మాతృభూమి
(గణతంత్ర దినోత్సవం సందర్భంగా)
[1/25, 5:52 AM] Poet Musthakheem విన్నర్: 💐💐మాతృభూమి..జన్మభూమి💐
మాతృభూమి రుణం..
మరణం. దాకా?
నిన్ను ..ఒక తల్లి లా.. చూసింది..నీ దేశం ...
ఈ జన్మభూమి లో పుట్టి పెరిగి..
పేరు.. గడిస్తావు..
ఈ భూమిలో ఆడావు.. పాడావు.. తొలిఆట ఇక్కడే..
తుది.. ఆటా ..ఇక్కడే ..?
నీ.. స్వదేశమంటే ..నీకు ప్రేముండాలి..గౌరవముండాలి .. నిను గన్న దేశం గనుక ?
బానిస శృంఖలాలు ..తెంచు
కోవడంలో ..వీరులు..శూరులు
ఎందరో ..ఎందరెందరో ..మాతృ
భూమి కై ప్రాణాలు ఎదురొడ్డి ..
నిలిచారు ..కర్తవ్య.. పాలన
చేశారు..పరుల హస్తగతం కాకుండా.. నీ కన్నతల్లి లాంటి
స్వీయదేశాన్ని ..కాప్సఫుకునాల్సిన అవసరం ఉంది..
ఒక ఆజాద్..లా ఒక భగత్ సింగ్ లా..ఒక అల్లూరి లా..
ఒక తిలక్ లా ..ఒక శుభాష్ లా..ఒక..యోధుడిలా.. మారి
కన్న తల్లిని రక్షించి ..చరిత్రలో ..
నిలిచిపోవాలి ..గాంధీ లాంటి
మహాత్ములు ...పుణ్యాత్ములు..
అహింసావాదులు ..ప్రభవించిన.. గొప్ప ప్రాచీన ..వేదభూమి
నీది ..వీర నారీమణులు.. సైతం పుట్టిన నేల నీది ..ఒక
ఝాన్సీ ..ఒక రుద్రమ ..ఒక సరోజిని..ఒక ..ఇందిర లు ..
కాలు మోపిన ..స్వాతంత్ర్య.. సంగ్రామాన ..నిలిచిన ..వీర
భూమి ఇది ..మాతృభూమి ..
కి సేవ చేసి ..రుణం తీర్చుకో ..
ఒకే తల్లి పిల్లలని గుర్తించి ..
అంతః కలహాలు వదిలి..ప్రేమించడం ..నేర్చుకో..
విన్నర్ , కొల్లాపూర్.
[1/25, 1:02 PM] Poet Satya Neelima: శీర్షిక: మాతృభూమి,
రచయిత: సత్యనీలిమ,
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏🙏🙏🙏
ఓ భరతదేశమా! మా
మాతృదేశమా!
ఎన్నెన్నో జన్మల మేం చేసిన పుణ్యాల ఫలితమా
ఎందరెందరో నిన్ను పరిపాలించినా
నీ గొప్పతనము కించిత్తు అయినా తగ్గలేదు సుమా
ప్రకృతి విళయాలకు ఎదురొడ్డి నిలిచి
నీ రూపురేఖలను కాపాడుకుంటివి
నీ కడుపులోని ఖనిజాలను
నీ గర్భస్థ జలాలను
నీ ఎదపై పండించిన పంటలను
మా కందించి మా జీవనానికి
నీవు తోడుగా వున్నావు
పరాయి దేశస్తులు నీ సొత్తును
దోచుకెళ్ళినా
అందరినీ సమానంగా కరుణించావు
సహనం నీ సహజగుణం
దాతృత్వం నీలోని దయాగుణం
కన్నతల్లి ఋణం తీర్చుకోగలమేమో కానీ
నీ ఋణం ఎన్నటికీ తీర్చుకోలేము
భవనాలకు, బోరులకు నీ గుండెను చీల్చినా
బావురుమనకుండా మా
బాగోగులు చూస్తావు
కన్నతల్లి మోసేది నవమాసాలు
నేలతల్లి మోసేది శతవత్సరాలు
అందుకే అన్నారు పెద్దలు
జన్మభూమి కన్నా వేరే స్వర్గంబు లేదని...
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👮♀భారత్ మాతా కీ జై....👮♀
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍......సత్యనీలిమ,
ఉపాధ్యాయురాలు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి..
