యువత - భవిత



12న స్వామి వివేకానంద జయంతి 
  
****************
ఓయువతా . . ! 
***************
ఓ యువతా . . . ! 
నీవే ఈ దేశ భవిత
ఆలోచన ఆచరణ 
నిరంతరం సాగాలి పరిశోధన 

సమస్త రుగ్మతల సమాజానికి 
చికిత్స చేసే వైద్యుడు నీవే 
అజ్ఞాన చీకటి బ్రతుకుల్లో 
విజ్ఞాన వెలుగుల నీతి సూర్యుడు నీవే 

కొత్త రక్తం  సరికొత్త నాయకత్వం 
దేశ ప్రగతికి నేడు అత్యవసరం 
దేశ రక్షణ జాతి సంరక్షణ 
నేటి యువత తక్షణ కర్తవ్యం 

స్వామి వివేకానంద జీవితం 
కావాలి నీకు ఆదర్శం 
రగలాలి నీలో స్వామిచైతన్య స్పూర్తి 
చాటాలి విశ్వవేదిక పై భరత జాతి కీర్తి 

అందుకే  ఓయువతా . . ! 
ఉప్పెనలా ఊరికిరా . . ! 
ఉల్కలా దూసుకురా. . !   
తూటాలా చేధించు . . !
కొత్త చరిత్ర లిఖించు . . ! 

****************************
పల్లోలి శేఖర్ బాబు -  9490484316
****************************
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

యువత--భవిత
         *****************

ఓ ...నవయుతా
"నయాగారం" లా దూకిరా

నవ నిర్మాణ రూప శిల్పివై
నవ సమాజానికి దిక్సూచివై

నిండుగా గుండెబలం నింపుకిని
నిత్య. చైతన్య జ్ఞాన కిరణమై

వెలుగులు నింపే జాతి రత్నమై
దేశ భవితకు పునాది రాయివై

మేల్కొని మేల్కొపే తారవై
ఉత్సాహ ఉత్తేజ తేజోవంతుడవై

నిర్లక్ష్యం,నిర్లిప్తతను నిర్వీర్యం చేసి
జాతి జనులకు చైతన్య దీప్తివై

అలసత్వాన్ని,అధైర్యాన్ని పారద్రోలి
అభ్యుదయ ప్రగతిమార్గ సూచివై

శక్తి యుక్తులను కూడదీసి
విశ్వవిజ్ఞాన వినయ శీలురజేసి

వ్యసనాలకు,అసమానతలకు
అడుగడుగునా పాతరవేసి

నిత్య చైతన్య శీలుడవై
నిలుపరా నీజాతి వైభవగీతి.!!

         పూదత్తు భాస్కర్
    పాఠశాల సహాయకులు,తెలుగు.
       తేది:  10-01-2018


 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
సూరారం కాలని, హైదరాబాదు.

శీర్షిక : యువత - భవిత

ఓయువతా మేలుకో
నీ భవిత తెలుసుకో.... (2)

మన తండ్రులు, మన తాతలు 
ప్రాణాలకు తెగించారు.... (2)
పోరాటం  చేశారు..
స్వాతంత్ర్యం తెచ్చారు.... ఓ యువతాII

తెల్లదొరలు వెళ్ళినారు...
నల్ల దొరలు వచ్చినారు...(2)
రాజులంత సచ్చినారు...
రౌడీలు బతికినారు.... ఓ యువతాII

బూములు ఖబ్జాలు జేస్తు
భవంతులే నిర్మిస్తూ... (2)
పేదొడి పొట్టగొట్టి
పొలిమెర దాటిస్తుండ్రు... ఓ యువతాIl

కాంట్రాక్టుల పేరుతోటి
కోట్లు కొల్లగొడుతుండ్రు... (2)
నాణ్యతలే లేకుండా
కట్టడాలు కడుతుండ్రు.... ఓ యువతll

కల్తీ సొమ్ములు జేస్తూ
ఖార్ఖానాల్ నడుపుతుండ్రు (2)
కల్తీ నోట్లు అమ్ముతు
కోట్లకు పడిగెడుతుండ్రు.... ఓ యువతll

