సంక్రాంతి సంబరాలు - 3


[1/14, 12:36 PM] Buf Amaravadi Rajashekar Sharma: రంగు రంగుల రంగవళ్ళుల
ముంగిలులు సుస్వాగతంబన
పొంగు పాలుగ నిపుడు నిట
నుప్పొంగు సంతసమందు వేళ

రాగదే సంక్రాంతి లక్ష్మి
రాగదే సౌభాగ్య లక్ష్మీ

ఇంటి నిండుగ బంధువులు కను
విందొనర్చ నమంద మోదము
పిండి వంటలు మెండుగగ మే
ముండగను నవ పండుగగ విలసిల్లగ

రాగదే సంక్రాంతి లక్ష్మి
రాగదే సౌభాగ్య లక్ష్మీ

మంగళంబగు గంగిరెద్దుల
మంగళం హరిదాసు సుద్దుల
మంగళంబగు మహిని జనులకు
మంగళము సంక్రాంతి వేడ్కన

రాగదే సంక్రాంతి లక్ష్మి
రాగదే సౌభాగ్య లక్ష్మీ

             అమరవాది రాజశేఖర శర్మ
[1/14, 1:13 PM] Poet Musthakheem విన్నర్: సంక్రాంతి ..నవక్రాంతి ....
సంక్రాంతి సంబరాలు ..అంబరాన్ని తాకుతున్న వేళ కళ్ళాపి జల్లి మనోహర ముగ్గులు అల్లి మెరుస్తున్న వేళ ..బంధుజనులు ..తనపర భేధాలు మరచి ...పలకరిస్తున్న వేళ ..పాడిపంటలు ..కళకళ లాడిన ..వేళ ..మదిలో సంతోషాలు వెల్లివిరిసి ..గాలిపటాలు చిన్ని చేతుల ..చిన్నారుల్లో ..రంగు రంగులతో ..ఆటలాడినవేళ ...గంగిరెద్దుల ..గలగలలు ..నాదస్వరాల ..సవ్వడులు .....ఊరంతా ..ఊరేగింపులు ..ఆడపడచుల ..ఆనందాలు .ఇంట్లో తీపికారపు ..వంటల ఘుమ ..ఘుమలు ..పండగ ..ముచ్చట్లు ..ముసలవ్వల ..మురిపాలు ..కొత్తజంటల ..కవ్వింపులు ..మామా అల్లుళ్ళ ..కరచాలనాలూ ..అత్తమ్మలకు ..నమస్కారాలు ..గొబ్బిళ్ళతో ..సంక్రాంతి ..సింగారాలు ..రైతులకు పంటల ..బంగారాలు ...సంక్రాంతి ..తెచ్చె ..నవక్రాంతి ..అందరికి ..శుభాకాంక్షలతో ...విన్నర్..కొల్లాపూర్ 
[1/14, 3:12 PM] Poet Narayana Vadiyala: సంక్రాంతి
---------------------------------
పల్లవి 
---------
రేగిపళ్ళె.....భోగిపళ్ళు
గొబ్బిళ్ళొ  గొబ్బిళ్ళొ. ..
మూడునాళ్ళ సంబరాల
సంక్రాంతి గొబ్బిళ్ళో........||2||

చరణం
----------
రమణీ మణుల చేతి
రతనాల ముగ్గులుగొబ్బిళ్ళొ
అందాల హరివిల్లు 
ఆనందాల పొదరిల్లు గొబ్బిళ్ళో     ||రేగి||
చరణం
----------
ముగ్గుముగ్గుల నడమ
ముత్యాల గొబ్బిళ్ళు 
ముదమునమురిసేను
భూదేవి గొబ్బిళ్ళొ ..... ||రేగి||
చరణం
-----------
వీధి వీధులలోన
హరిదాసు కీర్తనములుగొబ్బిళ్ళొ
గడప గడపన గంగిరెద్దు 
కాలిమువ్వ గంతులేగొబ్బిళ్ళొ 
                                ||రేగి||
చరణం
----------
భోగాలనందిచె భోగిమంటలు
సంక్రాంతి లక్ష్మిపాడిపంటలు
కనుమ నాటికనులవిందులు
గొబ్బిళ్ళొ గొబ్బిళ్ళొ. ......||రేగి||
చరణం
-----------
అంబరాననర్తించు
సంబరాలగాలిపటములుగొబ్బిళ్ళొ
బంధుమిత్రులబంధనాలు
సంక్రాంతి సంబరాలు  గొబ్బిళ్ళొ  ||రేగి||

                     వడ్త్యనారాయణ .
                     పాల్వంచ .
                     భద్రాద్రికొత్తగూడెంజిల్లా.
[1/14, 6:10 PM] ‪+91 94902 84761‬: కవి:పైడి నాగ సుబ్బయ్య
బద్వేలు,కడప జిల్లా.
7989700065

 *సంక్రాంతి లక్ష్మి ఆగమనం*

ఛందము:

తే.గీ.
ముదిత ముంగిట ముగ్గులు ముదము తోడ

రమ్యమైనరంగులు వేసి రచన జేయ

నవ్య శోభ నలముకొనె భవ్య గృహము

కదలె సంక్రాంతి శ్రీలక్ష్మి కరుణ జూపె.