[1/25, 1:27 PM] +91 96189 61384: శీర్షిక: మాతృభూమి,
రచయిత: ఉప్పరి తిరుమలేష్,
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🎋🎋🎋🎋🎋🎋🎋🎋
మాతృభూమికి పాదాభివందనం
మాతృగర్భ నేలకి వందనం
ఆసేతు హిమాచలం
ఆ గర్భ రామేశ్వరం
అరణ్య అరుణాచలం
గుర్తుండే గుజరాతం
నా భారతావని సరిహద్దు భూజాలం
పూర్వ జంబూనామం
సిరి సంపదల నిలయం నా మాతృభూమి
ప్రపంచ మేధావులు జయించలేని జంబూద్వీపం నా భారతదేశం
రాణి రుద్రమ,ఝాన్సీ లక్ష్మీ బాయి మహారాణుల పోరాట ప్రతిమ నా మాతృభూమి
అరబ్బు,పోర్చుగీస్, పర్షియన్
ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ఎదిరించిన పురిటిగడ్డ నా మాతృభూమి
ఆంగ్లేయుల ఆరాచకానికి ఎదురొడ్డిన వీరపాండ్య కట్టబ్రహ్మణ
బోసు, భగత్
అల్లూరి అల్లాడి
లాల్ బాల్ పాల్
సమరయోధుల పురిటిగడ్డ నా మాతృభూమి
పౌరుషానికి ప్రతీక విప్లవానికి నాందిక వింకిల్ ఆఫ్ జిందాబాద్ ప్రతీక
పదహారేళ్ళకే భారతావనికి
ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్
భారతగడ్డ బిడ్డ శాంతియే ఆయుధం
సహనమే శ్వాస
శాంతి మార్గమే
రాజ్య మార్గము
అదే గాంధేయ మార్గము
భారతావని వడిలో
శాంతి రత్నము మహాత్మాగాంధీ
జైన బౌద్ధ భారతావని గౌతమబుద్ద
బాబా సాహెబ్ అంబేద్కరా
నీవు చేకూర్ఛిన రాజ్యాంగం
భారత జాతికి గర్వకారణం
ఎగురుతున్న జెండా
ఇదే మనకు అండాదండా
ఎగరాలి నింగికి జెండా
ఈ జగతికి సిగ పూదండా
సమభావనే చల్లని నీడా
శ్రమజీవుల కడుపు నిండా
భారతదేశ కలలు పండా
మనమందరం ఈ మాతృభూమికి అండాదండా
భాషలు వేరైనా భావమొక్కటే
రాష్ట్రాలు వేరైనా దెశమొక్కటే
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
✍...ఉప్పరి తిరుమలేష్,
తెలుగు ఉపాధ్యాయుడు,
జీనియస్ పాఠశాల,
వనపర్తి...
చరవాణి 9618961384
[1/25, 2:33 PM] Poet Aruna Chamarthi: అరుణ చామర్తి /ముటుకూరి . కవిత శీర్షిక :తల్లీ-.భూమితల్లి ... ********** ********** తీరుతుంది అమ్మఋణం ఈ జన్మ లో తల కొరివితో ... తీరేన భూమి ఋణం ఒక జన్మ తో ... అమ్మ మన ఉనికి , ఊపిరి ... భూమాత మన ఉనికి కోల్పోయాకా చూపును దారి ..... తప్పు చేసినా దాస్తుంది అమ్మ కడుపులో లొల్లి . తలిరాకు లా రాలినా అక్కున చేర్చు భూమి తల్లి అయినా మనం విశ్వాసం లేనివారం .. అమ్మనైన , భూమి తల్లి నైన గుండె తూట్లు పొడుస్తాం ..... తను బలై పోతున్నా చూస్తూ ఊరుకుంటాం... . ఎగిరిపోతాం తల్లి పాలు తాగి తల్లిని , ఉన్న ఊరిని వదిలి ఎక్కడికో ... తీసుకుంటాం కానీ తిరిగి ఇవ్వడానికి మనసు లేని వారం ఎప్పటికీ .. నోరు తెరచి అడగలేని భూమి తల్లి -అడగని తల్లి మౌనం గా రోదిస్తూ ...ఎదురుచూస్తూ నీ ఆగమనానికి ..ఆగిపోతానన్న నీ మాట కై ..ఆశగా ..
