అంబటి భానుప్రకాశ్.
🌼🌷🍁🌞🌻🌸🌺🍀💥
*సంక్రాంతి పండుగ సందడి.*
✨🌺✨
సంకురాతిరి పండుగ సంతసంబు,
సకల జనులకు భాగ్యంబు చక్కనిచ్చు,!
మురియు చుందురు ముంగిట ముగ్గుబెట్టి,
భోగి సంక్రాంతి కనుమలె భోగమౌను !!
పిండి వంటల ఘుమఘుమ పిలుపువచ్చు,
తీయ నైనట్టి మాటల తేటదనము,!
నందరొక్కటి, గూర్చుండి యందముగను,
నారగింతురు మురియుచు తీరుగాను.!!
భోగి మంటల గాల్చేరు మూగికొనుచు,
పాత వైనట్టి వస్తువు, చేతబట్టి,!
మంట లెగయగ బెట్టుచు మమతలెంచి,
కొత్త యాశల గోరెరు కూర్మిమీర! !
అమ్మ యమ్మమ్మ తాతయ్య లక్కతోడ,
పిన్ని,బాబాయి,వదినమ్మ,యన్న,యనుచు!
నత్త మామయ్య, బావని,ఆదరించ,
బంధుమిత్రుల కలయిక యందమౌను.!!
🌻🌺🌻🌺🌻🌺🌻🌺🌻🌺
🌸🍀🌸
*ప్రకృతి కృతి_సంక్రాంతి*
అనునిత్యం నగర జీవన వనం లో సాగే
యాంత్రికతా యానానికి ఆటవిడుపు
పల్లవించే అనురాగ బంధాలు ప్రతి బింబించే
పల్లె మనసుల మమతానురాగాల పొద్దు పొడుపు
సంక్రాంతి ప్రకృతి కాంత కను వెలుగై విరిసే
పాడి పంటల సిరులు పంచే రైతన్న
హృదయ దీప్తి
కవులు రాయని కళామయ జగతిని
ఆవిష్కరించే అద్భుత కళాకృతి సంక్రాంతి
అతివల మదిలో కదలాడే కమనీయ భావనాకృతి
అరమరికలు లేని అనురాగ గీతానికి
ఆత్మీయ శృతి
వసుధైక కుటుంబాన్ని సృజించే భావనకు ఆకృతి
ఇది సంక్రాంతి
రిషితాత్మయై సాగే వినూత్న భారతీయ
సంస్కృతి కి
అద్దం పట్టే హర్షాంచిత ప్రకృతి కి నవీన చరితాకృతి
ఇది విశ్వ జీవన వేదికపై కదలాడే అమృత శాంతి
✍
వెల్ముల జయపాల్ రెడ్డి
కరీంనగర్ .9541168976
Velmulajayapalreddy@gmail.com
🍀🌸🍀
*🌷బద్రిపల్లె. శ్రీనివాసులు🌷*
*🌷శీర్షిక:-సంక్రాంతి.🌷*
*💐ఛందస్సు:-సీసమాలిక.💐*
ఆరుగాలంబును హలమునుబట్టియు
.......పొలముచదునుజేసి పొలుపుతోడ!
పంటను పండించి వ్యవసాయదారుడు
..........రామసాయంబుతో రాత్రిపగలు!
ప్రజలనాకలిదీర్చి బ్రతుకునుతలగాచ
..............నాతనికృషికిని యమితముగను! యానందమునుజెంది
నాడుతుపాడుతూ
..........కలకలనవ్వుచు కాంతితోడ!
సాగివచ్చినిలిచె సంక్రాంతి పండుగ
..........కలిమిచెలిమితోడ కనులయెదుట!
*🌷ఆటవెలది:-🌷*
రంగవల్లివేసి రామలు ముంగిట
ద్వారబంధములకు తోరణములు
చక్కగాను గట్టి సంక్రాతిపర్వమున్
పిలువ గృహముఁజేరె పొలుపు తోడ!