🌹🌹🙏🙏🙏🌹🌹
[1/14, 6:41 PM] ‪+91 99085 60246‬: 🍀🌸🍀

A.భాగ్యచంద్రిక.

 *పసిడి  కాంతుల  పల్లెలు*


తొలిపొద్దుతో తెలిమంచు కరిగి తెల్లవారే                         భోగిమంటలు వేసి వేడుకచేస్తూ                                      ముంగిట్లో ముత్యాలు పరిచినట్లు కనిపించే.               రంగవల్లులు ముచ్చట కలిగించు.                              అందమైన పల్లె ప్రకృతి             
నూతన వధువులా చూడముచ్చటగా ఉండదా,     అంగులంలో  గొబ్బిల్ల సిగలోన  పూబంతులుంచి  సిరిసంపదలు  ఇవ్వుమా సిరిలచ్చిమీ అంటూ వేడుకొందురు పల్లెపడుచులు   పోరగాళ్ళను ముగ్గులో కూసోబెట్టి  రేగుపండ్లుపోస్తూ బామ్మలు పాడే పల్లెపాటలు     
పంట చేతికొచ్చి పసందైన వేల  
గంగిరెద్దుల గంటల  గలగలలు,                      
హరిదాసు కీర్తనలు                  
గాలిపటాలు గగనాన నాట్యమాడుతూ                      
రంగుల హరివిల్లుగా ఆనందాలు  నింపు                    వచ్చింది వచ్చింది  సంక్రాంతి   
నవకాంతి  నిలిపింది                
పల్లె  ముంగిట్లో పసిడి కాంతులు  నింపింది...!!

🌸🍀🌸
[1/14, 7:17 PM] ‪+91 96662 05850‬: "కనుమ"రుగు
⚛️☸️🔆❄️🔆☸️⚛️
వేదకాలం నుంచి స్వాతంత్య్రానంతరందాకా
వెలిగిపోయేదాన్ని సూర్యునితో పోటీపడి 
వారానికి రెండు సార్లు గోమాత దయవల్ల 
తలంటు పోసుకొని అందంగా ముస్తాబయ్యేదాన్ని
ప్రత్యేక పర్వదినాల్లో పరితపించేవారు నాకై పడుచుపిల్లలు 
ఎప్పుడైతే ఆధునిక ధోరణులు సంతరించుకున్నాయో 
నా ఒళ్లంతా బండబారిపోయింది 
ఒట్టినీళ్లతో తలంటు పోసే గతి దాపురించింది 
పల్లెలు సైతం నన్ను పక్కన పెట్టాయి 
పట్టణాల్లో ఐతే నా ఊసే లేదు 
పడుచుపిల్లల చూపులు నావైపసలే లేవు 
ఐనా నాలో ఆశ బతికేవుంది 
ప్రతేడాది "సంక్రాంతి" నాకు "కాంతి" తెస్తుంది 
ఆడవాళ్ల చేతులన్నీ తట్టి లేపుతున్నాయి నన్ను సూర్యుని కంటే ముందుగా 
కల్లాపిచల్లి రంగవల్లుల రంగురథాలపై 
ఊరేగింపజేస్తున్నారు పోటీపడి "కనుమ"రుగవకుండా 
"వాకిలి" వన్నెను జాలితో...!! 
☀️⚛️☸️❄️✍️❄️☸️⚛️☀️
                    మీ 
           "వడ్ల వేంకటేశ్" 
            తొగిట - మెదక్ 
           SKNO :2177 
           14-01-2018 
           9666205850 
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
[1/15, 1:10 AM] ‪+91 99632 24187‬: 🌹🤘ఎద్దు'లా',వనపర్తి జిల్లా (9963224187)🤘🌹

శీర్షిక: "సంక్రాంతి గంగిరెద్దు"

ఆ.వె॥

గంగిరెద్దునేను గడ్జమూపురముతో|
పగలు రాత్రియనక బనిని జేతు|
పసిడి పంటలెన్నొ బండించె రైతుకు|
బలము నేనె దేశ భవిత నేనె|

ఆ.వె॥

జామురాతిరపుడు జక్కగా మేల్కొని|
పొద్దుగుంకు వరకు పొలము దున్ని|
ధాన్యరాశులెన్నొ దండిగా మోయుచు|