[1/25, 7:57 PM] Poet Seenu Vkota: రానాశ్రీ
కవిత
అంశం-మాతృభూమి
~~~~~~~~~~~~~~~~~~~
మట్టివాసనలు మహాపరిమళంగా
తనువు తాకు మారుతాలు మహాచల్లగా
నిర్భయపు తలపులు లోలోననిండగా
సైనికుడై.....సైరికుడై
కార్మికుడై....శ్రామికుడై
మహోన్నత మనసుతో
మానవులను మాదవులుగానెంచి
సేవాపరతే సద్భావంగానెంచి
పూనిచేస్తా....పూర్ణస్వరాజ్యంలో
సమిధనౌతా...మాతృభూమిలో!
నీలాకాశం నుండీ
నింగివరుకు...నాదంటూ
సమైఖ్యభావనలు
అణువణువునా....నింపుకొని
దేశకీర్తి దేదీప్యంగా
శాంతికవచమును కప్పుకొని
సంస్కృతీ సంపదను
భావితరాలకు బరోసానిచ్చి
భువనంలో మేటిగా
సకల సిరిసంపదలకు
తరగని ముడిసరుకుల పుడిమిగా
నా భూమిని నిర్మించే
సేవకుడౌతా మాతృభూమిలో!
కర్మభూమిలో
పరులమర్మం సాగదు...
వేదభూమిలో
శాంతి క్రాంతి తరగదు....
భవ్యమైనది నా భరతభూమి
నవ్యమైనది నా మాతృభూమి!
~~~~~~~~~~~~~~~~
ఆర్ .శ్రీనివాసులు
కలం-రానాశ్రీ
తెలుగు పండితులు
వి.కోట,చిత్తూరు
7989192308
[1/25, 8:19 PM] Poet Musthakheem విన్నర్: 💐💐గణతంత్ర దినోత్సవం💐
భారత రాజ్యాంగం అమలైన
దినం ..అద్భుత దినం
భారత దేశం ..పరిపూర్ణంగా ..
సర్వసత్తాక రాజ్యంగా..
అవతరించిన వేళ ..
ప్రతిదీ ప్రత్యేకమై ..చట్టమై ..
పుట్టిన వేళ ..
ప్రపంచదేశాలలో ..భారత్ కూడా ..అగ్రగామిగా నిలిచిన
సువర్ణ సమయం ..
భారతీయులు..హక్కులు బాధ్యతలు ..ఎరిగిన ..సమయం ..
దేశం అన్ని విధాలుగా ..సంపూర్ణంగా ..ప్రభవించిన ..సమయం ..
సుదీర్ఘ ..రాజ్యాంగం ..అంబెడ్కర్ ..ఆధ్వర్యం లో ..అవతరించిన..అద్భుత ..ఆనంద సమయం ..అమలైన ..అసలైన
సమయం ..అందరికీ ..శుభాకాంక్షలతో ..మీ..విన్నర్ , కొల్లాపూర్.
[1/25, 8:32 PM] Poet Palloli Shekar Babu: తెలుగు కవన వేదిక
🌷🌷🌷🌷🌷🌷🌷
కవి : పల్లోలి శేఖర్ బాబు
సహస్ర కవిమిత్ర, 9490484316
కవిత సంఖ్య : 6
కవిత శీర్షిక : భారత ఖ్యాతి
🎆🌄🌃🌄🌃🌄🌃
భారత ఖ్యాతి
🎆🌄🌃🌄🌃🌄🌃
భారత దేశం మనదేనన్నా!
భారత మాతకు బిడ్డలమన్నా! !
భారతీయులం మనమేనన్నా!
భారతజాతి మనదే నన్నా ! !
తూర్పున బంగాళఖాతమన్నా!
పడమర అరేబియా సంద్రమన్నా! !
ఉత్తరాన హిమగిరి శిఖరాలన్నా!
దక్షిణాన హిందూ సముద్రమన్నా! !
కులాలు మనలో ఎన్నున్నా!
మతాల విధాలు వేరున్నా ! !
భాషా బేధాలు చాల ఉన్నా!
వేషం యాసలు తేడున్నా! !
స్వార్థ చింతన వదలాలన్నా !
కుచ్చిత బుద్ధిని వీడాలన్నా! !
పరులకు మేలు చేయాలన్నా!
పరమాత్మను సదా వేడాలన్నా! !
మాతృభూమిని మరువకురన్నా !
మమతను ఎన్నడు వీడకురన్నా ! !