*💐ఆటవెలది💐*
బోగిమంటలెల్ల భాగ్యంబు లీయగా
మకర సంక్రమణము మధురమైన
మమత లందజేసి మదిలోన నిలుచును
సంక్రమణముజూడ సర్వజనుల!
*🌷ఆటవెలది:-🌷*
గంగిరెద్దు లాట ఘనముగ సాగును
కోడిపందె కిలము కూర్మితోడ
చక్కగాను జేయు జనులెల్ల కలిసియు సంక్రమణమునందు జగతిఁగనగ!
*🌷ఆటవెలది:-🌷*
హరినిగూర్చి గీతి హరిదాసు పాడగ
గాలి పటములెల్ల గగనమందు
చిందు లేయుచుండ చిన్నారులవిగాంచి
తన్మయంబుబొందు తల్లినెదన!
*🌷ఆటవెలది:-🌷*
పర్వపు దినమందు వ్యవసాయదారుని
కష్టమెల్ల ద్రుంచి కరుణజూడ
రయముఁజొచ్చెతాను లక్ష్మిరూపంబున
సంక్రమణము నతని సౌధమునకు!
*🌷బద్రిపల్లె. శ్రీనివాసులు*
*ప్రొద్దుటూరు,*
*కడపజిల్లా.*
*9441721650.🌷*
***************"
సంక్రాంతి శోభ"
⚛️☸️⚛️❄️⚛️☸️⚛️
తెల్లారు జామున కల్లాపి చల్లిన
ముత్యాల ముగ్గులు వేసి
ముంగిలంత రంగులు నింపి
మగువలంత మెచ్చిన మూడ్రోజుల
ఆంగ్లకాలమాన
తొలి 'తెలుగు పండుగ'...!
మదిలో పాతుకుపోయిన పాతను
ఇంట్లో పాడైపోయిన సామాన్లను
కక్ష్యలతో నిండిపోయిన జ్ఞాపకాలను
భోగిమంటల్లో కాల్చి
భోగభాగ్యాలనిచ్చే పిల్లల తలపై పోసే
రేగుపండ్ల"భోగిపండుగ "...!
గోపెమ్మ గొబ్బెమ్మై గుమ్మానికే ఆకర్షణయై
హరిదాసుల పాటలు గంగిరెద్దుల ఆటలు
సంతోషంగా చేసే పిండివంటల ఘుమఘుమలు
ఏడాదంతా శ్రమించిన రైతు సహనానికై వచ్చే
ధాన్యాగారాల సిరుల భాండాగారం
సూర్యునికి పాలుపొంగించే
"మకరసంక్రాంతి పండుగ"...!
ప్రతినిత్యం ప్రకృతితో పాటు సహకరించి
పదిమందిలో ధైర్యంగా నిలబెట్టి
కేవలం కూటికోసం కోటితిప్పలు పడే పశుజీవాలకు
భారత రైతాంగం చేసే
కనువిందైన "కనుమపండుగ"...!
✍✍✍✍✍✍✍✍✍
మీ
" వడ్ల వేంకటేశ్ "
తొగిట - మెదక్
SKNO :2177
13-01-2018
9666205850.