యువత నేడు నిద్దురతొ
మొద్దుబారి పోయింది... (2)
సోపతెక్కువయ్యింది
సోమరిలా అయ్యారు.... ఓ యువతాll

మద్యమంటు... మగువంటూ
మానవత్వమే మరిచి... (2)
పబ్బులెంట, పార్కులెంట
పరుగెడుతూ వెలుతుంది... ఓ యువతll

రాజకీయ రాక్షసేమో
జనులపీక కోస్తుంటే... (2)
పదవీ వ్యామోహాలు..
పట్టపగలె దోచుకుంటే... ఓ యువతాll

నీ తండ్రుల, నీతాతల 
పౌరుషాన్ని దెచ్చుకోరా.. (2)
అన్యాయం ఎదురించు
అక్రమాన్ని తరిమికొట్టు... ఓ యువతll

కల్తీలను నివారించు
నిజాయితీ నిలబెట్టు.. (2)
ఖబ్జాలను కాపాడు...
పేదోడికి అండగుండు... ఓ యువతll

గతఅమరుల ఆశయాలు
నెరవేర్చే వీరుడవై...(2)
వీర జవానులకు నీవు
వారసుడవై నిలిచిపో... ఓ యువతాll

ఓ యువతా మేలుకో
నీ భవిత మార్చుకో...(2)
నీ భాద్యత తెలుసుకో...
భాద్యతెరిగి మలుసుకో.... ఓ యువతll

యువతకు అంకితమిస్తూ....

గోగులపాటి కృష్ణమోహన్
సీనియర్ జర్నలిస్టు
9700007653


🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


అవనిశ్రీ: *మేము యువకులం*

        
మేము యువకులం
మాది నవకులం
మేము యువకులం
మేము ఈ దేశ భవుకులం
యువతరం
జాతి నవతరం
కండ్లల్లో మెరిసేటి కాంతులతో
అడుగుల్లో అగ్నిపర్వతాలను
 ఎక్కేటి పిక్కబలం
నరనరాల్లో తొణికిసలాడే
ఉక్కుబలం
తేజస్సులో తొలిపొద్దుకే
కంటగింపయ్యేలా నవకాంతులు
ఈ దేశ భవిష్యత్తునంత
యువత నుదుటి రాతల్లో
అరచేతి గీతల్లో
దాగున్నది
యువత అంటే
ఈ దేశ భవితే
తెలుగు సాహిత్యమంతటి
కవితే.

*రచన*  *అవనిశ్రీ*

దాసరిపల్లి,గద్వాల్
9985419424

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


నేటి యువత

పదికే ప్రేమలో పడిన ప్రాయమని చెప్పనా 
ప్యాకెట్ మనీతో సిగరెట్ ప్యాకెట్లు ఖాళీచేసే వయసని చెప్పనా
పొగరు బట్టిన కోరికలు కలిగిన పోట్లగిత్తని చెప్పనా
పనికిమాలిన సహవాసాల సంగమం అని చెప్పనా
ఏమని చెప్పను నా దేశ యువతరపు ఘనత గూర్చి

పేస్బుక్ పరిచయ పరిమళమని చెప్పనా
పబ్బులతో గబ్బులేసిన జీవితమని చెప్పనా
విజ్ఞానయాత్ర పేరుముసుగులో సరసాలని చెప్పనా
విదేశీ కల్చర్ కు వెల్కమ్ చెప్పిన వివేకులని చెప్పనా
ఏమని చెప్పను నా దేశ యువతరపు ఘనత గూర్చి

తల్లిదండ్రులు మాటవినని తపస్వీలని చెప్పనా
వేగానికే పాఠాలు చెప్పు పండితులను చెప్పనా
కౌమార కలల కెరటాలపై కోరికలను నిలిపిన నిపుణులని చెప్పనా
మితిమీరిన ఆశలతో అడ్డదార్లకు ఆహ్వనం పంపే అవధూతలని చెప్పనా
ఏమని చెప్పను నా దేశ యువతరపు ఘనత గూర్చి