ధరణి దిరుగు నెద్దె ధన్యజీవి|

ఆ.వె॥

కాయకష్టమెంతగా జేసినన్ నేను|
కూటి కొరకె గాని కూడబెట్ట|
నాదు కష్టమంత నరుడు గాజేయుచు|
మూటగట్టి వాడు మురియుచుండు|

ఆ.వె॥

సంకురాతిరపుడు సక్కగా ననుదువ్వి|
కాళ్ళకందెగట్టి కలిమి బొంది|
మాపటేల నరుడు మందుగొట్టూగుతూ
గడ్డి వేయ మరిచె గాటి లోన|

ఆ.వె॥

తాగి తాగి నరుడు తాలుగింజై వాడు|
కాడిగట్టరాడు గదలడాయె|
గడ్డిదిన్న ఎద్దు గంగిరెద్దై నిల్చె|
బువ్వ దిన్న నరుడు భువిల జేరె|

    🌹ఎద్దు'లా',వనపర్తి జిల్లా🌹
[1/15, 6:24 AM] ‪+91 94902 84761‬: 🌺🌼🌸🌼🌸🌼

కవి:
*పైడి నాగ సుబ్బయ్య*
బద్వేలు,కడప జిల్లా.
9490284761

శీర్షక:
*సంక్రాంతి సంబరాలు*

*ఛందస్సు: సీసము*

రవితేజ గమనాల రసరమ్య పర్వాన
    నవధాన్య రాశితో నవని వెలుగు

వ్యవసాయదారుల వందన పూర్వము
   కలబోయు సంతోష కలమ వెలుగు

హరినామ జపమున హరిదాసు పలుకులు
  స్మరణము మనమున మనన జేయు

గాలిపటములను గగన వీధులలోన 
  విహరింప జేసెడి వేెడుకిదియు

*తే.గీ.*
అరిసెలను చెక్కిలాలతోనారగించు

గంగిరెద్దుల సన్నాయి గంతులిడగ

రంగురంగుల ముగ్గులు రంగ రించ

సంత సమ్మాయె సంక్రాంతి సంబరాలు.

      🔥🔥🔥
[1/15, 8:15 AM] Poet Narayana Vadiyala: """"""""""""""""""""""""""""""""""""""""
         *మకరసంక్రాంతి* 
----------------------------------------------
1.తే.గీ 
----------
మార్గశిర మాసమందున మంచు తెరలఁ
జీల్చుకొనుచు బయలుదేరు చిత్రరధుడు 
సాక్షిగా కాలిమువ్వల సవ్వడులతొ
బయలుదేరెను *సంక్రాంతి బసవరేడు* *

2.కం
------------
ఎముకలఁ గొరికెడి చలిలో
రమణీమణులేసినట్టి రంగులమ్రుగ్గుల్
క్రమమును చూడగ గగనమె 
భ్రమపడి; హరివిల్లు బిడియ పడ సాగ నటన్

3.ఆ.వె 
----------
రంగవల్లిపై  బొసంగిన గొబ్బిళ్ళు 
రంభవోలెమెరియు యంబ యొడిలొ
రంకెలేయుచున్న మంకులబసవన్న 
రంగమందుదుమికె సింగమువలె 

4.సీసము 
------------
సువిశాల సుందర సుమధుర ప్రకృతిలో 
     సుమములు విరబూయు నమృతవేళ
నులివెచ్చని ప్రభాత నూతన కాంతులు 
          పైడివిభవములు పంచువేళ
చెలిమి కలుములతో చెలరేగు చిరుగాలి
         సస్యములందిన చలువవేళ
సకల జీవులు సంతసంబుగ యాడేటి
        నూతన తేజంబు నొందు వేళ

తే.గీ 
--------
పిన్నపెద్దలందరుకూడి ప్రియము గాను 
కలిసి మెలిసియాడెడి క్రీఢ గాలి పటము
చలిని గాచెడి చలిమంట చెలిమి కొలిమి 
కలిమి శుభములఁ బంచు సంక్రాంతి లక్ష్మి

5.సీసము
---------------
మంచుతో కడిగిన మంచిముత్యమొలె
         తెల్లని పత్తితో  పొలము  నిండెఁ
వేకువన పొలముఁవెండివలెతళకు
        సాలెగూళ్ళుమెరిసె సరులు జూడఁ
సన్నధాన్యాలన్నిచక్కనిముత్యాల
           కంకుల నుపెటంగ కాంతినిండెఁ
ఇంతిశిఖలలోని బంతిపూలను జూడ
          భ్రమరమువ్రా లెను భ్రాంతి తోడఁ
ఆ.వె
-------
జొన్న మొక్కజొన్న సన్నధాన్యాలన్ని
సంఘటితము గాను సహక రించెఁ
గనకకాంతిఁజిమ్ము కాలమందునపల్లె
పంటకాపు నింట పసిడి నిండెఁ