⚛️☸️⚛️❄️⚛️☸️⚛️
శీర్షిక: నవకాంతి...నేటిసంక్రాంతి
*****************************
ఆకాశవిహంగమెక్కి
అరుదెంచాడు అరుణుడు
మకరరాశి మురిసిపోయింది
తనముంగిలిలో రంగవల్లులు
తీర్చిదిద్దింది
నవకాంతుల తోరణాలు కట్టింది
ఏతెంచిన ఆ దినకరుని కన్నుల్లో
కాంతిహీనతను గమనించిన
ఆచెలి మంచుపొరల పరదాతీసి
పగటి రాజును పలకరించింది
చెలినీకౌగిలి నే ప్రతియేడు చేరక తప్పదు
మనకలయికకు మురిసే భూమాత కన్నుల్లో
నేడెందుకో విషాదఛాయలు గోచరమయ్యాయి
విచారించగా
పేడకళ్ళాపులనడుమ వరిపిండిముగ్గుల్లో పసుపు,కుంకుమ,చామంతి,బంతిపూలతో
ముచ్చటగొలిపే వాకిళ్ళు నేడు పచ్చరంగు నీళ్ళుజల్లి కృత్రిమరంగులతో ముగ్గులు
ముగ్గు మద్యనముచ్చటగాతల్లి,పిల్లలతో ఒదిగేకూర్చొనే గొబ్బెమ్మలబదులు
ప్లాష్టిక్ పూలనలంకరించినమట్టిగొబ్బిఒంటెరిగా
గొబ్బెమ్మలచుట్టు సుబ్బీగొబ్బెమ్మ అంటూతిరిగే కన్నెపిల్లలు సెల్ఫీల చుట్టూ తిరుగుతున్నారు
హరిదాసు హరికీర్తనాలేదు
కొమ్మయదాసు చుట్టరికాలు లేవు
కోడిపందాలు లేవు
పశువులకు అలంకారాలు లేవు
గంగిరెద్దుల సన్నాయిలులేవు,
పగటివేషగాళ్ళ పలకరింపులులేవు
బుడబుక్కల మేలుకొలుపులులేవు
బొమ్మలకొలువుల పేరంటాలు లేవు
తాతయ్యలిళ్ళల్లో కోలాహలాలులేవు
బావామరదళ్ళ సెటారులు లేవు
పచ్చనాకుతోరణాలు లేవు
పిండివంటలజోరు లేదు
ఉన్నదొకటే పరుగులు...పరుగులు...పరుగులు
వాట్సప్ శుభాకాంక్షలు
గూగులు పిక్ లు
ముఖపరిచయంలేని
ముఖపుస్తకమిత్రులతో
ఛాటింగులు
ఫోను ప్రపంచంలోంచి
బయటకు రావడంలేదు
నన్నసలు పట్టించుకోవడంలేదు
అంటూ వాపోయిందన్నాడు
ఘాలిలలితప్రవల్లిక
తెలుగుభాషోద్యమసమితి ప్రధానకార్యదర్సి
నెల్లూరు
*************
*🌷బద్రిపల్లె.శ్రీనివాసులు🌷*
*🌷శీర్షిక:-సంక్రాంతి.🌷*
సూర్యోదయపు వేళ కనులు మేలుకొనగ
తొంగి చూచితి గుమ్మమువైపు...........
పచ్చని పతకములాగ నేల మెరిసిపోతున్నది ముత్యాల ముగ్గులతో.............
రంగు మహాత్మ్యమో లేల లలనల చేతి మహాత్మ్యమౌ ఏమో దేవేంద్రుని నందనోద్యానములోని తరువులన్ని నేల మొలచినటులతోచె..............
ఆహా!ఏమీ!ఈ రమణీయత అని రంగవల్లిని చూచితి కనులు ఆర్పకుండా.............
సంక్రాంతి శుభాకాంక్షలు అని కాబోలు వ్రాసి యున్నది........
ఓహో!మూడు దినముల పండుగ కదా!..........
ఆ! ఆనందపుక్షణాల్లోనైన తనవారిని వలపుతో తలచుకొనియు ఇంటికి పిలుచుకుంటారని తట్టెను మదికి.........
శరీరము ముడతలు పడిందనో లేక చేతిలో పైసలు లేవనో కనుచూపుకు దూరంగా కాటికి చేరక.............
అనాధ ఆశ్రమంలో చలికి వణుకుచు అందులోను తనబిడ్డల క్షేమమును కోరుతున్న సన్నని మూలుగు స్వరము...............
అమ్మా!సంక్రాంతి లక్ష్మీ ఆ మాటలు విన్నదో
లేక రవికిరణములందు దాగి చూచెనో ఏమో మరి మెల్లగా పాదము
భువిపైకి మోపింది...............
తనురాక చే వృద్దుల మరియు
ఎముకల కూడుతో వున్న రైతుల మోముపై పాల మీగడవంటి సన్నని చిరునవ్వు...............