మానవతను పంచుమురన్నా !
సమానతను పెంచుమురన్నా !
గాంధీ బాటలో నడవాలన్నా!
శాంతి మాటలు పలకాలన్నా ! !
ఐక్యత కలిగి బతకాలన్నా!
భారత ఖ్యాతి ని నిలపాలన్నా! !
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవిమిత్ర, 9490484316
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
[1/26, 6:51 AM] +91 94933 58758: 💐💐గణతంత్ర భారత దేశం💐💐
భారత దేశ గణతంత్ర దినోత్సవం,
భారత జాతి ఉత్తేజానికి ఉత్ప్రేరకం,
వీరుల త్యాగఫలానికి నిలువెత్తు నిదర్శనం,
ప్రపంచ యవనికపై ఆత్మ గౌరవ ప్రదర్శనం..!
నా దేశం ఒక తత్వ శాస్త్ర గ్రంథం,
నాదేశం పఠిస్టమైన సనాతన ధర్మం,
అహింసా సిద్ధాంత స్వాతంత్ర చైతన్యం,
జాతి నాగరికత విరజిమ్మిన గౌరవం,
దేశ హుందాతనాన్ని పెంచిన ఉద్యమం..!
'జై హింద్' అంటే కాదు నినాదం,
భారతమాత కీర్తికి సుస్వర వేదం,
స్వరాజ్యానికి, స్వాభిమానానికి సంకేతం,
స్వతంత్ర ఉద్యమానికి అందించిన ఊతం..!
ప్రపంచానికి సంస్కృతిని,సత్యాన్ని,
ఆధ్యాత్మిక ఆనందాన్ని, కాంతిని,
దేశభక్తి నిర్వచనాన్ని,పోరాటాన్ని,
చతుషష్టి కళ లను,విజ్ఞానాన్ని,
దేశం కోసం అహింసను,ఆత్మార్పణాన్ని,
అహింస తో యుద్దాన్ని,విజయాన్ని,
పరిచయం చేసిన దేశం....నాదేశం!
ఓటమేరుగని జాతి,
అలుపెరగని ఖ్యాతి,
అహింసమనే నుతి,
సత్యమనే నీతి,
అఖండమైన నా భారత జాతి....!
💐💐గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు💐💐
💐💐వెంకటేశ్వర్లు. కె
తెలుగు ఉపాధ్యాయులు💐💐
[1/26, 10:07 AM] +91 91779 31900: *శీర్షిక : గణతంత్ర రాజ్యం*
తగ్గాము మనం
మగ్గాము మనం
నిగ్గాము మనం
తంత్రాలు పనిచేయక
యంత్రాలు విడిచి
పరుగులు తీశాయి
బ్రిటీష్ పురుగులు
కుళ్ళు విధానాన్ని
కట్ట కట్టి కాల్చివేసి
కొత్త విధానాన్ని అమలుపరిచాము
కుదుపులకు కృంగిపోయి
కూలబడ్డ మనము
కచ్చగట్టాం మనం
సాధించాం మనం
వినిపించాం విజయపు
అరుపులు ప్రపంచానికి
వృద్ధికై శుద్ధి చేసి
బుద్ధితో బలగంతో
రాసినాము
విధానం చేసినాము
దానం
ఎరుపెక్కిన కళ్ళతో
ఎగిసిపడే
ఆశలతో
కుశలత
తోడై చేశాము త్యాగం
రాజ్యాంగ రచనలో
ప్రజా ప్రయోజనానికై
ఉన్నాయి మణులు
నిలిచి ఉన్నాయి
నిధులు
✍నవ✍
[1/26, 2:20 PM] +91 99122 74442: రచన:ఐతగోని వేంకటేశ్వర్లు
నల్లగొండ
అంశము:మాతృభూమి
సీ:
ఏదేశమేగినా ఎందు కాలిడినను
పొగడరా నీతల్లి భూమిభార
తిని యను రాయప్రోలుని ప్రబోధమ్మది
ఆదర్శమును నిల్పుమణువణువున
నీబ్రత్కు నీయాశ నీశ్వాస నీధ్యాస
నీవిభవమ్ములు నీదుచరిత
మాతృభూమి యిడెడు మట్టిపరిమలమ్మె
నీతనువందున నీరక్తమందున
మునుమట్టిలోచేరు పూర్వికులయ
సేంద్రీయ యెరువులై చేసె హ్యూమసు వల్ల
అవని పంటలుపండుటరయగలము
జనని జన్మస్థలీ స్వర్గముకన్నను
మిన్నయను పలుకు లెన్ననిజము
వైభోగముల నంద పాశ్చాత్య దేశాల
కరిగి నీదేశమున్ మరవరాదు
మరచిపోయిన నాడు మనిషిగా నీవయ్య
చచ్చిపోయిన వాని సముడ వీవె
తే.గీ.