మద్యం సీసాకు మిత్రులైన మేధావులని చెప్పనా
జీవన గమ్యం మరిసిన మతిమరుపులని చెప్పనా
నెట్టింటి అశ్లీలతల ఆప్తమిత్రులని చెప్పనా
సొంతింటి తేజస్సును వృధా చేయూ తేజోమూర్తులని చెప్పనా
ఏమని చెప్పను నా దేశ యువతరపు ఘనత గూర్చి

తలకుమాసిన ప్రతోడి ఉపన్యాసాలకు ఉడుకురక్తంతో 
దర్నాలు చేయూ దయామయులని చెప్పనా
డ్రగ్స్ మత్తుకు చిక్కి చిత్తవుతున్న అమాయకులని చెప్పనా
యూట్యూబ్ ఊభిలో కూరుకున్న యువతని చెప్పనా
వాట్సాప్ గోడలపై నిర్మించిన భవితని చెప్పనా
చాటింగ్ పేరుతో మలినపు మీటింగ్లు పెట్టే మనుషులని చెప్పనా
రోజుకో సీతతో గీతదాటే నేటి రాముళ్ళని చెప్పనా
ఏమని చెప్పను నా దేశ నేటి యువతరపు ఘనత గూర్చి

చెప్పుకుంటే సిగ్గుచేటు
చెప్పకుంటే దేశం ఏమవుతుందో అన్న కలవరపాటు 
ఎటువైపో నేటి యువతరపు ప్రయాణం 
ఆలోచనల ఊహకు అందని శూన్యం
                *అభిరామ్* 
               970415364
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

@ ఓ యువతా @ 

దేశాభివృద్ధికి మూలం యువత
భావితరాలకు మార్గదర్శి యువత
ఆలోచనలెరిగిన యువజనమా
జాతిని నడిపించే రవికిరణమా
ఆశయాల సాధనకు అనుక్షణం
అహర్నిశలా కృషి చేస్తూ
భావి భారతానికి వన్నె తెచ్చిన
వీరుల వారసులు యువత
కొందరు విదేశీ మోజులో తమ
భవితను నాశనం చేసుకుంటూ
మత్తుపదార్థాల మాయలో పడి
సభ్య సమాజం తలదించుకునేలా మారుతూ
తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్న 
ఓ యువతా!ఒక్క సారి
యోచించు మీ వల్లే అఖండ భారతం ప్రపంచంలో అత్యున్నతంగా ఉండేలా జరగాలి 
యువజనం మీరే మన దేశ ప్రభంజనం...

       ✍...సత్యనీలిమ,
           ఉపాధ్యాయురాలు,
            జీనియస్ పాఠశాల,
                    వనపర్తి.

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

@ ఓ యువతా మేలుకో @

నేటి యువత ఇంటర్నెట్ ఇంతికే బానిస
అయినా మీలో ఉంది జిజ్ఞాస
అయినా ఎందుకు మందుకు బానిస
అయినా ఉంది ఇక జీవిత ప్రయణిక
ఇప్పుడైనా మేలుకో ఇక
ఓ యువతి యువకుడా
ఇక నైనా మేలుకో
జీవితాన్ని శిల్పంగా మార్చుకో
ఆశయ సాధన అలవర్చుకో
పట్టుదలనే పదిల పర్చుకో
ప్రజ్ఞావంతుడుగా జీవించుకో
అమ్మ మాటే ఆయుధం
నాన్న మాటే న్యాయం
దేశ ప్రగతిని మార్చు యువకుడా
యువజన దినోత్సవం సాక్షిగా
నీ జీవిత లక్ష్యం మార్చుకో
ఓ యువతీ యువకుడా...