చక్కని బాంధవ్యాలను ముడివేసి సకాలంలో వర్షములు కురిపించి బ్రతుకును కాంతిమయంచేస్తుందని.........
అమ్మా! సంక్రాంతి లక్ష్మీ ఎండిన బోరులు పగిలిన గుండెలు బావురుమనెడి పల్లెలు..................
పొట్టచేత పట్టుకొని వీధివీధి తిరిగెడు బాలలు..............
నీ రాకచే మానవుల మదిలో రాగద్వేషాలు తొలగి మానవత్వము పెరిగి.............
గతకాలమువలె కలసిమెలసి జీవనము సాగించేందుకు మనసున నిలుస్తావని............... రైతుల వ్యథలు తొలగించి అంబరమును తాకే సంక్రాంతి కాంతులు జీవితములో నిలుపుతావని ఆశిస్తూ!
*🌷బద్రిపల్లె.శ్రీనివాసులు*
*ప్రొద్దుటూరు,*
*కడపజిల్లా.*
*9441721650.🌷*
*****************
పాలకుర్తి నాగజ్యోతి
కుమ్రంభీం జిల్లా
8074712181
సంక్రాంతి సంబరాలు...
పల్లె ముంగిట్లో రంగు రంగుల రంగవల్లికలు
ఎక్కడున్నాచుక్కలై అల్లుకున్న పుట్టింటి మట్టి వాసనల బంధాలు..
గొబ్బెమ్మలు,
హరిదాసుకీర్తనలతో
పల్లె సింగారాలు
పచ్చ పచ్చని పైరుతో వరి కన్నియల హొయళ సింగారాలు...
బంగారు పంట సిరి జేబు నిండగా
పిండివంటల రుచులు పిల్లల నోరు నిండుగా..
తుషారవేళా బోగిమంటై
చెడును తరిమేయ మకరమై వచ్చింది సంక్రాంతి...
రేగుపండు ఊరింపులు,
పెసరి కాయలు,చిక్కుడుకాయలు,
పుల్లగంద,వంకాయ లతో
బంతి చామంతుల పోటాపోటీ పరిమళాలు...
నువ్వుండల సరిగమలు
నోములన్నీ నానబియ్యమై
పసుపు కుంకుమల పండగ
నిండు ముత్తైదువమ్మని దీవించగా సంక్రాంతి సంభరమై వచ్చింది మన ముంగిళ్ళకి....
@సిరిమల్లెలు...
???🌹✍🤘?ఎద్దు'లా'(9963224187)🤘✍🌹
శీర్షిక: "భోగి-యోగి"
సీ॥
భోగి పండగనాడు భోగిమంటను గాల్చ|
పాత బట్టలనేయ పాడి గాదు|
భోగలాలసతను భోగిమంటల గాల్చి|
పాడుమూఢత్వమున్ బారవేయి|
గంగిరెద్దుల నరసి గంతులేయుట మాను|
జంతువున్బలిజేస్తె జైలె నోయి|
ముంగిలంత యలికి ముగ్గులేయుటగాదు|
గదిమదిల మురికి గడుగ వోయి|
ఆ.వె॥
సంకురాతిరంటె సంబురంబును నీకు|
గూడు లేని ప్రజల గోడు జూడు|
అంతరంబులేని అభ్యుదయంబెగా|
"మా'నవ'కవుల"కిల పండుగన్న
రాజావాసిరెడ్డిమల్లీశ్వ
రిక్రాంతి పండుగంటే....!
సంక్రాంతి పండుగంటే నాకు
అమ్మే గుర్తుకొస్తుంది.....!
కొత్తేడాది వచ్చే సంక్రాంతి అంటే
ఊరొళ్లందరికీ కన్నుల పండుగ..!
అందరు తప్పక ఇళ్ళకు సున్నాలేస్తరు..
గడప గడపకు రంగు రూస్తరు..
దర్వాజలను కిటికీలను దర్జాగ మారస్తరు..