6.సీసము
--------------
పచ్చపచ్చని రంగు పండుమిరపచేల
          మకరసంక్రాంతి భాను కిరణములు
పొద్దతిరుగుపూల ముద్దులవర్ణాలు
         సోయగ మొలకించు శోబితములు
ముంగిట్లొ ముత్యాల మ్రుగ్గుల మెరుపులు
        కనులవిందునుగొల్పు కాంతి మయము
పాడిపంటలఁబంచు పసిడినేలమ్మర
        స్వాగతించెమకర సంక్రమణముఁ

ఆ.వె
----------
పంటచేలయందు పక్షులరాగాలు
కుప్పనూర్పువేళ కూలి జనుల
ఒలియయొలియ మనుచుయోంకార
గీతాలు
పాటపాడుకున్న పంటకాపు

7.సీసము
---------------
గంగిరెద్దు పుడమిపైకాలిమువ్వలతోడ
            గంతులేయగ నేలఘల్లు మనెను
హరిదాసు పాడినహరికీర్త నంబులు
            వినులకు విందయి వినుపి యంగ
పేదధనుకులను బేధభావములను
          పెరటిలోదాయుచు పేర్మితోడఁ
భోగభాగ్యాలిచ్చు భోగిమంటలనేసె
       మనసారదీవించె మహినిజనులఁ

ఆ.వె 
---------
ఆటపాటలన్న యానంద మొందెడి
బాలబాలికలకుఁభానుమైత్రి
తేటతెల్లమైన తెలుగు సంస్కృతికిది
తెరులు చూపనున్న తెలుగువెలుగు

8.సీసము 
------------
నులివెచ్చఁసురరాజనూతనకాంతులు
          రత్నాల రాశులు రమ్య నేలఁ
జాబిలివెన్నెల సారము  నింపుచు
          సంక్రాంతి సరదాల సరులహేల
మందారమకరంద మధురాల సురగంగ
           శుభములు పలకంగ సుధలు పారు
పైరులపాన్పుపు పైపౌష్యలక్ష్మిని
          స్వాగతించెమకర సంక్ర మణము
తే.గీ 
---------
గున్నమావివనముఁ కోయిలపాడంగ
సన్నజాజి విరులు సరసమాడెఁ
మిన్నుతారలన్ని మింటనుమెరిసెను
కన్నె వెన్నెలమ్మ కదలివచ్చెఁ


                     వడ్త్యనారాయణ .
                     పాల్వంచ .
                     భద్రాద్రికొత్తగూడెంజిల్లా
[1/15, 9:58 AM] 334455 Poet Chandrika Zee Tv: సంక్రాంతి శుభాకాంక్షలు

భోగి మంటలు
పిండి వంటలు
బోసి నవ్వు లకి భోగి పళ్ళు
బ్రతుకు సరళి బొమ్మల కొలువులు
పేరంటాలు 
పెద్దలకి నీరాజనాలు
రంగవల్లులు
 రంగు రంగుల గాలిపటాలు
గంగిరెద్దుల మెడలో గంటలు
హరిదాసు హరి సంకీర్తనలు
గోదా కళ్యాణం
లోక కళ్యాణం
ఊరంతా సంక్రాంతి శోభ
ఉత్తేజాన్నిచ్చే సుప్రభ

ముదిగొండ రాజ చంద్రిక
[1/15, 12:04 PM] Poet Padma Tripurari: 🌺🌷💐సంబరాల సంక్రాంతి🌷🌺💐***************
విశ్వానికి వెలుగునిచ్చు సూరీడి
తేజోమయ మకరక్రాంతి
అన్నదాత రైతన్నల
ఆరుగాల శ్రమఫల
పాడిపంటల దీప్తి

డూడూ
 బసవన్న హరిదాసుల
హృదయరవళులరమ్య సు దీప్తి
కుసుమ కోమలుల
కోమల మునివేలికొసల
జాలువారిన ఆకాశ తారకల
నడుమన విరబూసిన
రంగవల్లుల రమణీయ దీప్తి

గోకులనందనారాధనా గోపికలే
గొబ్బెమ్మలై నిలిచిన ముంగిలి క్రాంతి
నవధాన్యరాశుల పౌష్యలక్ష్మికి
ఇంటింటి గృహలక్ష్మీ చేసిన
ఆహ్వాన వంటక సంబర ప్రదీప్తి

బంధ అనుబంధ స్నేహానుబంధ
వల్లికల రంగవల్లే సంబరాల సంక్రాంతి
ముంగిలి ముత్యాల ముగ్గులో ముదితలానందమే జగతి జన కాంతి. ,💐🌸🌼🌻
పద్మ త్రిపురారి, జనగామ,🌻🌼🌸🌺
[1/15, 12:26 PM] Poet Telgu Thirumalesh: -------- 🌻🌻🌻🌻🌻 --------


రచనా తేది :15-01-2018

        🌞 సంక్రాంతి పండుగ విశిష్టత 🌞

రైతన్న పండుగ వారి పంట పండుగ...
కాంతలు మదిని నిండుగా జరుపుకునే పండుగా..