       ✍.ఉప్పరి తిరుమలేష్,
       తెలుగు ఉపాధ్యాయుడు,
             జీనియస్ పాఠశాల,
                  వనపర్తి.
      చరవాణి:9618961384

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ఓ ..యువతా మేలుకో ..సమయాన్ని ఏలుకో
మంచి భవిత కై నిరంతరం శ్రమించు ..ఇది తెలుసుకో ..లక్యం పై గురి పెట్టు ..పట్టుదలతో ..సాధించు ..శోధించు ..ఆ తదుపరి ..ఆనందించు తలిదంద్రులను ..ధిక్కరించకు ..పూజించు ..వారి ..కలలు ..మన్నించు ..సూర్యుడిలా వెలుగొంది ..వారిని సంతోష పెట్టు ..జీవితాన్ని ..పెడదారి లో పడనీకోయి ..చేజేజేతుల ..నాశనం చేసుకోకోయి ..ధ్యాస తో .జీవించోయి ..కన్నవారికి ..కడగండ్లు ..మిగల్చకోయి ..స్వదేశానికి సైతం మంచి పేరు తెచ్చి ..మంచి పౌరుడవనిపించవోయి ..ఓ..యువతా ..లే ..నిదుర నుండి ..మేలుకోవోయి ..

విన్నర్ ..కొల్లాపూర్ .

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀


దండ్రె రాజమౌళి
10-1-2017
శీర్షిక : యువత
పాశ్చాత్య సంస్క్రుతిమోజులో
భాయువత సంప్రదాయాల్ని వెలివేస్తూ
దేశీయతను పాతరేస్తూ
డాలర్లకై వెంపర్లాడుతూ
ఉన్న ఊరును వదిలి
కన్నవారిని వదిలి
విదేశీయతలో పునీతమౌతూ
దేశీయతనే త్రుణీకరిస్తూ
యువతరమా... నీదారి ఎటువైపు?
భావితరమా...  నీఆరాటం ఎవరివైపు?
వ్యసనాల పల్లకీలో ఊరేగుతూ
వారసుల నల్లాడించే పయనం!
రోగపీడితులూ అనారోగ్య కారకులూ
జాతిని నిర్మించ తరమౌనా?
సమాజ గతిని
మార్చేశక్తిగ మారునా?
ఉడుకు రక్తం ఉప్పెనై
ఉక్కుపిడికిలి సునామిగా మారి
శత్రువుల నెదిరించాలి గదా...
సమస్యల తుదముట్టించాలి ...
యువత నిలబడితే కదనోత్సాహం!
యువత కలబడితే సమస్యల సాధనం!!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

యువత - భవిత
వాసుదేవమూర్తి శ్రీపతి

మస్తిష్కంలో నీతో నువ్వు
యుద్ధం చెయ్యి ఓ యువత
నిద్రిస్తున్న నీలో శక్తిని
సిద్ధం చెయ్యి ఓ యువత
బద్ధకమన్నది నీ తొలి శత్రువు
మర్ధించెయ్యి ఓ యువత
మనసున నిండిన వ్యర్ధాలన్నీ
ఖాళీ చెయ్యి ఓ యువత
ఖాళీ మనసున ఙ్ఞాన జ్యోతిని
వెలిగించెయ్యి ఓ యువత
అసాధ్యమన్నది లేనేలేదని
రూఢి చెయ్యి ఓ యువత
భవితకు స్పూర్తిగ నిలిచే
ఆశయ సాధన చెయ్యి ఓ యువత
దుర్గుణములన్నీ నిర్దయగా
దగ్ధం చెయ్యి ఓ యువత
మరో ప్రపంచపు మహా సైన్యం
మీరే మీరే ఓ యువత

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

 💪🌹🌹  *యువతరం*  🌹🌹💪

తరం తరం 
నిరం తరం
యవ తరం
గరం గరం
నిరంతరం 
శ్రమించే
యువ తరం
మన కొక
 అపురూప వరం
శ్రమించని ...
నవ యువ తరం
శరం శరం

షేక్ మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత
జంతుశాస్త్ర అద్యాపకులు
సెల్  నెంబర్::  99 483 57 673.
----------------------------------------