అందుకే సంక్రాంతి పండుగంటే సరికొత్త కాంతి..!
పండుగ రోజు అమ్మ ఎప్పుడు నిద్రలేచేదేమో తెలియదు గానీ
తెల్లారిసరికల్లా వాకిలంతా నిండుగా
ముగ్గుల కిరణాలతో కళకళ లాడుతూ
మెరిసి మురిసి పోతుండేది...!
ఇంటి ముందరి వేప చెట్టు సందు నుండి
సూరీడు కూడా అందంగా
ఇంట్లోకి వచ్చినట్లు అనిపించేది...!
ఇప్పుడు ఎక్కడ జూసినా కూడా
ఇళ్ళన్నీ సిమెంటు కాంక్రీట్ మయం అయినాక
ముగ్గేసినా వేయనట్లే ఉంది..!
అప్పుడు అమ్మ పిడికిట్లో వేళ్ళ మధ్యనుండి వేసినట్లు
ఇప్పుడెవరైనా వేయగలరా...?
ఆ వాకిళ్ళు అరుగులు చూడ ఎంతో సింగారంగా అగుపించినట్లు
ఇప్పుడెక్కడైనా కనగలమా..?
దేవుడి రథోత్సవం నాడు రథం ముగ్గేస్తే ఊరేగింపు రథం కళ్ళముందర కదలినట్టుండేది..!
నేను ముప్పైఏళ్ళ వెనుకకు పోయిన ఆ మాధుర్యాలను
మారిన కాలంలో వెతుకుతున్నా...
గుర్తుకొచ్చిన ఆ రోజులను తలచి బతుకుతున్నా..!!
✍🏻"మరికంటి"
[1/14, 8:10 AM] Poet Bharathi: సెల్లుకూతలతోన మేల్కొన్న
కోళ్ళు
పరుగులెత్తేను పందేలలో
పాలూపంచుకోను
షాంపూలతోనె తలస్నానాలాయె
కుంకుళ్ళూ సీకాయ
తెలియక పాయ !
టీవీల ముందున్న
మాదొడ్డ ఇల్లాళ్ళు
కదలలేకపోత
కదలివచ్చెనంట అంగళ్ళనుండి
అరిసెలూ వడలూ
హోటళ్ళనుండి !
రైతులూలేక బసవన్నలూ లేక
ప్లాస్టిక్ బసవన్నల ఫేస్సులలోన
కొంటె కోణంగులూ
ముంగిట జేరిరంట
బూరలూదుతూను
పేడంటే ఏంటో పిడకలంటే
ఏంటో
చూడనైనాలేక
మట్టితోజేసిన
రెడీమేడూ గొబ్బమలతో
భోగీమంటాలేయ
ఎంతకూ రాని మంటలకై
తెగయిదైపోయిరంట
ఇదేభోగీయని భ్రమలోనె ముగిసేను సంకూరేతిరి పండగా
!
బాలభారతి భాస్కర
9491353544
💐💐💐
[1/14, 8:14 AM] +91 99896 79681: 🌺🌹🌷🌼🍁🍀🌅🍀🍁🌼🌷🌹🌺
సంక్రాంతలక్ష్మీ!స్వాగతం!!
****************
రాగదే సంక్రాంతి లక్ష్మీ! -నీకు
స్వాగతము సంక్రాంతి లక్ష్మీ!!