ముచ్చటగా మూడురోజులతో
కృషి వలుని కృషి కి కుతుహలంతో జరుపుకునే పండుగా...

భోగి తో భోగ్యము (ధాన్యము)తో
భోగము (సుఖము)ను కలిగింప చేయునది....

మకర తో మకర జ్యోతి వెలుగుల ఆహ్వానంతో
నవవస్త్రదారణాలతో ముక్తి ని కలిగించునది...

కనుమతో కర్షకుని కన్నీటిని తుడిచి
పశుపక్ష్యాదుల ఆటలతో ఆనందాన్ని వెలుగించునది...

నా ఈ పల్లె అందాలు
విమలమయినది విలాసవంతమైనది విశ్వజననీయమయినది....

కోడికూత రాగాలతో 
పులి లాంటి చలిలో
వేకువజామునే కుటుంభికుని (స్త్రీ) మేలుకొని
ఆదిత్యుని పలకరింపుతో
ముంగిటలో ముచ్చటగా
అందమైన ఆత్మీయతతో కల్లాపిచల్లి
మురిపించే ముగ్గు లు వేసి
రంగవల్లుల  రమనియంతో
బోగిమంటల తో గాలినెచ్చలి (అగ్ని)వెచ్చదనం లో
ఆడపిల్లల అందాలను
యవ్వనకాంతులను
లంగావాణి సంస్కృతి ని
ఆడతనాన్ని అమ్మలాంటి వెచ్చదనాని
గొబ్బెమ్మల సోయగాలతో
ముంగిటిని అలంకరించి
కొత్త అల్లుళ్ళ సయ్యటలలో
మూడురోజుల ముగ్గుల
సంభరాలతో అంబరాన్ని తాకే పండుగా...
ముద్దు గుమ్మలు జరుపుకునే పండుగా...

రవిని మరిపించే రంగవల్లులతో
రమణి జరుపుకునే రమణీయ పండుగా...

యువకుల ఆటల ఉత్సాహాన్ని
సంస్కృతి సంప్రదాయలను ప్రతిభింబింపచేసే పండుగా...

బసవన్న గంతులతో
గాలిపటాల ఆనందాలతో
కరసాముల కోలాటాల కోడిపందెలా పులివేశాల 
సందడీలతో సంప్రదాయంగా జరుపుకునే పండుగా...

గుమ్మడికాయ వెలుగులతో ఆహ్వానం పలికి
గుమ్మడికాయ కూరల రుచులతో
రేగు(బోగి) పండ్ల దీవెనలతో
నువ్వుల రొట్టెల భోజనంతో
తిలలు(నువ్వుల)లతో తల స్నానాలు ఆచరించి
పాలపొంగులతో పొంగలి రుచల సంతోషం తో
ఆనందంగా ఆత్మీయంగా జరుపుకునే పండుగా....

కృషి వలుని కృషికి కుతూహలంగా
జరుపుకునే పండుగా....
రత్నము రత్నాకారము వంటి 
విశాలహృదయుడు రైతన్న జరుపుకునేపండుగా...

ఆత్మీయులకు ఆతిథ్యం ను
ఆత్మియతానురాగాలను
ఆబాలగోపాలములకు
ఆహ్లాదం కలిగించి ఆశిస్సులు ఇచ్చే పండుగా....

ఆనందాలహరివిల్లు నా పల్లె
అందరి ఆశిస్సులను పొందెను నా పల్లె
ఆత్మీయతను పంచి మంచిని పెంచే నా ఈ పల్లె...

నవకాంతులతో
నవవదువులను పలకరించి,పులకరింపచేసి
వారిని ఆశీర్వాదించి ఆనందింపచేసిన పండుగా...
పాడిపంటలతో
నవధాన్యాగారముతో
నవజీవితానికి ఆనందాన్ని
కలిగించే పండుగా నా ఈ సంక్రాంతి పండుగా.....