తేది: 10-01-2018.బుధవారం

                🌞  యువత మేలుకో
                      మంచిని పెంచుకో ! 🌞

ఓ యువత నీవు మేలుకో...
నీలోని మంచిని పెంచుకో...
అసహనం నీ దరి చేరనియకు..
భయం నీ ఒడిలోకి రానియకు...
కష్టాలకు కన్నీళ్లను కార్చకు...
సమస్యకు  పరిష్కారం  వెతుకు...
నీ గతం గొప్పది...
నీ సంప్రదాయం గొప్పది...
కాని వర్తమానం ఇబ్భందిగా ఉండవచ్చు...
సవరించుకుంటే ...
నీ భవిషత్తును బంగారంగా మార్చుకోవచ్చు...
ఓ యువత ఆత్మ న్యూనత వదులు...
ఆత్మ గౌరవం తో మెలుగు...
ఆత్మవిశ్వాసం తో పనులను ప్రారంభించు...
అపరిమిత మైన నీ బోధనలతో సమాజాన్ని ప్రభావితం చేయవచ్చు..
ఆధ్యాత్మిక లకు హద్దు ...
మానవత్వమే ముద్దు అన్ని గ్రహించు..
తలెత్తి ఠీవి గా బ్రతకడం నేర్చుకో...
పిరికి పందలాంటి ప్రయత్నాలు మానుకో...
కలలు కనండి...
నీ మెదడు కండరాలు ప్రతిభాగం..
సమాజం హితం వైపు కదలాలి...
సమాజ గతిని మార్చాలి...
మీ శక్తి సామర్ధ్యాలను గ్రహించండి...
మీలోని శక్తిని ఈ విశ్వ ప్రయోజనాలకు ఉపయోగించండి..
ఆత్మ పరమాత్మల సారాన్ని తెలుసుకోండి...
సకాలంలో సత్కార్యాలను పూర్తి చేయండి...
గాలిలో దీపం పెట్టి దేవుడా అనకండి...
విలువైన జీవితాన్ని వ్యర్థం చేయకండి...
కలిసి కట్టు గా పోరాడండి...
రాజకీయాలకు ఎర (బలి, వ్యసనం)గా మారకండి...
నాయకుడిగా ఎదగండి...
ఐక్యమత్యమే..మహాబలమని ఎరగండి..
తీసుకోవడంలో ఆనందం లేదు...
తిరిగి ఇవ్వడం లోనే నిజమైన ఆనందం ఉందని గ్రహించండి...
తిట్లను తిరస్కరించండి...
అవి తిట్టిన వారికే చేరుతాయి అని గ్రహించండి...
నీ పై విమర్శలు పెరిగాయి అంటే...
నీ లో ఎదుగుదల మొదలైంది అని గుర్తించండి...
నా కోసం బ్రతకడం అనకండి...
మనకోసం బ్రతుకు పోరాటం అనండి...
యువకులారా మేలుకోండి !
అవినీతిని అరికట్టండి...
పేదరికాన్ని పెకిలించండి...
జనహితం,పరహితం,సమాజాహితం కోరి...
మంచి ఔన్నత్యం తో మెలుగండి...
సాధారణ పరిపూర్ణత మన జీవితం కాదు...
మన లక్ష్యం ను గుర్తుంచుకోవడం మన జీవితం...
ఓ యువకులారా మేల్కొనండి !
అంతర్జాలంతో అర్థం కాకుండాపోతున్నావు...
సోదరుల పట్ల స్వభావాన్ని కోల్పోతున్నావు...
రంగుల చిత్రాలతో సినిఅభిమానులుగా మారుతున్నావు...
రాజకీయాలతో కుతంత్రాలకు  తలపడుతున్నావు...
పరస్త్రీల పట్ల పరమనీచంగా ప్రవర్తిస్తున్నావు...
కళాశాలలో కల్చర్ ను మరుస్తున్నావు...
కులమతాలతో  కంటగింపు గా మారుతున్నావు...
ఓ యువత మేలుకో...నీ గమ్యం చేరుకో...!
యువకులారా మేల్కొనండి శోదించండి...
మరణాన్ని గ్రహించండి...
జీవితం చిన్నదని బోధించండి...
ఓ యువకులారా !
అనంతమైన  అఖండమైన ఈ విశ్వము లో...
ఆత్మ విశ్వాసం గొప్పదని  గ్రహించండి...
ఓ యువకులారా !
మంచిని పెంచు...
మంచిని బోధించు..
మంచిని పంచు...
మానవత్వం తో నడుచుకో...
యువకులారా మేల్కొనండి !
సేవాదృక్పథం లో ప్రయనిద్దాం...
సేవాభావంతో మెలుగుదాం...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
 🌼 యువకులందరికి జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.......🌼
🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