అంగ వైకల్యమున పుట్టు ఆత్మజులను
భారమనుకోక సాకవే బాధ్యతగను
అట్లె మాతృదేశమనిన యంత భక్తి
పొంగ నిజమైన నరుడవై పోదువీవు🍇🍇🍎🥕🥒🙏
[1/26, 2:30 PM] Poet Padma Tripurari: నమో భరతమాత
*****************
నమో భరతమాత
నమ నమో భరతమాత
నవనీత హృదయరవ గీత
నళినీ ప్రియ రవి తేజో వికసిత. "నమో"
పురాణేతిహాస దరహాసితా
చతుర్వేద చారుశీల విలసితా
జానపదుల జనరంజక గీతిక
జనప్రియ జయ జయ భరతమాత. "నమో"
వీర ధీర మాతా
వీరనారీ ప్రియ వరదాతా
వరప్రద సంస్కృతి సంభూతా
సదా సంస్కార సుగుణ సమ్మిళితా. "నమో"
సశ్యామల సుధీర సుగుణోపేతా
సుప్రజా సుందర మనోమందిర నివసితా
నిధి కళానిధుల సకలకళా సంభూతా
సుధాత్రి సుమనోమన విరాజితా "నమో"
పద్మ త్రిపురారి
**********************
[1/26, 2:43 PM] కృష్ణమోహన్ గోగులపాటి: శీర్షిక: నా మాతృభూమి
రచన : గోగులపాటి కృష్ణమోహన్
సూరారంకాలని, హైదరాబాదు.
నా మాతృభూమి...
వేదాలకు పుట్టినిల్లు
త్యాగాలకు మెట్టినిల్లు
జీవనదులు పారుభూమి
సముద్రాలు కలుయుభూమి
సాదు సంతులున్న భూమి
సత్పురుషుల కొలవు భూమి
కులమతాలు ఎన్నున్నా
కలిసిమెలిసి యుండు భూమి
చారిత్రక పునాదుల
చరిత యున్న భరతభూమి
ఆంగ్లేయులు, నవాబులు
రాజ్యాలేలిన భూమి
రాముడు, కృష్ణుడు, బుద్దుడు
అడుగిడిన అదృష్టభూమి
అంతా నా వారంటూ
ఆదరించె మాతృభూమి
ప్రపంచానికే ఆమని
అఖండ భారతావని
ప్రేమ వాత్సల్యంతో
మాటలాడు మాతృభూమి
అదే అదే నాభూమి
ఇదే నా మాతృభూమి
మీ
గోగులపాటి కృష్ణమోహన్
కవి, రచయిత, జర్నలిస్టు
9700007653
[1/26, 9:33 PM] Poet Telgu Thirumalesh: ------------🌻🌻🌻🌻--------------
అంశం మనది... పాట నాది .. కవితాగానం సమాజానికి!
తేది : 26-01-2018
🙏 నా మాతృభూమి 🙏
ప. మాతృభూమి బిడ్డలారా మీకు వందనం
మాతృదేశపు భక్తులారా మీకు వందనం
మనదేశపు చరితను చాటుకుందాం
మనమంత ఒకటేనని చాటి చెపుదాం
చ. బుద్ధుని మాటలో
మంచిని పెంచినది ఈ దేశం
వీరపురుషుని ఆశోక్ ని
అందించినది ఈ నేల
చత్రపతి చరితను తెలిపినది ఈ దేశం
భగసింగ్ రాజ్గురు సుఖదేవు ల
వీరులను అందించినది ఈ పుడమి
ప!
చ. అల్లూరి సుభాష్ లు సమకట్టిన సైన్యము
వీరనారి జాన్సీ రుద్రమ్మ ల
వీరత్వం మనతేజం
జాతిని జాగృతి
పరిచి జాతిపితగా మారెను
మన గాంధీ
కులమతాలు వద్దని
మానవత్వమే ముద్దని
దేశానికి ఆకృతిని అందించెను అంబెద్కర్
ప!