✍✍✍✍✍✍✍✍
🌞🌞🌞🌞🌞🌞🌞🌞

🌸 ఆచారాలను గౌరవిద్దాం - ఆత్మీయతలను పంచుదాం   🌸
🌞🌞🌞🌞🌞🌞🌞🌞
✍✍✍✍✍✍✍✍


                                     ఇట్లు
                       నా సొంత రచన
           ✍.. తెలుగు తిరుమలేష్
                తెలుగు ఉపాధ్యాయులు
      ప్రొ. జయశంకర్ స్వచ్చంధ సేవా సంస్థ
            వ్యవస్థాపక  అధ్యక్షులు
        తెలుగు భాషా పరిరక్షణ సమితి
                  అధ్యక్షులు
       అమరచింతమండలం, వనపర్తి జిల్లా
              చరవాణి : 9908910398


✍✍✍✍✍✍✍✍
------  🙏  సమాప్తం  🙏-------
[1/15, 2:55 PM] ‪+91 99483 57673‬: 🌹🌹  *సంక్రాంతి* వచ్చింది .... ఉయ్యాల 🌹🌹

  🔥🔥 🍆🍅🌾🌾 🥀 🌾🌾🍅🍆 🔥🔥

  ఉయ్యాల  ఉయ్యాల  ఉయ్యాల...
  సంక్రాంతి   వచ్చింది   ఉయ్యాల

  భోగి మంటలు  వెయ్యాల
  భోగ భాగ్యలు   ఇయ్యాల

  చంక లెత్తని  ఉయ్యాల
  చలి అంటలే  ఇయ్యాల 
  చలి మంటలే  వెయ్యాల 

పాడి పంటలు  ఉయ్యాల
ధాన్య రాశులు  వెయ్యాల
సకల జనుల కు ఇయ్యాల

ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల 
సంక్రాంతి  వచ్చింది  ఉయ్యాల

కొత్త  పంచెలు ఉయ్యాల
కొత్త  చీరలు  వెయ్యాల
కొంగు బంగారం ఇయ్యాల

వీధు లన్నీ ఉయ్యాల
రంగవల్లులు వెయ్యాల
క్రాంతి నిండెలే ఇయ్యాల

రంగు రంగులు ఉయ్యాల
రధ చక్రాలు వెయ్యాల

ఇంటి ముంగిట ఉయ్యాల
సంక్రాంతి వచ్చే ఉయ్యాల
సౌభాగ్య మిచ్చే ఇవ్వాళ

ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
సంక్రాంతి వచ్చింది ఉయ్యాల...

🌾🍆🍅🔥🔥🍅🍆🌾

   షేక్ .మస్తాన్ వలి.
నవ్యాంధ్ర గీత రచయిత

*************†**************†************
[1/15, 4:32 PM] Ppet Badripally Sreenu: *🌷బద్రిపల్లె.శ్రీనివాసులు🌷*
*🌷శీర్షిక:-సంక్రాంతి.🌷*
*🌷ఛందస్సు:-ఉత్పలమాల.🌷*
*🌷1🌷*
ముగ్గులువేసియంగనలు,మోదపురంగులనద్దిమధ్యలోన్
సిగ్గులుఁరాల్చునట్లుగను,జెక్కియుగొబ్బినినర్ధరాత్రిలో
మొగ్గలుసొత్తుగానునుచిముద్దుగరమ్మనిబల్కమెల్లగా
యుగ్గునుబట్టెతాయిగనునుర్వినిపాదముమోపెశోభతో!
*🌷2🌷*
కన్నులఁజూడఁగుమ్మమునకాలునుమోపియు,సర్వసంపదల్
మిన్నగనిచ్చికర్షకునిమేనున,స్వేదముద్రుంచికాంతియున్
సన్ననినవ్వుజీవితముఁచక్కగనీయను,సంకురాత్రియున్
మిన్నుననుండిజారెఁనులెమేదికి,మూడుదినంబుపర్వమై!
*🌷3🌷*
కష్టముఁజేయరైతునిలకాడినిగట్టియు,నాలితోడనన్
పుష్టిగసంపదల్ చపల,ముద్దుగనాతనిశాలవానయై
యిష్టముతోనికన్ కురిసి,నీప్సితమెల్లనుదీర్చునెప్పుడున్
నష్టముఁనాత్మలోదలఁచనామపుమాత్రములేదునిక్కమే!
*🌷4🌷*
బందు(ధు)వులెల్లరున్ నడుగువాసముఁమోపగ,నూత్నవస్త్రముల్
యందముగాధరించెనిట,నయ్యదివేడుకజూడకన్నులన్
చందురుఁసాగినట్లునిలసంతసమైతననాత్మకున్ ననే
చందపుతీరుఁదోచునటచక్కని,విందునుజేయువేళలన్!
*🌷5🌷*
శాంతియుసౌఖ్యముల్ సకలసంపదలిచ్చియుమానవాళికిన్
కాంతిని,జీవితానొసగెకమ్మనిపర్వమెసంకురాత్రియున్
నెంతనిదెల్పునేనిచటనీదినమందునజేయువేడుకన్
చెంతనదుఃఖముల్ దొలగిశ్రేష్టపుజీవనమందజేయునే!
*🌷బద్రిపల్లె.శ్రీనివాసులు*
*ప్రొద్దుటూరు,*
*కడపజిల్లా.*
*9441721650.🌷*
[1/15, 4:34 PM] Poet Palloli Shekar Babu: అన్నదాతను దీవించమ్మా !
*******************
- పల్లోలి శేఖర్ బాబు 949048316.