                               ఇట్లు
                       నా సొంత రచన
               ✍ తెలుగు తిరుమలేష్
               తెలుగు ఉపాధ్యాయులు
      ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
              వ్యవస్థాపక అధ్యక్షులు
      అమరచింతమండలం, వనపర్తి జిల్లా
             చరవాణి : 9908910398

----------------------------------------


A.భాగ్యచంద్రిక


యువత మేలుకో !
యువత మేలుకో !
చాటుకో  నీఘనత
అంతరిస్తున్నవి  ఆచారాలు , 
అలముతున్నవి  అగచాట్లు ,       
చెడువ్యసనం  చెంతచేరగా
నిలువ  నీడలేదు
నింగిపైన  మసక చీకట్లు
మసిబూసి పోయె.
మంచి, మానవత్వం  మరిచి    మరుగునపడుతుంది
యువత  బతుకు  .
మాటలులేవు   మమతలు లేవు !                              పలకరింపులేదు !
వెలకట్ట లేని  జీవితం
వెతలపాలాయె.                             
నిషాచరులై   నిప్పుల బడిరి 
తడవాయే   మంచి  మార్పుకై       
మనసు  గెలిచి  మసులుకో   
మానవత్వం  పెంచుకో !         
రాబోయే  తరానికి  రాచబాటలు  వేసి
వేడుకను  చూపి  కీర్తి పొందు!!



✍🌷✍

: యువతా...మేలుకో..

యువత మేలుకోవాలి
నవత మేలుకోవాలి
భవితవ్యం మారాలి
నవ చరిత్ర రావాలి

చరణం:
కులం కులం అంటూ
మనం కొట్టుకో కూడదు
మతం మతం అంటూ
మనం మట్టు పెట్టుకోకూడదు
మనదంతా ఓకేకుళం
అదే యువకులమంటూ
ముందుకు...ప్రగతి పథంవైపుకు దూసుకుపోదాం
చరణం2:
మూదాచారాల్ని మాపుతూ
కొత్త ఆలోచనలకు ఊపిరి లూదుతూ
ఈ సంక్రాంతి
ఉషోదయాల ఆశీస్సులతో..
కొంగత్త విజయాలతో
కలాం స్ఫూర్తిగా
టెక్నాలజీ తోడుగా

         
....ఈవేమన
****************

యువత--భవిత

యువత కదలగ వలెనురా భవిత కొరకు
భద్ర మొసగును యువతకు భవిత యెపుడు
చదువు సంధ్యల నేర్వగా శ్రద్ధ గలిగి
సమయ పాలన పాటించి సాగవలయు        1

చలన చిత్రములను చూచి కలలు గనుచు
సెల్లు ఫోనుల మాటల సొల్లు వినుచు
ప్రేమ పేరిట తిరుగుచు సోమరిగను
కాలము గడప వద్దుర ఖలుల తోడ.            2

 నాయకత్వపు బాటలో నడచి నీవు
కుళ్లు కుట్రల నన్నియు కుళ్లబొడిచి
ప్రజల పక్షము నిలబడి ప్రగతి రథము
నడప వలెనయ్య జగతికి నాయకునిగ.       3

దేశ మభివృద్ధి గాంచగా దిక్కు నీవె
దుష్ట దుర్మార్గుల నణచ కష్ట మనక
ఆత్మ విశ్వాసమును గల్గి హనుమ వలెను
పోరు సలుప వలెను నీవు పుడమి మీద.     4