చ. పాడిపంటలు దాన్యరాశులై వెలుగంగా
పచ్చని సిరులతో విలసిల్లెను నా దేశం
హలం పట్టే రైతన్నను
కష్టించే కార్మికున్ని
దేశరక్షణ సైనికున్ని
అందించెను ఈ దేశం
ప!
చ. ఒకదేశ పిల్లలం
దేశసేవలో మునుగుదాం
మనమంత ఒకటేనని
మనుషులు గా మెలుగుదాం
ప. మాతృభూమి బిడ్డలారా మీకు వందనం
మాతృదేశపు భక్తులారా మీకు వందనం
మనదేశపు చరితను చాటుకుందాం
మనమంత ఒకటేనని చాటి చెపుదాం...2
---------////-------
👉
దేశసేవలో మునిగిపోదాం.......మానవత్వంను చాటుకుందాం.
ఇట్లు
నా మొదటి స్వీయ కవితాగానం
✍....తెలుగు తిరుమలేష్
తెలుగు ఉపాధ్యాయులు
ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
వ్యవస్థాపక అధ్యక్షులు
తెలుగు భాషా పరిరక్షణ సమితి
అధ్యక్షులు
అమరచింతమండలం, వనపర్తి జిల్లా
చరవాణి : 9908910398
✍✍✍✍✍✍✍✍✍✍
-------🙏 సమాప్తం 🙏 -------
[1/26, 10:00 PM] Manne Lalitha: జెండా ఎగురుతొేంది
××××××××××××××××××
ఎగురుతొేంది ఎగురుతొేంది మువ్వన్నెలజెండా ముచ్చటగా
ఆనాడు ఈనాడు ఏనాడు ఎగురుతొేంది
కన్నులనిండా
కాంతికిరణాలై
బ్రిటీషువారి లాఠీ దెబ్బలకు రక్తాలొేడిన శరీరాల రక్తతర్పణలతొే
పుాలమాలలా ఉరితాడును నవ్వుతుా మెడలొే వేసుకున్న రొేజులు
పచ్చి కొబ్బరికాయలను చేతివేళ్ళతొే ఒలిచి
మాంసపు ముద్దలైన చేతులను
అండమాన్ లొే అతివలు ఆనందంగా
రక్తపింజేరులకు ఎరయై
దేశభక్తిని చాటుకున్న రొేజులను
దేశంకొేసం "బ్లాక్ టైగర్ "
కులమతమార్పిడి చేసుకుని
ప్రాణాలర్పించిన రొేజును
చిన్న పెద్ద స్త్రీ పురుషులంతా
దేశంకొేసం ముందుకురికి సర్వస్వం
ధన మాన ప్రాణాలర్పించిన రొేజులను
మరువగలదా!
అర్థరాత్రి స్వాతంత్యం తెచ్చుకున్నా
ఆ కాళరాత్రినే...(అర్థరాత్రిఅనే భావనలొే)
ఆ ఆంగ్లేయుల్నే తల్చుకుంటుా
అమ్మలాంటి ఆంధ్ర భాషనొదిలి
ఆంగ్లభాషనే స్మరిస్తున్న రొేజులను
తల్చుకుంటుా ఎగురుతొేంది ఎగురుతొేంది జాతీయజెండా
సుఖదుఃఖాలు చెప్పుకొేలేని మువ్వన్నెలజెండా
ఏడాదికి రెండుమార్లు ఎగిరే జాతీయజెండా
మానవత్వం నిండిన మనుషులమమతల్లొే
దేశభక్తి నింపుకున్న నాయకుల నిస్వార్థ సేవలొే
కులమతరహిత సమాజ స్థాపనలొే
పుాటకు గంజైనా తాగే పేదవాడి ఆనందంలొే
ఎగరాలి ఎగరాలి నా జాతీయజెండా
వినువీధిని విహరించాలి
భారతీయతనిండిన భారతజెండా
భారతీయునిఊపిరినిండా దేశభక్తిని నింపే నాజెండా
భారతీయం ఉప్పొంగేలా
భారతఖ్యాతి కాంతి కిరణాలు ప్రపంచానికి
ప్రసరించేలా
ఎగరాలి ఎగరాలి నాజెండా...
నా భారత జాతీయజెండా.
మన్నె లలిత
హైదరాబాద్.
***************
మంచి ప్రయత్నం..
ReplyDelete