సంక్రాంతిలక్ష్మీ నీకు స్వాగతం !
సౌభాగ్యలక్ష్మీ సుస్వాగతం ! !
మాఇంటి మహాలక్ష్మీ ఘనస్వాగతం !
సిరులిచ్చే శ్రీలక్ష్మీ మనస్స్వాగతం! !

వత్సరానికి ఒక్కసారి కోటి ఆశలతో వస్తావు !
మూడునాళ్ళుముచ్చట్లు మాకు చెప్తావు ! !
తెలుగు జాతి సంస్కృతినని గుర్తు చేస్తావు !
జ్ఞాపకాల పుటలను తెరచి చూపిస్తావు ! !

మేమంటే నీకెంతో ప్రేమాభిమానం !
అందర్నీఒకచోట కలపాలని ప్రయత్నం ! !
మానవ సంబంధాలు పెంచాలని ఆరాటం !
పల్లెకు పూర్వవైభవం తేవాలని పోరాటం ! !

అమ్మా! సంబరాల సంక్రాంతీ  !
తెలుగు జాతి ఘన సంస్కృతీ  ! !
బంతిపూల గొబ్బేమ్మల పూదొంతీ  !
సుగంధపరిమళాల చేమంతీ  ! !

అడగకున్నా. . ! ఆహ్వానించకున్నా. . !
అడుగులో అడుగేసుకుంటూ వచ్చావు ! !
చలితోడుగా భోగిమంటలతో పలుకరించావు  !
అదిగో చూడు రైతన్నగోడు చింతిస్తావు ! !

అధిక ధరల కుంపటి కాలుస్తోంది !
అతివృష్టి అనావృష్టి అనీమియా వేధిస్తోంది ! !
నకిలీ విత్తు మందుల భూతం పీడిస్తోంది !
దళారీల రాబందుల గుంపు పీక్కు తింటోంది ! !

కష్టాలపిడి బాకులు గ్రుచ్చుకొంటున్నాయి !
నష్టాల చురకత్తులు విచ్చుకొంటున్నాయి ! !
గిట్టుబాటుధర తలుపులు మూసుకొంటున్నాయి !
అప్పుల ఉరి తాళ్ళు బిగుసుకుంటున్నాయి ! !

అర్థ రాత్రి కరెంటు నాగులు కాటేస్తున్నాయి !
పురుగుమందు డబ్బాలు వాటేస్తున్నాయి ! !
ఆకలి రైతు కుటుంబాలు పల్లెనుదాటేస్తున్నాయి !
ఆదుకోక ప్రభుత్వాలు ముఖంచాటేస్తున్నాయి ! !

అన్నదాతకు ఆదరణ కరువవుతోంది !
బాధలతో గుండె చెరువవుతోంది ! !
నగరం కూడలిలో కమిలిపోతోంది !
మురికి కాల్వల ప్రక్కన కుమిలిపోతోంది ! ! 

ఓ సంక్రాంతిలక్ష్మీ ! మా ఇంటి మహాలక్ష్మీ!
రైతన్న దుర్భర గాధ ఆలకిస్తివిగదమ్మా   ! !
పాలకుల హృదయాల్లో మార్పు తేవమ్మా !
అన్నదాతను మనసారా దీవించమ్మా ! !

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
పల్లోలి శేఖర్ బాబు సహస్ర కవి మిత్ర , కొలిమిగుండ్ల 9490484316
[1/15, 4:49 PM] ‪+91 94411 10427‬: సంక్రాంతి-సంబరాలు

‌ఉత్త రాయణ మందున నుర్వి జనులు
‌మకర రాశికి భానుడు మరలి రాగ
‌పుష్య మాసపు పండుగ మూడు నాళ్ళు
‌సంకు రాతిరి జేతురు సంబరముగ.             1

‌కోడి కూయక ముందరే కూడి యువత
‌భోగి మంటలు వేయుచు మురియు చుంద్రు
‌ముద్ద బంతుల పూలతో ముద్దరాండ్రు
‌రంగ వల్లులు ముంగిళ్ళ రంగరింత్రు.            2

‌గంగి రెద్దుల సందడి   గ్రామ మందు         హరిని కీర్తించు హరిదాసు లాగమనము
‌బంధు మిత్రుల కలయిక పండుగంత
‌పిండి వంటల ఘుమఘుమల్ వీధి యంత.  3       