విద్య విజ్ఞానమును నేర్పి వినయ మొసగు
వినయ మెప్పుడు మనిషికి విలువ బెంచు
విద్య విజ్ఞానముల తోడ వెలుగు పంచి
సంఘ సంస్కర్తవై నీవు సాగిపొమ్ము.           5

         మేడిచర్ల హరినాగభూషణం
      తెలుగు ఉపన్యాసకులు,గద్వాల.
********************
నరేశాచార్య

వివేకానంద జన్మదిన శుభాకాంక్షలతో

🌳🌻 యువత🌻🌳

కలలుకనే ప్రపంచంలో యువతదే ముందడుగు
చిగురించిన ఆశలతో చిరునవ్వులు వెలుగు
ఆశయ సాధన కోసం అడుగడుగు ముందుకేయు
ప్రతిఫలంను పొందేందుకు ప్రతిక్షణం ప్రయత్నించు
 సాధించొచ్చు ఏదైనా సహనాన్ని సంగ్రహించి
పొందేందుకు పరితపించు నీమనసే నిగ్రహించి
ఎందరో మహానీయులు ఈ గమ్యానికి బాటేసిరి
ఆదమరిచి పయనిస్తే విజయమే నీదరి
కమ్మని నా భారతావనిలో ఝుమ్మని విజయభేరీ
కృషితోడ సాధిస్తే నీకల పొందేవు సరి
గమ్యందిశగా పయనిస్తే ఎన్నో ఒడిదొడుకులు.....
అన్నిటిని ఎదిరిస్తూ వెళ్తే జీవితమే పదనిసలు.....!!

మీ...... నరేశాచార్య
***************

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

: 🌷🙏🌷

*అంబటి భానుప్రకాశ్.*
  దుప్పల్లి.వనపర్తి జిల్లా.
         9948948787.

               *యువత భవిత*

కం.
యువతే దేశపు భవితని
భువినే మార్చెడు బలమను భోదనలెన్నో,!
కవులై,రవులై జగతిని
జవమున నడిపే వయసని,జాగృతి గొనరే!!

కం.
ధైర్యము ,శౌర్యము, గల్గిన
వీర్యులనంతముగ దేశ వీర్యత జూపన్,!
కార్యము లేవై యున్నను,
సూర్యుల మేమని గదిలెర శూరత చేతన్!!

కం.
ఆశల దీర్చగ నిలువు,ని
రాశల విడరా !నిజముగ రాదా జయమున్,!
దేశము బాగుండగ,నా
వేశము జూపుచు భవితకు వేదిక మీరే !!

కం.
వృధగా తిరుగుట మానుము,
వృధగా గడుపకు సమయము వీధులజేరీ!
వృధగా విలువల్లేకన్,
వృధగా మారును బ్రతుకులె ,వినరా మాటన్,!!

కం.
చదువే యువతకు భాగ్యము
పదరా చక్కగ చదువగ పదుగురు మెచ్చన్,!
చదువే దెచ్చును కీర్తుల,
ముదమే నిల్చుతలిదండ్రి మోమున్నెపుడున్! !

.🌷..................................................

(లావణ్యసైదీశ్వర్)

*యువత..భవిత*
******************
ఓ యువతా..
దేశమంటే.. నీదికాదా
నీవెవరవంటే..దేశభవితవేగా

నీ ప్రతీ అడుగూ
ప్రగతి వైపుకు..
పరుగులెత్తూ
ఆ శిఖరాగ్రాలకు..
ఆత్మవిశ్వాసం నీ
ఆలంభనగా..
అంధకారం చీల్చుకుంటూ
సూరీడివైపో..అన్ని దిక్కులకు

లక్ష్యమొకటే చూపు చివర
దారులన్నీ దాసోహమనగా
లోకమంతా నీ సైన్యమనుకో
గెలుపుకనకు..
ఓటమనకు..
గమ్యమొకటే గురితప్పనీయకు
యువతా..నీ భవితకొరకు
కలలు కనడం మానకు
సాధించేవరకు.. ఆదమరవకు
అలుపురానీయకు..

