట్టపెరుగు
పట్టెడన్నము తినుటకు ప్రాప్తములేక
ముాడుముద్దలతొే
త్రేన్పులుత్రేన్చుచు
భుక్తాయాసముపొంది
పట్టుపరుపున శయనించిన లేదు సుఖము
కలతనిద్ర పొేవుచుండు కా సులు కలలొే
నీతిబాహ్యమైన పనికి నిద్దురేది?
పాదచారుల దారిలొే
గంజితాగి శయనించిన
బిచ్చగాడు చుాడు ఆదమరిచిన నిద్ర
పాపభీతితొేడ నువ్వు పసిడి పాదుకలు
స్వామికిచ్చిననేమి ఫలము?
చుాచుచుండలేదా ఆస్వామి నీ పాపపు పనులు
మెదడున్న మనిషివి
తినతిండి కట్టుబట్ట
నీ తరానికి సరిపడ సంపాదన
చాలదానీకు చచ్చువరకు
వెంటరాని ధనమునకై
వెర్రి ఆశ ఎందుకు?
నల్లధనమంటే నల్లత్రాచునుకుని
పేద విద్యార్థుల చదివించి పుణ్యమందు.
××××××మన్నె లలిత×××.
[2/2, 3:11 PM] Poet Kusumanchi Sridevi: అంశం-నల్లధనం
పేరు-కుసుమంచి శ్రీదేవి
---------------------
పవిత్ర గ్రంధాలన్నీ
ముక్తకంఠంగా విశదపరుస్తున్న...
కాలగర్భములో కలిసిన
జీవితాల చరిత్రలు
గుణపాఠాలుగా అడుగడుగున
ప్రత్యక్షమౌతున్న...
పుట్టినప్పుడు తెచ్చిది లేదు...
పోయినప్పుడు మోసుకుపోయిది లేదు..
చెవులో ఇల్లుకట్టుకుని
నీ మేలు కోసం
ఓంకార నాదములా
అణువణువూ నీకు బోధిస్తే...
బుర్రలేని మనిషిలా
ఒళ్ళు వంచని ఛీడపురుగులా..
పరుల కష్టార్జిత స్వేదంతో
పరాన్న భుక్తలా కడుపునింపుకుంటావా!
చేయిచాచితే లంచం..
ప్రతీపనిలోని నీతిమాలిన
అవనీతి...
అన్యాయంగ జలగలా పీల్చే
ప్రతీ పైసా ..
పేదవాడు ఆకలితో ధారపోసే
రుధిరపు బొట్టు...
పరులసొమ్ము పాము వంటిదని
మరిచినావా!
అన్యాయంగా కూడబెట్టిన
నల్లధనం ,
విషం కక్కి నిన్ను సంహరించక తప్పదు.
కాలానికి నువ్వు చుట్టానివి కావు!
తప్పించుకు తిరగడానికి!
సామెతలేవి ఆకాశము నుండి
ఊడిపడలేదు....
తరతరాల అనుభావాల
నుండి జనించనివి..
సత్యం గ్రహించి చూడు..
కాలపుటలలో ఉన్నతంగా
నీ చరిత్ర లిఖించుకో!
[2/3, 3:13 PM] +91 99085 60246: 🌷
రంగు కాగితం
ధనం కట్టిపెట్టి కొల్లగొట్టి కోట్లు కూర్చి
తన ,మన అనే భావాలను రూపు మాపుకొని
చిన్న, పెద్ద మరచి బీద,సాదలకు దానామీయక మాయలు మోసాలు మోహరింపజేస్తాడు ఇంట బయట ఈసడింపులు చూస్తూ కూడా ధనానికి బానిస అయ్యాడు మనిషి.
మనిషి తీరుమారె రంగు కాగితం జోరు పెరిగె, కావు..కావు...మనీ !!!
కాకి కేకపెట్టినా లెక్క పెట్టరు.
దాచినట్టి డబ్బు ధడ.. ధడలుపుట్టించి
దండాలు పెట్టించు,
కూడబెట్టిన పైకం పరుపులాయే. డాబుపోయి దర్పంపోయి దండుగలు మిగులు.......
రంగు రంగు కాగితాలు నల్లధనముగా పేరుమారెను
పుట్టుకతో ఏమి తేలేదు.
చివరకి ఏమి మిగులలేదు.
ఎ.భాగ్యచంద్రిక .
[2/4, 12:07 PM] Poet Palloli Shekar Babu: 👹👹👹👹👹👹👹👹👹
"దేశ ప్రగతి కి అవరోధం - నల్ల ధనం "
👹👹👹👹👹👹👹👹👹
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర 9490484316.
ఏది నల్ల ధనం. . ? !
ఏది తెల్ల ధనం . . ? !
అక్రమ పద్దతి ధనమే నల్ల ధనం !
సక్రమ పద్దతి ధనమే తెల్ల ధనం !
నల్ల ధనం సర్వత్రా నేరం . . !
తెల్ల ధనం చట్టఆమోదం. . !
ధనం సమాజంలో మనిషి
జీవించటానికి అవసరం !
అది లేక మనిషి మనుగడ ప్రశ్నార్థకం
ధనం సృష్టికర్త మనిషి
ఆ ధనానికి బానిస మనిషి
ధన సంపాదనకు తీవ్ర కృషి
ఎందరు అయిన పరవాలేదు నుసి !
మరెందరికో పూస్తాడు మసి !
అంతా నాకే కావాలి !
అంతా నాదే సాగాలి !
అందర్నీ అధిగమించాలి !
అందరి పై పెత్తనం చెలాయించాలి !
సంకుచిత మనస్తత్వం
మనిషిలో రంగులుగుతున్న స్వార్థం
నల్లధనం సంపాదనకు మూలం
బడాబాబులకే సాధ్యం
బూర్జువా నాయకులతత్వం
ఇండియాలో ఆర్జితం
ఫారిన్ లాకర్లో దాపరికం
దేశ ప్రగతికి అవరోధం
నల్లధనం ! అక్రమధనం ! !
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
- పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర, 9490484316.
🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

Comments
Post a Comment