‌సజ్జ రొట్టెలు కలగూర చక్కిలాలు
‌కొత్త బియ్యపు పొంగలి చిత్త మలర
‌ధాన్య రాశుల కుప్పలు ధరణి నిండ
‌కర్షకుల హృదయము లెల్ల హర్ష మొందె     4
‌       

‌ పెద్ద పండుగ యను పేర పెద్దలకును
‌తర్పణమ్ములు విడుతురు ధరణి జనులు
‌సూర్య సంక్రమణము నందు సుద్దులన్ని
‌కాల మహిమను దెల్పును ఘనము గాను.   5

‌    సంక్రాంతి శుభాకాంక్షలతో...............
‌          మేడిచర్ల హరినాగభూషణం, గద్వాల.
‌   
‌**********************************

[1/15, 6:57 PM] Poet Pudathu Bhaskar: 🌸
సంక్రాంతి-సంబురాలు🌸
******************
తెల తెలవారుతుండగా
కోడి కూతలు కూయంగా

లేలేత కిరణాలు పొడసూపగా
లేగ దూడలన్ని రంకెలేయగా

ముసుగు దీసి నిద్రలేచి
ముంగిట మగువ ముగ్గులేసే

వీధి వీధిన అందాల హరివిల్లు
అలరించెను అందరి మదిని

నవధాన్యాలతో గిబ్బిళ్ళు పెట్టి
పిండి వంటలతో పండుగ జేసి

రంగు రంగుల గాలిపటాలతో
గంగిరెద్దుల విన్యాసాలతో

కష్టకాలము కనుమరుగు కాగా
కలసి మనసులు శాంతిపడగా

పల్లెపల్లెలందు ప్రకృతి ఒడిలో
వెల్లివిరిసెను సంబరాల సవ్వడి

సంతోష సంబురాల సమయాన
సంక్రాంతినిల్పె ప్రతిఇంట నవ్యకాంతి.!!!
     🌸🌸రచన🌸🌸
        పూదత్తు భాస్కర్
         ఎస్.ఎ.తెలుగు.
తేది : 15-01-2018
*************************
[1/15, 8:31 PM] ‪+91 91779 31900‬: శీర్షిక–కోడి పందేలు

నేతల చేతిలో
నేతులు తాగి
మోత మోగించే
కూతలతో బరిలోకి దిగుతున్నాయి
పందెం కోళ్ళు

మోడీలా సేవలు చేయించుకుని
మోడీ విద్యలో(కనికట్టు)
రాటుతేలిన
పందెం కోడి

విలువ లేని కోడికి
విలువ తెచ్చి
వాలిపోకుండా
వేరే వాడి ఒళ్ళో
కూరై పోకుండా
కూత కూయాలనే కాంక్ష

ఆస్తులు తుంచే
ఆస్తులు పెంచే
అట్టహాసపు కేంద్రాలు
ఈ కోడిపందేలు


                      ✍నవ✍
[1/15, 9:15 PM] Poet Musthakheem విన్నర్: కవితా శీర్షిక ..సంక్రాతి
ఆవైపున ..ఉదయించే ఎర ఎర్రటి సూరీడు ... లేలేత నునువెచ్చని బంగరు కిరణాలు ... అందరిలో ..సంక్రాంతి పండగ ..ఆనందాలు .... ఇల్లూ వాకిలి ..చెట్టూ గాలి అన్నిటి లో కొత్తదనాలు పిల్లా జెల్లా ..అందరిలో ..సుఖ సంతోషాలు . ముగ్గులతో ..మురిపాలు ..ఇంటికే అందాలు ..అమ్మలక్కల ..పనిపాటలు ..వర్ణణాతీతాలు ..మగమహారాజుల దర్పాలు ..పంచె కట్టడాలు ..ఊరంతా ఊసులు ..ఊపిరాడనీయని .పందాలు కొక్కర కో ..కోళ్లు ..దుముకుళ్ళు ఎగరడాళ్లు ..అరుపులు ..గెలుపుల ..మెరుపులు ..ఆనందాలు డూ డూ బస్వన్నల ..నాట్యాలు ..హరిదాసులు పిండి వంటల ..ఘాటులు ..ఘుమఘుమలు ..
 బంధు జనుల రావడాలు ..పోవడాలు ...పండగ ..పలకరింపులు ...పారవశ్యాలు ..పెద్దలకు ..పాదాభి వందనాలు ..నమస్కారాలు ..ఆశీస్సులు ..మన్నింపులు ..ఏడాదికొక్కసారి ..పాడిపంటలబారి ..సంకు రాతిరి ..విన్నర్ ..కొల్లాపూర్
************************

Comments