              (లావణ్యసైదీశ్వర్)
                       12-01-2018


🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

తేది :12 /01 /2018

శీర్షిక : యువత - భవిత

రంగుల లోకమిది ఓ యువతా !
రాలి పోనీయకుమా నీ భవితా !

జననం మరణం మధ్యలో జరిగేదే జీవితం
పరోపకారం పుణ్యం పరపీడనమే పాపం
మంచి చెడులు రెండుండును
యెంచుకోని దిద్దుకొమ్ము

శైశవ బాల్యాలు అమ్మనాన్నలతో అనుబంధం
వారితో ఎడబాటును కలనైనా సహించం
అమ్మే దైవం నాన్నే ఆదర్శం స్పూర్తిదాత
సత్యం శివం సుందరం కదా జీవితం

ఏరి కోరి నచ్చినట్టి పేరు పెట్టుకొని మురిసిరి
పదిలంగా ఎదగాలని మదిలో ఎప్పుడు తలచిరి
తమకున్నా లేకున్నా నిను ప్రేమతో చదివించిరి
విద్యార్థి దశలోన విధి మరచిన చెడిపోదువు

యౌవన మొచ్చేను సుమా!కవ్వింపుల పుటలే యిక
అందం ఆకర్షణ కనువిందు చేయు మనసులోన
ఒక్క ముక్క చదువనీదు చదివితె అర్థం కాదు
కోర్కెలేవొ ఏవొ కలుగు కోరని అలవాట్లు పెరుగు
బుద్ది మొద్దు కానీకు మనసుమాట వినబోకు

ఆకర్షణలకు లోనై అదే ప్రేమ అనుకునేరు
అమ్మానాన్నల ప్రేమల హత్యజేసి మురిసేరు
ప్రేమంటే ఒక త్యాగం ప్రాణం తీసేది కాదు
అనుభవలేములు మీకు ఆదర్శం సినిమాలా ....?
అమ్మాయిల తండ్రులంత విలన్లా....?
అబ్బాయిలు ఏం చేసిన హీరోలా ....?

.                రచన : మధుసూదన్ కోమటి,
.                                ఎస్ ఏ (తెలుగు),
ప్రభుత్వ ఉన్నత పాఠశాల (డైట్) నల్లగొండ,
.                చరవాణి : 9491328432.

***********************************

వివేకానందుడు
---------------------------------------
1.ఆ.వె
----------
భరతదేశ నుదయ భాను నరేంద్రుడు
భరతమాతసుతుడు భక్తిపరుఁడు
భరతసంస్కృతిలన పరదేశ వాసులు
నిచ్ఛగాను యాచరించపునిరి.

2.ఆ.వె
----------
కాళికమ్మశక్తి  కళ్లారదర్శించి
భీతిలేనిరీతిఁప్రీతిగాను
నీతిపథములోననిలచినమాన్యుడు
దైవభక్తిపరుడు పావనుండు.

3.ఆ.వె
-----------
అరటి తోటసాలుఁ హనుమను వెతుకుచు
బాల్యమందు నీవుబాధనొంది
బిక్షమెత్తుకున్నప్రియశిష్యుడతడుర
రామకృష్ణ మెచ్చు రత్నమితఁడు.

4.ఆ.వె
-----------
సూక్తులెల్లదెల్పె సుగుణధనుడుగాను
యుక్తులెన్నొచూపె నుత్తమముగ
దేశభక్తితనదు యాశయమనుచున్న
భరతమాతసుతుడ! భవమునీకుఁ

5.ఆ.వె
----------
పుణ్య క్షేత్ర మందు పూజలుచేయుచు
సర్వమతములోని సారమెరిగి
సకలజనుల మనముఁ సత్కరించు ఘనుడు
వందనములు నీకు వందనములు

                 వడ్త్యనారాయణ .
                   పాల్వంచ .
                 భద్రాద్రికొత్తగూడెంజిల్లా .
***********************






Comments