ఘనముగా నిన్ను,మం
గళవాద్య రాగాల
గంగిరౄద్దులవాడు
గరిమనాహ్వానించె ॥రాగదే॥
హరిలొరంగాయనుచు
హరిదాసులందరును
ఆనందముగ చిందు
లాడెదరు పాడెదరు ॥రాగదే॥
ముగుదలందరు కలిసి
ముంగిళ్ల లోగిళ్ల
ముత్యాలముగ్గులను
మురిసి పరచిరీనీకు ॥రాగదే॥
భోగిమంటల రుచులు
పిండివంటల రుచులు
చాగురే! నీకిదే
స్వాగతమ్మనీ పలికె ॥రాగదే॥
రైతు ఖుషితో కూని-
రాగమున నిను పిలిచె
కైత నీకై పలుక
కవి గళము నిను వలచె ॥రాగదే॥
🌸బంధు మిత్ర బృందానికి🌸
🌷🌹సుందర సంక్రాంతి శుభాకాంక్షలు🌹🌷
మీ
🌺వైద్యం వేంకటేశ్వరాచార్యులు🌺
🌺🌼🌷🌸✒🍀 వైద్యం🍀🌸🌷🌼🌺
[1/14, 10:42 AM] +91 94933 58758: తెలుగు ఇంటి తోరణాలు,
పడుచు భామల పైటకొంగులు,
పిండివంటల ఘుమఘుమలు,
పైరుగాలుల పదనిసలు,
నాట్యమాడే గాలిపటాలు,
సంక్రాంతి సరిగమలు.....!
ప్రభాతవేల భోగి మంటలు,
ఇంటిముందు రంగవల్లులు,
అలంకరణల గొబ్బెమ్మలు,
గంగిరెద్దుల కాళ్ళగజ్జెలు,
హరిదాసుల కీర్తనలు,
సంక్రాంతి సవ్వడులు.....!
సిరిసంపదలను ఆహ్వానించి,
పసిడి నవ్వులతో పలకరించి,
పాడిపంటలతో పరవశించి,
విరిజాజులతో వికసించి,
బాంధవ్యాలు పరిమళించి,
తెలుగు గడపలో సంక్రాంతి....!
అలసిపోయిన మనుషులకు,
అలమటించే మనసులకు,
ఆనందాలతో,
అనురాగాలతో,
అభిమానాలతో,
ఆహ్వానించే అందమైన పండుగ....
మన సంక్రాంతి పండుగ.....!
💐💐సంక్రాంతి శుభాకాంక్షలు💐💐
💐💐వెంకటేశ్వర్లు.కె
తెలుగు ఉపాధ్యాయులు💐💐
[1/14, 10:50 AM] Poet Malliswari రాజా వాసిరెడ్డి: సంక్రాంతి. శుభ కామనలు
అయనాల మార్పులో
ఆనంద సంబరాల
కాంతిలో..
మనుషులు ..మనశసులు కలసిన శాంతిలో
వాకిళ్ళ ..లోగిళ్ళ సింగారపు గొబ్బిళ్ళ
రంగవల్లుల రేఖా
సందళ్ళలో...అందు
శుభాకాంక్షల భోగ భాగ్యాలలో ..క్షణ క్షణం అనుభూతుల
ఆలాపనలో....క్రాంతి...సంక్రాంతి...కొంగొత్తత్త
కాంతి....జగతి నిండి
సర్వులు సఖులై.....
సుఖులై. మనాలి
సంక్రాంతి శుభాకాంక్షలతో .....
రాజావాసిరెడ్డిమల్లీశ్వరి
*********************
🌺🌼🌸🌼🌸🌼
కవి:
*పైడి నాగ సుబ్బయ్య*
బద్వేలు,కడప జిల్లా.
9490284761
శీర్షక:
*సంక్రాంతి సంబరాలు*
*ఛందస్సు: సీసము*
రవితేజ గమనాల రసరమ్య పర్వాన
నవధాన్య రాశితో నవని వెలుగు
వ్యవసాయదారుల వందన పూర్వము
కలబోయు సంతోష కలమ వెలుగు
హరినామ జపమున హరిదాసు పలుకులు
స్మరణము మనమున మనన జేయు
గాలిపటములను గగన వీధులలోన
విహరింప జేసెడి వేెడుకిదియు
*తే.గీ.*
అరిసెలను చెక్కిలాలతోనారగించు
గంగిరెద్దుల సన్నాయి గంతులిడగ
రంగురంగుల ముగ్గులు రంగ రించ
సంత సమ్మాయె సంక్రాంతి సంబరాలు.
🔥🔥🔥
Comments
Post a Comment